Register as a Reviewer

Movie Reviews

Professional reviews and ratings from top critics and publications worldwide

101
Total Reviews
38
Movies Reviewed
24
Reviewer Categories
Active filters: Category: Youtube Channel ×
Showing 1-12 of 101 reviews
Clear all filters

Kantara Chapter 1 Movie Review

7.0
out of 10
కన్నడ స్టార్ రిషబ్ శెట్టి నుంచి వచ్చిన కాంతార: చాప్టర్-1… మళ్లీ అదే వరల్డ్‌లోకి తీసుకెళ్తూ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ పార్ట్ ఎక్కడ ఎండ్ అయిందో అక్కడ్నుంచే కథ పికప్ అవ్వడం మంచి ప్లస్.స్టోరీ సింపుల్ అయినా… ప్రెజెంటేషన్ మాత్రం నెక్స్ట్ లెవెల్! 🎯హీరోగా కంటే డైరెక్టర్‌గా రిషబ్ శెట్టి చేసిన వర్క్ నిజంగా హైలైట్. ప్రతి సీన్‌లో ఆయన విజన్ క్లియర్‌గా కనిపిస్తుంది.టెక్నికల్‌గా సినిమా టాప్ నాచ్అజనీష్ లోకనాథ్ మ్...

కన్నడ స్టార్ రిషబ్ శెట్టి నుంచి వచ్చిన కాంతార: చాప్టర్-1… మళ్లీ అదే వరల్డ్‌లోకి తీసుకెళ్తూ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ పార్ట్ ఎక్కడ ఎండ్ అయిందో అక్కడ్నుంచే కథ పికప్ అవ్వడం మంచి ప్లస్.


స్టోరీ సింపుల్ అయినా… ప్రెజెంటేషన్ మాత్రం నెక్స్ట్ లెవెల్! 🎯

హీరోగా కంటే డైరెక్టర్‌గా రిషబ్ శెట్టి చేసిన వర్క్ నిజంగా హైలైట్. ప్రతి సీన్‌లో ఆయన విజన్ క్లియర్‌గా కనిపిస్తుంది.


టెక్నికల్‌గా సినిమా టాప్ నాచ్

అజనీష్ లోకనాథ్ మ్యూజిక్ & BGM – goosebumps level

సినిమాటోగ్రఫీ, విజువల్స్ – అద్భుతం

ఎడిటింగ్ కూడా క్రిస్ప్‌గా ఉంది


డివోషనల్ టచ్, ఫోక్ ఎలిమెంట్స్ కలిపి సినిమా మంచి ఇమర్సివ్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది. క్లైమాక్స్ అయితే major highlight 

రిషబ్‌తో పాటు రుక్మణి వసంత్ కూడా అక్కడ strong impact ఇస్తుంది.

ఎండింగ్ మాత్రం… next part కోసం wait చేయించేలా hook పెడుతుంది!

Apr 20, 2026 Telugu
7.0
out of 10
ఈ వారం మన ముందుకొచ్చిన తిమ్మరాజుపల్లి TV… basically ఒక నాస్టాల్జిక్ విలేజ్ డ్రామా! ముందుగా స్టోరీ పాయింట్ చూస్తే… చిన్నదే. కానీ డైరెక్టర్ వి. మునిరాజు దాన్ని 90స్ ఫీల్‌తో బానే ప్రెజెంట్ చేయడానికి ట్రై చేశాడు. ఇక్కడే కాస్త ఇష్యూ మొదలవుతుంది.మెయిన్ స్టోరీకి వెళ్లడానికి టైమ్ తీసుకుంటుంది… కొంచెం స్లోగా అనిపిస్తుంది. పెద్దగా కాన్ఫ్లిక్ట్ లేకపోవడం వల్ల “ఏమవుతోంది?” అనే ఫీల్ వస్తుంది. కానీ… పల్లెటూరి ఎమ...

ఈ వారం మన ముందుకొచ్చిన తిమ్మరాజుపల్లి TV… basically ఒక నాస్టాల్జిక్ విలేజ్ డ్రామా! ముందుగా స్టోరీ పాయింట్ చూస్తే… చిన్నదే. కానీ డైరెక్టర్ వి. మునిరాజు దాన్ని 90స్ ఫీల్‌తో బానే ప్రెజెంట్ చేయడానికి ట్రై చేశాడు. ఇక్కడే కాస్త ఇష్యూ మొదలవుతుంది.

మెయిన్ స్టోరీకి వెళ్లడానికి టైమ్ తీసుకుంటుంది… కొంచెం స్లోగా అనిపిస్తుంది. పెద్దగా కాన్ఫ్లిక్ట్ లేకపోవడం వల్ల “ఏమవుతోంది?” అనే ఫీల్ వస్తుంది. కానీ… పల్లెటూరి ఎమోషన్స్ మాత్రం neatగా work అవుతాయి


అసలు సినిమా ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే… Second half!

టీవీ చుట్టూ తిరిగే మిస్టరీ angle, “ఈ తప్పు ఎవరు చేశారు?” అన్న థ్రాక్‌తో కథ కాస్త ఇంట్రెస్టింగ్ అవుతుంది. అక్కడ నుంచి ఎంగేజ్ చేయడానికి ప్రయత్నిస్తుంది. టెక్నికల్‌గా చూస్తే.. వంశీకాంత్ రేఖన BGM – scenes కి soul ఇచ్చింది. ఆర్ట్ వర్క్ (సుధీర్ మాచర్ల) – 90s village vibes on point, తో పాటు అక్షయ్ రామ్ కెమెరా – very natural & pleasant visuals గా అనిపించాయి.మునిరాజు simple storyని emotionalగా చెప్పాడు. పెద్దగా high moments లేకపోయినా, grounded narration తో connect అయ్యేలా ట్రై చేశాడు. ఫైనల్ గా తిమ్మరాజు పల్లి టివి ఒక soft, nostalgic village drama. ఇక క్లైమాక్స్ లో ఒక మంచి సీన్ రివీల్ తో సీన్ ఎండ్ అవుతుంది. అండ్ కొత్త ఆడియన్స్ తో చేయడం వల్ల ఫ్రెష్ ఫీల్ వస్తుంది. ఇక వాళ్ళ పెర్ఫార్మన్స్ కూడా అదరగొట్టేసారు.

Apr 18, 2026 Telugu
6.0
out of 10
కిరణ్ అబ్బవరం ప్రొడ్యూస్ చేసిన మూవీ తిమ్మరాజు పల్లి TV ఫైనల్ గా థియేటర్లలో రిలీజ్ అయింది. చిన్న సినిమాగా రిలీజ్ అయిన ఈ మూవీ ఆడియన్స్ ని మెజారిటీ వారికి బానే నచ్చుతుంది. కొత్త నటులతో చేసినందువల్ల ఫ్రెష్ ఫీల్ కూడా వస్తుంది. దీనికి తోడు 90స్ బ్యాక్ డ్రాప్ కాబట్టి మరింత నచ్చే ఛాన్స్ ఉంది. మెయిన్లి పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో మూవీస్ ఇష్టపడే వాళ్లకు తిమ్మరాజు పల్లి టివి బాగానే నచ్చుతుందని అనిపిస్తుంది.&...

కిరణ్ అబ్బవరం ప్రొడ్యూస్ చేసిన మూవీ తిమ్మరాజు పల్లి TV ఫైనల్ గా థియేటర్లలో రిలీజ్ అయింది. చిన్న సినిమాగా రిలీజ్ అయిన ఈ మూవీ ఆడియన్స్ ని మెజారిటీ వారికి బానే నచ్చుతుంది. కొత్త నటులతో చేసినందువల్ల ఫ్రెష్ ఫీల్ కూడా వస్తుంది. దీనికి తోడు 90స్ బ్యాక్ డ్రాప్ కాబట్టి మరింత నచ్చే ఛాన్స్ ఉంది. మెయిన్లి పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో మూవీస్ ఇష్టపడే వాళ్లకు తిమ్మరాజు పల్లి టివి బాగానే నచ్చుతుందని అనిపిస్తుంది. 


అలాగే డైరెక్టర్ మునిరాజు ఈ సినిమాతో మంచి సక్సెస్ కొట్టే ఛాన్స్ బానే ఉందనిపిస్తుంది. ఇక ఈ సినిమాకు మా రేటింగ్ 3.7 ఫైనల్ గా తిమ్మరాజుపల్లి టివి గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే... టివి కి సంబంధించి అయితే బానే ఆడింది, కానీ థియేటర్లలో ఎంతవరకు ఆడుతుందో అనేది ఆడియన్స్ డిసైడ్ చేయాలి. కానీ ఇలాంటి సినిమాలు చూడాలి. ఎందుకంటే ఎన్నో చెత్త ఏ రేటెడ్ సినిమాల మధ్య ఇలాంటి డీసెంట్ థ్రిల్లర్ మూవీస్ ఉంటె ఆ మాత్రం హిట్ అవ్వాల్సిన అవసరం ఈ సినిమాలకుంది. ఫైనల్ గా తిమ్మరాజు పల్లి టివి మూవీ రెగ్యులర్ మూవీ లవర్స్ ని అయితే బానే ఆకట్టుకుంటుంది. 

Apr 18, 2026 Telugu

Papam Prathap Movie Review

5.0
out of 10
అయ్యో… పాపం అంటూనే.. ఈ వారం వచ్చిన పాపం ప్రతాప్ గురించే మాట్లాడుకుందాం! ముందుగా చెప్పాలంటే… స్టోరీ పాయింట్ చిన్నదే కానీ డైరెక్టర్ దానికి విలేజ్ కామెడీ, ఎమోషన్స్ కలిపి ఓ ఫీల్ గుడ్ సినిమా చేయాలని ట్రై చేశాడు.సినిమా కొంచెం స్లో గా అనిపిస్తోస్తుంది. పల్లెటూరు వాతావరణం, క్యారెక్టర్స్, వాళ్ల మాటలు—all fun. హీరో ప్రాబ్లమ్ రివీల్ చేసే సీన్ కూడా బాగుంటుంది. ఇంటర్వెల్ దగ్గర “ఇంకేమైనా ఉంటుందా?” అనే ఫీల్...

అయ్యో… పాపం అంటూనే.. ఈ వారం వచ్చిన పాపం ప్రతాప్ గురించే మాట్లాడుకుందాం! ముందుగా చెప్పాలంటే… స్టోరీ పాయింట్ చిన్నదే కానీ డైరెక్టర్ దానికి విలేజ్ కామెడీ, ఎమోషన్స్ కలిపి ఓ ఫీల్ గుడ్ సినిమా చేయాలని ట్రై చేశాడు.


సినిమా కొంచెం స్లో గా అనిపిస్తోస్తుంది. పల్లెటూరు వాతావరణం, క్యారెక్టర్స్, వాళ్ల మాటలు—all fun. హీరో ప్రాబ్లమ్ రివీల్ చేసే సీన్ కూడా బాగుంటుంది. ఇంటర్వెల్ దగ్గర “ఇంకేమైనా ఉంటుందా?” అనే ఫీల్ వస్తుంది. ఇక సెకండాఫ్ విషయానికి వస్తే.. అక్కడే సినిమా కాస్త దారి తప్పింది బాస్! తిరువీర్ మాత్రం సినిమా మొత్తాన్ని మోసేశాడు. కానీ వేరే వాళ్ళు పెద్దగా హెల్ప్ అవలేదు. ఫైనల్‌గా చెప్పాలంటే…

పాపం ప్రతాప్ ఒక సింపుల్ విలేజ్ డ్రామా. ఫస్ట్ హాఫ్ ఓకే, సెకండాఫ్ కాస్త బోర్… కానీ క్లైమాక్స్ ఎమోషన్ కొంతమందికి connect అవుతుంది. ఓవరాల్ గా ఇంటర్వెల్ సీక్వెన్స్ దగ్గర చెప్పే పాయింట్, క్లైమాక్స్ బాగుంటాయి. కానీ మూవీ ఓవరాల్ గా అంతగా ఎక్కదు. సో అదండీ పాయింట్. 

Apr 18, 2026 Telugu

Papam Prathap Movie Review

Thyview

By Thyview

5.0
out of 10
ఇవాళ మనం మాట్లాడుకోబోయేది పాపం ప్రతాప్ గురించి… ముందుగా స్టోరీ పాయింట్ చూస్తే… చాలా చిన్న ఐడియా. కానీ డైరెక్టర్ ఎస్‌పి దుర్గా నరేష్ దానికి విలేజ్ కామెడీ + ఎమోషన్స్ కలిపి ఒక సింపుల్ ఫీల్ గుడ్ కథలా తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. పల్లెటూరు సెటప్, క్యారెక్టర్స్ అమాయకత్వం, డైలాగ్స్—all work nicely. హీరో ప్రాబ్లమ్ రివీల్ చేసే సీన్, ఇంటర్వెల్ ట్విస్ట్ బాగుంటాయి… అక్కడికే “అరే సెకండాఫ్ లో ఏదో ఉంది” అనిప...

ఇవాళ మనం మాట్లాడుకోబోయేది పాపం ప్రతాప్ గురించి… 

ముందుగా స్టోరీ పాయింట్ చూస్తే… చాలా చిన్న ఐడియా. కానీ డైరెక్టర్ ఎస్‌పి దుర్గా నరేష్ దానికి విలేజ్ కామెడీ + ఎమోషన్స్ కలిపి ఒక సింపుల్ ఫీల్ గుడ్ కథలా తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. పల్లెటూరు సెటప్, క్యారెక్టర్స్ అమాయకత్వం, డైలాగ్స్—all work nicely. హీరో ప్రాబ్లమ్ రివీల్ చేసే సీన్, ఇంటర్వెల్ ట్విస్ట్ బాగుంటాయి… అక్కడికే “అరే సెకండాఫ్ లో ఏదో ఉంది” అనిపిస్తుంది. కానీ అసలు ప్రాబ్లమ్ ఎక్కడంటే… సెకండాఫ్! పేస్ స్లో అవుతుంది… కొన్ని డబుల్ మీనింగ్ జోక్స్ కాస్త అవుట్ ఆఫ్ ప్లేస్ ఫీల్ ఇస్తాయి. ఇంకొంచెం క్రిస్ప్‌గా రాస్తే సినిమా లెవెల్ ఇంకాస్త పెరిగేది.


 పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే…

తిరువీర్ literally carries the film!

అతని ఎమోషన్స్, కళ్లతో చేసే యాక్టింగ్ చాలా నేచురల్‌గా ఉంటుంది.

పాయల్ రాధాకృష్ణ కూడా బుజ్జమ్మ పాత్రలో క్యూట్‌గా, జెన్యూన్‌గా కనిపిస్తుంది.


 టెక్నికల్‌గా కేఎం రాధాకృష్ణన్ మ్యూజిక్, సురేష్ బొబ్బిలి BGM సీన్స్ కి good support. విశ్వేశ్వర్ సినిమాటోగ్రఫీ – గోదావరి visuals super fresh ఫైనల్‌గా… పాపం ప్రతాప్ పెద్ద సినిమా కాదు… కానీ ఒక సింపుల్, హార్ట్‌ఫెల్ట్ విలేజ్ డ్రామా. కొన్ని ఫ్లాజ్ ఉన్నా… క్లైమాక్స్ ఎమోషన్ connect అయితే, ఓవరాల్ గా One-time watch for its feel-good vibes..

Apr 18, 2026 Telugu

LIK (Love Insurance Movie Review)

6.0
out of 10
లైక్ (LIK) సినిమా అంటే… ట్రైలర్ చూసినప్పుడు “ఏదో కొత్తగా ఉంటుందేమో!” అనిపిస్తుంది. కానీ సినిమా చూసాక మాత్రం “అదే పాత ఫీలింగ్!” అనిపిస్తుంది. ఫ్యూచర్ జెనరేషన్ లూప్ హొల్స్ లో ఒక చిన్న పాయింట్ ని తీసుకొని ఈ కథ రెడీ చేసారు మేకర్స్. కానీ అసలు గేమ్ సెకండ్ హాఫ్‌ లో ఫెయిల్ అవుతుంది. స్టోరీ ఎటు వెళ్తుందో డైరెక్టర్‌ కే క్లారిటీ లేనట్టు అనిపిస్తుంది. మంచి పాయింట్‌ ని తీసుకుని దాన్ని సరిగ్గా డెవలప్ చేయకపోవడం...

లైక్ (LIK) సినిమా అంటే… ట్రైలర్ చూసినప్పుడు “ఏదో కొత్తగా ఉంటుందేమో!” అనిపిస్తుంది. కానీ సినిమా చూసాక మాత్రం “అదే పాత ఫీలింగ్!” అనిపిస్తుంది. ఫ్యూచర్ జెనరేషన్ లూప్ హొల్స్ లో ఒక చిన్న పాయింట్ ని తీసుకొని ఈ కథ రెడీ చేసారు మేకర్స్. కానీ అసలు గేమ్ సెకండ్ హాఫ్‌ లో ఫెయిల్ అవుతుంది. స్టోరీ ఎటు వెళ్తుందో డైరెక్టర్‌ కే క్లారిటీ లేనట్టు అనిపిస్తుంది. మంచి పాయింట్‌ ని తీసుకుని దాన్ని సరిగ్గా డెవలప్ చేయకపోవడం పెద్ద మైనస్. క్లైమాక్స్ కూడా పెద్దగా ఇంపాక్ట్ ఇవ్వదు. 


హీరో హీరోయిన్స్ Pradeep Ranganathan, Krithi Shetty పెర్ఫార్మన్స్ బానే ఉన్నా, న్యాచురాలిటీ మిస్ అయింది. మ్యూజిక్, విజువల్స్—all decent. కానీ కంటెంట్ వీక్ అయితే ఏం చేయలేము. బట్ స్టోరీ పాయింట్ బాగుంది. ఆ విషయంలో సో ఫ్రెష్ ఫీల్ ఇస్తుంది. అండ్ సినిమా రెగ్యులర్ మూవీ లవర్స్ కి పెద్దగా ఎక్కకపోవచ్చు గాని, ఫ్రెష్ కాన్సెప్ట్స్ ఇష్టపడే వాళ్లకి సినిమా నచ్చుతుంది. 

Apr 14, 2026 Telugu

LIK (Love Insurance Movie Review)

4.0
out of 10
లైక్ (LIK) సినిమా గురించి ఓవరాల్‌గా మాట్లాడితే… ఇది ఒక మంచి కాన్సెప్ట్‌తో వచ్చిన కానీ హాఫ్‌లోనే డ్రాప్ అయిన ఫిల్మ్. ముందుగా ప్లస్ పాయింట్ ఏమిటంటే… 2040 బ్యాక్‌డ్రాప్‌లో మొబైల్‌కు దూరంగా ఉండే హీరో, యాప్స్‌ని నమ్మే హీరోయిన్ అనే ఐడియా చాలా ఇంట్రెస్టింగ్. ఫస్ట్ హాఫ్ కూడా కొంతవరకు బాగానే వర్కౌట్ అవుతుంది. కొన్నిచోట్ల ఫన్, కొన్నిచోట్ల కాన్సెప్ట్—all mix అయి ఓకే ఫీల్ ఇస్తుంది.స్టోరీ ఎటు వెళ్తుందో కూడా క్...

లైక్ (LIK) సినిమా గురించి ఓవరాల్‌గా మాట్లాడితే… ఇది ఒక మంచి కాన్సెప్ట్‌తో వచ్చిన కానీ హాఫ్‌లోనే డ్రాప్ అయిన ఫిల్మ్. ముందుగా ప్లస్ పాయింట్ ఏమిటంటే… 2040 బ్యాక్‌డ్రాప్‌లో మొబైల్‌కు దూరంగా ఉండే హీరో, యాప్స్‌ని నమ్మే హీరోయిన్ అనే ఐడియా చాలా ఇంట్రెస్టింగ్. ఫస్ట్ హాఫ్ కూడా కొంతవరకు బాగానే వర్కౌట్ అవుతుంది. కొన్నిచోట్ల ఫన్, కొన్నిచోట్ల కాన్సెప్ట్—all mix అయి ఓకే ఫీల్ ఇస్తుంది.

స్టోరీ ఎటు వెళ్తుందో కూడా క్లారిటీ ఉండదు. మంచి పాయింట్ ఉన్నా, దాన్ని డెవలప్ చేయడంలో డైరెక్టర్ పూర్తిగా మిస్ అయ్యాడు. క్లైమాక్స్ కూడా పెద్దగా ఇంపాక్ట్ ఇవ్వదు.


ఇక పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే… Pradeep Ranganathan తన స్టైల్‌లో బాగానే చేశాడు. Krithi Shetty క్యూట్‌ గా కనిపించింది. S. J. Suryah పాత్ర మాత్రం సీరియస్‌ గా ఉండాల్సిన చోట కామెడీగా మారిపోవడం కొంచెం మైనస్. టెక్నికల్‌ గా సినిమా ఓకే—మ్యూజిక్, విజువల్స్ బాగానే ఉన్నాయి. కానీ కంటెంట్ స్ట్రాంగ్‌ గా లేకపోవడంతో అవి పూర్తిగా హెల్ప్ చేయలేకపోయాయి. “లైక్” సినిమా… ఐడియా పరంగా స్ట్రాంగ్, కానీ ఎగ్జిక్యూషన్ పరంగా వీక్. ఫస్ట్ హాఫ్ ఓకే… సెకండ్ హాఫ్ డ్రాప్… మొత్తానికి యావరేజ్ కంటే కాస్త తక్కువ అనిపించే సినిమా. ఒక ముక్కలో చెప్పాలంటే సొసైటీ లో మొబైల్ పిచ్చోళ్ళు ఉన్నారు, కానీ మొబైల్ ని ఇలా వాడేవాళ్లు లేరు కాబట్టి, LIK సినిమా కి ఇచ్చే రేటింగ్ 2.5.

Apr 14, 2026 Telugu

LIK (Love Insurance Movie Review)

Thyview

By Thyview

4.0
out of 10
“లైక్ (LIK)” గురించి స్ట్రైట్‌ గా చెప్పాలంటే… ఐడియా వినడానికి చాలా ఇంట్రెస్టింగ్‌ గా ఉంటుంది, కానీ సినిమా చూసాక మాత్రం ఆ ఫీల్ అంతగా రాదు. 2040 బ్యాక్‌ డ్రాప్, హీరో మొబైల్‌ కి దూరంగా ఉండటం, హీరోయిన్ యాప్స్‌ ని నమ్మడం, వినగానే “ఇది కొత్తగా ఉంటుంది” అనిపిస్తుంది. కానీ అసలు ప్రాబ్లమ్ సెకండ్ హాఫ్‌లో స్టార్ట్ అవుతుంది. కథ ఎటు వెళ్తుందో క్లారిటీ లేకుండా సాగిపోతుంది. మంచి పాయింట్ ఉన్నా, దాన్ని డెవలప్ చేయడ...

“లైక్ (LIK)” గురించి స్ట్రైట్‌ గా చెప్పాలంటే… ఐడియా వినడానికి చాలా ఇంట్రెస్టింగ్‌ గా ఉంటుంది, కానీ సినిమా చూసాక మాత్రం ఆ ఫీల్ అంతగా రాదు. 2040 బ్యాక్‌ డ్రాప్, హీరో మొబైల్‌ కి దూరంగా ఉండటం, హీరోయిన్ యాప్స్‌ ని నమ్మడం, వినగానే “ఇది కొత్తగా ఉంటుంది” అనిపిస్తుంది. కానీ అసలు ప్రాబ్లమ్ సెకండ్ హాఫ్‌లో స్టార్ట్ అవుతుంది. కథ ఎటు వెళ్తుందో క్లారిటీ లేకుండా సాగిపోతుంది. మంచి పాయింట్ ఉన్నా, దాన్ని డెవలప్ చేయడంలో డైరెక్టర్ పూర్తిగా మిస్ అయ్యాడు. ఎమోషన్స్ కూడా అంతగా కనెక్ట్ కావు.


Pradeep Ranganathan తన స్టైల్‌లో ఓకే పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. Krithi Shetty క్యూట్‌గా కనిపిస్తుంది. S. J. Suryah పాత్ర మాత్రం సీరియస్‌గా ఉండాల్సింది. టెక్నికల్‌గా సినిమా ఓకే. మ్యూజిక్, విజువల్స్ బాగానే ఉన్నాయి. కానీ కంటెంట్ స్ట్రాంగ్‌గా లేకపోతే ఇవి పెద్దగా హెల్ప్ అవ్వవు. ఓవరాల్ గా ప్రదీప్ రంగనాథన్ నెక్స్ట్ మూవీతో కం బ్యాక్ ఇవ్వాలని కోరుకోవడం తప్ప ఈ మూవీ కి న్యాయం చేయలేము. అలా న్యాయం చేద్దమని చూస్తే ప్రేక్షకుడు అన్యాయం అయిపోతాడేమో. 

Apr 14, 2026 Telugu

LIK (Love Insurance Movie Review)

4.0
out of 10
లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ” అనే కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ సినిమా, ఒక మంచి ఐడియాను తీసుకుని, దాన్ని పూర్తిగా వాడుకోలేకపోయిన సినిమాగా నిలుస్తుంది. Love Insurance Kompany లో 2040 బ్యాక్‌డ్రాప్‌ లో, టెక్నాలజీకి దూరంగా ఉండే హీరో… యాప్స్‌పై పూర్తిగా ఆధారపడే హీరోయిన్‌ను ప్రేమించడం అనే లైన్ చాలా మంచి కాన్సెప్ట్. ఇది రెలేషన్‌షిప్స్, నమ్మకం, మానవ భావోద్వేగాలపై ఒక డీప్ కామెంటరీగా మారే అవకాశం ఉంది. కానీ సినిమా ఆ లోత...

లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ” అనే కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ సినిమా, ఒక మంచి ఐడియాను తీసుకుని, దాన్ని పూర్తిగా వాడుకోలేకపోయిన సినిమాగా నిలుస్తుంది. Love Insurance Kompany లో 2040 బ్యాక్‌డ్రాప్‌ లో, టెక్నాలజీకి దూరంగా ఉండే హీరో… యాప్స్‌పై పూర్తిగా ఆధారపడే హీరోయిన్‌ను ప్రేమించడం అనే లైన్ చాలా మంచి కాన్సెప్ట్. ఇది రెలేషన్‌షిప్స్, నమ్మకం, మానవ భావోద్వేగాలపై ఒక డీప్ కామెంటరీగా మారే అవకాశం ఉంది. కానీ సినిమా ఆ లోతులోకి వెళ్లదు. 

Pradeep Ranganathan తన పాత్రలో కంఫర్ట్‌ గా కనిపిస్తాడు. అతని పెర్ఫార్మెన్స్ సినిమాకు కొంత స్టెబిలిటీ ఇస్తుంది. Krithi Shetty రోల్ ఎందుకుందో కూడా తెలీదు. S. J. Suryah పాత్రలో కూడా కొంత మిస్‌యూజ్ అనిపిస్తుంది. 


మొత్తానికి… “లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ” ఒక మంచి ఐడియాతో ప్రారంభమై, మధ్యలోనే దారి తప్పిన ప్రయాణంలా అనిపిస్తుంది. LIK అని సినిమా టైటిల్ పెట్టాడు గాని, సినిమా చుస్తే లవ్ ఇన్సూరెన్స్ కంపెని లా కాదు, కొంప ముంచే కంపెనీ సినిమాలా ఉంది. 

Apr 14, 2026 Telugu
4.0
out of 10
LIK సినిమా గురించి మనం మాట్లాడుకుంటే... స్టోరీ పరంగా 2040లో సెట్ చేస్తాం. హీరో మొబైల్‌ కు దూరంగా ఉంటాడు… హీరోయిన్ మాత్రం యాప్స్‌ నే నమ్ముతుంది. హీరో ఆమెను ప్రేమిస్తాడు… ఆమె యాప్‌ ని నమ్మి ‘నో’ చెబుతుంది… తర్వాత హీరో ఆమెకు ప్రేమ విలువ చెప్పడానికి ట్రై చేస్తాడు సార్!” వినడానికి చాలా కొత్తగా ఉన్నా, Love Insurance Kompany చాలా ల్యాగ్ ఫీలింగ్ ఇస్తుంది. మెయిన్ గా సెకండ్ హాఫ్ లో ఏదైనా గుడ్ ఎండింగ్ ఇ...

LIK సినిమా గురించి మనం మాట్లాడుకుంటే... స్టోరీ పరంగా 2040లో సెట్ చేస్తాం. హీరో మొబైల్‌ కు దూరంగా ఉంటాడు… హీరోయిన్ మాత్రం యాప్స్‌ నే నమ్ముతుంది. హీరో ఆమెను ప్రేమిస్తాడు… ఆమె యాప్‌ ని నమ్మి ‘నో’ చెబుతుంది… తర్వాత హీరో ఆమెకు ప్రేమ విలువ చెప్పడానికి ట్రై చేస్తాడు సార్!” వినడానికి చాలా కొత్తగా ఉన్నా, Love Insurance Kompany చాలా ల్యాగ్ ఫీలింగ్ ఇస్తుంది. మెయిన్ గా సెకండ్ హాఫ్ లో ఏదైనా గుడ్ ఎండింగ్ ఇస్తారనుకుంటే... మొత్తం ఆడియన్స్ ఊహించినట్టుగానే ఉంటుంది. ఇంచు మించు ఎక్కడో స్టార్ట్ అయి, ఇంకెక్కడో ఎండ్ అయినట్టు అయిపోతుంది. 


కథ పూర్తిగా ట్రాక్ తప్పి, మంచి పాయింట్ ఉన్నా దాన్ని సరిగ్గా డెవలప్ చేయకుండా వదిలేశారు. మూవీ లో హీరో, హీరోయిన్ రోల్స్ బాగానే ఉన్నా, పెర్ఫార్మన్స్ పరంగా రొటీన్ గా చేసారు. కొత్తదనం లేదు,

సాంగ్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఓకే. ఎడిటింగ్, స్క్రీన్‌ప్లే ఫస్ట్ హాఫ్ వరకు బాగానే ఉంటుంది… కానీ సెకండ్ హాఫ్? “ఫ్లాట్‌గా పడిపోవడం చాలా ఈజీ. ఫైనల్‌ గా మంచి కాన్సెప్ట్‌ తో స్టార్ట్ అయ్యి… సెకండ్ హాఫ్‌ లో పూర్తిగా డ్రాప్ అయింది. పైగా సినిమా మొత్తం ఫోన్ ఫోన్ ఫోన్ అదే చూపించారు గాని, నటీనటుల సైడ్ నుండి సినిమా చూసినట్టు లేదు.  

Apr 14, 2026 Telugu

Dacoit Movie Review

7.0
out of 10
"డెకాయిట్" సినిమా గురించి మాట్లాడితే… ఇది ఓ స్టైలిష్ యాక్షన్ లవ్ స్టోరీగా మంచి ఎఫర్ట్ అని చెప్పాలి. ముందుగా చెప్పుకోవాల్సింది టెక్నికల్ పార్ట్ గురించే. విజువల్స్ చాలా రిచ్‌గా ఉన్నాయి, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సీన్స్‌కి మంచి ఎలివేషన్ ఇస్తుంది. మేకింగ్ పరంగా సినిమా ఎక్కడా కాంప్రమైజ్ కాలేదనిపిస్తుంది. ఈ విషయంలో టీమ్ మంచి వర్క్ చేసింది.అడివి శేషు మరోసారి తన స్టైల్‌లోనే సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. యా...

"డెకాయిట్" సినిమా గురించి మాట్లాడితే… ఇది ఓ స్టైలిష్ యాక్షన్ లవ్ స్టోరీగా మంచి ఎఫర్ట్ అని చెప్పాలి. ముందుగా చెప్పుకోవాల్సింది టెక్నికల్ పార్ట్ గురించే. విజువల్స్ చాలా రిచ్‌గా ఉన్నాయి, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సీన్స్‌కి మంచి ఎలివేషన్ ఇస్తుంది. మేకింగ్ పరంగా సినిమా ఎక్కడా కాంప్రమైజ్ కాలేదనిపిస్తుంది. ఈ విషయంలో టీమ్ మంచి వర్క్ చేసింది.


అడివి శేషు మరోసారి తన స్టైల్‌లోనే సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. యాక్షన్, ఎమోషన్ రెండింటినీ బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేశాడు. మృణాల్ ఠాకూర్ కూడా స్క్రీన్‌పై మంచి ప్రెజెన్స్ చూపించింది. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ కొన్ని చోట్ల బాగా వర్కౌట్ అవుతుంది. సినిమాలో కొన్ని ట్విస్టులు, ఎమోషనల్ మోమెంట్స్ బాగానే కనెక్ట్ అవుతాయి. ముఖ్యంగా క్లైమాక్స్ ఎమోషనల్‌గా టచ్ చేస్తుంది. స్టోరీ రొటీన్ లైన్‌లో ఉన్నప్పటికీ, ప్రెజెంటేషన్ వల్ల సినిమా ఎంగేజ్ చేసే ప్రయత్నం చేస్తుంది. కొన్ని చోట్ల స్క్రీన్‌ప్లే మరింత గ్రిప్‌గా ఉండి ఉంటే ఇంకా బెటర్ అయ్యేది. అయినా కూడా ఓవరాల్‌గా సినిమా ఒక డీసెంట్ ఎంటర్‌టైనర్‌గా నిలుస్తుంది.

Apr 10, 2026 Telugu

Dacoit Movie Review

5.0
out of 10
"డెకాయిట్" గురించి మాట్లాడితే… ఇది ఒక యాక్షన్ లవ్ స్టోరీగా ప్యాకేజ్ చేసిన సినిమా. కానీ ఆ ప్యాకేజింగ్ లోపల ఉన్న కంటెంట్ మాత్రం అంతగా ఎగ్జైట్ చేయదు. సినిమా టెక్నికల్‌గా స్ట్రాంగ్‌గా ఉంటుంది. విజువల్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, మేకింగ్ అన్ని ఇంప్రెస్ చేస్తాయి. బట్ ఏదో తక్కువైంది అన్న ఫీల్ వస్తుంది. కంటెంట్, రైటింగ్, స్క్రీన్‌ ప్లే కూడా అంతే ముఖ్యమైనవి. అక్కడికే ఈ సినిమా కొంచెం తగ్గిపోతుంది. స్క్రీన్‌ ప...

"డెకాయిట్" గురించి మాట్లాడితే… ఇది ఒక యాక్షన్ లవ్ స్టోరీగా ప్యాకేజ్ చేసిన సినిమా. కానీ ఆ ప్యాకేజింగ్ లోపల ఉన్న కంటెంట్ మాత్రం అంతగా ఎగ్జైట్ చేయదు. సినిమా టెక్నికల్‌గా స్ట్రాంగ్‌గా ఉంటుంది. విజువల్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, మేకింగ్ అన్ని ఇంప్రెస్ చేస్తాయి. బట్ ఏదో తక్కువైంది అన్న ఫీల్ వస్తుంది. కంటెంట్, రైటింగ్, స్క్రీన్‌ ప్లే కూడా అంతే ముఖ్యమైనవి. అక్కడికే ఈ సినిమా కొంచెం తగ్గిపోతుంది. స్క్రీన్‌ ప్లే లో కొన్ని ఆసక్తికరమైన ఐడియాస్ ఉన్నప్పటికీ, అవి పూర్తిగా ఎఫెక్టివ్‌ గా ఎగ్జిక్యూట్ కాలేదు. 


పైగా ట్విస్టులు ఉన్నా, అవి మనల్ని సర్ప్రైజ్ చేయవు. బట్ పెర్ఫార్మన్స్ వైస్ గా అడివి శేష్ తన పాత్రలో బెస్ట్ అండ్ సెటిల్డ్ పెర్ఫార్మన్స్ ఇచ్చాడు. కానీ అతను ఎంచుకునే కథల మీద ఉన్న ఎక్స్‌పెక్టేషన్‌ ను ఈ సినిమా పూర్తిగా మీట్ చేయలేదు. మృణాల్ ఠాకూర్ కూడా తన రోల్ కి సరిపడేలా నటించింది కానీ ఆమె పాత్రలో మరింత డెప్త్ ఉండాల్సింది. క్లైమాక్స్ భావోద్వేగంగా కనెక్ట్ అవ్వాలనుకుంటుంది. కానీ ముందు వచ్చిన నరేషన్ దానికి సరైన బిల్డ్ ఇవ్వలేదు. అందుకే ఆ ఎమోషన్ కూడా పూర్తిగా హిట్ అవ్వదు. మొత్తానికి “డెకాయిట్” ఒక మిడ్-లెవల్ ఎఫర్ట్. ఐడియా ఉంది, టెక్నికల్ స్ట్రెంగ్త్ ఉంది… కానీ వాటిని కలిపే రైటింగ్ లోపించడం వల్ల సినిమా తన పూర్తి సామర్థ్యాన్ని అందుకోలేకపోయింది. 

Apr 10, 2026 Telugu