Hrudhayam Murali Movie Review
By NTV Telugu
అథర్వ మురళి ప్రధాన పాత్రలో నటించిన 'హృదయం మురళి' ప్రేమ, స్నేహం, జ్ఞాపకాల నేపథ్యంలో రూపొందిన యూత్‌ఫుల్ రొమాంటిక్ డ్రామా. చిన్ననాటి నుంచి జీవితంలోకి వచ్చిన ప్రేమలను గుర్తు చేసుకుంటూ సాగే కథ ప్రేక్షకులను ఆసక్తిగా ముందుకు తీసుకెళ్తుంది. ఫస్ట్ హాఫ్‌లో వచ్చే కామెడీ, ఫ్రెండ్స్ ట్రాక్, భావోద్వేగ సన్నివేశాలు బాగా ఆకట్టుకుంటాయి. ఇంటర్వెల్ తర్వాత కథలో కొత్త మలుపులు వచ్చినా, కొన్ని చోట్ల కథనం నెమ్మదించిన భావన కలుగుతుంది. అథర్వ మురళి సహజమైన నటనతో మెప్పించగా, హీరోయిన్లు తమ పాత్రల పరిధిలో మంచి నటన కనబరిచారు. తమన్ కనిపించే సన్నివేశాలు, నేపథ్య సంగీతం సినిమాకు అదనపు ఆకర్షణగా నిలిచాయి. విజువల్స్, నిర్మాణ విలువలు కూడా రిచ్‌గా అనిపిస్తాయి. అయితే క్లైమాక్స్‌ను ఇంకాస్త స్పష్టంగా ముగించి ఉంటే సినిమా మరింత బలంగా నిలిచేది. కొన్ని డబ్బింగ్ లోపాలు ఉన్నప్పటికీ భావోద్వేగాలు ప్రేక్షకులకు కనెక్ట్ అవుతాయి. మొత్తంగా 'హృదయం మురళి' 90's ప్రేమ జ్ఞాపకాలను గుర్తు చేసే ఒక ఫీల్‌గుడ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్.
Above Average
Hrudhayam Murali Movie Review
By 10TV Telugu
అథర్వ మురళి హీరోగా నటించిన 'హృదయం మురళి' ప్రేమ, జ్ఞాపకాలు, స్నేహం చుట్టూ తిరిగే యూత్‌ఫుల్ రొమాంటిక్ డ్రామా. ఐదుగురు హీరోయిన్లతో హీరో జీవితంలో జరిగే విభిన్న ప్రేమకథలను సరదాగా చూపించే ప్రయత్నం చేశారు. ఫస్ట్ హాఫ్‌లో వచ్చే కామెడీ, ఫ్రెండ్స్ ట్రాక్, చిన్ననాటి ప్రేమ జ్ఞాపకాలు మంచి వినోదాన్ని అందిస్తాయి. ఇంటర్వెల్ తర్వాత కథలో వచ్చే మలుపులు ఆసక్తిని పెంచినా, రెండో భాగంలో కథనం కాస్త నెమ్మదిస్తుంది. అథర్వ తన పాత్రలో సహజంగా నటించగా, తమన్ కనిపించే సన్నివేశాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. కొన్ని భావోద్వేగ సన్నివేశాలు 90's ప్రేమకథలను గుర్తు చేస్తాయి. అయితే క్లైమాక్స్‌ను మరింత సింపుల్‌గా ముగించి ఉంటే బాగుండేదనే భావన కలుగుతుంది. పాటలు సాధారణంగా అనిపించినా, నేపథ్య సంగీతం, విజువల్స్ సినిమాకు మంచి బలం చేకూర్చాయి. నిర్మాణ విలువలు ఆకట్టుకుంటాయి. మొత్తంగా 'హృదయం మురళి' ప్రేమలోని తీపి జ్ఞాపకాలు, చిన్న చిన్న కన్ఫ్యూజన్లతో సాగిన ఒక ఫీల్‌గుడ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్.
Above Average
I Nobody Movie Review
By 10TV Telugu
పృథ్వీరాజ్ సుకుమారన్, పార్వతి తిరువోతు ప్రధాన పాత్రల్లో నటించిన 'ఐ, నో బడీ' సస్పెన్స్‌తో పాటు సామాజిక అంశాలను స్పృశించే థ్రిల్లర్. ఓ సాధారణ వ్యక్తి అనుకోకుండా పెద్ద కేసులో చిక్కుకోవడంతో అతని జీవితం ఎలా మారిపోతుందనే కథతో సినిమా సాగుతుంది. ప్రారంభ సన్నివేశాల నుంచే ఆసక్తిని పెంచిన దర్శకుడు, ఫస్ట్ హాఫ్‌ను ఉత్కంఠభరితంగా నడిపించాడు. ఇంటర్వెల్ ట్విస్ట్ కథపై మరింత ఆసక్తిని కలిగిస్తుంది. సెకండ్ హాఫ్‌లో కుటుంబం, పోలీసులు, డబ్బు చుట్టూ తిరిగే సంఘటనలు ఆకట్టుకున్నా, చివర్లో కథ రాజకీయాల వైపు మళ్లడం కొంత అసహజంగా అనిపిస్తుంది. పృథ్వీరాజ్ తన పాత్రలో మరోసారి మెప్పించగా, పార్వతి కూడా భావోద్వేగ సన్నివేశాల్లో మంచి నటన కనబరిచింది. చిన్నారి పాత్రలో నటించిన ఐరా కొన్ని సన్నివేశాల్లో సహజమైన హాస్యాన్ని అందించింది. నేపథ్య సంగీతం, ఛాయాగ్రహణం సినిమాకు మంచి బలం అయినప్పటికీ, కొన్ని ప్రశ్నలకు సరైన సమాధానాలు లేకపోవడం, క్లైమాక్స్ పూర్తి సంతృప్తిని ఇవ్వకపోవడం చిన్న లోపాలుగా అనిపిస్తాయి. మొత్తంగా థ్రిల్లర్‌లను ఇష్టపడే ప్రేక్షకులకు ఒకసారి చూడదగ్గ చిత్రంగా 'ఐ, నో బడీ' నిలుస్తుంది.
Above Average
I Nobody Movie Review
పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రలో నటించిన 'ఐ, నోబడీ' ఒక యాక్షన్ థ్రిల్లర్‌తో పాటు సామాజిక, రాజకీయ అంశాలను స్పృశించే సినిమా. బ్యాంక్ దోపిడీతో ప్రారంభమైన కథ క్రమంగా సిస్టమ్, మీడియా, రాజకీయాల మధ్య చిక్కుకున్న ఓ వ్యక్తి పోరాటంగా మారుతుంది. ఫస్ట్ హాఫ్ ఆసక్తికరంగా సాగినా, సెకండ్ హాఫ్‌లో కథనం కాస్త నెమ్మదించడం ప్రభావం చూపుతుంది. పృథ్వీరాజ్ తన అనుభవానికి తగ్గట్టుగా పాత్రలో సహజంగా నటించగా, పార్వతి కూడా భావోద్వేగ సన్నివేశాల్లో ఆకట్టుకుంది. యాక్షన్ సన్నివేశాలు ఎక్కువగా ఉండటం కొంతమందికి భారంగా అనిపించవచ్చు. నేపథ్య సంగీతం, సినిమాటోగ్రఫీ సినిమాకు మంచి బలం అందించాయి. అయితే కొన్ని కీలక విజువల్స్, వార్తాపత్రికలు మలయాళంలోనే ఉండటం వల్ల తెలుగు ప్రేక్షకులకు పూర్తిగా కనెక్ట్ కావడం కాస్త కష్టంగా ఉంటుంది. డబ్బింగ్ విషయంలో ఇంకాస్త శ్రద్ధ తీసుకుని ఉంటే అనుభవం మరింత మెరుగ్గా ఉండేది. మొత్తంగా కమర్షియల్ కంటే కంటెంట్‌కు ప్రాధాన్యం ఇచ్చిన ఈ చిత్రం, విభిన్న కథలను ఇష్టపడే ప్రేక్షకులకు ఒకసారి చూడదగ్గ ప్రయత్నంగా నిలుస్తుంది.
Average
Love Oh Love Movie Review
ధనుష్ మేనల్లుడు పవిష్ నారాయణ్ హీరోగా, నాగదుర్గ హీరోయిన్‌గా నటించిన 'లవ్ ఓ లవ్' యూత్‌ను లక్ష్యంగా చేసుకుని రూపొందిన రొమాంటిక్ ఎంటర్‌టైనర్. నేటి ప్రేమ సంబంధాలు, ఖర్చులు, బాధ్యతలు వంటి అంశాలను సరదాగా చూపించే ప్రయత్నం చేసింది. పవిష్ తన గత చిత్రంతో పోలిస్తే నటనలో మరింత మెరుగ్గా కనిపించాడు. నాగదుర్గ కూడా తొలి తమిళ చిత్రంలో సహజమైన నటనతో ఆకట్టుకుంది. ఫస్ట్ హాఫ్‌లో కామెడీ, హీరో పెట్టే షరతులు కథపై ఆసక్తిని పెంచుతాయి. సెకండ్ హాఫ్‌లో కొన్ని వినోదాత్మక సన్నివేశాలు బాగా వర్కౌట్ అయ్యాయి. అయితే క్లైమాక్స్‌లో కథ ఒక్కసారిగా భావోద్వేగాల వైపు మళ్లడం అందరికీ కనెక్ట్ కాకపోవచ్చు. కొన్ని ట్విస్టులు ముందుగానే ఊహించేలా ఉండటం, పాటలు కథ వేగాన్ని తగ్గించడం చిన్న లోపాలుగా అనిపిస్తాయి. అయినప్పటికీ యువతకు కనెక్ట్ అయ్యే అంశాలు, వినోదం కోసం ఒకసారి చూడదగ్గ చిత్రంగా 'లవ్ ఓ లవ్' నిలుస్తుంది.
Average
Love Oh Love Movie Review
By 10TV Telugu
ధనుష్ మేనల్లుడు పవిష్ నారాయణ్ హీరోగా, నాగదుర్గ హీరోయిన్‌గా నటించిన 'లవ్ ఓ లవ్' ఒక యూత్‌ఫుల్ రొమాంటిక్ కామెడీ. సినిమా మొదటి సన్నివేశం నుంచే కథలోకి తీసుకెళ్లడం ఆకట్టుకుంటుంది. ఫస్ట్ హాఫ్ మొత్తం సరదా కామెడీతో నవ్వులు పంచుతుంది, అయితే కొన్ని పాటలు కథ వేగాన్ని కాస్త తగ్గిస్తాయి. ఇంటర్వెల్‌లో వచ్చే ట్విస్ట్ సెకండ్ హాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. రెండో భాగంలో హీరో-హీరోయిన్ల మధ్య జరిగే సరదా సంఘటనలు, కామెడీ ఎపిసోడ్స్ మంచి వినోదాన్ని అందిస్తాయి. చివర్లో కథ ఎమోషనల్ టచ్‌తో ముగుస్తూ పార్ట్-2కి చిన్న లీడ్ కూడా ఇస్తుంది. కొన్ని భావోద్వేగ సన్నివేశాలను ఇంకాస్త బలంగా చూపించి ఉంటే బాగుండేది. మొత్తంగా కామెడీ, ప్రేమ, భావోద్వేగాలు కలిసిన ఒక మంచి టైమ్‌పాస్ ఎంటర్‌టైనర్‌గా 'లవ్ ఓ లవ్' నిలుస్తుంది.
Above Average
Lenin movie Review
By Adireddy
అయ్యగారు అఖిల్ లెనిన్ సినిమా ఇప్పుడే చూసొచ్చాను. నాకైతే సినిమా బాగుంది. నాగార్జున గారు, డైరెక్టర్ కూర్చొని ఎలాగైనా ఈసారి అఖిల్ కి హిట్ ఇవ్వాలని దగ్గరుండి కూర్చుని కథ రాసి, అక్కడక్కడా అదిరిపోయే ట్విస్ట్ లు పెట్టి సినిమాని లేపారు. అండ్ అయ్యగారు అఖిల్ యాక్టింగ్ గురించి చెప్పుకుంటే.. అదరగొట్టాడు. చిత్తూరు యాసలో కూడా మాట్లాడుతూ సూపర్ అనిపించాడు. పైగా మనోడి యాక్టింగ్ చూసి షాక్ అయ్యా.. ఇంత బాగా చేస్తాడనుకోలేదు.
అండ్ కలెక్షన్స్ ఎలా వస్తాయో తెలీదు గాని సినిమా అయితే బాగుంది. ఎక్కడా వల్గారిటీ కూడా లేదు, కాబట్టి ఫ్యామిలీతో సినిమా చూడొచ్చు. సాంగ్స్ అంత బాగా లేవు కానీ, రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో ఉన్న ఓ సాంగ్ బాగుంది. ఇంటర్వెల్ లో వచ్చే ట్విస్ట్ లు, క్లైమాక్స్ ట్విస్ట్ లు కూడా ఎక్స్పెక్ట్ చేయలేము. బీజీఎమ్ కూడా చాలా బాగుంది. చివరగా అయ్యగారి యాక్టింగ్ మాత్రం నేను ఎక్స్పెక్ట్ చేయాలా... సినిమా థియేటర్లో బానే ఎంజాయ్ చేయొచ్చు.
Hit
Lenin movie Review
By T2B Live
కెరీర్ ని ఎప్పుడో 2015 టైంలో మొదలు పెట్టినా కూడా ఆశించిన మేర కమర్షియల్ సక్సెస్ ను అందుకోలేక పోయిన అఖిల్ అక్కినేని(Akhil Akkineni) ఎన్ని ప్రయత్నాలు చేసినా సరైనా కమర్షియల్ హిట్ ను అందుకోలేకపోయాడు…కొంత గ్యాప్ తర్వాత ఇప్పుడు కొత్త సినిమా లెనిన్(Lenin Movie)తో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. ఇక సినిమా గురించి చెప్పాలంటే.. ముందుగా ఇది ఎదో రెగ్యులర్ గా సాగే కమర్షియల్ డ్రామా మూవీ కాదు. ఒక సీరియస్ రూలర్ మాస్ డ్రామా గా తెరకెక్కిన సినిమా. ఇందులో హీరో హీరోయిన్ లవ్ స్టోరీ మెయిన్ గా చెప్పినా ఊరిలో అనేక పాత్రలు, ఆ పాత్రలకు ఊహించని కొన్ని ట్విస్ట్ లు ఉంటాయి.
వాటిని డైరెక్టర్ చాలా వరకు బాలెన్స్ చేస్తూ ఒక డీసెంట్ ఔట్ పుట్ ఇచ్చాడు. పెర్ఫార్మెన్స్ పరంగా అఖిల్ కెరీర్ లోనే ది బెస్ట్ అనిపించే రేంజ్ లో పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు. యాక్షన్ సీన్స్ లో కుమ్మేశాడు. హీరోయిన్ భాగ్య శ్రీ బాగానే నటించి మెప్పించింది. మిగిలిన రోల్స్ అందరూ బాగానే నటించారు. అయితే క్లైమాక్స్ ముగింపు విషాదాంతంగా ఉండడం వల్ల ఈ క్లైమాక్స్ ను ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు అన్నది ఇప్పుడు ఆసక్తికరం అని చెప్పాలి. ఓవరాల్ గా సినిమాలో అప్ అండ్ డౌన్స్ ఉన్నా కూడా అఖిల్ నుండి ఇది వరకు వచ్చిన మూవీస్ తో పోల్చితే మాత్రం, కచ్చితంగా లెనిన్ పెర్ఫార్మెన్స్ పరంగా టాప్ లో ఉంటుంది అని చెప్పాలి. అదే టైంలో ఆడియన్స్ మరీ ఎక్స్ పెర్టేషన్స్ ఎక్కువగా పెట్టుకోకుండా థియేటర్ కి వెళితే అఖిల్ పెద్దగా నిరాశ పరచకుండా ఆకట్టుకునే ఔట్ పుట్ తో మెప్పించే అవకాశం ఉంటుంది.
Above Average
Lenin Movie Review
By 10TV Telugu
అఖిల్ ఇప్పటివరకు ఒక్క కమర్షియల్ హిట్ కొట్టకపోవడంతో లెనిన్ పైనే అందరూ ఆశలు పెట్టుకున్నారు. ఇక థియేటర్లో ఈరోజే విడుదలైన ఈ సినిమా రొటీన్ స్టోరీ తో తెరకెక్కినా, మంచి స్క్రీన్ ప్లే తో ఎంగేజింగ్ గా ఉండి ఆకట్టుకుంటుంది. చాన్నాళ్ల తర్వాత ఓ పర్ఫెక్ట్ మాస్ కమర్షియల్ సినిమా చుసిన ఫీలింగ్ అయితే వస్తుంది. అనాథగా ఊళ్లోకి వచ్చి ఆ ఊరి పెద్ద కుటుంబంలో ఒకడిగా మారిన వ్యక్తి, అతని ప్రేమకథ, నమ్మినవాళ్ళే అతన్ని మోసం చేస్తే ఏం చేసాడు అనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది.
ఇక సినిమాని మహాభారతం రిఫరెన్స్ లో అందులోని పాత్రలతో లింక్ చేస్తూ తెరకెక్కించిన విధానం బాగుంది. విలేజ్ బ్యాక్ డ్రాప్, పీరియాడిక్ కావడంతో ఆర్ట్ డిపార్ట్మెంట్ కూడా బాగానే కష్టపడ్డారు. కొన్ని డైలాగ్స్ పవర్ ఫుల్ గా చాలా బాగున్నాయి. యాక్షన్ సీక్వెన్స్ బాగా డిజైన్ చేశారు. బస్ ఛేజింగ్, ఫైట్ సీన్, క్లైమాక్స్ ఫైట్ కూడా బాగుంటుంది. మొత్తంగా ‘లెనిన్’ సినిమా ఓ ప్రేమకథ చుట్టూ ట్విస్టులతో సాగే సినిమా.
Above Average
Lenin movie Review
By TV9 Telugu
లెనిన్ సినిమా గురించి చెప్పుకుంటే... ఈ చిత్ర దర్శకుడు రాసుకున్న స్క్రీన్ ప్లే సినిమాకు ప్రధాన బలంగా నిలిచింది. మహాభారతం స్ఫూర్తితో సాగే సన్నివేశాలు ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తిని రేకెత్తిస్తాయి. సినిమా మొదలైనప్పటి నుండి ఇంటర్వెల్ వరకు కథా గమనం ఒక ఎత్తు అయితే.. సెకండాఫ్‌లో సినిమాను నడిపించిన తీరు మరో ఎత్తు. దర్శకుడు ప్రతి పాత్రను చాలా లోతుగా మలిచాడు.
అయితే కథ పరంగా రొటీన్ గా ఉండి చాలా సీన్స్ ఊహాజనితంగానే ఉన్నాయి. ముఖ్యంగా ఫస్టాఫ్ లో అఖిల్, భాగ్యశ్రీ మధ్య వచ్చే లవ్ సీన్స్ పరిధి మేరకు ఉన్నాయి. ఎక్కడా కథను పక్కదారి పట్టించుకండా అనుకున్నది అనుకున్నట్లుగా తెరకెక్కించారు మురళీ కిషోర్. పైగా సెకండాఫ్‌లో కొన్ని సన్నివేశాల్లో అఖిల్ నటన కూడా సినిమా రేంజ్‌ను పెంచేసింది. కొన్ని పాత సినిమాల రిఫరెన్సులు కనిపించినా కూడా లెనిన్ ప్రత్యేకత లెనిన్ కు ఉంది. అయితే ఓవరాల్ గా సినిమాలో అఖిల్ పెర్ఫార్మన్స్ హైలెట్ గా నిలిచింది. కొత్తదనం కోసం ఆశించకుండా, తక్కువ అంచనాలతో చూస్తే... లెనిన్ ఊహించినదానికంటే ఎక్కువ బాగుంటుంది.
Hit
Lenin Movie Review
నాగార్జున నట వారసుడిగా ఎంట్రీ ఇచ్చాడు అఖిల్. ఇప్పటి వరకు ఐదు సినిమాలు చేశాడు. కానీ చెప్పుకోదగ్గ హిట్ ఒక్కటి కూడా లేదు. దీంతో ఇప్పుడు ఎలాగైనా హిట్ కొట్టాలని `లెనిన్` మూవీ చేశాడు. ఈ చిత్రానికి మురళీ కిశోర్ అబ్బూరు దర్శకత్వం వహించారు. ఇందులో అఖిల్‌కి జోడీగా భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రం నేడు శుక్రవారం(జులై 10) విడుదలైంది.
ఇక సినిమా విషయానికి వస్తే... లెనిన్ ఒక ఫక్తూ కమర్షియల్ మూవీ. మంచి డ్రామా, యాక్షన్, లవ్ స్టోరీ, ఊరి జాతర అనే సెంటిమెంట్, స్నేహం ఇలా అన్ని అంశాలను మేళవించి రూపొందించారు. అఖిల్ అక్కినేనికి ఎలాగైనా హిట్ ఇవ్వాలని లక్ష్యంతో నాగార్జున చేసిన ప్రయత్నం `లెనిన్` మూవీ అని చెప్పొచ్చు.
సినిమాలో డ్రామా బాగా వర్కౌట్ అయ్యింది. ట్విస్ట్ లు బాగున్నాయి. యాక్షన్ ఎపిసోడ్లు అదిరిపోయాయి. బీజీఎం బాగుంది. మరోవైపు హీరోహీరోయిన్ల మధ్య వచ్చే సీన్లు కొంత వరకు ఆకట్టుకుంటాయి. కానీ చాలా వరకు స్టోరీ రొటీన్ గా ఉంటుంది. కథనం రెగ్యూలర్‌గానే ఉంటుంది. చాలా లాజిక్ లు మిస్ అయ్యారు. ట్విస్ట్ లు చాలా పెట్టినా అవి చాలా వరకు తేలిపోయాయి. అంతగా కిక్ ఇవ్వలేదు. దీనికితోడు ఆ ట్విస్ట్ లకు సంబంధించి ముందే హింట్ ఇవ్వడం కొంత మైనస్‌గా చెప్పొచ్చు. కాకపోతే కమర్షియల్ యాంగిల్‌లో సినిమాని నడిపించిన తీరు మాత్రం మాస్ లవర్స్ కి బాగా నచ్చుతుందని చెప్పొచ్చు.
అఖిల్‌ని కమర్షియల్ గా నిలబెట్టే మూవీ అవుతుంది. నటుడిగానూ తనని కొత్తగా ఆవిష్కరించే చిత్రమవుతుంది. మాస్ కమర్షియల్ సినిమాలను ఇష్టపడే వారికి నచ్చే చిత్రమవుతుంది. కమర్షియల్ గా ఎలా మెప్పిస్తుందనేది ప్రశ్న.
Above Average
Lenin Movie Review
By Sakshi
అఖిల్ అక్కినేని నటించిన 'లెనిన్' మొదట్లో మరో రూరల్ యాక్షన్ డ్రామాలానే అనిపిస్తుంది. కానీ కథ ముందుకు సాగే కొద్దీ వచ్చే ట్విస్టులు సినిమాపై ఆసక్తిని పెంచుతాయి. ముఖ్యంగా ఇంటర్వెల్, క్లైమాక్స్ ఎపిసోడ్లు సినిమాను మరో స్థాయికి తీసుకెళ్తాయి.
అఖిల్ తన కెరీర్‌లో అత్యంత మెచ్యూర్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారని చెప్పొచ్చు. క్లైమాక్స్‌లో ఆయన నటన సినిమాకు హైలైట్‌గా నిలుస్తుంది. భాగ్యశ్రీ బోర్సేతో కెమిస్ట్రీ ఆకట్టుకోగా, తమన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ యాక్షన్ సన్నివేశాలకు మంచి ఎలివేషన్ ఇచ్చింది. కథలో కొత్తదనం తక్కువైనా, స్క్రీన్‌ప్లే ఎంగేజ్‌మెంట్‌తో పాటు అఖిల్ పెర్ఫార్మెన్స్ కోసం 'లెనిన్' ను ఒకసారి ట్రై చేయొచ్చు. అయితే ఈ సినిమా హిట్ అవుతుందా లేదా అనేది ప్రేక్షకులు నిర్ణయిస్తారు.
Above Average