Latest Movie Reviews
The most recent reviews from top critics and publications
Sardar 2 movie review
By NTV Telugu
Sardar 2 Review :
సర్దార్ 2 పై భారీ అంచనాలతో థియేటర్ కి వెళ్లిన ఆడియన్స్ కి మాత్రం నిరాశ తప్పదనే చెప్పాలి. పీఎస్ మిత్రన్ మరోసారి పార్ట్ 1 టెంప్లేట్ నే కొనసాగించినప్పటికీ, మొదటి భాగంలో ఆకట్టుకున్న యాక్షన్, స్పై ఎలిమెంట్స్, ఎమోషన్స్ ఈసారి అదే స్థాయిలో వర్కౌట్ కాలేదు. కథనం చాలా సాదాసీదాగా, ముందుగానే ఊహించగలిగే విధంగా సాగుతుంది. కొన్ని ఆసక్తికరమైన ఆలోచనలు ఉన్నప్పటికీ, వాటికి తగినంత ఇంపాక్ట్ ఇవ్వలేకపోయారు.
కార్తీ తన అద్భుతమైన నటనతో సినిమాను నిలబెట్టే ప్రయత్నం చేసినా, బలహీనమైన రైటింగ్ కారణంగా అది పూర్తిస్థాయిలో ఫలించలేదు. ఎస్.జే. సూర్యను కూడా ఆశించిన స్థాయిలో ఉపయోగించుకోలేకపోయారు. మొత్తంగా చూస్తే.. మంచి పెర్ఫార్మెన్స్ ఉన్నా, ఎంగేజింగ్ రైటింగ్ లేకపోవడంతో ‘సర్దార్ 2’ ఒక డిసప్పాయింటింగ్ సీక్వెల్‌గా మిగిలింది.
Sardar 2 Movie Review
దర్శకుడు పి.ఎస్. మిత్రన్ తన సినిమాల ద్వారా సాధారణ ప్రజలలో ఏదో ఒక అంశంపై అవగాహన కల్గించడానికి కృషి చేస్తుంటారు. 'సర్దార్' మూవీలో డ్రింకింగ్ వాటర్ మాఫియా గురించి చెప్పిన మిత్రన్... ఈ సీక్వెల్ లో మనం తినే ఆహారం ఎంతగా కలుషితం అయిపోయింది? విపరీతంగా మందుల వాడకం కారణంగా మన శరీరం ఎలా నిర్వీర్యం అయిపోతోందన్నది తెలియ చెప్పే ప్రయత్నం చేశారు. అయితే డైరెక్టర్ ఈసారి సరైన స్క్రీన్ ప్లే రాసుకోవడంలో తడబడ్డాడు.
ఇక సర్దార్ 2' సినిమా ఒక ఫ్లో లో ఎక్కడా బోర్ కొట్టకుండా సాగిపోయినా... తెర మీద జరిగే తంతు అంతా యాంత్రికంగా ఉంది. నటీనటుల నటన, సాంకేతిక నిపుణుల పనితనం కూడా ఏమంత గొప్పగా లేవు. అవీ రొటీన్ గానే సాగాయి. సినిమా మొత్తం మీద ఒక్కటంటే ఒక్కటి కూడా హై మూమెంట్ అనేది లేదు. 'రా' ఏజెంట్స్ పై తీసిన సినిమాను మరీ ఇంత 'రా'గా తీయడం అవసరమా అనిపిస్తుంది. అయితే కార్తీ పెర్ఫార్మన్స్ మాత్రం బాగుంది. ఓవరాల్ గా కథలో కొత్తదనం లేకపోవడం, కథనం ఆసక్తిని కలిగించకపోవడంతో ప్రేక్షకులను మెప్పించడంలో 'సర్దార్ 2' విఫలమైంది.
Sardar 2 Movie Review
By Filmi Beat
సర్దార్ సినిమా ద్వారా ప్లాస్లిక్ బాటిల్ వాడకం వల్ల ఎలాంటి అనర్థాలకు దారి తీస్తున్నాయనే సందేశాన్ని ప్రేక్షకులకు ఇచ్చారు. సర్దార్ 2 విషయానికి వస్తే.. కోలాస్టిన్ అనే మెడిసిన్ గురించి యాంటీ బయోటిక్స్ వాడకంపై అవగాహన కల్పించే చక్కటి ప్రయత్నం చేశారు. కానీ ఇలాంటి ముఖ్యమైన విషయాన్ని చెప్పడానికి ఎంచుకొన్న కథ, కథనాలు, చెప్పిన విధానం ఆకట్టుకోలేకపోయింది.
దర్శకుడు మిత్రన్ రాసుకొన్న సన్నివేశాలు పేలవంగా ఉన్నాయి. దాంతో ఇలాంటి థీమ్‌తో ఇప్పటికే ఎన్నో కథలు రావడం వల్ల పాత సినిమానే చూసిన ఫీలింగ్ కలుగుతుంది. విదేశీ మాఫియా కుట్రలు, బయో వెపన్ లాంటి కథలు పాత చింతకాయ పచ్చడి మాదిరిగానే అనిపిస్తాయి. ఇక పెర్ఫార్మన్స్ పరంగా కార్తీ చేయాల్సింది చేస్తే... ఎస్.జె. సూర్య చేయాల్సిందనికన్నా ఎక్కువ చేసినట్టు ఉంది.
ఈ సినిమా సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. సినిమాటోగ్రఫి ప్రామిసింగ్ ఎఫర్ట్స్ పెట్టారనిపిస్తుంది. అయితే ఎడిటింగ్ విభాగం పూర్తిగా ఫెయిల్ అవ్వడంతో సినిమా నేరేషన్ గ్రిప్పింగ్‌గా అనిపించదు. బీజీఎమ్ కూడా డిస్సపాయింట్ చేసింది. ప్రొడక్షన్ వాల్యూస్ మాత్రం బాగున్నాయి. ఓవరాల్ గా సినిమా కథ మంచి పాయింటే అయినప్పటికీ.. దాన్ని చక్కగా ప్రజెంట్ చేయడంలో పూర్తిగా విఫలమయ్యారనే చెప్పాలి. దాంతో కార్తీ సర్దార్ కంప్లీట్ గా నిరాశపరిచిందనే విషయాన్ని ఎలాంటి మొహమాటం లేకుండా చెప్పాల్సిందే.
Sardar 2 movie review
By Tupaki
సర్దార్-2’ ఎంతో ఎఫర్ట్ పెట్టిన రాసిన కథతో తయారైన సినిమా. రైటర్ కమ్ డైరెక్టర్ పి.ఎస్.మిత్రన్ అంత భారీగా.. అనేక లేయర్లతో ఆ కథను రాసుకున్నాడు. కానీ ఎంత ఎఫర్ట్ పెట్టి రాసినా.. తెర మీద ఎంత భారీగా ఆ కథను ప్రెజెంట్ చేసినా.. చెప్పాలనుకున్న విషయం అర్థవంతంగా అనిపిస్తేనే.. ప్రేక్షకులకు అది సరిగ్గా చేరితేనే మంచి అనుభూతి కలుగుతుంది. ‘సర్దార్’లో వాటర్ మాఫియా అంశాన్ని.. ఒక పంచె కట్టిన గూఢచారి చేసే విన్యాసాలను మిత్రన్ అలా అర్థవంతంగానే తెరపై ప్రెజెంట్ చేశాడు. కానీ ‘సర్దార్-2’కు వచ్చేసరికి.. బయో వార్ కాన్సెప్టు చుట్టూ అల్లుకున్న కథను కనీసం తన టీం సభ్యులకు అయినా అర్థమయ్యేలా చెప్పగలిగాడా అనే సందేహం కలుగుతుంది.
ఎస్.జె.సూర్య చేసిన విలన్ పాత్రను తీర్చిదిద్దిన విధానమే ప్రేక్షకులకు తీవ్ర గందరగోళంగా అనిపిస్తుంది. ఈ సినిమాకు అతను విలనో హీరోనో అర్థం కాదు. ఒకవైపేమో పరిమితికి మించి యాంటీ బయాటిక్స్ వాడడం వల్ల జరిగే అనర్థాల గురించి క్లాసులు పీకుతాడు. ఇంకోవైపేమో అలా చేయడం తప్పు కాబట్టి ఆ మనుషులకు బతికే అర్హత లేదంటాడు. ఇంకోవైపేమో ఈ తరం అంతా పోయాక ఒక మంచి తరాన్ని తయారు చేస్తా అంటాడు.
అయితే కార్తి పెర్ఫామెన్స్ పరంగా ఏమీ లోటు చేయలేదు. ఇటు డైరెక్టర్ కూడా కథ విషయంలో చాలా రీసెర్చ్ చేశాడని.. ఎంతో కసరత్తు చేసి స్క్రిప్టు రాశాడని అర్థమవుతుంది. కానీ ఎంత కష్టపడ్డప్పటికీ.. అర్థమయ్యేలా కన్విన్సింగ్ గా కథను చెబితేనే ఆశించిన ప్రయోజనం చేకూరుతుంది. కానీ రైటింగ్-టేకింగ్ లో విపరీతమైన గందరగోళం.. అర్థరహితంగా అనిపించే విలన్ పాత్ర వల్ల.. కన్విన్సింగ్ గా లేని కొన్ని సన్నివేశాల వల్ల మిత్రన్ కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరే అయింది. చివరగా సర్దార్-2.. దారి తప్పిన ఏజెంట్ అయ్యాడు.
Sardar 2 movie review
చాలా తక్కువ సినిమాలు వెళ్తుంటాను నేను... అండ్ మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాలకు ఎక్కువ preference ఇస్తుంటాను. అందుకే సర్దార్ మూవీ నచ్చి సీక్వెల్ గా వచ్చిన సర్దార్ 2 కి ఫస్ట్ డే నే ఫ్యామిలీతో వెళ్ళాం. బట్ సినిమా చూసాక నా ఫీలింగ్ ఒక్కటే — చాలా అంటే చాలా డిసప్పాయింట్ అయ్యాను!
Part 1 నచ్చిన వాళ్లకి Part 2 మీద మంచి expectations ఉంటాయని తెలుసు కదా, కానీ ఈ మూవీలో పార్ట్ 1 కి సగంలో సగం కూడా మ్యాచ్ కాలేదు. Story చాలా predictable గా వెళ్లిపోయింది. and Action, spy scenes, emotions లో ఏవి కూడా నాకు నచ్చలేదు. ఫైనల్ గా atleast ఓ మంచి message ని Part 1 లో చూపించినట్టు చుపిస్తారేమో అనుకున్నా కానీ, ఇందులో కూడా ఆలా ఏం చూపించలేదు. అండ్ బట్ కార్తీ performance మాత్రం బాగుంది. అతని కోసం మూవీ చేద్దామనుకున్నా, ఎక్కువ సేపు ఉండలేం.. అలా ఉంది మూవీ. overall dissapoint అయ్యా..
Sardar 2 Movie Review
సో కార్తీ గారి సర్దార్ 2... సినిమా ఇప్పుడే చూసొస్తున్నాను. ఇక సినిమా గురించి మాట్లాడుకుంటే.. ఆహా ఈ రేంజ్ డిస్సపాయింట్ బాబోయ్.. ఇంత దారుణంగా కూడా తీయొచ్చా అన్నట్టు ఉంది. అండ్ సినిమాలో ఫస్ట్ పార్ట్ లాగానే ఈ మూవీలో కూడా మంచి మెసేజ్ ఇద్దామని స్టోరీ పాయింట్ రాసుకున్నాడు... ఎక్కడివరకు బానే ఉంది. కానీ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసిన తీరు బాలేదు. కామెడీ అయితే దరిద్రంగా ఉంది. అండ్ కార్తీ ఫ్లాష్ బ్యాక్ సీన్స్ బాగున్నాయి. ఇలా కొన్ని సీన్లు సినిమాలో బాగున్నాయి. ఫస్ట్ హాఫ్ లో చిన్న కార్తీ సీన్లు అయితే ఆర్డినరీగా ఉన్నాయి.
అండ్ ఇంటర్వెల్ తర్వాత సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన తర్వాత నసుగుతా నసుగుతా ఉంటాదయ్యా. విలన్ క్యారెక్టర్ అయితే బాగుంది. అండ్ సర్దార్ కే వాడికి ఉన్న కనెక్షన్ బాగుంది. కానీ దాన్ని ఏ రేంజ్ లో పండబెట్టాలో ఆ రేంజ్ లో పండబెట్టారు. విలన్ పెర్ఫార్మన్స్ చూస్తే ఒక సీరియస్ నెస్ లేకుండా చాలా ఛండాలంగా ఉంది. ముఖ్యంగా డైలాగ్స్ అయితే అంటిఅంటరాని తెలుగు చూసినట్టు ఉంటుంది. అండ్ సినిమాలో చాలా మంచి ఎలిమెంట్స్ సీన్స్ ఉంటాయి. ప్రాబ్లెమ్ ఏంటంటే ప్రతి ఇరవై నిమిషాలకు సినిమాలో సీరియస్ నెస్ మారిపోతది. గోల్ మరి పోతది. క్యారెక్టర్స్ అయితే సర్దార్ కి తప్ప అన్ని క్యారెక్టర్లు దరిద్రంగా రాసుకున్నారు. అండ్ సినిమాలో పాటలు కూడా లేవు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా దరిద్రంగా ఉంది. ఫైనల్ గా డిస్సపాయింట్ చేసింది మొత్తం.
Sardar 2 Movie Review
After watching Sardar 2, my honest take is that the film is quite disappointing.
Directer P.S. Mithran returns with the same basic template from Part 1, but unfortunately, the elements that made the first film work — the action, spy portions and emotional depth — don’t have the same impact here.
The narrative feels too plain and predictable, with only a few interesting ideas that aren’t given enough weight or elevation.
but Karthi acting was good... and A few logical inconsistencies also affect the experience.
Overall, Sardar 2 had the potential to be a strong sequel, but weak writing and predictable execution make it a largely underwhelming experience.
Sardar 2 movie review
సర్దార్ 2... సినిమా చూసొచ్చాక సినిమా గురించి చెప్పాలంటే... ఫస్ట్ అఫ్ అల్ అసలు ఇది గుడ్ మూవీయా బాడ్ మూవీయా అనేది పక్కన పెడితే, అసలు ఈ మూవీ రాకూడదు. కానీ నా దృష్టిలో ఈ సినిమా రాకూడదు. ఎందుకంటే ఫస్ట్ పార్ట్ ని చెడగొట్టేలా ఉంది ఈ సినిమా. సర్దార్ సినిమాకి ఉన్న పాజిటివిటి పాజిటివిటి ఏదైతే ఉందొ దాన్ని చెడగొట్టడానికి సర్దార్ 2 తీసినట్టుంది. అసలు డైరెక్టర్ ఏం తాగి క్యారెక్టర్స్ రాసుకున్నారో కూడా అర్ధం కాదు. ముఖ్యంగా కామెడీ సీన్లు ఇరిటేటింగ్ గా ఉంటాయి. ఇంత సీరియస్ సినిమాలో కామెడీ సీన్లు పెడితే దాని వల్ల సినిమా మొత్తం ఎఫెక్ట్ పడుతుంది.
అయితే ఎండ్ అఫ్ ది మూవీ అసలు ఏంటి ఈ మూవీ అన్న డౌట్ వస్తుంది. కొన్ని పాయింట్స్ బాగున్నా వాటి గురించి పెద్దగా మాట్లాడుకోలేం. ఆ మంచి సీన్ల వల్ల మనకు తలనొప్పి ఎక్కువ రాదు గాని, ఓవరాల్ గా యావరేజ్ కి దగ్గరగా వచ్చి ఆగింది. బేసిగ్గా సీక్వెల్ గా వచ్చిన ఈ సినిమా కంప్లీట్ ఔట్రైట్ సినిమాలా ఉంది. కార్తీ తన వరకు బాగా చేసాడు. అనవసరంగా సర్దార్ కి కంటిన్యూ చేసారు. ఏందో మరి.. సర్లే ఇంకేం చేయలేము మరి... డిస్సపాయింటెడ్... ఇక మ్యూజిక్ అయితే రాడ్ బీజీఎమ్ ఇచ్చాడు.
Sardar 2 Movie Review
By 123telugu
కోలీవుడ్ టాలెంటెడ్ హీరో కార్తీ హీరోగా మాళవిక మోహనన్, ఆషిక రంగనాథ్ లు ఫీమేల్ లీడ్ లలో దర్శకుడు పి ఎస్ మిత్రన్ తెరకెక్కించిన స్పై యాక్షన్ సీక్వెల్ సినిమానే ‘సర్దార్ 2’. పార్ట్ 1 మంచి హిట్ కావడంతో దాని సీక్వెల్ ని తీసుకురాగా, థియేటర్లలో విడుదలై మిక్స్డ్ రెస్పాన్స్ అందుకుంటుంది. ఇక గత సినిమాలో లానే ఈసారి కూడా ఓ సెన్సిటివ్ సబ్జెక్ట్ ని దర్శకుడు పట్టుకోవడం జరిగింది. అయితే పార్ట్ 1 లో ఉన్న సాలిడ్ ఎలిమెంట్స్, మూమెంట్స్ పార్ట్ 2 లో బాగా మిస్ అయ్యాయి.
అయితే మూవీలో కొన్ని ఐడియాలు పార్ట్ 2 లో బాగానే ఉన్నాయి. కానీ వాటికీ తగ్గ సెటప్, స్క్రీన్ ప్లే మిస్ అయినట్టు కూడా చూసే ఆడియెన్ కి అర్ధం అయ్యిపోతుంది. కార్తీ బాగానే నటించినా, సినిమాలో అనవసర సన్నివేశాలతో ల్యాగ్ చేసారు. ఇక మొత్తంగా చూసుకుంటే ‘సర్దార్ 2’ మాత్రం పార్ట్ 1 తో పోలిస్తే అంచనాలు అందుకోలేకపోయింది. అలాగే సబ్జెక్టులో కోర్ పాయింట్ కూడా బాగానే ఉంది, కానీ ఇవే ఎలిమెంట్స్ పార్ట్ 1 లో కూడా ఉన్నప్పటికీ అక్కడ కనిపించిన గ్రిప్పింగ్ కథనం, థ్రిల్ మూమెంట్స్ ఇందులో బాగా మిస్ అయ్యాయి. సో వీటితో ఈ చిత్రం ఒక డల్ స్పై థ్రిల్లర్ గా నిలిచిపోయింది.
Sardar 2 Movie Review
ippude Sardar 2 morning show chusocchanu... Honestly, Sardar 2 very disappointed!
asalu part 1 lo work ayina action, spy elements, emotions e movie lo evi kooda naku proper ga click avvaledu. chala plain & predictable ga velthundi. few interesting choices unna, aa sences ki avasaramaina weight ivvaledu.
Karthi movie ni save cheyadaniki chala try chesadu. His performance is solid, but correct writing support lekapothe audiance kooda support cheyaru.
part one lo exiting ee movie start ayyaka sagam kooda ledu nalo.. inervel ke opika poyindi. vellipodam anukunna kaani... edo directer meeda nammakamtho last daka unna... aa tarvatha picchekkipoyindi...
ippatike naa review chusina vallaki movie talk ento ardhamai untundi.
Sardar2 movie review
By Devi Priya
సర్దార్ 2 ..IDreamRating 1.5/5
బయోవార్ నేపథ్యానికి..
ప్రజల మందుల వాడకాన్ని ముడిపెట్టి..
తండ్రీ కొడుకుల సెంటిమెంట్ రంగరించి..
అస్సలు రిలీఫ్ అన్నది లేకుండా చేసి..
మూడు గంటలు
చెవులు మూయకుండా చావగొట్టిన సినిమా
ప్లస్ పాయింట్లు
వెదికినా దొరకవు
మైనస్ పాయింట్లు
వెదక్కుండా దొరుకుతాయి
పంచ్ లైన్
టాక్సిక్ 2
Sardar 2 move Review
By Thyview
సర్దార్ 2 రివ్యూ... first of all movie చూసాక నా openoin చెప్పాలంటే.. very dissapointed.. PS మిత్రన్ మరీ ఇలా తీస్తారని అనుకోలేదు. పార్ట్ వన్ టెంప్లేట్ లోనే వెళ్తుంది ఈ కూడా. బట్ పార్ట్ వన్ లో వర్కవుట్ అయిన యాక్షన్ గాని, స్పై సీన్స్ గాని, క్యారెక్టర్ ఎమోషన్స్ గాని ఏవి సర్దార్ 2 లో వర్కౌట్ కాలేదు. చాలా ప్లేయిన్ గా టూ ప్రెడిక్ట్రబుల్ గా వెళ్ళిపోతుంది సినిమా. కొన్ని ఇంట్రెస్టింగ్ చాయిస్ ఉంటాయి సినిమాలో. బట్ వాటికివ్వాల్సిన వెయిట్ ఇవ్వలేదు. కార్తీ is the saving race in this movie. but writing support చేయనపుడు ఆయన కూడా ఎంత వరకు కాపాడగలుగుతారు.
part 1 ఎండింగ్ లో సర్దార్ వెనక్కి తగ్గాక, తన కొడుకు తన తండ్రిపై ఉన్న బ్లాక్ మార్క్ ని తీసేద్దామని పర్సనల్ గా ఒక మిషన్ లో ఇన్వాల్వ్ అవుతాడు. ఇంతకి ఆ మిషన్ ఏంటి? సర్దార్ ఈ మిషన్ లోకి ఎలా వచ్చాడు అని సినిమాలో చూడాలి. అయితే సినిమాలో అన్ని సీన్లు చాలా ఆర్డినరీగా సాగిపోతుంటాయి. అండ్ చాలా సీన్లు క్రిస్పీగా ఉన్నాయి. ఈ మూవీలో కొన్ని సీన్స్ ఇల్లాజికల్ గా ఉంటాయి. అండ్ ఇంటెలిజెంట్ పీపుల్స్ సినిమాలో ఉన్నా, వాళ్ళు చేసే పనులు అలా ఉండవు. ఫైనల్ గా కార్తీకి థ్యాంక్స్ చెప్పాలి పెర్ఫార్మన్స్ విషయంలో. ఇక ఎస్.జె. సూర్య ని అస్సలు వాడుకోలేదు. ఫైనల్ వర్డ్ ఏంటంటే సర్దార్ 2 టోటల్లీ డిస్సపాయింటెడ్.