Cult movie Review
By TV9 Telugu
గోవా నేపథ్యంగా ఒక బర్త్‌డే పార్టీతో ఈ సినిమా స్టార్ట్ అవుతుంది.. మొదట్నుంచీ డ్రగ్స్, మందుతో నిండిపోతుంది స్క్రీన్ అంతా.. ఆ తర్వాత రక్తం కూడా. అనూహ్యంగా ఆ పార్టీ కాస్తా ప్రాణాంతకమైన ఆటకు దారితీసి, అందులో ఇరుక్కుపోయిన వాళ్ళకు సర్వైవల్ డ్రామాగా మారుతుంది. స్క్రీన్ ప్లే చాలా వేగంగా సాగడం ఈ సినిమాకు ఉన్న అతిపెద్ద బలం. ఏమాత్రం సమయం వృధా చేయకుండా ఒక సీన్ నుంచి మరో సీన్‌కు చాలా వేగంగా కథను నడిపించారు. కాకపోతే పాత్రల పరిచయానికే దర్శకుడు ఎక్కువ సమయం తీసుకోవడం వల్ల ప్రేక్షకుడికి కాస్త అసహనం కలుగుతుంది.
సినిమా ‘హిట్ 3’ని గుర్తుకుతెచ్చేలా అత్యంత భయంకరమైన యాక్షన్, రక్తపాతం, హింసతో కూడిన సన్నివేశాలతో ఈ సినిమా నడుస్తుంది. ఇక సెకండాఫ్ కూడా ప్రాణాలను దక్కించుకునే పోరాటం చుట్టూనే సాగుతుంది, కానీ అవే సీన్లు మళ్లీ మళ్లీ వస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. పాత్రల గతాన్ని వివరించే నేపథ్య కథను ఇంకాస్త ఆసక్తికరంగా రాసుకుని ఉండాల్సింది. భావోద్వేగాలను పండించే సన్నివేశాలు ఆడియన్స్ మనసుకు సరిగ్గా హత్తుకోవు. మొత్తంగా చూసుకుంటే, కేవలం భీకరమైన పోరాటాలు, వయొలెన్స్ మాత్రమే ఈ సినిమాను చివరి వరకు నిలబెట్టాయి. నటుడిగానే కాదు దర్శకుడిగానూ విశ్వక్ సేన్ బాగానే ఆకట్టుకున్నాడు. ఈ తరహా సినిమాలు అందరికీ నచ్చకపోవచ్చు కానీ మనం ముందుగా చెప్పినట్లు సర్వైవల్ డ్రామాలు ఇష్టపడే వాళ్లకు మాత్రం ఓ మోస్తరుగా అనిపిస్తాయి. కొన్ని సీన్స్ థ్రిల్ పంచుతాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి. ఓవరాల్ గా కల్ట్.. రూత్ లెస్ సర్వైవల్ థ్రిల్లర్..!
Above Average
Cult movie review
By Tupaki
‘కల్ట్’ ప్రోమోలు చూసినపుడే ఇది కొరియన్ వెబ్ సిరీస్ ‘స్క్విడ్ గేమ్’ స్ఫూర్తితో తెరకెక్కిన సినిమా అని అర్థమైపోతుంది. ఐతే ‘స్క్విడ్ గేమ్’లో వయొలెన్స్ వెనుక బలమైన రీజన్ ఉంటుంది. తెర మీద క్యారెక్టర్ల తరహాలోనే మనమూ భయపడతాం. కానీ ‘స్క్విడ్ గేమ్’ కాన్సెప్టును తెలుగైజ్ చేస్తూ విశ్వక్సేన్ తీసిన ‘కల్ట్’లో మాత్రం ఎక్కడా ఎమోషన్ అన్నదే లేదు. ఉత్కంఠకూ ఛాన్స్ లేదు. ఏదో తమాషా గేమ్ నడుస్తున్నట్లు ఉంటుందే తప్ప.. భయం-ఉత్కంఠకు అవకాశం లేకపోయింది. అవయవాలు తెగిపడే సీన్లు చాలా కృత్రిమంగా.. జుగుప్ప కలిగేలా తీయడం.. కథ ఏమాత్రం ముందుకు కదలకుండా ఎంతసేపూ ఆ సీన్లే రిపీట్ అవుతుండడంతో ‘కల్ట్’ తొలి గంటలో తీవ్ర అసహనం కలిగిస్తుంది. మనుషులు రకరకాలుగా చస్తుంటారు. తెరంతా రక్తంతో తడిసిపోతుంటుంది. ఆ ఘోరాలన్నీ చూడలేక కాసేపు కళ్లు మూసుకుని మళ్లీ తెరిచినా కథ మాత్రం ముందుకు కదలదు. అక్కడే ఉంటుంది.
ఇక సినిమాలో ఈ హత్యల వెనుక అసలు కారణం తెలిశాక మాత్రం అందులో ఎంతమాత్రం లాజిక్ కనిపించదు. ప్రతీకారం తీర్చుకునే పాత్ర మీద ప్రేక్షకులకు ఆపేక్ష కలగనపుడు.. తనతో ఎమోషనల్ కనెక్షన్ ఏర్పడనపుడు పేఆఫ్ సీన్లు పండవు. ‘కల్ట్’లో కూడా అదే జరిగింది. చివరి ముప్పావు ‘కల్ట్’ కొంచెం ఎంగేజింగ్ గానే నడిచినప్పటికీ.. అంతకుముందు కలిగిన అసహనాన్ని భర్తీ చేసే స్థాయిలో అయితే సినిమా లేదు. బలమైన ఎమోషన్ లేకపోయినా అల్ట్రా వయొలెంట్ సీన్లను ఎంజాయ్ చేస్తాం అనుకున్న వాళ్లే ‘కల్ట్’ వైపు చూడాలి. బాబోయ్ హింస అనుకునేవాళ్లు దీనికి దూరంగా ఉండాల్సిందే.
డైరెక్టర్ విశ్వక్సేన్ విషయానికి వస్తే.. తన చివరి డైరక్టోరియల్ మూవీ ‘దాస్ కా ధమ్కీ’లో మాదిరే ఇక్కడ కూడా ట్విస్టుల మీద.. అలాగే బ్యాక్ స్టోరీ మీద ఎక్కువ ఆధారపడ్డాడు. కానీ తాను తీసిన తొలి రెండు చిత్రాలతో పోలిస్తే.. ఇందులో సరైన పాత్రలు- సన్నివేశాలు రాసుకోలేకపోయాడు. ఏమాత్రం ఎమోషన్ లేకుండా హింసాత్మక సన్నివేశాలను పేర్చుకువెళ్లడంతో ‘కల్ట్’ కంగాళీగా తయారైంది.
Below Average
Cult movie review
'కల్ట్' ఇంతకీ ఇదేం జానర్ సినిమానయ్యా విశ్వక్ సేనూ అంటే.. స్లాషర్ అనే హాలీవుడ్ జానర్ అని.. అదో కొత్త అనుభూతి అని చెప్పారు కానీ.. ఆ తెల్లవాళ్లకి నచ్చే జానర్ మన తెలుగు వాళ్లకి అంతగా అయితే కనెక్ట్ కాదు. స్లాషర్ జానర్ అంటే.. బ్లడ్ బాత్ సీన్లే ఎక్కువ ఉంటాయి. కల్ట్ సినిమాలో బ్లడ్ బాత్ కాదు.. పై నుంచి ప్రేక్షకులపై బ్లడ్ షవర్ పెట్టినట్టే అనిపిస్తాయి. రక్తపాతంతో తడిపేశారు. స్లాషర్ జానర్‌కి డార్క్ కామెడీ జోడించడం వరకూ ఒకే కానీ.. ప్రేక్షకుడు ఎక్కడ థ్రిల్ ఫీల్ అవ్వాలి? ఎక్కడ నవ్వాలి? ఎక్కడ ఉత్కంఠ పెంచాలి? అనే మూడింటినీ బ్యాలెన్స్ చేసినప్పుడే ఈ డిఫరెంట్ జానర్ మూవీస్ ఆడియన్స్‌కి కనెక్ట్ అవుతాయి. లేదంటే ఏ ఎమోషన్‌కి కనెక్ట్ కాలేక కన్ఫ్యూజన్లో ఉండిపోతారు. ‘కల్ట్’తో అలాంటి కన్ఫ్యూజన్కి గురిచేశారు.
వీక్ హార్టెడ్ పీపుల్స్, చిన్న పిల్లలు ఈ సినిమా చూడటానికి రావద్దని విశ్వక్ సేన్ ఇందుకేనా ముందే చెప్పారు అన్నట్టుగా ఉంటాయి కొన్ని దారుణమైన నరుకుడు సీన్లు. ఇది ఖచ్చితంగా వైల్డ్ ఫిల్మ్.. ఈ సినిమా 49 శాతం క్రెడిట్ నేను తీసుకుంటా.. 51 శాతం మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్కి ఇస్తానని చెప్పారు విశ్వక్ సేన్. నిజమే.. ఈ సినిమాలో సాంగ్స్ ఏమీ లేవు.. కేవలం బ్యాగ్రౌండ్ మ్యూజిక్‌పైనే కథనం నడుస్తుంది. విశ్వక్ సేన్‌కి మాత్రం 49 శాతం క్రెడిట్ ఇవ్వలేం. పాస్ మార్కులు కూడా కష్టమే. విశ్వక్ సేన్ సినిమా అంటే బూతులు మస్ట్.. మరి ఈ సినిమాకి కూడా బూతులు అత్యవసరం అని అనుకున్నారేమో కానీ.. ఎడిటర్ రవితేజ గిరిజాల అలాగే వదిలేశారు. ఓవరాల్‌గా ‘కల్ట్’.. ఇది విశ్వక్ సేనుడి హింసాత్మకం. అందరికీ నచ్చదు. ఫ్యామిలీ ఆడియన్స్ అయితే దూరంగా ఉండటమే మంచిది.
Below Average
Cult Movie Review
By Filmi Beat
కల్ట్ సినిమా కథ విషయానికి వస్తే.. ఎలాంటి కథ, ఎమోషన్స్ లేకుండా హింస, రక్తపాతం అంశాలే టార్గెట్‌గా సన్నివేశాలను అల్లుకొన్నాడు. ఓ రాత్రి పబ్‌లో జరిగే బర్త్ డే పార్టీలో జరిగిన గొడవలు, డేంజరస్ గేమ్ చుట్టూ సాగే కథను దర్శకుడిగా మారి విశ్వక్ సేన్ ఓ ప్రయోగమే చేశాడని చెప్పవచ్చు. అయితే దాదాపు 30 నిమిషాల తర్వాత డీఎస్పీ సంకల్ప్‌గా విశ్వక్ సేన్ ఎంట్రీ ఇచ్చేంత వరకు సినిమాలో ఎలాంటి ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ గానీ, కదలిక లేకపోవడం వల్ల సాదాసీదాగా కథ సాగుతుంది. విశ్వక్ ఎంట్రీ ఇచ్చిన తర్వాతైనా కథలో బలమైన సన్నివేశాలు లేకపోవడం, సినిమాను ముందుకు నడిపించడానికి హీరో, విలన్ మధ్య పోటాపోటీగా సరైన సన్నివేశాలు లేకపోవడంతో రోటీన్‌గా ఉందని చెప్పుకోవడానికైనా అవకాశం లేకపోయింది.
ఇక సెకండాఫ్‌లో కూడా అదే తీరు కొనసాగింది. చివర్లో స్వల్పింగ సంపర్కుల ఎపిసోడ్ లో కొంత మేరకు ఎమోషన్స్ కనిపించాయనిపిస్తుంది. అంతకు మించి ఈ సినిమాలో చెప్పుకోవడానికి ఘనతలు గానీ, గొప్ప అంశాలు లేవనే స్పష్టంగా కనిపిస్తాయి. ఫైనల్ గా ఉన్నంతలో విశ్వక్ సేన్ అన్ని రకాల భారాలను మోశాడు. తన కష్టం స్క్రీన్ మీద కనిపించినప్పటికీ.. కథ, కథనాలు పేలవంగా ఉండటంతో ఫలితం లేకుండా పోయింది. ఈ సినిమాకు రవి బస్రూర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్లస్ పాయింట్. ప్రొడక్షన్ వాల్యూస్ ఫర్వాలేదనిపిస్తాయి. ఈ సినిమా కథ, కథనాలపై మరింత దృష్టిపెట్టి.. నేటి తరం ఆడియెన్స్‌ను టార్గెట్ చేసుకొని సినిమా తీసి ఉంటే.. నిజంగానే కల్ట్ సినిమా అనిపించుకొనే అవకాశాలు ఉండేవి. మితీమీరిన హింస, రక్తపాతంతో ఉండే యాక్షన్ సినిమాలను ఎంజాయ్ చేసే వారు ఓ సారి చూడొచ్చు.
Not Good
Cult movie review
తెలుగులో స్లాషర్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రాలు ఇప్పటి వరకు రాలేదని చెప్పొచ్చు. విశ్వక్ సేన్ తెలుగు ఆడియెన్స్ కోసం ఈ ప్రయోగం చేశాడు. ఇది మన ఆడియెన్స్ కి కొత్త ఎక్స్ పీరియెన్స్ అని చెప్పొచ్చు. ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్‌గా కల్ట్ ని తెరకెక్కించాడు విశ్వక్ సేన్. అయితే ప్రయోగం బాగుంది. కానీ దాన్ని చుట్టూ అల్లుకున్న కథ అంతగా కన్విన్సింగ్‌గా లేదు. ఇలాంటి స్లాషర్ మూవీలకు కథ పెద్దగా ఉండదు, స్క్రీన్ ప్లే మెయిన్ ఇంపార్టెంట్. దాన్ని ఎంత బాగా తీస్తే అంత బాగా వస్తుంది, ఆకట్టుకుంటుంది. ఈ విషయంలో విశ్వక్ కొంత తడబడ్డాడు. సినిమాలో యాక్షన్ వీరోచితంగా ఉంటుంది. రక్తపాతం ఏరులై పారేలా ఉంటుంది.
హీరో కూడా నిస్సాహాయ స్థితిలో ఉన్న నేపథ్యంలో కథనం స్లో అయిపోతుంది. బోరింగ్ గా అనిపిస్తుంది. ఆ తర్వాత అసలు ట్విస్ట్ రివీల్ కావడం బాగుంది. క్లైమాక్స్ లో దానికి కారణం చెబుతారు. ఫినిషింగ్ మాత్రం సాగదీసినట్టుగా ఉంది. సౌండ్ ఓవర్‌గా అనిపించింది. కాకపోతే అందులో జీవిం లేదు. దర్శకుడు విశ్వక్ సేన్ చేసిన ప్రయత్నం బాగుంది. కానీ దాన్ని మన ఆడియెన్స్ కి ఆకట్టుకునేలా తెరకెక్కించడంలో మాత్రం కొంత తడబాటు కనిపిస్తుంది. యాక్షన్‌కి సంబంధించిన పెయిన్ మిస్ అయ్యింది. ఫైనల్ గా సినిమాలో హింస తప్ప ఎమోషన్ లేదు. అదే పెద్ద మైనస్. కానీ టెక్నీకల్‌గా బాగుంది. విశ్వక్ సేన్ చేసిన కొత్త ప్రయత్నంగానే మిగిలిపోతుంది.
Average
Cult Movie Review
By 10TV Telugu
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన చిత్రం ‘కల్ట్’. సరికొత్త కథాంశంతో, విపరీతమైన హింసతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా.. ఒక ప్రమాదకరమైన ఆట చుట్టూ తిరుగుతుంది. సినిమా ప్రారంభంలోనే ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచే ప్రయత్నం కనిపిస్తుంది. పార్టీ వాతావరణం నుంచి ఒక్కసారిగా ప్రమాదకరమైన పరిస్థితుల్లోకి కథను తీసుకెళ్లడం ద్వారా ఉత్కంఠను సృష్టించాలని దర్శకుడు భావించారు. అయితే, ఆసక్తికరమైన పాయింట్‌ను తెరపైకి తీసుకొచ్చినంత మాత్రాన సినిమా మొత్తం ఆకట్టుకోవడం సాధ్యం కాదు. కథలో బలమైన సంఘర్షణ, పాత్రల మధ్య భావోద్వేగాలు, ప్రేక్షకులను కట్టిపడేసే మలుపులు కీలకం. కానీ ఈ అంశాల విషయంలో ‘కల్ట్’ ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోయిందనే అభిప్రాయం కలుగుతుంది.సినిమాలు చూడండి
హింసాత్మక సన్నివేశాలపై పెట్టిన శ్రద్ధను కథనం మీద కూడా పెట్టి ఉంటే ఫలితం మరోలా ఉండేది. కొన్ని సన్నివేశాలు ఉత్కంఠను పెంచాల్సింది పోయి, అసలు కథ ఎటు వెళ్తోందనే సందేహాన్ని కలిగిస్తాయి. ‘కల్ట్’ అనే టైటిల్ తోనే ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచిన విశ్వక్ సేన్.. ఈసారి ఒక భిన్నమైన ప్రయోగంతో వచ్చారు. అయితే, కొత్త జానర్‌ను ఎంచుకోవడం, తెరపై తీవ్రతను చూపించడం మాత్రమే సినిమాను విజయవంతం చేయలేవు. విశ్వక్ సేన్ ప్రయత్నం కనిపించినా, దాన్ని బలమైన సినిమాగా మలచడంలో విఫలం అయ్యాడు. మొత్తంగా ‘కల్ట్’.. హింసను నమ్ముకుంది కానీ కథతో ప్రేక్షకులను మెప్పించలేకపోయింది.
Not Good
Cult Movie Review
By Great Andhra
మన మాస్ కా దాస్ విశ్వక్ సేన్ గారు ఈసారి గట్టిగా కంబ్యాక్ ఇవ్వాలని డిసైడ్ అయి, ఏకంగా కొరియన్ వాళ్ల ‘స్క్విడ్ గేమ్’ ప్యాకెట్‌ను విప్పేసి, దానికి గోవా మసాలా దట్టించి ‘కల్ట్’ అని పేరు పెట్టేశారు. కథ విషయానికి వస్తే.. 300 మంది కుర్రాళ్ళు గోవా పబ్‌లో చిల్లు చొక్కాలు వేసుకుని కేరింతలు కొడుతుంటే, సడన్‌గా మాస్కులు వేసుకున్న కొంతమంది వచ్చి ప్రాణాంతకమైన డెత్ గేమ్ స్టార్ట్ చేస్తారు. ఇక అందరినీ కాపాడటానికి మన డీఎస్పీ విశ్వక్ సేన్ లేట్‌గా ఐనా లేటెస్ట్గా ఎంట్రీ ఇచ్చి, పబ్‌లోని విలన్లను తుక్కు తుక్కుగా నరికేస్తుంటారు. యాక్షన్ సీన్స్, రవి బస్రూర్ హెవీ బీజీఎమ్ వరకు ఓకే గానీ.. రెడ్‌లైట్-గ్రీన్ లైట్ ఆడే లోపే ఫస్ట్ హాఫ్‌లోనే మ్యాటర్ మొత్తం లీక్ అయిపోతుంది!
సెకండాఫ్‌లో ఎమోషన్ ఉందా అంటే లేదు, కిక్ ఇచ్చే సస్పెన్స్ ఉందా అంటే అస్సలు లేదు! రక్తం మాత్రం లీటర్ల కొద్దీ స్క్రీన్ మీద పారుతుంటుంది. ఫ్యామిలీ ఆడియన్స్ అయితే ఈ వైలెన్స్ చూసి థియేటర్ బయటికే పరుగులు తీస్తారు. విశ్వక్ సేన్ డైరెక్షన్ అండ్ యాక్షన్ ఓకే గానీ, స్క్రీన్‌ప్లే మాత్రం కొరియన్ డ్రామాకి తెలుగు రొటీన్ బిస్కట్ వేసినట్టు అనిపిస్తుంది. ఓన్లీ బ్లడ్ & వైలెన్స్ లవర్స్ అయితే ఓ లుక్కేయండి! ప్రస్తుతానికి మాత్రం కల్ట్ కష్టపెట్టింది.
Average
Cult Movie Review
By NTV Telugu
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా, దర్శకుడిగా వచ్చి టాలీవుడ్ ముందుకు తెచ్చిన సర్వైవల్ యాక్షన్ థ్రిల్లర్ 'కల్ట్'. స్క్విడ్ గేమ్ తరహాలో ఓ గోవా పబ్‌లో 300 మంది ప్రాణాలతో ఆడే డెత్ గేమ్, వారిని కాపాడే డీఎస్పీ సంకల్ప్ నాయక్ (విశ్వక్) చుట్టూ ఈ సినిమా తిరుగుతుంది.
విశ్వక్ సేన్ మార్క్ వన్-మేన్ షో, స్టైలిష్ యాక్షన్ కొరియోగ్రఫీ, రవి బస్రూర్ ఎలివేటింగ్ బీజీఎమ్ విజువల్‌గా మంచి థ్రిల్ ఇస్తాయి. దర్శకుడిగా టాలీవుడ్‌కి కొత్త టేస్ట్ పరిచయం చేయాలనే విశ్వక్ ప్రయత్నం బాగుంది.
అయితే, మొదటి హాఫ్‌లోనే కాన్సెప్ట్ మొత్తం రివీల్ అయిపోవడం, సెకండాఫ్‌లో ఎగ్జైట్మెంట్ లేని స్లో నేరేషన్, ప్రిడిక్టబుల్ సీన్స్ సినిమాకి పెద్ద దెబ్బ. దానికితోడు ఫ్యామిలీకి అస్సలు కనెక్ట్ అవ్వని విపరీతమైన వైలెన్స్ ఉండటంతో అందరినీ మెప్పించడం కష్టమే.
మాస్ యాక్షన్ అండ్ స్లాషర్ జోనర్ ప్రియులకు ఇది ఒక జస్ట్ యావరేజ్ వాచ్! ఫైనల్లీ కల్ట్.. బ్లడ్ బాత్ ఓవర్ ఫ్లోడ్.. ఇది అందరి కప్ అఫ్ టీ కాదు.
Average
Cult movie Review
By Sakshi
టాలీవుడ్ మాస్ హీరో విశ్వక్ సేన్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ సర్వైవల్ యాక్షన్ థ్రిల్లర్ 'కల్ట్'. కొరియన్ 'స్క్విడ్ గేమ్' స్ఫూర్తితో గోవా పబ్ బ్యాక్‌డ్రాప్‌లో 300 మందితో సాగే ప్రాణాంతకమైన డెత్ గేమ్ కాన్సెప్ట్‌తో నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
గోవా హోమ్ మినిస్టర్ కొడుకు బర్త్ డే పార్టీని ఓ గ్యాంగ్ ముట్టడించి డేంజర్ గేమ్ స్టార్ట్ చేయడం, అందులో చిక్కుకున్న వారిని కాపాడటానికి డీఎస్పీ సంకల్ప్ నాయక్ (విశ్వక్ సేన్) రంగంలోకి దిగడం ఈ సినిమా ప్లాట్.
విశ్వక్ సేన్ స్టైలిష్ టేకింగ్, రవి బస్రూర్ పవర్ ప్యాక్డ్ బీజీఎమ్, హై-వోల్టేజ్ వైల్డ్ యాక్షన్ సీక్వెన్సెస్ సినిమాకి మెయిన్ ప్లస్ పాయింట్లు. అయితే, టాలీవుడ్ ఆడియన్స్ భరించలేని అతిగా ఉండే వైలెన్స్, రొటీన్ సెకండాఫ్ స్క్రీన్ ప్లే, ఊహించదగ్గ సన్నివేశాలు సినిమాకి బిగ్ మైనస్. ఫ్యామిలీ ఆడియన్స్ దీనికి దూరంగా ఉండటమే బెటర్!
Average
Cult movie Review
By 123telugu
విశ్వక్ సేన్ మరోసారి దర్శకుడిగా మారి రూపొందించిన చిత్రం `#కల్ట్`. ఇందులో ఆయనే హీరో. గాయత్రీ భరద్వాజ్ హీరోయిన్ గా నటించింది. కాగా ఈ రోజు రిలీజ్ అయిన ఈ చిత్రం యావరేజ్ టాక్ తెచ్చుకుంది. అయితే ఈ కల్ట్ సినిమాలో వైల్డ్ యాక్షన్ ఎలిమెంట్స్ అండ్ క్లైమాక్స్ లో వచ్చే మెయిన్ స్టోరీ థీమ్ బాగున్నాయి. తన పాత్రలో విశ్వక్ సేన్ బాగానే నటించాడు. అలాగే ‘వైల్డ్ యాక్షన్ అండ్ కొన్ని చోట్ల ఎమోషనల్ ఎలిమెంట్స్’ కూడా పర్వాలేదు. కానీ విపరీతమైన హింసతో పాటు సినిమాలో విపరీతంగా బ్లడ్ షెడ్ కూడా ఎక్కువ అయిపోయింది. సినిమా ప్రమోషన్స్ లో కూడా సినిమా ఇలాగే ఉండబోతుంది అని చెప్పారు కాబట్టి, కుటుంబ ప్రేక్షకులకు, సున్నితమైన మనస్తత్వం ఉన్నవారికి ఈ సినిమా కనెక్ట్ కాదు. వాళ్ళు ఈ సినిమాకి వెళ్లకపోవడమే మంచిది.
మొత్తానికి కథలో చెప్పాలనుకున్న మెయిన్ థీమ్ తో పాటు కీలక సన్నివేశాల్లో మంచి పనితీరుని కనబర్చిన దర్శకుడు విశ్వక్ మిగిలిన కొన్ని సన్నివేశాల్లో మాత్రం నెమ్మదిగా కనిపించారు. స్లాషర్ జోనర్ లో #కల్ట్ అంటూ వచ్చిన హై వోల్టేజ్ ఇంటెన్సివ్ యాక్షన్ డ్రామాలో… విశ్వక్ నటన, వైల్డ్ యాక్షన్ సీన్స్ అండ్ క్లైమాక్స్ బాగున్నాయి. ఐతే, సినిమాలో బలమైన ఎమోషన్, కాన్ ఫ్లిక్ట్ ఉన్నప్పటికీ… ఆ ఎమోషన్ లో, ఆ కాన్ ఫ్లిక్ట్ లో ప్రేక్షకుడు ఇన్ వాల్వ్ అయ్యేంతగా.. అవి సరిగ్గా కనెక్ట్ కాలేదు. దీనికితోడు స్క్రీన్ ప్లేలో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ మిస్ అయ్యాయి. ఓవరాల్ గా యాక్షన్ లవర్స్ ను మాత్రమే ఈ చిత్రం కొన్ని చోట్ల ఆకట్టుకుంటుంది.
Above Average
Adarsha Kutumbam movie review
By Tupaki
త్రివిక్రమ్ శ్రీనివాస్ రచన.. విక్టరీ వెంకటేష్ నటన.. ఈ రెండూ కలిస్తే అద్భుతమే. ఒక నువ్వు నాకు నచ్చావ్.. ఒక మల్లీశ్వరి.. మామూలు సినిమాలు ఇవ్వలేదు ఈ జోడీ. మరి త్రివిక్రమ్ దర్శకత్వంలో వెంకీ సినిమా చేస్తే ఇంకెంత అద్భుతంగా ఉంటుందో అని ఆశిస్తే.. నిరాశ తప్పదు. సినిమా తీస్తున్నపుడే ఈసారి తమ జోడీ అద్భుతాలేమీ చేయబోవట్లేదని అర్థమయ్యే ప్రోమోల్లోనే అంచనాలు తగ్గించేసిందేమో ఈ జోడీ. కథాకథనాల పరంగా ‘ఆదర్శ కుటుంబం’ చాలా సాధారణంగా అనిపించే సినిమా. ఏమాత్రం లాజికల్ గా అనిపించని సెటప్ తో త్రివిక్రమ్.. కథ పరంగా బాగా నిరాశపరుస్తాడు. ఆ స్టోరీ చుట్టూ అల్లిన కథనం కూడా పెద్దగా కిక్కు ఇవ్వదు. కానీ బలహీన కథాకథనాల్లోనే తన మార్కు చమత్కారం.. డైలాగులతో త్రివిక్రమ్ ఒక చేయి వేస్తే.. విక్టరీ వెంకటేష్ తనదైన నటనతో సన్నివేశాలను పాస్ చేయించేశాడు.
‘ఆదర్శ కుటుంబం’ చూస్తున్నంతసేపు ఏముంది దీని స్పెషాలిటీ అనిపిస్తూ ఉంటుంది. కానీ రెండున్నర గంటలు అలా అలా గడిచిపోతాయి. ఫ్యామిలీ ఆడియన్స్ కోరుకునే టైంసాప్ వినోదానికి ఢోకా లేని ఈ సినిమాను ఎక్కువ అంచనాలు పెట్టుకోకుండా చూస్తే ఓకే. కథతో పాటు కొన్ని సీన్లు చూస్తే త్రివిక్రమ్ మరీ రాజీపడిపోయాడు అనిపిస్తుంది. లాజిక్స్ ఏమాత్రం పట్టించుకోలేదు. కానీ టార్గెట్ ఆడియన్స్ మెచ్చే వినోదంతో ఆయన సినిమాను ఎంగేజింగ్ గా మార్చారు. చివరగా : ఆదర్శ కుటుంబం.. అతకని కథలో టైంపాస్ వినోదం.
Average
Adarsha Kutumbam movie Review
By ABP Desam
మాటలతో ప్రేక్షకులను మాయ చేయగల రచయిత త్రివిక్రమ్. పలు సినిమాల్లో కథ, కథనం, దర్శకత్వాన్ని ఆయన మాటలు డామినేట్ చేసిన సందర్భాలు ఎక్కువ. మరి ఈసారి దర్శకుడిగా వెంకీతో ఎటువంటి సినిమా తీశారు? అనే విషయానికి వస్తే... ఆదర్శ కుటుంబం' ప్రారంభం చూస్తే... వింటేజ్ వెంకీని చూపించడానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు త్రివిక్రమ్. ఆయన పాత్రను పరిచయం చేసిన తీరు, తన కుటుంబంతో కలిసి డైనింగ్ టేబుల్ దగ్గర సీన్స్ ఇన్‌స్టంట్‌గా నవ్వించాయి. ఆ తర్వాత ప్రేక్షకులకు ఆలోచించే సమయం ఇవ్వలేదు త్రివిక్రమ్. సినిమాలో యాక్షన్ రూట్ తీసుకోకుండా క్రైమ్, కామెడీని మిళితం చేసి ఓ అరగంట హిలేరియస్‌గా నవ్వించారు త్రివిక్రమ్.
పతాక సన్నివేశాలు త్రివిక్రమ్ నుంచి ప్రేక్షకులు ఆశించే స్థాయిలో లేవు. కథలో అసలు విషయం మొదలైన తర్వాత వినోదం బ్యాక్ సీటు తీసుకోవడంతో ఫన్ మూమెంట్స్ తగ్గాయి. తమన్ పాటలు సైతం ఛార్ట్ బస్టర్లు కాదు. ప్రేక్షకులు మళ్ళీ మళ్ళీ పాడుకునే పాటలు ఈ సినిమాలో లేవు. వెంకటేష్, త్రివిక్రమ్ కాంబినేషన్ నుంచి ప్రేక్షకులు ఆశించే వినోదాన్ని ఇవ్వడంలో 'ఆదర్శ కుటుంబం హౌస్ నంబర్ 47' సక్సెస్ అయ్యింది. క్లైమాక్స్ కొంత నిరాశ పరుస్తుంది. కానీ, ఓవరాల్ సినిమా ఎంటర్టైన్ చేసింది. దీపావళి పండక్కి ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా చూడవచ్చు.
Above Average