Register as a Reviewer
Home Latest Movie Reviews

Latest Movie Reviews

The most recent reviews from top critics and publications

1888 Reviews
Showing 217–228 of 1888 reviews

Jailer 2 Movie Review

మొదటి పార్ట్‌ తోనే ఆడియన్స్ పల్స్ పట్టేసిన డైరెక్టర్ నెల్సన్, ఈ సీక్వెల్‌ లో తనకు బాగా అలవాటైన పిచ్ మీద అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. నెల్సన్ తన మార్క్ డార్క్ కామెడీతో నవ్విస్తూనే, ప్రతీ పది నిమిషాలకు ఒ...

మొదటి పార్ట్‌ తోనే ఆడియన్స్ పల్స్ పట్టేసిన డైరెక్టర్ నెల్సన్, ఈ సీక్వెల్‌ లో తనకు బాగా అలవాటైన పిచ్ మీద అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. నెల్సన్ తన మార్క్ డార్క్ కామెడీతో నవ్విస్తూనే, ప్రతీ పది నిమిషాలకు ఒక అదిరిపోయే హై మూమెంట్ ఇస్తూ థియేటర్లలో విజిల్స్ పడేలా చేశాడు. మొదటి 20 నిమిషాలు సినిమా కాస్త నెమ్మదించిన ఫీలింగ్ కలుగుతుంది. మొదటి భాగం టెంప్లేట్‌లోనే సాగడంతో కొత్త విలన్లు వచ్చినా పెద్దగా ఫ్రెష్‌నెస్ కనిపించదు. పైగా ఎస్‌జే సూర్యతో వచ్చే సీన్స్ కూడా ల్యాగ్ అనిపిస్తుంటాయి. దాదాపు 3 గంటల నిడివి ఉండటం వల్ల సెకండాఫ్‌లో మెయిన్ సీన్స్ మధ్య గ్యాప్ ఎక్కువై సాగదీసినట్టు అనిపిస్తుంది. 


క్లైమాక్స్‌ లో హృతిక్ రోషన్ ఎంట్రీ సీన్ బాగున్నప్పటికీ, దాన్ని ఇంకాస్త పవర్‌ఫుల్‌గా డిజైన్ చేసుంటే ఇంపాక్ట్ మరోలా ఉండేది. మొత్తానికి పార్ట్ 3 కూడా ఉండబోతోందనే హింట్ ఇస్తూ ఈ ఫ్రాంచైజీని ముగించిన తీరు ఆకట్టుకుంటుంది. ఈ సినిమాకు రజనీకాంత్ తర్వాత అంతటి బలాన్ని ఇచ్చింది మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్. పాత జైలర్ థీమ్ మ్యూజిక్‌ను మళ్ళీ వాడుతూ మూడ్ సెట్ చేసిన తీరు థియేటర్లలో దుమ్మురేపింది. రైటింగ్ ఇంకాస్త గ్రిప్పింగ్‌గా ఉండి, సెకండాఫ్ పేసింగ్‌పై దృష్టి పెట్టుంటే రిజల్ట్ మరో రేంజ్‌లో ఉండేది. 3 గంటల రన్‌టైమ్‌ను తగ్గించి ఉంటే సినిమా మరింత ఎంగేజింగ్‌గా ఉండేది. ఓవరాల్‌గా జైలర్ 2.. టైగర్ కా హుకుం.. పర్ఫెక్ట్ సీక్వెల్..




6.0
out of 9
1 month ago
Oct 15, 2026 Hindi

Jailer 2 Movie Review

ఇక జైలర్ సినిమా మాదిరిగానే జైలర్ 2 కూడా పక్కా కమర్షియల్ ఫార్మాట్ లో సాగుతుంది. ఫస్టాఫ్ లో ఫన్ ఎలిమెంట్స్, రజనీకాంత్ ఎలివేషన్స్, గూస్ బంప్స్ తెప్పించే ఇంటర్వెల్ బ్యాంగ్ తో దర్శకుడు నెల్సన్ చాలా ఎంగేజిం...

ఇక జైలర్ సినిమా మాదిరిగానే జైలర్ 2 కూడా పక్కా కమర్షియల్ ఫార్మాట్ లో సాగుతుంది. ఫస్టాఫ్ లో ఫన్ ఎలిమెంట్స్, రజనీకాంత్ ఎలివేషన్స్, గూస్ బంప్స్ తెప్పించే ఇంటర్వెల్ బ్యాంగ్ తో దర్శకుడు నెల్సన్ చాలా ఎంగేజింగ్ గా తీసుకొచ్చాడు. సినిమాలో కామెడీ, మాస్ అంశాలు, ఎమోషన్స్ ఇలా అన్నీ ప‌క్కాగా ఉండేలా, ఏ విష‌యంలోనూ త‌క్కువ కాకుండా రెండో భాగంలో మరింత జాగ్ర‌త్త‌ప‌డ్డాడు నెల్స‌న్. మొత్తానికి ఫస్టాఫ్ ఫ్యాన్స్ కు ఫీస్ట్ అని చెప్పాలి.


అలాగే సెకండాఫ్ నుంచి కథ అనుకున్నంతగా ప్రభావం చూపించలేకపోయిందని చెప్పాలి. కానీ ఎక్కడా బోర్ కొట్టకుండా సెకండాఫ్ ను లాగించాడు నెల్సన్. హృతిక్ రోష‌న్ కేమియో సినిమాకు హైలెట్ అని చెప్పాలి. అలాగే మూవీ క్లైమాక్స్ లో మరో కీలక నటుడి కేమియో కూడా ఉంటుంది. ఇక ఫైనల్ గా జైలర్ 3 కు లీడ్ ఇస్తూ సినిమా ముగుస్తుంది. ఇక చివరగా సినిమాలో ప్లస్ లు చూస్తే రజనీకాంత్ యాక్టింగ్, మాస్ ఎలివేషన్స్, ఫస్టాఫ్, కామెడీ.. అలాగే మైనస్ లు చూస్తే.. సెకండాఫ్, సాంగ్స్ అని చెప్పొచ్చు.


6.0
out of 9
1 month ago
Oct 15, 2026 Hindi

Jailer 2 Movie Review

మూడేళ్ల క్రితం వచ్చిన `జైలర్‌` మూవీకిది సీక్వెల్‌. అందులో రౌడీలకు దగ్గరై నేరాలకు పాల్పడుతున్న సొంత కొడుకునే చంపేస్తాడు రజనీకాంత్‌. ఆ సమయంలో మరణించిన విలన్‌ వర్మకి పైన ఉన్నవాళ్లు హీరో కోసం వెతుకుతుంటార...

మూడేళ్ల క్రితం వచ్చిన `జైలర్‌` మూవీకిది సీక్వెల్‌. అందులో రౌడీలకు దగ్గరై నేరాలకు పాల్పడుతున్న సొంత కొడుకునే చంపేస్తాడు రజనీకాంత్‌. ఆ సమయంలో మరణించిన విలన్‌ వర్మకి పైన ఉన్నవాళ్లు హీరో కోసం వెతుకుతుంటారు. హీరో స్వాధీనం చేసుకున్న కోట్ల విలువ చేసే విగ్రహాలను తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. అందుకు హీరోని ఎలా ఇబ్బంది పెట్టారు? ఆ స్మగ్లింగ్‌ మాఫియా ఆటలను ముత్తువేల్‌ ఎలా ఆట కట్టించాడనేది సింపుల్‌గా ఈ మూవీ కథ. ప్రారంభంలో సరదాగా, కామెడీగా వెళ్తుంది. మెయిన్‌ గా రజనీకాంత్‌ ఎలివేషన్లు, యాక్షన్‌ని బేస్ చేసుకొని సినిమాని నడిపించారు. ఎలివేషన్లు, అదిరిపోయే యాక్షన్‌ సీన్లు పూనకాలు తెప్పిస్తాయి. డ్రామా, కామెడీ, యాక్షన్‌, ఎలివేషన్లని పర్‌ఫెక్ట్ గా రాసుకొని మూవీని నడిపించారు. 


అయితే విలన్లకి సంబంధించిన బ్యాక్‌ డ్రాప్‌ ప్రారంభంలో వాహ్‌ అనిపించినా, ఆ తర్వాత తేలిపోయిన ఫీలింగ్‌ కలుగుతుంది. హృతిక్‌ రోషన్‌ ఎంట్రీ బాగుంది, కానీ వాహ్‌ ఫీలింగ్‌ ఇవ్వలేదు. మాస్‌ ఆడియెన్స్ కి పూనకాలు తెప్పిస్తుంది. కథ ట్రాక్‌ తప్పినట్టుగా అనిపిస్తుంది. అయితే గెస్ట్ అప్పీయరెన్స్ లు ఇందులో అంతగా పేలలేదు. కొన్ని మైనస్‌లు పక్కన పెడితే మాస్‌ ఎలిమెంట్లు, కొంత ఫ్యామిలీ సెంటిమెంట్‌, కామెడీ డ్రామాని పర్‌ఫెక్ట్ గా బ్లెండ్‌ చేసి సినిమాని నడిపించిన తీరు బాగుంది. ఓవరాల్‌గా మాస్‌ ఆడియెన్స్ కి, రజనీ అభిమానులకు మంచి ఫీస్ట్ లాంటి మూవీ అవుతుంది. కమర్షియల్‌ సినిమాకి కావాల్సిన అన్ని హంగులు అద్ది, మాస్‌ ఆడియెన్స్ కావాల్సిన అన్ని అంశాలు మేళవించి రూపొందించిన చిత్రమిది. కామెడీ, ఫ్యామిలీ ఎమోషన్స్, యాక్షన్‌, ట్విస్ట్ లతో అల్లడించే మూవీ అవుతుంది. 

6.0
out of 9
1 month ago
Oct 15, 2026 Hindi

Jailer 2 movie Review

నెల్సన్ 'జైలర్' కోసం ఓ సింపుల్ కథనే ఎంచుకున్నాడు. కానీ తన స్టైల్‌ ఆఫ్ మేకింగ్, డార్క్ కామెడీని యాడ్ చేసి ప్రజెంట్ చేశాడు. ఇప్పుడు జైలర్ 2 కోసం కూడా అదే ఫార్మాట్‌ను వాడుకున్నాడు నెల్సన్. ఈ సినిమా ఎక్కడ...

నెల్సన్ 'జైలర్' కోసం ఓ సింపుల్ కథనే ఎంచుకున్నాడు. కానీ తన స్టైల్‌ ఆఫ్ మేకింగ్, డార్క్ కామెడీని యాడ్ చేసి ప్రజెంట్ చేశాడు. ఇప్పుడు జైలర్ 2 కోసం కూడా అదే ఫార్మాట్‌ను వాడుకున్నాడు నెల్సన్. ఈ సినిమా ఎక్కడా కూడా కొత్తగా అనిపించకపోవచ్చు. కానీ నేటి ఆడియెన్స్‌కి ఏం కావాలి.. ఎక్కడ విజిల్స్ వేయించాలి.. ఎక్కడ స్లోమోషన్ షాట్స్ పెట్టాలి.. ఎక్కడ ఎమోషన్ పండించాలి అని లెక్కలు వేసుకుని మరీ పకడ్బంధీగా రాసుకున్నాడు నెల్సన్. కథ అలా ముందుకు వెళ్తున్న కొద్దీ రజినీకి పడే ఎలివేషన్స్ అదిరిపోతాయి. 

సెకండాఫ్‌ ఆరంభంలోనే ఎస్ జే సూర్య పాత్ర ఎంట్రీ, అతని రేంజ్ చూపించే సీన్ ఇలా అన్నీ బాగుంటాయి. 


ఇక సినిమా కొన్ని ల్యాగ్ సీన్స్ తో అలా డౌన్ అవుతుంది అనుకున్న టైంలోనే అదిరిపోయే ఎంట్రీలు, ట్విస్ట్‌లు, స్పెషల్ అప్పియరెన్స్‌లు అదిరిపోతాయి. చివరకు క్లైమాక్స్ ఫుల్ ట్రీట్‌లా అనిపిస్తుంది. చివరగా.. ఊహకందేలా సాగే కథనం, రొటీన్ కమర్షియల్ ఫార్మాట్‌లో తెరకెక్కించడం కాస్త మైనస్ అని చెప్పుకోవచ్చు. అయినా కూడా విజిల్స్ వేయించే మూమెంట్స్ ఉండటంతో ఎక్కడా కూడా బోర్ కొట్టదు. జస్ట్ రజినీ ఆరా ని ఎక్స్‌పీరియెన్స్ చేయాలంతే. జైలర్ 2 విషయంలోనూ.. టైగర్.. టైగర్ కా హుకూం.. అని చెప్పాల్సిందే. ఈ సారి కూడా బాక్సాఫీస్ వద్ద ఈ ముత్తువేల్ పాండ్యన్ రికార్డులు క్రియేట్ చేసేలానే ఉన్నాడు.


6.0
out of 9
1 month ago
Oct 15, 2026 Hindi

Jailer 2 Movie Review

Gulte

By Gulte

Superstar Rajinikanth and Nelson Dilip Kumar are back with a Sequel Jailer2. Rajinikanth is elegant and stylish just like the first part, We see in him a simple look that is age-appropriate and decent...

Superstar Rajinikanth and Nelson Dilip Kumar are back with a Sequel Jailer2. Rajinikanth is elegant and stylish just like the first part, We see in him a simple look that is age-appropriate and decent costumes.

Nelson Dilip Kumar directs Jailer 2. The best part of his work is the first half where he brilliantly embedded entertainment and heroism. 

Positives:


1.⁠ ⁠First Half

2.⁠ ⁠Superstar Rajinikanth’s Swag

3.⁠ ⁠Adrenaline-Thumping Moments


Negatives:


1.⁠ ⁠Second Half

2.⁠ ⁠Bland Family Drama

3.⁠ ⁠Not-So-Effective Cameos


Finally, Jailer 2 is a mixed bag. The first half of the film has everything in it to become a blockbuster but a lackluster second half brought down the overall graph of the film. It is because of this mismatch in execution between both the halves of the films, it ended up giving a mixed feeling.


Bottomline: Blockbuster First Half, Weak Second Half!

5.0
out of 9
1 month ago
Oct 15, 2026 Hindi

Jailer 2 Movie Review

Sakshi

By Sakshi

సూపర్ స్టార్ రజనీకాంత్ - నెల్సన్ దిలీప్ కుమార్ కాంబినేషన్‌లో వచ్చిన ప్రతిష్టాత్మక చిత్రం 'జైలర్ 2'. మొదటి భాగం భారీ విజయాన్ని నమోదు చేయడంతో ఈ సీక్వెల్‌పై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఇక ఈ సీక్వెల్ లో నెల...

సూపర్ స్టార్ రజనీకాంత్ - నెల్సన్ దిలీప్ కుమార్ కాంబినేషన్‌లో వచ్చిన ప్రతిష్టాత్మక చిత్రం 'జైలర్ 2'. మొదటి భాగం భారీ విజయాన్ని నమోదు చేయడంతో ఈ సీక్వెల్‌పై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఇక ఈ సీక్వెల్ లో నెల్సన్ రాసిన కథ, కథనం, మరియు సంభాషణలు ప్రేక్షకాభిమానులను విశేషంగా ఆకట్టుకున్నాయి.


ఫస్ట్ హాఫ్ ని నెల్సన్ తన మార్క్ డార్క్ కామెడీ, ఎమోషన్స్, మరియు పవర్-ప్యాక్డ్ యాక్షన్‌తో ఎంతో ఆసక్తికరంగా మలిచారు. రజనీకాంత్ మాస్ ఇమేజ్‌కు తగ్గట్టుగా ఆయన పాత్రను డిజైన్ చేసిన తీరు మరియు ఇచ్చిన ఎలివేషన్లు థియేటర్లలో ఈలలు వేయించేలా ఉన్నాయి. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో కల్పక్ ఫ్యామిలీ ఎంట్రీతో కథ మరింత ఆసక్తికరంగా మారుతుంది.


ఇక బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ ఎంట్రీ, కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, మోహన్ లాల్, విజయ్ సేతుపతిల క్యామియో పాత్రలు సినిమా స్థాయిని మరో ఎత్తుకు తీసుకెళ్లాయి. అనిరుధ్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ (BGM) ప్రతీ సన్నివేశానికి ప్రాణం పోసింది. ఫైనల్ గా ప్రథమార్థంలో కామెడీ, ద్వితీయార్థంలో డ్రామా మరియు యాక్షన్ ఈ చిత్రాన్ని సూపర్ హిట్ దిశగా నిలబెట్టాయి.

6.0
out of 9
1 month ago
Oct 15, 2026 Hindi

Jailer 2 Movie Review

సూపర్ స్టార్ రజనీకాంత్, డైరెక్టర్ నెల్సన్ కాంబోలో వచ్చిన 'జైలర్ 2' బాక్సాఫీస్ వద్ద రచ్చ లేపుతోంది! ఫస్టాఫ్ అంతా మార్క్ కామెడీ, యాక్షన్, ఫ్యామిలీ ఎమోషన్స్‌తో నెల్సన్ నెక్స్ట్ లెవెల్ ఎలివేషన్స్ ఇవ్వగా,...

సూపర్ స్టార్ రజనీకాంత్, డైరెక్టర్ నెల్సన్ కాంబోలో వచ్చిన 'జైలర్ 2' బాక్సాఫీస్ వద్ద రచ్చ లేపుతోంది! ఫస్టాఫ్ అంతా మార్క్ కామెడీ, యాక్షన్, ఫ్యామిలీ ఎమోషన్స్‌తో నెల్సన్ నెక్స్ట్ లెవెల్ ఎలివేషన్స్ ఇవ్వగా, దిలీప్ క్యారెక్టర్‌తో వచ్చే ఇంటర్వెల్ బ్యాంగ్ దెబ్బకి సెకండాఫ్‌పై అంచనాలు ఆకాశాన్ని తాకాయి.


ఇక సెకండాఫ్‌లో కల్పక్ ఫ్యామిలీ ఎంట్రీ, ముత్తువేల్ పాండియన్ మైండ్ గేమ్స్ వర్కవుట్ అయ్యాయి. దీనికి తోడు హృతిక్ రోషన్, శివరాజ్ కుమార్, మోహన్ లాల్, కాంత కల్పక్, విజయ్ సేతుపతిల మాస్ కామియోలు థియేటర్లలో పూనకాలు తెప్పించగా, అనిరుధ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మరో రేంజ్‌కి తీసుకెళ్ళింది. జైలర్ 3కి ఇచ్చిన క్రేజీ లీడ్ ఫ్యాన్స్‌కు ఫుల్ కిక్! దసరా హాలిడేస్‌కి ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేసే పక్కా బ్లాక్‌బస్టర్ బొమ్మ! అయితే నిడివి ఇంకా తగ్గించాల్సింది. లొకేషన్స్ బాగున్నాయి. ఆర్ట్ వర్క్ కూడా బాగుంది. ఫైనల్ గా ఒక్క మాత్రలో చెప్పాలంటే రజిని మార్క్ ఎంటెర్టైనింగ్ జైలర్ 2 విత్ అనిరుద్ మ్యూజిక్

6.0
out of 9
1 month ago
Oct 15, 2026 Hindi

Jailer 2 movie review

సూపర్‌స్టార్ రజనీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్‌ కుమార్ కలయికలో వచ్చిన ప్రతిష్టాత్మక సీక్వెల్ ‘జైలర్ 2’. కాగా భారీ అంచనాల నడుమ ఈ సినిమా ఈ రోజు థియేటర్లలో విడుదలై డీసెంట్ రెస్పాన్స్ అందుకుంది. టైగర్ ‘మ...

సూపర్‌స్టార్ రజనీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్‌ కుమార్ కలయికలో వచ్చిన ప్రతిష్టాత్మక సీక్వెల్ ‘జైలర్ 2’. కాగా భారీ అంచనాల నడుమ ఈ సినిమా ఈ రోజు థియేటర్లలో విడుదలై డీసెంట్ రెస్పాన్స్ అందుకుంది. టైగర్ ‘ముత్తువేల్ పాండియన్’ గా సూపర్ స్టార్ రజినీకాంత్ తన అభిమానులను ఎప్పటిలాగే ఉర్రూతలూగించారు. అతిధి పాత్రల్లో నటించిన హృతిక్ రోషన్, మోహన్ లాల్, శివ రాజ్ కుమార్, జాకీ ష్రాఫ్ లు కూడా సినిమాకి బాగా ప్లస్ అయ్యారు. అయితే జైలర్ పాత్రను, ఆ పాత్ర తాలూకు యాక్షన్ ను బాగా డిజైన్ చేసుకున్న దర్శకుడు అంతే స్థాయిలో కొన్ని చోట్ల ట్రీట్మెంట్ ను రాసుకోలేదు.


నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకుడిగా ఈ సినిమాకి న్యాయం చేసినా.. రచయితగా ఇంకా బెటర్ వర్క్ చేయాల్సింది. జైలర్ 2 అంటూ భారీ తారాగణంతో వచ్చిన ఈ చిత్రంలో.. నెల్సన్ మార్క్ డార్క్ హ్యూమర్, సూపర్ స్టార్ స్వాగ్, భారీ క్యాస్టింగ్ స్పెషల్ ఎలివేషన్స్ సినిమాకు మరింత బలం చేకూర్చింది. ముఖ్యంగా యాక్షన్ సీన్స్ చాలా బాగా ఆకట్టుకున్నాయి. అయితే, కొన్ని చోట్ల రెగ్యులర్ ప్లేతో కథనం సాధారణంగా సాగింది. ఓవరాల్ గా సూపర్ స్టార్ అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులకు కూడా ఈ సినిమాలో యాక్షన్ అండ్ ఎమోషన్ ఆకట్టుకుంటాయి.


6.0
out of 9
1 month ago
Oct 15, 2026 Hindi

Jailer Movie Review

జైలర్ 2 సినిమా విషయానికి వస్తే.. నెల్సన్ దిలీప్ కుమార్ రాసిన కథ, సన్నివేశాలు, డైలాగ్స్ సూపర్బ్‌గా ఉన్నాయి. ఫస్టాఫ్‌ను కామెడీ, యాక్షన్, ఫ్యామిలీ ఎమోషన్స్‌తో కలిపి చేసిన సన్నివేశాలు నెల్సన్ ప్రతిభకు అద్...

జైలర్ 2 సినిమా విషయానికి వస్తే.. నెల్సన్ దిలీప్ కుమార్ రాసిన కథ, సన్నివేశాలు, డైలాగ్స్ సూపర్బ్‌గా ఉన్నాయి. ఫస్టాఫ్‌ను కామెడీ, యాక్షన్, ఫ్యామిలీ ఎమోషన్స్‌తో కలిపి చేసిన సన్నివేశాలు నెల్సన్ ప్రతిభకు అద్దం పట్టాయి. ఇక రజనీకాంత్ ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకొని ఆయన క్యారెక్టర్‌ను డిజైన్ చేసిన తీరు, ఆయన పాత్రకు ఇచ్చిన ఎలివేషన్స్ అదిరిపోయాయి. దిలీప్‌తో ఇంటర్వెల్ సీన్‌తో సినిమాను మరో రేంజ్‌కు తీసుకెళ్లి సెకండాఫ్‌పై అంచనాల పెంచాడు. ఇక సెకండాఫ్‌ లో కల్పక్ ఫ్యామిలీని ఎంట్రీ ఇవ్వడంతో ముత్తువేల్‌తో ఆడించిన గేమ్ సినిమాకు హైలెట్. సెకండాఫ్‌ లో సూర్యతో కొడుకును ముత్తువేల్ చంపారని కుటుంబానికి చెప్పే సీన్ హృదయానికి హత్తుకొనేలా చేస్తుంది. 


హృతిక్ రోషన్ ఎంట్రీ, శివరాజ్ కుమార్ చుట్టూ తిరిగే కథ ఈ సినిమాను లేపి ఎక్కడో కూర్చుండపెట్టారనిపిస్తుంది. అయితే కాంత కల్పక్, విజయ్ సేతుపతి ఎంట్రీతో జైలర్ 3 ఇచ్చిన లీడ్ మరింత అంచనాలు పెంచేలా చేసింది. అన్నిటికి మించి అనిరుద్ మ్యూజిక్ తో సినిమాని ఎక్కడో నిలబెట్టాడు. జైలర్ 2 సినిమా గురించి ఫైనల్‌గా చెప్పాలంటే.. రజనీ ఇమేజ్‌ను అసెట్‌ గా చేసుకొని నెల్సన్ చేసిన సిల్వర్ స్క్రీన్ మ్యాజిక్. ఫస్టాఫ్‌లో కామెడీ, సెకండాఫ్‌లో యాక్షన్ డ్రామా ఈ సినిమాను సూపర్ హిట్ సినిమాగా మార్చేలా చేశాయని చెప్పవచ్చు. ఇక శివరాజ్ కుమార్, మోహన్ లాల్, హృతిక్ రోషన్, విజయ్ సేతుపతి పాత్రలు క్రేజీగా వర్కవుట్ అయ్యాయి. ఈ సినిమా రజనీ ఫ్యాన్స్‌కే కాకుండా సగటు సినిమా ప్రేక్షకుడికి కూడా ఫుల్ కిక్కు ఇచ్చేలా ఉంటుంది. దసరా పండుగ సెలవుల్లో ఫ్యామిలీ అంతా ఎంజాయ్ చేసే ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్. డోంట్ మిస్ ఇట్.

7.0
out of 9
1 month ago
Oct 15, 2026 Hindi

Jailer 2 Movie Review

జైలర్ 2 (Jailer 2) 2026 Twitter Channel
#Jailer2 #IDreamMediaRating 3/5...పక్కా పైసా వసూల్కమర్షియల్ ఎంటర్ ట్రైనర్..మాస్ ఎలిమెంట్ లువినోదంసెంటిమెంట్ అన్నీసమపాళ్ళలోమిక్స్ చేయడందర్శకుడు నెల్సన్ సక్సెస్ మంత్ర…తొలి సగం మొత్తంస్టోరీ లీడ్ కి వదిలే...

#Jailer2 #IDreamMediaRating 3/5

...

పక్కా పైసా వసూల్

కమర్షియల్ ఎంటర్ ట్రైనర్

..

మాస్ ఎలిమెంట్ లు

వినోదం

సెంటిమెంట్ అన్నీ

సమపాళ్ళలో

మిక్స్ చేయడం

దర్శకుడు నెల్సన్ సక్సెస్ మంత్ర

…

తొలి సగం మొత్తం

స్టోరీ లీడ్ కి వదిలేసి

మలి సగం ని

టోటల్ కథ కి

వాడుకున్నారు

..

అందువల్ల రెండో సగం

కాస్త హెవీ అనిపిస్తుంది

..

కానీ రజనీ లాంటి

సీనియర్ స్టార్ కి ఈ కథ..కథనం

పక్కాగా సరిపోతాయి

అనే చెప్పాలి

…

అక్కడక్కడ నెమ్మదించినట్లు

అనిపించినా

కామన్ ప్రేక్షకుడికి

అది పెద్దగా ఇబ్బంది పెట్టదు

…

పంచ్ లైన్…

సక్సెస్ 2

6.0
out of 9
1 month ago
Oct 15, 2026 Hindi

Jailer 2 Movie Review

జైలర్ 2 (Jailer 2) 2026 Twitter Channel
#Jailer2 A Familiar Commercial Entertainer With a Solid 1st Half but an Underwhelming 2nd Half!First half works mainly because of Nelson’s trademark comedy, a few solid Superstar elevation scenes, and...

#Jailer2 A Familiar Commercial Entertainer With a Solid 1st Half but an Underwhelming 2nd Half!


First half works mainly because of Nelson’s trademark comedy, a few solid Superstar elevation scenes, and Anirudh’s BGM. But the writing gets weaker as it goes on, with the SJ Suryah and Vidya Balan villain tracks feeling tiring and impactless, while the film moves away from the entertainment that works best.


Rajinikanth’s screen presence still delivers, but even the elevation scenes don’t hit consistently. The cameos also feel more like plot devices than genuine high points and fail to create the same impact as the first film. Entertaining in stretches, but ultimately an average sequel.


Rating: 2.5/5

5.0
out of 9
1 month ago
Oct 15, 2026 Hindi

Mayookha movie review

just now finished mayookha movie in theaters. Starring Payal Chengappa in the lead, "Mayookha" is a recent psycho-suspense thriller blending phrogging and dark horror elements. Payal Chengappa ca...

just now finished mayookha movie in theaters. Starring Payal Chengappa in the lead, "Mayookha" is a recent psycho-suspense thriller blending phrogging and dark horror elements. 


Payal Chengappa carries the film well, delivering great expressions of fear and tension.

Shibin Mathew Alex's background score and sound design successfully build an eerie, nail-biting atmosphere.


The first half feels a bit slow, taking time to settle into the core plot.

overall A decent watch for thriller fans who enjoy dark, suspenseful drama

5.0
out of 9
1 month ago
Oct 14, 2026 Telugu
Why MRO?