Register as a Reviewer
Home Reviews Media Reviews

Media Reviews

Reviews from top media outlets, YouTube channels, and publications

703
Total Reviews
Showing 361–372 of 703 media reviews
ఉస్తాద్ భగత్ సింగ్ (Ustaad Bhagat Singh)

Ustaad Bhagat Singh Movie Review

ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ అంటూ ఆడియన్స్ ముందుకు వచ్చిన పవన్‌ కళ్యాణ్‌ వన్ మ్యాన్ షో తో సినిమాని నడిపించాడు. డాన్సుల కోసం, ఫైట్స్ కోసం బాగానే కష్టపడ్డాడు. మాస్‌ డైలాగ్‌ లతో మెప్పించాడు. ఇక శ్రీలీల పాత్ర సె...

ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ అంటూ ఆడియన్స్ ముందుకు వచ్చిన పవన్‌ కళ్యాణ్‌ వన్ మ్యాన్ షో తో సినిమాని నడిపించాడు. డాన్సుల కోసం, ఫైట్స్ కోసం బాగానే కష్టపడ్డాడు. మాస్‌ డైలాగ్‌ లతో మెప్పించాడు. ఇక శ్రీలీల పాత్ర సెకండాఫ్‌ లో వస్తుంది. ఆమెకి మంచి పాత్ర పడింది. రాశి పాత్రకి పెద్దగా స్కోప్ లేనట్టు ఉంటుంది. సీఎంగా, హీరోకి గురువుగా కేఎస్‌ రవికుమార్‌ బాగా నటించాడు. నల్ల నాగప్పగా విలన్‌ పాత్రలో పార్థిబన్‌ బాగా సూట్‌ అయ్యాడు. రాంకీ డీజీపీగా గెస్ట్ రోల్‌లో కనిపించాడు. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం గొప్పగా లేదు. థమన్‌ బీజీఎం కూడా రొటీన్‌ గానే ఉంది. ఇప్పుడు కమర్షియల్‌ సినిమాలను జనం పెద్దగా చూడటం లేదు. అయినా ఇలాంటి సినిమా చేయడం హరీష్‌ చేసిన సాహసమనే చెప్పాలి. కాకపోతే అభిమానులకు కావాల్సిన విధంగా మూవీని రూపొందించారు. అన్ని అంశాలను పర్‌ఫెక్ట్ గా మేళవించి రూపొందించారు. సినిమాలో ట్విస్ట్ లు ఉన్నా, అవి పెద్దగా కిక్‌ ఇవ్వవు. రొటీన్‌ ఫీలింగ్‌నే తెస్తాయి. ఓవరాల్ గా సినిమాపై తక్కువ అంచనాలు పెట్టుకుని చూస్తే ఓ మోస్తరు ఎంజాయ్ చేయొచ్చు.

6.0
out of 10

Above Average

ఉస్తాద్ భగత్ సింగ్ (Ustaad Bhagat Singh)

Ustaad Bhagat Singh Movie Review

గబ్బర్ సింగ్ తర్వాత పవన్ కళ్యాణ్ - హరీష్ శంకర్ కాంబో లో సెట్టయిన మూవీ కావడంతో ఉస్తాద్ భగత్ సింగ్ పై భారీ అంచనాలు పెరిగిపోగా, సినిమా మాత్రం చాలా రోజులు షూటింగ్ జరుపుకుని తాజాగా థియేటర్లలో రిలీజ్ అయింది...

గబ్బర్ సింగ్ తర్వాత పవన్ కళ్యాణ్ - హరీష్ శంకర్ కాంబో లో సెట్టయిన మూవీ కావడంతో ఉస్తాద్ భగత్ సింగ్ పై భారీ అంచనాలు పెరిగిపోగా, సినిమా మాత్రం చాలా రోజులు షూటింగ్ జరుపుకుని తాజాగా థియేటర్లలో రిలీజ్ అయింది. అయితే థియేటర్లలో మిక్స్డ్ రెస్పాన్స్ తెచ్చుకున్న ఈ సినిమా కథా, కథనాల పరంగా నిరాశ పరిచింది. దర్శకుడు హరీష్ తన టేకింగ్ తో మెప్పించినా, ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లే రాసుకోవడంలో తడబడ్డాడు. ముందే నార్మల్ స్టోరీ ఫ్యాన్స్ కోసం మాత్రమే తీస్తున్నానని క్లారిటీ ఇచ్చాడు కాబట్టి, లో అంచనాలు పెట్టుకుని ఆడియన్స్ థియేటర్లకు వెళ్తే బాగుంటుంది. పైగా ఎడిటింగ్ విషయంలో జాగ్రత్త పడాల్సింది. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. ఓవరాల్ గా థియేటర్లలో సినిమా ఫ్యాన్స్ కి బాగా నచ్చుతుంది. అలాగే రెగ్యులర్ మూవీ లవర్స్ కి కూడా ఓ మోస్తరు నచ్చోచ్చు. కానీ కొత్తదనం ఆశిస్తే నిరాశ తప్పదు.

6.0
out of 10

Above Average

ఉస్తాద్ భగత్ సింగ్ (Ustaad Bhagat Singh)

Ustaad Bhagat Singh Movie Review

Gulte

By Gulte

ఉస్తాద్ భగత్ సింగ్ అంటూ ఆడియన్స్ ముందుకు వచ్చిన పవన్ కళ్యాణ్ థియేటర్లలో ఉగాది నుండి సందడి చేస్తున్నాడు. అయితే సినిమా మిశ్రమ స్పందన తెచ్చుకుంది. కథ, కథనాల్లో బలం లోపించగా, డైరెక్షన్ పరంగా హరీష్ శంకర్ త...
ఉస్తాద్ భగత్ సింగ్ అంటూ ఆడియన్స్ ముందుకు వచ్చిన పవన్ కళ్యాణ్ థియేటర్లలో ఉగాది నుండి సందడి చేస్తున్నాడు. అయితే సినిమా మిశ్రమ స్పందన తెచ్చుకుంది. కథ, కథనాల్లో బలం లోపించగా, డైరెక్షన్ పరంగా హరీష్ శంకర్ తన వంతు న్యాయం చేసాడు. ఇక సినిమా మొత్తం పవన్ కళ్యాణ్ వన్ మ్యాన్ షోగా నడిపించాడని చెప్పొచ్చు. శ్రీ లీల, రాశి ఖన్నా పాత్రలు ఇంకా బాగా రాసుకోవలసింది. ఓవరాల్ గా 'ఉస్తాద్ భగత్ సింగ్'లో పవన్ కళ్యాణ్ అభిమానులకు, మాస్ ఆడియన్స్‌కు ఖచ్చితంగా నచ్చే కొన్ని సన్నివేశాలు ఉన్నాయి. కానీ, ఫ్యాన్స్ 'గబ్బర్ సింగ్'తో పోలిస్తే ఏమాత్రం సరిపోదు. పవన్ కళ్యాణ్ కి సంబంధించిన సీన్స్ విషయంలో మాత్రం ఆయన అభిమానులు పెద్దగా కంప్లైంట్ చేయకుండా ఈ సినిమా చూడటానికి సరిపడా అంశాలు ఉన్నాయి. కథానాయకుల స్టార్‌డమ్‌పై ఎక్కువగా ఆధారపడే మూస ధోరణి వాణిజ్య వినోద చిత్రాలను చూడటానికి సౌకర్యంగా భావించే ఇతర వర్గాల ప్రేక్షకులు మాత్రమే ఈ సినిమాను థియేటర్‌లో చూడటానికి ప్రయత్నించవచ్చు.
5.0
out of 10

Average

ఉస్తాద్ భగత్ సింగ్ (Ustaad Bhagat Singh)

Ustaad Bhagat Singh Movie Review

పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ కాంబోలో వచ్చిన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా సాధారణ ప్రేక్షకుల అంచనాలకు దిగువన.. పవర్ స్టార్ ఫ్యాన్స్ అంచనాలు మ్యాచ్ అయ్యేలా చేసిన పూర్తిస్థాయి కమర్షియల్, ఎంటర్‌టైన్‌మెంట్‌తో సాగే...
పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ కాంబోలో వచ్చిన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా సాధారణ ప్రేక్షకుల అంచనాలకు దిగువన.. పవర్ స్టార్ ఫ్యాన్స్ అంచనాలు మ్యాచ్ అయ్యేలా చేసిన పూర్తిస్థాయి కమర్షియల్, ఎంటర్‌టైన్‌మెంట్‌తో సాగే ప్యాకేజ్డ్ మూవీ. పవన్ కల్యాణ్ వన్ మ్యాన్ షో, శ్రీలీల, రాశీ ఖన్నా గ్లామర్ కోసం ఈ సినిమాను చూడాలి. హరీష్ శంకర్‌లో కొత్తగా ఏమి ట్రై చేయలేదు కానీ.. తన మార్కును బ్రహ్మండంగా ప్రజెంట్ చేశాడు. అలాగే సినిమాటోగ్రఫి ఈ సినిమాను మరింత రిచ్‌గా మార్చింది. పవన్ కల్యాణ్ కోసం ప్రత్యేకంగా శ్రద్ద తీసుకొని రాసిన డైలాగ్స్ బాగున్నాయి. దేవీ శ్రీ ప్రసాద్ పాటలు, తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకు ప్లస్ పాయింట్స్. మైత్రీ మూవీ మేకర్స్ అనుసరించిన నిర్మాణ విలువలు హై స్టాండర్డ్‌లో ఉన్నాయి. అతిగా ఆశపడితే నిరాశ తప్పదు.. అంచనాలు లేకుండా వెళ్తే రెండున్నర గంటలపాటు వినోదాన్ని ఎంజాయ్ చేయొచ్చు.
6.0
out of 10

Above Average

ఉస్తాద్ భగత్ సింగ్ (Ustaad Bhagat Singh)

Ustaad Bhagat Singh Movie Review

Tupaki

By Tupaki

అభిమానులను అలరించడమే లక్ష్యంగా తీసిన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో పవన్ కళ్యాణ్ వారు మెచ్చే రీతిలో కనిపించాడు. ఆయన చాలా ఏళ్ల తర్వాత ఫన్ టచ్ ఉన్న పాత్ర ఇందులో చేసారు. ఓవైపు పవర్ ఫుల్ గా సాగుతూనే.. ఇంకోవ...
అభిమానులను అలరించడమే లక్ష్యంగా తీసిన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో పవన్ కళ్యాణ్ వారు మెచ్చే రీతిలో కనిపించాడు. ఆయన చాలా ఏళ్ల తర్వాత ఫన్ టచ్ ఉన్న పాత్ర ఇందులో చేసారు. ఓవైపు పవర్ ఫుల్ గా సాగుతూనే.. ఇంకోవైపు వినోదం కూడా పంచుతుందా పాత్ర. అయితే శ్రీలీల.. పవన్ పక్కన కొంచెం చిన్నమ్మాయిలా కనిపించింది. గీత పాత్రలో ఆమె లుక్.. అభినయం బాగానే సాగాయి. రాశి ఖన్నా పాత్ర కాస్త గ్లామర్ కోణంలో సాగింది. పార్తీబన్ మంచి పేరున్న నటుడే అయినా ఆయనకు రొటీన్ విలన్ పాత్ర ఇచ్చాడు హరీష్ శంకర్. ఇక గబ్బర్ సింగ్ కాంబినేషన్ అంటే.. పాటల మీద చాలా అంచనాలు పెట్టుకుంటాం. కానీ దేవిశ్రీ ప్రసాద్ ఇప్పుడిచ్చిన పాటలు ఓ మోస్తరుగా అనిపిస్తాయి. థమన్ బీజీఎమ్ కూడా కొన్ని చోట్ల మరీ లౌడ్ బీజీఎంతో ఇబ్బంది పెట్టాడు. నిర్మాణ విలువలు సినిమాకు అవసరమైన స్థాయిలో ఉన్నాయి. ఓవరాల్ గా కథలో కొత్తదనం లేదు కానీ.. పవన్ శైలికి తగ్గ ఎంటర్టైనింగ్.. మరియు ఎలివేషన్ సీన్ల మీద బండి నడిపించాడు. 'ఓజీ' స్థాయిలో కాదు కానీ.. పవన్ ను అభిమానులు మెచ్చేలా చూపించాడు హరీష్ శంకర్.
5.0
out of 10

Average

ఉస్తాద్ భగత్ సింగ్ (Ustaad Bhagat Singh)

Ustaad Bhagat Singh Movie Review

పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన 'ఉస్తాద్ భగత్ సింగ్' మూవీ ఫైనల్ గా థియేటర్లలో రిలీజ్ కాగా, ఆడియన్స్ నుండి మిక్స్డ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇక పవన్ కళ్యాణ్ ఒక పవర్ ఫుల్ పోలీసాఫీసర్ గా మరోసారి మెప్పించారు....
పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన 'ఉస్తాద్ భగత్ సింగ్' మూవీ ఫైనల్ గా థియేటర్లలో రిలీజ్ కాగా, ఆడియన్స్ నుండి మిక్స్డ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇక పవన్ కళ్యాణ్ ఒక పవర్ ఫుల్ పోలీసాఫీసర్ గా మరోసారి మెప్పించారు. శ్రీలీల ఈ సినిమాలో చాలా క్యూట్ గా కనిపిస్తుంది. బాగా నటించింది కూడా, రాశీఖన్నా పాత్ర కు మాత్రం పెద్దగా ఇంపార్టెన్స్ లేదు. నాగప్ప గా నెగిటివ్ షేడ్స్ లో పార్తీబన్, సీఎం గా, KS రవికుమార్ సహా కిల్లి క్రాంతి, టెంపర్ వంశీ వారి పాత్రల పరిధి మేరకు మెప్పించారు. ఇక టెక్నికల్ గా సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. పాటలు యావరేజ్ గా ఉండగా, ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి వర్క్ బాగుంది. అలాగే హరీష్ శంకర్ అందించిన కొన్ని పవర్ ఫుల్ డైలాగ్స్ సినిమాకి ప్లస్ అవుతాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి. ఓవరాల్ గా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా ఫ్యాన్స్ కి మంచి ఫీస్ట్ ఇచ్చే కమర్షియల్ ఎంటర్టైనర్ సినిమా అవుతుంది. కానీ నార్మల్ ఆడియన్స్ ని అంతగా మెప్పించదు.
6.0
out of 10

Above Average

ఉస్తాద్ భగత్ సింగ్ (Ustaad Bhagat Singh)

Ustaad Bhagat Singh Movie Review

పవన్ కళ్యాణ్ – హరీష్ శంకర్ కాంబో అంటేనే భారీ ఎక్స్‌పెక్టేషన్స్.. ‘గబ్బర్ సింగ్’ రేంజ్ మ్యాజిక్ మళ్లీ రిపీట్ అవుతుందా అనే ఆసక్తితో వచ్చిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఆడియన్స్ ని ఊహించిన రేంజ్ లో ఎంటర్టైన్ చేయ...

పవన్ కళ్యాణ్ – హరీష్ శంకర్ కాంబో అంటేనే భారీ ఎక్స్‌పెక్టేషన్స్.. ‘గబ్బర్ సింగ్’ రేంజ్ మ్యాజిక్ మళ్లీ రిపీట్ అవుతుందా అనే ఆసక్తితో వచ్చిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఆడియన్స్ ని ఊహించిన రేంజ్ లో ఎంటర్టైన్ చేయకపోయినా, ఫ్యాన్స్ కి మాత్రం ట్రీట్ ఇస్తుంది. ముఖ్యంగా సెకండాఫ్ పూర్తిగా ఫ్యాన్ అండ్ మాస్ స్టఫ్‌గా డిజైన్ చేశారు. వింటేజ్ సాంగ్స్‌తో వచ్చే పవన్ మూమెంట్స్ థియేటర్లలో ఫ్యాన్స్‌ని ఊగేలా చేస్తాయి. పవన్ స్క్రీన్ ప్రెజెన్స్, ఎనర్జీ, యాక్షన్ సీన్స్ సినిమా మొత్తాన్ని మోస్తాయి. పాతబస్తీ సీక్వెన్స్‌లో గబ్బర్ సింగ్ వైబ్స్ స్పష్టంగా కనిపిస్తాయి. అయితే ఫస్టాఫ్ మాత్రం అంతగా ఎంగేజ్ చేయదు. స్టోరీ నెమ్మదిగా సాగుతూ కొన్ని చోట్ల ఫ్లాట్‌గా అనిపిస్తుంది. ట్విస్ట్స్ ఉన్నా ఇంపాక్ట్ తక్కువగా ఉంటుంది. హీరోయిన్స్ రాశీ ఖన్నా, శ్రీలీల తమ పాత్రల్లో ఓకే. విలన్ పార్థిబన్ పెర్ఫార్మెన్స్ బాగున్నా క్యారెక్టర్ మరింత స్ట్రాంగ్‌గా ఉండాల్సింది. టెక్నికల్‌గా విజువల్స్ రిచ్‌గా ఉన్నాయి కానీ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మాత్రం మిస్ అయ్యిన ఫీలింగ్ ఇస్తుంది. ఓవరాల్‌గా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ పూర్తిగా పవన్ ఫ్యాన్స్ కోసం తీసిన మాస్ ఎంటర్టైనర్. స్టోరీలో కొత్తదనం తక్కువ అయినా, పవన్ స్వాగ్ & యాక్షన్ కోసం ఒకసారి చూడొచ్చు

6.0
out of 10

Above Average

ఉస్తాద్ భగత్ సింగ్ (Ustaad Bhagat Singh)

Ustaad Bhagat singh movie Review ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా అభిమానుల్లో భారీ అంచనాల మధ్య విడుదలైంది. స్క్రీన్‌పై పవన్ కనిపించే ప్రతి సీన్‌లో ఆయన స్వాగ్, ఎనర్జీ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా యా...
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా అభిమానుల్లో భారీ అంచనాల మధ్య విడుదలైంది. స్క్రీన్‌పై పవన్ కనిపించే ప్రతి సీన్‌లో ఆయన స్వాగ్, ఎనర్జీ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాలు, డైలాగ్ డెలివరీ ఫ్యాన్స్‌కు పూర్తి సంతృప్తినిస్తాయి. అయితే కథ, కథనం విషయానికి వస్తే దర్శకుడు హరీష్ శంకర్ ఈసారి పూర్తిగా మెప్పించలేకపోయాడు. ఫస్టాఫ్‌లో పాత కథన శైలి స్పష్టంగా కనిపిస్తుంది. సెకండాఫ్‌లో కొన్ని ఎమోషనల్, మాస్ సీన్స్ బాగున్నప్పటికీ మొత్తం సినిమా మీద ప్రభావం చూపలేకపోయాయి. తొలిప్రేమ రిఫరెన్స్ సీన్ ప్రత్యేకంగా నిలుస్తుంది. హీరోయిన్‌లుగా శ్రీలీల, రాశీ ఖన్నా గ్లామర్ పరంగా ఆకట్టుకున్నా, వారి పాత్రలకు పెద్దగా ప్రాధాన్యం లేదు. విలన్ పాత్ర బలహీనంగా ఉండటం సినిమాకు మైనస్. టెక్నికల్‌గా విజువల్స్ బాగున్నా, ఎడిటింగ్ లోపాలు, లౌడ్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కొంత ఇబ్బంది కలిగిస్తాయి. మొత్తం మీద ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రం పవన్ కళ్యాణ్ అభిమానులను ప్రధానంగా దృష్టిలో పెట్టుకుని రూపొందించబడింది. సాధారణ ప్రేక్షకులకు మాత్రం ఇది సాధారణ కమర్షియల్ ఎంటర్టైనర్‌గా అనిపించే అవకాశముంది.
5.0
out of 10

Average

ఉస్తాద్ భగత్ సింగ్ (Ustaad Bhagat Singh)

Ustaad Bhagat singh Movie Review

పవన్ కళ్యాణ్ సినిమా అంటే ఫ్యాన్స్‌కు ఎప్పుడూ పండగే. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ (Ustaad Bhagat Singh)లో కూడా ఆయన స్క్రీన్ ప్రెజెన్స్, ఎనర్జీ, స్వాగ్ బాగానే కనిపిస్తాయి. కానీ కంటెంట్ విషయంలో సినిమా పూర్తిగా మ...
పవన్ కళ్యాణ్ సినిమా అంటే ఫ్యాన్స్‌కు ఎప్పుడూ పండగే. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ (Ustaad Bhagat Singh)లో కూడా ఆయన స్క్రీన్ ప్రెజెన్స్, ఎనర్జీ, స్వాగ్ బాగానే కనిపిస్తాయి. కానీ కంటెంట్ విషయంలో సినిమా పూర్తిగా మెప్పించదు. దర్శకుడు హరీష్ శంకర్ (Harish Shankar) మాస్ ఎలివేషన్స్‌పై ఎక్కువ ఫోకస్ పెట్టి, ఎమోషన్‌ను కొంత మిస్ అయ్యాడు. ఫస్టాఫ్ ఎక్కువగా ఓల్డ్ వైన్ న్యూ బాటిల్ ఫీలింగ్ ఇస్తుంది. సెకండాఫ్ మాత్రం కొంచెం బెటర్‌గా ఉంటుంది. ముఖ్యంగా తొలిప్రేమ రిఫరెన్స్ సీన్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. పవన్ కళ్యాణ్ యాక్షన్ సీన్స్, డైలాగ్ డెలివరీ ఫ్యాన్స్‌కు బాగా నచ్చుతాయి. పోలీస్ స్టేషన్ సీన్, ఇంటర్వెల్ బ్యాంగ్ హైలైట్స్‌గా నిలుస్తాయి. అయితే రొటీన్ స్టోరీ, బలహీనమైన విలన్ ట్రాక్, వర్కౌట్ కాని కామెడీ సినిమాకు మైనస్. శ్రీలీల, రాశీ ఖన్నా పాత్రలు పరిమితంగానే ఉంటాయి. పార్థిబన్ నటన బాగున్నా, క్యారెక్టర్ స్ట్రాంగ్‌గా అనిపించదు. టెక్నికల్‌గా చూస్తే విజువల్స్ రిచ్‌గా ఉన్నా, ఎడిటింగ్ వీక్‌గా ఉంది, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కొంచెం లౌడ్‌గా అనిపిస్తుంది. మొత్తానికి ఈ సినిమా పవర్ స్టార్ ఫ్యాన్స్‌ను మాత్రం ఎంటర్టైన్ చేస్తుంది, కానీ సాధారణ ప్రేక్షకులకు ఇది రొటీన్ కమర్షియల్ సినిమా అనిపించే అవకాశం ఉంది.
5.0
out of 10

Average

విష్ణు విన్యాసం (Vishnu Vinyasam)

Vishnu Vinyasam movie Review

శ్రీ విష్ణు హీరోగా, యదునాథ్ మారుతీ రావు దర్శకత్వంలో తెరకెక్కిన “విష్ణు విన్యాసం” కామెడీ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే సినిమా టెక్నికల్‌గా బాగానే ఉన్నా, కంటెంట్ పరంగా మాత్రం మిక్స్‌...

శ్రీ విష్ణు హీరోగా, యదునాథ్ మారుతీ రావు దర్శకత్వంలో తెరకెక్కిన “విష్ణు విన్యాసం” కామెడీ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే సినిమా టెక్నికల్‌గా బాగానే ఉన్నా, కంటెంట్ పరంగా మాత్రం మిక్స్‌డ్ ఫీలింగ్ ఇస్తుంది. మ్యూజిక్ డైరెక్టర్ రథన్ అందించిన పాటలు పర్వాలేదనిపించినా పెద్దగా గుర్తుండవు. అయితే నేపథ్య సంగీతం కొన్ని సన్నివేశాల్లో కామెడీని బాగా హైలైట్ చేసింది. సినిమాటోగ్రాఫర్ సాయి శ్రీరామ్ అందించిన విజువల్స్ మాత్రం కలర్‌ఫుల్‌గా, కనువిందు చేసేలా ఉన్నాయి. నిర్మాణ విలువలు కూడా రిచ్‌గా కనిపిస్తాయి. ఇక నెగెటివ్ పాయింట్స్ విషయానికి వస్తే… ఎడిటింగ్‌లో లోపాలు స్పష్టంగా కనిపిస్తాయి. స్క్రీన్‌ప్లేలో క్లారిటీ లేకపోవడం, సన్నివేశాలు వెనకా ముందు అనిపించడం సినిమా ప్రభావాన్ని తగ్గించాయి. కథ కూడా చాలా చిన్నదిగా ఉండటం, దర్శకుడు ఏమి చెప్పాలనుకున్నారో స్పష్టంగా కనెక్ట్ కాకపోవడం మైనస్. అయితే కామెడీ ట్రాక్ మాత్రం కొన్ని చోట్ల బాగా వర్కవుట్ అయ్యింది. శ్రీ విష్ణు తన స్టైల్‌లో ఫ్రీడమ్ తీసుకుని చేసిన నటనతో నవ్వులు పంచే ప్రయత్నం చేశాడు. ఆయన పెర్ఫార్మెన్స్ సినిమాకు ప్రధాన బలం. మొత్తంగా చూస్తే… టెక్నికల్‌గా బాగున్నా, బలహీనమైన కథనం వల్ల “విష్ణు విన్యాసం” పూర్తిగా ఆకట్టుకోలేకపోయింది. కొన్ని కామెడీ సన్నివేశాల కోసం మాత్రమే ఒకసారి చూడదగ్గ సినిమా.

6.0
out of 10

Above Average

విష్ణు విన్యాసం (Vishnu Vinyasam)

Vishnu Vinyasam movie review

“విష్ణు విన్యాసం”… ఒక ఐడియాగా చూస్తే ఇది ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్. జాతకాలు, వాస్తు వంటి నమ్మకాల మీద ఒక లైట్ కామెడీ డ్రామా చేయాలనే ప్రయత్నం కనిపిస్తుంది. కానీ ఆ ఐడియాను స్క్రీన్‌పై కన్విన్సింగ్‌గా మలచడ...

“విష్ణు విన్యాసం”… ఒక ఐడియాగా చూస్తే ఇది ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్. జాతకాలు, వాస్తు వంటి నమ్మకాల మీద ఒక లైట్ కామెడీ డ్రామా చేయాలనే ప్రయత్నం కనిపిస్తుంది. కానీ ఆ ఐడియాను స్క్రీన్‌పై కన్విన్సింగ్‌గా మలచడంలో సినిమా తడబడింది. శ్రీ విష్ణు తనకు బాగా తెలిసిన జోనర్‌లోనే ఉన్నాడు. ఆయన కామెడీ టైమింగ్, డైలాగ్ డెలివరీ కొన్ని చోట్ల పని చేస్తాయి. కానీ అదే ప్యాటర్న్ రిపీట్ అవ్వడం వల్ల కొత్తదనం అనిపించదు. క్యారెక్టర్‌లో డెప్త్ కంటే మేనరిజమ్స్ మీదే ఎక్కువ ఫోకస్ పెట్టినట్టు అనిపిస్తుంది. సినిమాలో మీమ్ కల్చర్‌ను ఎక్కువగా వాడటం పెద్ద మైనస్. అది కథలో భాగంగా కాకుండా, ఆడియన్స్‌ను ఫోర్స్ చేసి నవ్వించాలనే ప్రయత్నంగా కనిపిస్తుంది. ఫలితంగా కామెడీ నేచురల్‌గా రాదు. పాటలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా సినిమా టోన్‌కు సరైన సపోర్ట్ ఇవ్వలేకపోయాయి. నేరేషన్ విషయంలో ఫస్టాఫ్ కొంతవరకు హోల్డ్ చేసినా, సెకండాఫ్‌లో రైటింగ్ వీక్ అవ్వడంతో సినిమా గ్రాఫ్ పడిపోతుంది. ముఖ్యంగా మెయిన్ కాన్‌ఫ్లిక్ట్‌కు సరైన ఎమోషనల్ వెయిట్ ఇవ్వలేకపోయారు.

5.0
out of 10

Average

విష్ణు విన్యాసం (Vishnu Vinyasam)

Vishnu Vinyasam movie Review

అయ్యో బాబోయ్… ఈ విష్ణు విన్యాసం చూడటం కూడా ఓ విన్యాసమే అయ్యింది స్టోరీ అంటే చాలా సింపుల్… జాతకాలు, వాస్తు, హీరో పిచ్చి… ఇవన్నీ కలిపి కామెడీ చేయాలని ట్రై చేశారు. కానీ స్క్రీన్ మీద చూసేసరికి “ఇదంతా ఎక్క...

అయ్యో బాబోయ్… ఈ విష్ణు విన్యాసం చూడటం కూడా ఓ విన్యాసమే అయ్యింది స్టోరీ అంటే చాలా సింపుల్… జాతకాలు, వాస్తు, హీరో పిచ్చి… ఇవన్నీ కలిపి కామెడీ చేయాలని ట్రై చేశారు. కానీ స్క్రీన్ మీద చూసేసరికి “ఇదంతా ఎక్కడో చూసినట్టుంది కదా?” అనిపిస్తుంది. శ్రీ విష్ణు మాత్రం తన స్టైల్‌లో వన్ లైనర్స్ కొడుతూ సినిమాను లాగడానికి ట్రై చేశాడు. కొన్ని చోట్ల నవ్వు వస్తుంది… కానీ చాలా చోట్ల అదే కామెడీ రిపీట్ అవుతూ బోర్ కొడుతుంది. ముఖ్యంగా ఈ మీమ్ మ్యూజిక్… మీమ్ రిఫరెన్స్‌లు… అబ్బా! సినిమా చూస్తున్నామా లేక రీల్స్ చూస్తున్నామా అన్న కన్ఫ్యూజన్. పాటలు వస్తే “సరే… అయిపోండి ప్లీజ్” అనిపించే రేంజ్ సెకండాఫ్ కి వెళ్లేసరికి సినిమా పూర్తిగా స్లో అయి… డ్రాగ్ ఫీల్ వస్తుంది. మొత్తానికి చెప్పాలంటే… పూల చొక్కా వేసుకుని వెళ్తే కూడా ఫ్రెష్ ఫీలింగ్ రాదు

5.0
out of 10

Average

Why MRO?