Register as a Reviewer
Home Reviews Media Reviews

Media Reviews

Reviews from top media outlets, YouTube channels, and publications

580
Total Reviews
Showing 289–300 of 580 media reviews
బైసన్ (Bison)

Bison Movie Review

F

By FilmyFocus

చియాన్ విక్రమ్ కుమారుడు ధృవ్ హీరోగా నటించిన చిత్రం “బైసన్”. మారి సెల్వరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మిక్స్డ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. 1990 కాలంలో తమిళనాడులో చోటు చేసుకున్న వర్గ రణాల్ని, వాటి కార...

చియాన్ విక్రమ్ కుమారుడు ధృవ్ హీరోగా నటించిన చిత్రం “బైసన్”. మారి సెల్వరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మిక్స్డ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. 1990 కాలంలో తమిళనాడులో చోటు చేసుకున్న వర్గ రణాల్ని, వాటి కారణంగా అసువులు బాసిన మనుషుల వ్యథల్ని కళ్ళకి కట్టినట్లుగా చూపించాడు దర్శకుడు మారి సెల్వరాజ్. అయితే.. ఈ కథకు తెలుగు ప్రేక్షకులు ఎంతవరకూ రిలేట్ అవ్వగలరు అనేది ఇక్కడ ప్రశ్న. ఎందుకంటే.. పూర్తిగా తమిళ నెటివిటీ, సంస్కృతికి అద్దం పట్టేలా ఉండడంతో.. ఈ చిత్రం సగటు తెలుగు సినిమా ప్రేక్షకుడికి నచ్చుతుందా అంటే.. పూర్తిస్థాయిలో నచ్చకపోవచ్చు అనే చెప్పాలి. అయితే.. ధృవ్ విక్రమ్, పశుపతిల మాస్టర్ క్లాస్ యాక్టింగ్ & మారి సెల్వరాజ్ టేకింగ్ ను ఆస్వాదించడం కోసం ఈ చిత్రాన్ని కచ్చితంగా చూడాల్సిందే!

6.0
out of 10

Above Average

బైసన్ (Bison)

Bison Movie Review

Tupaki

By Tupaki

బైసన్ సినిమా విషయానికి వస్తే మేకర్స్ మంచి క్వాలిటీతో సినిమా తీశారు. నివాస్ ప్రసన్న నేపథ్య సంగీతం సినిమాను డ్రైవ్ చేయడంలో ఉపయోగపడింది. తన పాటలు ఓ మోస్తరుగా అనిపిస్తాయి. ఎలిల్ అరసు ఛాయాగ్రహణం సినిమాలో మ...

బైసన్ సినిమా విషయానికి వస్తే మేకర్స్ మంచి క్వాలిటీతో సినిమా తీశారు. నివాస్ ప్రసన్న నేపథ్య సంగీతం సినిమాను డ్రైవ్ చేయడంలో ఉపయోగపడింది. తన పాటలు ఓ మోస్తరుగా అనిపిస్తాయి. ఎలిల్ అరసు ఛాయాగ్రహణం సినిమాలో మేజర్ హైలైట్. విజువల్స్ చాలా బాగున్నాయి. ఇక రైటర్ కమ్ డైరెక్టర్ మారి సెల్వరాజ్.. ఇంతకుముందు తీసిన నాలుగు సినిమాలతో పోలిస్తే ‘బైసన్’ సాధారణంగా అనిపిస్తుంది. తన సినిమాల్లో బలమైన ఎమోషన్ ఉంటుంది. ఇందులో అది మిస్ అయింది. సాధారణమైన పాత్రలు.. సన్నివేశాలతో తన మీద ఉన్న అంచనాలను అతను అందుకోలేకపోయాడు. కుల కోణాన్ని అతను ఈసారి సరిగా ఎలివేట్ చేయకపోవడమే సినిమాకు సమస్యగా మారింది

6.0
out of 10

Above Average

బైసన్ (Bison)

Bison Movie Review

బైసన్ సినిమా విషయానికి వస్తే.. ధ్రువ్ విక్రమ్‌ పెర్ఫార్మెన్స్, ఆయన పాత్రతోపాటు పశుపతి ఇతర క్యారెక్టర్లను చిత్రీకరించిన తీరు ఈ మూవీకి అత్యంత బలంగా మారింది. కథ, కథనాలు మరో ప్లస్ పాయింట్, ఫస్టాఫ్ చాలా ఇం...

బైసన్ సినిమా విషయానికి వస్తే.. ధ్రువ్ విక్రమ్‌ పెర్ఫార్మెన్స్, ఆయన పాత్రతోపాటు పశుపతి ఇతర క్యారెక్టర్లను చిత్రీకరించిన తీరు ఈ మూవీకి అత్యంత బలంగా మారింది. కథ, కథనాలు మరో ప్లస్ పాయింట్, ఫస్టాఫ్ చాలా ఇంటెన్స్‌గా ఉంటుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ సెకండాఫ్‌పై భారీ అంచనాలు పెంచుతుంది. కానీ రెండో భాగంలో అంతా ఊహించినట్టే సన్నివేశాలు ఉండటం కొంత మైనస్‌. తమిళ వాసన ఎక్కువగా ఉండటం తెలుగు ప్రేక్షకులకు రుచించని అంశంగా కనిపిస్తుంది. ఓవరాల్‌గా ఆద్యంతం కట్టిపడేసే కథనం, ఆలోచింపజేసే కథ, స్పోర్ట్స్, దేశభక్తిని రగిలించే అంశాలు ఉన్న ఈ సినిమా తప్పకుండా చూడాల్సిందే. హై ఎండ్ థియేట్రికల్ వాల్యూస్ ఉన్న సినిమా ఇది. ఎలాంటి అంచనాలు ఉన్న చక్కటి అనుభూతిని పంచే మూవీ బైసన్. ఈ వారం థియేటర్‌లో చూడటానికి, సినిమాటిక్ అనుభూతిని పొందడానికి ప్రేక్షకులకు, సినీ అభిమానులకు చక్కటి ఆప్షన్. డోంట్ మిస్ బైసన్ దిస్ వీక్.

6.0
out of 10

Above Average

బైసన్ (Bison)

Bison Movie Review

మారి సెల్వరాజ్ డైరెక్ట్ చేసిన బైసన్ మూవీ నిజ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన స్పోర్ట్స్ డ్రామా. మణాతి గణేశన్ లైఫ్ స్టైల్ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో ధృవ్ విక్రమ్ టైటిల్ రోల్ చేసాడు. అయితే ఆడియన్స్ నుండి...

మారి సెల్వరాజ్ డైరెక్ట్ చేసిన బైసన్ మూవీ నిజ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన స్పోర్ట్స్ డ్రామా. మణాతి గణేశన్ లైఫ్ స్టైల్ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో ధృవ్ విక్రమ్ టైటిల్ రోల్ చేసాడు. అయితే ఆడియన్స్ నుండి మిక్స్డ్ రివ్యూస్ తెచ్చుకుంది ఈ సినిమా. కంటెంట్ బాగున్నా, స్క్రీన్ ప్లే ల్యాగ్ ఉండడం వల్ల, కథలో కావాల్సిన కంటెంట్ కన్నా, సమాజంలో జరిగే అసమానతలపై ఎక్కువ ఫోకస్ ఉండడం వల్ల మూవీ ఆడియన్స్ కి అంతగా రీచ్ కాదు. ఓవరాల్‌గా చూస్తే, ‘బైసన్’ చిత్రం అనచివేత, సామాజిక న్యాయం వంటి అంశాలను టచ్ చేసే స్పోర్ట్స్ డ్రామాగా పర్వాలేదనిపిస్తుంది. ధృవ్ విక్రమ్ డెడికేషన్, పశుపతి ఎమోషనల్ పర్ఫార్మెన్స్‌లు ఈ సినిమాకు ప్లస్ అయ్యాయి. అయితే, మారి సెల్వరాజ్ గతచిత్రాలతో పోలిస్తే ఈ సినిమా పెద్ద ఇంపాక్ట్ చూపెట్టలేకపోయింది. సాగదీసే రన్‌టైమ్, వీక్ రైటింగ్ వంటి అంశాలు ఈ చిత్రానికి డ్యామేజ్ చేశాయి. స్పోర్ట్స్ డ్రామాలతో పాటు సామాజిక అంశాలు ఉన్న చిత్రాలను ఇష్టపడేవారు ఈ సినిమాను తక్కువ అంచనాలతో చూడటం బెటర్.

6.0
out of 10

Above Average

కే- ర్యాంప్ (K - Ramp)

K - Ramp Movie Review

Thyview

By Thyview

కిరణ్ అబ్బవరం నటించిన “కే–రాంప్” సినిమా ఒక లైన్‌లో చెప్పాలంటే – ఐడియా ఉంది, కానీ ఎగ్జిక్యూషన్ మిస్ అయింది. సినిమా మొదలైనప్పటి నుంచి డైరెక్టర్ ఏం చెప్పాలనుకుంటున్నాడో అర్థమవుతుంది, కానీ దాన్ని స్క్రీన్...

కిరణ్ అబ్బవరం నటించిన “కే–రాంప్” సినిమా ఒక లైన్‌లో చెప్పాలంటే – ఐడియా ఉంది, కానీ ఎగ్జిక్యూషన్ మిస్ అయింది. సినిమా మొదలైనప్పటి నుంచి డైరెక్టర్ ఏం చెప్పాలనుకుంటున్నాడో అర్థమవుతుంది, కానీ దాన్ని స్క్రీన్ మీద బలంగా చూపించడంలో తడబడినట్టు అనిపిస్తుంది. కథ కొత్తదేమీ కాదు, మనం ఇంతకుముందే చాలా సినిమాల్లో చూసిన ఫార్ములానే. ఫస్ట్ హాఫ్ కొంచెం ఎంగేజింగ్‌గా ఉన్నా, సెకండ్ హాఫ్ వచ్చేసరికి స్క్రీన్‌ప్లే పూర్తిగా డౌన్ అయిపోతుంది. కిరణ్ అబ్బవరం పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, తన స్టైల్‌లోనే చేశాడు. కొన్ని సీన్స్‌లో ఎమోషన్ వర్క్ అవుతుంది, కానీ చాలా చోట్ల ఓవర్ ఇంటెన్స్‌గా అనిపిస్తుంది. సపోర్టింగ్ క్యారెక్టర్స్‌కు సరైన ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. మ్యూజిక్ పెద్దగా గుర్తుండిపోయేది కాదు, బీజీఎం కూడా సీన్స్‌ని ఎలివేట్ చేయలేకపోయింది. మొత్తానికి “కే–రాంప్” ఒక యావరేజ్ సినిమా.

6.0
out of 10

Above Average

కే- ర్యాంప్ (K - Ramp)

K - Ramp movie Review

Ragadi

By Ragadi

కిరణ్ అబ్బవరం నటించిన “కే–రాంప్” సినిమా అంటే ముందే ఓ రేంజ్ ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి. కానీ సినిమా స్టార్ట్ అయిన కొద్ది నిమిషాలకే క్లారిటీ వచ్చేస్తుంది – ఇది పూర్తిగా మాస్‌కు మాత్రమే కనెక్ట్ అయ్యే ప్రయత...

కిరణ్ అబ్బవరం నటించిన “కే–రాంప్” సినిమా అంటే ముందే ఓ రేంజ్ ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి. కానీ సినిమా స్టార్ట్ అయిన కొద్ది నిమిషాలకే క్లారిటీ వచ్చేస్తుంది – ఇది పూర్తిగా మాస్‌కు మాత్రమే కనెక్ట్ అయ్యే ప్రయత్నం. కిరణ్ అబ్బవరం యాక్టింగ్ విషయానికి వస్తే, తన పాత సినిమాల్లో చూసిన అదే ఎనర్జీ, అదే బాడీ లాంగ్వేజ్. కొన్ని సీన్స్‌లో బాగానే సెట్ అయ్యాడు కానీ కొత్తదనం మాత్రం మిస్ అయింది. కథ చాలా సింపుల్, ప్రెడిక్టబుల్‌గా నడుస్తుంది. స్క్రీన్‌ప్లే ఇంకాస్త టైట్‌గా ఉంటే బాగుండేదనిపిస్తుంది. డైరెక్షన్ పరంగా చెప్పాలంటే, కొన్ని సీన్స్ ఎలివేషన్ బాగా వర్క్ అయ్యాయి కానీ మధ్యలో లాగ్ ఫీల్ ఎక్కువ. విలన్ క్యారెక్టర్‌కు సరైన డెప్త్ లేకపోవడం మైనస్. పాటలు ఓకే అనిపిస్తాయి కానీ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇంకాస్త బెటర్‌గా ఉండాల్సింది. మొత్తానికి “కే–రాంప్” సినిమా కిరణ్ అబ్బవరం అభిమానులకు ఒకసారి చూసేలా ఉంటుంది, కానీ జనరల్ ఆడియన్స్‌కు మాత్రం పెద్దగా ఇంప్రెస్ చేయదు. థియేటర్‌కి వెళ్లాలా వద్దా అనేది మీ అంచనాల మీదే ఆధారపడి ఉంటుంది.

6.0
out of 10

Above Average

కే- ర్యాంప్ (K - Ramp)

K - Ramp Movie Review

F

By FilmyFocus

కిరణ్ అబ్బవరం నటించిన కె - ర్యాంప్ మూవీ ఎంటర్టైన్మెంట్ కోసమే సినిమా చూడండి అని చెప్పడంలో తప్పు లేదు, కానీ.. ఆ ఎంటర్టైన్మెంట్ ఎంగేజింగ్ గా ఉందా? లేదా? అనేది కూడా చూసుకోవాలి. “K-ర్యాంప్” సినిమా కొంతమేర...

కిరణ్ అబ్బవరం నటించిన కె - ర్యాంప్ మూవీ ఎంటర్టైన్మెంట్ కోసమే సినిమా చూడండి అని చెప్పడంలో తప్పు లేదు, కానీ.. ఆ ఎంటర్టైన్మెంట్ ఎంగేజింగ్ గా ఉందా? లేదా? అనేది కూడా చూసుకోవాలి. “K-ర్యాంప్” సినిమా కొంతమేర ఎంటర్టైన్ చేస్తుంది. కిరణ్ అబ్బవరం టైమింగ్, మాస్ ఫైట్స్ ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ ను కచ్చితంగా అలరిస్తాయి. అయితే.. కాన్ఫ్లిక్ట్ పాయింట్ ను డీల్ చేసిన విధానం కానీ, దానికి సమాధానం చెప్పిన విధానం కన్విన్సింగ్ గా లేదు. ఆ విషయంలో కేర్ తీసుకుని ఉంటే బాగుండేది. అలాగే.. ఇబ్బందిపట్టే హాస్యం కూడా ఉంది. ఇక యుక్తి తరేజా, సాయికుమార్, మురళీధర్ గౌడ్ వాళ్ళ పరిధి మేరకు బాగా నటించారు. టెక్నికల్ గా మూవీ టీం ఎఫర్ట్స్ కూడా బాగున్నాయి. చేతన్ భరద్వాజ్ మ్యూజిక్ బాగుంది. ఓవరాల్ గా ఎక్కువ ఎక్స్పెక్ట్ పెట్టుకోకుండా మూవీ చూస్తే బెటర్. కథలో కొత్తదనం మాత్రం ఉండదు.

6.0
out of 10

Above Average

కే- ర్యాంప్ (K - Ramp)

K - Ramp movie Review

కే - ర్యాంప్ మూవీ కథ విషయానికి వస్తే.. కథలో కొత్తదనం ఉందని అనిపించదు కానీ.. కథనంలో మాత్రం కొత్తదనం ఉంది. లాజిక్స్ వెతకకుండా ఓ లవ్ స్టోరీ చూసి నవ్వుకోవాలి అంటే ఈ సినిమా బెటర్ చాయిస్. పైగా లాజిక్స్ వెతక...

కే - ర్యాంప్ మూవీ కథ విషయానికి వస్తే.. కథలో కొత్తదనం ఉందని అనిపించదు కానీ.. కథనంలో మాత్రం కొత్తదనం ఉంది. లాజిక్స్ వెతకకుండా ఓ లవ్ స్టోరీ చూసి నవ్వుకోవాలి అంటే ఈ సినిమా బెటర్ చాయిస్. పైగా లాజిక్స్ వెతకొద్దని సినిమా టీం ముందే అనౌన్స్ చేసేసింది. డైరెక్టర్ కూడా దానికి తగినట్టుగానే కథ రాసుకున్నాడు. అయితే మరీ డీప్ గా వెళ్లకుండా ఎక్కడ డైవర్ట్ అవ్వకుండా, దీని చుట్టూ కొన్ని కామెడి లేయర్స్ రాసుకున్నాడు దర్శకుడు. వన్ లైనర్స్ కూడా బాగానే ఉన్నాయి. కిరణ్ అబ్బవరం స్టైల్ లు కరెక్ట్ గా సూట్ అయ్యాయి. మూవీ స్టార్ట్ అయిన మొదటి 15నిముషాల తర్వాత కథ కాలేజ్ కు షిఫ్ట్ అవుతుంది. తర్వాత అంతా ప్రెడిక్టబిల్ గానే ఉంటుంది. హీరో హీరోయిన్ తో ప్రేమలో పడడం. ఆమెను పడేయడం కోసం తిప్పలు పడడం. ఆ తర్వాత హీరోయిన్ కు ఉన్న సమస్య బయటపడడం.. దాని కోసం హీరో పడే పాట్లు , టెన్షన్స్ ఇవన్నీ ఫన్నీ వే లోనే చూపించారు. అలా మొదటి హాఫ్ కంప్లీట్ అయిపోతుంది. సెకండ్ ఆఫ్ లో కథ కొంచెం సీరియస్ గా సాగి హీరో తన తండ్రి గురించి తెలుసుకోవడం.. లాంటివి జరుగుతాయి. ఓవరాల్ గా నవ్వుకోవడానికి కే - ర్యాంప్ మంచి ఛాయస్.

6.0
out of 10

Above Average

కే- ర్యాంప్ (K - Ramp)

K - Ramp Movie Review

కిరణ్ అబ్బవరం నటించిన కే - ర్యాంప్ మూవీ ఆడియన్స్ ని మెప్పించడంలో సక్సెస్ అయింది. దర్శకుడు జైన్స్ నాని స్టోరీ పరంగా మెప్పించలేదు గాని, ఆడియన్స్ ని నవ్వించడంలో సక్సెస్ అయ్యాడు. ఓవరాల్ గా సినిమా కంటెంట్...

కిరణ్ అబ్బవరం నటించిన కే - ర్యాంప్ మూవీ ఆడియన్స్ ని మెప్పించడంలో సక్సెస్ అయింది. దర్శకుడు జైన్స్ నాని స్టోరీ పరంగా మెప్పించలేదు గాని, ఆడియన్స్ ని నవ్వించడంలో సక్సెస్ అయ్యాడు. ఓవరాల్ గా సినిమా కంటెంట్ విషయానికి వస్తే..ఈ మూవీ కేవలం కామెడీ చిత్రం మాత్రమే కాదు.. యూత్‌కు నచ్చే లవ్ స్టోరి. ఫ్యామిలీ ఆడియెన్స్‌ను మెప్పించే ఫాదర్ సెంటిమెంట్ ఈ కథలో భాగమయ్యాయి. కిరణ్ అబ్బవరం హృదయాన్ని భారంగా మార్చే నటనను ప్రదర్శించాడు. దీపావళీ పండుగ సీజన్‌లో కుటంబ సమేతంగా చూసే చిత్రమే కాకుండా మంచి వినోదాన్ని ఆస్వాదించేలా మూవీని రూపొందించారు. ఈ పండుగ సెలవుల్లో ఈ సినిమాను మీ లిస్టులో ఎలాంటి సందేహాలు లేకుండా చేర్చుకోవచ్చు. మీరు పెట్టే టికెట్‌కు ఫుల్ పైసా వసూల్ మూవీ ఈ కె ర్యాంప్. కాకపోతే కొత్తదనం ఎక్స్పెక్ట్ చేయకుండా మూవీ చుస్తే బెటర్.

6.0
out of 10

Above Average

కే- ర్యాంప్ (K - Ramp)

K - Ramp movie Review

కే ర్యాంప్.. కిరణ్ అబ్బవరం ర్యాంప్‌నో.. కుమార్ ర్యాంప్‌నో.. లేదంటే కు** ర్యాంప్‌నో.. ర్యాంప్‌కి ముందు తోక ఏదైనా కావచ్చు కానీ.. ముందు మాత్రం ఆడియన్స్‌కి కావాల్సింది ఎంటర్‌టైన్మెంట్. అదే పాయింట్‌తో మీకు...

కే ర్యాంప్.. కిరణ్ అబ్బవరం ర్యాంప్‌నో.. కుమార్ ర్యాంప్‌నో.. లేదంటే కు** ర్యాంప్‌నో.. ర్యాంప్‌కి ముందు తోక ఏదైనా కావచ్చు కానీ.. ముందు మాత్రం ఆడియన్స్‌కి కావాల్సింది ఎంటర్‌టైన్మెంట్. అదే పాయింట్‌తో మీకు హామీ ఇస్తున్నా.. ‘కే ర్యాంప్‌’లో మాత్రం ఎంటర్‌టైన్మెంట్ పక్కా.. దీపావళి పండుగ పూట ఫ్యామిలీ మొత్తం థియేటర్స్‌కి వచ్చి హాయిగా నవ్వుకుంటారని ప్రామిస్ చేశాడు కిరణ్ అబ్బవరం. ప్రామిస్ తప్పితే ఎలా ఉంటుందనే కో ఇన్సిడెంట్ కథే ‘K ర్యాంప్. కంటెంట్ పరంగా ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయడంలో మేకర్స్ సక్సెస్ అయ్యారు. స్క్రీన్ ప్లే పెద్దగా లేకపోయినా, ల్యాగ్ ఫీల్ ఉన్నా, ఎక్స్పెక్ట్ చేసే కథనమే ఉన్నా, ఓవరాల్ గా క్లైమాక్స్ వరకు దాదాపుగా మూవీ ఎంటర్టైన్ చేస్తుంది. చేతన్ భరద్వాజ్ మ్యూజిక్ ‘కే ర్యాంప్’ అనిపించకపోయినా.. నిరాశపరచలేదు. సతీష్ రెడ్డి మాసం సినిమాటోగ్రఫీ కే ర్యాంప్‌కి బాగా సెట్ అయ్యింది. కేరళ బ్యూటీని కెమెరాలో బంధించారు. ఓవరాల్ గా నవ్వుకోవడానికి మాత్రమే ఒకసారి ట్రై చేయొచ్చు.

6.0
out of 10

Above Average

కే- ర్యాంప్ (K - Ramp)

K - Ramp movie Review

కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన కె - ర్యాంప్ మూవీని జైన్స్ నాని డైరెక్ట్ చేయగా, యుక్తి తరేజా హీరోయిన్ గా నటించింది. ఫక్తు కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా కథ పరంగా అంతగా ఇంప్రెస్ చేయకపోయినా, ఆడియ...

కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన కె - ర్యాంప్ మూవీని జైన్స్ నాని డైరెక్ట్ చేయగా, యుక్తి తరేజా హీరోయిన్ గా నటించింది. ఫక్తు కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా కథ పరంగా అంతగా ఇంప్రెస్ చేయకపోయినా, ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. స్క్రీన్ ప్లే కూడా అక్కడక్కడా ట్రిమ్ చేయాల్సి ఉన్నా, అన్ని సీన్లు ఎంటర్టైనింగ్ గా ఉండడం వల్ల పెద్దగా ఎడిట్ చేయలేదు. కానీ సన్నివేశాలు చాలా వరకు ఊహాజనితంగా ఉంటాయి. అందువల్ల కొత్తదనం కోరుకునే ఆడియన్స్ డిస్సపాయింట్ అవుతారు. అలాగే ఫస్ట్ హాఫ్ చాలా రొటీన్ గా ఉంటుంది. కానీ ఇంటర్వెల్ తర్వాత సెకండాఫ్ కొంచెం రిలీఫ్ ఇస్తుంది. ప్రీ క్లైమాక్స్ లో అక్కడక్కడా డీసెంట్ ఎమోషనల్ టచ్ సీన్స్ బాగున్నాయి. ఓవరాల్ గా కొత్త కంటెంట్ ఎక్స్పెక్ట్ చేస్తే ఆడియన్స్ డిస్సపాయింట్ అవుతారు. కథా, కథనాలతో సంబంధం లేకుండా నవ్వుకోవడానికి మాత్రమే ఈ సినిమా చూడొచ్చు.

6.0
out of 10

Above Average

ది గర్ల్ ఫ్రెండ్ (The Girl Friend)

The Girl Friend Movie Review

Ragadi

By Ragadi

రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో వచ్చిన ది గర్ల్‌ఫ్రెండ్ మంచి ఉద్దేశంతో తీసిన సినిమా అయినా, స్క్రీన్‌పై పూర్తిగా స్ట్రాంగ్ ఇంపాక్ట్ ఇవ్వలేకపోయింది. కథలో కొత్తదనం పెద్దగా లేకపోవడం, ముఖ్యంగా మొదటి సగం చాలా...

రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో వచ్చిన ది గర్ల్‌ఫ్రెండ్ మంచి ఉద్దేశంతో తీసిన సినిమా అయినా, స్క్రీన్‌పై పూర్తిగా స్ట్రాంగ్ ఇంపాక్ట్ ఇవ్వలేకపోయింది. కథలో కొత్తదనం పెద్దగా లేకపోవడం, ముఖ్యంగా మొదటి సగం చాలా స్లోగా నడవడం పెద్ద మైనస్. ప్రేమ, పాజెసివ్‌నెస్, టాక్సిక్ రిలేషన్‌షిప్ లాంటి సీరియస్ టాపిక్స్ తీసుకున్నా, వాటిని ఇంకా షార్ప్‌గా చూపించాల్సింది. రష్మిక మందన్న నటన బాగుంది, ఎమోషనల్ సీన్స్‌లో ఆమె నిజాయితీ కనిపిస్తుంది. కానీ ఆమె క్యారెక్టర్ గ్రోత్ కొంచెం రిపిటేటివ్‌గా అనిపిస్తుంది. దీక్షిత్ శెట్టి పాత్రకి సరైన డెప్త్ ఇవ్వలేదు అనిపిస్తుంది, అందుకే అతని ప్రవర్తనకు సరైన జస్టిఫికేషన్ రాకపోతుంది. స్క్రీన్‌ప్లే చాలా చోట్ల ల్యాగ్ అవుతుంది, కొన్ని సీన్స్ కేవలం మెసేజ్ చెప్పడానికే పెట్టినట్టు అనిపిస్తాయి. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఓకే అనిపించినా, గుర్తుండిపోయేలా ఏమీ లేదు. క్లైమాక్స్ కూడా ఆశించినంత స్ట్రాంగ్‌గా కాకుండా సేఫ్‌గా ముగించారు. మొత్తానికి ఇది ఎంటర్‌టైన్ చేసే సినిమా కంటే, ఒక అవగాహన కలిగించే ప్రయత్నం చేసిన సినిమా. కానీ ఆ ప్రయత్నం పూర్తిగా క్లిక్ కాలేదు. పేషెన్స్ ఉన్నవాళ్లకి ఓసారి చూడొచ్చు, కానీ హై ఎక్స్‌పెక్టేషన్స్‌తో వెళ్తే నిరాశే.

5.0
out of 10

Average

Why MRO?