DC Movie Review
By Filmi Beat
డీసీ సినిమా కథను దర్శకుడు మాతేశ్వరన్ ఓ ఎమోషనల్ పాయింట్‌తో మొదలు పెట్టి.. కేవలం ఇది గ్యాంగ్‌స్టర్ సినిమానే కాదు.. భావోద్వేగాలతో సాగే కథ అని చెప్పాడు. అయితే ఆ తర్వాత చంద్రతో జర్నీ మరింత ఎమోషనల్‌గా రాసుకోవడంలో దర్శకుడు తనదైన శైలిని ప్రదర్శించడమే కాకుండా లోకేష్ కనకరాజ్ బాడీ లాంగ్వేజ్, యాటిట్యూడ్ తగినట్టుగా సీన్లును, క్యారెక్టర్‌ను డిజైన్ చేయడంతోపాటు కథను గ్రిప్పింగ్‌గా చెప్పేందుకు ప్రయత్నించిన తీరు ఆకట్టుకొనేలా ఉంటుంది. కాకపోతే మితి మీరిన హింస, యాక్షన్ పెద్ద పీట వేయడం వల్ల ఈ కథలో బయటకు రావాల్సిన ఎమోషన్స్ మరుగున పడిపోయాయనే ఫీలింగ్ కలుగుతుంది. సినిమా అంతా ఒకే నోట్ లో సింగిల్ పాయింట్‌తో సాగడం వల్ల రొటీన్, రెగ్యులర్ గ్యాంగ్‌స్టర్ డ్రామా చూస్తున్నామా? అనే ఫీలింగ్ కలుగుతుంది.
అయితే ఆ తర్వాత చంద్రతో జర్నీ మరింత ఎమోషనల్ గా రాసుకోవడంలో దర్శకుడు తనదైన శైలిని ప్రదర్శించడమే కాకుండా లోకేష్ కనకరాజ్ బాడీ లాంగ్వేజ్, యాటిట్యూడ్ తగినట్టుగా సీన్లును, క్యారెక్టర్‌ను డిజైన్ చేయడంతోపాటు కథను గ్రిప్పింగ్ గా చెప్పేందుకు ప్రయత్నించిన తీరు ఆకట్టుకొనేలా ఉంటుంది. కాకపోతే మితి మీరిన హింస, యాక్షన్ పెద్ద పీట వేయడం వల్ల ఈ కథలో బయటకు రావాల్సిన ఎమోషన్స్ మరుగున పడిపోయాయనే ఫీలింగ్ కలుగుతుంది. సినిమా అంతా ఒకే నోట్‌లో సింగిల్ పాయింట్‌తో సాగడం వల్ల రొటీన్, రెగ్యులర్ గ్యాంగ్‌స్టర్ డ్రామా చూస్తున్నామా? అనే ఫీలింగ్ కలుగుతుంది.
Above Average
DC Movie Review
By NTV Telugu
తీసింది కొన్ని సినిమాలైనా మంచి స్టార్ డైరెక్టర్ గా తమిళనాట ఓ వెలుగువెలుగుతున్న కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ హీరోగా నటించిన తొలి చిత్రం ‘డిసి’ ఈ వారం థియేటర్లలో విడుదలైంది. అరుణ్ మాదేశ్వరన్ తెరకెక్కించిన ఈ యాక్షన్ డ్రామాకు మిశ్రమ స్పందన లభిస్తున్నప్పటికీ, స్క్రీన్‌ప్లే సినిమాకు ప్రధాన బలంగా నిలిచింది.
చిన్న కథను ఆసక్తికరమైన ట్రీట్‌మెంట్‌తో, సాలిడ్ యాక్షన్ మూమెంట్స్‌తో దర్శకుడు ఆకట్టుకునేలా తెరకెక్కించాడు. హీరోగా లోకేష్ కనకరాజ్ తన పాత్రలో మెప్పించడంతో పాటు యాక్షన్ సన్నివేశాల్లో మంచి ఇంపాక్ట్ చూపించాడు. అనిరుధ్ సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు మరో ప్లస్‌గా నిలిచాయి.
కథలో కొన్ని చిన్న లోపాలు ఉన్నప్పటికీ, దర్శకుడి స్క్రీన్‌ప్లే ప్రేక్షకులను ఎంగేజ్ చేస్తుంది. మొత్తంగా ‘డిసి’ మంచి మాస్ యాక్షన్ డ్రామాగా నిలిచింది. లోకేష్ కనకరాజ్‌కు ఇది ఇంప్రెసివ్ డెబ్యూ అని చెప్పొచ్చు. ఫైనల్ గా డిసి ఎంగేజింగ్ మూవ్మెంట్స్ ఉన్న ఒక రెగ్యులర్ గ్యాంగ్ స్టర్ డ్రామా అని చెప్పొచ్చు.
Above Average
DC Movie Review
By Sakshi
ఈ వారం థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమాల్లో కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ హీరోగా నటించిన ‘డిసి’ కూడా ఒకటి. దర్శకుడు అరుణ్ మాదేశ్వరన్ తెరకెక్కించిన ఈ యాక్షన్ డ్రామా ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందనను అందుకుంటోంది. అయితే సినిమాను తెరకెక్కించిన విధానం, స్క్రీన్‌ప్లే విషయంలో దర్శకుడు తన మార్క్ చూపించాడు.
చిన్న కథాంశాన్నే తీసుకుని దానికి ఆసక్తికరమైన మలుపులు, యాక్షన్ ఎలిమెంట్స్ జోడించి ప్రేక్షకులను ఎంగేజ్ చేసేలా సినిమాను రూపొందించాడు. ముఖ్యంగా సినిమా సాగుతున్న కొద్దీ వచ్చే కొన్ని సాలిడ్ మూమెంట్స్ మాస్ ఆడియన్స్‌ను ఆకట్టుకుంటాయి. కథలో పెద్దగా కొత్తదనం కనిపించకపోయినా, దర్శకుడు ఎంచుకున్న ట్రీట్‌మెంట్ సినిమాకు ప్రధాన బలంగా నిలిచింది.
ఇక ఈ సినిమాతో హీరోగా డెబ్యూ చేసిన లోకేష్ కనకరాజ్ తన పాత్రకు న్యాయం చేశాడు. యాక్షన్ సన్నివేశాలతో పాటు కీలకమైన ఎమోషనల్ సీన్స్‌లోనూ తనదైన పెర్ఫార్మెన్స్‌తో మెప్పించాడు. మరోవైపు అనిరుధ్ అందించిన సంగీతం సినిమాకు అదనపు బలంగా నిలిచింది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ పలు సన్నివేశాల ఇంపాక్ట్‌ను మరింత పెంచింది.
ఓవరాల్‌గా ‘డిసి’ సినిమా సాలిడ్ యాక్షన్ మూమెంట్స్, ఆసక్తికరమైన స్క్రీన్‌ప్లేతో ఆకట్టుకునే మాస్ డ్రామాగా నిలుస్తుంది. అక్కడక్కడా కనిపించే చిన్న లోపాలను పక్కన పెడితే, థియేటర్లలో ఒకసారి చూడదగ్గ సినిమాగా అనిపిస్తుంది.
Above Average
DC Movie review
By 123telugu
ఈ వారం థియేటర్స్ లో విడుదలకి వచ్చిన లేటెస్ట్ సినిమాల్లో కోలీవుడ్ స్టార్ దర్శకుడు లోకేష్ కనకరాజ్ హీరోగా నటించిన మొదటి సినిమా ‘డిసి’ కూడా ఒకటి. దర్శకుడు అరుణ్ మాదేశ్వరన్ తెరకెక్కించిన ఈ యాక్షన్ డ్రామా మిక్స్డ్ రెస్పాన్స్ అందుకుంది. అయితే చిన్న కథని అదిరిపోయే స్క్రీన్ ప్లే తో ఆడియన్స్ కి ఆకట్టుకునేలా తెరకెక్కించాడు డైరెక్టర్.
మొత్తంగా చూసుకున్నట్టైతే ఈ “డిసి” చిత్రం సాలిడ్ మూమెంట్స్ తో సాగే మాస్ యాక్షన్ డ్రామాగా నిలిచింది. లోకేష్ కనకరాజ్ కి ఇది ఓ బ్యాంగర్ డెబ్యూ. తన రోల్ లో బాగా చేసి ఇంప్రెస్ చేసాడు. అలాగే అనిరుద్ సంగీతం మరో బలంగా ఇందులో నిలిచింది. దర్శకుడు ప్లాన్ చేసుకున్న కథనం కూడా బాగా వర్కవుట్ కావడంతో ఈ సినిమా చూసే ఆడియెన్స్ ని ఎంగేజ్ చేస్తుంది. చిన్న ఫ్లాస్ పక్కన పెడితే ఈ చిత్రం థియేటర్లులో మెప్పిస్తుంది.
Hit
Korean Kanakaraju Movie Review
By Thyview
కొరియన్ కనకరాజు.. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ కొరియన్ కనకరాజు ఈజ్ ఒకే టు వాచ్. ఫస్ట్ హాఫ్ వరకు సినిమా మీద నా ఒపీనియన్ మోర్ పాజిటివ్ గా ఉండేది. బట్ సెకండ్ హాఫ్ స్క్రీన్ ప్లే లూజ్ అవ్వడం, క్లైమాక్స్ వీక్ అవడం వల్ల ఓవరాల్ గా యావరేజ్ గా అనిపించింది. అయితే నేను అనుకున్న దాంట్లో సత్య కామెడీ మాత్రం అల్టిమేట్ గా సాటిస్ఫైచేస్తుంది.
అండ్ ఫస్ట్ హాఫ్ చాలా ప్రెడిక్టబుల్ గా అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ కూడా చాలా కన్ఫ్యూజన్ అనిపించింది. ఇండియా నుండి కొరియ కి సినిమా స్టోరీ షిఫ్ట్ అవడం కూడా అంతగా కిక్ ఇవ్వలేదు. అండ్ సినిమాలో చాలా వరకు క్లారిటీ మిస్ అయింది. లాజిక్ లెస్ సీన్స్ కూడా చాలా ఉన్నాయి. పెర్ఫార్మన్స్ విషయానికి వస్తే వరుణ్ తేజ్ డీసెంట్ పెర్ఫార్మన్స్ ఇచ్చాడు. కామెడీ టైమింగ్ కూడా అదిరింది. అలాగే రితిక నాయక్ కూడా డీసెంట్ పెర్ఫార్మన్స్ ఇచ్చింది. బట్ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ మిస్ అయింది. సినిమాకి హైలెట్ పెర్ఫార్మన్స్ ఇచ్చింది మాత్రం సత్యనే. ఓవరాల్ గా లైట్ కామెడీని ఎంజాయ్ చేయాలనుకుంటే ఈ సినిమాని చూస్ చేసుకోవచ్చు.
Above Average
Korean Kanakaraju movie Review
By 10TV Telugu
వరుస ఫ్లాప్స్ లో ఉన్న వరుణ్ తేజ్ కి కొరియన్ కనకరాజు టీజర్, ట్రైలర్స్ తో సినిమాపై భారీ అంచనాలు నెలకొనడంతో హిట్ కొడతాడు అనే ఆశలు చిగురించాయి. సత్య కామెడీ కూడా ఉండటంతో ఈసారి వరుణ్ హిట్ కొడతాడని అంత ఫిక్స్ అయ్యారు. ఒక ఆత్మ ఎక్కడ్నుంచో వచ్చి ఒకరి శరీరంలోకి దూరడం, తన ప్లేస్ కి వెళ్లడం.. లాంటి కథ చాలా పాతదే. కానీ దానికి పెనుగొండ, కొరియా బ్యాక్ డ్రాప్ తీసుకొని కొత్తగా రాసుకున్నారు.
సత్య కామెడీ ట్రాక్స్ కి మాత్రం ఫుల్ గా నవ్వుకుంటాం. కొరియాకు సంబంధించిన సీన్స్, హీరోయిన్ పాత్ర సెటప్ అన్ని బాగా ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. ఈ సినిమాకు పార్ట్ 2 కి లీడ్ ఇవ్వడం గమనార్హం. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. ఫుల్ గా నవ్వుకోడానికి థియేటర్ కి వెళ్లి చూడొచ్చు ఈ సినిమాని. మొత్తంగా ‘కొరియన్ కనకరాజు’ ఓ కొరియన్ గ్యాంగ్ స్టర్ ఆత్మ పెనుగొండలో ఉండే కనకరాజు అనే వ్యక్తి శరీరంలోకి వస్తే ఏం జరిగింది అని కామెడీ యాక్షన్ తో తెరకెక్కిన సినిమా.
Above Average
Korean kanakaraju movie review
By One India
మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన తాజా చిత్రం కొరియన్ కనకరాజు. వరుణ్ తేజ్ నటించిన ఈ మూవీ..టైటిల్‌తోనే ఇండస్ట్రీలో బజ్ క్రియేట్ చేసింది. ఆగస్టు 7వ తేదీన ఎట్టకేలకు అధికారికంగా ఈ చిత్రం విడుదల కానుండగా అంతకంటే ఒకరోజు ముందే ఫ్యాన్స్ కోసం థియేటర్లలో స్పెషల్ షోస్ తో స్క్రీనింగ్ అయ్యింది. హీరో వరుణ్ తేజ్ కొత్త లుక్,డిఫరెంట్ మేనరిజంతో ఆకట్టుకున్నాడు.హీరోయిన్ రితిక తన పాత్రకు న్యాయం చేశారు. అయితే సినిమాకు అసలు బలం మాత్రం సత్య (కిష్టప్ప) కామెడీనే.తన అద్భుతమైన కామిక్ టైమింగ్‌తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాడు.
అయితే మొదటి భాగం నెమ్మదిగా సాగడం, స్క్రీన్‌ప్లేలో గ్రిప్ లేకపోవడం ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తుంది. హారర్ కామెడీకి అవసరమైన ఊహించని ట్విస్టులు లేకపోవడం, భయపెట్టాల్సిన సన్నివేశాలు పెద్దగా ప్రభావం చూపకపోవడం నిరాశ కలిగిస్తాయి. మొత్తంగా 'కొరియన్ కనకరాజు' కొత్త కాన్సెప్ట్ తో వచ్చిన వినోదాత్మక హారర్ కామెడీ కథనం మరింత బిగుతుగా ఉండి,ట్విస్టులు బలంగా ఉంటే ఫలితం మరో స్థాయిలో ఉండేది. అయినప్పటికీ సత్య కామెడీ, తమన్ BGM, ఇంటర్వెల్ ఎపిసోడ్ కోసం ఈ సినిమాను ఒకసారి హ్యాపీగా చూడొచ్చు.
Above Average
Korean kanakaraju movie review
By TV9 Telugu
దెయ్యాలు, ఆత్మలు తదితర అంశాల నేపథ్యంలో భయపెడుతూనే నవ్వించే చిత్రాలు తెలుగు తెరకు కొత్త కాదు. ఒకరి దేహంలోకి మరొకరి ఆత్మ ప్రవేశించడం కూడా మనం చాలాసార్లు చూసిందే. కానీ ఇక్కడ దర్శకుడు ఎంచుకున్న విదేశీ ఆత్మ అనే పాయింట్ కొత్తగా అనిపిస్తుంది. సినిమా మొదలైన చాలాసేపటి వరకు కథనం చాలా సాదాసీదాగా సాగుతుంది. అయితే ప్రేక్షకుడు కాస్త బోర్ ఫీలయ్యే సమయంలో ఇంటర్వెల్ దగ్గర వచ్చే ట్విస్ట్ సినిమా స్వరూపాన్నే మార్చేస్తుంది. ఎప్పుడైతే హీరో శరీరంలోకి ఆత్మ వస్తుందో అక్కడి నుంచి కథ ఊపు అందుకుంటుంది.
లాజిక్ లను పూర్తిగా పక్కనపెట్టి కేవలం నవ్వించడమే లక్ష్యంగా దర్శకుడు అడుగులు వేశాడు. ముఖ్యంగా స్నేహితుడి పాత్రలో సత్య చేసే హడావిడి, ఇచ్చే ఎక్స్ ప్రెషన్స్ అంతా ఇంతా కాదు. అయితే వినోదానికి ఇచ్చిన ప్రాధాన్యత కథా గమనానికి ఇవ్వకపోవడం కొంత లోపం. కథలో బలమైన ఫ్లో ఉండదు. ఇక క్లైమాక్స్ సన్నివేశాలు మరీ కార్టూన్ నెట్వర్క్ తరహాలో సాగడం కొంచెం నిరాశపరుస్తుంది. ఫస్టాఫ్ లో ఉన్న సాగతీతను తగ్గించి ఉంటే సినిమా స్థాయి మరింత పెరిగేది. లాజిక్స్ వెతక్కుండా కేవలం నవ్వుకోవడానికి వెళ్లే వారికి ఈ సినిమా వినోదాన్ని పంచుతుంది. ఓవరాల్ గా కొరియన్ కనకరాజు.. లాజిక్స్ తో పనిలేకుండా కాసేపు హాయిగా నవ్వుకునేలా ఉంది.
Above Average
Korean kanakaraju movie review
By Great Andhra
వరుణ్ తేజ్ హీరోగా నటించిన `కొరియన్ కనకరాజు` ఫైనల్ గా థియేటర్లలో విడుదలై మిక్స్డ్ రెస్పాన్స్ అందుకుంది. డైరెక్టర్ మేర్లపాక గాంధీ ఓ రొటీన్ సబ్జెక్టు పట్టుకుని దాని చుట్టూ కామెడీ ప్రధానంగా స్క్రిప్ట్ రాసుకున్నారు. అయితే దాన్ని ఆడియన్స్ కి ఆకట్టుకునేలా తీయడంలో కొంతవరకు సక్సెస్ అయ్యాడు. అయితే సినిమా కథ బలంగా లేదు. లాజిక్ లెస్ సీన్లు కూడా బాగా ఉన్నాయి.
ఇటు ఆడియన్స్ కడుపుబ్బా నవ్వించే సినిమా కోసమని ఈ కొరియన్ కనకరాజుకి వెళ్తే కాసేపే నవ్వించాడని తెలుస్తుంది. పైగా సినిమాకి క్లైమాక్స్ లో కెన్యా కనకరాజు అంటూ సీక్వెల్ ప్రకటించడం కూడా అంతగా నచ్చలేదు. ఫైనల్ గా కొరియన్ కనకరాజు సగమే మెప్పించాడు.
Above Average
Korean kanakaraju movie review
హర్రర్ ని బేస్ చేసుకుని కామెడీ చిత్రాలు గతంలో చాలా వచ్చాయి. కానీ ఇప్పుడు గ్యాప్ వచ్చింది. తాజాగా `కొరియన్ కనకరాజు` ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ హర్రర్ కామెడీ చిత్రం. ఇందులో కామెడీ ప్రధానంగా చేసుకొని, అందులోనూ సత్య పాత్ర చుట్టూ కామెడీని ప్రధానంగా చేసుకొని రూపొందించారు. కామెడీని సరిగ్గా బ్లెండ్ చేయడంలో మేకర్స్ సక్సెస్ అయ్యారు. సత్య చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. పొట్టచెక్కలావ్వాల్సిందే. ఇక క్లైమాక్స్ లో ఫైట్ అదిరిపోయింది.
అయితే సినిమా కథ బలంగా లేదు. దర్శకుడు తనకు అనుకూలంగా ప్లెక్సీబుల్‌గా మార్చుకున్నారు. లాజిక్ లను పట్టించుకోకుండా సినిమా తీశాడు. వరుణ్ తేజ్‌ని పక్కన పెట్టి దర్శకుడు సత్యతో సినిమాని నడిపించడం విశేషం. అతను కూడా అదే స్థాయిలో ఇరగదీశాడు. సినిమాని మరో స్థాయికి తీసుకెళ్లారు. మొత్తంగా ఈ చిత్రం హిలేరియస్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా నిలుస్తుందని చెప్పొచ్చు. యాక్షన్ ప్రధానంగా సాగే హిలేరియస్ కామెడీ ఎంటర్‌టైనర్ `కొరియన్ కనకరాజు`. సరదాగా నవ్వుకోవడానికి మంచి ఆప్షన్.
Hit
Korean kanakaraju movie review
By Sakshi
వరుణ్ తేజ్ నటించిన కొరియన్ కనకరాజు మూవీ తాజాగా థియేటర్లలో విడుదలై మిశ్రమ స్పందన తెచ్చుకుంది. వరుణ్ తేజ్ తన డీసెంట్ పెర్ఫార్మన్స్ తో మెప్పిస్తాడు. సత్య కామెడీ సినిమాకే హైలెట్. డైరెక్టర్ మేర్లపాక గాంధీ ఎంటర్టైనింగ్ స్క్రీన్ ప్లే తో మెప్పించాడు. కానీ కథ ఇంకా బలంగా రాసుకోవాల్సింది. థమన్ మ్యూజిక్ చాలా బలమైంది.
ఇక ఫస్ట్ హాఫ్ రొటీన్ గానే ఉన్నా, సెకండ్ హాఫ్ హిలేరియస్ గా నవ్విస్తుంది. కాకపోతే క్లైమాక్స్ నిరాశపరుస్తుంది. ఓవరాల్ గా కొరియన్ కనకరాజు ఆడియన్స్ ని మెప్పిస్తుంది. కొత్తదనం కోరుకునే వాళ్లకు, లాజిక్ లు వెతికేవాళ్లకు ఈ సినిమా కొంతవరకు నిరాశపరచవచ్చు.
Hit
Korean kanakaraju Movie Review
By Gulte
Mega Prince Varun Tej is going through a lean phase for quite sometime. He decided to keep experiments aside for a while and try entertainment genre. He teamed up with director Merlapaka Gandhi for a Horror comedy film, Korean Kanakaraju.
Positives:
Satya’s Comedy
Varun Tej’s Performance
Negatives:
Predictability in the Story
Convenient Writing
Climax
Finally, Korean Kanakaraju is a mixed bag while it scores in the comedy department, it falters in the writing department. Try it but have your expectations in check.
Bottomline: High on laughs, Weak on script
Rating: 2.5/5
Above Average