వీరభద్రుడు (VeeraBhadrudu)
కోలీవుడ్ స్టార్ సూర్య నటించిన లేటెస్ట్ మూవీ "వీరభద్రుడు". చాలా రోజులుగా సరైన సక్సెస్ లేక ఫ్యాన్స్ ని నిరాశపరుస్తున్న సూర్య ఈసారి బ్లాక్ బస్టర్ టార్గెట్ గా వీరభద్రుడిగా కమర్షియల్ మాస్ మూవీతో తాజాగా ఆడియన్స్ ముందుకు వచ్చాడు. నటుడు ఆర్.జె.బాలాజీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటించింది.
Available in:
Reviews
What critics and the public are saying about వీరభద్రుడు (VeeraBhadrudu)
Media Reviews
17 Avg: 5.5/10Above Average
Veerabhadrudu movie Review
సూర్య లీడ్ రోల్ లో నటించిన వీరభద్రుడు మూవీ చూసాక సినిమా గురించి చెప్పాలంటే ఇట్స్ ఎ డీసెంట్ మూవీ. అయితే స్టోరీ లో ఏమాత్రం కొత్తదనం ఉండదు. కానీ కమర్షియల్ మూవీస్ చాలు ఎంజాయ్ చేయొచ్చు, సూర్య ఫ్యాన్స్ కి ఎలివేషన్స్ ఉంటే చాలు అనుకునే వాళ్ళకి మూవీ నాచొచ్చు. అయితే మాస్ ఆడియన్స్ కనెక్ట్ అయితే సీన్లు బానే ఉంట...
సూర్య లీడ్ రోల్ లో నటించిన వీరభద్రుడు మూవీ చూసాక సినిమా గురించి చెప్పాలంటే ఇట్స్ ఎ డీసెంట్ మూవీ. అయితే స్టోరీ లో ఏమాత్రం కొత్తదనం ఉండదు. కానీ కమర్షియల్ మూవీస్ చాలు ఎంజాయ్ చేయొచ్చు, సూర్య ఫ్యాన్స్ కి ఎలివేషన్స్ ఉంటే చాలు అనుకునే వాళ్ళకి మూవీ నాచొచ్చు. అయితే మాస్ ఆడియన్స్ కనెక్ట్ అయితే సీన్లు బానే ఉంటాయి. కానీ స్టోరీ వైస్ గా చూస్తే నచ్చకపోవచ్చు. సినిమా చూస్తే డైరెక్టర్ ఆర్ జె బాలాజీ ఫ్యాన్స్ కోసం మాత్రమే తీసాడని తెలుస్తుంటే ఉంటుంది.
సరిగా గమనిస్తే... సినిమాలో ఫస్ట్ హాఫ్ లో ఓ స్టోరీ, సెకండ్ హాఫ్ లో మరో స్టోరీ ఉంటుంది. అది ఒక రకంగా మైనస్ అవచ్చు. ఇక సూర్య పెర్ఫార్మన్స్ పరంగా అదరగొట్టాడు. విలన్ గా నటించిన అర్జె బాలాజి పర్వాలేదన్పించాడు. సాంగ్స్ అంత బాలేవు. తమిళ్ నేటివిటీ మసాలా ఎక్కువయింది. ఓవరాల్ గా వీరభద్రుడు సూర్య ఫ్యాన్స్ కి మంచి ట్రీట్ ఇస్తుంది. బట్ నార్మల్ ఆడియన్స్ గురించి చెప్పలేం. అయితే క్రేజీ సినిమాలు ఏమి ఈ మధ్య కాలంలో రాలేవు కాబట్టి, సూర్య వీరభద్రుడు సినిమాని ఓసారి టైంపాస్ కి చూసేయొచ్చు.
Above Average
Veerabhadrudu movie Review
కోలీవుడ్ స్టార్ సూర్య నటించిన వీరభద్రుడు సినిమా రివ్యూ విషయానికి వస్తే... సినిమాకి బిగ్ ప్లస్ పాయింట్ సూర్య. సూర్య రోల్ చాల పవర్ ఫుల్ క్యారెక్టర్. కాకపోతే ఆ పవర్ఫుల్ క్యారెక్టర్ వల్లే ఈ సినిమా స్టోరీ అంత బాగాలేదనిపిస్తుంది. ఇక స్టోరీ స్టార్ట్ అవుతూనే ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. కానీ అంతే ఇంట...
కోలీవుడ్ స్టార్ సూర్య నటించిన వీరభద్రుడు సినిమా రివ్యూ విషయానికి వస్తే... సినిమాకి బిగ్ ప్లస్ పాయింట్ సూర్య. సూర్య రోల్ చాల పవర్ ఫుల్ క్యారెక్టర్. కాకపోతే ఆ పవర్ఫుల్ క్యారెక్టర్ వల్లే ఈ సినిమా స్టోరీ అంత బాగాలేదనిపిస్తుంది. ఇక స్టోరీ స్టార్ట్ అవుతూనే ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. కానీ అంతే ఇంట్రెస్టింగ్ గా స్టోరీని ముందుకు తీసుకెళ్లలేకపోయాడు డైరెక్టర్. కథ పరంగా స్టోరీ ఫస్ట్ హాఫ్ కే ఎండ్ అయిపోయిన ఫీల్ వస్తది.
ముఖ్యంగా అర్జె బాలాజీ ఫస్ట్ హాఫ్ లో రాసుకున్న స్క్రిప్ట్ కి సెకండ్ హాఫ్ లో వచ్చే స్క్రిప్ట్ కి సంబంధమే ఉండదు. బట్ సెకండ్ హాఫ్ లో కొన్ని ఎమోషనల్ సీన్స్ అంతగా ఇంపాక్టుబుల్ గా లేవు. మెయిన్ గా విలన్ క్యారెక్టర్ తేలిపోయింది. టెక్నికల్ గా సినిమాటోగ్రఫీ బాగుంది. మ్యూజిక్ లౌడ్ గా అనిపించింది. ఓవరాల్ గా చెప్పాలంటే పవర్ఫుల్ గా బాగానే ఉంది. కానీ స్టోరీ వైస్ గా చూస్తే, ఆడియన్స్ ని ఎంగేజింగ్ గా ఉంచే స్క్రిప్ట్ పరంగా ఏమి వర్కౌట్ అవలేదని అనిపిస్తుంది. ఓవరాల్ గా ఫ్యాన్స్ మినహా మిగతా ఆడియన్స్ కనెక్ట్ అవడం కష్టమే.
Average
Veerabhadrudu movie Review
సూర్య సినిమా వీరభద్రుడు సినిమా గురించి చెప్పాలంటే... దర్శకుడు ఆర్జె బాలాజీ ముందు సినిమా అమ్మోరు తల్లి సినిమా ఎలా ఉంటుందో అలాంటి పాయింట్ అఫ్ వ్యూ లోనే తెరకెక్కింది ఈ మూవీ కూడా. అయితే మూవీ మాత్రం చాలా రొటీన్ ఫీల్ వస్తుంది. ఫస్ట్ యావరేజ్ గా ఉంటుంది. సెకండ్ హాఫ్ అయితే ఎక్కడ్నుంచో స్టార్ట్ అయి మరెక్కడికో...
సూర్య సినిమా వీరభద్రుడు సినిమా గురించి చెప్పాలంటే... దర్శకుడు ఆర్జె బాలాజీ ముందు సినిమా అమ్మోరు తల్లి సినిమా ఎలా ఉంటుందో అలాంటి పాయింట్ అఫ్ వ్యూ లోనే తెరకెక్కింది ఈ మూవీ కూడా. అయితే మూవీ మాత్రం చాలా రొటీన్ ఫీల్ వస్తుంది. ఫస్ట్ యావరేజ్ గా ఉంటుంది. సెకండ్ హాఫ్ అయితే ఎక్కడ్నుంచో స్టార్ట్ అయి మరెక్కడికో వెళ్ళిపోతుంది. ఇక సాయి అభ్యంకార్ మ్యూజిక్ అయితే ఏమాత్రం బాలేవు. బీజీఎమ్ ఒకే. ఇక సూర్య పెర్ఫార్మన్స్ బాగుంది. కానీ స్క్రీన్ టైం లెంగ్త్ తక్కువ. అలాగే డైరెక్ట్ చేయడమే కాకుండా విలన్ గా నటించిన ఆర్ జె బాలాజీ పెర్ఫార్మన్స్ బాగుంది. బట్ సూర్య ముందు తేలిపోతాడు.
ఇక ఈ సినిమాలో లాజిక్ లు పక్కన పెడితేనే సినిమా చూడగలరు ఆడియన్స్. పైగా సూర్య - అర్జె బాలాజీ మధ్య సీన్స్ ఇల్లాజికల్ గా అనిపించడమే కాకుండా, తల తోక లేని సీన్స్ అన్నట్టు ఉంటుంది. ఇక త్రిష రోల్ పెద్దగా చెప్పుకోవడానికి ఏం లేదు. ఓవరాల్ గా వీరభద్రుడు సినిమా ఫ్యాన్స్ కి నచ్చేట్టు ఉంటుందేమో గాని నార్మల్ ఆడియన్స్ పెద్దగా చూసేట్టు లేదు. ఇక ఫ్రెష్ మూవీస్ కోరుకునే ఆడియన్స్ దీని జోలికెళ్లకపోవడం మంచిది.
Below Average
Veerabhadrudu movie Review
సూర్య నటించిన వీరభద్రుడు సినిమా గురించి చెప్పాలంటే... సినిమా బేసిగ్గా ఓవరాల్ గా అయితే మాత్రం జస్ట్ అబౌవ్ యావరేజ్ అంతే... ఫస్ట్ హాఫ్ బాగా అనిపిస్తది. అప్పట్లో శివకార్తికేయన్ నటించిన మహావీరుడు సినిమాలా జోనర్ లో ఉంటుంది ఈ మహావీరుడు సినిమా. ఫస్ట్ హాఫ్ బానే అనిపిస్తుంది. కానీ సినిమాలో కోర్ట్ సీన్స్ లాంటి...
సూర్య నటించిన వీరభద్రుడు సినిమా గురించి చెప్పాలంటే... సినిమా బేసిగ్గా ఓవరాల్ గా అయితే మాత్రం జస్ట్ అబౌవ్ యావరేజ్ అంతే... ఫస్ట్ హాఫ్ బాగా అనిపిస్తది. అప్పట్లో శివకార్తికేయన్ నటించిన మహావీరుడు సినిమాలా జోనర్ లో ఉంటుంది ఈ మహావీరుడు సినిమా. ఫస్ట్ హాఫ్ బానే అనిపిస్తుంది. కానీ సినిమాలో కోర్ట్ సీన్స్ లాంటివి అంత ఎక్సయిటింగ్ గా ఇంట్రెస్టింగ్ గా లేకపోయినా, కొన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ బాగున్నాయి. కానీ కొన్ని ఓవర్ ది టాప్ అయిపోతాయి. అయితే సెకండ్ హాఫ్ కి వచ్చేటప్పటికి అయితే ఏ సీన్ ఎటు పోతుందో అర్ధం కానట్టుంటుంది.
అయితే సినిమాలో కొన్ని పాత సినిమాల రిఫరెన్స్ లు ఎక్కువగా కనిపిస్తాయి. ఫ్యాన్స్ కి బానే అనిపించినా, నార్మల్ ఆడియన్స్ అంతగా కనెక్ట్ కాకపోవచ్చు. ఇక సాంగ్స్ అయితే ఏమంత బాగాలేవు. కొన్ని అర్ధం కానీ విధంగా ఉన్నాయి. సాయి అభ్యంకార్ మ్యూజిక్ బానే ఉంది. సో ఓవరాల్ గా వీరభద్రుడు మూవీ అయితే అబొవ్ యావరేజ్. సోది లేకుండా ఒక్క ముక్కలో మూవీ గురించి చెప్పాలంటే... సూర్య లాస్ట్ మూవీస్ తో పోల్చుకుంటే కొంచెం బెటర్ గానే ఉంది. కానీ బాగుందని కాదు. రెగ్యులర్ మూవీ లవర్స్ ఓసారి ట్రై చేయొచ్చు. రేటింగ్ చెప్పాలంటే 2.5 ఇవ్వొచ్చు.
Above Average
Veerabhadrudu movie review
వీరభద్రుడు.. రెండున్నర గంటల రన్ టైం తో వన్ డే డిలే తో రిలీజ్ అయింది. మొత్తానికి సినిమా చూసాక ఫస్ట్ హాఫ్ బానే ఉంది. సెకండ్ హాఫ్ లో ఒక అరగంట స్లో ఉంటుంది. ఓవరాల్ గా పర్లేదు. టూ గుడ్ కాదు గాని, ఒకసారి చూసేయొచ్చు. ఇలా ఉన్నా గాని చాలు... థియేటర్ కి వెళ్లి చూడొచ్చు అనిపించేలా ఉంది. ఈ మధ్య కాలంలో వచ్చిన మూ...
వీరభద్రుడు.. రెండున్నర గంటల రన్ టైం తో వన్ డే డిలే తో రిలీజ్ అయింది. మొత్తానికి సినిమా చూసాక ఫస్ట్ హాఫ్ బానే ఉంది. సెకండ్ హాఫ్ లో ఒక అరగంట స్లో ఉంటుంది. ఓవరాల్ గా పర్లేదు. టూ గుడ్ కాదు గాని, ఒకసారి చూసేయొచ్చు. ఇలా ఉన్నా గాని చాలు... థియేటర్ కి వెళ్లి చూడొచ్చు అనిపించేలా ఉంది. ఈ మధ్య కాలంలో వచ్చిన మూవీస్ తో కంపేర్ చేస్తే బెటర్ వీరభద్రుడు మూవీ. ఇక సూర్య సీన్స్ చాలా బాగున్నాయి. పాత సినిమాల రిఫరెన్స్ లు కూడా బాగున్నాయి.
ఇక “సమాజాన్ని దేవుడు కూడా మార్చలేడు” అనే పాయింట్ కొత్తది కాదు. కానీ కోర్ట్ డ్రామాగా చెప్పాలని ట్రై చేశారు.
ట్రైలర్ చూస్తే ఏదో గట్టిగా ఉంటుందనిపిస్తుంది. సూర్య స్క్రీన్ స్పేస్ తగ్గింది. డైరెక్టర్ ఆర్జె బాలాజీ తన స్క్రీన్ టైం పైనే ఎక్కువ ఫోకస్ పెట్టినట్టుంది. అయినా కానీ సూర్య ఫ్యాన్స్ కి ఉన్నంత సేపు మంచి కిక్ ఇస్తాడు. క్లైమాక్స్ ఫ్యాన్స్ కి గూస్బంప్స్ ఫీల్ వస్తుంది. త్రిష పాత్ర కూడా జస్ట్ అలా వచ్చి వెళ్లిపోతుంది. కోర్ట్ సీన్స్ ఇంకాస్త పవర్‌ఫుల్‌గా ఉంటే మూవీ నిలబడేది. మొత్తానికి ‘వీరభద్రుడు’లో రెగ్యులర్ మూవీ లవర్స్ కి కావాల్సిన అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి గాని, ఫ్రెష్ నెస్ కోరుకుంటే మాత్రం డిస్సపాయింట్ అవుతారు.
Above Average
Veerabhadrudu movie Review
రిలీజ్ లాస్ట్ మినట్ లో ఫైనాన్స్ ఇబ్బందులను ఫేస్ చేసి షోలు కాన్సిల్ చేసుకుని ఒక రోజు ఆలస్యంగా ఆడియన్స్ ముందుకు వరల్డ్ వైడ్ గా భారీ లెవల్ లో వచ్చేసిన కోలివుడ్ స్టార్ హీరో సూర్య(Suriya) నటించిన వీరభద్రుడు మూవీ ఆడియన్స్ నుండి మిక్స్డ్ రెస్పాన్స్ అందుకుంది. ఓవరాల్ గా చాలా బేసిక్ పాయింట్ తో రూపొందిన వీరభద...
రిలీజ్ లాస్ట్ మినట్ లో ఫైనాన్స్ ఇబ్బందులను ఫేస్ చేసి షోలు కాన్సిల్ చేసుకుని ఒక రోజు ఆలస్యంగా ఆడియన్స్ ముందుకు వరల్డ్ వైడ్ గా భారీ లెవల్ లో వచ్చేసిన కోలివుడ్ స్టార్ హీరో సూర్య(Suriya) నటించిన వీరభద్రుడు మూవీ ఆడియన్స్ నుండి మిక్స్డ్ రెస్పాన్స్ అందుకుంది. ఓవరాల్ గా చాలా బేసిక్ పాయింట్ తో రూపొందిన వీరభద్రుడు సినిమా డైరెక్టర్ ఇది వరకే ప్రమోషన్స్ లో చెప్పినట్లు పక్కా మాస్ అండ్ కమర్షియల్ ఎలిమెంట్స్ ఇష్టపడే ఆడియన్స్ కోసం తీసిన సినిమా ఇది.
ఫ్రెష్ స్టోరీలు ఎక్స్ పెర్ట్ చేసే ఆడియన్స్ కి కమర్షియల్ ఎలిమెంట్స్ తప్ప కథ పెద్దగా ఇంప్రెస్ చేయకపోవచ్చు. కానీ కమర్షియల్ మూవీస్, మాస్ మూమెంట్స్, హీరో ఎలివేషన్ సీన్స్ లాంటివి ఎంజాయ్ చేసే ఆడియన్స్ కి మాత్రం బాగానే కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది. సినిమాలో ఈజీగా రీసెంట్ టైంలో వచ్చిన సూర్య మూవీస్ లో బెస్ట్ కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న మూవీ ఇదే అని చెప్పొచ్చు. సూర్య తనదైన స్టైల్ లో యాక్టింగ్ అండ్ డైలాగ్స్ హీరో ఎలివేషన్స్ తో పాటు, తనదైన స్క్రీన్ ప్రజెన్స్ తో కుమ్మేశాడు. ఇక ఆర్ జే బాలాజీ విలన్ గా జస్ట్ ఓకే అనిపించగా, డైరెక్టర్ గా ఫ్యాన్స్ కోసం ఎక్స్ లెంట్ ఎలివేషన్స్ ను పెట్టినా, కథ పరంగా వీక్ పాయింట్ నే ఎంచుకున్నాడు. ఓవరాల్ గా వీరభద్రుడు బాగానే ఆకట్టుకోవచ్చు. అయితే కొంచం తమిళ్ ఫ్లేవర్ తగ్గించి కథ విషయంలో శ్రద్ధ పెట్టి ఉంటే పెర్ఫెక్ట్ కంబ్యాక్ మూవీ అయ్యేది. అయినా సినిమా ఒకసారి చూడొచ్చు.
Average
Veerabhadrudu movie Review
#Karuppu A fantasy commercial film with a unique premise and a few standout mass moments, but the execution gets messy especially in the second half! The first half is passable despite a slow start, with the emotional and mass scenes working in parts. However, the second half falters. The writing st...
#Karuppu A fantasy commercial film with a unique premise and a few standout mass moments, but the execution gets messy especially in the second half!
The first half is passable despite a slow start, with the emotional and mass scenes working in parts. However, the second half falters. The writing starts off grounded but turns illogical and messy.
This feels like a fan-made film for Suriya. His screen presence is superb, though the role offers limited acting scope. RJ Balaji does better as an actor than director. He gets some commercial moments right but his overall execution lacks clarity and conviction. Sai Abhyankar’s music is hit or miss.
Slightly better than Suriya’s recent films and may connect a bit more with the Tamil audience, but still doesn’t meet the expectations. Below Average to Average Watch! #VeeraBhadrudu
Rating: 2.25-2.5/5
Above Average
Veerabhadrudu movie Review
సూర్య హీరోగా నటించిన ‘వీరభద్రుడు’ భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చి… ఫైనల్‌గా మిక్స్డ్ టాక్‌తో సరిపెట్టుకుంది. “ఈ సమాజాన్ని దేవుడు వచ్చినా మార్చలేడు” అనే లైన్‌తో దర్శకుడు RJ Balaji కథను నడిపించినా… స్క్రీన్‌పైన ఆ ఎమోషన్ అంతగా కనెక్ట్ కాలేదు. కోర్ట్ డ్రామా బ్యాక్‌డ్రాప్‌లో చెప్పిన ఈ కథ రొటీన్...
సూర్య హీరోగా నటించిన ‘వీరభద్రుడు’ భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చి… ఫైనల్‌గా మిక్స్డ్ టాక్‌తో సరిపెట్టుకుంది. “ఈ సమాజాన్ని దేవుడు వచ్చినా మార్చలేడు” అనే లైన్‌తో దర్శకుడు RJ Balaji కథను నడిపించినా… స్క్రీన్‌పైన ఆ ఎమోషన్ అంతగా కనెక్ట్ కాలేదు. కోర్ట్ డ్రామా బ్యాక్‌డ్రాప్‌లో చెప్పిన ఈ కథ రొటీన్ ట్రాక్‌లో పడిపోయింది. సూర్య ఫ్యాన్స్‌కు మాత్రం కొన్ని సీన్స్‌లో గూస్‌బంప్స్ వస్తాయి. కానీ అదే సమయంలో సినిమాలో ఫాంటసీ ఎలిమెంట్స్ ఆకట్టుకోకపోగా, కొన్ని సీన్లు చికాకు తెప్పిస్తాయి. సూర్య పాత్ర కంటే ఆర్జే బాలాజీ పాత్రే ఎక్కువగా కనిపించడం మరో మైనస్.
దర్శకుడిగా ఓకే అనిపించిన బాలాజీ… నటుడిగా మాత్రం సూర్య ముందు నిలబడలేకపోయాడు. త్రిష పాత్ర కూడా పేరుకే ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ బాగానే నడిచినా… సెకండాఫ్ పూర్తిగా నీరసంగా మారింది. ముఖ్యంగా కోర్ట్ సీన్స్ ఇంకాస్త ఎమోషనల్‌గా, పవర్‌ఫుల్‌గా రాసి ఉంటే సినిమా మరో లెవెల్‌లో ఉండేది. మొత్తంగా ‘వీరభద్రుడు’లో మెసేజ్ ఉంది… సూర్య పెర్ఫార్మెన్స్ ఉంది… కానీ స్క్రీన్ స్పేస్ తక్కువ ఉంది. స్ట్రాంగ్ స్క్రీన్ ప్లే కూడా ఉండాల్సింది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. ఓవరాల్ గా వీరభద్రుడు మూవీ పూర్తి స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది.
Average
Veerabhadrudu Movie Review
గత కొంత కాలంగా తమిళ స్టార్ హీరో సూర్య నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద అంతగా ప్రభావం చూపించటం లేదు. ఈ నేపథ్యంలో నటుడు ఆర్జే బాలాజీ దర్శకత్వంలో సూర్య నటించిన తాజా చిత్రం ‘వీరభద్రుడు’ (తమిళంలో ‘కరుప్పు’) శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. న్యాయవ్యవస్థలోని లోపాలను దైవాంశకు ముడిపెడుతూ కమర్షియల్ యాంగ...
గత కొంత కాలంగా తమిళ స్టార్ హీరో సూర్య నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద అంతగా ప్రభావం చూపించటం లేదు. ఈ నేపథ్యంలో నటుడు ఆర్జే బాలాజీ దర్శకత్వంలో సూర్య నటించిన తాజా చిత్రం ‘వీరభద్రుడు’ (తమిళంలో ‘కరుప్పు’) శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. న్యాయవ్యవస్థలోని లోపాలను దైవాంశకు ముడిపెడుతూ కమర్షియల్ యాంగిల్ లో రూపొందించిన ఈ చిత్రం ప్రేక్షకుల నుండి అనుకున్నంత రెస్పాన్స్ రాబట్టుకోలేకపోతుంది.
కథ పరంగా బాగానే ఉన్నప్పటికీ ఎన్నో వందల చిత్రాల్లో ఈ కాన్సెప్ట్ చూసే ఉంటారు ఆడియన్స్. రీసెంట్ గా గోపాల గోపాల, బ్రో వంటి చిత్రాల్లో కూడా ఈ నేపథ్యాన్ని వాడారు. దర్శకుడు బాలాజీ ఫ్యాన్స్ ని మెప్పించేలా సినిమా తెరకెక్కించాడు గాని, నార్మల్ ఆడియన్స్ కి చాలా బోరింగ్ గా అనిపిస్తుంది. ముఖ్యంగా క్లైమాక్స్ చూస్తున్న ప్రేక్షకులకు ‘కాంతారా’ లాంటి సినిమాలు గుర్తొస్తాయి. అయితే ఎలాంటి ఎమోషనల్ బాండింగ్ కి ఆడియన్స్ లోను కాకపోవడం వల్ల అంతగా ఆకట్టుకోదు. తొలి అర్ధభాగం చూసి పర్వాలేదని ఫీలయిన వారికి ద్వితీయార్ధంతో పెద్ద షాక్ ఇస్తాడు దర్శకుడు. సూర్య ఇలాంటి స్క్రిప్ట్ కు ఎందుకు ఓకె చెప్పాడా అనే సందేహం కలగక మానదు. ఏది ఏమైనా సూర్య అభిమానులు మరోసారి నిరాశకు గురికాక తప్పదు.
Above Average
Veerabhadrudu movie Review
సూర్య గత కొన్నాళ్లుగా ఫ్లాప్స్ లో ఉండటంతో ఫ్యాన్స్ ఏ రేంజ్ లో డిస్సపాయింట్ లో ఉన్నారో తెలిసిందే. ఈ క్రమంలో భారీ అంచనాలతో వీరభద్రుడు తాజాగా విడుదలైంది. మిక్స్డ్ రెస్పాన్స్ అందుకున్న ఈ సినిమాలో సూర్య దేవుడిగా కనపడటం విశేషం.అయితే ఫస్ట్ హాఫ్ ఇంట్రెస్ట్ గా సాగితే సెకండ్ హాఫ్ మాత్రం తల తోక లేకుండా కేసుల గ...
సూర్య గత కొన్నాళ్లుగా ఫ్లాప్స్ లో ఉండటంతో ఫ్యాన్స్ ఏ రేంజ్ లో డిస్సపాయింట్ లో ఉన్నారో తెలిసిందే. ఈ క్రమంలో భారీ అంచనాలతో వీరభద్రుడు తాజాగా విడుదలైంది. మిక్స్డ్ రెస్పాన్స్ అందుకున్న ఈ సినిమాలో సూర్య దేవుడిగా కనపడటం విశేషం.
అయితే ఫస్ట్ హాఫ్ ఇంట్రెస్ట్ గా సాగితే సెకండ్ హాఫ్ మాత్రం తల తోక లేకుండా కేసుల గురించి కాకుండా లాయర్లు, కోర్టు చుట్టూ, దేవుడు వీరభద్రుడు మీదే బేబీ కృష్ణ రివెంజ్ అన్నట్టు రొటీన్ డ్రామాగా తెరకెక్కించాడు దర్శకుడు.
పైగా సినిమాలో హీరో సూర్య అయినా కథ మొత్తం నడిచేది ఆర్జే బాలాజీ చుట్టూనే. అసలు హీరో సూర్యనా, ఆర్జే బాలాజీనా అనే సందేహం రాక మానదు. ఈ విషయంలో ఫ్యాన్స్ డిస్సపాయింట్ అవుతారు. ఎమోషన్స్ మాత్రం బాగా వర్కౌట్ అయ్యాయి. కోర్టులో కేసు తేలక బాధ పడే పేదవాళ్ళు, తండ్రి ఎమోషన్, దేవుడి ఎమోషన్.. ఇవన్నీ బాగా వర్కౌట్ అయ్యాయి. మొత్తంగా దేవుడే దిగివచ్చినా ఇక్కడ సమాజంలో, కోర్టు, లాయర్లలో ఉన్న అవినీతిని, చెడుని తీసేయడం కష్టం, ఒక కోర్టు మారిస్తే సరిపోదు దేశంలో చాలా కోర్టుల్లో ఇదే పరిస్థితి అని చెప్పే ప్రయత్నం ఈ సినిమాతో చేసారు. మొత్తంగా ‘వీరభద్రుడు’ సినిమా కోర్టుల్లో జరిగే అవినీతిని అంతం చేయడానికి దేవుడే దిగి వస్తే ఏం జరిగింది, అని రెగ్యులర్ కమర్షియల్ సినిమాగా తెరకెక్కించారు.
Hit
Veerabhadrudu movie Review
కొన్నేళ్లుగా సూర్య నుంచి సరిగ్గా కోరుకున్న సినిమా అయితే రావడం లేదు. చాలా సినిమాలు చేస్తున్నా కూడా కోరుకున్న ఫలితం లేదు. ఇలాంటి సమయంలో ఆయన నుంచి వచ్చిన రూరల్ డివోషనల్ డ్రామా వీరభద్రుడు. ఫైనల్ గా థియేటర్లలో విడుదలయింది. దేవుడే దిగివచ్చినా కూడా ఇప్పుడున్న న్యాయవ్యవస్థను బాగు చేయలేరు పాయింట్ తో... అలాగే...
కొన్నేళ్లుగా సూర్య నుంచి సరిగ్గా కోరుకున్న సినిమా అయితే రావడం లేదు. చాలా సినిమాలు చేస్తున్నా కూడా కోరుకున్న ఫలితం లేదు. ఇలాంటి సమయంలో ఆయన నుంచి వచ్చిన రూరల్ డివోషనల్ డ్రామా వీరభద్రుడు. ఫైనల్ గా థియేటర్లలో విడుదలయింది. దేవుడే దిగివచ్చినా కూడా ఇప్పుడున్న న్యాయవ్యవస్థను బాగు చేయలేరు పాయింట్ తో... అలాగే న్యాయం జరగడంలో అయ్యే ఆలస్యం, సామాన్యులను వ్యవస్థ ఎలా పీల్చి పిప్పిచేస్తుంది.. అనే పాయింట్ తో ఈ సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు ఆర్జే బాలాజీ.
ఇక సూర్య వీరభద్రుడి పాత్రను కేవలం ఒక కమర్షియల్ మాస్ హీరోలా కాకుండా, వ్యవస్థ చేతిలో మోసపోయిన సామాన్యుడి కోపానికి ప్రతీకగా మలచడం బాగుంది. సూర్య తన రెండు షేడ్స్ ఉన్న రోల్ లో అద్భుతంగా నటించాడు. కానీ తన రోల్ ముందు అటుడిగా ఆర్జే బాలాజీ తేలిపోతాడు. అందువల్ల బలమైన ప్రతినాయకుడు ఉండడు. ఇక మ్యూజిక్ కూడా డిస్సపాయింట్ చేసింది. బీజీఎమ్ బాగుంది. కొన్ని కీలకమైన సన్నివేశాల్లో వీఎఫ్‌ఎక్స్ క్వాలిటీ బాలేదు. ఎడిటింగ్ ఓకే, అయితే ఇప్పటి ఆడియన్స్ కమర్షియల్ ఎంటర్‌టైనర్ నుంచి ఏం ఆశిస్తున్నారు అనేది తెలుసుకుంటూనే, కథలోని ఎమోషనల్ డెప్త్ మిస్ అవ్వకుండా చూసుకున్నాడు దర్శకుడు... ఓవరాల్ గా తక్కువ అంచనాలతో రెగ్యులర్ మూవీ లవర్స్ ని బాగానే అలరిస్తుంది సినిమా. సూర్య ఫాన్స్ కి మాత్రం ఐ ఫీస్ట్.
Average
Veerabhadrudu movie Review
కోలీవుడ్ స్టార్ సూర్య 'కరుప్పు' ఫైనాన్షియల్ ఇష్యూల కారణంగా మే 14న విడుదల కాకపోగా, ఒక్క రోజు ఆలస్యంగా మే 15న థియేటర్లలోకి వచ్చింది. ఆర్జే బాలాజీ దర్శకత్వం వహించడంతో పాటు విలన్ గా నటించగా, తెలుగులో 'వీరభద్రుడు' పేరిట విడుదలై మిక్స్డ్ రెస్పాన్స్ అందుకుంది. అయితే సినిమా కథ పరంగా అంతగా మెప్పించలేకప...
కోలీవుడ్ స్టార్ సూర్య 'కరుప్పు' ఫైనాన్షియల్ ఇష్యూల కారణంగా మే 14న విడుదల కాకపోగా, ఒక్క రోజు ఆలస్యంగా మే 15న థియేటర్లలోకి వచ్చింది. ఆర్జే బాలాజీ దర్శకత్వం వహించడంతో పాటు విలన్ గా నటించగా, తెలుగులో 'వీరభద్రుడు' పేరిట విడుదలై మిక్స్డ్ రెస్పాన్స్ అందుకుంది. అయితే సినిమా కథ పరంగా అంతగా మెప్పించలేకపోయినా, కమర్షియాలిటీతో పాటు కామన్ ఆడియన్స్ కనెక్ట్ అయ్యే నార్మల్ కథ రాసుకున్నారు ఆర్జే బాలాజీ & టీమ్. అందులో సక్సెస్ అయ్యారు. అయితే... దర్శకుడిగా మాత్రం కథకు సరైన క్యాస్టింగ్ ఎంపిక చేసుకోవడంలో ఫెయిల్ అయ్యారు ఆర్జే బాలాజీ.
వీరభద్రుడు' కథకు వస్తే... దేవుడు వచ్చినా న్యాయవ్యవస్థను మార్చలేడని ఆర్జే బాలాజీ చెప్పాలనుకున్నారు. సినిమాలో సూర్య వీరభద్రుడిగా రుద్ర తాండవం చేశారు. అయితే... సూర్యను చూడాలని థియేటర్లకు వచ్చే ప్రేక్షకులకు ఆర్జే బాలాజీ ఎలివేషన్స్ & ఆయన స్క్రీన్ టైమ్ ఇబ్బంది పెడుతుంది. టెక్నికల్ గా మ్యూజిక్ ఫెయిల్ అయింది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. ఫైనల్ గా ఎటువంటి అంచనాలు పెట్టుకోకుండా వెళితే... ప్రేక్షకులకు 'వీరభద్రుడు' నచ్చుతాడు.
Average
Veerabhadrudu Movie Review
న్యాయ వ్యవస్థలో లోపాలు, కోర్టు విచారణలో జాప్యాలు, లాయర్లు, జడ్జీల అవినీతి భాగోతాలపై ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి. ఈ వీరభద్రుడు సినిమా కూడా అలాంటి తరహా ఫాంటసీ పాయింట్ తో కథతో తెరకెక్కింది. కానీ దర్శకుడు ఆర్జే బాలాజీ బలమైన సన్నివేశాలను రాసుకోవడంలో విఫలమయ్యాడు. కొంత వరకు ఎమోషనల్ అంశాలను సరిగానే డీల్...
న్యాయ వ్యవస్థలో లోపాలు, కోర్టు విచారణలో జాప్యాలు, లాయర్లు, జడ్జీల అవినీతి భాగోతాలపై ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి. ఈ వీరభద్రుడు సినిమా కూడా అలాంటి తరహా ఫాంటసీ పాయింట్ తో కథతో తెరకెక్కింది. కానీ దర్శకుడు ఆర్జే బాలాజీ బలమైన సన్నివేశాలను రాసుకోవడంలో విఫలమయ్యాడు. కొంత వరకు ఎమోషనల్ అంశాలను సరిగానే డీల్ చేసిన దర్శకుడు ఆర్జే బాలాజీ.. సెకండాఫ్‌లో ఏం చేయాలో తోచని స్థితిలోను, గందరగోళంలోను పడటం వల్ల సినిమా అనుకొన్నంత ఇంపాక్ట్ చూపలేదని చెప్పాలి.
సినిమాలో ప్రధానమైన పాయింట్ ఫస్టాఫ్ లోనే ముగిసిపోతుంది. కానీ సెకండాఫ్ లో రకరకాల అంశాలను తెరపైకి తెచ్చి సాగదీసి సినిమాను ముగించడం మూవీకి మైనస్ అయింది. కానీ వీరభద్రస్వామిగా, సూర్యగా రెండు షేడ్స్ ఉన్న పాత్రలను సూర్య తనదైన శైలిలో అదరగొట్టాడు. మిగతా రోల్స్ ఏమి అంత ఇంపాక్ట్ చేయలేదు. మ్యూజిక్ విషయంలో దెబ్బ పడగా, సినిమాటోగ్రఫి, ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. ఓవరాల్ గా కథ, కథనాలు, గ్రాఫిక్స్ పై ఇంకా దృష్టి పెడితే.. ఫాంటసీ, క్రైమ్, ఇన్వెస్టిగేషన్ జోనర్ లో బెటర్ రిజల్డ్ వచ్చి ఉండేది. కోర్టు రూమ్ డ్రామాలు, డివైన్ ఎలిమెంట్స్ తో సోషల్ ఇష్యూస్ మీద వచ్చి సినిమాలను ఇష్టపడే వారికి వీరభద్రుడు మూవీ నచ్చే అవకాశం ఉంది.
Average
Veerabhadrudu movie Review
కోలీవుడ్ స్టార్ Suriya నటించిన ‘వీరభద్రుడు’ ఫైనల్ గా థియేటర్లలోకి వచ్చింది. రిలీజ్‌కి ముందు నుంచే మంచి బజ్ క్రియేట్ చేసిన థియేటర్లలో ఫ్యాన్స్ ని ఆకట్టుకున్నా, టాక్ పరంగా మిక్స్డ్ రెస్పాన్స్ అందుకుంది. స్టోరీ పాయింట్ కొస్తే... సమాజంలో పెరిగిపోతున్న అన్యాయాలు, మనుషుల ఆలోచనా విధానం చూసి “దేవుడు వచ్చినా...
కోలీవుడ్ స్టార్ Suriya నటించిన ‘వీరభద్రుడు’ ఫైనల్ గా థియేటర్లలోకి వచ్చింది. రిలీజ్‌కి ముందు నుంచే మంచి బజ్ క్రియేట్ చేసిన థియేటర్లలో ఫ్యాన్స్ ని ఆకట్టుకున్నా, టాక్ పరంగా మిక్స్డ్ రెస్పాన్స్ అందుకుంది. స్టోరీ పాయింట్ కొస్తే... సమాజంలో పెరిగిపోతున్న అన్యాయాలు, మనుషుల ఆలోచనా విధానం చూసి “దేవుడు వచ్చినా మార్చలేడు” అనే పాయింట్‌తో దర్శకుడు RJ Balaji వీరభద్రుడుని తెరకెక్కించాడు. పైగా ఈ బ్యాక్ డ్రాప్ లో చాలా సినిమాలొచ్చాయి, కాకపోతే దీన్ని కోర్ట్ డ్రామా బ్యాక్‌డ్రాప్ లో చెప్పడానికి ట్రై చేశాడు.
ఫస్ట్ హాఫ్ వరకు కథ ఓకే అనిపించినా… సెకండాఫ్‌లో మాత్రం సినిమా కాస్త ట్రాక్ తప్పినట్టే అనిపిస్తుంది. ముఖ్యంగా కోర్ట్ సీన్స్ ఇంకాస్త పవర్‌ఫుల్‌గా ఉండాల్సింది. ఇక సూర్య ఫ్యాన్స్ కోసం పెట్టిన ఎలివేషన్స్ మాత్రం బాగానే వర్కౌట్ అయ్యాయి. Trisha Krishnan పాత్రకు పెద్దగా స్కోప్ లేకపోవడం మైనస్ కాగా… ఆర్జే బాలాజీ మాత్రం హీరో కంటే తన పాత్రకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చుకున్నట్టుగా కనిపించాడు. ఓవరాల్ గా సూర్య నటన కోసం వీరభద్రుడు ఒక్కసారి చూసేయొచ్చు అనే ఫీలింగ్ మాత్రం ఇస్తుంది. ఫైనల్ గా వీరభద్రుడు మూవీ సూర్య అభిమానులకు పండగ లాంటి మూవీ అయినా, పెద్దగా అంచనాలు లేకుండా అయితే మెప్పించే అవకాశం ఉంది.
Average
Samayam Telugu
కోలీవుడ్ స్టార్ సూర్య నటించిన వీరభద్రుడు పలు కారణాల వల్ల వాయిదా పడి ఫైనల్ గా ఆడియన్స్ ముందుకొచ్చింది. థియేటర్లలో మిక్స్డ్ రెస్పాన్స్ అందుకున్న ఈ సినిమా విషయానికొస్తే.. ప్రస్తుత సమాజ స్థితిగతుల్ని చూస్తే.. అందరికీ ఏదో ఒక టైంలో.. ఆ దేవుడు దిగి వచ్చినా ఈ మనుషుల్ని, సమాజాన్ని మార్చలేడు అని అనుకునే పాయిం...
కోలీవుడ్ స్టార్ సూర్య నటించిన వీరభద్రుడు పలు కారణాల వల్ల వాయిదా పడి ఫైనల్ గా ఆడియన్స్ ముందుకొచ్చింది. థియేటర్లలో మిక్స్డ్ రెస్పాన్స్ అందుకున్న ఈ సినిమా విషయానికొస్తే.. ప్రస్తుత సమాజ స్థితిగతుల్ని చూస్తే.. అందరికీ ఏదో ఒక టైంలో.. ఆ దేవుడు దిగి వచ్చినా ఈ మనుషుల్ని, సమాజాన్ని మార్చలేడు అని అనుకునే పాయింట్ తోనే ఈ కథను అల్లినట్టుగా అనిపిస్తుంది. ఈ కాన్సెప్ట్ తో కొన్ని వందల సినిమాలొచ్చాయి, వస్తున్నాయి కూడా. కాకపోతే దర్శకుడు ఆర్జే బాలాజీ దీనికి కోర్ట్ బ్యాక్ డ్రాప్ ఎంచుకున్నాడు అంతే.
కానీ కథకుడిగా మాత్రం దర్శకుడు అంతగాఆకట్టుకోలేదు. సూర్య ఫ్యాన్స్ ని మెప్పించడంలో మాత్రం కాస్త సక్సెస్ అయ్యాడు. అయితే సినిమాలో సూర్య పాత్ర మాత్రం ఒక గెస్ట్ రోల్ లా కనిపిస్తుంది. ఎందుకంటే సూర్యకి స్క్రీన్ స్పేస్ తక్కువ. ఉన్నంతలో మాత్రం సూర్య అదరగొట్టేశాడు. త్రిష పాత్రకి పెద్ద స్కోప్ లేదు. ఇక దర్శకుడు ఆర్జే బాలాజీ, ఇది సూర్య కోసం కాకుండా తన కోసమే రాసుకుని, తన కోసమే తీసుకున్నట్టుగా అనిపిస్తుంది. అలా తన పాత్ర కనిపిస్తుంది. కాకపోతే సూర్య నటన ముందు తేలిపోతుంది ఆ పాత్ర. ఆర్జే బాలాజీ కేవలం దర్శకుడిగా ఈ మూవీని తీసి ఉంటే.. సెకండాఫ్ మీద మరింత ఫోకస్ పెట్టి ఉంటే ఫలితం మరింత అద్భుతంగా వచ్చే అవకాశం ఉండేదనిపిస్తుంది.
Average
Veerabhadrudu Movie Review
సూర్య నటించిన లేటెస్ట్ మూవీ వీరభద్రుడు కొన్ని ఫైనాన్షియల్ ఇస్యూస్ వల్ల ఆలస్యంగా విడుదలైనా, థియేటర్లలో మంచి జోష్ కనబరుస్తుంది. టాక్ పరంగా మాత్రం బీలో యావరేజ్ రెస్పాన్స్ అందుకుంది. ఇక కథ విషయానికి వస్తే.. తనను నమ్ముకున్న వాళ్లు కష్టాల్లో ఉంటే దేవుడొచ్చి కాపాడే కథలు దశాబ్దాల నుంచి చూస్తూ వస్తున్నాం. ఇం...
సూర్య నటించిన లేటెస్ట్ మూవీ వీరభద్రుడు కొన్ని ఫైనాన్షియల్ ఇస్యూస్ వల్ల ఆలస్యంగా విడుదలైనా, థియేటర్లలో మంచి జోష్ కనబరుస్తుంది. టాక్ పరంగా మాత్రం బీలో యావరేజ్ రెస్పాన్స్ అందుకుంది. ఇక కథ విషయానికి వస్తే.. తనను నమ్ముకున్న వాళ్లు కష్టాల్లో ఉంటే దేవుడొచ్చి కాపాడే కథలు దశాబ్దాల నుంచి చూస్తూ వస్తున్నాం. ఇంచుమించు అలాంటి కథే ఈ వీరభద్రుడు కూడా. అందువల్ల ఎంత కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నా, ఫ్రెష్ స్టోరీ కాకపోవడం బిగ్ మైనస్.
డైరెక్టర్ ఆర్జె బాలాజీ తీసింది నాసిరకం సినిమా అయితే... అందులోనూ సినిమాలో ప్రతినాయక పాత్రలో నటించడం ఆ పాత్ర సూర్య కి అపోజిట్ గా స్ట్రాంగ్ గా లేకపోవడం మైనస్. పైగా సాయి అభ్యంకర్ సాంగ్స్ మైనస్ అయ్యాయి. బీజీఎమ్ కొంచెం బెటర్. జి.కె.విష్ణు సినిమాటోగ్రఫి బాగుంది. ఓవరాల్ గా డైరెక్టర్ ఆర్.జె.బాలాజీ రైటింగ్ - టేకింగ్ లో కొత్తదనం చూపించలేకపోయాడు. సూర్య స్క్రీన్ ప్రెజెన్స్ అయితే బాగుంది. కానీ లాజిక్స్ పూర్తిగా పక్కన పెట్టి తోచినట్లుగా సన్నివేశాలు రాసి తీసేశాడు దర్శకుడు చివరగా వీరభద్రుడు.. మహిమ పని చేయలేదు.
Above Average
Veerabhadrudu movie Review
సూర్య నటించిన కరుప్పు మూవీ తెలుగులో వీరభద్రుడు గా విడుదల కాగా, నటుడు ఆర్జె బాలాజీ దర్శకత్వం వహించాడు. మిశ్రమ స్పందన తెచ్చుకున్న ఈ ‘వీర భద్రుడు’ మూవీ కొన్ని మంచి మూమెంట్స్ తో సాగే యావరేజ్ యాక్షన్ డ్రామాగా చెప్పుకోవచ్చు. సూర్య ఫాన్స్ కి మంచి ట్రీట్ ఇచ్చే ఈ సినిమా నార్మల్ ఆడియన్స్ ని అంతగా ఆకట్టుకోకపోవ...
సూర్య నటించిన కరుప్పు మూవీ తెలుగులో వీరభద్రుడు గా విడుదల కాగా, నటుడు ఆర్జె బాలాజీ దర్శకత్వం వహించాడు. మిశ్రమ స్పందన తెచ్చుకున్న ఈ ‘వీర భద్రుడు’ మూవీ కొన్ని మంచి మూమెంట్స్ తో సాగే యావరేజ్ యాక్షన్ డ్రామాగా చెప్పుకోవచ్చు. సూర్య ఫాన్స్ కి మంచి ట్రీట్ ఇచ్చే ఈ సినిమా నార్మల్ ఆడియన్స్ ని అంతగా ఆకట్టుకోకపోవచ్చు. కథ పరంగా నిరాశపరిచిన ఈ సినిమాలో కొన్ని సీన్స్ మాత్రం చాలా బాగుంటాయి. పైగా కొన్ని బేసిక్ స్టోరీ లైన్ మరియు ఎమోషనల్ సీన్స్ చాలా రొటీన్‌గా అనిపించడం వల్ల సినిమా ఓవరాల్ ఇంపాక్ట్ తగ్గుతుంది.
అయితే నాసిరకం డబ్బింగ్, తమిళ నేటివిటీ ఎక్కువ అవడం వల్ల తెలుగు ఆడియన్స్ ని అంతగా మెప్పించలేకపోతుంది. మ్యూజిక్ కూడా అంతగా వర్కౌట్ అవలేదు. ఓవరాల్ గా సూర్య అభిమానులకు మంచి కిక్కిచ్చే ఈ మూవీని కొత్తదనం ఆశించకుండా, తక్కువ అంచనాలతో చూస్తే బెటర్.
Public Reviews
6 Avg: 6.3/10Above Average
VeeraBhadrudu Movie Review
Chaala rojula tarvatha Suriya ni proper mass role lo chusina feeling ichindi ‘Veerabhadrudu’. after many years later.. naku connect ayina Suriya movie ide anipinchindi. Low expectations tho vellam kaani surprisingly movie decent ga anipinchindi. Story routine gane unna… makers fans kosam elevat...
Chaala rojula tarvatha Suriya ni proper mass role lo chusina feeling ichindi ‘Veerabhadrudu’. after many years later.. naku connect ayina Suriya movie ide anipinchindi. Low expectations tho vellam kaani surprisingly movie decent ga anipinchindi.
Story routine gane unna… makers fans kosam elevations, whistle moments baga set chesaru. Konni scenes lo vintage Suriya vibe clear ga kanipistadi. Overall ga decent watchable.
Hit
Veerabhadrudu
veerabhadrudu : Vintage Suriya is back boss! chalaa rojulnundi suriya movies dissapoint chestunnayi.. manaku telsu.. appudeppudo "soorai potru" tarvatha naku conect ayina surya movie okkati guda ledu. jai bhim ante vere genre anuko... but latest ga release ayina "veerabhadrudu" movieki guda ver...
veerabhadrudu :
Vintage Suriya is back boss! chalaa rojulnundi suriya movies dissapoint chestunnayi.. manaku telsu.. appudeppudo "soorai potru" tarvatha naku conect ayina surya movie okkati guda ledu. jai bhim ante vere genre anuko... but latest ga release ayina "veerabhadrudu" movieki guda very low expectations tho moviekellinam nenu ma friends.
but unexpected ga movie nak nachindi. low expectations tho vellinanduko... leka suriya edanna sences ki connect ayinamo ledo telidu gani... overall movie was good. story antha ledu, but directer RJ bajali fans ni impress cheddamane movie teesinattundi.
rating ayithe 7/10
Above Average
Veerabhadrudu Cinema Review
వారం మొత్తం office tensions తర్వాత relife కోసం ఎదో ఒక movie కి వెళ్దాం అని అలా ‘వీరభద్రుడు’ మూవీకి వెళ్లాను. బేసిగ్గా కమర్షియల్ మూవీస్ నాకు పెద్దగా నచ్చవు, కానీ వీరభద్రుడు మూవీని బాగా ఎంజాయ్ చేశాను. పెద్దగా స్టోరీ కూడా ఏం లేదు. మూవీ చూస్తుంటే... గోపాల గోపాల, వకీల్ సాబ్ మూవీ కాన్సెప్ట్...
వారం మొత్తం office tensions తర్వాత relife కోసం ఎదో ఒక movie కి వెళ్దాం అని అలా ‘వీరభద్రుడు’ మూవీకి వెళ్లాను. బేసిగ్గా కమర్షియల్ మూవీస్ నాకు పెద్దగా నచ్చవు, కానీ వీరభద్రుడు మూవీని బాగా ఎంజాయ్ చేశాను. పెద్దగా స్టోరీ కూడా ఏం లేదు. మూవీ చూస్తుంటే... గోపాల గోపాల, వకీల్ సాబ్ మూవీ కాన్సెప్ట్స్ మిక్స్ చేసి దించినట్టు అనిపించింది. బట్ సూర్య performance after long gap తర్వాత మంచిగనిపించింది. ఇక జెనరల్ ఆడియన్స్ గురించి నాకు తెలీదు గాని ఫ్యాన్స్ బాగా ఎంజాయ్ చేస్తారు మూవీని. but మూవీ నేటివిటీ మాత్రం అంత ఎక్కదు. because తమిళ్ నేటివిటీ మసాల ఎక్కువైంది. ఓవరాల్ గా ఓ సారి weekend లో enjoy చేయొచ్చు.
Average
Veerabhadrudu review
అందరూ కోర్ట్ రూమ్ డ్రామా బాగుంది... jai bhim తర్వాత ఆల్మోస్ట్ అలాంటి బ్యాక్ డ్రాప్ లో మూవీ వచ్చిందని చెప్తే ఈ sunday మూవీ చూడ్డానికి వెళ్లాను.. ముందే ట్రైలర్ చుస్తేనే చిన్న డౌట్ ఒచ్చింది... నాకు నచ్చుద్దా మూవీ అని.. సినిమా చూసాక అదే ఫీలింగ్... మే బి కమర్షియల్ మూవీ అయినా కూడా నేనే ఎక్కువ expect చేసాన...
Super Hit
Suriya’s Veerabhadrudu Film Review
Suriya’s Veerabhadrudu feels like a solid comeback to the mass commercial genre. Suriya perfectly fits the role and delivers several goosebumps-worthy moments for fans. Director RJ Balaji handles the film well with entertaining commercial elements and a few surprise moments. The music by Sai Ab...
Suriya’s Veerabhadrudu feels like a solid comeback to the mass commercial genre. Suriya perfectly fits the role and delivers several goosebumps-worthy moments for fans. Director RJ Balaji handles the film well with entertaining commercial elements and a few surprise moments.
The music by Sai Abhyankkar adds good energy to the film.
However, the movie carries strong Tamil nativity, which may not connect with everyone.
Overall, Veerabhadrudu is a decent mass entertainer and a satisfying comeback film for Suriya fans.
Above Average
Veerabhadrudu
veerabhadrudu : Suriya’s Veerabhadrudu had a decent setup, but the film ends up feeling below average overall. A few mass moments and Suriya’s screen presence work to an extent, but the story doesn’t offer anything fresh or exciting. Apart from a few engaging moments and decent music, the film mos...
About This Movie
Story : కథ విషయానికి వస్తే... మునిస్వామి (ఇంద్రన్స్) అనే వ్యక్తి, తన కూతురు మీను (అనఘా మాయా రవి) సర్జరీ కోసం హైదరాబాద్ వస్తారు. అయితే సిటీకి రాగానే వాళ్ళు వెంట తెచ్చుకున్న బంగారం దుండగులు దొంగిలిస్తారు. దీంతో నాంపల్లి కోర్టులో లాయర్ బేబీ కృష్ణ (ఆర్జే బాలాజీ)ను సాయం అడుగుతారు. కానీ ఆ లాయర్ వాళ్లని అవినీతితో మోసం చేస్తాడు. దీంతో విసిగిపోయిన మునిస్వామి వీరభద్రుడి (సూర్య) సాయం కోరతాడు. ఈ క్రమంలో రంగంలోకి దిగిన వీరభద్ర మోసం చేసిన వాళ్ళకి ఎలా బుద్ధి చెప్పాడు? అసలు వీరభద్ర ఎవరు? చివరికి మీను కుటుంబానికి న్యాయం జరిగిందా లేదా? అనేది మిగిలిన కథ.
కొన్నాళ్లుగా సరైన సక్సెస్ లేక సతమతమవుతున్న సూర్య ఈసారి వీరభద్రుడిగా మాస్ కమర్షియల్ మూవీతో ఎంట్రీ ఇచ్చాడు. అయితే సినిమా మరో కోణంలో సాగుతుంది. అది మూవీ చూసాక తెలుస్తుంది. ఇక సూర్య ఫ్యాన్స్ కి ఇది ఫుల్ మీల్స్ లాంటి సినిమా అని చెప్పొచ్చు. మూవీ లో సూర్య స్క్రీన్ ప్రెజెన్స్ అదిరిపోగా, వన్ మ్యాన్ షోగా నడిపించాడని చెప్పొచ్చు. సూర్య తన మార్క్ పెర్ఫార్మన్స్ తో అభిమానులని సప్రైజ్ చేస్తాడని చెప్పొచ్చు. క్లైమాక్స్ కూడా సాలిడ్ ఇంపాక్ట్ ఇస్తుంది. ఇక ప్రతినాయకుడిగా ఆర్జే బాలాజీ నటన కూడా బాగుంది. త్రిష సహా మిగిలిన వాళ్ళు వాళ్ళ పరిధి మేరకు నటించారు.
అయితే సినిమా కథలో మాత్రం ఏమాత్రం కొత్తదనం లేదు. పైగా కమర్షియల్ గా స్క్రీన్ ప్లే ఇతర డైరెక్టర్ల సినిమాలను గుర్తు చేసే విధంగా ఉంది. కథ పరంగాను మహావీరుడు, కాంతారా లాంటి మూవీస్ గుర్తొస్తాయి. పైగా కొన్ని సీన్స్ ఇల్లాజికల్ గా ఉంటాయి. పైగా సూర్య డబ్బింగ్ అంత ఇంపాక్టుబుల్ గా లేదు. సినిమా మొత్తంలో ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ మినహా పెద్దగా గుర్తు పెట్టుకునే సీన్స్ ఉండవు. అన్నిటికి మించి తమిళ నేటివిటీ ఎక్కువ ఉండడం వల్ల తెలుగు వాళ్ళకి కొన్ని సీన్స్ కనెక్ట్ కాకపోవచ్చు.
Final Review :
టెక్నికల్ గా చూస్తే... ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. ఎటొచ్చి డైరెక్టర్ ఆర్ జె బాలాజీ కథను బలంగా రాసుకుంటే బాగుండేది. కానీ సూర్య ఫాన్స్ కి మాత్రం నచ్చి ట్రీట్ ఇచ్చేలా సీన్స్ రాసుకున్నాడు. ఇక మ్యూజిక్ డైరెక్టర్ సాయి అభ్యంకర్ ఇచ్చిన సంగీతం అంత వర్కౌట్ అవలేదు, గాని బీజీఎమ్ సాలిడ్ గా వర్క్ అయింది. అయితే ఎమోషనల్ సన్నివేశాల్లో కూడా మరింత ఫోకస్ పెట్టాల్సింది. ఓవరాల్ గా తక్కువ అంచనాలతో సినిమాని ఓసారి చూసేయొచ్చు.