Movie Reviews
Professional reviews and ratings from top critics and publications worldwide
శర్వానంద్ నటించిన బైకర్ సినిమా తాజాగా థియేటర్లలో రిలీజ్ అయి మిశ్రమ స్పందన తెచ్చుకుంది. సినిమా చూసాక రివ్యూ గురించి చెప్పాలంటే... సినిమాలో శర్వానంద్ తన పాత్రలో ఒదిగిపోయాడు. సినిమా కోసం బాగా కష్టపడ్డాడని రేసింగ్ సీన్లు చూస్తేనే తెలుస్తుంది. అలాగే రేసింగ్ ఎపిసోడ్స్ ఉత్కంఠకి గురి చేస్తాయి. దాంతో పాటు క్లైమాక్స్ ఎమోషనల్ గా ఉండి ఆకట్టుకుంది. అలాగే జిబ్రాన్ బిజిఎం కూడా బాగుంది. విజువల్స్ బాగున్నాయి. నటీనటులు బాగా చేశారు. మెయిన్ కాస్టింగ్ సినిమాకి ప్లస్ అయ్యారని చెప్పొచ్చు.
అయితే మైనస్ లు చెప్పుకుంటే సినిమా చాలా వరకు డ్రైగా సాగింది. ఏమాత్రం హై మూమెంట్స్ లేవు. డ్రామా అంతగా పండలేదు. ఎమోషన్స్ వర్కౌట్ కాలేదు. తండ్రీకొడుకుల బాండింగ్‌కి సంబంధించిన ఎమోషన్స్ ఎలివేట్ కాలేదు. క్లైమాక్స్ లో తప్ప మరెక్కడా అది కనిపించలేదు. స్పోర్ట్స్ డ్రామాలో ఉండాల్సిన డ్రామా ఇందులో అంతగా లేదు. దీంతో ఓల్డ్ సినిమాలను తలపించింది. ఫ్రెష్ ఫీలింగ్ ఇవ్వలేకపోయింది. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ తప్ప మరేదీ కొత్తగా లేదనే ఫీలింగ్ తెప్పించింది. సినిమా స్లోగా సాగడం మరో మైనస్‌గా చెప్పొచ్చు.ఓవరాల్ గా సినిమా గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే..
రేస్ తక్కువ, సాగదీత ఎక్కువ.. ఎమోషనల్ గానూ, డ్రామా పరంగానూ మెప్పించలేకపోయిన 'బైకర్'.
శర్వానంద్ నటించిన బైకర్ సినిమా గురించి ఓవరాల్ గా చెప్పుకోవాలంటే.. అమ్మనాన్న తమిళ అమ్మాయి, జెర్సీ తరహా సినిమాగా బైకర్ ని చూడొచ్చు. కానీ ఆ సినిమాలతో పోల్చుకొంటే ఎమోషన్స్, కమర్షియల్ అంశాలు కొన్ని మిస్ అయ్యాయి. అలాగే సెకండాఫ్ లో బాగా సాగదీత, అనసవరమైన సీన్లు సినిమాను ల్యాగ్ గా మార్చాయి. టెక్నికల్ గా సంగీతంతో పాటు, నేపథ్య సంగీతంతో జిబ్రాన్ ఎమోషనల్ సీన్స్ ని బాగా ఎలివేట్ చేశాడు.
నిర్మాణ విలువల పరంగా ఎక్కడా రాజీ పడలేదు. డైరెక్టర్ అభిలాష్ రెడ్డి ఒక కొత్త పాయింట్‌తో ఎమోషన్స్ ను బ్యాలెన్స్ చేస్తూ చాలా కొత్తగా ట్రై చేశాడు. కెమెరా వర్క్ కూడా అద్భుతంగా ఉంది. ఓవరాల్ గా బి,సీ సెంటర్ల ప్రేక్షకులకు కనెక్ట్ అయితే ఈ సినిమా కమర్షియల్‌గా విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. లేకపోతే క్రిటిక్స్ మెచ్చిన సినిమాగా మిగిలిపోతుంది. స్పోర్ట్స్ డ్రామాలను ఇష్టపడే వారికి బైకర్ సినిమా నచ్చే అవకాశం ఉంది.
శర్వానంద్ హీరోగా నటించిన మోటోక్రాస్ బైక్ రేసింగ్ స్పోర్ట్స్ డ్రామా తాజాగా థియేటర్లలో విడుదలై మిక్స్డ్ రెస్పాన్స్ దక్కించుకుంది. శర్వానంద్ తన పాత్రలో ఇమిడిపోయాడు. బైకర్ రోల్ కి పర్ఫెక్ట్ గా సెట్టయ్యాడు. రాజశేఖర్ నారాయణ పాత్రలో చాన్నాళ్ల తర్వాత చాలా స్ట్రాంగ్‌గా మెప్పించారు. హీరో కాకపోయినా ఈ కథలో ఆయనే కీలక పాత్రగా నిలిచారు. తన అనుభవంతో ఆ పాత్రను మరో స్థాయికి తీసుకెళ్లగా, ముఖ్యంగా క్లైమాక్స్‌లో శర్వానంద్‌ను హగ్ చేసే సీన్లో ఎమోషన్ పీక్స్‌కు చేరి ఆడియన్స్‌ను కదిలిస్తుంది.
మాళవిక నాయర్ ఫస్టాఫ్‌లో గ్లామర్‌తో ఆకట్టుకుని, సెకండాఫ్‌లో నటనతో ఇంప్రెస్ చేసింది. కథలో ఆమె పాత్రకు మంచి ప్రాధాన్యం ఉంది. విలన్‌గా అతుల్ కులకర్ణి చాలా సెటిల్డ్‌గా నటించగా, అన్వర్ పాత్రలో నటించిన వ్యక్తి కూడా మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. బ్రహ్మాజీ, తులసి తదితరులు తమ పాత్రలకు న్యాయం చేశారు.
టెక్నికల్‌గా చూస్తే జిబ్రాన్ ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు పెద్ద ప్లస్. రేసింగ్ సీన్స్, ఎమోషనల్ మోమెంట్స్‌ను బాగా ఎలివేట్ చేశారు. సినిమాటోగ్రఫీ కూడా విజువల్‌గా ఆకట్టుకుంటుంది. డైలాగులు తక్కువగా ఉన్నా, ఉన్నవన్నీ ఇంపాక్ట్ ఫుల్‌గా ఉన్నాయి. మొత్తంగా, ఎమోషన్స్‌తో పాటు రేసింగ్ ఎలిమెంట్స్‌ను మిక్స్ చేస్తూ శర్వానంద్ ఈసారి మంచి హిట్ కంటెంట్ అందించాడని చెప్పొచ్చు.
శర్వానంద్ హీరోగా నటించిన మోటోక్రాస్ బైక్ రేసింగ్ స్పోర్ట్స్ డ్రామా తాజాగా థియేటర్లలో విడుదలై మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. బైక్ రేసింగ్ ని మెయిన్ పాయింట్ గా ఎంచుకుని, తండ్రి కొడుకుల మధ్య ఎమోషన్స్ ని అద్భుతంగా చూపించాడు దర్శకుడు అభిలాష్ రెడ్డి. ఇక తెలుగులో ఇప్పటివరకు టచ్ చేయని మోటోక్రాస్ రేసింగ్ బ్యాక్‌డ్రాప్ ని ఎంచుకోవడం సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అవుతుంది. అలాగే శర్వానంద్, డా. రాజశేఖర్ల అద్భుతమైన నటన సినిమాకు హైలైట్ కాగా, ముఖ్యంగా రాజశేఖర్ కి రీ ఎంట్రీ తర్వాత దక్కిన స్ట్రాంగ్ రోల్ గా చెప్పొచ్చు.
అలాగే పలు రేసింగ్ సన్నివేశాలు కూడా ఆడియన్స్ ని థ్రిల్ చేస్తాయి. కాకపోతే, కాస్త నెమ్మదిగా సాగే ఫస్టాఫ్, రొటీన్ కథ కావడం వల్ల కాస్త యావరేజ్ ఫీల్ వచ్చినా, క్లైమాక్స్ వరకు థియేటర్లో కూర్చో బెట్టేసే స్ట్రాంగ్ స్క్రీన్ ప్లే బైకర్ కి రాసుకున్నాడు దర్శకుడు. స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో ఎమోషనల్ డ్రామాలను ఇష్టపడే వారికి బైకర్ సినిమా ఒక మంచి ఛాయస్ గా చెప్పొచ్చు.
హ్యాపీ రాజ్ సినిమా ఫస్టాఫ్ చూస్తుంటే… ఇది పూర్తిగా సెకండాఫ్ కోసం బిల్డప్ చేస్తున్నట్టే అనిపిస్తుంది. లౌడ్ మ్యూజిక్, అర్ధంపర్థం లేని కామెడీ, మాస్ ఎలిమెంట్స్, యూత్‌ను టార్గెట్ చేసే సీన్స్—ఇవన్నీ కలిపి రొటీన్ ఫీలింగ్ ఇస్తాయి. జీవీ ప్రకాశ్ వంటి టాలెంటెడ్ యాక్టర్ ఇలాంటి టెంప్లేట్ మూవీ చేశాడా? అనే సందేహం కూడా కలుగుతుంది. మొత్తానికి ఫస్టాఫ్‌లో పెద్దగా కొత్తదనం లేకుండా సాదాసీదాగా సాగుతుంది.
అయితే సెకండాఫ్‌లో తండ్రి-కొడుకుల మధ్య ఉన్న భావోద్వేగాలను బలంగా ప్రెజెంట్ చేస్తూ ఆడియన్స్‌ను కనెక్ట్ చేయడంలో సక్సెస్ అయ్యాడు. కానీ కథ పరంగా, కథనం పరంగా కూడా ఆడియన్స్ కి రెండు గంటలు బోర్ కొడుతోంది. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, జార్జ్ మార్యన్ వన్ మ్యాన్ షో చూపించాడు. జీవీ ప్రకాశ్ కూడా ఎమోషనల్ సీన్స్‌లో బాగా ఒదిగిపోయాడు. అబ్బాస్ రీ ఎంట్రీ డీసెంట్‌గా ఉంది.
టెక్నికల్‌గా సినిమా ఓకే అనిపిస్తుంది. సినిమాటోగ్రఫీ గ్రామీణ నేపథ్యంలో విజువల్స్‌ని బాగా చూపించింది. జస్టిన్ ప్రభాకరన్ మ్యూజిక్ ఫస్టాఫ్ లో కొంచెం లౌడ్‌గా అనిపించినా, సెకండాఫ్‌లో ఎమోషన్స్‌ని ఎలివేట్ చేయడంలో సహాయపడింది. మొత్తంగా చూస్తే, రొటీన్ స్టఫ్ తో క్లైమాక్స్ పై మాత్రమే డైరెక్టర్ ఫోకస్ చేసాడని అనిపిస్తుంది.
ఈ వారం థియేటర్లలోకి వచ్చిన హ్యాపీ రాజ్ ఆడియన్స్ నుండి డీసెంట్ రెస్పాన్స్ తెచ్చుకుంది. అయితే హ్యాపీ రాజ్ మూవీ టెక్నీకల్ గా చూస్తే.. జస్టిన్ ప్రభాకరన్ మ్యూజిక్ సినిమాకి పెద్ద మైనస్. సౌండింగ్ విషయంలో చాలా వరకు చిరాకు తెప్పిస్తుంది. కాకపోతే క్లైమాక్స్ లో ఎమోషనల్ సీన్లు ఆకట్టుకుంది. మధన్ క్రిస్టోఫర్ విజువల్స్ ఆకట్టుకున్నాయి. సెల్వ ఆర్కే ఎడిటింగ్ ఇంకా బాగా చేయాల్సింది. నిర్మాణ విలువలకు కొదవలేదు. దర్శకుడు మరియా రాజా ఎంచుకున్న కథ బాగుంది. దాన్ని తెరకెక్కించడంలో విఫలమయ్యాడు. సినిమా మొత్తం బాగా లేకపోవడంతో క్లైమాక్స్ హైలైట్ అయ్యింది. ఆకట్టుకుంది.
ఇక ఈ సినిమాకి జీవీ ప్రకాష్, జార్జ్ మరియన్, అబ్బాస్, శ్రీ గౌరీ ప్రియా పెర్ఫార్మన్స్ పరంగా మంచి ప్లస్ అయ్యారు. అలాగే విజువల్స్ కూడా బాగున్నాయి. క్లైమాక్స్ ఎమోషనల్ సీన్లు మంచి ప్లస్ అయ్యాయి. కానీ సరైన కథనం, పాటలు, బీజీఎం, కామెడీ, సాగదీత, ఫస్టాఫ్, సెకండాఫ్ కూడా కొంచెం మైనస్ అయ్యాయి. తండ్రి గొప్పతనాన్ని, పల్లెటూరి వాళ్లల్లో ఉండే బ్యూటీని, తండ్రి కొడుకుల మధ్య ఎమోషన్స్ బాండింగ్‌ని ఆవిష్కరించే మూవీ ఇది. క్లైమాక్స్ మినహా మిగతా సీన్లు చాలా యావరేజ్ గా ఉన్నాయి.
జివి ప్రకాష్ హీరోగా నటించిన హ్యాపీ రాజ్ ఈ వారం థియేటర్లలో రిలీజ్ కాగా, మరియా రాజ ఇళంజెళియన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆడియన్స్ నుండి మిక్స్డ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. హ్యాపీ రాజ్ మూవీ గురించి షార్ట్‌గా చెప్పాలంటే… “ఫస్టాఫ్ ఓకే, సెకండాఫ్ బ్లాక్‌బస్టర్ ఎమోషన్” అనే ఫీలింగ్ ఇస్తుంది.
ఫస్టాఫ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి చూసేవాళ్లకి ఒక్క డౌట్ వస్తుంది. “ఇది సెకండాఫ్ కోసం టైంపాస్ చేస్తున్నారా?” లౌడ్ మ్యూజిక్, కొంచెం ఓవర్ కామెడీ, మాస్ & యూత్ టార్గెట్ కంటెంట్… ఇవన్నీ కలిపి చూసినప్పుడు జీవీ ప్రకాశ్ ఇలాంటి సినిమా ఎందుకు చేశాడు? అనిపిస్తుంది. అంత రొటీన్ అనిపిస్తుంది. కానీ కానీ అసలు మ్యాజిక్ సెకండాఫ్‌లో స్టార్ట్ అవుతుంది.
డైరెక్టర్ మారియా రాజా ఇక్కడే గేమ్ మార్చేస్తాడు. ఫాదర్-సన్ ఎమోషన్స్ ని గుండెల్లో దిగేలా చూపించాడు. ముఖ్యంగా జార్జ్ మార్యన్ అయితే పూర్తిగా వన్ మ్యాన్ షో చివరి 30 నిమిషాలు అయితే… literally కంటతడి పెట్టించేలా ఉంటాయి. మూవీ అయిపోయే సరికి హార్ట్ హేవీగా బయటికి రావాల్సిందే. స్క్రీన్‌ప్లే, ఎమోషనల్ గ్రిప్ ఇవే మూవీకి పెద్ద ప్లస్ పాయింట్స్. జార్జ్ మార్యన్ — నెక్స్ట్ లెవెల్ ఎమోషన్స్ తో పాటు జీవీ ప్రకాశ్ - మాస్ + ఎమోషన్ రెండింటిలోనూ సెటిల్ అయ్యాడు. అలాగే అబ్బాస్ — రీ ఎంట్రీ కూడా సాలిడ్ కిక్కిస్తుంది. ఇటు శ్రీ గౌరి ప్రియ - గ్లామర్ మాత్రమే కాదు, యాక్టింగ్‌లో కూడా ఇంప్రూవ్ అయింది. ఓవరాల్ గా సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ ని ఆకట్టుకునే అవకాశం ఉంది.
జివి ప్రకాష్, శ్రీ గౌరీ ప్రియ హీరో హీరోయిన్లుగా నటించిన మూవీ హ్యాపీ రాజ్. మరియా రాజ ఇళంజెళియన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆడియన్స్ నుండి మిక్స్డ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. లవ్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కించిన ఈ సినిమా ఎక్కువగా ఫ్యామిలి ఆడియన్స్ ని ఆకట్టుకునేలా దర్శకుడు తెరకెక్కించాడని తెలుస్తుంది. కానీ దర్శకుడు ఆడియన్స్ కి కథ గురించి సరిగా చెప్పడంలో తడబడ్డాడు. కొన్ని సీన్స్ చక్కగా అనిపించినా, మరికొన్ని సీన్స్ ఇంకా బెటర్ గా తీసి ఉండాల్సింది.
జస్టిన్ ప్రభాకరన్ సంగీతం కొంతవరకు ఫర్వాలేదనిపిస్తుంది. మదన్ క్రిస్టోఫర్ సినిమాటోగ్రఫీ బాగుంది. చిత్ర నిర్మాణ విలువలు బాగున్నాయి. ఓవరాల్ గా చూస్తే.. ‘హ్యాపీ రాజ్’ కొంతవరకు ఆకట్టుకునే ఫ్యామిలీ డ్రామాగా నిలిచింది. జి.వి. ప్రకాష్, శ్రీ గౌరి ప్రియ మరియు జార్జ్ మరియన్ తమ పర్ఫార్మెన్స్ లతో మెప్పిస్తారు. అలాగే అబ్బాస్ రోల్ కూడా బాగుంది. కానీ ఇంకాస్త బలంగా ఉండాల్సింది. ఫస్ట్ హాఫ్ కాస్త విసిగించినా, సెకండాఫ్ ఫర్వాలేదనిపిస్తుంది. ఫామిలీ లవ్ డ్రామాలను ఇష్టపడేవారు హ్యాపీ రాజ్ సినిమాను ఒకసారి ట్రై చేయవచ్చు.
యూత్ సినిమా గురించి స్ట్రైట్ గా చెప్పాలంటే… ఇది ఒక పక్కా యూత్ ని మెప్పించే అంశాలతో తెరకెక్కించే మూవీ. బాల నటుడిగా కెరీర్ మొదలు పెట్టిన కెన్ కరుణాస్ ప్రవీణ్ పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. ఎమోషన్స్ కూడా బాగా పండించాడు. అమాయకపు ప్రేమికుడిగా పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయ్యాడు. నిడివి ఎక్కువ ఉన్న కథానాయికగా గంగవల్లి పాత్రలో అనీషా అనిల్ నటన నేచురల్ గా ఉంది. మిగతా హీరోయిన్లు మీనాక్షి దినేష్, ప్రియాన్సీ యాదవ్ కూడా కనిపించిన కాసేపు తమ పాత్రలకు న్యాయం చేశారు. హీరోకి తల్లిగా దేవదర్శిని తో పాటు తండ్రిగా నటించిన సూరజ్ పాత్రలు సినిమాకు హైలైట్.
వికీ సినిమాటోగ్రఫీ వర్క్ బాగుంది. స్కూల్ వాతావరణాన్ని, టీనేజ్ రంగుల ప్రపంచాన్ని చక్కగా చూపించారు. జీవీ ప్రకాశ్ సంగీతం కథకు తగ్గట్టు ఉంది. అయితే యూత్ నోట్లో నానే పాటలను అందించటంలో తను ఫెయిల్ అయ్యాడు. తెలుగు అనువాదం విషయంలో మేకర్స్ జాగ్రత్తలు తీసుకున్నారు. యూత్ నే కాదు పేరెంట్స్ ను సైతం ఈ సినిమా ఆకట్టుకుంటుంది. ప్రత్యేకించి చివరి 20 నిమిషాలు సినిమాకు ఆయువు పట్టు.
కెన్ కరుణాస్ హీరోగా, డైరెక్టర్ గా తీసిన యూత్ సినిమా మిక్స్డ్ టాక్ తోనే నడుస్తోంది. సినిమా మొత్తంగా చూస్తే టార్గెట్ క్లియర్ గా యూత్ ఆడియన్స్ ని టార్గెట్ చేసినట్టు ఉంది.
కెన్ కరుణాస్ తన రోల్‌కు తగ్గట్టు నటించాడు. ఓవరాల్‌గా సినిమాను క్యారీ చేయడానికి బాగా ట్రై చేశాడు. మీనాక్షి దీక్షిత్, ప్రియాన్షి యాదవ్, అనీష్మా అనిల్ కుమార్ ముగ్గురు కూడా స్క్రీన్ పై క్యూట్ గా కనిపిస్తూ తమ పార్ట్ చేసేశారు. దేవదర్శిని, సూరజ్ వెంజరమూడు ఎక్స్పీరియన్స్ మాత్రం కొన్ని సీన్స్‌లో స్పష్టంగా కనిపిస్తుంది.
కామెడీ ఈ సినిమా కి మెయిన్ బలం. చాలా చోట్ల వర్క్ అవుతుంది. ఫ్రెండ్స్ తో వెళ్లి లైట్ గా నవ్వుకోవడానికి సరిపోతుంది. మ్యూజిక్ కూడా జీవీ ప్రకాష్ స్టైల్లో ఓకే అనిపిస్తుంది. కానీ సమస్య ఏంటంటే… కథలో కొత్తదనం లేదు. చాలా సీన్స్ ముందే ఊహించగలిగేలా ఉంటాయి. రొటీన్ ఫ్లో నుంచి బయటకు రావడం లేదు. ఓవరాల్ గా
ఎక్స్పెక్టేషన్స్ తక్కువగా పెట్టుకుని వెళ్తే… యూత్ ఓకే టైమ్ పాస్ అనుకుని చూడొచ్చు, కానీ కొత్తదనం కోసం వెతికితే… నిరాశ తప్పదు.
కెన్ కరుణాస్ హీరోగా నటించిన యూత్ మూవీ థియేటర్లలో మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఈ సినిమాకి జీవీ ప్రకాష్ కుమార్ ఇచ్చిన సంగీతం బాగుంది. తెలుగు రీమిక్స్ పాటలు ఉర్రూతలూగించాయి. వీకీ కెమెరా వర్క్ కూడా ఆకట్టుకునేలా ఉంది. తెలుగు సినిమా చూసినట్టుగానే యూత్ ఉండడంతో అది సినిమాకు మంచి ప్లస్ అవుతుంది. కెన్ కరునాస్ అండ్ గ్యాంగ్ దర్శకత్వం పరంగా చాలా బాగా కష్టపడ్డారు.
తెలుగులో ఇలాంటి సినిమాలు రెగ్యూలర్‌గా వస్తూనే ఉన్నాయి. అయినప్పటికీ కుర్రాళ్లకి మాత్రం టైమ్ పాస్ మూవీ అవుతుంది. ఇప్పటికే నటుడిగా పలు సినిమాలతో మెప్పించగా ఇప్పుడు హీరోగా యూత్ సినిమాతో చాలా యాక్టివ్ గా నటించి అదరగొట్టాడు. ఓవరాల్ గా యూత్ సినిమా ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంటుంది.
కెన్ కరుణాస్ స్వీయ దర్శకత్వంలో నటించిన యూత్ మూవీ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంటుంది. కొత్తవాడైనప్పటికీ తెలుగు ప్రేక్షకులు కూడా కనెక్ట్ అయ్యేలా బాగా ఇంప్రెస్ చేసాడు. అలాగే ముగ్గురు హీరోయిన్లలో అనీష్మా అనిల్ కుమార్ బాగా పెర్ఫామ్ చేసింది. క్యూట్ గా అనిపిస్తూనే చక్కగా హావభావాలు పలికించింది. మీనాక్షి.. ప్రియాంశి ఓకే అనిపిస్తారు. హీరో తల్లిదండ్రుల పాత్రల్లో సూరజ్.. దేవదర్శిని చాలా బాగా నటించారు. వారి పాత్రలు.. నటన సినిమాకు పెద్ద బలంగా నిలిచాయి.
అలాగే సాంకేతికంగా జి.వి.ప్రకాష్ కుమార్ ‘ముత్త కలక్కి’ వైరల్ పాటతో ముందే ఈ సినిమాకు చాలా ప్రయోజనం చేకూర్చి పెట్టాడు. తెలుగులో ఆ పాట లిరిక్స్ అంత ఆకర్షణీయంగా లేకపోయినప్పటికీ.. బీట్ వల్ల తెరపై ఈ పాట బాగానే క్లిక్ అయింది. నిర్మాణ విలువలు సినిమాలకు అవసరమైన స్థాయిలో ఉన్నాయి. కెన్ తన టీంతో కలిసి యూత్ ను మెప్పించేలా ఒక సింపుల్ కథను ఎంగేజింగ్ స్క్రీన్ ప్లేతో తెర మీద బాగా ప్రెజెంట్ చేశాడు. తన టేకింగ్ బాగుంది. వినోదంతో పాటు ఎమోషన్లనూ అతను బాగా హ్యాండిల్ చేశాడు.
Browse by Reviewer Category
Discover reviews from different types of critics and publications
News Channel
Movie-specific media and publications
Twitter Channel
Website
Youtube Channel
CA/Advocate
Corporate (Non IT) Employee
Doctor/Health Worker
Freelancer & Consultant
Homemaker / Housewives
Women managing households
Influencer
IT Employee
Journalists & Critics
Private Employee
Small Business Owner
Less than 20 team size
Students & Youth
School students, college students, young viewers