Register as a Reviewer

Movie Reviews

Professional reviews and ratings from top critics and publications worldwide

233
Total Reviews
70
Movies Reviewed
24
Reviewer Categories
Active filters: Category: Youtube Channel ×
Showing 109-120 of 233 reviews
Clear all filters

Veerabhadrudu movie Review

5.0
out of 10
సూర్య సినిమా వీరభద్రుడు సినిమా గురించి చెప్పాలంటే... దర్శకుడు ఆర్జె బాలాజీ ముందు సినిమా అమ్మోరు తల్లి సినిమా ఎలా ఉంటుందో అలాంటి పాయింట్ అఫ్ వ్యూ లోనే తెరకెక్కింది ఈ మూవీ కూడా. అయితే మూవీ మాత్రం చాలా రొటీన్ ఫీల్ వస్తుంది. ఫస్ట్ యావరేజ్ గా ఉంటుంది. సెకండ్ హాఫ్ అయితే ఎక్కడ్నుంచో స్టార్ట్ అయి మరెక్కడికో వెళ్ళిపోతుంది. ఇక సాయి అభ్యంకార్ మ్యూజిక్ అయితే ఏమాత్రం బాలేవు. బీజీఎమ్ ఒకే. ఇక సూర్య పెర్ఫార్మన్స్...

సూర్య సినిమా వీరభద్రుడు సినిమా గురించి చెప్పాలంటే... దర్శకుడు ఆర్జె బాలాజీ ముందు సినిమా అమ్మోరు తల్లి సినిమా ఎలా ఉంటుందో అలాంటి పాయింట్ అఫ్ వ్యూ లోనే తెరకెక్కింది ఈ మూవీ కూడా. అయితే మూవీ మాత్రం చాలా రొటీన్ ఫీల్ వస్తుంది. ఫస్ట్ యావరేజ్ గా ఉంటుంది. సెకండ్ హాఫ్ అయితే ఎక్కడ్నుంచో స్టార్ట్ అయి మరెక్కడికో వెళ్ళిపోతుంది. ఇక సాయి అభ్యంకార్ మ్యూజిక్ అయితే ఏమాత్రం బాలేవు. బీజీఎమ్ ఒకే. ఇక సూర్య పెర్ఫార్మన్స్ బాగుంది. కానీ స్క్రీన్ టైం లెంగ్త్ తక్కువ. అలాగే డైరెక్ట్ చేయడమే కాకుండా విలన్ గా నటించిన ఆర్ జె బాలాజీ పెర్ఫార్మన్స్ బాగుంది. బట్ సూర్య ముందు తేలిపోతాడు. 


ఇక ఈ సినిమాలో లాజిక్ లు పక్కన పెడితేనే సినిమా చూడగలరు ఆడియన్స్. పైగా సూర్య - అర్జె బాలాజీ మధ్య సీన్స్ ఇల్లాజికల్ గా అనిపించడమే కాకుండా, తల తోక లేని సీన్స్ అన్నట్టు ఉంటుంది. ఇక త్రిష రోల్ పెద్దగా చెప్పుకోవడానికి ఏం లేదు. ఓవరాల్ గా వీరభద్రుడు సినిమా ఫ్యాన్స్ కి నచ్చేట్టు ఉంటుందేమో గాని నార్మల్ ఆడియన్స్ పెద్దగా చూసేట్టు లేదు. ఇక ఫ్రెష్ మూవీస్ కోరుకునే ఆడియన్స్ దీని జోలికెళ్లకపోవడం మంచిది. 

May 16, 2026 Telugu

Veerabhadrudu movie Review

6.0
out of 10
సూర్య నటించిన వీరభద్రుడు సినిమా గురించి చెప్పాలంటే... సినిమా బేసిగ్గా ఓవరాల్ గా అయితే మాత్రం జస్ట్ అబౌవ్ యావరేజ్ అంతే... ఫస్ట్ హాఫ్ బాగా అనిపిస్తది. అప్పట్లో శివకార్తికేయన్ నటించిన మహావీరుడు సినిమాలా జోనర్ లో ఉంటుంది ఈ మహావీరుడు సినిమా. ఫస్ట్ హాఫ్ బానే అనిపిస్తుంది. కానీ సినిమాలో కోర్ట్ సీన్స్ లాంటివి అంత ఎక్సయిటింగ్ గా ఇంట్రెస్టింగ్ గా లేకపోయినా, కొన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ బాగున్నాయి. కానీ కొన్న...

సూర్య నటించిన వీరభద్రుడు సినిమా గురించి చెప్పాలంటే... సినిమా బేసిగ్గా ఓవరాల్ గా అయితే మాత్రం జస్ట్ అబౌవ్ యావరేజ్ అంతే... ఫస్ట్ హాఫ్ బాగా అనిపిస్తది. అప్పట్లో శివకార్తికేయన్ నటించిన మహావీరుడు సినిమాలా జోనర్ లో ఉంటుంది ఈ మహావీరుడు సినిమా. ఫస్ట్ హాఫ్ బానే అనిపిస్తుంది. కానీ సినిమాలో కోర్ట్ సీన్స్ లాంటివి అంత ఎక్సయిటింగ్ గా ఇంట్రెస్టింగ్ గా లేకపోయినా, కొన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ బాగున్నాయి. కానీ కొన్ని ఓవర్ ది టాప్ అయిపోతాయి. అయితే సెకండ్ హాఫ్ కి వచ్చేటప్పటికి అయితే ఏ సీన్ ఎటు పోతుందో అర్ధం కానట్టుంటుంది. 


అయితే సినిమాలో కొన్ని పాత సినిమాల రిఫరెన్స్ లు ఎక్కువగా కనిపిస్తాయి. ఫ్యాన్స్ కి బానే అనిపించినా, నార్మల్ ఆడియన్స్ అంతగా కనెక్ట్ కాకపోవచ్చు. ఇక సాంగ్స్ అయితే ఏమంత బాగాలేవు. కొన్ని అర్ధం కానీ విధంగా ఉన్నాయి. సాయి అభ్యంకార్ మ్యూజిక్ బానే ఉంది. సో ఓవరాల్ గా వీరభద్రుడు మూవీ అయితే అబొవ్ యావరేజ్. సోది లేకుండా ఒక్క ముక్కలో మూవీ గురించి చెప్పాలంటే... సూర్య లాస్ట్ మూవీస్ తో పోల్చుకుంటే కొంచెం బెటర్ గానే ఉంది. కానీ బాగుందని కాదు. రెగ్యులర్ మూవీ లవర్స్ ఓసారి ట్రై చేయొచ్చు. రేటింగ్ చెప్పాలంటే 2.5 ఇవ్వొచ్చు. 

May 16, 2026 Telugu

Veerabhadrudu movie review

6.0
out of 10
వీరభద్రుడు.. రెండున్నర గంటల రన్ టైం తో వన్ డే డిలే తో రిలీజ్ అయింది. మొత్తానికి సినిమా చూసాక ఫస్ట్ హాఫ్ బానే ఉంది. సెకండ్ హాఫ్ లో ఒక అరగంట స్లో ఉంటుంది. ఓవరాల్ గా పర్లేదు. టూ గుడ్ కాదు గాని, ఒకసారి చూసేయొచ్చు. ఇలా ఉన్నా గాని చాలు... థియేటర్ కి వెళ్లి చూడొచ్చు అనిపించేలా ఉంది. ఈ మధ్య కాలంలో వచ్చిన మూవీస్ తో కంపేర్ చేస్తే బెటర్ వీరభద్రుడు మూవీ. ఇక సూర్య సీన్స్ చాలా బాగున్నాయి. పాత సినిమాల రిఫరెన్స్...

వీరభద్రుడు.. రెండున్నర గంటల రన్ టైం తో వన్ డే డిలే తో రిలీజ్ అయింది. మొత్తానికి సినిమా చూసాక ఫస్ట్ హాఫ్ బానే ఉంది. సెకండ్ హాఫ్ లో ఒక అరగంట స్లో ఉంటుంది. ఓవరాల్ గా పర్లేదు. టూ గుడ్ కాదు గాని, ఒకసారి చూసేయొచ్చు. ఇలా ఉన్నా గాని చాలు... థియేటర్ కి వెళ్లి చూడొచ్చు అనిపించేలా ఉంది. ఈ మధ్య కాలంలో వచ్చిన మూవీస్ తో కంపేర్ చేస్తే బెటర్ వీరభద్రుడు మూవీ. ఇక సూర్య సీన్స్ చాలా బాగున్నాయి. పాత సినిమాల రిఫరెన్స్ లు కూడా బాగున్నాయి. 

ఇక “సమాజాన్ని దేవుడు కూడా మార్చలేడు” అనే పాయింట్ కొత్తది కాదు. కానీ కోర్ట్ డ్రామాగా చెప్పాలని ట్రై చేశారు. 


ట్రైలర్ చూస్తే ఏదో గట్టిగా ఉంటుందనిపిస్తుంది. సూర్య స్క్రీన్ స్పేస్ తగ్గింది. డైరెక్టర్ ఆర్జె బాలాజీ తన స్క్రీన్ టైం పైనే ఎక్కువ ఫోకస్ పెట్టినట్టుంది. అయినా కానీ సూర్య ఫ్యాన్స్ కి ఉన్నంత సేపు మంచి కిక్ ఇస్తాడు. క్లైమాక్స్ ఫ్యాన్స్ కి గూస్బంప్స్ ఫీల్ వస్తుంది. త్రిష పాత్ర కూడా జస్ట్ అలా వచ్చి వెళ్లిపోతుంది. కోర్ట్ సీన్స్ ఇంకాస్త పవర్‌ఫుల్‌గా ఉంటే మూవీ నిలబడేది. మొత్తానికి ‘వీరభద్రుడు’లో రెగ్యులర్ మూవీ లవర్స్ కి కావాల్సిన అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి గాని, ఫ్రెష్ నెస్ కోరుకుంటే మాత్రం డిస్సపాయింట్ అవుతారు.  

May 16, 2026 Telugu

Godari Gattupaina movie Review

6.0
out of 10
‘గోదారి గట్టుపైన’ టైటిల్ చూసి… గోదావరి బ్యాక్‌డ్రాప్‌లో ఓ feel-good లవ్ స్టోరీ, గట్టిగా connect అయ్యే ఎమోషన్స్ ఉంటాయనుకుంటే… థియేటర్లో మాత్రం సీన్ కాస్త రివర్స్ అవుతుంది బాస్! సినిమా మొత్తం చూస్తుంటే దర్శకుడు కథ కంటే విజువల్స్ మీదే ఎక్కువ ప్రేమ పెట్టినట్టు కనిపిస్తుంది. సినిమాకి సింప్లిసిటీ చాలా ప్లస్ అయింది. స్పెషల్లీ గోదావరి అందాలు, పల్లెటూరి వాతావరణం మాత్రం స్క్రీన్ మీద అదిరిపోతాయి. సినిమాలో సు...

‘గోదారి గట్టుపైన’ టైటిల్ చూసి… గోదావరి బ్యాక్‌డ్రాప్‌లో ఓ feel-good లవ్ స్టోరీ, గట్టిగా connect అయ్యే ఎమోషన్స్ ఉంటాయనుకుంటే… థియేటర్లో మాత్రం సీన్ కాస్త రివర్స్ అవుతుంది బాస్! సినిమా మొత్తం చూస్తుంటే దర్శకుడు కథ కంటే విజువల్స్ మీదే ఎక్కువ ప్రేమ పెట్టినట్టు కనిపిస్తుంది. సినిమాకి సింప్లిసిటీ చాలా ప్లస్ అయింది. స్పెషల్లీ గోదావరి అందాలు, పల్లెటూరి వాతావరణం మాత్రం స్క్రీన్ మీద అదిరిపోతాయి. సినిమాలో సుదర్శన్ కామెడీ హైలెట్ అవుతుంది. 


ఇక సినిమాలో మైనస్ పాయింట్ మెయిన్ గా చెప్పాలంటే స్టోరీ. చాలా సింపుల్ గా తెలిసిన సీన్లే ఉంటాయి. పెర్ఫార్మన్స్ గురించి మాట్లాడుకుంటే జగపతి బాబు రోల్ బిగ్ ప్లస్. హీరోహీరోయిన్లు కూడా డీసెంట్ గా ఆక్ట్ చేసారు. మ్యూజిక్ డీసెంట్ గా అనిపించింది. ఫన్ కూడా మెజారిటీ వర్కౌట్ అయేలా ఉంది. సో ఓవరాల్ గా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా చూస్తే డీసెంట్ వాచబుల్ ఫీల్ వస్తుంది. 

May 12, 2026 Telugu

Godari Gattupaina Movie Review

Thyview

By Thyview

5.0
out of 10
గోదారి గట్టుపైన’ సినిమా చూసాక ముందు రివ్యూ సింపుల్ గా చెప్పాలంటే నచ్చలేదు బ్రో. మొత్తం అవుట్ డేటెడ్ మూవీ స్టోరీ. బట్ గోదావరి visuals అంత బాగా చూపించినందుకు డైరెక్టర్ సుభాష్ చంద్రని అభినందించాలి. అసలు సినిమా కథ గురించి కాకుండా టైటిల్ గురించి మాట్లాడుకుంటే గోదారి గట్టుపైన అంటూ టైటిల్ పెట్టినప్పుడు ఆ టైటిల్ కి జస్టిఫై చేయాలి. బట్ అది జరగలేదు. సినిమాలో కూడా గోదావరి కాస్ట్ ని చూస్తున్నాం అని కాకుండా, స...

గోదారి గట్టుపైన’ సినిమా చూసాక ముందు రివ్యూ సింపుల్ గా చెప్పాలంటే నచ్చలేదు బ్రో. మొత్తం అవుట్ డేటెడ్ మూవీ స్టోరీ. బట్ గోదావరి visuals అంత బాగా చూపించినందుకు డైరెక్టర్ సుభాష్ చంద్రని అభినందించాలి. అసలు సినిమా కథ గురించి కాకుండా టైటిల్ గురించి మాట్లాడుకుంటే గోదారి గట్టుపైన అంటూ టైటిల్ పెట్టినప్పుడు ఆ టైటిల్ కి జస్టిఫై చేయాలి. బట్ అది జరగలేదు. సినిమాలో కూడా గోదావరి కాస్ట్ ని చూస్తున్నాం అని కాకుండా, సినిమా కాస్ట్ ని చూస్తున్న ఫీలింగే వస్తుంది. అంటే సహజత్వం లేదన్నమాట.


లైలా లాంటి ఆర్టిస్టులకు స్ట్రాంగ్ రోల్స్ కూడా ఇవ్వలేదు. సినిమాలో కామెడికి స్కోప్ ఉన్నా, ఎక్కడా వాడలేదు. పెర్ఫార్మన్స్ వరకు సుమంత్ ప్రభాస్ decent గా చేశాడు. Jagapathi Babu కి importance ఇచ్చారు కానీ… ఆ character నుంచి audience expect చేసే emotional impact మాత్రం రావడం లేదు. Overall గా చెప్పాలంటే… ‘గోదారి గట్టుపైన’ ఒక beautiful looking village love story. కానీ heart touching cinema అవ్వాల్సింది… slow and routine experience గా మారిపోయింది. అందువల్ల డిస్సపాయింట్ చేసింది. 

May 11, 2026 Telugu

Godari Gattupaina movie Review

5.0
out of 10
‘గోదారి గట్టుపైన’ అనే టైటిల్ వింటే… గోదావరి ఒడ్డున ఓ అందమైన ప్రేమకథ, మనసుకు హత్తుకునే ఎమోషన్స్, పల్లెటూరి నేటివిటీ ఇలా చాలా ఎక్స్‌పెక్టేషన్స్ వస్తాయి. సినిమా మొదలైన కొద్దిసేపు ఆ ఫీల్ కూడా ఉంటుంది. విజువల్స్, గోదావరి బ్యాక్‌డ్రాప్, పాత్రల సెటప్ ఇవన్నీ చూసి “ఏదో మంచి ఫీల్ గుడ్ మూవీ చూడబోతున్నామేమో” అనిపిస్తుంది. కానీ సినిమా ముందుకు వెళ్లేకొద్దీ ఆ ఫీల్ మెల్లగా తగ్గిపోతుంది.సింపుల్ గా చెప్పాలంటే నిబ్బ...

‘గోదారి గట్టుపైన’ అనే టైటిల్ వింటే… గోదావరి ఒడ్డున ఓ అందమైన ప్రేమకథ, మనసుకు హత్తుకునే ఎమోషన్స్, పల్లెటూరి నేటివిటీ ఇలా చాలా ఎక్స్‌పెక్టేషన్స్ వస్తాయి. సినిమా మొదలైన కొద్దిసేపు ఆ ఫీల్ కూడా ఉంటుంది. విజువల్స్, గోదావరి బ్యాక్‌డ్రాప్, పాత్రల సెటప్ ఇవన్నీ చూసి “ఏదో మంచి ఫీల్ గుడ్ మూవీ చూడబోతున్నామేమో” అనిపిస్తుంది. కానీ సినిమా ముందుకు వెళ్లేకొద్దీ ఆ ఫీల్ మెల్లగా తగ్గిపోతుంది.


సింపుల్ గా చెప్పాలంటే నిబ్బా నిబ్బి కలుసుకుంటారు, కొట్లాడుకుంటారు, తర్వాత లవ్...ఇక ఫ్యామిలీ ట్విస్ట్.. అమ్మో, అయ్యో అడ్డం వస్తారు. ఇంకేముంది కలుస్తారా? లేదా? అంతే కథ. వెయ్యి సినిమాల్లో ఇలాంటి స్టోరీలు చూసాం.. ప్రతి సీన్ కూడా మనం ఈజీగా గెస్ చేస్తాం.. బట్ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యేలా ఒక్క సీన్ ఉండదు. ఇక సాంగ్స్ కూడా ఆగం పట్టించినయి. ఓవరాల్ గా ‘గోదారి గట్టుపైన’ మంచి ప్రయత్నమే… కానీ థియేటర్లో గట్టిగా నిలబడేంత బలం మాత్రం సినిమాలో కనిపించదు. ఇక డెసిషన్ మీ పైనే ఉంది. 

May 11, 2026 Telugu
5.0
out of 10
సుమంత్ ప్రభాస్ హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ ‘గోదారి గట్టుపైన’ సినిమా గురించి సింపుల్ గా చెప్పాలంటే అవుట్ డేటెడ్ ఇల్లాజికల్. ఈ సినిమా ఒక 40 ఇయర్స్ కిందట రిలీజ్ అయి ఉండాల్సిన సినిమా. అలాంటి ఈ సినిమాలో ఏదైనా ఒక కొత్త పాయింట్ కొంచెమైనా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తే... ఏం లేదు.. అంతా తెలిసిన సినిమాలే.. కాకపోతే "గోదారి గట్టుపైన" టైటిల్ ఎక్స్పెక్ట్ చేసి ఇంకేదో ఉంటుందని ఆడియన్స్ అనుకుంటే అది కూడా ఏం లేదు. ఒక...

సుమంత్ ప్రభాస్ హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ ‘గోదారి గట్టుపైన’ సినిమా గురించి సింపుల్ గా చెప్పాలంటే అవుట్ డేటెడ్ ఇల్లాజికల్. ఈ సినిమా ఒక 40 ఇయర్స్ కిందట రిలీజ్ అయి ఉండాల్సిన సినిమా. అలాంటి ఈ సినిమాలో ఏదైనా ఒక కొత్త పాయింట్ కొంచెమైనా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తే... ఏం లేదు.. అంతా తెలిసిన సినిమాలే.. కాకపోతే "గోదారి గట్టుపైన" టైటిల్ ఎక్స్పెక్ట్ చేసి ఇంకేదో ఉంటుందని ఆడియన్స్ అనుకుంటే అది కూడా ఏం లేదు. ఒక సరైన లవ్ లేదు, ఫామిలీ డ్రామా లేదు, కనీసం కామెడీ కూడా లేదు. 


ఇక క్రింజు సీన్లకు కొదవలేదు. హీరో హీరోయిన్లు కొట్టుకుంటారు, అపార్ధాలు... జాలి.. దెబ్బకు లవ్ లో పడిపోతారు.. అంతే దీనికి తోడు హీరో హీరోయిన్లు వేరే కాస్ట్. ఈ కాన్సెప్ట్ తో వందల సినిమాలొచ్చాయి. అదే రొట్టని డైరెక్టర్ మళ్ళీ దించాడు. ఎంతో కొంత గోదారి అందాల్ని చూద్దామనుకున్న ఆడియన్స్ ఎంతో కొంత రిలాక్స్ అవుతారు. టెక్నికల్‌గా మూవీ కొంత నీట్ గా ఉంటుంది. కెమెరా వర్క్ చాలా బాగుంది. గోదావరి అందాలు మాత్రం స్క్రీన్ మీద అందంగా కనిపిస్తాయి. కానీ అందమైన విజువల్స్‌తో మాత్రమే సినిమా నిలబడదు కదా బాస్! మొత్తానికి ‘గోదారి గట్టుపైన’ అంటే భారీ ఎమోషనల్ జర్నీ అనుకుంటే… థియేటర్లో మాత్రం స్లో బోట్ రైడ్‌లా అనిపించే ఛాన్స్ ఎక్కువ.

May 11, 2026 Telugu

Gayapadda Simham movie Review

5.0
out of 10
తరుణ్ భాస్కర్ చాలా రోజుల తర్వాత మళ్ళీ హీరోగా ట్రై చేసిన ‘గాయపడ్డ సింహం’ ఫైనల్ గా థియేటర్లకు వచ్చేసింది. ఇక సినిమా స్టార్ట్ అయిన పదిహేను నిమిషాల్లోనే క్లారిటీ వచ్చేస్తుంది… “ఇది ఏ జానర్ బాస్?” అసలు కామెడీనా? సీరియస్ స్టోరీనా? లేక ఎక్స్‌పెరిమెంటా? అని — ఏదీ ఫుల్‌ గా వర్క్ అవ్వలేదు. హీరోగా తరుణ్ భాస్కర్ బానే సెట్టయ్యాడు, కానీ తన రోల్ స్ట్రాంగ్ రాసుకోలేదు. తన స్టైల్ అఫ్ డైలాగ్స్, నేచురల్ యాక్టింగ్ ఉంద...

తరుణ్ భాస్కర్ చాలా రోజుల తర్వాత మళ్ళీ హీరోగా ట్రై చేసిన ‘గాయపడ్డ సింహం’ ఫైనల్ గా థియేటర్లకు వచ్చేసింది. ఇక సినిమా స్టార్ట్ అయిన పదిహేను నిమిషాల్లోనే క్లారిటీ వచ్చేస్తుంది… “ఇది ఏ జానర్ బాస్?” అసలు కామెడీనా? సీరియస్ స్టోరీనా? లేక ఎక్స్‌పెరిమెంటా? అని — ఏదీ ఫుల్‌ గా వర్క్ అవ్వలేదు. హీరోగా తరుణ్ భాస్కర్ బానే సెట్టయ్యాడు, కానీ తన రోల్ స్ట్రాంగ్ రాసుకోలేదు. తన స్టైల్ అఫ్ డైలాగ్స్, నేచురల్ యాక్టింగ్ ఉంది, కానీ ఫ్రెష్ నెస్ లేదు.


సెకండాఫ్‌లో అయినా స్టోరీ పికప్ అవుద్దేమో అనుకుంటే మళ్ళీ రిపీట్ మోడ్ లోకి వెళ్తుంది. ఎటొచ్చి శ్రీ విష్ణు ఎంట్రీ చ్చినప్పుడే కాస్త ఎంటర్టైన్మెంట్ పెరిగి మంచి ఫీల్ ఇస్తుంది. ఓవరాల్ గా ఒక డిఫెరెంట్ కాన్సెప్ట్ ని, డిఫెరెంట్ పాయింట్ తో, డిఫెరెంట్ గానే మేకర్స్ చూపించడానికి ట్రై చేశారన్నమాట. సింపుల్ గా లో ఎక్స్పెక్టేషన్స్ తో చూస్తే మంచి ఫీల్ రావొచ్చు గాని, గాయపడ్డ సింహం పై కన్ఫ్యూజన్ ఎక్కువ.

May 06, 2026 Telugu

Gayapadda Simham movie Review

5.0
out of 10
'గాయపడ్డ సింహం' అంటూ ఆడియన్స్ ముందుకు వచ్చిన తరుణ్ భాస్కర్ ఈసారి అరకొర అన్నట్టుగా ఇంప్రెస్ చేయడానికి ట్రై చేసాడు. అయితే సినిమా చూస్తే ఒక క్లియర్ ఫీలింగ్ అయితే వస్తుంది. ఐడియా ఉంది, కానీ ఎగ్జిక్యూషన్ మిస్ అయింది. తరుణ్ భాస్కర్ డైరెక్టర్ గా ప్రూవ్ చేసుకున్నా, హీరోగా ఎక్స్‌పెక్ట్ చేసిన ఇంపాక్ట్ రాలేదు. ఫస్ట్ హాఫ్‌ లోనే సినిమా టోన్ సెటిల్ అవ్వదు. సెకండాఫ్‌లో కథ ముందుకు వెళ్లాలని చూస్తుంది, కానీ మళ్లీ...

'గాయపడ్డ సింహం' అంటూ ఆడియన్స్ ముందుకు వచ్చిన తరుణ్ భాస్కర్ ఈసారి అరకొర అన్నట్టుగా ఇంప్రెస్ చేయడానికి ట్రై చేసాడు. అయితే సినిమా చూస్తే ఒక క్లియర్ ఫీలింగ్ అయితే వస్తుంది. ఐడియా ఉంది, కానీ ఎగ్జిక్యూషన్ మిస్ అయింది. తరుణ్ భాస్కర్ డైరెక్టర్ గా ప్రూవ్ చేసుకున్నా, హీరోగా ఎక్స్‌పెక్ట్ చేసిన ఇంపాక్ట్ రాలేదు. ఫస్ట్ హాఫ్‌ లోనే సినిమా టోన్ సెటిల్ అవ్వదు. సెకండాఫ్‌లో కథ ముందుకు వెళ్లాలని చూస్తుంది, కానీ మళ్లీ అదే లూప్‌లో తిరిగినట్టు అనిపిస్తుంది. ఎమోషన్, కామెడీ రెండింట్లోనూ క్లారిటీ లేకపోవడం వల్ల ఆడియెన్స్ కనెక్ట్ అవ్వడం కష్టమే. 


ఓవరాల్ గా సినిమా గురించి చెప్పాలంటే..జస్ట్ ఒకే. సోది లేకుండా ఒక్క ముక్కలో చెప్పాలంటే..కొత్తదనం కోసం వెళ్ళేవాళ్లకి మిస్, టైమ్‌పాస్ కోసం వెళ్లేవాళ్లకి కూడా మిక్స్డ్ ఫీలింగ్ మాత్రమే. రేటింగ్ విషయానికి వస్తే... ఫైవ్ అవుట్ అఫ్ టెన్ వరకు ఇవ్వొచ్చు.. లేదంటే టు పాయింట్ ఫైవ్ వరకు ఇవ్వొచ్చు. 

May 06, 2026 Telugu

Gayapadda Simham movie Review

5.0
out of 10
సమ్మర్ లో పెద్ద సినిమాలు లేక డీలా పడితే, చిన్న సినిమాలైనా ఊరట కలిగిస్తాయనుకుంటే అవి కూడా దెబ్బేస్తున్నాయి. లేటెస్ట్ గా రిలీజ్ అయిన ‘గాయపడ్డ సింహం’ కూడా ఇదే కోవలోకి వచ్చేలా కనిపిస్తుంది. ఈ సినిమా ఒక క్లియర్ ఐడియా లేకుండా తీసిన ఎక్స్‌పెరిమెంట్‌ లా అనిపిస్తుంది. తరుణ్ భాస్కర్ దర్శకుడిగా తనదైన స్టైల్‌ తో మంచి సినిమాలు ఇచ్చాడు. కానీ హీరోగా ఈసారి ఆయన తీసుకున్న రిస్క్ పూర్తిగా వర్క్ కాలేదు. ట్రైలర్‌ లో క...

సమ్మర్ లో పెద్ద సినిమాలు లేక డీలా పడితే, చిన్న సినిమాలైనా ఊరట కలిగిస్తాయనుకుంటే అవి కూడా దెబ్బేస్తున్నాయి. లేటెస్ట్ గా రిలీజ్ అయిన ‘గాయపడ్డ సింహం’ కూడా ఇదే కోవలోకి వచ్చేలా కనిపిస్తుంది. ఈ సినిమా ఒక క్లియర్ ఐడియా లేకుండా తీసిన ఎక్స్‌పెరిమెంట్‌ లా అనిపిస్తుంది. తరుణ్ భాస్కర్ దర్శకుడిగా తనదైన స్టైల్‌ తో మంచి సినిమాలు ఇచ్చాడు. కానీ హీరోగా ఈసారి ఆయన తీసుకున్న రిస్క్ పూర్తిగా వర్క్ కాలేదు. ట్రైలర్‌ లో కనిపించిన ఎంటర్టైన్మెంట్ సినిమా మొత్తంలో కనబడకపోవడం పెద్ద డిసప్పాయింట్.


ఫస్ట్ హాఫ్ మొత్తం లాజిక్ లేకుండా, సిల్లీ సిట్యుయేషన్స్‌ తో సాగిపోతుంది. కామెడీ కోసం పెట్టిన రిఫరెన్సులు కూడా పెద్దగా పేలవు. ప్రేక్షకుడు ఎక్కడ కనెక్ట్ అవ్వాలి, ఎక్కడ నవ్వాలి అన్న క్లారిటీ లేకుండా సినిమా ముందుకు సాగుతుంది. సెకండాఫ్‌లో కూడా కథలో పెద్దగా ట్విస్టులు ఉండవు. నటీనటుల పరంగా చూస్తే తరుణ్ భాస్కర్ తన పాత్రలో ఓకే అనిపించినా, సినిమాలోని బలహీన రైటింగ్ వల్ల ఆయన పర్ఫార్మెన్స్ కూడా లిఫ్ట్ కాలేదు. ఫరియా అబ్దుల్లా, మానస చౌదరి పాత్రలు కూడా పరిమితంగానే ఉన్నాయి. జెడి చక్రవర్తి పాత్రకు ఉన్న బిల్డప్ స్క్రీన్‌ పై కనిపించదు. అయితే శ్రీ విష్ణు ఎంట్రీ మాత్రం కొంతవరకు సినిమాకు ఎనర్జీ ఇస్తుంది. ఓవరాల్ గా ‘గాయపడ్డ సింహం’ కంఫ్యూజ్డ్ రైటింగ్ + వీక్ ఎక్స్యూగుషన్. 

May 06, 2026 Telugu

Gayapadda Simham movie Review

4.0
out of 10
'గాయపడ్డ సింహం' అంటూ థియేటర్లోకి వచ్చిన తరుణ్ భాస్కర్ సినిమా గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే… అంచనాలు ఎక్కువ, అవుట్‌పుట్ తక్కువ. డైరెక్టర్ గా మంచి పేరు తెచ్చుకున్న తరుణ్ భాస్కర్ ఈసారి హీరోగా ఆడియెన్స్‌ను పూర్తిగా డిస్సపాయింట్ చేసాడు. ట్రైలర్‌ లో కనిపించిన కామెడీ, ఎంటర్టైన్మెంట్ సినిమా మొత్తంలో కనిపించకపోవడం పెద్ద మైనస్. ఫస్ట్ హాఫ్ అంతా సిల్లీ సీన్స్, లాజిక్ లేకుండా సాగిపోతుంది. కొన్ని రిఫరెన్సులు,...

'గాయపడ్డ సింహం' అంటూ థియేటర్లోకి వచ్చిన తరుణ్ భాస్కర్ సినిమా గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే… అంచనాలు ఎక్కువ, అవుట్‌పుట్ తక్కువ. డైరెక్టర్ గా మంచి పేరు తెచ్చుకున్న తరుణ్ భాస్కర్ ఈసారి హీరోగా ఆడియెన్స్‌ను పూర్తిగా డిస్సపాయింట్ చేసాడు. ట్రైలర్‌ లో కనిపించిన కామెడీ, ఎంటర్టైన్మెంట్ సినిమా మొత్తంలో కనిపించకపోవడం పెద్ద మైనస్. ఫస్ట్ హాఫ్ అంతా సిల్లీ సీన్స్, లాజిక్ లేకుండా సాగిపోతుంది. కొన్ని రిఫరెన్సులు, మీమ్‌ లను పెట్టినా అవి నవ్వు తెప్పించలేవు. సెకండాఫ్‌ లో కూడా కథ ముందుకు వెళ్లకుండా అదే చుట్టూ తిరుగుతున్న ఫీలింగ్ వస్తుంది.


ఫరియా అబ్దుల్లా, మానస చౌదరి రోల్స్ పరిమితంగానే ఉంటాయి. జెడి చక్రవర్తి పాత్రకు హైప్ ఇచ్చినా, స్క్రీన్‌ పై పెద్దగా ఇంపాక్ట్ లేదు. సినిమా మొత్తం బోర్‌ గా సాగుతున్న టైం లో శ్రీ విష్ణు ఎంట్రీ కొద్దివరకు రిలీఫ్ ఇస్తుంది. టెక్నికల్‌ గా పర్వాలేదనిపించినా, కంటెంట్ పరంగా సినిమా బలహీనంగా ఉంది. మొత్తంగా ‘గాయపడ్డ సింహం’ అనే టైటిల్ లాగా… ఈ సినిమా చూసిన ఆడియెన్స్‌ కి కూడా ‘గాయం’ మిగులుతుంది. కామెడీ కోసం వచ్చినవాళ్లకు నిరాశ, కొత్తదనం కోరుకున్నవాళ్లకు పూర్తిగా మిస్ అయ్యే సినిమా ఇది. ఓవరాల్ గా గాయపడ్డ సింహాన్ని చూసి జాలిపడితే థియేటర్ నుంచి వచ్చిన ఆడియన్స్ ని చూసి మరొకరు జాలిపడతారు అన్నట్టుంది. 

May 06, 2026 Telugu

Kara movie Review

కర (Kara) 2026 Youtube Channel
5.0
out of 10
కర’ సినిమా చూసాక ఒకే ఫీలింగ్… “బేస్ బాగుంది… కానీ ప్యాకేజింగ్ కాస్త వీక్!” హీరోగా Dhanush తనదైన స్టైల్‌లో నేచురల్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. కొన్ని సీన్స్‌లో ఆయన యాక్టింగ్ నిజంగా హైలైట్. కానీ సినిమా మొత్తం అదే ఎనర్జీని మెంటైన్ చేయలేకపోయింది. డైరెక్టర్ Vignesh Raja తీసుకున్న కాన్సెప్ట్ మాత్రం సాలిడ్. చాలా సీన్లు రియలిస్టిక్ గా ఉంటాయి. కానీ ప్రీ క్లైమాక్స్ వచ్చేసరికి మరీ సినిమాటిక్ లిబర్టీని...

కర’ సినిమా చూసాక ఒకే ఫీలింగ్… “బేస్ బాగుంది… కానీ ప్యాకేజింగ్ కాస్త వీక్!” హీరోగా Dhanush తనదైన స్టైల్‌లో నేచురల్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. కొన్ని సీన్స్‌లో ఆయన యాక్టింగ్ నిజంగా హైలైట్. కానీ సినిమా మొత్తం అదే ఎనర్జీని మెంటైన్ చేయలేకపోయింది. డైరెక్టర్ Vignesh Raja తీసుకున్న కాన్సెప్ట్ మాత్రం సాలిడ్. చాలా సీన్లు రియలిస్టిక్ గా ఉంటాయి. కానీ ప్రీ క్లైమాక్స్ వచ్చేసరికి మరీ సినిమాటిక్ లిబర్టీని ఎక్కువగా తీసుకున్నారు. అందువల్ల ఆడియన్స్ కి మరీ ఇంత ఎమోషన్స్ ఏంట్రా తట్టుకోలేకపోతున్నాం అన్న ఫీల్ వస్తుంది. సింపుల్ గా చెప్పాలంటే కొంచెం ఎమోషనల్ ఓవర్‌డోస్‌గా అనిపిస్తుంది.


కొన్ని సీన్స్ బాగా హిట్ అవుతాయి… కానీ వెంటనే ఫ్లో బ్రేక్ అవ్వడం వల్ల ఆడియెన్స్ కనెక్ట్ మిస్ అవుతుంది. జివి ప్రకాష్ బీజీఎమ్ కూడా బాగుంది. ఓవరాల్ గా కర ఒక స్లో పేస్డ్ ఫిలిం. కానీ సెటప్ చాలా స్ట్రాంగ్ గా ఉంటది. విజువల్స్ కూడా బావుంటాయి. కానీ ఫ్రెష్ నెస్ కోరుకుంటే డిస్సపాయింట్ అవుతారు. రెగ్యులర్ మూవీ లవర్స్ కి అయితే ఒకే గాని, లవ్ స్టోరీస్, యాక్షన్ మూవీస్, ఎంటర్టైన్మెంట్స్ ఇష్టపడే వాళ్లకయితే పెద్దగా సినిమా నచ్చకపోవచ్చు. 

May 04, 2026 Telugu
Why MRO?