Register as a Reviewer
Home Reviews Media Reviews

Media Reviews

Reviews from top media outlets, YouTube channels, and publications

1463
Total Reviews
Showing 73–84 of 1463 media reviews
ఆదర్శ కుటుంబం - AK47 (Aadarsha Kutumbam AK47)

Adarsha Kutumbam movie review

ఆదర్శ కుటుంబం సినిమాలో వెంకీ కామెడీ, సత్య ట్రాక్ ఇలా అన్నీ కూడా ప్రేక్షకుల్ని నవ్వించేలా ఉంటాయి. ఇంటర్వెల్ బ్లాక్‌తో గురూజీ అందరి మైండ్ బ్లాక్ చేసేస్తాడు. ఆ బ్లాక్‌ని చాలా స్టైలీష్‌గా డిజైన్ చేసుకున్న...

ఆదర్శ కుటుంబం సినిమాలో వెంకీ కామెడీ, సత్య ట్రాక్ ఇలా అన్నీ కూడా ప్రేక్షకుల్ని నవ్వించేలా ఉంటాయి. ఇంటర్వెల్ బ్లాక్‌తో గురూజీ అందరి మైండ్ బ్లాక్ చేసేస్తాడు. ఆ బ్లాక్‌ని చాలా స్టైలీష్‌గా డిజైన్ చేసుకున్నారు. అక్కడి యాక్షన్, బీజీఎం అన్నీ కూడా బాగుంటాయి. సెకండాఫ్ ఏమైనా ఎమోషనల్‌లా సాగదీస్తాడేమో అని అంతా అనుకుని ఉంటారు. కానీ అక్కడ కూడా తివిక్రమ్ జాగ్రత్త పడ్డాడు. ఆడియెన్స్‌ ని ఇంకా ఏడ్పించాలని, మరింతగా డిప్రెషన్‌లోకి తీసుకు వెళ్లాలని త్రివిక్రమ్ అనుకోలేదనిపిస్తుంది. సెకండాఫ్‌ని కూడా చాలా వరకు తన కామెడీ, ప్రాసలు, పంచ్‌లతోనే నడిపించాడు. 


పెద్ద పెద్ద ట్విస్టులు, భారీ క్లైమాక్స్ ఉంటుందని అనుకుంటే మాత్రం పొరబాటే. చాలా సింపుల్‌గానే సినిమా ముగుస్తుంది. ఓ రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్‌కి క్రైమ్ డ్రామాని జొప్పించే ప్రయత్నం చేశాడు త్రివిక్రమ్. టెక్నికల్‌గా చూసుకుంటే కెమెరా వర్క్ బాగుంటుంది. తమన్ పాటల కంటే బీజీఎం బాగుంటుంది. కొన్ని లాజిక్స్‌ని వదిలేస్తే పూర్తి సినిమాని ఎంజాయ్ చేయొచ్చు. ఇక వెంకటేష్‌కి ఇలాంటి పాత్రలు కొట్టిన పిండి. నవ్వించడం, ఏడ్పించడం, యాక్షన్ సీక్వెన్స్ ఇలా అన్నింట్లో వెంకటేష్ తన మార్క్ చూపిస్తారు. శ్రీనిధి శెట్టికి చాలా కొత్త పాత్ర వచ్చింది. ఆమెని తెరపై చూస్తే అంతా ఆశ్చర్యపోతారు. పిల్లలిద్దరూ బాగా నటించారు. ఓవరాల్‌ గా ఏకే 47 (ఆదర్శకుటుంబం ఇంటి నెం. 47) బాగానే పేలిందని చెప్పుకోవచ్చు. ఈ వీకెండ్‌‌లో ఫ్యామిలీ ఆడియెన్స్‌కి, మాస్‌కి, జెన్ జీ ఆడియెన్స్‌కి మంచి టైం పాస్‌ అయ్యేందుకు ఈ సినిమాని ఆప్షన్‌గా ఎంచుకోవచ్చు. మరి కమర్షియల్‌గా వెంకీ, త్రివిక్రమ్ కాంబో ఏ రేంజ్‌కు వెళ్తుందన్నది ఇంకొన్ని రోజులు ఆగితే తెలుస్తుంది.

ఆదర్శ కుటుంబం - AK47 (Aadarsha Kutumbam AK47)

Adarsha kutumbam movie review

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అంటే పదునైన డైలాగ్స్, కామెడీ సన్నివేశాలు, కుటుంబ విలువలు, బంధాలు, అనుబంధాలు చుట్టే తిరగడం సహజం. అలాంటి నేపథ్యంతోనే ఈ ఆదర్శ కుటుంబం సినిమా కూడా సాగుతుంది. మధ్య త...

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అంటే పదునైన డైలాగ్స్, కామెడీ సన్నివేశాలు, కుటుంబ విలువలు, బంధాలు, అనుబంధాలు చుట్టే తిరగడం సహజం. అలాంటి నేపథ్యంతోనే ఈ ఆదర్శ కుటుంబం సినిమా కూడా సాగుతుంది. మధ్య తరగతి కష్టాలు, సంసన్నుల జీవన శైలి అంశాల చుట్టూ తనదైన మార్కుతో డైలాగ్స్‌తో ఫస్టాఫ్‌ను లాగించే ప్రయత్నం చేశారు. అయితే రెండో భాగంలో కథ, కథనాలు గాడి తప్పడంతో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితిలా ఉంటుంది. ఒకే రకమైన ట్రాక్‌తో సాగడంతో కొత్త అసంతృప్తికి గురి చేసినట్టు అనిపిస్తుంది. అయితే చివర్లలో కాస్త తేరుకొనేలా మంచి ఫ్యామిలీ ఎమోషన్స్‌తో మంచి ఫీల్ వచ్చేలా ముగించడం కొంత ఊరట కలుగుతుంది. 


పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే.. వెంకటేష్ గురించి కొత్తగా చెప్పాల్సిన అసవరం లేదు. ఫ్యామిలీ, యాక్షన్ మోడ్‌తో సాగే క్మారెక్టర్‌లో ఒదిగిపోయారు. ఇలాంటి క్యారెక్టర్లను ఎలివేట్ చేయడం విక్టరీకి కొట్టిన పిండే. గృహిణి పాత్రలొ స్వర్ణగా శ్రీనిధి శెట్టి కొత్తగా కనిపించింది. గ్లామర్ పరంగా, యాక్టింగ్ పరంగానే కాకుండా ఎమోషనల్ పాత్రలో ఒదిగిపోయింది. ఇద్దరు బాల నటులు బాగా నటించారు. నారా రోహిత్, రావు రమేష్ తమ పాత్రలకు న్యాయం చేశారు. సత్య కామెడీ ఒకేలా ఉంటుంది. సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. తమన్ మ్యూజిక్ సినిమా కథను, సన్నివేశాలను ఎలివేట్ చేయలేకపోయింది. సినిమాటోగ్రఫి ఈ సినిమాకు అదనపు ఆకర్షణ. చాలా రిచ్‌గా, క్లాస్‌గా సన్నివేశాలను చూపించారు. క్రైమ్ కామెడీ, త్రివిక్రమ్ డైలాగ్స్‌ను ఇష్టపడే వారికి ఓ మోస్తారుగా నచ్చే అవకాశం ఉంది.

6.0
out of 10

Above Average

ఆదర్శ కుటుంబం - AK47 (Aadarsha Kutumbam AK47)

Adarsha Kutumbam movie review

 సో మన గురుజీ అండ్ వెంకటేశ్ గారి కాంబినేషన్ లో వీళ్ళిద్దరూ ట్రై చేసిన ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ సినిమా ఈ ఆదర్శ కుటుంబం సినిమా అని అయితే మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. ఈ సినిమాలో ఆదర్శ కుటుంబం కాన్సెప్ట్ క...

 సో మన గురుజీ అండ్ వెంకటేశ్ గారి కాంబినేషన్ లో వీళ్ళిద్దరూ ట్రై చేసిన ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ సినిమా ఈ ఆదర్శ కుటుంబం సినిమా అని అయితే మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. ఈ సినిమాలో ఆదర్శ కుటుంబం కాన్సెప్ట్ కానీ అసలు ఏం జరిగింది అనే ట్విస్టులు కానీ టర్న్స్ కానీ మీకు కనుక తెలిస్తే ఇంక మీరు సినిమాకి వెళ్లడం మానేసుకోవచ్చు అన్నమాట. ఫస్ట్ హాఫ్ ఈ మూవీని స్టార్ట్ చేయడం కూడా చాలా లైట్ హార్టెడ్ గా స్టార్ట్ చేస్తారు. ఫస్ట్ హాఫ్ చాలా తాపీగా గారి మీద ఒక డైలాగ్ ఉంటది. ఆ డైలాగ్ అసలు త్రివిక్రం గారు ఎలా ఆలోచించి రాశారో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. సూపర్బ్ గా ఉంది. అక్కడక్కడ మన త్రివిక్రం గారు రాసిన ఫెంటాస్టిక్ డైలాగ్స్ కి పిచ్చి పిచ్చిగా నవ్వుకుంటాం. 


యాక్చువల్ గా ఈ సినిమాలో ఏం జరుగుతుంది అసలు ఆదర్శ కుటుంబం అంటే ఏమిటి అనేది మనకి యాక్చువల్ గా స్టోరీ ఓపెన్ అప్ అయి రివీల్ అయిన తర్వాత ఎంటర్టైన్మెంట్ కొంచెం బాగానే కొన్ని సీన్స్ లో పట్టుకెళ్లి ఇంక నేను సినిమాని ఈ యాంగిల్ లోనే తీసుకెళ్తాను అనేటప్పటికి మనకి కంప్లీట్ గా అక్కడ వరకు చూసిన స్టోరీలోనే ఈ సినిమాని మనం ఎండ్ చేస్తాం. వెంకటేశ్ గారు మధ్యలో వచ్చే ఆ కాంబినేషన్ జోక్స్ ఏవైతే ఉన్నాయో అక్కడక్కడ కొంచెం నాస్టాల్జియా ని టచ్ చేసుకుంటూ బాగా పెర్ఫార్మ్ చేశారు అండ్ శ్రీనిధి కూడా బానే మనల్ని ఎంటర్టైన్ చేసింది ఆ రోల్లో అని చెప్పొచ్చు. మిగతా ఆర్టిస్టులు అందరూ జస్ట్ అలా ఉంటారు. ఎంటర్టైన్మెంట్ పరంగా చూస్తే ఎంటర్టైన్మెంట్ చాలా ఎంటర్టైనింగ్ గానే ఉంది. గురుజీ మీ కలంలో నుంచి వచ్చే ఆ పదాలని మాకు ఇంకా ఎక్కువగా వినిపిస్తారు అని మేము కోరుకుంటూ ఈ సినిమా కూడా సెకండ్ హాఫ్ లో ఇంకా ఎక్కువగా వినిపిస్తే బాగుండేది అని కొంచెం బాధపడుతూ ఈ థియేటర్ లో నుంచి ఇలా బయటికి వెళ్ళిపోవడం జరుగుతుంది అన్నమాట. మొత్తానికి అదన్నమాట సంగతి గైస్. 

6.0
out of 10

Above Average

ఆదర్శ కుటుంబం - AK47 (Aadarsha Kutumbam AK47)

Adarsha Kutumbam movie review

Thyview

By Thyview

ఆదర్శ కుటుంబం అనేది మనకి తెలిసిన త్రివిక్రమ్ మార్క్ సినిమా కాదండి ఇది. ఇది త్రివిక్రమ్ 2.0 కాకపోతే ఇన్ ప్రోగ్రెస్ ఫిలిం. వీడేంటి త్రివిక్రమ్ అని అనుకోవచ్చు. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, మూవీ చూసాక నా ఎక్స్పీర...

ఆదర్శ కుటుంబం అనేది మనకి తెలిసిన త్రివిక్రమ్ మార్క్ సినిమా కాదండి ఇది. ఇది త్రివిక్రమ్ 2.0 కాకపోతే ఇన్ ప్రోగ్రెస్ ఫిలిం. వీడేంటి త్రివిక్రమ్ అని అనుకోవచ్చు. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, మూవీ చూసాక నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే మిట్టున్నాయండి. ఒకే టైం పాస్ సినిమా. కొన్ని సీన్స్ ఇట్ ఫెల్ట్ లైక్ దే లాక్ ప్రాపర్ క్లారిటీ అండ్ కన్విక్షన్. ఏదో రష్డ్ అండ్ అండర్ కుక్డ్ ఫీలింగ్ ఉండేది. అలా అని నేను తీసిపారేసే సినిమా ఏం కాదు. చాలా చోట్ల నవ్వుకున్నాను, డైలాగ్స్ కూడా బానే ఉన్నాయి. వెల్ నేను కథ గురించి అంతగా డిస్క్రైబ్ చేయదలుచుకోలేదు, ట్రైలర్ లో ఏం చూపించారో అదే. బికాజ్ ఇది క్రైమ్ కామెడీ మాత్రమే కాదండి, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయి. సో నేను ఏది చెప్పినా స్పాయిలర్ అయిపోద్ది. 


అండ్ త్రివిక్రమ్ సినిమా అనగానే మన మైండ్ లో ఒక మెంటల్ ఇమేజ్ పడిపోతది అన్నమాట మొత్తం ఉంటాం మనం. సో మీరు అదే మైండ్ సెట్ తో గనక సినిమాకి వెళ్తే ఈ మూవీ మీకు అంతగా నచ్చకపోవచ్చు. అలా కాకుండా అరే త్రివిక్రమ్ గారు ఏదో కొత్తగా ట్రై చేశారంట, లెట్స్ సీ హౌ ఇట్ గోస్ అంటే ఇట్ మైట్ వర్క్ ఫర్ యు. సో మనం ఏదో అనుకోవడానికి ఈజీగా ఉంటది కానీ చాలా టఫ్ జాబ్ ఇది. తమన్ గారి మ్యూజిక్ హిట్ అండ్ మిస్ ఉన్నాయండి. చాలా చోట్ల లౌడ్ అనిపించింది. వెంకటేశ్ గారు ఇస్ యాక్చువల్లీ యూజువల్ బెస్ట్. టైమింగ్ గాని ఎవ్రీథింగ్ స్పాట్ ఆన్ అండ్ శ్రీనిధి విల్ సర్ప్రైజ్ యు విత్ హర్ కామెడీ టైమింగ్. అండ్ ఇద్దరు పిల్లలు కూడా భలే చేశారు. 


కాకపోతే ఏంటంటే వీళ్ళ రిలేషన్షిప్ లో ప్రోగ్రెషన్ ఉంటదండి. ఆ ప్రోగ్రెషన్ తో మనం కరెక్ట్ గా కనెక్ట్ అయి ఉంటే, మనకి అది బాగా కన్వే అయి ఉంటే క్లైమాక్స్ ఇంకా బాగా వర్క్ అయ్యేదేమో అని నా ఫీలింగ్. కానీ అవ్వలేదు. సో దీస్ ఆర్ మై థాట్స్. ఫైనల్ వర్డ్ త్రివిక్రమ్ గారి దగ్గర నుంచి ఒక కొత్త అటెంప్ట్. ఇట్స్ ఆన్ ఓకేష్ క్రైమ్ కామెడీ థ్రిల్లర్. ఫస్ట్ హాఫ్ కామెడీ బాగుంటది, ఇంటర్వెల్ సీన్ బాగుంది, సెకండ్ హాఫ్ లో ఫస్ట్ 15-20 మినిట్స్ బాగుంది. ఆ తర్వాత నేను అంతగా కనెక్ట్ కాలేదండి. అంతే.

6.0
out of 10

Above Average

ఆదర్శ కుటుంబం - AK47 (Aadarsha Kutumbam AK47)

Adarsha Kutumbam movie Review

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ ఫ్యామిలీ అంశాలకు ప్రయారిటీ ఇస్తుంటారు. అయితే ఈ సారి ఆయన రూట్‌ మార్చారు. ఫ్యామిలీ చుట్టూ క్రైమ్‌ యాక్షన్‌ మూవీని తెరకెక్కించారు. తన మార్క్ దాటి తెరకెక్కించిన చిత్రం ఆదర్శ...

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ ఫ్యామిలీ అంశాలకు ప్రయారిటీ ఇస్తుంటారు. అయితే ఈ సారి ఆయన రూట్‌ మార్చారు. ఫ్యామిలీ చుట్టూ క్రైమ్‌ యాక్షన్‌ మూవీని తెరకెక్కించారు. తన మార్క్ దాటి తెరకెక్కించిన చిత్రం ఆదర్శ కుటుంబం. ఫస్టాఫ్‌ సినిమా చాలా సరదాగా సాగుతుంది. వెంకీ, శ్రీనిధి శెట్టి, కూతురు, కొడుకు పాత్రల మధ్య మంచి కామెడీని రాసుకున్నారు. అది ఆద్యంతం నవ్వులు పూయిస్తుంది. ఇక దొంగలు వచ్చినప్పుడు వచ్చే ట్విస్ట్ అదిరిపోయింది. యాక్షన్‌లో వేరే లెవల్‌ చూపించారు. పాత్రలోని మలుపులు ఆకట్టుకుంటాయి. ఆ తర్వాత వీళ్ల బ్యాక్‌ గ్రౌండ్‌కి సంబంధించిన ట్విస్ట్ కూడా ఆకట్టుకుంటుంది.  


దొంగల బ్యాచ్‌కి, వెంకీ ఫ్యామిలీకి మధ్య వచ్చే సీన్లు కొంత ల్యాగ్‌ ఉంటాయి. అయితే వీరి బ్యాక్‌డ్రాప్‌ కూడా అంతగా కన్విన్సింగ్‌గా లేదు. ఫన్‌ డోస్‌ తగ్గింది. ఆ తర్వాత సినిమా డ్రామా వైపు వెళ్తుంది. అది రొటీన్‌గా అనిపిస్తుంది. ఓవరాల్‌గా మూవీ ఫస్టాఫ్‌ హిలేరియస్‌గా ఆకట్టుకుంటుంది. సెకండాఫ్‌ తగ్గింది. క్లైమాక్స్ ఫర్వాలేదనిపించేలా ఉంటుంది. సెకండాఫ్‌ని మరింత బాగా చేసి ఉంటే అదిరిపోయేది.

ఆదర్శ కుటుంబం మూవీ ఫైనల్ గా నవ్విస్తూ, యాక్షన్‌తో థ్రిల్‌ చేస్తూ ఆకట్టుకునే ఫ్యామిలీ క్రైమ్‌ థ్రిల్లర్‌ `ఆదర్శ కుటుంబం`. త్రివిక్రమ్‌ మార్క్ డైలాగ్‌లు ప్లస్‌. ఎలాంటి అంచనాలు లేకుండా చూస్తే ఆకట్టుకునే `ఆదర్శ కుటుంబం`.

6.0
out of 10

Above Average

ఆదర్శ కుటుంబం - AK47 (Aadarsha Kutumbam AK47)

Adarsha Kutumbam movie Review

ఆదర్శ కుటుంబం ఏకే 70 dollars. ఎస్ ఏకే 70 dollars మూవీ అన్నమాట. ఎందుకు ఏకే 70 డ dollars కి ఫిక్స్ అవుతున్నా.. అది కూడా ఈ సినిమాకే అంటే ఇంక అంతే అండి సీ ప్రొడక్ట్ ఫుల్ ఫ్లెడ్జ్ ఒక ప్రొడక్ట్ ని చూస్తే ప్...

ఆదర్శ కుటుంబం ఏకే 70 dollars. ఎస్ ఏకే 70 dollars మూవీ అన్నమాట. ఎందుకు ఏకే 70 డ dollars కి ఫిక్స్ అవుతున్నా.. అది కూడా ఈ సినిమాకే అంటే ఇంక అంతే అండి సీ ప్రొడక్ట్ ఫుల్ ఫ్లెడ్జ్ ఒక ప్రొడక్ట్ ని చూస్తే ప్రొడక్ట్ ఏ బొక్కలాగా ఉంది. అది మీరు చూసినప్పుడే కంప్లీట్ ప్రొడక్ట్ కాదు ఏదో వదిలారు మనం వెతకాలి అంటారు చూసినా కూడా చిరాకు. అలానే కాకపోతే ఒకటే ప్రాబ్లం కెమెరా ఎక్కడ పెట్టాలి ఇక్కడ పెట్టొచ్చా అక్కడ పెట్టొచ్చా అని చూస్తారా నాకు తెలిసి వినంటారు అరే బాబు నీ ఇష్టం రా అని. ఇక సినిమాలో వెంకటేష్ గారు బాగా చేసారు. బట్ ఆయన క్యారెక్టర్ ని సరిగా రాసుకోలేదు. అండ్ సత్య గారు కొన్ని సీన్స్ లో కామెడీ మామూలుగా పడదు టవల్ కట్టుకున్న సీన్స్ కొన్ని ఉంటాయి అంటే కొన్ని సీన్స్ చాలా బాగా తీశారు కామెడీ. 


అది పక్కన పెడితే అంతే అంతే నాకైతే అంతే అండి ఫాస్ట్ గా. అదేంట్రా నువ్వు అలా మాట్లాడుతున్నావు సినిమా ఏ నచ్చలేదా గురూజీ గారు గురూజీ గారినే అంటావు నువ్వు ఎంత నీ బతుకెంత అని అనొచ్చు. మీకైనా మీకు పోయినా మీలో ఒక్కరికైనా అనిపియొచ్చు. కొన్ని సీన్స్ లో వెంకటేష్ గారి సీన్స్ మాత్రం దారుణంగా రాశారండి నాకైతే నచ్చలేదు. ఇప్పుడు వెంకటేష్ గారు ఏమి రోడ్ సైడ్ ఉమెన్ క్యారెక్టర్ కాదు. ఉమెన్ ఐజర్ క్యారెక్టర్ కాదు. వెళ్ళిపోతారు హగ్గులు చేసుకుంటారు సరే హగ్గు ఫ్రెండ్లీ హగ్గు హగ్గు చేసుకుంటూ ఉంటారు. అసలు ఆ సీన్ కి సంబంధమే ఉండదు.  



అండ్ గురూజీ గారికి తన మీద నమ్మకం పోయింది. నాకైతే ఎందుకో కొంచెం అంటే మాట్లాడను నేను చూసే బాబు. చూడక ముందు కూడా నాకు తెలిసిపోద్ది కొన్నిసార్లు. బట్ నా సిక్స్ సెన్స్ నాకు గట్టిగా కొడుతుంది చూసిన మెటీరియల్ లో అయితే. మ్యూజిక్ కడుపు చూద్దాం బట్ దీని గురించి కట్ గురించి ఇప్పుడు ఈ మధ్య అనిపిస్తుంది నాకు. ఎందుకో నన్ను నేను సరిగ్గా ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాను ఈ ఫస్ట్ రివ్యూస్ లో ఎక్కువ చెప్తే స్పా అంటారు. ఆ పాయింట్ చెప్పాలి నాకు లోపల ఆటిట్యూడ్ సో ఒక డీటెయిల్ రివ్యూ కి వెళ్తాను నేను.

4.0
out of 10

Below Average

ఆదర్శ కుటుంబం - AK47 (Aadarsha Kutumbam AK47)

Adarsha Kutumbam movie Review

మామూలుగా మనకు త్రివిక్రమ్ సినిమా అంటే ఇలాగే ఉంటుంది అని ఒక ఐడియా ఉంది. కానీ ఇలా కూడా ఉంటుంది అని దాన్ని మార్చడానికి చేసిన సినిమా ఆదర్శ కుటుంబం. గురూజీ సినిమాలో కామెడీ ఉండడం కామన్. దానికి క్రైమ్ కూడా య...

మామూలుగా మనకు త్రివిక్రమ్ సినిమా అంటే ఇలాగే ఉంటుంది అని ఒక ఐడియా ఉంది. కానీ ఇలా కూడా ఉంటుంది అని దాన్ని మార్చడానికి చేసిన సినిమా ఆదర్శ కుటుంబం. గురూజీ సినిమాలో కామెడీ ఉండడం కామన్. దానికి క్రైమ్ కూడా యాడ్ చేశాడు ఈసారి. ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వెళ్తే డీసెంట్ గా అనిపిస్తుంది AK 47. చాలా వరకు త్రివిక్రమ్ మార్క్ పంచ్ డైలాగ్స్ కనిపిస్తాయి. మధ్య మధ్యలో వచ్చే క్రైమ్ ఎపిసోడ్స్ ఆకట్టుకుంటాయి. వాటి డోస్ కూడా పెంచేశారు. ఇంటర్వెల్ ట్విస్ట్ అదిరిపోయింది. మొదటి సగంతో పోలిస్తే సెకండాఫ్ మాత్రం నెమ్మదిగా సాగుతుంది. కథ అక్కడక్కడే ఉంది కాబట్టి స్క్రీన్ ప్లే మీద ఎక్కువగా ఫోకస్ చేశాడు మాటల మాంత్రికుడు. 


క్లైమాక్స్ చివరి 15 నిమిషాలు ఆసక్తికరంగా ఉంది. యాక్షన్ బ్లాక్స్ ఈ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్. ఫ్యామిలీ ఎమోషన్స్ సెకండ్ హాఫ్ లో అక్కడక్కడ బాగా రాసుకున్నాడు. ఓవరాల్ గా ఒక కంప్లీట్ క్రైమ్ థ్రిల్లర్ చూడాలి అనుకునే వాళ్లకు ఆదర్శ కుటుంబం బెస్ట్ ఆప్షన్. ఇక వెంకటేష్ మరోసారి ఫ్యామిలీ ప్లస్ యాక్షన్ రోల్ లో అదరగొట్టాడు. తనకు తగిన రోల్ పడితే ఎలా ఉంటుందో చూపించారు విక్టరీ హీరో. శ్రీనిధి శెట్టి మోస్ట్ సర్ప్రైజింగ్ క్యారెక్టర్ చేసింది.. ఇద్దరు చిన్నపిల్లల యాక్టింగ్ కూడా బాగుంది.. సత్య కామెడీ ఈ సినిమాకు మేజర్ రిలీఫ్. 

తమన్ మ్యూజిక్ ఎక్కడో విన్నట్టు ఉన్న బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది. త్రివిక్రమ్ చాలా రోజుల తర్వాత డైలాగ్స్ అదరగొట్టారు. యాక్షన్ పార్ట్ కూడా నెక్స్ట్ లెవెల్ లో ఉంది. ఓవరాల్ గా ఆదర్శ కుటుంబం.. మంచి కమర్షియల్ కుటుంబం..!

6.0
out of 10

Above Average

ఆదర్శ కుటుంబం - AK47 (Aadarsha Kutumbam AK47)

Adarsha kutumbam movie review

ఆదర్శ కుటుంబం సినిమా అనౌన్స్‌మెంట్ నుంచే స్పానిష్ వెబ్ సిరీస్ 'బ్లాస్ట్'తో పోలికలు ఉన్నాయనే ప్రచారం జరిగింది. అయితే త్రివిక్రమ్ ఆ ముద్ర పడకుండా జాగ్రత్త పడ్డారు. ఇంటర్వెల్ బ్యాంక్ మినహా ఎక్కడా ఆ సిరీస...

ఆదర్శ కుటుంబం సినిమా అనౌన్స్‌మెంట్ నుంచే స్పానిష్ వెబ్ సిరీస్ 'బ్లాస్ట్'తో పోలికలు ఉన్నాయనే ప్రచారం జరిగింది. అయితే త్రివిక్రమ్ ఆ ముద్ర పడకుండా జాగ్రత్త పడ్డారు. ఇంటర్వెల్ బ్యాంక్ మినహా ఎక్కడా ఆ సిరీస్ ఛాయలు కనిపించవు. ఫస్టాఫ్ విషయంలో త్రివిక్రమ్ తన మార్క్ రైటింగ్, టైమింగ్‌తో పూర్తి విజయం సాధించారు. ఇంటర్వెల్ ముందు వచ్చే 20 నిమిషాల యాక్షన్, దొంగల ముఠా స్కెచ్‌లు కథను పరుగులు పెట్టించాయి. ఇక్కడ తమన్ బ్యాక్‌ గ్రౌండ్ స్కోర్, కెమెరా వర్క్ సీన్లను బాగా ఎలివేట్ చేశాయి. ఇక ఆదర్శ కుటుంబం బ్యాక్‌గ్రౌండ్ డ్రామా పెద్దగా పండలేదు. క్లైమాక్స్ కూడా హడావుడిగా ముగించేసిన భావన కలుగుతుంది. 


సెకండాఫ్‌ లో కూడా ఫస్టాఫ్ తరహాలోనే కామెడీ, కథనంలో బిగుతు ఉండి ఉంటే సినిమా రేంజ్ వేరేలా ఉండేది. అయితే అనవసరమైన ల్యాగ్ లేకుండా నిడివి తక్కువగా ఉంచడం, ట్రోల్ అయిన 'మాలా వచ్చా చూడు' పాటను ఎడిటింగ్‌లో తీసేయడం సినిమాకు కలసిసొచ్చిన అంశం. ఇక వెంకటేష్ తన నటనతో మరోసారి వన్ మ్యాన్ షో చేశారు. "నేనేమైనా కమల్ హాసనా, మోహన్ లాలా.. ప్రతీ ఎక్స్‌ప్రెషన్ పలకడానికి" అంటూ ఆయన చెప్పిన సెల్ఫ్ డిప్రిసియేటింగ్ డైలాగ్ థియేటర్లలో నవ్వులు పూయిస్తుంది. సంగీత దర్శకుడు తమన్ అందించిన పాటలు పెద్దగా గుర్తుండవు. కానీ, తన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో మాత్రం కొన్ని సన్నివేశాలను బాగా ఎలివేట్ చేశారు. మొత్తంగా చెప్పాలంటే.. 'ఆదర్శ కుటుంబం' చిత్రం 'నువ్వు నాకు నచ్చావ్', 'మల్లీశ్వరి' లాంటి కల్ట్ క్లాసిక్ స్థాయిని అందుకోకపోవచ్చు. కానీ, థియేటర్లకు వచ్చే ప్రేక్షకుడికి కావలసినంత వినోదాన్ని అందించడంలో మాత్రం నిరాశపరచదు. సెకండాఫ్‌ పై మరికాస్త శ్రద్ధ పెట్టి ఉంటే బాక్సాఫీస్ దగ్గర ఈ 'ఆదర్శ కుటుంబం' కలెక్షన్ల సునామీ సృష్టించి ఉండేది.


6.0
out of 10

Above Average

ఆదర్శ కుటుంబం - AK47 (Aadarsha Kutumbam AK47)

Adarsha Kutumbam movie Review

'ఆదర్శ కుటుంబం' అనే టైటిల్‌పై రక్తం చిమ్మించడం, ట్యాగ్‌లైన్ గా ఏ.కె. 47 అని పెట్టడంతోనే ఇది ఆదర్శ కుటుంబం కథ మాత్రమే కాదు... అంతకు మించిన యాక్షన్ మూవీ అనేది అర్థమౌతుంది. అయితే ఏ రకంగానూ ఏజ్‌ కాంబినేషన...

'ఆదర్శ కుటుంబం' అనే టైటిల్‌పై రక్తం చిమ్మించడం, ట్యాగ్‌లైన్ గా ఏ.కె. 47 అని పెట్టడంతోనే ఇది ఆదర్శ కుటుంబం కథ మాత్రమే కాదు... అంతకు మించిన యాక్షన్ మూవీ అనేది అర్థమౌతుంది. అయితే ఏ రకంగానూ ఏజ్‌ కాంబినేషన్స్‌ సెట్‌ కానీ వీళ్ళు ఆదర్శ కుటుంబం ఏమిటనే సందేహం ప్రతి ఒక్కరికీ వస్తుంది. దానికి సమాధానం సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. ఓ సాధారణ మధ్యతరగతి కుటుంబం అన్నింటికీ తెగించి, దోపీడీ దొంగల ముఠాను అంతమొందించిందంటే దానికి బలమైన కారణం ఉండాలి. ఇందులో ఆ కారణం అంత బలంగా మాత్రం లేదు. కాకపోతే... ఆ దోపిడీ ముఠా గతంలో చేసిన ఓ హత్య తాలూకూ కర్మ వాళ్ళను వెంటాడి, చిట్టిబాబు కుటుంబం రూపంలో పగ తీర్చుకుందని చెప్పుకోవచ్చు. 'కర్మ రిటర్న్స్' అనే పాయింట్‌ ను బేస్‌ చేసుకుని త్రివిక్రమ్ ఈ కథను రాశారు.



సినిమాలో నిడివి తగ్గించే క్రమంలో చేసిన ఎడిటింగ్‌ కారణంగా అక్కడక్కడా లింగ్స్ తెగిపోవడమే కాదు... కొన్ని క్యారెక్టర్స్ ఎగిపోయినట్టు అర్థమౌతోంది. కాకపోతే ఇంటర్వెట్‌ బ్యాంగ్‌ అదిరింది. వినోదం కోసం ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు దర్శకుడు త్రివిక్రమ్ యాక్షన్‌ డిష్ వడ్డించారు. మొత్తం మీద హీరో కుటుంబం పగ తీర్చుకోవడానికో నోబుల్‌ రీజన్‌ చూపించి, కొంతలో కొంత శాటిస్ ఫై చేశారు. ఇక తమన్ పాటల గురించి చెప్పుకోవడానికి ఏమీ లేదు. నేపథ్య సంగీతం బాగుంది. సూర్యదేవర రాధాకృష్ణ ప్రొడక్షన్ కు వంక పెట్టలేం. అయితే భారీ అంచనాలు పెట్టుకోకుండా... త్రివిక్రమ్ మార్క్ సంభాషణలు, వెంకీ మార్క్ ఎంటర్ టైన్ మెంట్ కోసం ఓసారి సినిమాను చూడొచ్చు. 


ట్యాగ్‌ లైన్‌: వయొలెంట్‌ ఫ్యామిలీ!

6.0
out of 10

Above Average

ఆదర్శ కుటుంబం - AK47 (Aadarsha Kutumbam AK47)

Adarsha kutumbam movie review

Gulte

By Gulte

Aadarsha Kutumbam House No. 47 #AK47 is one of the most anticipated movies in Tollywood, marking the reunion of Trivikram and Venkatesh after many years. It also marks the first time Trivikram has dir...

Aadarsha Kutumbam House No. 47 #AK47 is one of the most anticipated movies in Tollywood, marking the reunion of Trivikram and Venkatesh after many years. It also marks the first time Trivikram has directed Venkatesh. After multiple delays, the movie has finally hit theatres today. Has this vintage blockbuster combination delivered what audiences expected? Let’s find out in this detailed review of AK47.


Positives:


1. Entertaining Moments In The First Half


2. Pre-Interval Action Episode


3. Venkatesh’s Unmatchable Performance


4. Basic Core Plot


5. Protagonist Gang Setup


Negatives:


1. Not-So-Engaging Second Half


2. Predictable Screenplay 


3. Unimpressive Music


4. Needless Backstory 


Overall, Aadarsha Kutumbam is not the Trivikram-mark entertainer audiences expected. The dark comedy and crime-comedy elements work in parts, but the film lacks consistent humour, emotional depth and narrative flow. It remains a passable watch with noticeable limitations


Bottom Line: A Family With ‘Ups & Downs’.


Rating: 2.5/5

5.0
out of 10

Average

ఆదర్శ కుటుంబం - AK47 (Aadarsha Kutumbam AK47)

Adardsha Kutumbam Movie Review

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో ఎంతో కాలంగా బాక్సాఫీస్ వెయిట్ చేస్తున్న బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ 'ఆదర్శ కుటుంబం - AK47' నేడు ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలై డీ...

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో ఎంతో కాలంగా బాక్సాఫీస్ వెయిట్ చేస్తున్న బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ 'ఆదర్శ కుటుంబం - AK47' నేడు ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలై డీసెంట్ రెస్పాన్స్ అందుకుంది.


ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్న ఒక సాధారణ మిడిల్ క్లాస్ తండ్రి చిట్టిబాబుకి (వెంకటేష్) ఊహించని రీతిలో లాటరీ జాక్‌పాట్ వరిస్తుంది. గ్రాండ్ గేటెడ్ కమ్యూనిటీలోకి షిఫ్ట్ అయిన ఈ ఫ్యామిలీపై ఒక ప్రమాదకర బందిపోటు ముఠా కన్నుపడుతుంది. ఈ విపత్కర పరిస్థితుల నుంచి చిట్టిబాబు తన కుటుంబాన్ని ఎలా రక్షించుకున్నాడనేదే ఈ క్లీన్ ఫ్యామిలీ యాక్షన్ థ్రిల్లర్ ప్లాట్!


సినిమాకి ప్రధాన బలం వెంకటేష్ వన్-మాన్ షో! తన నటనతో, క్యూట్ కామెడీతో, పవర్ ప్యాక్డ్ యాక్షన్ సీక్వెన్సెస్ తో థియేటర్లను షేక్ చేశారు. త్రివిక్రమ్ మార్క్ షార్ప్ పంచ్ డైలాగ్స్, సత్య హిలేరియస్ కామెడీ ట్రాక్, థమన్ థ్రిల్లింగ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకి ప్లస్ పాయింట్లుగా నిలిచాయి. అయితే, రొటీన్ సెకండాఫ్ టెంప్లేట్, కొంతమేర సాగదీసిన డ్రామా, క్యాచీగా లేని సాంగ్స్ బాక్సాఫీస్ ఆడియన్స్‌కి కొంత అసంతృప్తిని కలిగిస్తాయి. సెకండ్ హాఫ్ విషయంలో ఇంకాస్త కేర్ తీసుకుని ఉంటె బాగుండేది. ఫైనల్ గా ఆదర్శ కుటుంబం ఎంగేజింగ్ ఫామిలీ ఆక్షన్ ఎంటర్టైనర్.

6.0
out of 10

Above Average

ఆదర్శ కుటుంబం - AK47 (Aadarsha Kutumbam AK47)

Adarsha Kutumbam Movie Review

ఫైనల్‌ గా విక్టరీ వెంకటేష్, గురూజీ త్రివిక్రమ్ కాంబో సెట్ అయింది! అయితే ఒక మైండ్ బ్లోయింగ్ ఫ్రెష్ కాన్సెప్ట్‌తో వస్తారు అనుకుంటే... పాత కథలనే రీ సైకిల్ చేసి, లాటరీ జాక్‌పాట్ అండ్ బందిపోట్ల మసాలా దట్టి...

ఫైనల్‌ గా విక్టరీ వెంకటేష్, గురూజీ త్రివిక్రమ్ కాంబో సెట్ అయింది! అయితే ఒక మైండ్ బ్లోయింగ్ ఫ్రెష్ కాన్సెప్ట్‌తో వస్తారు అనుకుంటే... పాత కథలనే రీ సైకిల్ చేసి, లాటరీ జాక్‌పాట్ అండ్ బందిపోట్ల మసాలా దట్టించి మన ముందర పెట్టేశారు! కథ చాలా సింపుల్ గా... మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మ్యాన్ చిట్టిబాబుకి సడన్‌గా లాటరీ తగులుతుంది. గేటెడ్ కమ్యూనిటీకి మారడమే ఆలస్యం, చుట్టుపక్కల ఉన్న బందిపోట్లంతా తమ లైఫ్ గోల్స్ పక్కన పెట్టేసి కేవలం ఆయన ఇల్లు కొల్లగొట్టడమే టార్గెట్‌గా ఫిక్స్ అయిపోతారు.


వెంకీ మామ తన టైమ్‌లెస్ టైమింగ్, చార్మ్‌తో సినిమా మొత్తాన్ని ఒంటిచేత్తో ఈదేస్తే, మన సత్య కామెడీతో బోర్ కొట్టకుండా కాపాడాడు. ఇక తమన్ గారి సాంగ్స్ అంటారా... థియేటర్‌లో పాట ప్లే అవుతున్నప్పుడే మర్చిపోయే రేంజ్‌లో స్పెషల్ గా డిజైన్ చేశారు! నారా రోహిత్ రోల్ అయితే ఫంక్షన్‌ కి వచ్చి కేవలం బిర్యానీ తిని వెళ్లే చుట్టం పాత్రలా అనిపిస్తుంది. లాజిక్‌ లు వెతక్కుండా, సెకండాఫ్ ల్యాగ్‌ని పట్టించుకోకుండా వెంకీ మామ పంచ్‌లకు నవ్వుకుందాం అనుకుంటే ఓకే... లేదంటే ఈ AK47 తుస్సుమన్నట్టే! ఓవరాల్ గా ఆదర్శ కుటుంబంలో ఆదర్శమేమి లేదు.



6.0
out of 10

Above Average

Why MRO?