Movie Reviews
Professional reviews and ratings from top critics and publications worldwide
Dhurandhar The Revenge Movie Review
By One India
బాలీవుడ్ స్టార్ హీరో రణ్ వీర్ సింగ్ హీరోగా నటించిన "ధురంధర్" కి సీక్వెల్ గా వచ్చిన 'ధురంధర్ ' - ది రివెంజ్ ఫైనల్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సెకండ్ పార్ట్ లో 'ధురంధర్ ది రివెంజ్' స్టోరీని మొత్తం ఆరు ఛాప్టర్లుగా చూపించారు. సినిమా సెకండ్ పార్ట్ అజయ్ ఖన్నా పాత్ర చనిపోయిన తర్వాత బలోచి ల్యారీలో జరిగే సన్నివేశాలతో కథ మొదలవుతుంది. హమ్జాగా రణ్వీర్ సింగ్ పాకిస్థాన్ రాజకీయాల్లో ఎదిగిగిన తీరు, దాని కోసం వేసిన ఎత్తులు కూడా ఆడియన్స్‌కి కిక్కిస్తాయి. ముఖ్యంగా భారత్ కు నరేంద్ర మోడీ ప్రధాని అయిన తర్వాత జరిగిన పలు ముఖ్యమైన ఘటనలను కూడా ప్రస్తావించారు.
ఇవే కాకుండా నోట్ల రద్దు, ఉరి సర్జికల్ స్ట్రైక్స్, పాకిస్థాన్‌లో ఉగ్రవాదంపై తీసుకున్న చర్యలని స్టోరీకి లింక్ చేయడంలో కూడా ఆదిత్య టాలెంట్ నిరూపించుకున్నాడు. ఈ సీన్లన్నీ సినిమాకు చాలా ప్లస్ అయ్యాయి. సెకండాఫ్‌లో కూడా మొత్తం పాకిస్థాన్‌లో ఉన్న ఉగ్రవాదులు, భారత్‌కి వ్యతిరేకంగా పనిచేసే పలువుర్ని ఏరిపారేసే సీన్లు ఇవన్నీ కూడా ఆడియన్స్ చేత విజిల్స్ వేయిస్తాయి. అలానే హమ్జాని ప్రేమించి పెళ్లి చేసుకున్న ఎలీనా (సారా అర్జున్)కి కూడా ఇందులో రెండు మూడు బలమైన సీన్లు పడ్డాయి. ఇక క్లైమాక్స్‌లో ఒక పాత్రలో ఇచ్చిన ట్విస్ట్ మాత్రం ఆడియన్స్‌కి మంచి థ్రిల్ ని ఇస్తుంది. ఓవరాల్‌గా ఇదొక అదిరిపోయే "దేశభక్తి ఉన్న రివెంజ్ డ్రామా".
Dhurandhar The Revenge Movie Review
By T2B Live
ధురంధర్2 గురించి చెప్పాలంటే.. ముందుగా కథ గురించే చెప్పాలి. నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా అన్ని రకాల ప్రేక్షకుల్ని థియేటర్లో కట్టిపడేస్తుందని చెప్పాలి. కథ మెయిన్ పాయింట్ విషయానికి వస్తే మొదటి పార్ట్ లో ల్యారీ బాద్ షా ని చంపినా ఇంకా శత్రువులు చాలా మంది ఉండటంతో ఒక్కొక్కరినీ ఎలా మట్టుపెట్టాలి అని ఎదురు చూసే హీరో ఫ్లాష్ బ్యాక్ తో సినిమా మొదలవుతుంది. తన ఫ్లాష్ బ్యాక్ తర్వాత ప్రజెంట్ టైంలో, ఒక్కో మెట్టు ఎక్కుతూ హీరో ఎలా ఎదిగాడు, తన నిజం గురించి అందరికీ తెలిసే టైంకి తను చేయాలి అనుకున్నది చేశాడా లేదా అనేది స్టోరీ.
క ఫస్ట్ పార్ట్ ఇచ్చిన హైని ఏమాత్రం తగ్గించకుండా స్టార్ట్ అయిన ధురంధర్2 ప్రతి సీన్ ని కథలో లోతుగా చూపిస్తూ ఆడియన్స్ ని మెప్పిస్తాడు. ల్యాగ్ అవుతుంది అనుకుంటున్న టైంలో ఆసక్తిని మరింతగా పెంచేస్తూ దావూద్ ఇబ్రహీంని సీన్ లోకి తీసుకు రావడం అలాగే ఫస్ట్ పార్ట్ మొదట్లో ఫ్లైట్ హైజాక్ చేసిన పాకిస్తాన్ విలన్ ని చూపించడం తో మళ్ళీ ఆసక్తి పెంచుతారు. ఓవరాల్ గా మూవీ లెంగ్త్ ఎక్కువైనా అదిరిపోయే డ్రామా సీన్స్ తో ఆడియన్స్ కి సినిమా కనెక్ట్ అవుతుంది. మొత్తం సినిమా అయిపోయిన తర్వాత ఆడియన్స్ ఇది కదా సినిమా అంటే అన్న ఫీలింగ్ తో రావడం మాత్రం ఖాయం.
Dhurandhar The Revenge Movie Review
ధురంధర్’పై వచ్చిన ప్రాపగాండ విమర్శలను పక్కన పెట్టి, ఈ సీక్వెల్ ధురంధర్2 లో దర్శకుడు ఆదిత్య ధర్ మరింత బలంగా తన కథను ఆడియన్స్ కు చెప్పాడు. దేశ భద్రత, టెర్రరిజం, డీమోనిటైజేషన్ వంటి అంశాలను కలిపి రియలిస్టిక్ గా ప్రెజెంట్ చేశారు. ఈ సన్నివేశాలు థియేటర్లలో మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటాయనడంలో ఆశ్చర్యం లేదు. ఫస్ట్ హాఫ్ కాస్త స్లో గా ఉన్నా… సెకండాఫ్ నుంచి సినిమా పికప్ అవుతుంది. క్లైమాక్స్ మాస్ గా, ఎమోషనల్ గా కూడా ఆకట్టుకుంటుంది . అయితే నిడివి ఎక్కువగా ఉండటం, కొన్నిచోట్ల వైలెన్స్ ఎక్కువ కావడం మైనస్ అయింది.
పెర్ఫార్మెన్స్ పరంగా సినిమా ఎక్కువగా రణవీర్ సింగ్ మీదే నడుస్తుంది. సారా అర్జున్‌కు స్కోప్ తక్కువైనా బాగా ఆకట్టుకుంది. ఇక మాధవన్, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్ తమ పాత్రల్లో బాగా నిలిచారు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు పెద్ద ప్లస్ అయింది. యాక్షన్ ఎపిసోడ్స్, విజువల్స్ కూడా స్టైలిష్ గా ఉన్నాయి. అలాగే దేశభక్తి, యాక్షన్, మాస్ ఎలిమెంట్స్ తో కూడిన సాలిడ్ ఎంటర్టైనర్ గా ధురంధర్ అలరిస్తుంది. ఇక సినిమాలో చూపించే కొన్ని నిజ జీవిత సంఘటనల సన్నివేశాలు ఆడియన్స్ కి కథలోకి మరింత ఇన్వాల్వ్ అయ్యేలా చేస్తాయి.
Dhurandhar The Revenge Movie Review
By ABP Desam
ధురంధర్ 2 సినిమా మొదలవుతూనే కథ ఇండియా బ్యాక్‌డ్రాప్ లో జస్కరిత్ సింగ్ కథతో స్టార్ట్ కావడం సినిమాకు కొత్త ఫీల్ ఇస్తుంది. కానీ పాకిస్తాన్ ట్రాక్‌లోకి వెళ్లిన తర్వాత గ్యాంగ్ వార్, రెగ్యులర్ స్పై థ్రిల్లర్ టోన్‌లో సాగుతుంది. అయినా యాక్షన్ బ్లాక్స్, నటీనటుల అదిరిపోయే పెర్ఫార్మెన్స్ వల్ల ధురంధర్ సినిమా బోర్ కొట్టదు.
రణ్‌వీర్ సింగ్ డ్యూయల్ షేడ్స్ లో అద్భుతంగా నటించి ఈ సినిమాను నెక్స్ట్ లెవల్ కు తీసుకెళ్లాడు. మాధవన్ డీసెంట్ ఎలివేషన్స్ తో తన రోల్ తో మెప్పించగా, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్ తమ పాత్రలకు న్యాయం చేశారు. సారా అర్జున్‌కు స్కోప్ తక్కువైనా, ఎమోషనల్ సీన్స్‌లో బాగుంది.
అయితే ఫస్ట్ పార్ట్‌తో పోలిస్తే ఈసారి ఫ్యామిలీ ఎమోషన్స్‌కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంది. యాక్షన్, డైరెక్షన్, స్క్రీన్ ప్లే బలంగా ఉండటంతో నాలుగు గంటల నిడివి ఉన్నా సినిమా చాలా ఎంగేజింగ్‌గా సాగుతుంది. ఫస్ట్ పార్ట్ నచ్చితే ఇది కూడా తప్పకుండా నచ్చుతుంది.
Dhurandhar The Revenge Movie Review
‘ధురంధర్’ సక్సెస్ తర్వాత వచ్చిన ‘ధురంధర్ 2’ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. సినిమా ఆ అంచనాలను పూర్తిగా మించకపోయినా, మొదటి పార్ట్ స్థాయిని మాత్రం మెయింటైన్ చేసింది.
మొదటి అరగంట రేసీగా సాగుతూ యాక్షన్, ఎమోషన్స్‌తో ఆకట్టుకుంటుంది. హీరో బ్యాక్‌స్టోరీ, ఫ్యామిలీ ఎమోషన్స్, ఏజెంట్‌గా మారే ట్రాక్ బాగా వర్క్ అవుతాయి. ఇంటర్వెల్ బ్యాంగ్, నోట్ల రద్దు ట్విస్ట్ హైలైట్స్.
పాకిస్తాన్ బ్యాక్ డ్రాప్ లో హీరో ఎదుగుదల, టెర్రరిస్ట్ ట్రాక్ బాగున్నా… ఈ మధ్యలో సినిమా కాస్త స్లో అవుతుంది. సెకండాఫ్ లో కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్, హై మూమెంట్స్ ఉన్నా… నేరేషన్ మళ్లీ డ్రాప్ అవుతుంది.
క్లైమాక్స్, ఎమోషనల్ సీన్స్ బాగా కనెక్ట్ అవుతాయి. డైలాగ్స్ దేశభక్తి ఫీల్‌ను బాగా ఎలివేట్ చేస్తాయి. పెర్ఫార్మెన్స్ పరంగా హీరో హైలైట్ కాగా, సంజయ్ దత్, మాధవన్ పాత్రలు కూడా బాగా నిలిచాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు పెద్ద ప్లస్ అవుతుంది. మొత్తానికి
హై మూమెంట్స్, యాక్షన్ కోసం మాత్రమే కాదు.. అన్ని రకాల ఆడియన్స్ ని ఆకట్టుకునే సినిమాగా ధురంధర్ అలరిస్తుంది.
Dhurandhar The Revenge Movie Review
By Tupaki
రణ్వీర్ సింగ్ నటించిన ‘దురంధర్-2’ మూవీ గురించి సింపుల్ గా చెప్పాలంటే ఇంటర్నేషనల్ లెవెల్లో ఉంది. శశ్వత్ సచ్ దేవ్ తన నేపథ్య సంగీతంతో ‘దురంధర్’కు మంచి ఊపు తీసుకొచ్చాడు. సినిమా మంచి ఫ్లోతో సాగేలా చేయడంలో ఆర్ఆర్ కీలక పాత్ర పోషించింది. అతడి పాటలు కూడా బాగున్నాయి. వికాస్ నౌలాఖా ఛాయాగ్రహణం కూడా అదిరిపోయింది. కెమెరా యాంగిల్స్.. టేకింగ్.. కలర్ థీమ్స్.. మొత్తంగా విజువల్స్ కట్టిపడేస్తాయి. ప్రొడక్షన్ డిజైన్ గొప్పగా అనిపిస్తుంది. నిజంగా పాకిస్థాన్లోనే ఉన్న భావన కలిగేలా ల్యారీ సిటీని క్రియేట్ చేసిన తీరు అద్భుతం. నిర్మాణ విలువలకు ఢోకా లేదు.
ఇక రైటర్ కమ్ డైరెక్టర్ ఆదిత్య ధర్ ను ఎంత కొనియాడినా తక్కువే. ఎంతో సమాచారం సేకరించి.. దాని చుట్టూ కథాకథనాలు అల్లిన తీరు.. తెర మీద ప్రెజెంట్ చేసిన విధానం ఆశ్చర్యపరుస్తుంది. తన టేకింగ్ గురించి చాలా ఏళ్లు మాట్లాడుకుంటారనడంలో.. ‘దురంధర్’తో దర్శకుడిగా అతను చాలా ఏళ్లు గుర్తుండిపోతాడనడంలో.. ఈ చిత్ర ప్రభావం ఇండియన్ సినిమా మీద చాలా కాలం ఉంటుందనడంలో సందేహం లేదు.
Dhurandhar The Revenge Movie Review
ఆదిత్య ధర్ డైరెక్ట్ చేసిన ధురంధర్ ది రివెంజ్ ఆడియన్స్ నుండి యానానిమస్ గా మంచి రెస్పాన్స్ అందుకుంది. ఇక ఈ సినిమాలో రణ్‌వీర్ సింగ్ పెర్ఫార్మన్స్ పరంగా అందర్నీ పూర్తిగా డామినేట్ చేశాడు. మొదటి సీన్ నుంచి చివరి వరకు హమ్జా పాత్రలో వన్ మ్యాన్ షో చూపిస్తూ ఆడియన్స్‌ని కట్టిపడేశాడు. యాక్షన్ లో ఎంత క్రూరంగా కనిపించాడో, ఎమోషనల్ సీన్స్‌లో అంతగా కంటతడి పెట్టించాడు.
మాధవన్ ఇంటెలిజెన్స్ చీఫ్‌గా కూల్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. సంజయ్ దత్, అర్జున్ రాంపాల్ కూడా తమ పాత్రల్లో మెప్పించారు. అలాగే నిర్మాణ విలువలు కూడా రిచ్ గా ఉన్నాయి. రెండో పార్ట్ లెంగ్త్ కాస్త ఎక్కువ ఉన్నా కూడా బోర్ కొట్టదు. దర్శకుడు ఆ రేంజ్ స్క్రీన్ ప్లే తో మ్యాజిక్ చేసాడు. ఇక టెక్నికల్ గా ఎడిటింగ్, కెమెరా వర్క్ అన్ని బాగా కుదిరాయి. ఓవరాల్ గా ధురంధర్ ది రివెంజ్ బాక్స్ ఆఫీస్ వద్ద భారీ వసూళ్లు కొల్లగొట్టడం ఖాయమనిపిస్తుంది.
Dhurandhar The Revenge Movie Review
By Gulte
రణ్‌వీర్ సింగ్ ‘ధురంధర్: ది రివెంజ్’ సినిమాలో నిజంగానే తన నట విశ్వరూపం చూపించాడు. హమ్జా పాత్రలో పూర్తిగా ఇమిడిపోయి, బీస్ట్ మోడ్‌లో చెలరేగిపోయాడు. సినిమా మొత్తాన్ని తన భుజాలపై మోస్తూ వన్ మ్యాన్ షో ఇచ్చాడు. యాక్షన్, ఎమోషన్, మాస్ ఎలివేషన్స్ సహా అన్ని రణ్‌వీర్ స్క్రీన్ ప్రెజెన్స్‌ని మరో లెవెల్‌కు తీసుకెళ్లాయి. సపోర్టింగ్ క్యాస్ట్ కూడా బాగానే నిలిచింది. సంజయ్ దత్, మాధవన్, అర్జున్ రాంపాల్ తమ పాత్రలకు న్యాయం చేశారు. సారా అర్జున్ పాత్ర చిన్నదే అయినా ఓకే.
టెక్నికల్‌గా ఎడిటింగ్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్రధాన బలం. లాంగ్ రన్‌టైమ్ ఉన్నా ఎక్కడా బోర్ అనిపించకుండా మేనేజ్ చేశారు. సినిమాటోగ్రఫీ రిచ్‌గా ఉంది. వీఎఫ్ఎక్స్ కొద్దిగా వీక్‌గా ఉన్నా ఓవరాల్ ఫీల్‌పై పెద్దగా ప్రభావం లేదు. దర్శకుడు అదిత్య ధార్ స్క్రీన్‌ప్లేను గ్రిప్పింగ్‌గా నడిపిస్తూ, ట్విస్ట్స్‌తో ఎంగేజ్ చేశాడు. మాస్ డైలాగ్స్, ఎలివేషన్ సీన్స్ థియేటర్లలో బాగా వర్క్ అవుతాయి. మొత్తానికి ‘ధురంధర్: ది రివెంజ్’ ఒక పవర్‌ప్యాక్డ్ యాక్షన్ ఎంటర్టైనర్. రణ్‌వీర్ సింగ్ కోసం అయినా థియేటర్‌లో చూసేయాల్సిన సినిమా.
Dhurandhar The Revenge Movie Review
By Filmi Beat
ధురంధర్ ది రివెంజ్ అంటూ ఆడియన్స్ ముందుకు వచ్చిన రణ్‌వీర్ సింగ్ ఈ సినిమాలో పూర్తిగా బీస్ట్ మోడ్‌లో చెలరేగిపోయాడు. హమ్జా పాత్రలో వన్ మ్యాన్ షోతో స్క్రీన్‌ని డామినేట్ చేస్తూ యాక్షన్, ఎమోషన్, డ్రామాను అద్భుతంగా పండించాడు. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్, ఎలివేషన్స్ సినిమాకు మెయిన్ హైలైట్.
సంజయ్ దత్, ఆర్ మాధవన్, అర్జున్ రాంపాల్ తమ పాత్రల్లో బాగా మెప్పించారు. సారా అర్జున్‌కు స్కోప్ తక్కువైనా, కనిపించినంతసేపు ఓకే అనిపిస్తుంది.
టెక్నికల్‌గా ఎడిటింగ్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు పెద్ద ప్లస్ నాలుగు గంటల రన్‌టైమ్ ఉన్నా ఎక్కడా ల్యాగ్ అనిపించదు. సినిమాటోగ్రఫీ బాగుంది, వీఎఫ్ఎక్స్ కొంచెం వీక్ అయినా ప్రభావం తగ్గించవు.
దర్శకుడు అదిత్య ధార్ స్క్రీన్‌ప్లే, ట్విస్ట్స్‌తో సినిమాను ఎంగేజింగ్‌గా తీర్చిదిద్దాడు. బలమైన డైలాగ్స్, మాస్ సీన్స్ థియేటర్‌లో మంచి ఎక్స్‌పీరియెన్స్ ఇస్తాయి. ఓవరాల్ గా సినిమా అన్ని వర్గాల ఆడియన్స్ థియేటర్లో చూడాల్సిన సినిమాగా చెప్పొచ్చు.
Dhurandhar The Revenge Movie Review
By 123telugu
‘ధురంధర్: ది రివేంజ్’ ఒక కమర్షియల్ యాక్షన్ డ్రామాగా ప్రేక్షకులను బాగా ఎంగేజ్ చేసే ప్రయత్నం చేసింది. కథ పరంగా రివెంజ్ లైన్ పరిచయంగా అనిపించినప్పటికీ, దర్శకుడు దాన్ని ప్రెజెంట్ చేసిన విధానం ఆసక్తికరంగా ఉంది. ముఖ్యంగా రణవీర్ సింగ్ తన ఎనర్జిటిక్ మరియు ఇన్‌టెన్స్ పెర్ఫార్మెన్స్‌తో సినిమాకు పెద్ద ప్లస్ అయ్యాడు. యాక్షన్ సీన్స్ బాగా డిజైన్ చేయబడగా, సెకండాఫ్‌లో వచ్చే ట్విస్ట్స్, ఎమోషనల్ మూమెంట్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. ఫస్టాఫ్ కాస్త నెమ్మదిగా సాగినప్పటికీ, తరువాత కథ పికప్ అవుతుంది. టెక్నికల్‌గా సినిమాటోగ్రఫీ రిచ్‌గా ఉండగా, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ యాక్షన్ ఎపిసోడ్స్‌కి మంచి ఎలివేషన్ ఇచ్చింది. ఎడిటింగ్ ఇంకాస్త క్రిస్ప్‌గా ఉండి ఉంటే ఇంకా బెటర్ అయ్యేది. మొత్తానికి ‘ధురంధర్: ది రివేంజ్’ మాస్ ఆడియెన్స్‌ను దృష్టిలో పెట్టుకుని తెరకెక్కిన ఎంగేజింగ్ కమర్షియల్ ఎంటర్టైనర్‌గా నిలుస్తుంది.
Ustaad Bhagat Singh Movie Review
By Great Andhra
ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా రివ్యూ విషయానికి వస్తే... హైదరాబాద్ బ్యాక్‌డ్రాప్‌లో సాగిన ఈ కథలో రాజకీయాలు, పోలీస్ వ్యవస్థ, గ్యాంగ్ వార్స్ మిక్స్ అవుతాయి. హీరో పవన్ కళ్యాణ్ తన స్టైల్, స్వాగ్‌తో మాస్ ఆడియెన్స్‌ను ఆకట్టుకుంటాడు. ముఖ్యంగా కొన్ని యాక్షన్ సీన్స్, డైలాగ్స్ బాగా వర్క్ అవుతాయి. అయితే కథలో భావోద్వేగాలు, సామాజిక అంశాలు ఉన్నా కూడా అవి పూర్తిగా ప్రభావం చూపలేకపోతాయి. కొన్ని సన్నివేశాలు బాగున్నా మొత్తం కథనం కొంచెం నెమ్మదిగా, ఫ్లాట్ గా అనిపిస్తుంది. విలన్ ట్రాక్ కూడా అంతగా స్ట్రాంగ్‌గా ఏం లేదు. హరీష్ శంకర్ తన మార్క్ లో బాగానే సినిమాని ప్రెజెంట్ చేసినా, ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లే రాసుకోవడంలో తడబడ్డాడు. మొత్తానికి ఇది పూర్తి మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కినా, కొత్తదనంలేని కథా కథనాలతో ఆడియన్స్ ని పూర్తి స్థాయిలో మెప్పించలేదు. కానీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు మంచి ట్రీట్‌గా ఉంటుంది.
Browse by Reviewer Category
Discover reviews from different types of critics and publications
News Channel
Movie-specific media and publications
Twitter Channel
Website
Youtube Channel
CA/Advocate
Corporate (Non IT) Employee
Doctor/Health Worker
Homemaker / Housewives
Women managing households
Journalists & Critics
Private Employee
Small Business Owner
Less than 20 team size
Students & Youth
School students, college students, young viewers