Latest Movie Reviews
The most recent reviews from top critics and publications
Sardar 2 movie review
By T2B Live
సర్దార్ మొదటి పార్ట్ సాలిడ్ విజయం సాధించడంతో రెండో పార్ట్ ను తెరకెక్కించగా ఎక్కడా కూడా సీక్వెల్ హైప్ కి మ్యాచ్ అయ్యేలా అయితే సర్దార్2 స్క్రీన్ ప్లే ను రాసుకోలేక పోయాడు డైరెక్టర్. కథ ఎటు నుండి ఎటో వెళ్ళిన ఫీలింగ్ కలుగుతుంది అలాగే చాలా లాగ్ ఉన్న సీన్స్ తో డ్రాగ్ అవుతూ అసలు ఈ సీక్వెల్ బ్లాక్ బస్టర్ అయిన సర్దార్ సీక్వెలేనా అని అనిపించేలా ఉంటుంది. ఉన్నంతలో కార్తి తన వరకు రెండు రోల్స్ డిఫెరెంట్ గెటప్స్ లో ఆకట్టుకున్నాడు. ఇక హీరోయిన్స్ ఉన్నంతలో ఓకే అనిపించుకోవా ఎస్ జే సూర్య విలన్ గా పర్వాలేదు అనిపించినా కథ పెద్దగా లేక పోవడంతో ఇంపాక్ట్ లేకపోయింది.
ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే చాలా వీక్ గా అనిపించగా ఏ దశలో మెప్పించలేకపోయింది…ఫస్టాఫ్ లోనే డ్రాగ్ ఎక్కువ ఉందంటే సెకెండ్ ఆఫ్ డ్రాగ్ మరీ ఎక్కువ అయింది…సీన్స్ వైజ్ గా కూడా చాలా కొన్ని సీన్స్ మినహా పెద్దగా ఇంప్రెస్ చేయలేక పోయింది ఈ సీక్వెల్. మొత్తం మీద మరీ తక్కువ అంచనాలు పెట్టుకుని థియేటర్స్ కి వెళ్ళినా కూడా సినిమా ఆ అంచనాలను కూడా అందుకోవడానికి చాలా ఓపిక పట్టి చూడాల్సి ఉంటుంది…అంత ఓపిక ఉంటే ఓవరాల్ గా కొంచం కష్టం అయినా ఓకే అనిపించవచ్చు.
Sardar 2 Movie Review
సర్దార్ 2... ఇది ఫస్ట్ హాఫ్ కి డైరెక్ట్ కంటిన్యుయేషన్.. ఇది చూడాలంటె ముందు ఫస్ట్ పార్ట్ కూడా చూడల్సి ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ పార్ట్ కి కనెక్షన్స్ చాల ఉంటాయి. అండ్ సెకండ్ పార్ట్ చూసాక చెప్పాలంటే... ఫస్ట్ హాఫ్ బాగుంది. సెకండ్ హాఫ్ మొత్తం పోయింది. మూవీలో ఫ్లాష్ బ్యాక్ ఇంటర్వెల్ కే వచ్చేసింది. దీంతో సెకండ్ హాఫ్ లో ఏం పెట్టాలో డైరెక్టర్ మర్చిపోయాడు అన్నట్టుంది. అండ్ ఫ్యామిలీతో చూడొచ్చా అంటే... చూడొచ్చు...
ఇక ప్లస్ పాయింట్స్ ఏంటంటే కార్తీ.. చాలా బాగా చేసాడు. అండ్ స్టోరీ పాయింట్ కూడా బాగుంది. అయితే ఎస్.జె. సూర్య రోల్ మాత్రం వేరే సినిమాల్లో ఉన్నట్టే ఉంది. యాక్టింగ్ కూడా ఫ్రెష్ గా లేదు. బీజీఎమ్ అయితే వరెస్ట్ గా ఉంది. అండ్ ల్యాగ్ సీన్స్ చాలా ఉన్నాయి. అండ్ సినిమాలో ఎడిటింగ్ వర్క్ చాలా ఉంది. అండ్ ఫస్ట్ పార్ట్ లో ఉన్న స్ట్రాంగ్ మెసేజ్ పాయింట్ సెకండ్ పార్ట్ లో రాసుకోలేదు. అది సినిమాకి మైనస్ అయింది. అండ్ AI విజువల్స్ బాగాలేవు. మూవీ లెంగ్త్ చాలా మైనస్ అయింది. ఫైనల్ గా ఫస్ట్ హాఫ్ బాగుంది నాకు నచ్చింది కాబట్టి, ఎవరైనా చూడాలంటె వన్ టైం వాచబుల్ అంటాను. కాబట్టి ఓవరాల్ గా నా రేటింగ్ 2.75\5
Sardar 2 Movie Review
Sardar 2 attempts to build on the world established in the first film, but unfortunately, it struggles to recreate the same impact.
The action sequences in the movie don’t deliver the expected highs, the spy elements rarely generate genuine suspense, and the emotional moments fail to leave a lasting impression.
The film does have a few intriguing ideas, but they are not explored with enough depth or conviction. The predictable screenplay and occasional logical inconsistencies further weaken the experience.
Karthi remains the strongest aspect of the film, bringing sincerity and conviction to his performance, but the writing limits how much he can elevate the material. S.J. Suryah, despite his potential, is also underutilised.
overall A disappointing follow-up with a strong lead performance but weak writing.
Sardar 2 Movie review
Part 1 ఇచ్చిన experience తర్వాత Sardar 2 మీద expectations naturally high గా ఉంటాయి. కానీ సినిమా చూసిన తర్వాత మాత్రం “ఇంతేనా?” అనే feeling వస్తుంది. అదే spy-thriller setup, అదే template, and Story చాలా predictableగా వెళ్లిపోవడంతో audienceకి engage అయ్యే అవకాశం కూడా తక్కువ.
కొన్ని ideas genuinely interestingగా అనిపిస్తాయి, కానీ వాటిని explore చేసే depth లేకపోవడంతో impact miss అవుతుంది. కొన్ని scenes అయితే logicకి కూడా దూరంగా అనిపిస్తాయి.
Overall, Sardar 2 feels less like a worthy continuation and more like a routine sequel made around a familiar template. Part 1 ఇచ్చిన highకి ఈ సినిమా చాలా దూరంలోనే ఆగిపోయింది.
Sardar 2 movie review
By Sakshi
కార్తీ హీరోగా తెరకెక్కిన సర్దార్ 2 పై మొదటి భాగం కారణంగా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఆ అంచనాలను ఈ సీక్వెల్ అందుకోలేకపోయింది.
పార్ట్ 1లో ఆకట్టుకున్న స్పై ఎలిమెంట్స్, యాక్షన్ సన్నివేశాలు, ఎమోషనల్ కంటెంట్ ఈసారి పెద్దగా ప్రభావం చూపించవు. కథనం రొటీన్ ఫార్ములాలో సాగుతూ, చాలా సందర్భాల్లో ముందే ఊహించే విధంగా ఉంటుంది.
కొన్ని ఆసక్తికరమైన అంశాలు ఉన్నప్పటికీ.. వాటిని బలమైన స్క్రీన్‌ప్లేతో నడిపించడంలో దర్శకుడు విఫలమయ్యారు. కొన్ని సన్నివేశాలు లాజిక్‌కు దూరంగా అనిపిస్తాయి. కార్తీ తన నటనతో సినిమాను నిలబెట్టే ప్రయత్నం చేసినా.. బలహీనమైన రైటింగ్ కారణంగా పూర్తిస్థాయిలో ఫలితం కనిపించదు.
overall.. భారీ అంచనాలతో వచ్చిన ‘సర్దార్ 2’ రొటీన్ కథనం, బలహీనమైన స్క్రీన్‌ప్లేతో నిరాశపరిచింది. పార్ట్ 1తో పోలిస్తే ఇది స్పష్టంగా డౌన్‌గ్రేడ్ సీక్వెల్.
Sardar 2 movie review
By One India
సర్దార్ 2 సినిమా గురించి చెప్పుకుంటే... డైరెక్టర్ పీఎస్ మిత్రన్ మొదటి భాగంలో ప్లాస్టిక్ బాటిళ్ల వల్ల కలిగే ప్రమాదాలను కోర్ పాయింట్ గా చూపిస్తే.. ఈ సీక్వెల్లో కృత్రిమ మాంసాహార ఉత్పత్తులు, మానవ శరీరానికి అతిగా మందులు, యాంటీబయోటిక్స్ అలవాటు చేయడం వల్ల వచ్చే ముప్పును ప్రధానాంశంగా ఎంచుకున్నారు. అయితే సెకండాఫ్‌లో స్క్రీన్ ప్లే కొంత నెమ్మదిస్తుంది. స్టోరీలో రొటీన్ ఫార్ములా సీన్లు, ప్రీ-క్లైమాక్స్, క్లైమాక్స్ డ్రామా ప్రేక్షకుడికి ముందే ఊహించగలిగేలా ఉండటం కాస్త నిరాశపరుస్తుంది.
అయితే ఎడిటింగ్ టేబుల్ పై ఇంకాస్త కత్తెర వేసి ఉంటే సినిమా వేగం పెరిగేది. మొత్తానికి ఎలాంటి థ్రిల్స్ లేని స్టోరీ, లాజిక్ లేని సీన్లు, సుదీర్ఘమైన రన్ టైమ్‌తో వచ్చిన 'సర్దార్ 2' ఓ విఫల సీక్వెల్‌గా మిగిలిపోయింది. ఫైనల్‌గా.. మొదటి భాగం స్థాయి మ్యాజిక్‌ను పూర్తిగా రిపీట్ చేయలేకపోయినప్పటికీ.. అంతర్జాతీయ స్పై థ్రిల్లర్స్, కార్తీ నటనను ఇష్టపడే వారు 'సర్దార్ 2' సినిమాను ఒకసారి వీక్షించవచ్చు.
Sardar 2 Movie Review
By TV9 Telugu
సర్దార్ సినిమా సూపర్ హిట్ కావడంతో.. అవే అంచనాలు సీక్వెల్ మీద కూడా ఉన్నాయి. అందుకే దర్శకుడు మిత్రన్ అసలు కథను ఎక్కడా పక్కదారి పట్టించకుండా సూటిగా పాయింట్‌లోకి తీసుకెళ్లడం సినిమాకు పెద్ద ప్లస్. ముఖ్యంగా స్పై థ్రిల్లర్‌కు కావాల్సిన అంశాలన్నీ బాగానే రాసుకున్నా కూడా వాటిని సరిగ్గా స్క్రీన్ మీదకు తీసుకురావడంలో అంతగా ఆకట్టుకోలేదు దర్శకుడు మిత్రన్. సర్దార్‌లో ప్లాస్టిక్ వాటర్ బాటిల్ నుంచి కలిగే నష్టాల గురించి చెప్పినట్లే.. ఇందులో కృత్రిమ మాంసాహారం, శరీరానికి మందులు విపరీతం అలవాటు చేస్తున్న విధానం గురించి చూపించారు.
అయితే ఫస్ట్ పార్ట్ చూసి చాలా ఏళ్లవడంతో కాస్త కన్ప్యూజన్స్ కూడా వస్తుంటాయి. మొదటి భాగానికి లింక్ పెడుతూ రాసుకున్న సన్నివేశాలు మళ్లీ గుర్తు చేసుకోవడం కష్టం. ఇక మూవీలో చివర్లో వచ్చే భారీ యాక్షన్ ఎపిసోడ్స్, క్లైమాక్స్ ఫైట్స్ మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా డిజైన్ చేశారు. స్క్రీన్ ప్లేలో నిడివి కొంచెం తగ్గించి, ఎమోషన్స్‌ను ఇంకొంచెం బలంగా ఎస్టాబ్లిష్ చేసి ఉంటే ఈ స్పై థ్రిల్లర్ రేంజ్ మరింత పెరిగి ఉండేది. ప్రొడక్షన్ వాల్యూస్ సినిమా స్థాయికి తగ్గట్లుగా చాలా రిచ్ గా ఉన్నాయి. కాకపోతే విజువల్ ఎఫెక్ట్స్ క్వాలిటీపై ఇంకొంచెం శ్రద్ధ పెట్టి ఉంటే అవుట్ పుట్ ఇంకా అద్భుతంగా వచ్చేది. ఓవరాల్ గా సర్దార్ 2.. యావరేజ్ స్పై థ్రిల్లర్..!
Sardar 2 movie review
By ABP Desam
సర్దార్ 2' తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో... కమల్ హాసన్‌కు 'భారతీయుడు'లా తనకు 'సర్దార్' అని కార్తీ చెప్పారు. అది నిజమే. 'భారతీయుడు'లో కమల్, 'సర్దార్'లో కార్తీ... తమ వయసుకు మించిన పాత్రల్లో కనిపించారు. లుక్స్, యాక్టింగ్ పరంగా మెప్పించారు. రెండు సినిమాల్లోనూ కంటెంట్ ఉంది. 'భారతీయుడు'కు సీక్వెల్ 'ఇండియన్ 2'తో కమల్ డిజాస్టర్ అందుకున్నారు. అలాగే సర్దార్ 2 తో కూడా కార్తీ డిజాస్టర్ అందుకున్నట్టు అనిపిస్తుంది.
చాలా మంచి విషయం చెప్పాలనుకున్నారు. కానీ, ఎగ్జిక్యూషన్ పరంగా ఎగ్జైట్ చేయలేదు. స్పై థ్రిల్లర్ కథకు కమర్షియల్ హంగులు యాడ్ చేసి సినిమాను సాగదీశారు. కానీ, కథ సీరియస్‌గా సాగేటప్పుడు కామెడీ చేసి కంపరం పుట్టించారు.
'సర్దార్ 2'లో ప్రజలకు చెప్పాలనుకున్న సందేశం బావుంది. కానీ, చెప్పిన విధానం బాలేదు. ఆసక్తిగా సినిమా ముందుకు సాగలేదు. కథను సాగదీసి సాగదీసి చెప్పారు. అక్కడక్కడా యోగిబాబు నవ్వించారు. అయితే... సీరియస్ కథలో ఆ కామెడీ సెట్ కాలేదు. కార్తీ, పీఎస్ మిత్రన్ అభిమానులతో పాటు సగటు సినిమా ప్రేక్షకులను డిజప్పాయింట్ చేసే చిత్రమిది. ఫైనల్ గా మరో భారతీయుడు 2 లా, మరో సర్దార్ 2 ఉంది.
Sardar 2 movie review
Honestly bro, చాలా డిసప్పాయింటింగ్ అయ్యా సర్దార్ 2 మూవీ చూసి!
సర్దార్ Part 1 ఇచ్చిన hype తో వెళ్తే అసలు 10 persent కూడా match అవ్వదు. Story చాలా predictable గా ఉంటుంది, ఎక్కడా proper excitement రాదు. Action, spy scenes, emotions — ఏదీ Part 1 level లో అనిపించలేదు. కొన్ని scenes అయితే logic లేకుండా సాగిపోతాయి.
Karthi performance మాత్రం solid.. అది కూడా few సీన్స్ మాత్రమే.
ఓవరాల్ గా writing weak గా ఉండడం మాత్రమే కాదు... సినిమాలో పాజిటివ్స్ గురించి చెప్పాలంటే... వేళ్ళ మీద లెక్కబెట్టొచ్చు. అలా ఉంది మూవీ. కార్తీ ఫ్యాన్స్ కూడా ఈ మూవీ చూసి ఫీల్ అవుతారేమో. ఇంతకు మించి సినిమా గురించి చెప్పలేకపోతున్న.
Sardar 2 movie review
By Great Andhra
సర్దార్ 2 చూస్తుంటే అసలు కొత్తగా ఏం చూస్తున్నామో అనిపించదు.
రొటీన్ స్పై థ్రిల్లర్ ఫార్ములానే మళ్లీ మళ్లీ వాడిన ఫీలింగ్ వస్తుంది. Part 1లో పనిచేసిన elementsనే తీసుకొచ్చారు కానీ ఈసారి అవి అంతగా work అవ్వలేదు. Story చాలా predictableగా ఉంటుంది.
atleast screenplay లో grip కనిపించదు. కొన్ని interesting ideas ఉన్నప్పటికీ వాటిని proper గా develop చేయలేదు.
Karthi మాత్రం తన performance తో సినిమాని నిలబెట్టడానికి full effort పెట్టారు. కానీ S.J. Suryah లాంటి strong actorని కూడా పెద్దగా ఉపయోగించుకోలేదు.
Sardar 2 movie review
దర్శకుడు పీఎస్ మిత్రన్ తన సినిమాల్లో సామాజిక అంశాలను ప్రస్తావిస్తూ ప్రేక్షకులకు సందేశం ఇచ్చే ప్రయత్నం చేస్తుంటారు. ‘సర్దార్’లో ప్లాస్టిక్ బాటిల్స్ వినియోగంపై అవగాహన కల్పించిన దర్శకుడు ‘సర్దార్ 2’లో మనం తీసుకునే ఆహారం, అందులో కలిసే మందులు, యాంటీబయాటిక్స్ ప్రభావాన్ని కోలాస్టిన్ (Colastin) అంశం ద్వారా చూపించారు. పాయింట్ మంచిదే అయినా.. దాన్ని తెరపై ఆసక్తికరంగా చెప్పడంలో మాత్రం విఫలమయ్యారు.
స్పై థ్రిల్లర్‌కు కమర్షియల్ అంశాలను జోడించడంతో సినిమా బాగా సాగదీసినట్టు అనిపిస్తుంది. సీరియస్ సన్నివేశాల మధ్య వచ్చే కామెడీ కూడా కథ ఫ్లోను దెబ్బతీసింది. తెలుగు డబ్బింగ్ కూడా దారుణంగా ఉంది. ఏమాత్రం సహజంగా అనిపించలేదు. అది పెద్ద మైనస్‌గా చెప్పొచ్చు. అయితే కార్తీ పెర్ఫార్మన్స్ లో మాత్రం ఏ డోకా లేదు. ఎస్.జె. సూర్య మాత్రం చాలా సినిమాల్లో చేసిన క్యారెక్టర్ నే మళ్ళీ మళ్ళీ చేసినట్టుంది. మొత్తంగా సందేశం బాగున్నా.. ఎగ్జిక్యూషన్ ఆకట్టుకోలేదు. కార్తీ, పీఎస్ మిత్రన్ అభిమానులను, సగటు ప్రేక్షకులను ‘సర్దార్ 2’ నిరాశపరుస్తుంది. మంచి పాయింట్‌ను ఆసక్తికరమైన స్పై థ్రిల్లర్‌గా మలచడంలో దర్శకుడు విఫలమయ్యారు.
Sardar 2 movie review
By Gulte
Sardar 2 Review :
Positives:
Karthi’s screen presence
Negatives:
Weak screenplay
Forced Comedy
Heavily inspired action
Sardar2 basic idea is good, but the screenplay never interests you. Yet another major drawback is the lack of tension in the narrative. Spy thrillers are always pulsating, but that aspect is totally missing in the film. The makers have spent money and given the film a lavish scale, but in all this, the basic emotion is missing, and the characters are hardly developed, making Sardar 2 a tedious watch. The film is only made to cash in on the franchise and nothing else.
Bottomline: Failed Mission.