Register as a Reviewer
గాయపడ్డ సింహం (Gayapadda Simham)

గాయపడ్డ సింహం (Gayapadda Simham)

01 May 2026
Overall Rating
5.3/10
20 Reviews

దర్శకనటుడు 'తరుణ్ భాస్కర్' హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ "గాయపడ్డ సింహం". మానస చౌదరి, ఫరియా అబ్దుల్లా హీరోయిన్లుగా నటించిన ఈ మూవీని కశ్యప్ శ్రీనివాస్ డైరెక్ట్ చేయగా తాజాగా థియేటర్లలో విడుదలైంది.

Director: Kasyap Sreenivas
Cast: Sree Vishnu, Tharun Bhascker, J.D.Chakravarthy, Faria Abdullah, Maanasa Choudhary, Kasyap Sreenivas and others

Available in:

Reviews

What critics and the public are saying about గాయపడ్డ సింహం (Gayapadda Simham)

Media Reviews

20 Avg: 5.3/10
Venky Reviews
Venky Reviews Twitter Channel
4

Below Average

Gayapadda Simham Movie Review

గాయపడ్డ సింహం గురించి చెప్పాలంటే... ఇంట్రెస్టింగ్ ఐడియా. బోరింగ్ స్టోరీ. ఈ మూవీకి ఒక విలక్షణమైన కథాంశం ఉంది. ఇది ఒక ఎంటర్టైనింగ్ కామెడీగా మారే అవకాశం ఉంది. కానీ స్క్రీన్ ప్లే చాలా బోరింగ్ గా అనిపిస్తుంది, ఎట్ ది సేమ్ టైం సెకండ్ హాఫ్ లో ఏవేవో సన్నివేశాలను కలిపి కుట్టినట్లుగా అనిపిస్తుంది. ఈ ఫార్స్ స్...

గాయపడ్డ సింహం గురించి చెప్పాలంటే... ఇంట్రెస్టింగ్ ఐడియా. బోరింగ్ స్టోరీ. ఈ మూవీకి ఒక విలక్షణమైన కథాంశం ఉంది. ఇది ఒక ఎంటర్టైనింగ్ కామెడీగా మారే అవకాశం ఉంది. కానీ స్క్రీన్ ప్లే చాలా బోరింగ్ గా అనిపిస్తుంది, ఎట్ ది సేమ్ టైం సెకండ్ హాఫ్ లో ఏవేవో సన్నివేశాలను కలిపి కుట్టినట్లుగా అనిపిస్తుంది. ఈ ఫార్స్ స్పూఫ్ కామెడీ చాలా వరకు ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. కొన్ని నవ్వులు తప్ప, చివరికి ఇది ఒక బోరింగ్ మూవీగా నిలుస్తుంది. 


#GaayaPaddaSimham Interesting Idea, Boring Execution!


The film has an unconventional storyline that had potential to be a wacky comedy. But the screenplay turns out to be exhausting and feels like random scenes stitched together especially in the second half. The farce/spoof comedy fails to land for the most part. 


Ends up being a tiring experience with just a few laughs!

May 01, 2026 Read Review
Cinema Picha
Cinema Picha Youtube Channel
5

Average

Gayapadda Simham movie Review

తరుణ్ భాస్కర్ చాలా రోజుల తర్వాత మళ్ళీ హీరోగా ట్రై చేసిన ‘గాయపడ్డ సింహం’ ఫైనల్ గా థియేటర్లకు వచ్చేసింది. ఇక సినిమా స్టార్ట్ అయిన పదిహేను నిమిషాల్లోనే క్లారిటీ వచ్చేస్తుంది… “ఇది ఏ జానర్ బాస్?” అసలు కామెడీనా? సీరియస్ స్టోరీనా? లేక ఎక్స్‌పెరిమెంటా? అని — ఏదీ ఫుల్‌ గా వర్క్ అవ్వలేదు. హీరోగా తరుణ్ భాస్కర...

తరుణ్ భాస్కర్ చాలా రోజుల తర్వాత మళ్ళీ హీరోగా ట్రై చేసిన ‘గాయపడ్డ సింహం’ ఫైనల్ గా థియేటర్లకు వచ్చేసింది. ఇక సినిమా స్టార్ట్ అయిన పదిహేను నిమిషాల్లోనే క్లారిటీ వచ్చేస్తుంది… “ఇది ఏ జానర్ బాస్?” అసలు కామెడీనా? సీరియస్ స్టోరీనా? లేక ఎక్స్‌పెరిమెంటా? అని — ఏదీ ఫుల్‌ గా వర్క్ అవ్వలేదు. హీరోగా తరుణ్ భాస్కర్ బానే సెట్టయ్యాడు, కానీ తన రోల్ స్ట్రాంగ్ రాసుకోలేదు. తన స్టైల్ అఫ్ డైలాగ్స్, నేచురల్ యాక్టింగ్ ఉంది, కానీ ఫ్రెష్ నెస్ లేదు.


సెకండాఫ్‌లో అయినా స్టోరీ పికప్ అవుద్దేమో అనుకుంటే మళ్ళీ రిపీట్ మోడ్ లోకి వెళ్తుంది. ఎటొచ్చి శ్రీ విష్ణు ఎంట్రీ చ్చినప్పుడే కాస్త ఎంటర్టైన్మెంట్ పెరిగి మంచి ఫీల్ ఇస్తుంది. ఓవరాల్ గా ఒక డిఫెరెంట్ కాన్సెప్ట్ ని, డిఫెరెంట్ పాయింట్ తో, డిఫెరెంట్ గానే మేకర్స్ చూపించడానికి ట్రై చేశారన్నమాట. సింపుల్ గా లో ఎక్స్పెక్టేషన్స్ తో చూస్తే మంచి ఫీల్ రావొచ్చు గాని, గాయపడ్డ సింహం పై కన్ఫ్యూజన్ ఎక్కువ.

May 01, 2026 Watch
Mahidhar Vibes
Mahidhar Vibes Youtube Channel
5

Average

Gayapadda Simham movie Review

'గాయపడ్డ సింహం' అంటూ ఆడియన్స్ ముందుకు వచ్చిన తరుణ్ భాస్కర్ ఈసారి అరకొర అన్నట్టుగా ఇంప్రెస్ చేయడానికి ట్రై చేసాడు. అయితే సినిమా చూస్తే ఒక క్లియర్ ఫీలింగ్ అయితే వస్తుంది. ఐడియా ఉంది, కానీ ఎగ్జిక్యూషన్ మిస్ అయింది. తరుణ్ భాస్కర్ డైరెక్టర్ గా ప్రూవ్ చేసుకున్నా, హీరోగా ఎక్స్‌పెక్ట్ చేసిన ఇంపాక్ట్ రాలేదు....

'గాయపడ్డ సింహం' అంటూ ఆడియన్స్ ముందుకు వచ్చిన తరుణ్ భాస్కర్ ఈసారి అరకొర అన్నట్టుగా ఇంప్రెస్ చేయడానికి ట్రై చేసాడు. అయితే సినిమా చూస్తే ఒక క్లియర్ ఫీలింగ్ అయితే వస్తుంది. ఐడియా ఉంది, కానీ ఎగ్జిక్యూషన్ మిస్ అయింది. తరుణ్ భాస్కర్ డైరెక్టర్ గా ప్రూవ్ చేసుకున్నా, హీరోగా ఎక్స్‌పెక్ట్ చేసిన ఇంపాక్ట్ రాలేదు. ఫస్ట్ హాఫ్‌ లోనే సినిమా టోన్ సెటిల్ అవ్వదు. సెకండాఫ్‌లో కథ ముందుకు వెళ్లాలని చూస్తుంది, కానీ మళ్లీ అదే లూప్‌లో తిరిగినట్టు అనిపిస్తుంది. ఎమోషన్, కామెడీ రెండింట్లోనూ క్లారిటీ లేకపోవడం వల్ల ఆడియెన్స్ కనెక్ట్ అవ్వడం కష్టమే. 


ఓవరాల్ గా సినిమా గురించి చెప్పాలంటే..జస్ట్ ఒకే. సోది లేకుండా ఒక్క ముక్కలో చెప్పాలంటే..కొత్తదనం కోసం వెళ్ళేవాళ్లకి మిస్, టైమ్‌పాస్ కోసం వెళ్లేవాళ్లకి కూడా మిక్స్డ్ ఫీలింగ్ మాత్రమే. రేటింగ్ విషయానికి వస్తే... ఫైవ్ అవుట్ అఫ్ టెన్ వరకు ఇవ్వొచ్చు.. లేదంటే టు పాయింట్ ఫైవ్ వరకు ఇవ్వొచ్చు. 

May 01, 2026 Watch
Man of Fiction
Man of Fiction Youtube Channel
5

Average

Gayapadda Simham movie Review

సమ్మర్ లో పెద్ద సినిమాలు లేక డీలా పడితే, చిన్న సినిమాలైనా ఊరట కలిగిస్తాయనుకుంటే అవి కూడా దెబ్బేస్తున్నాయి. లేటెస్ట్ గా రిలీజ్ అయిన ‘గాయపడ్డ సింహం’ కూడా ఇదే కోవలోకి వచ్చేలా కనిపిస్తుంది. ఈ సినిమా ఒక క్లియర్ ఐడియా లేకుండా తీసిన ఎక్స్‌పెరిమెంట్‌ లా అనిపిస్తుంది. తరుణ్ భాస్కర్ దర్శకుడిగా తనదైన స్టైల్‌ త...

సమ్మర్ లో పెద్ద సినిమాలు లేక డీలా పడితే, చిన్న సినిమాలైనా ఊరట కలిగిస్తాయనుకుంటే అవి కూడా దెబ్బేస్తున్నాయి. లేటెస్ట్ గా రిలీజ్ అయిన ‘గాయపడ్డ సింహం’ కూడా ఇదే కోవలోకి వచ్చేలా కనిపిస్తుంది. ఈ సినిమా ఒక క్లియర్ ఐడియా లేకుండా తీసిన ఎక్స్‌పెరిమెంట్‌ లా అనిపిస్తుంది. తరుణ్ భాస్కర్ దర్శకుడిగా తనదైన స్టైల్‌ తో మంచి సినిమాలు ఇచ్చాడు. కానీ హీరోగా ఈసారి ఆయన తీసుకున్న రిస్క్ పూర్తిగా వర్క్ కాలేదు. ట్రైలర్‌ లో కనిపించిన ఎంటర్టైన్మెంట్ సినిమా మొత్తంలో కనబడకపోవడం పెద్ద డిసప్పాయింట్.


ఫస్ట్ హాఫ్ మొత్తం లాజిక్ లేకుండా, సిల్లీ సిట్యుయేషన్స్‌ తో సాగిపోతుంది. కామెడీ కోసం పెట్టిన రిఫరెన్సులు కూడా పెద్దగా పేలవు. ప్రేక్షకుడు ఎక్కడ కనెక్ట్ అవ్వాలి, ఎక్కడ నవ్వాలి అన్న క్లారిటీ లేకుండా సినిమా ముందుకు సాగుతుంది. సెకండాఫ్‌లో కూడా కథలో పెద్దగా ట్విస్టులు ఉండవు. నటీనటుల పరంగా చూస్తే తరుణ్ భాస్కర్ తన పాత్రలో ఓకే అనిపించినా, సినిమాలోని బలహీన రైటింగ్ వల్ల ఆయన పర్ఫార్మెన్స్ కూడా లిఫ్ట్ కాలేదు. ఫరియా అబ్దుల్లా, మానస చౌదరి పాత్రలు కూడా పరిమితంగానే ఉన్నాయి. జెడి చక్రవర్తి పాత్రకు ఉన్న బిల్డప్ స్క్రీన్‌ పై కనిపించదు. అయితే శ్రీ విష్ణు ఎంట్రీ మాత్రం కొంతవరకు సినిమాకు ఎనర్జీ ఇస్తుంది. ఓవరాల్ గా ‘గాయపడ్డ సింహం’ కంఫ్యూజ్డ్ రైటింగ్ + వీక్ ఎక్స్యూగుషన్. 

May 01, 2026 Watch
Barbell Pitch Meeting
Barbell Pitch Meeting Youtube Channel
4

Below Average

Gayapadda Simham movie Review

'గాయపడ్డ సింహం' అంటూ థియేటర్లోకి వచ్చిన తరుణ్ భాస్కర్ సినిమా గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే… అంచనాలు ఎక్కువ, అవుట్‌పుట్ తక్కువ. డైరెక్టర్ గా మంచి పేరు తెచ్చుకున్న తరుణ్ భాస్కర్ ఈసారి హీరోగా ఆడియెన్స్‌ను పూర్తిగా డిస్సపాయింట్ చేసాడు. ట్రైలర్‌ లో కనిపించిన కామెడీ, ఎంటర్టైన్మెంట్ సినిమా మొత్తంలో కనిపి...

'గాయపడ్డ సింహం' అంటూ థియేటర్లోకి వచ్చిన తరుణ్ భాస్కర్ సినిమా గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే… అంచనాలు ఎక్కువ, అవుట్‌పుట్ తక్కువ. డైరెక్టర్ గా మంచి పేరు తెచ్చుకున్న తరుణ్ భాస్కర్ ఈసారి హీరోగా ఆడియెన్స్‌ను పూర్తిగా డిస్సపాయింట్ చేసాడు. ట్రైలర్‌ లో కనిపించిన కామెడీ, ఎంటర్టైన్మెంట్ సినిమా మొత్తంలో కనిపించకపోవడం పెద్ద మైనస్. ఫస్ట్ హాఫ్ అంతా సిల్లీ సీన్స్, లాజిక్ లేకుండా సాగిపోతుంది. కొన్ని రిఫరెన్సులు, మీమ్‌ లను పెట్టినా అవి నవ్వు తెప్పించలేవు. సెకండాఫ్‌ లో కూడా కథ ముందుకు వెళ్లకుండా అదే చుట్టూ తిరుగుతున్న ఫీలింగ్ వస్తుంది.


ఫరియా అబ్దుల్లా, మానస చౌదరి రోల్స్ పరిమితంగానే ఉంటాయి. జెడి చక్రవర్తి పాత్రకు హైప్ ఇచ్చినా, స్క్రీన్‌ పై పెద్దగా ఇంపాక్ట్ లేదు. సినిమా మొత్తం బోర్‌ గా సాగుతున్న టైం లో శ్రీ విష్ణు ఎంట్రీ కొద్దివరకు రిలీఫ్ ఇస్తుంది. టెక్నికల్‌ గా పర్వాలేదనిపించినా, కంటెంట్ పరంగా సినిమా బలహీనంగా ఉంది. మొత్తంగా ‘గాయపడ్డ సింహం’ అనే టైటిల్ లాగా… ఈ సినిమా చూసిన ఆడియెన్స్‌ కి కూడా ‘గాయం’ మిగులుతుంది. కామెడీ కోసం వచ్చినవాళ్లకు నిరాశ, కొత్తదనం కోరుకున్నవాళ్లకు పూర్తిగా మిస్ అయ్యే సినిమా ఇది. ఓవరాల్ గా గాయపడ్డ సింహాన్ని చూసి జాలిపడితే థియేటర్ నుంచి వచ్చిన ఆడియన్స్ ని చూసి మరొకరు జాలిపడతారు అన్నట్టుంది. 

May 01, 2026 Watch
6

Above Average

Gayapadda Simham movie Review

తరుణ్ భాస్కర్ హీరోగా నటించిన గాయపడ్డ సింహం తాజాగా థియేటర్లలో విడుదల కాగా థియేటర్లలో మిక్స్డ్ రెస్పన్స్ అందుకుంది. కాగా ఈ సినిమా ప్రమోషన్లలో ట్రంప్ అంశాన్ని వినియోగించడం వల్ల ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. ఫస్ట్ హాఫ్‌ లో ప్రేమ కథ, అమెరికా ప్రయాణం, ట్రంప్‌ పై ప్రతీకారం వంటి అంశాలు ప్రధానంగా చూపించారు...

తరుణ్ భాస్కర్ హీరోగా నటించిన గాయపడ్డ సింహం తాజాగా థియేటర్లలో విడుదల కాగా థియేటర్లలో మిక్స్డ్ రెస్పన్స్ అందుకుంది. కాగా ఈ సినిమా ప్రమోషన్లలో ట్రంప్ అంశాన్ని వినియోగించడం వల్ల ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. ఫస్ట్ హాఫ్‌ లో ప్రేమ కథ, అమెరికా ప్రయాణం, ట్రంప్‌ పై ప్రతీకారం వంటి అంశాలు ప్రధానంగా చూపించారు. సెకండ్ హాఫ్‌ లో పోలీస్ అంశాలు, ధర్మ పాత్ర, భైరవ్ దాస్ కథ ప్రధానంగా సాగుతుంది. శ్రీ విష్ణు పాత్ర గెస్ట్ రోల్‌ గా కాకుండా సెకండ్ హీరోలా కనిపించడం విశేషం. అతని పాత్రకు ప్రత్యేకంగా కథను రూపొందించడం కొత్తగా అనిపించింది.


అయితే ఈ ప్రయోగం మెయిన్ స్టోరీని కొంతవరకు డామినేట్ చేసినట్లు అనిపిస్తుంది. భైరవ్ దాస్ పాత్ర ఆధారంగా భవిష్యత్తులో ప్రత్యేక సినిమా వచ్చే అవకాశం ఉందని క్లైమాక్స్ తో హింట్ ఇచ్చారు టీమ్. ట్రంప్‌కు సంబంధించిన సన్నివేశాలు హాస్యాన్ని అందిస్తాయి. అమెరికాకు వెళ్లాలని ఆశపడే ప్రేక్షకులకు ఈ కథ కనెక్ట్ అవుతుంది. కొన్ని చోట్ల కథ నెమ్మదిగా సాగినప్పటికీ, కామెడీ సీన్స్ కడుబుబ్బా నవ్విస్తాయి. ఓవరాల్ గా సినిమా గురించి సింపుల్ గా చెప్పేస్తే... “గాయపడ్డ సింహం” సినిమా అమెరికా వెళ్లాలన్న ఓ వ్యక్తి కల నెరవేరకపోవడంతో అతను తీసుకున్న నిర్ణయాలు, వాటి ప్రభావం చుట్టూ తిరిగే కథ. కామెడీ, యాక్షన్, ఎమోషనల్ అంశాలతో సినిమా రూపొందించబడింది. హ్యాపీగా నవ్వుకోవాలి అనుకునేవారికి గాయపడ్డ సింహం సినిమా మంచి ఆప్షన్.


May 01, 2026 Read Review
Tupaki
Tupaki Website
5

Average

Gayapadda Simham movie Review

గాయపడ్డ సింహం కథ విషయానికి వస్తే... డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడు అయినప్పటి నుంచి తన నిర్ణయాలతో ప్రపంచాన్ని ఎలా ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాడో తెలిసిందే. అలాంటి నిర్ణయాల్లో వీసా రద్దు నిబంధనలు కూడా ఒకటి. దీనివల్ల అందరికంటే ఎక్కువగా ఇండియన్సే ఇబ్బంది పడ్డారు. ఈ కాన్సెప్ట్ బేస్ చేసుకుని క...

గాయపడ్డ సింహం కథ విషయానికి వస్తే... డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడు అయినప్పటి నుంచి తన నిర్ణయాలతో ప్రపంచాన్ని ఎలా ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాడో తెలిసిందే. అలాంటి నిర్ణయాల్లో వీసా రద్దు నిబంధనలు కూడా ఒకటి. దీనివల్ల అందరికంటే ఎక్కువగా ఇండియన్సే ఇబ్బంది పడ్డారు. ఈ కాన్సెప్ట్ బేస్ చేసుకుని కామెడీ ప్రధానంగా తెరకెక్కిన గాయపడ్డ సింహం ఆడియన్స్ ని బానే మెప్పిస్తుంది. కామెడీ బాగా రాయగలిగిన రైటర్ అయితే దీని మీద మంచి కామెడీ సీన్లతో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించేవాడు. 


కానీ కొత్త దర్శకుడు కశ్యప్ శ్రీనివాస్. ఒరిజినల్ కామెడీని పండించలేక ఎక్కువగా స్పూఫుల మీద ఆధారపడ్డాడు. ఈ క్రమంలో అక్కడక్కడా కొన్ని నవ్వులు పండాయి కానీ.. ఆ డోస్ సరిపోలేదు. తనను డిపోర్ట్ చేయించిన ట్రంప్ మీద ప్రతీకారం తీర్చుకునే హీరో, ఈ పాయింట్ మీదే ఈ కథను నడిపిస్తే అది హిలేరియస్ గా వర్కవుట్ అయ్యేదేమో. కానీ ఇందులోకి క్రైమ్ రాకెట్ ట్రాక్ ను తీసుకొచ్చి మిక్స్ చేయడంతో ఈ కథ రొటీన్ క్రైమ్ కామెడీలా రూట్ తీసుకుంది. ఇక జేడీ చక్రవర్తి పాత్ర గురించి ప్రోమోల్లో ఇచ్చిన బిల్డప్ కి సినిమాలో ఉన్నదానికి పొంతన లేదు. అసలు ‘గాయపడ్డ సింహం’ టైటిల్ కే న్యాయం జరగలేదు. ఎక్కువ అంచనాలు పెట్టుకోకుండా అక్కడక్కడా కొన్ని నవ్వులతో సరిపెట్టుకుంటాం అంటే ఈ చిత్రంపై ఒక లుక్కేయొచ్చు. అంతకుమించి ఆశిస్తే కష్టం. 

May 01, 2026 Read Review
Samayam Telugu
Samayam Telugu Website
5

Average

Gayapadda Simham movie Review

తరుణ్ భాస్కర్‌కి దర్శకుడిగా మంచి విజయాలున్నాయి. కానీ నటుడిగా, హీరోగా మాత్రం ఆ రేంజ్ సక్సెస్‌ని ఇంకా అందుకోలేదు. తరుణ్ భాస్కర్ నుంచి ఆడియెన్స్ ఎక్కువగా డైరెక్షన్ కోరుకుంటున్నారు. కానీ తరుణ్ భాస్కర్ మాత్రం ఎక్కువగా నటన మీద ఫోకస్ పెట్టినట్టు అనిపిస్తుంది.యాక్టర్‌గానూ తరుణ్ భాస్కర్‌ కి మంచి పేరు అయితే ఉ...

తరుణ్ భాస్కర్‌కి దర్శకుడిగా మంచి విజయాలున్నాయి. కానీ నటుడిగా, హీరోగా మాత్రం ఆ రేంజ్ సక్సెస్‌ని ఇంకా అందుకోలేదు. తరుణ్ భాస్కర్ నుంచి ఆడియెన్స్ ఎక్కువగా డైరెక్షన్ కోరుకుంటున్నారు. కానీ తరుణ్ భాస్కర్ మాత్రం ఎక్కువగా నటన మీద ఫోకస్ పెట్టినట్టు అనిపిస్తుంది.యాక్టర్‌గానూ తరుణ్ భాస్కర్‌ కి మంచి పేరు అయితే ఉంది కానీ సరైన సక్సెస్ లేదు. ఇపుడు ‘గాయపడ్డ సింహం’తో మరోసారి ఆడియన్స్ ముందుకు వచ్చాడు. అయితే సినిమాకు ఆడియన్స్ నుండి ఊహించిన రేంజ్ లో అయితే రెస్పాన్స్ రాలేదు. 


కథా కథనాలు చాలా ఆర్డినరీగా ఉండి కాస్త డిస్సపాయింట్ చేసింది. ఎంటర్టైన్మెంట్ బానే చేసినా ఫ్రెష్ కామెడీ రిపీటెడ్ కామెడీలా అనిపించలేదు. టెక్నికల్ గా చూసుకుంటే గాయపడ్డ సింహం ఓకే అనిపిస్తుంది. పాటలు అంత గుర్తు పెట్టుకునేలా ఉండకపోయినా ఆర్ఆర్ బాగుంటుంది. విజువల్స్ కూడా రిచ్‌ గా అనిపిస్తాయి. ఈ మూవీని లిమిటెడ్ బడ్జెట్‌ లో, తక్కువ లొకేషన్లలోనే చుట్టేసినట్టుగా అనిపిస్తుంది. కొన్ని చోట్ల డైలాగ్స్, మీమ్స్ రిఫరెన్స్ బాగుంటాయి. ఎడిటింగ్, ఆర్ట్ ఇలా అన్ని డిపార్మెంట్స్ పర్వాలేదనిపిస్తాయి. అలాగే క్లైమాక్స్ లో పోరాట సింహం అంటూ సీక్వెల్ కూడా అనౌన్స్ చేస్తారు. దానికన్నా ముందు ఫస్ట్ పార్ట్ ఆడియన్స్ ని ఎంతవరకు మెప్పిస్తోందో ఫైనల్ గా చూడాలి. 

May 01, 2026 Read Review
T2B Live
T2B Live Website
6

Above Average

Gayapadda Simham Movie Review

గాయపడ్డ సింహం అంటూ ఆడియన్స్ ముందుకు వచ్చిన తరుణ్ భాస్కర్ ఎప్పట్లానే తన న్యాచురల్ పెర్ఫార్మన్స్ తో ఆకట్టుకున్నాడు.ముందుగా కథ పాయింట్ విషయానికి వస్తే అందరి లానే హీరో కూడా అమెరికా వెళ్ళాలని అనుకుంటాడు, కానీ తన విసా రిజక్ట్ అవ్వడంతో ఏకంగా ట్రంప్ మీదే పగ తీర్చుకోవాలని డిసైడ్ అవుతాడు. దాంతో హీరో ఏం చేశాడు...

గాయపడ్డ సింహం అంటూ ఆడియన్స్ ముందుకు వచ్చిన తరుణ్ భాస్కర్ ఎప్పట్లానే తన న్యాచురల్ పెర్ఫార్మన్స్ తో ఆకట్టుకున్నాడు.

ముందుగా కథ పాయింట్ విషయానికి వస్తే అందరి లానే హీరో కూడా అమెరికా వెళ్ళాలని అనుకుంటాడు, కానీ తన విసా రిజక్ట్ అవ్వడంతో ఏకంగా ట్రంప్ మీదే పగ తీర్చుకోవాలని డిసైడ్ అవుతాడు. దాంతో హీరో ఏం చేశాడు, ఆ తర్వాత కథేంటి అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. ఓవరాల్ గా కథ సిల్లీగా అనిపించినా కూడా కామెడీ పరంగా బానే వర్కౌట్ అయ్యే స్కోప్ ఉన్న పాయింట్ ను కొంచెం కన్ఫ్యూజన్ స్క్రీన్ ప్లే తో డైరెక్టర్ పూర్తిగా అనుకున్న రేంజ్ లో తీయలేకపోయాడు. 


అయితే ఉన్నంతలో సినిమాలో ఎంటర్టైన్మెంట్ బానే మెప్పించింది. తరుణ్ భాస్కర్ తన వరకు బాగా నటించి మెప్పించగా టాప్ స్టార్ మూవీస్ రిఫరెన్స్ లు సినిమాలో బాగానే వర్కౌట్ అయ్యాయి అని చెప్పాలి. అన్నిటికి మించి కొంత గ్యాప్ తర్వాత జేడీ చక్రవర్తి పర్వాలేదు అనిపించేలా నటించగా స్పెషల్ క్యామియో చేసిన శ్రీ విష్ణు ఉన్న సీన్స్ అన్నీ కూడా బాగా వర్కౌట్ అయ్యాయి. ఓవరాల్ గా ఆడియన్స్ ముందే తక్కువ అంచనాలతో థియేటర్స్ కి వెళితే చాలా వరకు ఎంజాయ్ చేసి పర్వాలేదు, మంచి సినిమానే చూశాం అన్న ఫీలింగ్ తో థియేటర్స్ బయటికి రావొచ్చు. 

May 01, 2026 Read Review
One India
One India Website
6

Above Average

Gayapadda simham Movie Review

క్రైమ్ కామెడీ సినిమాలకు పెద్దగా లాజిక్‌లు వెతకకూడదు, చూసినంత సేపు నవ్వుకుంటే చాలు. ఇదే విధంగా గాయపడ్డ సింహం సినిమాలో కూడా ట్రంప్ మీద హీరో పగ తీర్చుకోవాలనుకునే సిల్లీ పాయింట్‌ లోనే కావాల్సినంత కామెడీ పుట్టింది. తరుణ్ భాస్కర్ హీరోగా బానే చేసినా, కొత్త తరహాలో చేసిందేమి లేదు. అందరికీ సిల్లీగా అనిపించే వ...

క్రైమ్ కామెడీ సినిమాలకు పెద్దగా లాజిక్‌లు వెతకకూడదు, చూసినంత సేపు నవ్వుకుంటే చాలు. ఇదే విధంగా గాయపడ్డ సింహం సినిమాలో కూడా ట్రంప్ మీద హీరో పగ తీర్చుకోవాలనుకునే సిల్లీ పాయింట్‌ లోనే కావాల్సినంత కామెడీ పుట్టింది. తరుణ్ భాస్కర్ హీరోగా బానే చేసినా, కొత్త తరహాలో చేసిందేమి లేదు. అందరికీ సిల్లీగా అనిపించే విషయాన్ని హీరో చాలా సీరియస్‌గా తీసుకోవడం బాగుంది. అయితే, కథనం చాలా నెమ్మదిగా సాగడం వల్ల సినిమా ముందుకు సాగకుండా అక్కడే తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. కథలోకి వెళ్లడానికి చాలా సమయం తీసుకున్నారు. అందులోనూ వచ్చే పాటలు కథకు అడ్డం తగిలి బ్రేకులు వేస్తూ ఉంటాయి.


ఇక తరుణ్ భాస్కర్, జేడీ చక్రవర్తి నటన ఈ సినిమాకు అతిపెద్ద ప్లస్ పాయింట్‌గా నిలిచింది. అక్కడక్కడా కామెడీ అద్భుతంగా పేలింది. ఈ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ సెకండాఫ్. సెకండాఫ్ అభిమానులను ఆకట్టుకునేలా తీశారు. అయితే ఫస్టాఫ్ లో కథాంశం స్లోగా సాగుతుంది. ఉడికీ ఉడకని కథ, కథనంతో దర్శకుడు ప్రేక్షకులను కాస్త కన్‌ఫ్యూజ్ చేశాడు. సీరియస్ అంశాల వల్ల తికమక జరిగింది. ఓవరాల్ గా 'గాయపడిన సింహం' పెద్దగా అంచనాలు లేకుండా ఓసారి చూడదగ్గ క్రైమ్ కామెడీ చిత్రం. అయితే టైటిల్‌ కు తగ్గట్టుగానే కొన్నిసార్లు ఆ 'గాయపడిన సింహం' ప్రేక్షకులను కూడా కాస్త గాయపరిచే ప్రయత్నమే చేసింది. 


May 01, 2026 Read Review
10TV Telugu
10TV Telugu News Channel
6

Above Average

Gayapadda Simham Movie Review

గాయపడ్డ సింహం అంటూ ఆడియన్స్ ముందుకు వచ్చిన తరుణ్ భాస్కర్ ఈ సినిమాతో తన ఫ్యాన్స్ ని బానే మెప్పించడని చెప్పాలి. ఇక సినిమా ఫస్ట్ హాఫ్ అంతా ధరహాస్ ప్రేమకథ, అమెరికా ప్రయాణం, ట్రంప్ మీద రివెంజ్, భైరవ్ దాస్ కథతో సాగుతుంది. సెకండ్ హాఫ్ అంతా ధరహాస్ జీవితంలోకి పోలీసులు, ధర్మ ఎలా వచ్చాడు, భైరవ్ దాస్ కథతో సాగుత...

గాయపడ్డ సింహం అంటూ ఆడియన్స్ ముందుకు వచ్చిన తరుణ్ భాస్కర్ ఈ సినిమాతో తన ఫ్యాన్స్ ని బానే మెప్పించడని చెప్పాలి. ఇక సినిమా ఫస్ట్ హాఫ్ అంతా ధరహాస్ ప్రేమకథ, అమెరికా ప్రయాణం, ట్రంప్ మీద రివెంజ్, భైరవ్ దాస్ కథతో సాగుతుంది. సెకండ్ హాఫ్ అంతా ధరహాస్ జీవితంలోకి పోలీసులు, ధర్మ ఎలా వచ్చాడు, భైరవ్ దాస్ కథతో సాగుతుంది. ఈ మధ్యలో శ్రీ విష్ణు పాత్ర భైరవ్ దాస్ ని గెస్ట్ అప్పీరెన్స్ లా కాకుండా, సెకండ్ హీరోలా దానికి ఇంకో కథ రాసుకొని, అతని ఫ్యామిలీ, అతని కథ చెప్పడం గమనార్హం. 


అంతే కాదు క్లైమాక్స్ లో శ్రీవిష్ణు, జెడి చక్రవర్తి పాత్రలని చూపించడంతో పాటు పార్ట్ 2 అని ‘పోరాట సింహం’ టైటిల్ అనౌన్స్ చేసారు కాబట్టి అది శ్రీవిష్ణు మీదే ఫుల్ సినిమా ఉండొచ్చు అని తెలుస్తుంది. ఇక ఈ సినిమా గురించి ఓవరాల్ గా సింపుల్ గా చెప్పాలంటే... ఓవరాల్ గా ‘గాయపడ్డ సింహం’ సినిమా అమెరికా వెళ్లాలన్న ఓ వ్యక్తి కల ఆగిపోవడంతో ట్రంప్ మీద కోపంతో ఏం చేసాడు, దాంతో అతని చుట్టూ ఏం జరిగింది అని కామెడీగా తెరకెక్కించారు. ఫ్రెష్ స్టోరీ ఎక్స్పెక్ట్ చేస్తే నిరాశ చెందొచ్చుగాని, తక్కువ అంచనాలతో సినిమాకి వెళ్తే ఓ మోస్తరు ఎంజాయ్ చేయొచ్చు. 


May 01, 2026 Read Review
TV9 Telugu
TV9 Telugu News Channel
6

Above Average

Gayapadda Simham movie Review

దర్శకుడు ఎంచుకున్న కథాంశం చాలా సింపుల్ అయినప్పటికీ.. దానిని తెరపై ఆవిష్కరించిన విధానం బాగుంది.. స్క్రీన్ ప్లే ఫాస్టుగా ఉండటంతో "గాయపడ్డ సింహం" పర్లేదు అనిపిస్తుంది. సినిమా ఆద్యంతం వినోదాత్మకంగా సాగేలా దర్శకుడు చేసిన ప్రయత్నం చాలా వరకు ఫలించింది. అయితే కథను ముందుకు నడిపించే ఇతర కీలక సన్నివేశాలు, క్యా...

దర్శకుడు ఎంచుకున్న కథాంశం చాలా సింపుల్ అయినప్పటికీ.. దానిని తెరపై ఆవిష్కరించిన విధానం బాగుంది.. స్క్రీన్ ప్లే ఫాస్టుగా ఉండటంతో "గాయపడ్డ సింహం" పర్లేదు అనిపిస్తుంది. సినిమా ఆద్యంతం వినోదాత్మకంగా సాగేలా దర్శకుడు చేసిన ప్రయత్నం చాలా వరకు ఫలించింది. అయితే కథను ముందుకు నడిపించే ఇతర కీలక సన్నివేశాలు, క్యారెక్టరైజేషన్స్ విషయంలో ఆశించిన స్థాయిలో పట్టు కనిపించలేదు. సినిమా చూస్తున్నంత సేపు ఒక సన్నివేశం తర్వాత మరో సన్నివేశం అలా సాగిపోతుందే తప్ప, ప్రేక్షకుడు ఉత్కంఠగా ఎదురుచూసేలా కథనంలో వేగం లేదు.


అలాగే సినిమాలో కేవలం వినోదం మాత్రమే కాపాడిన ఈ స్క్రీన్ ప్లే లో.. ఎమోషన్స్‌ కు ఇంకాస్త స్పేస్ ఇచ్చుంటే దర్శకుడికి మంచి మార్కులు పడేవి. స్వీకర్ అగస్తి అందించిన సంగీతం, పాటలు వినడానికి బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పర్వాలేదనిపిస్తుంది. ఓవరాల్ గా దర్శకుడు కశ్యప్ శ్రీనివాస్ ఆలోచన, టేకింగ్ బాగున్నప్పటికీ.. దాన్ని అంతే సమర్థవంతంగా స్క్రీన్ ప్లే గా మలచడంలో కాస్త తడబడ్డాడు. ఇటు నిర్మాతలు కళ్యాణ చక్రవర్తి మంథిన, భాను కిరణ్ ప్రతాప, విజయ్ కృష్ణ లింగమనేని బాగా ఖర్చుపెట్టారు. ఓవరాల్‌ గా ఈ గాయపడ్డ సింహం.. సింపుల్ అండ్ ఎంటర్‌టైనింగ్ గా ఆడియన్స్ ని మెప్పించే అవకాశం ఉంది. 


May 01, 2026 Read Review
NTV Telugu
NTV Telugu News Channel
6

Above Average

Gayapadda Simham Movie Review

కశ్యప్ శ్రీనివాస్ డైరెక్షన్ లో తరుణ్ భాస్కర్ మెయిన్ లీడ్ లో నటించిన లేటెస్ట్ మూవీ 'గాయపడ్డ సింహం'. కామెడీ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీలో మానసచౌదరి, ఫరియా అబ్దుల్లా హీరోయిన్లుగా నటించగా, థియేటర్లలో మిక్స్డ్ రెస్పాన్స్ అందుకుంది. కథ పాయింట్ వరకు 'గాయపడ్డ సింహం' చిన్న స్టోరీగా యావరేజ్ గా అనిపించగా, దాన్న...

కశ్యప్ శ్రీనివాస్ డైరెక్షన్ లో తరుణ్ భాస్కర్ మెయిన్ లీడ్ లో నటించిన లేటెస్ట్ మూవీ 'గాయపడ్డ సింహం'. కామెడీ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీలో మానసచౌదరి, ఫరియా అబ్దుల్లా హీరోయిన్లుగా నటించగా, థియేటర్లలో మిక్స్డ్ రెస్పాన్స్ అందుకుంది. కథ పాయింట్ వరకు 'గాయపడ్డ సింహం' చిన్న స్టోరీగా యావరేజ్ గా అనిపించగా, దాన్ని ఇంట్రెస్టింగ్ గా తెరకెక్కించడంలో డైరెక్టర్ తడబడ్డాడు. సినిమాలో ట్రంప్ మీద రివేంజ్ తీర్చుకోవాలని అనుకోవడం, అదీ చేతబడి చేయాలని హీరో ట్రై చేయడంలో మంచి ఫన్ జెనరేట్ అయింది. కానీ అది కాసేపటికే రొటీన్ ఫీల్ వస్తుంది. 


ఇటు డైరెక్టర్ కశ్యప్ శ్రీనివాస్ రైటింగ్ పరంగా ఫెయిల్ అయినా... స్టయిలిష్ ఫిల్మ్‌ మేకింగ్ వరకు కొంత బావుంది. ఇక తరుణ్ భాస్కర్ తన పాత్రకు తగ్గట్టు బానే నటించాడు. అలాగే శ్రీ విష్ణు రోల్ కూడా కొంత ఫన్ గా ఉన్నా ఏం పెద్దగా ఉపయోగపడలేదు. సినిమాకి సంబంధించి సింపుల్ గా కథ బాగున్నప్పటికీ స్పీడు లేకపోవడం వల్ల ఆడియన్స్ బోర్ ఫీల్ అవుతారు, అలాగే కన్ఫ్యూజ్ అవుతారు. ఓవరాల్ గా ఈ గాయపడ్డ సింహం సిల్లీ కామెడీతో ఒక వర్గం ఆడియన్స్ ని నవ్విస్తుంది. 


May 01, 2026 Read Review
ABP Desam
ABP Desam Website
5

Average

Gayapadda Simham Movie Review

స్పూఫ్ లేదా పేరడీ ప్రధాన ఉద్దేశం ప్రేక్షకులను నవ్వించడం. స్పూఫ్ సీన్ వచ్చినప్పుడు థియేటర్లలో విజిల్స్‌, క్లాప్స్, నవ్వులు వినిపించ లేదంటే రైటింగ్ పరంగా మేజిక్ మిస్ అయినట్టే. 'గాయపడ్డ సింహం' విషయంలో జరిగింది అదే. 'జల్సా' నుంచి మొదలు పెడితే... 'కేజీఎఫ్', 'అర్జున్ రెడ్డి', 'బొమ్మరిల్లు' వంటి పలు సినిమా...

స్పూఫ్ లేదా పేరడీ ప్రధాన ఉద్దేశం ప్రేక్షకులను నవ్వించడం. స్పూఫ్ సీన్ వచ్చినప్పుడు థియేటర్లలో విజిల్స్‌, క్లాప్స్, నవ్వులు వినిపించ లేదంటే రైటింగ్ పరంగా మేజిక్ మిస్ అయినట్టే. 'గాయపడ్డ సింహం' విషయంలో జరిగింది అదే. 'జల్సా' నుంచి మొదలు పెడితే... 'కేజీఎఫ్', 'అర్జున్ రెడ్డి', 'బొమ్మరిల్లు' వంటి పలు సినిమాలను స్పూఫ్ చేశాడు. ఒక్క స్పూఫ్ కూడా వర్కవుట్ అవ్వలేదు. కథగా చూస్తే... 'గాయపడ్డ సింహం' పాయింట్‌ లో మంచి పొటెన్షియల్ ఉంది. ట్రంప్ మీద రివేంజ్ తీర్చుకోవాలని అనుకోవడం, అదీ చేతబడి చేయాలని హీరో ట్రై చేయడంలో తెలియని అమాయకత్వం ఉంది. అయితే స్పూఫ్స్ మీద ఎక్కువ డిపెండ్ అయ్యారు. కానీ, వర్కవుట్ అవ్వలేదు.


ఇటు డైరెక్టర్ కశ్యప్ శ్రీనివాస్ సిట్యువేషనల్ హ్యూమర్ మాత్రమే కాదు... పంచ్ డైలాగ్ కామెడీని కూడా మిస్ చేశారు. అయితే రైటింగ్ పరంగా ఫెయిల్ అయినా... స్టయిలిష్ ఫిల్మ్‌ మేకింగ్ కొంత బావుంది. సినిమాటోగ్రఫీ, మ్యూజిక్ కొంత మేరకు ఆకట్టుకున్నాయి. ఇక తరుణ్ భాస్కర్ తన పాత్రకు తగ్గట్టు నటించారు. పెర్ఫార్మన్స్ స్కోప్ ఉన్న రోల్ కాదు. హీరోయిన్లు మానసా చౌదరి, ఫరియా అబ్దుల్లా... కథలో ఇద్దరి పాత్రలు పరిమితమే. బ్రూటల్ ధర్మగా జేడీ చక్రవర్తి పాత్రకు విపరీతమైన బిల్డప్ ఇచ్చారు. కానీ ఆయన్ను సరిగ్గా వాడుకోలేదు. శ్రీ విష్ణు కనిపించే సన్నివేశాలు తక్కువ. కథగా చూస్తే 'గాయపడ్డ సింహం'లో పాయింట్ బావుంది. కానీ, ఎగ్జిక్యూషన్ ఫెయిల్ అయ్యింది. కామెడీ వర్కవుట్ కాలేదు. డ్రామా పండలేదు. సరదాగా నవ్వుకోవచ్చని వినోదం ఆశించి థియేటర్లకు వెళ్లిన ప్రేక్షకుల ఆశలకు గాయం చేస్తుందీ సినిమా.

May 01, 2026 Read Review
Sakshi
Sakshi News Channel
6

Above Average

Gayapadda simham movie Review

తరుణ్ భాస్కర్ హీరోగా తెరకెక్కిన ‘గాయపడ్డ సింహం’ తాజాగా చిత్రం ప్రేక్షకుల ముందుకు రాగా, ఆడియన్స్ నుండి మిస్క్డ్ రెస్పాన్స్ అందుకుంది. హీరోగా తరుణ్ భాస్కర్ తన పాత్రలో సహజంగా నటించినా, ప్రేక్షకులు ఆయన నుంచి మరింత ఎక్స్‌పెక్ట్ చేసినట్లు అనిపిస్తుంది. హీరోయిన్‌లు ఫరియా అబ్దుల్లా, మానస చౌదరిలు వాళ్ళ రోల్స...

తరుణ్ భాస్కర్ హీరోగా తెరకెక్కిన ‘గాయపడ్డ సింహం’ తాజాగా చిత్రం ప్రేక్షకుల ముందుకు రాగా, ఆడియన్స్ నుండి మిస్క్డ్ రెస్పాన్స్ అందుకుంది. హీరోగా తరుణ్ భాస్కర్ తన పాత్రలో సహజంగా నటించినా, ప్రేక్షకులు ఆయన నుంచి మరింత ఎక్స్‌పెక్ట్ చేసినట్లు అనిపిస్తుంది. హీరోయిన్‌లు ఫరియా అబ్దుల్లా, మానస చౌదరిలు వాళ్ళ రోల్స్ కి తగ్గట్టు నటించారు. ఇక సినిమాలో కీలక పాత్రగా చెప్పుకున్న J. D. Chakravarthy పాత్ర డిజైన్ బాగున్నప్పటికీ, ప్రచారంలో చెప్పినంత ప్రాధాన్యం సినిమాలో కనిపించలేదు. Sree Vishnu తాంత్రికుడిగా కనిపించిన పాత్రలో తనదైన నటనతో ఆకట్టుకున్నాడు.


టెక్నికల్ విషయాల్లో సినిమాటోగ్రఫీ, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ పర్వాలేదనిపిస్తాయి. అయితే కథనం సాధారణంగా ఉండటం, వినోదం పరిమితంగా ఉండటం సినిమాకు మైనస్‌గా మారాయి. ఓవరాల్ గా ‘గాయపడ్డ సింహం’ ఎలాంటి అంచనాలు లేకుండా వెళితే కొంతవరకు ఆకట్టుకోవచ్చు. కానీ ఎక్కువ కామెడీ ఆశించి వెళితే మాత్రం ప్రేక్షకుడి మనసు గాయపడగా తప్పదు. 

May 01, 2026 Read Review
Chitra Jyothy
Chitra Jyothy Website
5

Average

Gayapadda Simham Movie Review

గాయపడ్డ సింహం అంటూ ఆడియన్స్ ముందుకొచ్చిన తరుణ్ భాస్కర్ ఈసారి వాళ్ళ పల్స్ పట్టుకోవడంలో తడబడ్డాడు. అంటే పూర్తిగా కాదు గాని, తన మార్క్ చూపించడంలో తడబడ్డాడు. అయితే సినిమాలో దరహాస్‌ గా నటించిన తరుణ్‌ భాస్కర్‌ తన పెర్ఫార్మన్స్ వరకు బానే ఇచ్చాడు. కానీ ఆడియన్స్ ఇంకా ఎక్స్పెక్ట్ చేసారు. ఫరియా అబ్దుల్లా కూడా...

గాయపడ్డ సింహం అంటూ ఆడియన్స్ ముందుకొచ్చిన తరుణ్ భాస్కర్ ఈసారి వాళ్ళ పల్స్ పట్టుకోవడంలో తడబడ్డాడు. అంటే పూర్తిగా కాదు గాని, తన మార్క్ చూపించడంలో తడబడ్డాడు. అయితే సినిమాలో దరహాస్‌ గా నటించిన తరుణ్‌ భాస్కర్‌ తన పెర్ఫార్మన్స్ వరకు బానే ఇచ్చాడు. కానీ ఆడియన్స్ ఇంకా ఎక్స్పెక్ట్ చేసారు. ఫరియా అబ్దుల్లా కూడా శాలిని పాత్రకు న్యాయం చేసింది. అక్కడక్కడా కాస్త ఓవర్‌గా అనిపిస్తుంది. మానస చౌదరి కనిపించింది రెండు మూడు సీన్లలోనే అయినా మెప్పించింది. 


ఇక సినిమాకు ఎంతో కీలకమైన పాత్రగా చెప్పుకొన్న జెడి చక్రవర్తి పాత్ర డిజైన్‌ బాగానే ఉంది. కానీ ప్రమోషన్స్‌లో ఆయన చెప్పినంతగా ఆ పాత్రలో ఏమీ లేదు. దర్శకుడు కూడా ఈ చిత్రంలో ఓ పాత్ర పోషించారు. యాక్టింగ్‌ లోనూ డైలాగ్‌ డెలివరీలోనూ ఆయనకు పేరు పెట్టక్కర్లేదు. భైరవ్‌ గా శ్రీవిష్ణు ఓ తాంత్రికుడిగా కనిపించారు. ఆ పాత్రకు న్యాయం చేశారు. విద్యాసాగర్‌ చింతా సినిమాటోగ్రఫీ బావుంది. నేపథ్య సంగీతం అలరించింది. అయితే వినోదాన్ని కోరుకునే వారికి మాత్రం ఈ సినిమా కాస్త ఊరటను ఇస్తుంది. అంతకుమించి ఎక్స్‌పెక్ట్‌ చేయడానికి ఈ సినిమాలో ఏమీ లేదు. ఇందులో శ్రీవిష్ణు పోషించిన పాత్రను కంటిన్యూ చేస్తూ 'పోరాడే సింహం' టైటిల్‌తో సీక్వెల్‌ ప్లాన్‌ చేసినట్లు లీడ్‌ ఇచ్చారు. కానీ ఆ అవకాశం దర్శక నిర్మాతలకు ప్రేక్షకులు ఇవ్వకపోవచ్చు.


May 01, 2026 Read Review
Filmi Beat
Filmi Beat Website
6

Above Average

Gayapadda Simham Movie Review

తరుణ్ భాస్కర్ నటించిన గాయపడ్డ సింహం థియేటర్లలో మిక్స్డ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. కథా, కథనాలు రొటీన్ గానే ఉన్నా, డైరెక్టర్ జనరంజకంగా తెరకెక్కించడానికి ట్రై చేసాడు. అయితే సినిమాలో కథనంలో వేగం లేకపోవడంతో కాస్త నెమ్మదిగా కథలోకి వెళ్లినట్టు అనిపిస్తుంది. ఎప్పుడైతే బ్రూటల్ ధర్మ క్యారెక్టర్ ఎంట్రీ ఇస్తుందో...

తరుణ్ భాస్కర్ నటించిన గాయపడ్డ సింహం థియేటర్లలో మిక్స్డ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. కథా, కథనాలు రొటీన్ గానే ఉన్నా, డైరెక్టర్ జనరంజకంగా తెరకెక్కించడానికి ట్రై చేసాడు. అయితే సినిమాలో కథనంలో వేగం లేకపోవడంతో కాస్త నెమ్మదిగా కథలోకి వెళ్లినట్టు అనిపిస్తుంది. ఎప్పుడైతే బ్రూటల్ ధర్మ క్యారెక్టర్ ఎంట్రీ ఇస్తుందో అప్పటి నుంచి కథలో వేగంగా కదలికలు చోటు చేసుకొని రకరకాల ట్విస్టులతో ప్రేక్షకుడిని ఎంగేజ్ చేసిన తీరు బాగుంటుంది. ఇక భైరవ దాస్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత సినిమా మరింత ఊపందుకుంది. 


అలాగే కథలో భాగంగా క్లైమాక్స్‌ను ముగించిన తీరు ఫీల్ గుడ్‌గా ఉంటుంది. అలాగే పార్ట్ 2 సినిమాకు పోరాట సింహం అంటూ శ్రీవిష్ణు క్యారెక్టర్‌ కు ఇచ్చిన లీడ్ బాగుంది. ఓవరాల్‌ గా చిన్న పాయింట్‌ను లాగి లాగి కథను నడిపించినా.. దర్శకుడు కశ్యప్ శ్రీనివాస్ కంటెంట్ మీద పెట్టిన శ్రద్ద ప్రతీ ఫ్రేమ్‌లోను కనిపిస్తుంంది. ఈ సినిమాకు విద్యా సాగర్ చింతా సినిమాటోగ్రఫి స్టోరీ మూడ్‌ ను, క్యారెక్టర్ల ఇంపాక్ట్‌ ను బాగా క్రియేట్ చేసింది. ఓవరాల్ గా ఈ వారం చూడాల్సిన సినిమాల జాబితాలో గాయపడ్డ సింహాం సినిమాను చేర్చుకోవచ్చు. వినోదంతోపాటు యాక్టర్ల పెర్ఫార్మెన్స్‌ను బాగా ఎంజాయ్ చేయడానికి అవకాశం ఉంది.

May 01, 2026 Read Review
Great Andhra
Great Andhra Website
4

Below Average

Gayapadda Simham Movie Review

తరుణ్ భాస్కర్, మానస చౌదరి, ఫరియా అబ్దుల్లా ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ‘గాయపడ్డ సింహం’ సినిమా తాజాగా థియేటర్లలోకి రాగా… ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. మెయిన్ లీడ్ లో నటించిన తరుణ్ భాస్కర్, కీ రోల్ చేసిన శ్రీ విష్ణు ఎవరి స్టైల్ లో వాళ్ళు బానే నటించారు. ఎంటర్టైన్ చేయడానికి సినిమా మొ...

తరుణ్ భాస్కర్, మానస చౌదరి, ఫరియా అబ్దుల్లా ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ‘గాయపడ్డ సింహం’ సినిమా తాజాగా థియేటర్లలోకి రాగా… ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. మెయిన్ లీడ్ లో నటించిన తరుణ్ భాస్కర్, కీ రోల్ చేసిన శ్రీ విష్ణు ఎవరి స్టైల్ లో వాళ్ళు బానే నటించారు. ఎంటర్టైన్ చేయడానికి సినిమా మొత్తం ట్రై చేస్తారు. కానీ ఎక్కడో కాస్త బెడిసికొట్టింది. ఇక జెడి చక్రవర్తి సినిమాలో ఉన్నంత వరకు బెస్ట్ ఇచ్చాడు. అలాగే సినిమా రిలీజ్ టైం లో ఆయన చేసిన ప్రమోషన్స్ మెచ్చుకుతీరాలి. 


ఇటు కంటెంట్ లో ట్రంప్ పై క్రియేట్ చేసిన కామెడీ సీన్లకు మంచి ఫన్ జనరేట్ అవుతుంది. ఓవరాల్ గా గాయపడ్డ సింహం ఈ సమ్మర్ లో నవనవలాడే మామిడిపండులా అనిపిస్తున్నా, ఆడియన్స్ కి కాస్త పులుపు ఫీలింగ్ నే ఇచ్చింది. సింపుల్ గా చెప్పాలంటే ఇది గాయపడ్డ సింహం అనుకుంటే, సినిమా వరకు గాయపడ్డ కథగా మారింది. 

May 01, 2026 Read Review
Gulte
Gulte Website
5

Average

Gayapadda Simham Movie Review

తరుణ్ భాస్కర్, మానస చౌదరి, ఫరియా అబ్దుల్లా ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ‘గాయపడ్డ సింహం’ సినిమా తాజాగా థియేటర్లలోకి రాగా… ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. దర్శకుడు Kashyap Srinivas తీసుకున్న కథ, స్క్రీన్‌ ప్లే పూర్తిగా రొటీన్‌ గా ఉండి పెద్దగా ఇంపాక్ట్ ఇవ్వలేకపోయాయి. సినిమాలో కొన్ని కా...

తరుణ్ భాస్కర్, మానస చౌదరి, ఫరియా అబ్దుల్లా ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ‘గాయపడ్డ సింహం’ సినిమా తాజాగా థియేటర్లలోకి రాగా… ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. దర్శకుడు Kashyap Srinivas తీసుకున్న కథ, స్క్రీన్‌ ప్లే పూర్తిగా రొటీన్‌ గా ఉండి పెద్దగా ఇంపాక్ట్ ఇవ్వలేకపోయాయి. సినిమాలో కొన్ని కామెడీ సీన్స్, ముఖ్యంగా Sree Vishnu గెస్ట్ రోల్ ఉన్న ట్రాక్ కాస్త రిలీఫ్ ఇచ్చినా… అవి కూడా మొత్తం సినిమాను మోసేంత బలం చూపించలేకపోయాయి. కథలో కొత్తదనం లేకపోవడం, సింపుల్ స్టోరీని కూడా ఆసక్తికరంగా చెప్పలేకపోవడం పెద్ద మైనస్‌గా మారింది.


టెక్నికల్‌ గా ప్రొడక్షన్ వాల్యూస్ ఓకే అనిపించినా… సంగీతం పెద్దగా ప్రభావం చూపలేదు. అలాగే సాగదీత సీన్స్ ఎక్కువగా ఉండటం వల్ల సినిమా బోర్ ఫీల్ కలిగిస్తుంది. ఎడిటింగ్‌లో ఇంకా కట్స్ అవసరమనే ఫీలింగ్ వస్తుంది. ఓవరాల్ గా ‘గాయపడ్డ సింహం’ = Routine story + slow narration! కొన్ని కామెడీ సీన్స్ తప్ప… సినిమా మొత్తంగా డిసప్పాయింట్ చేస్తుంది. కొత్తదనం ఆశించే వారికి ఇది పూర్తిగా మిస్ అయ్యే అవకాశం ఉంది.

May 01, 2026 Read Review
123telugu
123telugu Website
6

Above Average

GayapaddaSimham Movie Review

తరుణ్ భాస్కర్, మానస చౌదరి, ఫరియా అబ్దుల్లా హీరో, హీరోయిన్లుగా నటించిన సినిమా గాయపడ్డ సింహం. తాజాగా థియేటర్లలో విడుదలైన ఈ సినిమాను కశ్యప్ శ్రీనివాస్ డైరెక్ట్ చేయగా, శ్రీవిష్ణు గెస్ట్ రోల్ లో నటించాడు. ఇక సినిమా విషయానికి వస్తే.. కథ స్క్రీన్ ప్లే రొటీన్ గా ఉండి కాస్త డిస్సపాయింట్ చేయగా... సినిమాలో ట్ర...

తరుణ్ భాస్కర్, మానస చౌదరి, ఫరియా అబ్దుల్లా హీరో, హీరోయిన్లుగా నటించిన సినిమా గాయపడ్డ సింహం. తాజాగా థియేటర్లలో విడుదలైన ఈ సినిమాను కశ్యప్ శ్రీనివాస్ డైరెక్ట్ చేయగా, శ్రీవిష్ణు గెస్ట్ రోల్ లో నటించాడు. ఇక సినిమా విషయానికి వస్తే.. కథ స్క్రీన్ ప్లే రొటీన్ గా ఉండి కాస్త డిస్సపాయింట్ చేయగా... సినిమాలో ట్రంప్ – శ్రీవిష్ణు ట్రాక్స్ అండ్ కొన్ని కామెడీ సీన్స్ బాగున్నాయి. నటీనటుల నటన కూడా బాగానే ఉంది. ఐతే, కొన్ని రెగ్యులర్ సీన్స్ అండ్ సింపుల్ స్టోరీ వంటి అంశాలు సినిమాకి మైనస్ అయ్యాయి. 


ఇక ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయ్. సంగీతం పర్లేదు. సాగదీత సీన్లు ఎడిట్ చేయాల్సింది. అయితే ఓవరాల్ గా ఈ గాయపడ్డ సింహం సినిమాలో కామెడీ ఎలిమెంట్స్ మాత్రమే ఆడియన్స్ కి కనెక్ట్ అవుతాయి. థియేటర్లలో ఒకసారి రెగ్యులర్ మూవీ లవర్స్ చూసేయొచ్చు. కానీ కొత్తదనం కోరుకునే వారికీ కనెక్ట్ అయ్యే ఛాన్స్ లేదు.

May 02, 2026 Read Review

Public Reviews

Avg: —

No public reviews yet.

About This Movie

Story : కథ విషయానికి వస్తే... ఎథికల్ హ్యాకర్ గా పనిచేసే దరహాస్ (తరుణ్ భాస్కర్) గాయత్రి (మానస చౌదరీ)తో ప్రేమలో పడుతాడు. అయితే అమెరికాలో సెటిల్ అయితేనే కూతుర్ని ఇచ్చి పెళ్ళిచేస్తానని గాయత్రి తండ్రి దరహాస్ కి కండిషన్ పెడతాడు. దీంతో ఎలాగైనా అమెరికాలో సెటిల్ అవ్వాలని దరహాస్ ప్రయత్నాలు చేయగా, అక్కడికి ఎలాగో వెళ్లినప్పటికీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొన్ని విధానాల వల్ల దరహాస్‌ ను ఎయిర్ పోర్ట్ నుండే తిరిగి పంపించేస్తారు. దాంతో లవ్ బ్రేకప్ అయిన దరహాస్ ట్రంప్ పై పగదీర్చుకోవాలని ప్లాన్ వేస్తాడు. మరి దరహాస్ అనుకున్న పని జరిగిందా? మధ్యలో ధర్మ (జెడి చక్రవర్తి) పాత్రేంటి? భైరవ్ దాస్ తో (శ్రీవిష్ణు) దరహాస్ ఏం చేయించాడు. ఈ ప్రయత్నాల్లో దరహాస్ లైఫ్ లోకి శాలిని (ఫరియా అబ్దుల్లా) ఎలా వచ్చింది. మరి దరహాస్ అనుకున్న ప్రయత్నాలు జరిగాయా లేదా? అనేది మిగిలిన కథ.


పక్కా ఎంటర్టైన్మెంట్ జోన్ లో తెరకెక్కిన ఈ మూవీ ఆడియన్స్ ని నవ్వించే విషయంలో మేకర్స్ కొంతవరకు సక్సెస్ అయ్యారని చెప్పాలి. సినిమాలో తరుణ్ భాస్కర్ తన మార్క్ పంచ్ డైలాగ్స్ తో ఎప్పట్లాగే ఎనర్జిటిక్ గా నటించాడు. అలాగే గెస్ట్ అప్పీరెన్స్ ఇచ్చిన శ్రీవిష్ణు కూడా తన రోల్ లో బాగానే కామెడీ పండించాడు. తరుణ్ భాస్కర్ తో కామెడీ ట్రాక్ మంచి ప్లస్ అయింది. ఇక హీరోయిన్లుగా నటించిన ఫరియా అబ్దుల్లా, మానస చౌదరీ వాళ్ళ స్క్రీన్ ప్రెజెన్స్ తో ఆడియన్స్ ని ఇంప్రెస్ చేసారు. అలాగే జె.డి.చక్రవర్తి, శుభలేఖ సుధాకర్ కీ రోల్స్ లో వాళ్ళ సీనియారిటీకి పదును పెట్టారు. అలాగే దర్శకుడిగానే కాకుండా సినిమాలో హీరో ఫ్రెండ్ గా నటించిన కశ్యప్ శ్రీనివాస్, అలాగే హర్షవర్ధన్ వాళ్ళ పాత్రల పరిధిమేరకు బాగానే నటించారు. 


అయితే దరహాస్ పాత్రను, శ్రీవిష్ణు కీ గెస్ట్ రోల్ పాత్రల్ని బాగానే రాసుకున్న దర్శకుడు కశ్యప్ శ్రీనివాస్ మిగతా పాత్రల్ని అంత ఎంటర్టైనింగ్ గా తెరకెక్కించలేకపోయాడు. అలాగే కథా కథనాలు ఇంకాస్త స్ట్రాంగ్ గా రాసుకొని ఉండాల్సింది. అలాగే సీన్ కి మరో సీన్ కి పొంతన లేక ఆడియన్స్ కన్ఫ్యూజ్ అవుతారు. అలాగే హీరోకి బలమైన ప్రత్యర్థి ఉంటే మరింత ఇంట్రెస్టింగ్ గా ఉండేది. ఇక స్వీకర్ అగస్తి అందించిన సంగీతం పర్లేదు. కొన్ని సాగదీత సీన్లు ఎడిట్ చేయాల్సింది. ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా ఉన్నాయి. 


Final Review : ఓవరాల్ గా "గాయపడ్డ సింహం" అంటూ వచ్చిన ఈ కామెడీ ఎంటర్టైనర్ లో తరుణ్ భాస్కర్, శ్రీ విష్ణు కామిక్ డైమింగ్స్ మినహా ఏవి పెద్దగా మెప్పించలేకపోయాయి. రెగ్యులర్ కామెడీ మూవీ లవర్స్ ఒకసారి చూసేలా మూవీ ఉంటుంది గాని, కొత్తదనం కోరుకుంటే మాత్రం నిరాశ తప్పదు. 

Review Statistics

5.3
Overall Rating
Avg. of all reviews
20
Total Reviews
From 4 Provider Types

Review Average

Media
5.3/10
Public
N/A
Why MRO?