Latest Movie Reviews
The most recent reviews from top critics and publications
Sahaa movie review
సహ సినిమాని ఎంతో డెప్త్‌తో రాసుకున్నాడు దర్శకుడు. పూర్తిగా ప్రేమ, అమ్మాయి అబ్బాయి పాయింట్ ఆఫ్ వ్యూలోనే కథను అల్లుకున్నాడు. సహ లైఫ్ ఆఫ్ సంజు అని పెట్టిన టైటిల్, క్యాప్షన్‌కి తగ్గట్టుగానే సినిమా ఉంది. అమ్మాయి ప్రేమలో పడి, తనే లోకంగా బతికి, అందులోంచి బయటకు రాలేక చిక్కుకుపోయిన సంజు కథే ‘సహ’. ఈ కథకు కొన్ని చోట్ల లాజిక్స్ కనిపించవు. ఇలా కూడా ఉంటారా? అని అనిపించే అవకాశం ఉంటుంది. అయితే సహ మూవీ మాత్రం ఓ సెక్షన్ ఆఫ్ ఆడియెన్స్‌కి నచ్చే అవకాశం ఉంటుంది.
సినిమా ముందుకు వెళ్తున్న కొద్దీ భారంగా మారుతుంటుంది. ఇన్ని కష్టాలా? ఇన్ని బాధలా? అన్నట్టుగా అనిపిస్తుంది. ఇక క్లైమాక్స్ మాత్రం గుండెల్ని మరింత భారంగా చేస్తుంది. చివరి 20 నిమిషాల్లో ఆడియెన్స్ కన్నీరు పెట్టే అవకాశం ఉంది. ఆర్టిస్టుల విషయానికి వస్తే శివ కుమార్, శ్వేత లక్ష్మణ్ ఎక్కువగా కనిపిస్తారు. సంజు, సహ పాత్రలకు వారిద్దరూ వంద శాతం న్యాయం చేశారని చెప్పుకోవచ్చు. వ్రజన పాండ్య పాత్ర కూడా బాగుంటుంది. చివరగా సహ మూవీని చూడాలంటే కాస్త ఓపిక, సహనం అయితే ఉండాల్సిందే. అసలే ఇంకా బ్రేకప్ బాధలు, డిప్రెషన్, ట్రామా ఉంటే మాత్రం ‘సహ’ మరింత భారంగా అనిపించే అవకాశం ఉంది.
Dharmasthala Niyojakavargam movie review
వారమంతా వర్క్ ప్రెజర్ తర్వాత కాస్త మైండ్ రిలీఫ్ కోసం సినిమాకెళ్తే, అక్కడ స్లో నెరేషన్ మన ఓపికకి పరీక్ష పెడుతుంది. అసలు ధర్మస్థల నియోజకవర్గం మూవీకి డైరెక్టర్ ఎంచుకున్న 'సోషల్ మెసేజ్ + పొలిటికల్ డ్రామా' ఐడియా పర్ఫెక్ట్.
మూవీలో సాయికుమార్, సుమన్ గారి పెర్ఫార్మన్స్ వల్ల సినిమా అక్కడక్కడా హోల్డ్ అవుతుంది. కానీ సెకండాఫ్ లో సాగదీత సీన్లు ఎక్కువగా ఉండటం వల్ల ఎంగేజ్‌మెంట్ దెబ్బతింది. టైమ్ వాల్యూ బేస్ చేసుకుంటే థియేటర్ కి వెళ్లేంత వర్త్ లేదు. నాకైతే మిక్స్డ్ ఫీల్ వచ్చింది. ఎవరైనా చూడాలనుకుంటే.. వీకెండ్ బింజ్ వాచ్ కోసం OTT రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయొచ్చు.
Dharmasthala Niyojakavargam movie review
కాలేజ్ బ్యాక్‌డ్రాప్ లో డ్రగ్స్ మాఫియా అనగానే ధర్మస్థల నియోజకవర్గం స్టూడెంట్స్ కి బాగా కనెక్ట్ అయ్యే సబ్జెక్టే.
వితికా షెరు లెక్చరర్‌గా, స్టూడెంట్ బద్రి (నటరాజ్) చేసిన ఫైట్ బాగుంది. కానీ ప్రాబ్లెమ్ ఏంటంటే.. మేకింగ్ అంతా చాలా ఓల్డ్ స్కూల్‌లా ఉంది.
మన ఇప్పటీ జనరేషన్ స్పీడ్ కి ఈ స్క్రీన్ ప్లే మ్యాచ్ అవ్వలేదు. సాయికుమార్ సార్ విలన్‌గా డైలాగ్స్ తో రచ్చ లేపారు కానీ, ఫ్రెండ్షిప్ అండ్ ఎమోషనల్ సీన్స్ ఇంకా స్ట్రాంగ్ గా ఉంటే బాగుండేది.
ovarall : గ్యాప్ దొరికినప్పుడు విత్ ఫ్రెండ్స్ క్యాజువల్ ఓటిటి వాచ్.. అంతే!
Dharmasthala Niyojakavargam movie Review
By NTV Telugu
ధర్మస్థల నియోజకవర్గం అనే టైటిల్ తో, పొలిటికల్ సినిమా, వరుణ్ సందేశ్ భార్య వితిక షేరు రీ ఎంట్రీ సినిమా అని ఈ సినిమాపై రిలీజ్ కి ముందే కాస్త బజ్ నెలకొంది. ఇక స్టోరీ లైన్ గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే... ఒక నియోజకవర్గాన్ని తన చేతిలో పెట్టుకొని జనాల్ని భయపెడుతూ విర్రవీగుతున్న ఓ రాజకీయనాయకుడిని ఎలా ఎదురించారు అనే కథతో ఈ సినిమాని తెరకెక్కించారు. అలాగే డ్రగ్స్ తో యువత ఎలా పాడైపోతుంది అనే మెసేజ్ ని, ఓటు హక్కు మెసేజ్ ని చూపించారు.
అయితే ఫస్ట్ హాఫ్ ని రొటీన్ ఫైట్స్, సాంగ్స్ తో సాగదీసినా సెకండ్ హాఫ్ సీన్స్ పరిగెడతాయి. అయితే రాజకీయ నాయకులపై సామాన్యులు పోటీకి నిలబడి గెలిచినా సినిమాలు అనేకం ఉన్నాయి. ఇది కూడా అలాంటిదే. కాకపోతే కొన్ని మెసేజ్ లు ఇస్తూ పొలిటికల్ యాక్షన్ గా తెరకెక్కించారు. ఇక సినిమాలో సాయికుమార్, సుమన్ తో పాటు, వరుణ్ సందేశ్, వితిక షేరు కూడా బాగా నటించారు. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. మొత్తంగా ‘ధర్మస్థల నియోజకవర్గం’ యూత్ కి, జనాలకు మెసేజ్ ఇస్తూ సాగిన పొలిటికల్ యాక్షన్ సినిమా. ఈ సినిమాకు 2.75 రేటింగ్ ఇవ్వొచ్చు.
Dharmasthala Niyojakavargam Movie Review
By TV9 Telugu
సమాజంలో ఒక స్త్రీ గట్టిగా నిర్ణయించుకుంటే ఎంతటి మార్పునైనా తీసుకురాగలదు అనే బలమైన సందేశాన్ని దర్శకుడు జై జ్ఞాన ప్రభ తోట తెరపై ఆవిష్కరించారు. ప్రస్తుత రాజకీయ నాయకులు ధనం కోసం ఎంతటి నీచానికైనా ఎలా దిగజారుతున్నారో చాలా సున్నితంగా, ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా చూపించిన విధానం మెచ్చుకోదగ్గది. పైగా ఇది కేవలం ఒక ఊరికి సంబంధించిన కథ కాదు, నేటి యువత, ముఖ్యంగా విద్యార్థులు, వాళ్ళ తల్లిదండ్రులు చూడాల్సిన సామాజిక అంశాలు ఈ సినిమాలో డిస్కస్ చేసాడు దర్శకుడు ప్రభ.
అలాగే ఎలాంటి అసభ్యత లేకుండా చాలా క్లీన్‌గా, ఒక అద్భుతమైన సామాజిక ప్రయోజనంతో ఒక మంచి ప్రయత్నమే చేసారు. సీనియర్ నటులు సుమన్, సాయికుమార్ తమ అద్భుత నటనతో ఒకరికొకరు గట్టి పోటీ ఇచ్చారు. అలాగే వితిక షేరు కి కూడా మంచి రోల్ పడింది. ఇక మొదటి చిత్రంతోనే ఇంతటి బరువైన కథాంశాన్ని ఎంచుకోవడం దర్శకుడు జై చేసిన సాహసమే. తను ఎంచుకున్న రెండు ప్రధాన సమస్యలకు సరైన ముగింపు ఇచ్చే ప్రయత్నం చేసాడు. తొలి ప్రయత్నంలోనే చాలా మంది సీనియర్స్‌ను హ్యాండిల్ చేసారు. ఓవరాల్ గా ధర్మస్థల నియోజకవర్గం.. పొలిటికల్ ఎంటర్‌టైనర్ విత్ మెసేజ్..!
Dharmasthala Niyojakavargam Movie Review
By Sakshi
సాయికుమార్, సుమన్ ప్రధాన పాత్రల్లో జై జ్ఞాన ప్రభ దర్శకత్వంలో తెరకెక్కిన రూరల్ పొలిటికల్ డ్రామా 'ధర్మస్థల నియోజకవర్గం'. సినిమా స్టోరీ పరంగా బాగానే రాసుకున్నా, దానికి తగ్గ మంచి స్క్రీన్ ప్లే రాసుకోవడంలో డైరెక్టర్ తడబడ్డాడు.
డ్రగ్స్ మాఫియా, రాజకీయాల చుట్టూ తిరిగే ఈ కథలో సాయికుమార్ విలనిజం, డైలాగ్స్ ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. అండ్ చాలా రోజుల తర్వాత సుమన్ కి కూడా స్ట్రాంగ్ రోల్ పడింది. అండ్ కీ రోల్ లో నటించిన వితికా షేరుకి కూడా మంచి రోల్ వచ్చింది.
అయితే, నెమ్మదించిన కథనం, పాత సీన్లు నిరాశపరుస్తాయి. మంచి మెసేజ్ ఉన్నా స్క్రీన్‌ప్లే వీక్‌గా ఉండటంతో సాధారణ చిత్రంగా మిగిలిపోయింది. ఓవరాల్ గా ఒక్కసారి చూసేలా ఉంది.
Ramba Oorvasi Menaka Movie review
By Cinema Picha
'రంభ ఊర్వశి మేనక' రివ్యూ.. గురించి చెప్పాలంటే... ఆల్మోస్ట్ అల్లరి నరేష్ గత మూవీ యముడికి మొగుడు కాన్సెప్ట్ లాగానే ఇది కూడా ఉంటుంది. అండ్ సినిమా స్టోరీ పాయింట్ గురించి చెప్తే బానే ఉంది. ఓవరాల్ గా కామెడీ అయితే నాకు వర్కౌట్ కాలేదు. కొన్ని సీన్స్ బాగుంటాయి. అండ్ సినిమాలో ఎమోషనల్ సీన్స్ కి కూడా కనెక్ట్ అవలేం. అండ్ హీరో హీరోయిన్ లవ్ ట్రాక్ పెద్దగా వర్కౌట్ కాలేదు. ఇక AI అయితే సినిమాలో వరెస్ట్ గా ఉన్నాయి. సెట్ ప్రాపర్టీస్ ఫేక్ గా అనిపిస్తాయి.
అండ్ సినిమాలో మెయిన్ గా అల్లరి నరేష్ గారి యాక్టింగ్ పెద్దగా లేదు. కానీ ఆయన పొటెన్షియల్ కి తగ్గ రోల్ కాదు ఇది. అండ్ మిగతా వాళ్ళు అంతంత మాత్రమే.. అండ్ సినిమాలో ఓవరాల్ గా కొన్ని కామెడీ సీన్స్ తప్ప ఇంకేమి వర్కౌట్ కాలేదు. ఫైనల్లీ అల్లరి నరేష్ గారు ఫుల్ లెంగ్త్ కామెడీ సినిమా బాగా చేద్దామనుకున్నారు కానీ, ఇది యముడికి మొగుడు 2.0 లా ఉంది కానీ, కనెక్ట్ కాదు.
Ramba oorvasi menaka movie review
'రంభ ఊర్వశి మేనక' రివ్యూ.. నాకు అల్లరి నరేష్ సినిమాలంటే చాలా ఇష్టం. ఆయన మీదున్న అభిమానంతోనే సినిమాకి వెళ్ళాను. సినిమా చూసాక ఓవరాల్ గా కొన్ని సీన్స్ మాత్రమే బాగున్నాయి. బేసిగ్గా స్టోరీ పాయింట్ చూస్తే.. ఒక బుక్ లో ఉన్నట్టు, రంభ ఊర్వశి మేనక లు ఏదో ఒకరోజు వచ్చి వరం ఇస్తాడని ఎదురుచూస్తుంటారు. ఓపెన్ గా చెప్పాలంటే మంచి లైన్ ని తీసుకొచ్చి, రొటీన్ ట్రీట్మెంట్ తో తలనొప్పి తీసుకొచ్చారు. అండ్ సినిమాలో నరేష్ గారు మాత్రం బాగా పెర్ఫార్మ్ చేసారు.
కొన్ని సీన్స్ కోసం ఒకసారి చూసేలానే ఉంది. మూవీలోని కాన్సెప్ట్ బాగుంది. కామెడీ సీన్స్ బాగున్నాయి. వెన్నెల కిషోర్ ఇంద్రుడిగా బాగున్నాడు. మైనస్ పాయింట్స్ చెప్పుకుంటే, రొటీన్ సీన్స్, రొటీన్ స్టోరీ.. అండ్ ట్రీట్మెంట్ కూడా యావరేజ్ టెంప్లెట్ తో వెళ్ళిపోతుంది. అండ్ మదర్ సెంటిమెంట్ కనెక్ట్ కాలేదు. కొన్ని సీన్స్ కన్విన్సింగ్ గా లేదు. అండ్ ముగ్గురి హీరోయిన్లకు సరైన సీన్లు లేవు. ఓవరాల్ గా పెద్ద పెద్ద కామెడియన్లను పెట్టి బాగానే ట్రై చేసారు. కానీ ఫ్రెష్ ఫీల్ అయితే రాలేదు. కొన్ని ఫన్ సీన్ల కోసం ఒకసారి చూసేలా సినిమా ఉంది. అండ్ ఈ సినిమాకి నా పర్సనల్ రేటింగ్ 2.75\5
Rambha Oorvasi Menaka movie review
By Thyview
'రంభ ఊర్వశి మేనక' రివ్యూ.. సినిమా చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే అస్సలు నచ్చలేదండి. అసలు సినిమాలో స్టోరీ పాయింట్ ఏముందో కూడా సరిగా అర్ధం కాదు. ఎందుకంటే టైటిల్ రోల్ చేసిన వాళ్ళ చుట్టూ సినిమా ఉంటుంది కానీ, వాళ్లకు అస్సలు కనెక్ట్ అవదు. అండ్ ఈ సినిమా పదేళ్ల కిందట వచ్చినా కూడా హిట్ అవదు. మొత్తం సినిమాలో ఒక్క సీన్ కూడా నచ్చలేదు. అండ్ ప్రీ ఇంటర్వెల్ సీన్ లో సినిమా చేంజ్ అవుతుంది అన్న ఆశ వస్తుంది, కానీ సినిమాలో అదొక్క సీన్ తప్ప ఇంకేమి లేదు.
అండ్ సినిమాలో హీరోయిన్లు ఐదు నిమిషాల కొచ్చి ఏవో డాన్సులు వేసి, డైలాగులు చెప్పి వెళ్ళిపోతారు. అండ్ సినిమాలో వింటేజ్ నరేష్ కనిపిస్తాడు అని, చాలా మంది ఆడియన్స్ అనుకున్నారు కానీ, ఇప్పుడు కూడా దెబ్బేసారు. అండ్ యాక్టింగ్ విషయానికి వస్తే ఎవ్వరు కూడా ఫ్రెష్ గా చేయలేదు. ఓవరాల్ గా మూవీలో కథ పరంగా ఎక్కడా సీరియస్ నెస్ లేదు. క్లైమాక్స్ కూడా కన్విన్సింగ్ గా లేదు. ఓవరాల్ గా రంభ ఊర్వశి మేనకా డిస్సపాయింట్ చేసిందండి.
Ramba Oorvasi menaka movie review
'రంభ ఊర్వశి మేనక' రివ్యూ.. మూవీ గురించి చెప్పాలంటే గుడ్. బాగుంది సినిమా.. అంటే అవుట్ రైట్ ఫన్నే. స్టార్టింగ్ లో ఒకలాగా ఉంటది, ఎండింగ్ లో ఒకలా ఉంటది. సినిమాలో ఫన్ బాగానే వర్కవుట్ అయింది. అవుట్ డేటెడ్ అనుకున్నా, కానీ మంచి ఫన్ అండ్ ఎమోషనల్ మూవీ అని చెప్పాలి. అల్లరి నరేష్ గారు ఇలా ఫన్ ఓరియెంటెడ్ మూవీస్ తీస్తే బాగుంటుంది. అండ్ సినిమాలో చాలా సినిమాల రిఫరెన్స్ లు ఉంటాయి. ఇక ఎమోషనల్ డ్రామా అనేది సినిమాలో వర్కౌట్ అయింది. కానీ దానికన్నా ఫన్ మెయిన్ కంటెంట్ అని చెప్పాలి.
అండ్ సినిమాలో 1 or 2 సీన్స్ రొటీన్ గా బోరింగ్ గా అనిపిస్తాయి. అల్లరి నరేష్ గారితో పాటు, వెన్నెల కిషోర్ క్యారెక్టర్ కూడా బాగుంది. హీరోయిన్లు అందరూ బాగా చేసారు. సినిమాలో చిన్న మెసేజ్ కూడా బాగుంది. సాంగ్స్ అండ్ బీజీఎమ్ కూడా డీసెంట్ గా ఉన్నాయి. ఓవరాల్ గా సినిమా గుడ్. ఇప్పటికైతే ఈ రివ్యూ ఇంతే.
Ramba Oorvasi menaka movie review
'రంభ ఊర్వశి మేనక' రివ్యూ.. గురించి చెప్పాలంటే... ముందు నేను అల్లరి నరేష్ మూవీ చాలా రోజులుగా మిస్ అయ్యాను ఎలాగైనా వెళ్లాలని వెళ్ళా... చూసాక it is so bad... ఈ సినిమా అయితే ఇక కష్టమే. మాములుగా కొన్ని సినిమాలుంటాయి.. అరె ఇది అప్పుడొచ్చుంటే ఆడుండేదేమో రా అనేట్టు ఉంటాయి.. కానీ ఈ సినిమా అలా కూడా ఉండదు. ఎప్పుడొచ్చినా ఆడవు అనేలా ఉంటుంది.
పైగా ఈ సినిమాలో రంభ ఊర్వశి మేనకలను దేవతలంటూ చూపిస్తూ ఐటెం సాంగ్ చేయించారు అది అస్సలు నచ్చలేదు. పైగా వెకిలి చేష్టలు చేయిస్తారు. ఈ స్టోరీ లైన్ రాయడం చాలా రొట్టగా ఉంది. అసలు ఈ సీన్ కి నవ్వాలా అని ఒక్క సీన్ కూడా అనిపించదు. తల తోక సంబంధం లేని జబర్దస్త్ కామెడీ కన్నా ఘోరంగా రోతగా ఉంటుంది ఈ సినిమా. సినిమాలో ఎన్ని బెస్ట్ సీన్స్ ఉన్నాయో లెక్కబెట్టడం కూడా అవసరం ఉండదు. ఎందుకంటే నాకైతే ఎక్కడా కనిపించలేదు. అసలు స్టోరీ ఎట్నుంచి ఎటొచ్చి ఎల్తుందో కూడా తెలీదు. పైగా సినిమాలో AI సీన్లు పెట్టారు. దరిద్రంగా ఉంటాయి. చాలా సీన్లు non sink లో ఉంటాయి. ఓవరాల్ గా దీని గురించి ఎంత మాట్లాడితే అంత వేస్ట్.
Ramba oorvasi menaka movie review
సో 'రంభ ఊర్వశి మేనక' మూవీ చూసొస్తున్నాను. సగమే చూసొస్తున్నాను. బేసిగ్గా అంతే ఎం లేదు మూవీ.. నేను సినిమాలో ఎంత దరిద్రం ఉన్నా, ఒక్క పాజిటివ్ ఉన్నా మొత్తం చూస్తా.. కానీ ఈ సినిమాలో ఒక్క జోక్ కి నవ్వు రాలేదు. నాకొక్కడికే నవ్వు రావట్లేదేమో అనుకున్నా, కానీ థియేటర్లో మిగతా వాళ్ళు కూడా నవ్వట్లేదు. సినిమా మొత్తం 90స్ లో కూడా రాని క్రిమ్జ్ కామెడీని ఇరికించారు. ఎంతలా అంటే నేను చూసిన థియేటర్లో కొంతమంది నిద్రపోయారు.
సినిమా అయితే దారుణాతి దారుణం. సినిమాలో హీరో సహా ఎవ్వరి క్యారెక్టర్ కూడా నచ్చలేదు నాకు. అండ్ సినిమా కోసం చాలా ట్రావెల్ చేశా.. దాంతో మరింత తలనొప్పి ఒచ్చింది నాకు. అండ్ ట్రైలర్ కూడా నచ్చలేదు కానీ ఎందుకు పోయాను అంటే... ఈ ఇయర్ లో కొన్ని రొటీన్ ట్రైలర్ ఇచ్చి, సినిమాలో మంచి కంటెంట్ ఇచ్చారు. అలాగే ఈ సినిమా కూడా ఉంటుందేమో అని ఆశతో వెళ్ళాను. కానీ తప్పు చేసానని వెళ్ళాక తెలిసింది. సింపుల్ గా చెప్పాలంటే ఏదో పైత్యంతో వెళ్ళాను. ఇంకా సినిమా గురించి చెప్పాలంటే... నా వల్ల కాదు. ఇక మిగతా వాళ్ళు రుద్దుతున్నావు అంటే కూడా నేనేం చేయలేను. ఓవరాల్ గా నాకైతే నచ్చలేదు.