Register as a Reviewer
గోదారి గట్టుపైన (Godari Gattupaina)

గోదారి గట్టుపైన (Godari Gattupaina)

08 May 2026
Overall Rating
5.2/10
21 Reviews

మేం ఫేమస్ ఫేమ్ సుమంత్ ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘గోదారి గట్టుపైన’. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో లవ్ అండ్ ఫ్యామిలీ స్టోరీగా తెరకెక్కిన ఈ మూవీ సుభాష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కింది. జగపతి బాబు ప్రత్యేక పాత్రలో నటించిన ఈ సినిమాలో నిధి ప్రదీప్ హీరోయిన్ గా నటించగా తాజాగా థియేటర్లలో విడుదలైంది.

Director: Subash Chandra
Cast: Sumanth Prabhas, Nidhi Pradeep, Jagapathibabu, Laila, Deviprasad and others

Available in:

Reviews

What critics and the public are saying about గోదారి గట్టుపైన (Godari Gattupaina)

Media Reviews

15 Avg: 5.1/10
Cinema Picha
Cinema Picha Youtube Channel
6

Above Average

Godari Gattupaina movie Review

‘గోదారి గట్టుపైన’ టైటిల్ చూసి… గోదావరి బ్యాక్‌డ్రాప్‌లో ఓ feel-good లవ్ స్టోరీ, గట్టిగా connect అయ్యే ఎమోషన్స్ ఉంటాయనుకుంటే… థియేటర్లో మాత్రం సీన్ కాస్త రివర్స్ అవుతుంది బాస్! సినిమా మొత్తం చూస్తుంటే దర్శకుడు కథ కంటే విజువల్స్ మీదే ఎక్కువ ప్రేమ పెట్టినట్టు కనిపిస్తుంది. సినిమాకి సింప్లిసిటీ చాలా ప్ల...

‘గోదారి గట్టుపైన’ టైటిల్ చూసి… గోదావరి బ్యాక్‌డ్రాప్‌లో ఓ feel-good లవ్ స్టోరీ, గట్టిగా connect అయ్యే ఎమోషన్స్ ఉంటాయనుకుంటే… థియేటర్లో మాత్రం సీన్ కాస్త రివర్స్ అవుతుంది బాస్! సినిమా మొత్తం చూస్తుంటే దర్శకుడు కథ కంటే విజువల్స్ మీదే ఎక్కువ ప్రేమ పెట్టినట్టు కనిపిస్తుంది. సినిమాకి సింప్లిసిటీ చాలా ప్లస్ అయింది. స్పెషల్లీ గోదావరి అందాలు, పల్లెటూరి వాతావరణం మాత్రం స్క్రీన్ మీద అదిరిపోతాయి. సినిమాలో సుదర్శన్ కామెడీ హైలెట్ అవుతుంది. 


ఇక సినిమాలో మైనస్ పాయింట్ మెయిన్ గా చెప్పాలంటే స్టోరీ. చాలా సింపుల్ గా తెలిసిన సీన్లే ఉంటాయి. పెర్ఫార్మన్స్ గురించి మాట్లాడుకుంటే జగపతి బాబు రోల్ బిగ్ ప్లస్. హీరోహీరోయిన్లు కూడా డీసెంట్ గా ఆక్ట్ చేసారు. మ్యూజిక్ డీసెంట్ గా అనిపించింది. ఫన్ కూడా మెజారిటీ వర్కౌట్ అయేలా ఉంది. సో ఓవరాల్ గా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా చూస్తే డీసెంట్ వాచబుల్ ఫీల్ వస్తుంది. 

May 08, 2026 Read Review
Thyview
Thyview Youtube Channel
5

Average

Godari Gattupaina Movie Review

గోదారి గట్టుపైన’ సినిమా చూసాక ముందు రివ్యూ సింపుల్ గా చెప్పాలంటే నచ్చలేదు బ్రో. మొత్తం అవుట్ డేటెడ్ మూవీ స్టోరీ. బట్ గోదావరి visuals అంత బాగా చూపించినందుకు డైరెక్టర్ సుభాష్ చంద్రని అభినందించాలి. అసలు సినిమా కథ గురించి కాకుండా టైటిల్ గురించి మాట్లాడుకుంటే గోదారి గట్టుపైన అంటూ టైటిల్ పెట్టినప్పుడు ఆ ట...

గోదారి గట్టుపైన’ సినిమా చూసాక ముందు రివ్యూ సింపుల్ గా చెప్పాలంటే నచ్చలేదు బ్రో. మొత్తం అవుట్ డేటెడ్ మూవీ స్టోరీ. బట్ గోదావరి visuals అంత బాగా చూపించినందుకు డైరెక్టర్ సుభాష్ చంద్రని అభినందించాలి. అసలు సినిమా కథ గురించి కాకుండా టైటిల్ గురించి మాట్లాడుకుంటే గోదారి గట్టుపైన అంటూ టైటిల్ పెట్టినప్పుడు ఆ టైటిల్ కి జస్టిఫై చేయాలి. బట్ అది జరగలేదు. సినిమాలో కూడా గోదావరి కాస్ట్ ని చూస్తున్నాం అని కాకుండా, సినిమా కాస్ట్ ని చూస్తున్న ఫీలింగే వస్తుంది. అంటే సహజత్వం లేదన్నమాట.


లైలా లాంటి ఆర్టిస్టులకు స్ట్రాంగ్ రోల్స్ కూడా ఇవ్వలేదు. సినిమాలో కామెడికి స్కోప్ ఉన్నా, ఎక్కడా వాడలేదు. పెర్ఫార్మన్స్ వరకు సుమంత్ ప్రభాస్ decent గా చేశాడు. Jagapathi Babu కి importance ఇచ్చారు కానీ… ఆ character నుంచి audience expect చేసే emotional impact మాత్రం రావడం లేదు. Overall గా చెప్పాలంటే… ‘గోదారి గట్టుపైన’ ఒక beautiful looking village love story. కానీ heart touching cinema అవ్వాల్సింది… slow and routine experience గా మారిపోయింది. అందువల్ల డిస్సపాయింట్ చేసింది. 

May 08, 2026 Watch
Man of Fiction
Man of Fiction Youtube Channel
5

Average

Godari Gattupaina movie Review

‘గోదారి గట్టుపైన’ అనే టైటిల్ వింటే… గోదావరి ఒడ్డున ఓ అందమైన ప్రేమకథ, మనసుకు హత్తుకునే ఎమోషన్స్, పల్లెటూరి నేటివిటీ ఇలా చాలా ఎక్స్‌పెక్టేషన్స్ వస్తాయి. సినిమా మొదలైన కొద్దిసేపు ఆ ఫీల్ కూడా ఉంటుంది. విజువల్స్, గోదావరి బ్యాక్‌డ్రాప్, పాత్రల సెటప్ ఇవన్నీ చూసి “ఏదో మంచి ఫీల్ గుడ్ మూవీ చూడబోతున్నామేమో” అన...

‘గోదారి గట్టుపైన’ అనే టైటిల్ వింటే… గోదావరి ఒడ్డున ఓ అందమైన ప్రేమకథ, మనసుకు హత్తుకునే ఎమోషన్స్, పల్లెటూరి నేటివిటీ ఇలా చాలా ఎక్స్‌పెక్టేషన్స్ వస్తాయి. సినిమా మొదలైన కొద్దిసేపు ఆ ఫీల్ కూడా ఉంటుంది. విజువల్స్, గోదావరి బ్యాక్‌డ్రాప్, పాత్రల సెటప్ ఇవన్నీ చూసి “ఏదో మంచి ఫీల్ గుడ్ మూవీ చూడబోతున్నామేమో” అనిపిస్తుంది. కానీ సినిమా ముందుకు వెళ్లేకొద్దీ ఆ ఫీల్ మెల్లగా తగ్గిపోతుంది.


సింపుల్ గా చెప్పాలంటే నిబ్బా నిబ్బి కలుసుకుంటారు, కొట్లాడుకుంటారు, తర్వాత లవ్...ఇక ఫ్యామిలీ ట్విస్ట్.. అమ్మో, అయ్యో అడ్డం వస్తారు. ఇంకేముంది కలుస్తారా? లేదా? అంతే కథ. వెయ్యి సినిమాల్లో ఇలాంటి స్టోరీలు చూసాం.. ప్రతి సీన్ కూడా మనం ఈజీగా గెస్ చేస్తాం.. బట్ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యేలా ఒక్క సీన్ ఉండదు. ఇక సాంగ్స్ కూడా ఆగం పట్టించినయి. ఓవరాల్ గా ‘గోదారి గట్టుపైన’ మంచి ప్రయత్నమే… కానీ థియేటర్లో గట్టిగా నిలబడేంత బలం మాత్రం సినిమాలో కనిపించదు. ఇక డెసిషన్ మీ పైనే ఉంది. 

May 08, 2026 Watch
Barbell Pitch Meeting
Barbell Pitch Meeting Youtube Channel
5

Average

Godari Gattupaina movie Review

సుమంత్ ప్రభాస్ హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ ‘గోదారి గట్టుపైన’ సినిమా గురించి సింపుల్ గా చెప్పాలంటే అవుట్ డేటెడ్ ఇల్లాజికల్. ఈ సినిమా ఒక 40 ఇయర్స్ కిందట రిలీజ్ అయి ఉండాల్సిన సినిమా. అలాంటి ఈ సినిమాలో ఏదైనా ఒక కొత్త పాయింట్ కొంచెమైనా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తే... ఏం లేదు.. అంతా తెలిసిన సినిమాలే.. కాకప...

సుమంత్ ప్రభాస్ హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ ‘గోదారి గట్టుపైన’ సినిమా గురించి సింపుల్ గా చెప్పాలంటే అవుట్ డేటెడ్ ఇల్లాజికల్. ఈ సినిమా ఒక 40 ఇయర్స్ కిందట రిలీజ్ అయి ఉండాల్సిన సినిమా. అలాంటి ఈ సినిమాలో ఏదైనా ఒక కొత్త పాయింట్ కొంచెమైనా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తే... ఏం లేదు.. అంతా తెలిసిన సినిమాలే.. కాకపోతే "గోదారి గట్టుపైన" టైటిల్ ఎక్స్పెక్ట్ చేసి ఇంకేదో ఉంటుందని ఆడియన్స్ అనుకుంటే అది కూడా ఏం లేదు. ఒక సరైన లవ్ లేదు, ఫామిలీ డ్రామా లేదు, కనీసం కామెడీ కూడా లేదు. 


ఇక క్రింజు సీన్లకు కొదవలేదు. హీరో హీరోయిన్లు కొట్టుకుంటారు, అపార్ధాలు... జాలి.. దెబ్బకు లవ్ లో పడిపోతారు.. అంతే దీనికి తోడు హీరో హీరోయిన్లు వేరే కాస్ట్. ఈ కాన్సెప్ట్ తో వందల సినిమాలొచ్చాయి. అదే రొట్టని డైరెక్టర్ మళ్ళీ దించాడు. ఎంతో కొంత గోదారి అందాల్ని చూద్దామనుకున్న ఆడియన్స్ ఎంతో కొంత రిలాక్స్ అవుతారు. టెక్నికల్‌గా మూవీ కొంత నీట్ గా ఉంటుంది. కెమెరా వర్క్ చాలా బాగుంది. గోదావరి అందాలు మాత్రం స్క్రీన్ మీద అందంగా కనిపిస్తాయి. కానీ అందమైన విజువల్స్‌తో మాత్రమే సినిమా నిలబడదు కదా బాస్! మొత్తానికి ‘గోదారి గట్టుపైన’ అంటే భారీ ఎమోషనల్ జర్నీ అనుకుంటే… థియేటర్లో మాత్రం స్లో బోట్ రైడ్‌లా అనిపించే ఛాన్స్ ఎక్కువ.

May 08, 2026 Watch
10TV Telugu
10TV Telugu News Channel
6

Above Average

Godari Gattupaina Movie Review

సుమంత్ ప్రభాస్, నిధి ప్రదీప్ జంటగా తెరకెక్కిన సినిమా గోదారి గట్టుపైన. రెడ్ పప్పెట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై అభినవ్ రావు నిర్మాణంలో సుభాష్ చంద్ర దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. తాజాగా థియేటర్లలో విడుదలైన ఈ సినిమా డీసెంట్ టాక్ తెచ్చుకుంది. కథ పరంగా పెద్దగా చెప్పుకొనేలా లేకపోయినా, గోదావరి అందాలు, నేట...

సుమంత్ ప్రభాస్, నిధి ప్రదీప్ జంటగా తెరకెక్కిన సినిమా గోదారి గట్టుపైన. రెడ్ పప్పెట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై అభినవ్ రావు నిర్మాణంలో సుభాష్ చంద్ర దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. తాజాగా థియేటర్లలో విడుదలైన ఈ సినిమా డీసెంట్ టాక్ తెచ్చుకుంది. కథ పరంగా పెద్దగా చెప్పుకొనేలా లేకపోయినా, గోదావరి అందాలు, నేటివిటీ ఆకట్టుకునేలా ఉన్నాయి. సినిమాటోగ్రఫీ విజువల్స్ చాలా అందంగా ఉన్నాయి. పాటలు పర్వాలేదనిపిస్తాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది. 


మొత్తంగా ‘గోదారి గట్టుపైన’ సినిమా చుట్టుపక్కల జరిగే ఓ ఆటో డ్రైవర్ – కాలేజీ స్టూడెంట్ ప్రేమకథకి తండ్రి ఎమోషన్ జోడించి తెరకెక్కిన సినిమాగా ఒక వర్గం ఆడియన్స్ కి కనెక్ట్ అవచ్చు. అయితే రెగ్యులర్ మూవీ లవర్స్ ని ఆకట్టుకోవచ్చు గాని, కొత్తదనం కోరుకునే ఆడియన్స్ ని నిరాశపరచవచ్చు.


May 08, 2026 Read Review
NTV Telugu
NTV Telugu News Channel
5

Average

Godari Gattupaina movie Review

గోదావరి తీరం… పల్లెటూరి ప్రేమ… అందమైన విజువల్స్… ఇలా చూసుకుంటే ‘గోదారి గట్టుపైన’ మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీలా అనిపిస్తుంది. కానీ థియేటర్లో సినిమా చూసిన తర్వాత మాత్రం ఆ ఫీల్ ఎక్కువసేపు నిలబడదు. దర్శకుడు సుభాష్ చంద్ర మంచి వాతావరణాన్ని క్రియేట్ చేసినా… దానికి సరిపోయే బలమైన కథనాన్ని ఇవ్వలేకపోయాడు. సుమంత్...

గోదావరి తీరం… పల్లెటూరి ప్రేమ… అందమైన విజువల్స్… ఇలా చూసుకుంటే ‘గోదారి గట్టుపైన’ మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీలా అనిపిస్తుంది. కానీ థియేటర్లో సినిమా చూసిన తర్వాత మాత్రం ఆ ఫీల్ ఎక్కువసేపు నిలబడదు. దర్శకుడు సుభాష్ చంద్ర మంచి వాతావరణాన్ని క్రియేట్ చేసినా… దానికి సరిపోయే బలమైన కథనాన్ని ఇవ్వలేకపోయాడు. సుమంత్ ప్రభాస్, నిధి ప్రదీప్ తమ పాత్రల్లో ఓకే అనిపిస్తారు. జగపతిబాబు పాత్రకు కథలో మంచి వెయిట్ ఉంది. 


సినిమాలో గోదావరి విజువల్స్ చాలా బాగున్నయి. అయితే బాగున్నంత మాత్రాన ప్రేక్షకుడు కనెక్ట్ అవ్వడు. కథలో కొత్తదనం, స్క్రీన్‌ప్లే లో గ్రిప్ లేకపోవడం సినిమాను వెనక్కి లాగాయి.

మొత్తంగా ‘గోదారి గట్టుపైన’ ఓ అందమైన గ్రామీణ ప్రేమకథలా కనిపించినా… థియేటర్లో మాత్రం ఆ మ్యాజిక్ పూర్తిగా వర్కౌట్ కాలేదు. ప్రేమకథలు ఇష్టపడే వారికి కొంతవరకు నచ్చొచ్చు గానీ, మిగతా ఆడియెన్స్‌ కు మాత్రం ఇది ఓ స్లో అండ్ రొటీన్ ఎక్స్‌పీరియెన్స్‌లా అనిపించే ఛాన్స్ ఉంది.

May 08, 2026 Read Review
One India
One India Website
5

Average

Godari Gattupaina movie Review

ఈ ఏడాది వేసవి బాక్సాఫీస్ వద్ద పెద్ద హీరోల సందడి లేక వెలవెలబోతోంది. ఈ గ్యాప్‌ను క్యాష్ చేసుకునేందుకు చిన్న చిత్రాలు క్యూ కడుతున్నాయి. ఈ క్రమంలో 'మేమ్ ఫేమస్' చిత్రంతో యూత్‌ లో మంచి క్రేజ్ సంపాదించుకున్న సుమంత్ ప్రభాస్ హీరోగా లేటెస్ట్ గా గోదావరి నేపథ్యంతో 'గోదారి గట్టుపైన' అనే సినిమాతో వచ్చాడు. సినిమాక...

ఈ ఏడాది వేసవి బాక్సాఫీస్ వద్ద పెద్ద హీరోల సందడి లేక వెలవెలబోతోంది. ఈ గ్యాప్‌ను క్యాష్ చేసుకునేందుకు చిన్న చిత్రాలు క్యూ కడుతున్నాయి. ఈ క్రమంలో 'మేమ్ ఫేమస్' చిత్రంతో యూత్‌ లో మంచి క్రేజ్ సంపాదించుకున్న సుమంత్ ప్రభాస్ హీరోగా లేటెస్ట్ గా గోదావరి నేపథ్యంతో 'గోదారి గట్టుపైన' అనే సినిమాతో వచ్చాడు. సినిమాకి సంబంధించి పెద్దగా కథా కథనాల గురించి చెప్పాల్సిన అవసరం లేదు. దర్శకుడు ఎంచుకున్న పల్లెటూరి నేపథ్యం సినిమాకు అతిపెద్ద బలం. 


గోదారి గట్టు, పచ్చని పొలాలు, ఆ యాసలో ఉండే తీయదనం ప్రేక్షకులకు ఒక మంచి ఫీల్‌ ను అందిస్తాయి. ప్రథమార్ధంలో హీరో, హీరోయిన్ల మధ్య సాగే లవ్ ట్రాక్ క్యూట్‌ గా ఉన్నప్పటికీ, కథనం నెమ్మదిగా సాగడం కాస్త అసహనానికి గురిచేస్తుంది. ముఖ్యంగా కొన్ని సన్నివేశాలు సాగదీసినట్టుగా అనిపించి, టీవీ సీరియల్స్‌ను గుర్తుకు తెస్తాయి. ఇంకా చెప్పాలంటే.. ఊహకు అందే పాత కథాంశం, నెమ్మదిగా సాగే ప్రథమార్ధం, అలాగే సాగదీత సీన్లతో ఆడియన్స్ కి బోర్ ఫీల్ వస్తుంది. ఓవరాల్ గా ఈ 'గోదారి గట్టుపైన' చిత్రం పక్కా గ్రామీణ ప్రేమకథగా ఒకసారి ఈ కూల్ ఎమోషనల్ డ్రామా చూడాలనుకునే వారికి ఇది మంచి ఛాయిస్!


May 08, 2026 Read Review
ABP Desam
ABP Desam Website
5

Average

Godari Gattupaina Movie Review

ప్రేమ కథలకు నేపథ్యం కంటే బలమైన భావోద్వేగాలు, ముఖ్యంగా హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ కీలకం. దాంతో పాటు కథనంలో బలం ఉంటే హీరో హీరోయిన్లు తమ నటనతో ప్రేక్షకులు ఆ ప్రేమను ఆస్వాదించేలా చేయగలరు. 'గోదారి గట్టుపైన' మూవీలో బ్యాక్‌డ్రాప్ బావుంది, కానీ, కథ కొత్తగా లేదు & బాలేదు. సుభాష్ చంద్ర రచనలో బలం తక్కు...

ప్రేమ కథలకు నేపథ్యం కంటే బలమైన భావోద్వేగాలు, ముఖ్యంగా హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ కీలకం. దాంతో పాటు కథనంలో బలం ఉంటే హీరో హీరోయిన్లు తమ నటనతో ప్రేక్షకులు ఆ ప్రేమను ఆస్వాదించేలా చేయగలరు. 'గోదారి గట్టుపైన' మూవీలో బ్యాక్‌డ్రాప్ బావుంది, కానీ, కథ కొత్తగా లేదు & బాలేదు. సుభాష్ చంద్ర రచనలో బలం తక్కువైనా... విజువల్స్ పరంగా మెప్పించే ప్రయత్నం చేశారు. ఇక పల్లెటూరి ఆటో డ్రైవర్ పాత్రలో సుమంత్ ప్రభాస్ చక్కగా నటించాడు. కొత్తమ్మాయి నిధి ప్రదీప్ నటన పరంగా కాస్త మెరుగు పడాలి.


అలాగే సినిమాలో సరైన కామెడీ సీన్లు కుదరలేదు. దాంతో బోరింగ్ మూమెంట్స్ చాలా వచ్చి వెళ్లాయి. ఇక కెమెరా వర్క్ మరియు 'బంగారు బొమ్మ' సాంగ్ బావున్నాయి. కానీ, కథలో బలం లేదు. సన్నివేశాల్లో స్ట్రాంగ్ ఎమోషన్స్, కాన్‌ఫ్లిక్ట్ మిస్ అయ్యాయి. ఆర్ఆర్ బాలేదు. అందువల్ల, రెండున్నర గంటల సినిమాను చూడటానికి ఓపిక అవసరం. ఓవరాల్ గా సినిమా ఆశించిన రేంజ్ లో మెప్పించలేదు.

May 08, 2026 Read Review
5

Average

Godari Gattupaina movie Review

`మేమ్‌ ఫేమస్‌`తో దర్శకుడిగా, హీరోగా ఆకట్టుకున్న సుమంత్‌ ప్రభాస్‌ కొంత గ్యాప్‌తో `గోదారి గట్టుపైన` అనే చిత్రంలో హీరోగా నటించాడు. సుభాష్‌ చంద్ర దర్శకత్వం వహించిన ఈ మూవీలో జగపతిబాబు కీలక పాత్ర పోషించగా తాజాగా థియేటర్లలో విడుదలై మిశ్రమ స్పందన తెచ్చుకుంది. సినిమా కథా కథనాలు అంతా రొటీన్ గా ఉండి ఆడియన్స్ న...

`మేమ్‌ ఫేమస్‌`తో దర్శకుడిగా, హీరోగా ఆకట్టుకున్న సుమంత్‌ ప్రభాస్‌ కొంత గ్యాప్‌తో `గోదారి గట్టుపైన` అనే చిత్రంలో హీరోగా నటించాడు. సుభాష్‌ చంద్ర దర్శకత్వం వహించిన ఈ మూవీలో జగపతిబాబు కీలక పాత్ర పోషించగా తాజాగా థియేటర్లలో విడుదలై మిశ్రమ స్పందన తెచ్చుకుంది. సినిమా కథా కథనాలు అంతా రొటీన్ గా ఉండి ఆడియన్స్ ని డిస్సపాయింట్ చేసింది. ఎప్పుడో పాతికేళ్ల కిందటే ఇలాంటి కథలకు కాలం చెల్లిపోయింది. ఎదో ట్రెండి ఎంటర్టైనింగ్ స్క్రీన్ ప్లే తో మేజిక్ చేస్తే తప్ప ఇలాంటి స్టోరీతో సినిమాలు ఇప్పుడు ఆడవు. 


ఓవరాల్ గా రొటీన్‌, ఓల్డ్ ఫార్మాట్‌ తో గోదారిగట్టుపైన మూవీ తెరకెక్కిందని చెప్పొచ్చు. కామెడీ ఆశించిన స్థాయిలో వర్కౌట్‌ కాలేదు. లౌడ్‌ ఎక్కువైంది, కామెడీ తక్కువైంది. ఎమోషన్స్ సీన్లు కూడా పెద్దగా వర్కౌట్‌ కాలేదు. జగపతిబాబు పాత్రకి చాలా ఎలివేషన్లు ఇచ్చారు, కానీ ఎక్కడా ఆయా సీన్లు చూపించలేదు. ఈ జెనరేషన్‌ ఆడియెన్స్ ని ఆకట్టుకోవడం కష్టమనే చెప్పొచ్చు. సింపుల్ గా ఒక్క డైలాగ్ లో సినిమా గురించి చెప్పాలంటే... కొత్త సీసాలో చాలా పాత సారా అన్నట్టు ఉంటుంది. 



May 08, 2026 Read Review
Sakshi
Sakshi News Channel
6

Above Average

Goadari Gattupaina movie Review

గోదావరి అందాల నేపథ్యంలో తెరకెక్కిన ప్రేమకథా చిత్రం ‘గోదారి గట్టుపైన’. సుమంత్ ప్రభాస్, నిధి ప్రదీప్ జంటగా నటించిన ఈ సినిమాకు సుభాష్ చంద్ర దర్శకత్వం వహించారు. అయితే మంచి లొకేషన్స్, సహజమైన వాతావరణం ఉన్నప్పటికీ సినిమా మాత్రం ప్రేక్షకులను పూర్తిస్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. కథ పరంగా చూస్తే కొత్తదనం కనిపిం...

గోదావరి అందాల నేపథ్యంలో తెరకెక్కిన ప్రేమకథా చిత్రం ‘గోదారి గట్టుపైన’. సుమంత్ ప్రభాస్, నిధి ప్రదీప్ జంటగా నటించిన ఈ సినిమాకు సుభాష్ చంద్ర దర్శకత్వం వహించారు. అయితే మంచి లొకేషన్స్, సహజమైన వాతావరణం ఉన్నప్పటికీ సినిమా మాత్రం ప్రేక్షకులను పూర్తిస్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. కథ పరంగా చూస్తే కొత్తదనం కనిపించదు. కానీ కథనాన్ని ఆసక్తికరంగా మలచడంలో తడబాటు కనిపిస్తుంది. ముఖ్యంగా తొలి భాగంలో సన్నివేశాలు నెమ్మదిగా సాగుతూ బోర్ ఫీలింగ్ తెప్పిస్తాయి. 


నటీనటుల విషయానికి వస్తే సుమంత్ ప్రభాస్, నిధి ప్రదీప్ తమ పాత్రలకు న్యాయం చేశారు. జగపతిబాబు పాత్రకు సినిమాలో మంచి ప్రాధాన్యం ఉంది. అయితే పాత్రల ఎమోషన్స్‌ను బలంగా ఎలివేట్ చేయడంలో దర్శకుడు పూర్తిగా సక్సెస్ కాలేకపోయాడు. టెక్నికల్‌ గా సాయి సంతోష్ సినిమాటోగ్రఫీ సినిమాకు హైలైట్‌గా నిలిచింది. గోదావరి అందాలను తెరపై ఎంతో సహజంగా చూపించారు. కానీ విజువల్స్ మాత్రమే సినిమాను నిలబెట్టలేకపోయాయి. టైటిల్‌ కు తగ్గ బలమైన భావోద్వేగం కూడా సినిమాలో కనిపించదు. ఓవరాల్‌గా ‘గోదారి గట్టుపైన’ మంచి విజువల్స్‌తో వచ్చినా… బలమైన కథనం, ఎంగేజింగ్ ట్రీట్‌మెంట్ లేక ఆకట్టుకోలేకపోయింది. 

May 08, 2026 Read Review
Chitra Jyothy
Chitra Jyothy Website
5

Average

Godari Gattupaina movie Review

సుమంత్ ప్రభాస్, నిధి ప్రదీప్ జంటగా నటించిన చిత్రం 'గోదారి గట్టుపైన’ (Godari Gattupaina). 100కు పైగా లఘు చిత్రాలు తీసిన అనుభవం ఉన్న సుభాష్ చంద్ర (Subhash Chandra) దర్శకత్వం వహించిన ఈ సినిమా విలేజ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కగా తాజాగా ఆడియన్స్ ముందుకొచ్చింది. ఇక థియేటర్లో మిక్స్డ్ రెస్పాన్స్ తెచ్చుకుంది...

సుమంత్ ప్రభాస్, నిధి ప్రదీప్ జంటగా నటించిన చిత్రం 'గోదారి గట్టుపైన’ (Godari Gattupaina). 100కు పైగా లఘు చిత్రాలు తీసిన అనుభవం ఉన్న సుభాష్ చంద్ర (Subhash Chandra) దర్శకత్వం వహించిన ఈ సినిమా విలేజ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కగా తాజాగా ఆడియన్స్ ముందుకొచ్చింది. ఇక థియేటర్లో మిక్స్డ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. నటీనటులందరూ తమ పాత్రల పరిధి మేరకు నటించారు. జగపతిబాబు రోల్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంది. 


సుభాష్ చంద్ర రచనలో పెద్దగా మెరుపులు లేకున్నా… విజువల్ గ్రాండియర్ తో మెప్పించే ప్రయత్నం చేశాడు. సాయి సంతోష్ సినిమాటోగ్రఫీ బావుంది. గోదావరి జిల్లా అందాలను చక్కగా క్యాప్చర్ చేశాడు. కథ రొటీన్ దే అయినా కథనంతో మెప్పించాల్సింది. ఈ విషయంలో దర్శకుడు సక్సెస్ కాలేక పోయాడు. కానీ ఆ క్యూట్ నెస్ వెండితెరపై క్యారీ చేయలేక పోయాడు. చాలా సీన్స్ ప్రత్యేకించి తొలి అర్ధభాగం చాలా వరకూ సాగదీతతో ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టేలా ఉంది. ప్రేమకథలను ఇష్టపడే కొందరికి నచ్చవచ్చు. అసలు టైటిల్ ‘గోదారి గట్టుపైన’ అని ఎందుకు పెట్టారో దర్శకుడికే తెలియాలి. ఓవరాల్ గా మౌత్ టాక్ కూడా సరిగా లేని ఈ సినిమా ఎలా నిలబడుతుందో లాంగ్ రన్ లో తెలుస్తుంది. 


May 08, 2026 Read Review
Filmi Beat
Filmi Beat Website
4

Below Average

Godari Gattupaina Movie Review

గోదారి గట్టుపైన సినిమా విషయానికి వస్తే.. తండ్రి, కూతుళ్ల సెంటిమెంట్ అంశంతో ఎమోషనల్‌ గా కథను సుభాష్ చంద్ర ప్రారంభించారనే ఫీలింగ్ కలుగుతుంది. అయితే కథలోకి వెళ్లిన కొద్ది పక్కా రొటీన్, రెగ్యులర్ ఫార్మాట్‌ను అనుసరించారనే విషయం కామెడీ ట్రాక్ చెప్పకనే చెబుతుంది. సినిమాలో రాజు, మాయ ప్రేమ కథ మొదలైనప్పటి నుం...

గోదారి గట్టుపైన సినిమా విషయానికి వస్తే.. తండ్రి, కూతుళ్ల సెంటిమెంట్ అంశంతో ఎమోషనల్‌ గా కథను సుభాష్ చంద్ర ప్రారంభించారనే ఫీలింగ్ కలుగుతుంది. అయితే కథలోకి వెళ్లిన కొద్ది పక్కా రొటీన్, రెగ్యులర్ ఫార్మాట్‌ను అనుసరించారనే విషయం కామెడీ ట్రాక్ చెప్పకనే చెబుతుంది. సినిమాలో రాజు, మాయ ప్రేమ కథ మొదలైనప్పటి నుంచి రిపీట్ సీన్లతో విసుగుపుట్టించేలా చేశారు. కథ, కథనాల్లో పస లేకపోవడం వల్ల సాంకేతిక విభాగాల పనితీరు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. 


సినిమాలో సిట్యుయేషనల్‌గా పాటలు ఉన్నప్పటికీ.. పెద్దగా ఎలివేట్ కాలేకపోయాయి. కథలో బలం లేనప్పుడు సినిమా రన్‌టైమ్ తగ్గిస్తే ఫీల్ ఏదైనా పెరిగేది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. కథ, కథనాలపై మరింత దృష్టిపెట్టి ఉంటే ఈ సినిమా ఫలితం వేరేలా ఉండేదనిపిస్తుంది. జగపతిబాబు మినహా మిగతా నటీనటుల ప్రతిభ ఏమి అంత లేదు. ఓవరాల్ గా సినిమా ఆడియన్స్ ని నిరాశపరుస్తుంది. 


May 08, 2026 Read Review
Tupaki
Tupaki Website
5

Average

Godari Gattupaina Movie Review

షార్ట్ ఫిలిమ్స్ తో పేరు సంపాదించి.. ‘మేం ఫేమస్’ సినిమాతో హీరోగా దర్శకుడిగా మారిన సుమంత్ ప్రభాస్ ఆ చిత్రంతో బానే ఆకట్టుకున్నాడు. ఇప్పుడు లేటెస్ట్ గా ‘గోదారి గట్టుపైన’ మూవీతో ఆడియన్స్ ముందుకొచ్చాడు. ‘గోదారి గట్టుపైన’ ట్రైలర్ చూస్తేనే ఇదొక సగటు టీనేజీ ప్రేమకథ అనే విషయం అర్థమైపోతుంది. కథ విషయంలోనూ ఫుల్...

షార్ట్ ఫిలిమ్స్ తో పేరు సంపాదించి.. ‘మేం ఫేమస్’ సినిమాతో హీరోగా దర్శకుడిగా మారిన సుమంత్ ప్రభాస్ ఆ చిత్రంతో బానే ఆకట్టుకున్నాడు. ఇప్పుడు లేటెస్ట్ గా ‘గోదారి గట్టుపైన’ మూవీతో ఆడియన్స్ ముందుకొచ్చాడు. ‘గోదారి గట్టుపైన’ ట్రైలర్ చూస్తేనే ఇదొక సగటు టీనేజీ ప్రేమకథ అనే విషయం అర్థమైపోతుంది. కథ విషయంలోనూ ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. సింపుల్ గా కథ చెప్పాలంటే.. కూతురిని అమితంగా ఇష్టపడే తండ్రి.. ఆమెను తమ కంటే ఉన్నత స్థాయి కుటుంబంలో ఇవ్వాలని ఆశిస్తాడు. కథానాయికేమో హీరో గుణం చూసి ఇష్టపడుతుంది. వీరి పెళ్లికి ఇష్టపడని తండ్రి.. మిగతా విషయాల కంటే ఆ గుణమే గొప్పదని అర్థం చేసుకోవడం.. ఆ ఇద్దరినీ ఒక్కటి చేయడం.. ఈ నేపథ్యంలో బాగా అలవాటైన కథలాగే నడుస్తుంది ‘గోదారి గట్టుపైన’. 


కథ పరంగా ఏ కొత్తదనం కనిపించదు. ఇందులో ఆశ్చర్యపరిచే అంశాలు కూడా ఏమీ లేవు. కథాకథనాలు రొటీన్ అనిపించినా.. టైంపాస్ వినోదాన్ని ఇవ్వడం ద్వారా జస్ట్ ఓకే అనిపిస్తుంది. ఇలాంటి రూరల్ లవ్ స్టోరీలకు వీనుల విందైన సంగీతం అవసరం. కానీ ఆ పాటలు వినాలి అనిపించే స్థాయిలో లేవు. సాయి సంతోష్ ఛాయాగ్రహణం ఆకట్టుకుంటుంది. గోదారి పల్లెటూర్లను.. ప్రేమ సన్నివేశాలను బాగా చూపించాడు. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. ఇటు ప్రేమ సన్నివేశాలు కానీ.. అటు కాన్ఫ్లిక్ట్ కానీ బలంగా లేకపోవడంతో సినిమా మరీ తేలిగ్గా అనిపిస్తుంది. ఐతే కొన్ని కామెడీ సీన్లు.. తండ్రీ కూతుళ్ల ఎమోషన్ వరకు అతను బాగా డీల్ చేశాడు. ఓవరాల్ గా గోదారి గట్టుపైన.. కూసింత కాలక్షేపం అన్నట్టు లో ఎక్స్పెక్టేషన్స్ తో సినిమా చూసి బైటికొచ్చేయాలి. 


May 08, 2026 Read Review
Samayam Telugu
Samayam Telugu Website
5

Average

Godari Gattupaina Movie Review

‘మేం ఫేమస్’ అంటూ సుమంత్ ప్రభాస్ సోషల్ మీడియాలో కాస్త హడావిడి చేశాడు. సినిమా అంతగా హిట్ కాకపోయినా మనోడు తన డిఫరెంట్ ప్రమోషన్స్‌, మాటలు, చేతలతో ఎక్కువగానే ట్రెండ్ అయ్యాడు. ఇప్పుడు సుమంత్ ప్రభాస్ ‘గోదారి గట్టుపైన’ అనే సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. ప్రేమకు కులం, మతం, డబ్బు అడ్డు వచ్చిన కథలెన్నో మనం...

‘మేం ఫేమస్’ అంటూ సుమంత్ ప్రభాస్ సోషల్ మీడియాలో కాస్త హడావిడి చేశాడు. సినిమా అంతగా హిట్ కాకపోయినా మనోడు తన డిఫరెంట్ ప్రమోషన్స్‌, మాటలు, చేతలతో ఎక్కువగానే ట్రెండ్ అయ్యాడు. ఇప్పుడు సుమంత్ ప్రభాస్ ‘గోదారి గట్టుపైన’ అనే సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. ప్రేమకు కులం, మతం, డబ్బు అడ్డు వచ్చిన కథలెన్నో మనం చూశాం. ఇందులో ఏమైనా కొత్తగా చెబుతాడని, చూపిస్తాడని ప్రేక్షకులు ఆశిస్తే మాత్రం నిరాశే కలుగుతుంది.


దర్శకుడు సుభాష్ చంద్ర తీసుకున్న పాయింట్, కథ, కథనం, మేకింగ్, టేకింగ్ ఇవన్నీ కూడా అవుట్ డేటెడ్‌గానే కనిపిస్తాయి. ఏ ఒక్క చోట కూడా అరెరే ఇదేదో కొత్త సీన్‌లా ఉందే, సినిమా కొత్తగా ఉందే అని అనిపించదు. నటీనటులు కూడా పెద్దగా గుర్తుండిపోయే పెర్ఫార్మన్స్ చేసింది లేదు... దాని కంటే ముందు ఆ రోల్స్ అంత స్ట్రాంగ్ గా లేవు కూడా. ఉన్నంతలో జగపతిబాబు రోల్ కొంచెం బాగుంటుంది. ఓవరాల్‌ గా గోదారి గట్టుపైన అని అందమైన టైటిల్, ఓ ఆహ్లాదకరమైన టైటిల్‌ను పెట్టారు. కానీ అందులోని కథ, కథనం, ఎమోషన్స్ మాత్రం అంత గొప్పగా ఉండవు. అంచనాలతో థియేటర్‌కి వెళ్తే ప్రేక్షకుడు కాస్త భంగపడే అవకాశం ఉందనిపిస్తుంది.


May 08, 2026 Read Review
123telugu
123telugu Website
5

Average

Godari Gattupaina Movie Review

యంగ్ హీరో సుమంత్ ప్రభాస్ హీరోగా నటించిన రూరల్ లవ్, ఫ్యామిలీ డ్రామా ‘గోదారి గట్టుపైన’ తాజాగా థియేటర్లలో రిలీజ్ కాగా, మిక్స్డ్ రెస్పాన్స్ అందుకుంది. సుభాష్ చంద్ర దర్శకత్వంలో రెడ్ పప్పెట్ ప్రొడక్షన్స్ నిర్మించింది. అయితే రొటీన్ కథా కథనాలతో సినిమా ఆడియన్స్ ని అంతగా మెప్పించలేదు. గోదావరి నేటివిటీ బాగానే...

యంగ్ హీరో సుమంత్ ప్రభాస్ హీరోగా నటించిన రూరల్ లవ్, ఫ్యామిలీ డ్రామా ‘గోదారి గట్టుపైన’ తాజాగా థియేటర్లలో రిలీజ్ కాగా, మిక్స్డ్ రెస్పాన్స్ అందుకుంది. సుభాష్ చంద్ర దర్శకత్వంలో రెడ్ పప్పెట్ ప్రొడక్షన్స్ నిర్మించింది. అయితే రొటీన్ కథా కథనాలతో సినిమా ఆడియన్స్ ని అంతగా మెప్పించలేదు. గోదావరి నేటివిటీ బాగానే చూపించినా ఇంట్రెస్టింగ్ సీన్స్ తో ఆసక్తిగా చూపించలేకపోయారు.


ఓవరాల్ గా “గోదారి గట్టుపైన’’ అంటూ ఎమోషనల్ లవ్ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈ చిత్రంలో.. మెయిన్ థీమ్, ప్రేమ సన్నివేశాలు అండ్ ఎమోషనల్ సీన్స్ బాగున్నాయి. సుమంత్ ప్రభాస్, జగపతి బాబు నటన కూడా చాలా బాగుంది. ఐతే, కొన్ని రెగ్యులర్ సీన్స్ వంటి అంశాలు సినిమాకి మైనస్ అయ్యాయి. ఓవరాల్ గా ఈ సినిమాలో కొన్ని లవ్ అండ్ ఎమోషనల్ ఎలిమెంట్స్ మాత్రమే ఆకట్టుకుంటాయి.


May 08, 2026 Read Review

Public Reviews

6 Avg: 5.5/10
A
6

Above Average

Godari Gattupaina Movie Review

‘Godari Gattupaina’ title chusi proper feel-good love story expect chesam… kaani movie mostly visuals meedhe nadichinattu anipistundi. Godavari backdrop, village vibes matram screen meeda chaala beautiful ga unnay. few comedy scenes lo baga workout ayindi. Story matram chaala simple and predictable...

‘Godari Gattupaina’ title chusi proper feel-good love story expect chesam… kaani movie mostly visuals meedhe nadichinattu anipistundi. Godavari backdrop, village vibes matram screen meeda chaala beautiful ga unnay. few comedy scenes lo baga workout ayindi. Story matram chaala simple and predictable ga undi. Hero heroine decent ga chesaru, music kuda just okay. Ekkuva expectations lekunda chuste overall ga decent one-time watch feel istundi.

May 26, 2026
B
Baswaraj Students & Youth
6

Above Average

Godari gattupaina

Godari Gattupaina : Godari Gattupaina looks beautiful, but emotionally it doesn’t hit that hard. The movie mostly survives on Godavari visuals, village atmosphere, and a few fun moments. overall Storyline feels outdated, but as a chill weekend watch with friends, it’s manageable.my rating 5/10....

Godari Gattupaina : 

Godari Gattupaina looks beautiful, but emotionally it doesn’t hit that hard. The movie mostly survives on Godavari visuals, village atmosphere, and a few fun moments. overall Storyline feels outdated, but as a chill weekend watch with friends, it’s manageable.


my rating 5/10


May 26, 2026
T
Talari Snehalatha Corporate (Non IT) Employee
4

Below Average

Godari Gattupaina Review Telugu Movie

‘గోదారి గట్టుపైన’... ఈ టైటిల్ చూసి super feel-good లవ్ స్టోరీ అని expect చేస్తే… movie లో మాత్రం visuals magic తప్ప ఒక story, screenplay ఏమి కనిపించలేదు నాకు. గోదారి అందాలు, village backdrop మాత్రం థియేటర్‌ లో super pleasing‌ గా కనిపిస్తాయి. main leads బాగానే act చేసారు... బట్ అంత feel రాలేదు. ...


‘గోదారి గట్టుపైన’... ఈ టైటిల్ చూసి super feel-good లవ్ స్టోరీ అని expect చేస్తే… movie లో మాత్రం visuals magic తప్ప ఒక story, screenplay ఏమి కనిపించలేదు నాకు. గోదారి అందాలు, village backdrop మాత్రం థియేటర్‌ లో super pleasing‌ గా కనిపిస్తాయి. main leads బాగానే act చేసారు... బట్ అంత feel రాలేదు. 


and story మాత్రం చాలా predictable route‌ లో వెళ్తుంది. Emotional highs కూడా అంతగా workout కాలేదు. అయినా ఎక్కువ expectations లేకుండా చూస్తే… ‘గోదారి గట్టుపైన’ ఒక decent cinematic village drama అనిపిస్తుంది.

May 26, 2026
G
Goshika Shreshta CA/Advocate
5

Average

Godari Gattupaina Review

Godari Gattupaina : గోదారి గట్టుపైన... టైటిల్ వినడానికి చాలా cool గా ఉంది. but movie మాత్రం దానికి rivers లో ఉంది. ఏదో family తో కలిసి కాస్త relax అవుదామని గోదారి గట్టుపైన మూవీ theater కి వెళ్తే... రివర్స్ లో entertainment కన్నా iritation ఎక్కువొచ్చింది. పాత చింతకాయ పచ్చడి లాగా routeen story templat...

Godari Gattupaina : గోదారి గట్టుపైన... టైటిల్ వినడానికి చాలా cool గా ఉంది. but movie మాత్రం దానికి rivers లో ఉంది. ఏదో family తో కలిసి కాస్త relax అవుదామని గోదారి గట్టుపైన మూవీ theater కి వెళ్తే... రివర్స్ లో entertainment కన్నా iritation ఎక్కువొచ్చింది. పాత చింతకాయ పచ్చడి లాగా routeen story template తో విసిగిపోయాం. but last దాకా సీట్లో కూర్చున్నామంటే అది గోదావరి పల్లెటూరి విజువల్స్, ఆ నేటివిటీయే. మేకర్స్ దాంట్లో సక్సెస్ అయ్యారు. and movie లో entertainment kuda fresh గా లేదు. ఏదో జబర్దస్త్ కామెడీ ఫీల్ ఒచ్చింది. ఓవరాల్ గా decent వర్డ్ కి ఎక్కువ... avarage word కి తక్కువ అన్నట్టుంది సినిమా.. rating ఇవ్వాలంటే only గోదావరి నేటివిటీ కోసం ఒక 5/10...
May 19, 2026
M
Mulollu Praveen Kumar CA/Advocate
6

Above Average

Godari Gattupaina Film Review

Godari Gattupaina starts with a very promising village love-story vibe, but the film mostly depends on its beautiful visuals rather than a strong story. The Godavari backdrop and rural atmosphere look absolutely stunning on screen. The lead pair does a decent job, and the music works in parts....

Godari Gattupaina starts with a very promising village love-story vibe, but the film mostly depends on its beautiful visuals rather than a strong story. The Godavari backdrop and rural atmosphere look absolutely stunning on screen. 


The lead pair does a decent job, and the music works in parts. However, the storyline feels too predictable and lacks emotional depth. Still, if you go in with low expectations, the movie ends up being a decent and watchable love drama.

May 19, 2026
B
Baru Sri Harshitha Students & Youth
6

Above Average

Godard gattupaina

godari gattupaina : Honestly, Godari Gattupaina feels like a visually rich Instagram reel stretched into a movie. The Godavari scenery and rural setup are super pleasing, and Sudarshan comedy gives some entertaining moments. overall its a decent watchable village drama. rating 5/10
May 19, 2026 Watch

About This Movie

Story : కథ విషయానికి వస్తే... శ్యామ్ బాబు (జగపతి బాబు)కి తన కూతురు మాయ (నిధి ప్రదీప్) అంటే చాలా ఇష్టం. తన కూతురిపై ప్రేమ తప్ప కోపాన్ని ఎప్పుడూ చూపడు. చిన్న ఉద్యోగం చేస్తూ కూతుర్ని ఉన్నంతలో మారాణిలా చూసుకుంటాడు. ఇటు మాయకి కూడా నాన్నంటే ఎంతో ప్రేమ. మరోవైపు రాజు (సుమంత్ ప్రభాస్) ఆటో నడుపుకునే కుర్రాడు. రాజు తన చెల్లి సమైఖ్య(శ్రీలాస్య) ద్వారా పరిచయమైన మాయని ప్రేమిస్తాడు. మాయ కూడా రాజుని ప్రేమిస్తుంది. ఈ క్రమంలో కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో రాజు - మాయ ప్రేమ మధ్య అడ్డొచ్చిన తండ్రి శ్యామ్ బాబు కూతురి విషయంలో తప్పు జరుగుతోందా అని బాధపడుతుంటాడు. ఇటు మాయ కూడా తండ్రి ఇచ్చిన స్వేచ్ఛని తప్పుగా వాడుకుంటున్నానేమో అని బాధతో రాజుకి దూరమవుతుంది. మరి శ్యామ్ బాబు తన కూతుర్ని అర్ధం చేసుకున్నాడా? చివరికి రాజు-మాయ  ఒక్కటయ్యారా? లేదా అనేది కథ.

 

సినిమా కథ నేపథ్యం విషయానికి వస్తే... అందరికి తెలిసిన మాములు కథే. ఓ సగటు తండ్రి.. కూతుర్ని మహారాణిలా చూస్కుంటే... మధ్యలో పెళ్లి టైమ్ వచ్చేసరికి కూతురి జీవితంలో కొత్త వ్యక్తి... ఇటు ప్రేమికుడు, తండ్రి మధ్యలో నలిగిపోయే కూతురు... సింపుల్ కథ... కానీ ఈ సినిమాలో సగటు ఆడపిల్ల తండ్రికి ఉండే ఎమోషన్ ని సరిగ్గా చూపించారు. ముఖ్యంగా తండ్రి పాయింట్ అఫ్ వ్యూ లో సీన్స్ చాలా బాగా చూపించారు. ఇక హీరో హీరోయిన్ల మధ్య సీన్స్ కథ పరంగా రొటీన్ గా ఉన్నా ఆకట్టుకున్నాయి. ఇటు మేం ఫేమస్ తో ఆకట్టుకున్న సుమంత్ ప్రభాస్ ఈ సినిమాతోనూ న్యాచురల్ పెర్ఫార్మన్స్ తో అలరించాడు. హీరొయిన్ నిధి నటన పరంగా మెప్పిచింది. వీళ్ళు కాకుండా ప్రత్యేక పాత్రలో నటించిన జగపతిబాబు తన పెర్ఫార్మన్స్ తో మూవీకి బ్యాక్ బోన్ గా నిలిచారు. ఇక రాజీవ్‌ కనకాల, లైలా, దేవిప్రసాద్‌, మిగతా నటీనటులు వాళ్ళ పాత్రల పరిధి మేరకు మెప్పించారు.


ఇక సినిమాలో నటీనటుల పెర్ఫార్మన్స్ పై బాగానే శ్రద్ధ పెట్టిన దర్శకుడు సుభాష్ చంద్ర ఆ స్థాయిలో స్టోరీ, స్క్రీన్ ప్లే రాసుకోలేకపోయాడు. కథలో కొత్తదనం లేకపోయినా, ట్రీట్మెంట్ అయినా ఇంట్రెస్టింగ్ గా ఉండాలి కానీ. అలాగే మూవీ లో మెయిన్ లీడ్స్ రోల్స్ క్యారెక్టర్స్ ని ఇంకా స్ట్రాంగ్ గా రాసుకోవాల్సింది. జగపతిబాబు పాత్ర తప్ప హీరో హీరోయిన్ల రోల్స్ కూడా గుర్తుండే విధంగా ఉండవు. ఎంతో ఇంట్రెస్టింగ్ గా ఎమోషనల్ గా మలిచే అవకాశం ఉన్నా... సింపుల్ గా ముగించినట్టు అనిపిస్తుంది. 


 
Technical values : ఇక టెక్నికల్ గా డైరెక్టర్ సుభాష్ చంద్ర తన టేకింగ్ తో మెప్పించినా, సరైన స్టోరీ, స్క్రీన్ ప్లే రాసుకోవాల్సింది. ఇక మ్యూజిక్ డైరెక్టర్ నాగవంశీకృష్ణ ఇచ్చిన బీజీఎమ్ బాగుంది. పాటలు పర్లేదు. సినిమాలో గోదారి సన్నివేశాలు మంచి ప్లస్ అయ్యాయి. అక్కడక్కడా కొన్ని సీన్స్ ని ఎడిట్ చేయాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి. 


Final Review :

ఓవరాల్ గా "గోదారి గట్టుపైన" అంటూ థియేటర్లోకి వచ్చిన ఈ ఎమోషనల్ లవ్ అండ్ ఫామిలీ డ్రామా రెగ్యులర్ మూవీ లవర్స్ ని మెప్పించేలా ఉంది. కానీ ఫ్రెష్ కంటెంట్ కోరుకునే ఆడియన్స్ డిస్సపాయింట్ అవుతారు. తక్కువ అంచనాలు పెట్టుకుని థియేటర్లో ఓసారి చూసేయొచ్చు. 

Review Statistics

5.2
Overall Rating
Avg. of all reviews
21
Total Reviews
From 4 Provider Types

Review Average

Media
5.1/10
Public
5.5/10
Why MRO?