Register as a Reviewer
Home Reviews Media Reviews

Media Reviews

Reviews from top media outlets, YouTube channels, and publications

937
Total Reviews
Showing 433–444 of 937 media reviews
తిమ్మరాజుపల్లి టివి (ThimmarajuPalli TV)

ThimmarajuPalli TV Movie Review

తిమ్మరాజుపల్లి టీవీ అంటూ ఆడియన్స్ ముందుకు వచ్చిన చిన్న సినిమా ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన అందుకుంది. హీరోహీరోయిన్లుగా నటించిన సాయి తేజ్, వేదా జలంధర్ మంచి పెర్ఫార్మన్స్ ఇవ్వగా, ప్రదీప్ కొట్టే, స్వాత...

తిమ్మరాజుపల్లి టీవీ అంటూ ఆడియన్స్ ముందుకు వచ్చిన చిన్న సినిమా ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన అందుకుంది. హీరోహీరోయిన్లుగా నటించిన సాయి తేజ్, వేదా జలంధర్ మంచి పెర్ఫార్మన్స్ ఇవ్వగా, ప్రదీప్ కొట్టే, స్వాతి కరిమిరెడ్డి కూడా మెచ్యురిటీతో కూడిన పెర్ఫార్మెన్స్‌ను అందించారు. కిరణ్ అబ్బవరమ్ నుంచి లభించిన ఒకే ఒక్క ఛాన్స్‌‌ను ప్రూవ్ చేసుకోవాలనే తపన కనిపించింది. ఈ సినిమాలో నటించిన ప్రతీ ఒక్కరు కూడా వందకు వందశాతం తమ ప్రతిభను చాటుకొన్నారు. ఈ సినిమాను ఫీల్‌గుడ్‌గా మార్చడంలో తమ వంతు సహకారాన్ని అందించారు.


ఇక ఈ మూవీకి అత్యంత బలంగా మారిన సాంకేతిక విభాగాల్లో మ్యూజిక్, సినిమాటోగ్రఫి గురించి చెప్పుకోవాలి. వంశీకాంత్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదరగొట్టింది. అక్షయ్ రామ్ అందించిన సినిమాటోగ్రఫి చాలా బాగుంది. కిరణ్ అబ్బవరం టీమ్ అనుసరించిన ప్రొడక్షన్ వాల్యూస్ ట్రెండ్ సెట్టింగ్‌గా ఉన్నాయి. సరైన కంటెంట్‌ ఉంటే.. భారీ బడ్జెట్‌తో కాకుండా తక్కువ వ్యయంతో ప్రేక్షకులను మెప్పించవచ్చు అని నిరూపించారు. ఈకలు పీకి..లోపాలు వెతకాలనే టార్గెట్‌తో కాకుండా.. ఓ నిజాయితీతో కూడిన అంటెంప్ట్‌ను చూడాలంటే.. తిమ్మరాజుపల్లి టీవీని ఈ వారం మీ ఛాయిస్‌గా ఎంచుకోవచ్చు.

6.0
out of 10

Above Average

తిమ్మరాజుపల్లి టివి (ThimmarajuPalli TV)

ThimmarajuPalli TV Movie Review

తాజాగా విడుదలైన తిమ్మరాజు పల్లి TV చిత్రం ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందనను అందుకుంటోంది. సినిమాలో హీరో సాయితేజ, హీరోయిన్ వేద జలంధర్ తమ నటనతో ఆకట్టుకోగా… రూరల్ తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌ ను బాగా చూపించారు....

తాజాగా విడుదలైన తిమ్మరాజు పల్లి TV చిత్రం ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందనను అందుకుంటోంది. సినిమాలో హీరో సాయితేజ, హీరోయిన్ వేద జలంధర్ తమ నటనతో ఆకట్టుకోగా… రూరల్ తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌ ను బాగా చూపించారు. రాజప్ప పాత్రలో ప్రతీక్ కూడా మంచి నటన కనబరిచారు. మిగతా నటీనటులు తమ పాత్రలకు న్యాయం చేశారు. సాంకేతిక విభాగాల విషయానికి వస్తే… సంగీతం సినిమాకు ప్లస్‌గా నిలిచింది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, కొన్ని పాటలు బాగున్నాయి. కెమెరా వర్క్ కూడా విజువల్స్‌ను నేచురల్‌గా చూపించింది.


అయితే ఎడిటింగ్ విషయంలో లోపాలు కనిపిస్తాయి. రెండు గంటల సినిమా అయినా స్లో నేరేషన్ వల్ల మరింత పొడవుగా అనిపిస్తుంది. ముఖ్యంగా లవ్ ట్రాక్ బలహీనంగా ఉండటం, కొన్ని సన్నివేశాలు కన్ఫ్యూజింగ్‌గా అనిపించడం మైనస్ పాయింట్స్. ఓవరాల్ గా తక్కువ బడ్జెట్‌లో చేసిన ప్రయత్నం కనిపించినా, కథనం బలహీనతల వల్ల సినిమా పూర్తిగా మెప్పించలేకపోయింది. అయితే రూరల్ డ్రామాలు ఇష్టపడే ఆడియన్స్ కి తిమ్మరాజు పల్లి TV నచ్చే ఛాన్స్ ఉంది. 

6.0
out of 10

Above Average

తిమ్మరాజుపల్లి టివి (ThimmarajuPalli TV)

ThimmarajuPalliTV Movie Review

తిమ్మరాజుపల్లి టీవీ’ అంటూ ఆడియన్స్ ముందుకు వచ్చిన కొత్త సినిమా ఆడియన్స్ ని అంతగా ఇంప్రెస్ చేయలేదు. చిన్న కథని ఇంట్రెస్టింగ్ గా మలచడంలో విఫలమయ్యాడు డైరెక్టర్. ఇక నటీనటులు సాయి తేజ్, వేద జలంధర్, ప్రదీప్...

తిమ్మరాజుపల్లి టీవీ’ అంటూ ఆడియన్స్ ముందుకు వచ్చిన కొత్త సినిమా ఆడియన్స్ ని అంతగా ఇంప్రెస్ చేయలేదు. చిన్న కథని ఇంట్రెస్టింగ్ గా మలచడంలో విఫలమయ్యాడు డైరెక్టర్. ఇక నటీనటులు సాయి తేజ్, వేద జలంధర్, ప్రదీప్ కొట్టే తమ పాత్రల్లో మెప్పించారు. హీరోయిన్ వేద కి మంచి రోల్ దక్కగా, రాజప్ప పాత్రధారి ప్రతీక్ కూడా అద్భుత నటనను కనబరిచాడు. మిగిలిన నటీనటులంతా వాళ్ల పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.


ఇంతకి చెప్పుకోవాల్సిన విషయం మరొకటుంటే సంగీతోం. ఈ సినిమాకి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో పాటు సాంగ్స్ గా నిలిచింది. పాటలు ఒకటి బాగుంది. కెమెరా వర్క్ కూడా ఇంట్రెస్టింగ్ గా, న్యూ మ్యూజిక్ మూడ్ కి తగ్గట్టుగా ఉంది. ఎడిటింగ్ ఇంకాస్త ఫాస్ట్ గా ఉండాల్సింది. రెండు గంటల సినిమా అయినా మూడు గంటల భావాన్ని అనిపించింది. దానికి కారణం కొన్ని ఎడిటింగ్ అంశం చెప్పాల్సిందే. సీన్స్ పేస్ లో బాగా ఉంది. సినిమా మొత్తానికి కూడా వర్క్ ఫ్రెండ్ మెంట్ గా ఉంది. ఇంటర్వెల్ కి అప్పుడు కధ మొదలవ్వడం ఫీలింగ్ రావు. అంతే డ్రామాటిక్ గా జంక్ అయ్యింది. హీరో హీరోయిన్ లవ్ ట్రాక్ కూడా చాలా వీక్ గా ఉంది. ఫోకస్ టీమ్ చెప్పిన అంశాలను అంతగా సక్సెస్ కి నెత్తురం పడ్డ సన్నివేశాలు లో ఏమి చెప్పాలో తెలియని సన్నివేశాలుగా అనిపించింది. ఓవరాల్ గా మూవీ టీవీల్లో చూసేలా ఉంది గాని, థియేటర్ కి హాల్లో చూడాల్సిన మూవీలా లేదు. 

5.0
out of 10

Average

తిమ్మరాజుపల్లి టివి (ThimmarajuPalli TV)

ThimmarajuPalli TV Movie Review

Sakshi

By Sakshi

తిమ్మరాజుపల్లి టీవీ’ పేరుతో వచ్చిన ఈ పీరియాడికల్ ఎమోషనల్ డ్రామా ఓ వర్గం ప్రేక్షకులకు నాటి జ్ఞాపకాలను గుర్తు చేస్తోంది. కథ, అప్పటి టీవీ నేపథ్య సన్నివేశాలు, కొన్ని ఎమోషనల్ ఎలిమెంట్స్ సినిమాకు ప్రధాన ఆకర...

తిమ్మరాజుపల్లి టీవీ’ పేరుతో వచ్చిన ఈ పీరియాడికల్ ఎమోషనల్ డ్రామా ఓ వర్గం ప్రేక్షకులకు నాటి జ్ఞాపకాలను గుర్తు చేస్తోంది. కథ, అప్పటి టీవీ నేపథ్య సన్నివేశాలు, కొన్ని ఎమోషనల్ ఎలిమెంట్స్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. 90స్ వాతావరణం కట్టిపడేస్తుంది.


అయితే కొన్ని సీన్స్ నెమ్మదిగా సాగడం, రొటీన్ స్క్రీన్‌ప్లే, కమర్షియల్ ఎలిమెంట్స్ లోపం సినిమాకు మైనస్‌లుగా మారాయి. నటీనటుల విషయానికి వస్తే… కొత్తవాళ్లే అయినప్పటికీ అందరూ సహజంగా నటించారు. ముఖ్యంగా సాయి తేజ్, వేద జలంధర్, ప్రదీప్ కొట్టే తమ పాత్రల్లో మెప్పించారు. దర్శకుడు వి. మునిరాజు బాగా హ్యాండిల్ చేసాడు. అలాగే వంశీ కాంత్ మ్యూజిక్ బాగా ఉంది. నిర్మాతగా కిరణ్ అబ్బవరం కు ఈ మూవీతో మంచి సక్సెస్ దక్కే అవకాశం ఉంది. ఇక ‘తిమ్మరాజుపల్లి టీవీ’ పీరియాడికల్ కథలను ఇష్టపడే వారికి కొంతవరకు కనెక్ట్ అయ్యే సినిమా.

6.0
out of 10

Above Average

తిమ్మరాజుపల్లి టివి (ThimmarajuPalli TV)

ThimmarajuPalli TV movie Review

‘తిమ్మరాజుపల్లి టీవీ’ అంటూ వచ్చిన ఈ పీరియాడికల్ ఎమోషనల్ డ్రామా ఓ వర్గం ప్రేక్షకులకు తమ గత అనుభూతిని ఇస్తోంది. ముఖ్యంగా కథ, అప్పటి టీవీ నేపథ్య సన్నివేశాలు, కొన్ని ఎమోషనల్ ఎలిమెంట్స్.. ఈ సినిమాలో ఆకట్టు...

‘తిమ్మరాజుపల్లి టీవీ’ అంటూ వచ్చిన ఈ పీరియాడికల్ ఎమోషనల్ డ్రామా ఓ వర్గం ప్రేక్షకులకు తమ గత అనుభూతిని ఇస్తోంది. ముఖ్యంగా కథ, అప్పటి టీవీ నేపథ్య సన్నివేశాలు, కొన్ని ఎమోషనల్ ఎలిమెంట్స్.. ఈ సినిమాలో ఆకట్టుకునే అంశాలు. అయితే, కొన్ని సీన్స్ రెగ్యులర్ గా అండ్ స్లోగా సాగడం, మరియు రొటీన్ స్క్రీన్ ప్లే, అలాగే కమర్షియల్ ఎలిమెంట్స్ మిస్ కావడం వంటి అంశాలు సినిమాకి బలహీనతలుగా నిలుస్తాయి.


అంతా కొత్త వాళ్ళతో చేసినప్పటికీ దాదాపుగా నటీనటులందరూ బాగా పెర్ఫార్మ్ చేసారు. ముఖ్యంగా సాయి తేజ్, వేద జలంధర్‌, ప్రదీప్ కొట్టే వారి పాత్రల్లో సహజంగా బాగా నటించారు. ఇక దర్శకుడిగా వి. మునిరాజు మంచి పనితనం కనబరిచాడు. ఓవరాల్ గా పీరియాడికల్ చిత్రాలను ఇష్టపడేవారికి ఈ సినిమాలో కొన్ని అంశాలు కనెక్ట్ అవుతాయి.

7.0
out of 10

Hit

పాపం ప్రతాప్ (Papam Prathap)

Papam Prathap Movie Review

అయ్యో… పాపం అంటూనే.. ఈ వారం వచ్చిన పాపం ప్రతాప్ గురించే మాట్లాడుకుందాం! ముందుగా చెప్పాలంటే… స్టోరీ పాయింట్ చిన్నదే కానీ డైరెక్టర్ దానికి విలేజ్ కామెడీ, ఎమోషన్స్ కలిపి ఓ ఫీల్ గుడ్ సినిమా చేయాలని ట్రై చ...

అయ్యో… పాపం అంటూనే.. ఈ వారం వచ్చిన పాపం ప్రతాప్ గురించే మాట్లాడుకుందాం! ముందుగా చెప్పాలంటే… స్టోరీ పాయింట్ చిన్నదే కానీ డైరెక్టర్ దానికి విలేజ్ కామెడీ, ఎమోషన్స్ కలిపి ఓ ఫీల్ గుడ్ సినిమా చేయాలని ట్రై చేశాడు.


సినిమా కొంచెం స్లో గా అనిపిస్తోస్తుంది. పల్లెటూరు వాతావరణం, క్యారెక్టర్స్, వాళ్ల మాటలు—all fun. హీరో ప్రాబ్లమ్ రివీల్ చేసే సీన్ కూడా బాగుంటుంది. ఇంటర్వెల్ దగ్గర “ఇంకేమైనా ఉంటుందా?” అనే ఫీల్ వస్తుంది. ఇక సెకండాఫ్ విషయానికి వస్తే.. అక్కడే సినిమా కాస్త దారి తప్పింది బాస్! తిరువీర్ మాత్రం సినిమా మొత్తాన్ని మోసేశాడు. కానీ వేరే వాళ్ళు పెద్దగా హెల్ప్ అవలేదు. ఫైనల్‌గా చెప్పాలంటే…

పాపం ప్రతాప్ ఒక సింపుల్ విలేజ్ డ్రామా. ఫస్ట్ హాఫ్ ఓకే, సెకండాఫ్ కాస్త బోర్… కానీ క్లైమాక్స్ ఎమోషన్ కొంతమందికి connect అవుతుంది. ఓవరాల్ గా ఇంటర్వెల్ సీక్వెన్స్ దగ్గర చెప్పే పాయింట్, క్లైమాక్స్ బాగుంటాయి. కానీ మూవీ ఓవరాల్ గా అంతగా ఎక్కదు. సో అదండీ పాయింట్. 

5.0
out of 10

Average

పాపం ప్రతాప్ (Papam Prathap)

Papam Prathap Movie Review

Thyview

By Thyview

ఇవాళ మనం మాట్లాడుకోబోయేది పాపం ప్రతాప్ గురించి… ముందుగా స్టోరీ పాయింట్ చూస్తే… చాలా చిన్న ఐడియా. కానీ డైరెక్టర్ ఎస్‌పి దుర్గా నరేష్ దానికి విలేజ్ కామెడీ + ఎమోషన్స్ కలిపి ఒక సింపుల్ ఫీల్ గుడ్ కథలా...

ఇవాళ మనం మాట్లాడుకోబోయేది పాపం ప్రతాప్ గురించి… 

ముందుగా స్టోరీ పాయింట్ చూస్తే… చాలా చిన్న ఐడియా. కానీ డైరెక్టర్ ఎస్‌పి దుర్గా నరేష్ దానికి విలేజ్ కామెడీ + ఎమోషన్స్ కలిపి ఒక సింపుల్ ఫీల్ గుడ్ కథలా తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. పల్లెటూరు సెటప్, క్యారెక్టర్స్ అమాయకత్వం, డైలాగ్స్—all work nicely. హీరో ప్రాబ్లమ్ రివీల్ చేసే సీన్, ఇంటర్వెల్ ట్విస్ట్ బాగుంటాయి… అక్కడికే “అరే సెకండాఫ్ లో ఏదో ఉంది” అనిపిస్తుంది. కానీ అసలు ప్రాబ్లమ్ ఎక్కడంటే… సెకండాఫ్! పేస్ స్లో అవుతుంది… కొన్ని డబుల్ మీనింగ్ జోక్స్ కాస్త అవుట్ ఆఫ్ ప్లేస్ ఫీల్ ఇస్తాయి. ఇంకొంచెం క్రిస్ప్‌గా రాస్తే సినిమా లెవెల్ ఇంకాస్త పెరిగేది.


 పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే…

తిరువీర్ literally carries the film!

అతని ఎమోషన్స్, కళ్లతో చేసే యాక్టింగ్ చాలా నేచురల్‌గా ఉంటుంది.

పాయల్ రాధాకృష్ణ కూడా బుజ్జమ్మ పాత్రలో క్యూట్‌గా, జెన్యూన్‌గా కనిపిస్తుంది.


 టెక్నికల్‌గా కేఎం రాధాకృష్ణన్ మ్యూజిక్, సురేష్ బొబ్బిలి BGM సీన్స్ కి good support. విశ్వేశ్వర్ సినిమాటోగ్రఫీ – గోదావరి visuals super fresh ఫైనల్‌గా… పాపం ప్రతాప్ పెద్ద సినిమా కాదు… కానీ ఒక సింపుల్, హార్ట్‌ఫెల్ట్ విలేజ్ డ్రామా. కొన్ని ఫ్లాజ్ ఉన్నా… క్లైమాక్స్ ఎమోషన్ connect అయితే, ఓవరాల్ గా One-time watch for its feel-good vibes..

5.0
out of 10

Average

పాపం ప్రతాప్ (Papam Prathap)

Papam Prathap Movie Review

పాపం ప్రతాప్ మూవీ గురించి చెప్పుకుంటే.. గ్రామీణ నేపథ్యంలో సాగే సైకలాజికల్ థ్రిల్లర్ లవ్ స్టోరీ ఇది. ఓ చిన్న పాయింట్ తీసుకుని దాదాపు రెండున్నర గంటల సినిమాగా సాగదీయడమే ఈ సినిమా విషయంలో జరిగిన అతి పెద్ద...

పాపం ప్రతాప్ మూవీ గురించి చెప్పుకుంటే.. గ్రామీణ నేపథ్యంలో సాగే సైకలాజికల్ థ్రిల్లర్ లవ్ స్టోరీ ఇది. ఓ చిన్న పాయింట్ తీసుకుని దాదాపు రెండున్నర గంటల సినిమాగా సాగదీయడమే ఈ సినిమా విషయంలో జరిగిన అతి పెద్ద పొరపాటు. ఓ తీవ్రమైన సమస్యను వినోదాత్మకగా చెప్పాలని దర్శకుడు ఎస్. పి. దుర్గ నరేశ్ భావించాడు. కానీ దానిని అంత ఎఫెక్టివ్‌గా తెర మీద చూపించలేకపోయాడు. గతంలోనూ గురక, నిద్రలో నడిచే అలవాటు నేపథ్యంలో కొన్ని సినిమాలు వచ్చాయి. కానీ ఇందులో హీరో సమస్య దానికంటే చాలా పెద్దది. 


టెక్నికల్ గా కె. ఎం. రాధాకృష్ణన్ స్వరాలు సమకూర్చిన ఈ సినిమాకు సురేశ్ బొబ్బిలి (Suresh Bobbili) నేపథ్య సంగీతం అందించారు. ఆర్. ఆర్. బాగుంది. ఈటీవీ విన్ లాంటి సంస్థ నుండి వస్తున్న సినిమా కావడం, తిరువీర్ హీరోగా నటించడం వంటి అంశాల వల్ల 'పాపం ప్రతాప్'ను చూద్దాం అనుకుంటే తప్పు చేసినట్టే. ఎలానూ రెండు మూడు వారాల తర్వాత ఓటీటీలో వస్తుంది కాబట్టి... అప్పటి వరకూ వేచి ఉండటం బెటర్. లేకపోతే... ఆడియెన్స్‌ను 'పాపం' అనుకోవాల్సి వస్తుంది!

4.0
out of 10

Below Average

పాపం ప్రతాప్ (Papam Prathap)

Papam Prathap Movie Review

ఈటివి వాళ్ళు నిర్మించిన కొత్త సినిమా పాపం ప్రతాప్(Papam prathap Movie)తో యంగ్ హీరో తిరువీర్(ThiruVeer) మరోసారి ఆడియన్స్ ముందుకు వచ్చేశాడు… ముందుగా కథ పాయింట్ విషయానికి వస్తే…హీరో తను ఇష్టపడిన అమ్మాయిన...

ఈటివి వాళ్ళు నిర్మించిన కొత్త సినిమా పాపం ప్రతాప్(Papam prathap Movie)తో యంగ్ హీరో తిరువీర్(ThiruVeer) మరోసారి ఆడియన్స్ ముందుకు వచ్చేశాడు… ముందుగా కథ పాయింట్ విషయానికి వస్తే…హీరో తను ఇష్టపడిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు… కానీ పెళ్లి అయిన మూడో రోజే పెళ్ళికూతురు తన పుట్టింటికి వెళ్ళిపోతుంది…దాంతో హీరో తనని తిరిగి బ్రతిమలాడి తిరిగి రప్పించుకుంటాడు..కానీ మళ్ళీ సీన్ రిపీట్ అవుతుంది. అసలు వీళ్ళకి ప్రాబ్లెం ఏంటి అసలు ఆ తర్వాత ఏం జరిగింది అన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే…


ఇక హీరోగా తిరువీర్ మరోసారి మంచి పెర్ఫార్మన్స్ ఇచ్చాడు. హీరోయిన్ ఓకే అనిపించగా అజయ్ ఘోష్ పెర్ఫార్మెన్స్ ఆకట్టుకుంది. మిగిలిన యాక్టర్స్ పర్వాలేదు…ఇక సంగీతం పర్వాలేదు అనిపించగా ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే చాలా స్లో నరేషన్ తో సాగింది. సినిమా ఎందుకో ఎక్కువ లాగ్ అయిన ఫీలింగ్ కలిగింది. ఫస్టాఫ్ పర్వాలేదు అనిపించేలా ఎండ్ అవ్వగా సెకెండ్ ఆఫ్ కథ చాలా స్లో నరేషన్ తో సాగుతూ రిపీటివ్ సీన్స్ తో సాగింది…ప్రీ క్లైమాక్స్ నుండి మళ్ళీ ఊపు అందుకుని క్లైమాక్స్ లో పర్లేదనిపించింది. ఓవరాల్ గా ఒకసారి చూసేయొచ్చు అనిపించేలా ఉంది పాపం ప్రతాప్. 

5.0
out of 10

Average

పాపం ప్రతాప్ (Papam Prathap)

Papam Prathap Movie Review

ఈ వారం విడుదలైన క్రేజీ మూవీస్ లో పాపం ప్రతాప్ ఒకటి. ఈ సినిమా రివ్యూ గురించి మాట్లాడుకుంటే... దర్శకుడు ఎస్‌పి దుర్గా నరేష్ ఎంచుకున్న పాయింట్ చాలా చిన్నది. కానీ దానికి పల్లెటూరి హాస్యాన్ని, బలమైన ఎమోషన్...

ఈ వారం విడుదలైన క్రేజీ మూవీస్ లో పాపం ప్రతాప్ ఒకటి. ఈ సినిమా రివ్యూ గురించి మాట్లాడుకుంటే... దర్శకుడు ఎస్‌పి దుర్గా నరేష్ ఎంచుకున్న పాయింట్ చాలా చిన్నది. కానీ దానికి పల్లెటూరి హాస్యాన్ని, బలమైన ఎమోషన్లను జోడించి హృద్యంగా మలిచారు. ఇక ఫస్ట్ హాఫ్ లో పల్లెటూరి వాతావరణం, అక్కడి మనుషుల మాటలు, అమాయకత్వం చాలా సరదాగా సాగిపోతాయి. హీరోకు ఉన్న వింత సమస్యను రివీల్ చేసిన విధానం, ఇంటర్వెల్ ట్విస్ట్ సెకండాఫ్‌పై ఆసక్తిని కలిగిస్తాయి.


అయితే సెకండాఫ్ ద్వితీయార్థంలో కథనం కాస్త నెమ్మదించింది. కొన్ని డబుల్ మీనింగ్ జోకులు లేకపోయినా సినిమా బాగుండేది. కానీ, క్లైమాక్స్‌లో వచ్చే ఎమోషన్స్ ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. నటీనటుల పెర్ఫార్మెన్స్ గురించి చెప్పుకుంటే... ఈ సినిమాకు ప్రధాన బలం తిరువీర్ నటన. భార్య దూరమైన బాధను, లోపల ఉన్న ఆవేదనను తన కళ్లతోనే పలికించాడు. ఒక సగటు మధ్యతరగతి భర్త పడే కష్టాలను అద్భుతంగా పండించాడు. బుజ్జమ్మ పాత్రలో పాయల్ రాధాకృష్ణ చాలా సహజంగా ఉంది. కేఎం రాధాకృష్ణన్ అందించిన పాటలు వినడానికి ఇంపుగా ఉన్నాయి. సురేష్ బొబ్బిలి నేపథ్య సంగీతం సీన్లను బాగా ఎలివేట్ చేసింది. విశ్వేశ్వర్ ఎస్.వి సినిమాటోగ్రఫీ గోదావరి అందాలను ఫ్రెష్‌గా చూపించింది. ఎడిటింగ్ విషయంలో సెకండాఫ్‌పై ఇంకాస్త శ్రద్ధ పెట్టి ఉంటే బాగుండేది. ఓవరాల్ గా 'పాపం ప్రతాప్'.. మనసును హత్తుకునే స్వచ్ఛమైన గ్రామీణ వినోదం.


6.0
out of 10

Above Average

పాపం ప్రతాప్ (Papam Prathap)

Papam Prathap Movie Review

తిరువీర్ నటించిన పాపం ప్రతాప్ మూవీ రివ్యూ గురించి చెప్పుకుంటే... ఆడియన్స్ నుండి మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. ప్రతాప్ పాత్రలో తిరువీర్ బాగా నటించాడు. నటుడిగా కొన్ని చిన్న ఎక్స్‌ప్రెషన్స్ భలే పలికించార...

తిరువీర్ నటించిన పాపం ప్రతాప్ మూవీ రివ్యూ గురించి చెప్పుకుంటే... ఆడియన్స్ నుండి మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. ప్రతాప్ పాత్రలో తిరువీర్ బాగా నటించాడు. నటుడిగా కొన్ని చిన్న ఎక్స్‌ప్రెషన్స్ భలే పలికించారు. పాయల్‌ రాధాకృష్ణకు మంచి ఎమోషనల్ పాత్ర దక్కింది. ఆమె కూడా చక్కగా నటించారు. అమ్మ పాత్రలో రాశి ఆకట్టుకున్నారు. అజయ్ ఘోష్, గోపరాజు రమణ తమ పాత్రల్లో చక్కగా నటించారు. మిగతా వారు పర్లేదనిపించారు.


ఇక సినిమా విషయానికి వస్తే... కథలో అసలు పాయింట్ పక్కనపెట్టి ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ వీక్‌నెస్ క్యాష్ చేసుకోవడానికి అన్నట్టు చేసిన పబ్లిసిటీ 'పాపం ప్రతాప్'కు మెయిన్ మైనస్ పాయింట్. ప్రేమ కథకు డిజార్డర్ యాడ్ చేసిన సినిమా తీయాలనే ఆలోచన బావుంది. దర్శకుడు అనుకున్న పాయింట్ కూడా బావుంది. కానీ, ఎగ్జిక్యూట్ చేసిన తీరు బాలేదు. కామెడీలో డబుల్ మీనింగ్ డోస్ ఎక్కువైంది. అది కొన్ని చోట్ల వర్కవుట్ అయ్యింది. కానీ, సినిమాగా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎంగేజ్ చేయలేదు. ప్రతాప్ సమస్యను దర్శకుడు సీరియస్‌గా తీసుకోలేదు. సినిమాను ప్రేక్షకులు సీరియస్‌గా తీసుకోవడం కష్టమే. థియేటర్లకు వెళ్లిన వాళ్ళను చూసి పాపం ఆడియన్స్ అనుకోవాలి!

3.0
out of 10

Not Good

పాపం ప్రతాప్ (Papam Prathap)

Papam Prathap Movie Review

తిరువీర్ నటించిన పాపం ప్రతాప్ మూవీ రివ్యూ గురించి చెప్పుకుంటే... కథ చాలా చిన్న పాయింట్. దర్శకుడు ఎస్.పీ. దుర్గా నరేష్ దానికి ఎమోషన్స్, పల్లెటూరి కామెడీని జోడించి సినిమాగా మలిచారు. మధ్యతరగతి భర్త పడే క...

తిరువీర్ నటించిన పాపం ప్రతాప్ మూవీ రివ్యూ గురించి చెప్పుకుంటే... కథ చాలా చిన్న పాయింట్. దర్శకుడు ఎస్.పీ. దుర్గా నరేష్ దానికి ఎమోషన్స్, పల్లెటూరి కామెడీని జోడించి సినిమాగా మలిచారు. మధ్యతరగతి భర్త పడే కష్టాలు, ఆత్మగౌరవం కోసం చేసే పోరాటం ప్రేక్షకులకు ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతాయి. అయితే ఇంత చిన్న పాయింట్‌ను రెండున్నర గంటల సినిమాగా మలచడం అనేది కత్తిమీద సాము లాంటిదే. కానీ అది కాస్త గాడి తప్పింది. ఫస్టాఫ్ అంతా బాగానే వెళ్లిపోతుంది. హీరోకు ఉన్న సమస్యేంటి అనేది ల్యాగ్ చేయకుండా త్వరలోనే రివీల్ చేసాడు దర్శకుడు.. అయితే కీలకమైన ద్వితీయార్థంలో కథనం కాస్త నెమ్మదించింది. 


సినిమాలో కొన్ని డబుల్ మీనింగ్ జోకులు, సీన్లు అవసరం లేదేమో అనిపించింది. క్లైమాక్స్ ఓకే..! నిర్మాణ విలువలు కథా నేపథ్యానికి తగ్గట్లుగా, రాజీ పడకుండా చాలా బాగున్నాయి. దర్శకుడు ఎంచుకున్న కథాంశం చిన్నదే అయినా.. 90ల నాటి గోదావరి నేటివిటీని తెరపైకి తీసుకురావడంలో సక్సెస్ అయ్యాడు. ఓవరాల్‌గా పాపం ప్రతాప్.. పల్లెటూరి కథ.. డీసెంట్ ఎంటర్‌టైనర్..!

5.0
out of 10

Average

Why MRO?