హ్యాపీ జర్నీ (Happy Journey)
Happy Journey : అభిరాం నాయుడు డైరెక్షన్ లో తెరకెక్కిన లేటెస్ట్ లేడీ ఓరియెంటెడ్ మూవీ "హ్యాపీ జర్నీ". ప్యారిస్ ట్రిప్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీలో సీనియర్ ఆర్టిస్ట్ అన్నపూర్ణ, ఆమని, ఘాన్సీ, పాయల్ రాధాకృష్ణ తదితరులు నటించిన ఈ సినిమా తాజాగా థియేటర్లలో విడుదలై మిక్స్డ్ రెస్పాన్స్ అందుకుంది.
Available in:
Reviews
What critics and the public are saying about హ్యాపీ జర్నీ (Happy Journey)
Media Reviews
5 Avg: 5.4/10Above Average
Happy Journey Movie Review
ఏడుగురు విభిన్న వయస్కులైన మహిళల ఫ్రాన్స్ పర్యటన నేపథ్యంలో తెరకెక్కిన రోడ్-కామెడీ డ్రామా ‘హ్యాపీ జర్నీ’. వినోదం, ఫ్యామిలీ ఎమోషన్స్ కలబోతగా వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన తెచ్చుకుంది. కథ పరంగా సింపుల్ గా ఉన్నా, ఎంటర్టైన్మెంట్ కే డై రెక్టర్ ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు. గోవింద్, అప్పారావు...
ఏడుగురు విభిన్న వయస్కులైన మహిళల ఫ్రాన్స్ పర్యటన నేపథ్యంలో తెరకెక్కిన రోడ్-కామెడీ డ్రామా ‘హ్యాపీ జర్నీ’. వినోదం, ఫ్యామిలీ ఎమోషన్స్ కలబోతగా వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన తెచ్చుకుంది. కథ పరంగా సింపుల్ గా ఉన్నా, ఎంటర్టైన్మెంట్ కే డై రెక్టర్ ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు. గోవింద్, అప్పారావు పాత్రల పరిచయంతో వేగంగా మొదలయ్యే ప్రథమార్ధం, ఫ్రాన్స్ అందాలు మరియు 'ఎవడి గోల వాడిదే' శైలిలో సాగే హాయిగా నవ్వించే కామెడీతో సాగిపోతుంది.
అయితే ఫస్టాఫ్ మెప్పించినప్పటికీ, ద్వితీయార్ధంలో నాటకీయత ఎక్కువవ్వడం, పాతకాలపు భావోద్వేగాలు మరియు బలవంతపు సామాజిక అంశాల వల్ల కథనం కాస్త ట్రాక్ తప్పుతుంది. ఎమోషనల్ సీన్లు అనుకున్నంతగా పండలేదు. చివరిలో వచ్చే ఊహించని క్లైమాక్స్ ట్విస్ట్, కుటుంబ విలువల సందేశం సినిమాను సరైన ముగింపు వైపు నడిపించాయి. సెకండాఫ్ లోపాలను కాస్త పక్కన పెడితే, వినోదం మరియు క్లైమాక్స్ కోసం ఫ్యామిలీతో కలిసి చూడదగ్గ క్లీన్ డీసెంట్ ఎంటర్‌టైనర్!
Below Average
Happy Journey movie review
This weekend does not have many notable theatrical releases, but Happy Journey stands out because of its ensemble cast.Starring Annapurna, Aamani, Jhansi, Vamsi, Payal Radhakrishna, Sunaina, Ravi Siva Teja, Jinisha Alishetty, Roopa Srinivas, Prudhvi Dandamudi and others.HighlightsInteresting basic i...
This weekend does not have many notable theatrical releases, but Happy Journey stands out because of its ensemble cast.
Starring Annapurna, Aamani, Jhansi, Vamsi, Payal Radhakrishna, Sunaina, Ravi Siva Teja, Jinisha Alishetty, Roopa Srinivas, Prudhvi Dandamudi and others.
Highlights
Interesting basic idea
A few decent sequences
European locations
Drawbacks
Weak screenplay
Meandering narrative
Repetitive drinking and free-stuff comedy
Emotional portions fail to connect
Lack of consistent humour
Despite a reasonably promising idea, Happy Journey fails to turn its premise into an engaging film. The comedy is inconsistent, the emotions do not connect, and the screenplay keeps wandering.
The journey ultimately feels more tiring than entertaining.
Bottom Line: Tiring Journey
Above Average
Happy Journey Movie Review
హ్యాపీ జర్నీ సినిమాలో డైరెక్టర్ ఎంచుకున్న పాయింట్, చెప్పాలనుకున్న సందేశం చాలా బాగున్నాయి. ఫస్టాఫ్, సెకండాఫ్ లో అక్కడక్కడ వచ్చే కామెడీ సన్నివేశాలు ప్రేక్షకులను నవ్విస్తాయి. ముఖ్యంగా వంశీధర్ గౌడ్ అద్భుతమైన టైమింగ్‌తో ఆకట్టుకోగా.. రవి శివతేజతో ఆయన కాంబినేషన్ బాగుంది.కొన్ని అనవసరమైన సీన్లు, కొన్ని రిపీ...
హ్యాపీ జర్నీ సినిమాలో డైరెక్టర్ ఎంచుకున్న పాయింట్, చెప్పాలనుకున్న సందేశం చాలా బాగున్నాయి. ఫస్టాఫ్, సెకండాఫ్ లో అక్కడక్కడ వచ్చే కామెడీ సన్నివేశాలు ప్రేక్షకులను నవ్విస్తాయి. ముఖ్యంగా వంశీధర్ గౌడ్ అద్భుతమైన టైమింగ్‌తో ఆకట్టుకోగా.. రవి శివతేజతో ఆయన కాంబినేషన్ బాగుంది.
కొన్ని అనవసరమైన సీన్లు, కొన్ని రిపీటెడ్ సన్నివేశాల వల్ల కథనం కాస్త నెమ్మదించినా పరవాలేదనిపిస్తుంది. ప్రతినాయిక పాత్రకు సంబంధించిన భావోద్వేగాలను ఇంకా బలంగా చూపించి ఉంటే బాగుండేది. కామెడీకి, ఎమోషన్ కు మధ్య సరైన సమతుల్యత లోపించినట్లు అనిపిస్తుంది.
ఎడిటింగ్ పర్వాలేదనిపిస్తుంది. హేమంత్ ధోమే కథ బాగున్నా, అభిరామ్ నాయుడు కథనాన్ని మరికొంత గ్రిప్పింగ్ గా తీర్చిదిద్ది ఉంటే సినిమా స్థాయి వేరేలా ఉండేది. ఫైనల్ గా .. 'హ్యాపీ జర్నీ' కొన్ని మంచి నవ్వులు, సందేశం కావాలనుకునేవారికి బెస్ట్ ఛాయిస్.
Above Average
Happy Journey movie Review
అభిరామ్ నాయుడు దర్శకత్వంలో రూపొందిన లేడీ ఓరియెంటెడ్ చిత్రం ‘హ్యాపీ జర్నీ’. అన్నపూర్ణమ్మ, ఝాన్సీ, పాయల్ రాధాకృష్ణ, ఆమని ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా తాజాగా థియేటర్లలో విడుదలై మిక్స్డ్ రెస్పాన్స్ అందుకుంది. ఒక మంచి ఉద్దేశంతో తెరకెక్కిన చిత్రం ‘హ్యాపీ జర్నీ’. దర్శకుడు చెప్పాలనుకున్న సందేశం కొంతమంద...
అభిరామ్ నాయుడు దర్శకత్వంలో రూపొందిన లేడీ ఓరియెంటెడ్ చిత్రం ‘హ్యాపీ జర్నీ’. అన్నపూర్ణమ్మ, ఝాన్సీ, పాయల్ రాధాకృష్ణ, ఆమని ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా తాజాగా థియేటర్లలో విడుదలై మిక్స్డ్ రెస్పాన్స్ అందుకుంది. ఒక మంచి ఉద్దేశంతో తెరకెక్కిన చిత్రం ‘హ్యాపీ జర్నీ’. దర్శకుడు చెప్పాలనుకున్న సందేశం కొంతమంది ప్రేక్షకులకు ఖచ్చితంగా కనెక్ట్ అవుతుంది. ఇక టైటిల్ తోనే ఈ సినిమా ఇచ్చే మెసేజ్ ఏమిటో అర్థమవుతుంది.
అయితే స్క్రీన్ ప్లే సరిగ్గా కుదరకపోవడం వల్ల ‘హ్యాపీ జర్నీ’ అనుకున్న స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. కొన్ని అనవసరమైన సన్నివేశాల వల్ల మంచి సీన్ల ఇంపాక్ట్ తగ్గి, సినిమా ఫ్లో దెబ్బతింది. రిపీటెడ్ సీన్లను తగ్గించి ఉంటే బాగుండేది. ఇక మొత్తంగా చూసుకుంటే.. ‘హ్యాపీ జర్నీ’ అక్కడక్కడా ఓకే అనిపించే ఫన్ డ్రామాగా నిలుస్తుంది. ఇందులో ముఖ్యంగా ఫీమేల్ సెంట్రిక్ పాయింట్, వారితో జెనరేట్ చేసిన ఫన్ అక్కడక్కడా మెప్పిస్తాయి. కానీ కథ, కథనాల్లో కావాల్సిన ఫుల్ ఫ్లెడ్జ్ డెప్త్ మిస్ కావడంతో ఫలితంకి దెబ్బ పడింది. సో చాలా తక్కువ అంచనాలు పెట్టుకుంటే ఈ కామెడీ డ్రామా కనెక్ట్ అవుతుంది.
Average
Happy Journey movie review
హ్యాపీ జర్నీ మూవీ విషయానికి వస్తే... కొంతమంది గ్రూప్ గా ఏదో ఒక ట్రిప్ కి వెళ్లడం, అక్కడ జ్ఞాపకాలు, ఎమోషన్స్ అనే డైలాగ్స్ తో గతంలో అనేక సినిమాలు వచ్చాయి. అలా ఓ ఏడుగురు ఆడవాళ్లు డిఫరెంట్ ఏజ్ ఉన్నవాళ్లు వెళితే ఎలా ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక్కో కథ, ఎమోషన్ పెట్టి ఈ హ్యాపీ జర్నీ సినిమాని తీశారు. అయితే సినిమ...
హ్యాపీ జర్నీ మూవీ విషయానికి వస్తే... కొంతమంది గ్రూప్ గా ఏదో ఒక ట్రిప్ కి వెళ్లడం, అక్కడ జ్ఞాపకాలు, ఎమోషన్స్ అనే డైలాగ్స్ తో గతంలో అనేక సినిమాలు వచ్చాయి. అలా ఓ ఏడుగురు ఆడవాళ్లు డిఫరెంట్ ఏజ్ ఉన్నవాళ్లు వెళితే ఎలా ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక్కో కథ, ఎమోషన్ పెట్టి ఈ హ్యాపీ జర్నీ సినిమాని తీశారు. అయితే సినిమా అంతా వీరి ట్రావెలింగ్ నడుస్తూనే మధ్యమధ్యలో కామెడీ నడుస్తూనే ఒక్కొక్కరి కథ, వ్యథ, కన్నీటి గాధ చూపించారు. ఇవి చూస్తుంటే ఈ కాలంలో ఆడవాళ్లు మగవాళ్ళని దాటేసి, తోసేసి ముందుకు వెళ్లిపోతున్నా ఇంకా దర్శకుడు ఎక్కడో పదేళ్ల క్రితమే ఆగిపోయి అప్పటి సమస్యలని చూపించాడు అనిపిస్తుంది.
అయితే సినిమాలో ఒక్కో పాత్ర ఒక్కోలా బిహేవ్ చేస్తుంది. ఈ ఆడవాళ్ళ మధ్య గొడవలు అవుతాయి. ఆ గొడవలు కూడా కామెడీగానే చూపించారు. అయితే సెకండ్ హాఫ్ అంతా ఎటెటో వెళ్ళిపోతుంది అనుకునే సమయానికి క్లైమాక్స్ లో గోవింద్ ఇచ్చిన ట్విస్ట్ తో హమ్మయ్య బతికించారు అనిపిస్తుంది.ఇక సినిమా చూస్తుంటే వెంకటేష్ జయం మనదేరా ఫస్ట్ హాఫ్ గుర్తుకు రావడం ఖాయం. అలాగే ఫ్రాన్స్ దేశం ట్రావెల్ వ్లోగ్ కూడా చూసినట్టు ఉంటుంది. మొత్తంగా ‘హ్యాపీ జర్నీ’ ఇళ్లల్లో ఉండే ఆడవాళ్లు ఫ్రాన్స్ దేశానికి ట్రిప్ కి వెళ్తే అక్కడ ఏం చేశారు, వాళ్ళ కథేంటి అని కామెడీగా ఎమోషనల్ గా చెప్పే ప్రయత్నం చేశారు.
Public Reviews
4 Avg: 5.5/10Above Average
Happy Journey movie review
Happy Journey Movie ReviewFirst half comedy & France travel vlog vibe = Full Chill! Divya missing interval block = Good Hype!Second half routine emotional drama & forced pseudo-feminism = Major Rodd! Climax Govind twist & family message = Saved the Day! final Verdict: Second half rodd ni...
Happy Journey Movie Review
First half comedy & France travel vlog vibe = Full Chill!
Divya missing interval block = Good Hype!
Second half routine emotional drama & forced pseudo-feminism = Major Rodd!
Climax Govind twist & family message = Saved the Day!
final Verdict: Second half rodd ni baristhe, first half comedy & climax twist kosam friends tho oka sari chuseyochu! other wise better to shift OTT
Average
Happy Journey Movie Review
just now finished 'Happy Journey' movie. overall ga ఒక mixed experience ఇస్తుంది. 7 members different age group ఉన్న ladies ఫ్రాన్స్ ట్రిప్‌కి వెళ్లడం అనే unique concept తో సినిమా స్టార్ట్ అవుతుంది. First half అంతా మంచి full-length comedy, ఫ్రాన్స్ లోకేషన్లతో travel vlog చూస్తున్న ఫీలింగ్ ఇస్తూ చాల...
just now finished 'Happy Journey' movie. overall ga ఒక mixed experience ఇస్తుంది. 7 members different age group ఉన్న ladies ఫ్రాన్స్ ట్రిప్‌కి వెళ్లడం అనే unique concept తో సినిమా స్టార్ట్ అవుతుంది. First half అంతా మంచి full-length comedy, ఫ్రాన్స్ లోకేషన్లతో travel vlog చూస్తున్న ఫీలింగ్ ఇస్తూ చాలా సరదాగా సాగిపోతుంది.
కానీ, సెకండ్ హాఫ్‌లోనే scene reverse అవుతుంది; over-dramatic emotions valla connection అసలు పండదు. అయితే, climax లో ఊహించని kick-ass twist మరియు మంచి family values message సినిమాను కంప్లీట్ గా save చేశాయి. overall one time watchabull.
Average
Happy Journey Movie Review
Happy Journey movie like a mixed bag of comedy and drama. The first half delivers clean entertainment with seven diverse women on a France trip, packed with Evadi Gola Vadide - style humor, scenic views.However, the second half stumbles with forced emotional drama, outdated struggles, and preachy ps...
Happy Journey movie like a mixed bag of comedy and drama. The first half delivers clean entertainment with seven diverse women on a France trip, packed with Evadi Gola Vadide - style humor, scenic views.
However, the second half stumbles with forced emotional drama, outdated struggles, and preachy pseudo-feminist themes that fail to hit the mark.
Thankfully, the climax saves the narrative with a clever twist from Govind and a heartwarming message on family values.
Skip the second-half logic, and it’s a decent one-time watch for the comedy and climax!
Above Average
Happy Journey movie review
ఇరుముడి తరువాత మళ్ళీ నాకే సినిమా నచ్చలేదు. చాలా రోజుల తర్వాత ఓ కామెడీ సినిమా వచ్చిందని అనిపించి హ్యాపీ జర్నీ సినిమాకెళ్ళా. సినిమా కాన్సెప్ట్ అయితే బాగానే నచ్చింది. కానీ ట్రీట్మెంట్ ఇంట్రెస్టింగ్ గా అనిపించలేదు. సింపుల్ గా కాన్సెప్ట్ గురించి చూస్తే.. ఏడుగురు వేర్వేరు వయసున్న మహిళలు ఫ్రాన్స్ ట్రిప్‌కి...
ఇరుముడి తరువాత మళ్ళీ నాకే సినిమా నచ్చలేదు. చాలా రోజుల తర్వాత ఓ కామెడీ సినిమా వచ్చిందని అనిపించి హ్యాపీ జర్నీ సినిమాకెళ్ళా. సినిమా కాన్సెప్ట్ అయితే బాగానే నచ్చింది. కానీ ట్రీట్మెంట్ ఇంట్రెస్టింగ్ గా అనిపించలేదు. సింపుల్ గా కాన్సెప్ట్ గురించి చూస్తే.. ఏడుగురు వేర్వేరు వయసున్న మహిళలు ఫ్రాన్స్ ట్రిప్‌కి వెళ్లే కాన్సెప్ట్‌తో ‘హ్యాపీ జర్నీ’ రూపొందింది. ఫస్టాఫ్ అంతా కామెడీతో హ్యాపీగా సాగిపోతుంది. సెకండాఫ్ లో వచ్చే విపరీతమైన ఎమోషన్లు, పాతకాలపు ఆలోచనలు, ఫోర్స్డ్ సూడో-ఫెమినిజం డ్రామా మాత్రం నాకు పిచ్చ బోర్ కొట్టించాయి.
ఎదో చివరిలో గోవింద్ క్యారెక్టర్ ఇచ్చే ఊహించని ట్విస్ట్, ఫ్యామిలీ విలువలు కొంచెం బెటర్ అనిపించాయి. అండ్ ఈ సినిమా చూస్తుంటే నాకు ‘జయం మనదేరా’, ‘ఎవడి గోల వాడిదే’ టైప్ అఫ్ కామెడీ మూవీస్ గుర్తొచ్చాయి. ఏదయితే నేం కంప్లీట్ సాటిస్ఫాక్షన్ ఇవ్వలేదు కానీ, ఓసారి ట్రై చేయొచ్చు. మే బి లేడీస్ ఎక్కువ కనెక్ట్ అవ్వొచ్చు.
About This Movie
Story :
కథ విషయానికి వస్తే... గోవింద్ (వంశి), అప్పారావు (రవి శివతేజ) నడుపుతున్న ఓ ట్రావెల్ కంపెనీ నష్టాల్లో ఉండడంతో ఎలాగైనా తమ కంపెనీని బాగా ప్రమోట్ చేయాలని ఒక ఐడియా ప్లాన్ చేసి లక్కీ డ్రా పేరుతో కొంతమంది ఆడవాళ్ళని ఫ్రీ ట్రిప్ తో ప్యారిస్ కి తీసుకెళ్తారు. సావిత్రి (అన్నపూర్ణమ్మ), చాముండేశ్వరి (ఆమని), నయన (జినీషా), శ్రీలత (ఝాన్సీ), తన్వి (పాయల్ రాజ్ పుత్), విహన (రూప శ్రీనివాస్), దివ్య (సునైనా).. ఈ ఏడుగురికి ఫ్రీ ట్రిప్ లో సెలెక్ట్ చేసి, వంశి గోవింద్ గైడ్ లు గా తీసుకెళ్తారు. ఈ జర్నీ లో ఆ ఆడవాళ్లు జీవిత సత్యాలను తెలుసుకోవడానికి, వాళ్ళ ఫ్యామిలీ బంధాలను బలపరుచుకోవడానికి ఈ జర్నీ ఎలా ఉపయోగపడింది. అసలు గోవింద్ వీళ్ళనే ఎందుకు ఫ్రీ గా ట్రిప్ కి తీసుకొచ్చాడు? అసలు వీళ్ళకు ఫ్రీ ట్రిప్ స్పాన్సర్ చేసింది ఎవరు? ఫైనల్ గా ఈ హ్యాపీ జర్నీ ఎలా ఎండ్ అయింది అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.
Plus Points :
ఇలాంటి కాన్సెప్ట్ తో చాలా సినిమాలే వచ్చాయి. కానీ మనసుకు హత్తుకున్న తక్కువ చిత్రాలే సక్సెస్ సాధించాయి. ఇక ఈ సినిమా వరకు ఒక మంచి ఫ్యామిలీ మెసెజ్ ఇచ్చే కాన్సెప్ట్ తోనే తెరకెక్కిందే ఈ "హ్యాపీ జర్నీ". ఇలాంటి ఫీల్ గుడ్ డ్రామాలను చాలామంది ఆడియన్స్ ఇష్టపడతారు. కాకపోతే కొత్తగా ఆడియన్స్ ఎంగేజ్ చేసేలా చెప్పే సినిమాలకే ఓటేస్తారు. కథ వరకు చిన్న కథే అయినా, దాన్ని మంచి ఎంటర్టైనింగ్ వే లో తెరకెక్కించాడు దర్శకుడు. సినిమా మొత్తం శారద సరదాగా సాగిపోతుంది. అల్లరి, కోపాలు, మనస్పర్థలు జర్నీలో ఇవన్నీ కామనే కదా. అలాగే ఈ మూవీ ఉంటుంది. ఇక సినిమాలో వంశీ, రవి శివతేజ కామెడీ హైలెట్ గా నిలుస్తుంది. ఇక సీనియర్ నటి అన్నపూర్ణమ్మ, ఆమని, ఝాన్సీ, పాయల్ రాధాకృష్ణ, సునైనలు వాళ్ళ వాళ్ళ రోల్స్ లో చక్కగా నటించారు. ప్రతి ఒక్కరికి ఒక డిఫరెంట్ క్యారెక్టరైజెషన్ ఉంటుంది.
Minus Points :
అయితే ఈ సినిమాకి మంచి కాన్సెప్ట్ అనుకున్నా, దానికి తగ్గట్టు ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే మరింత స్ట్రాంగ్ గా రాసుకోవాల్సింది. కానీ డైరెక్టర్ అందులో విఫలమయ్యాడు. ఎందుకంటే సినిమాలో మంచి ఫన్ సీన్స్ వస్తాయ్. నవ్వేలానే ఉంటాయి. కానీ అంత ఫన్ రాదు. ఒక్క వంశీ కామెడీ తప్పితే మిగతా వాళ్ళ నుండి ఎంటర్టైన్మెంట్ నవ్వుకునే రేంజ్ లో రాదు. పైగా కొన్ని అనవసరమైన సీన్స్ వల్ల సినిమా ఫ్లో తగ్గి ఇంట్రెస్ట్ ని తగ్గిస్తుంది. పైగా ఇలాంటి సినిమాల్లో ఎమోషనల్ డెప్త్ ఎంత ఆకట్టుకునేలా ఉంటే ఆడియన్స్ అంతగా కనెక్ట్ అవుతారు. దీంట్లో అదే మిస్ అయింది. జర్నీ ఎంటర్టైనింగ్ గా పర్లేదు గాని, ఎమోషనల్ సీన్స్ లో డెప్త్ ని ఇంకా స్ట్రాంగ్ గా చూపించి ఉంటే ఆ పాత్రలకు మరింత కనెక్ట్ అయ్యేవాళ్ళు. ఇక క్లైమాక్స్ అయితే హడావిడిగా ముగించినట్టు ఉంది. పైగా సినిమాలో కొన్ని సీన్స్ లో సహజత్వం అనేది లోపించినట్టు అనిపిస్తుంది.
Technical Values :
టెక్నికల్ గా చూస్తే ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. హేమంత్ ధోమే అందించిన కథ బాగున్నా, దానికి తగ్గ స్ట్రాంగ్ స్క్రీన్ ప్లే రాసుకోలేదు డైరెక్టర్ అభిరామ్ నాయుడు. తీయడం బాగానే తీసాడు కానీ, ఫ్రెష్ నెస్ అనేది సినిమాలో కనిపించలేదు. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్ లో డెప్త్ ని ఇంకా బాగా చుపించాల్సింది. ఇక శేఖర్ చంద్ర అందించిన సాంగ్స్ మ్యూజిక్ పర్లేదు. సుబ్రమణ్యన్ మణిగండన్ సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ పర్వాలేదు. కానీ సినిమాలో అనవసరమైన సన్నివేశాలని ట్రిమ్ చేయాల్సింది. పలానా సీన్ అని కాదు గాని, అక్కడక్కడా కొంత ట్రిమ్ చేసి కథలో వేగాన్ని పెంచి ఉంటే బాగుండేది.
Final Review :
ఇక ఓవరాల్ గా హ్యాపీ జర్నీ మూవీలో ట్రిప్ సక్సెస్ ఫుల్ గానే జరిగినా, సినిమా ఆడియన్స్ ని పూర్తి స్థాయిలో ఆకట్టుకోవడంలో మేకర్స్ తడబడ్డారు. అక్కడక్కడా కొన్ని సీన్స్ ఆకట్టుకుంటాయి. ఫైనల్ గా ఇది ఫీమేల్ సెంట్రిక్ పాయింట్ మూవీ కావడం వల్ల ఆడవాళ్ళకైతే నచ్చే అవకాశం ఎక్కువ ఉంది. ఓవరాల్ గా తక్కువ అంచనాలతో ఈ కామెడీ డ్రామాను ట్రై చేస్తే ఆడియన్స్ కి కొంత వరకు నచ్చే అవకాశం ఉంది.