Register as a Reviewer
Home Reviews Media Reviews

Media Reviews

Reviews from top media outlets, YouTube channels, and publications

937
Total Reviews
Showing 193–204 of 937 media reviews
నాగబంధం (NagaBandham)

Naga Bandham Movie Review

Tupaki

By Tupaki

నిర్మాతగా అనేక సినిమాలు తీసిన అభిషేక్ నామా దర్శకుడిగా మారి రూపొందించిన చిత్రం.. నాగబంధం. ‘పెదకాపు’ చిత్రంతో కథానాయకుడిగా పరిచయమైన విరాట్ కర్ణ ఇందులో లీడ్ రోల్ చేశాడు. తాజాగా థియేటర్లలో విడుదలైన ఈ మూవీ...

నిర్మాతగా అనేక సినిమాలు తీసిన అభిషేక్ నామా దర్శకుడిగా మారి రూపొందించిన చిత్రం.. నాగబంధం. ‘పెదకాపు’ చిత్రంతో కథానాయకుడిగా పరిచయమైన విరాట్ కర్ణ ఇందులో లీడ్ రోల్ చేశాడు. తాజాగా థియేటర్లలో విడుదలైన ఈ మూవీ యావరేజ్ రెస్పాన్స్ అందుకుంది. సినిమా కంటెంట్ విషయానికి వస్తే...

ప్రథమార్థం ఎగుడు దిగుడుగా ఉన్నా ఓవరాల్ గా పర్వాలేదు అనిపిస్తుంది. కానీ రెండో అర్థం మాత్రం ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడుతుంది.


ఒక దశ తర్వాత విజువల్స్.. భారీతనం కూడా ఎంగేజ్ చెయ్యలేని విధంగా సన్నివేశాలు ప్రేక్షకుడిని గందరగోళానికి గురి చేస్తాయి. డైలాగులు సుదీర్ఘంగా సాగి విసుగు పుట్టిస్తాయి. హిందూ దేవుళ్ళు.. సనాతన ధర్మం.. హిందుత్వం మీద డైలాగులు పనిగట్టుకుని పెట్టినట్లు అనిపిస్తాయి తప్ప కథలో భాగంగా.. ఆ కథను ఎలివేట్ చేసేలా లేవు. ఒక అద్భుతమైన ఈవెంట్ ఫిలిం కావడానికి తగ్గ కథ.. సాంకేతిక హంగులు.. భారీతనం 'నాగబంధం'కు కుదిరినా.. కథను ఆసక్తికరంగా చెప్పలేకపోవడంతో ఈ సినిమా ఆశించిన అనుభూతి ఇవ్వలేక పోయింది. రచయిత.. దర్శకుడు అభిషేక్ నామా తన విజువలైజేషన్ తో వావ్ అనిపించాడు. కానీ సన్నివేశాలను క్రిస్ప్ గా ప్రెసెంట్ చెయ్యడంలో.. రక్తి కట్టించడంలో అతను తడబడ్డాడు. కథ కూడా ఓకే కానీ.. కథనం మాత్రం ఆసక్తికరంగా సాగలేదు. కేవలం విజువల్స్.. ఎఫెక్ట్స్.. భారీతనం కోసం అయితే నాగబంధం మీద ఒక లుక్కేయొచ్చు.


చివరగా: నాగబంధం.. విజువల్స్ అద్భుతం.. విషయం పరిమితం. 



5.0
out of 10

Average

నాగబంధం (NagaBandham)

NagaBandham Movie Review

తొలిసారి దర్శకత్వ బాధ్యతలు చేపట్టిన నిర్మాత అభిషేక్ నామా 1960 బ్యాక్ డ్రాప్‌తో నాగబంధం సినిమా కథను ఊహించుకొన్న విధానం చాలా బాగుంది. కానీ ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే రాసుకోవడంలో తడబడ్డాడు. అలాగే నాగబంధం సి...

తొలిసారి దర్శకత్వ బాధ్యతలు చేపట్టిన నిర్మాత అభిషేక్ నామా 1960 బ్యాక్ డ్రాప్‌తో నాగబంధం సినిమా కథను ఊహించుకొన్న విధానం చాలా బాగుంది. కానీ ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే రాసుకోవడంలో తడబడ్డాడు. అలాగే నాగబంధం సినిమాలో సనాతన ధర్మం, హిందూ మత పరిరక్షణ ముఖ్యమైన అంశాలుగా రూపొందిన ఈ సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్స్, సిస్టర్ సెంటిమెంట్ అంశాలు ఆకట్టుకొనేలా ఉంటాయి. 


అయితే కథ చెప్పడంలో ఇంకాస్త క్లారిటీ, నిడివి తగ్గించి ఉంటే ఈ సినిమా టెక్నికల్‌ గా విజువల్ గ్రాండియర్ పరంగా బెంచ్ మార్క్ అయి ఉండేది. కథలో వేగానికి అడ్డుపడేలా పాటలు ఉండటం ఆడియెన్స్ క్యూరియాసిటీపై ప్రభావం పడేలా చేస్తుంది. టెక్నికల్ అంశాలు, సనాతన ధర్మం అంశాలతో వచ్చే మైథాలజికల్ టచ్ ఉన్న సినిమాలను చూసే వారికి ఈ సినిమా నచ్చుతుంది. ఈ వారం చూడాల్సిన సినిమాల జాబితాల్లో నిస్సందేహంగా ఈ సినిమా లవర్స్ ఈ చిత్రాన్ని చేర్చుకోవచ్చు.

7.0
out of 10

Hit

రావు బహదూర్ (Rao Bahadur)

Rao Bahadur Movie Review

ఈ వారం థియేటర్స్ లోకి వచ్చిన తాజా చిత్రాల్లో టాలెంటెడ్ నటుడు సత్యదేవ్ హీరోగా కేరాఫ్ కంచరపాలెం దర్శకుడు వెంకటేష్ మహా నుంచి వచ్చిన సినిమా “రావు బహదూర్” కూడా ఒకటి. అయితే ఆడియన్స్ నుండి ఈ మూవీ మిక్డ్స్ రె...

ఈ వారం థియేటర్స్ లోకి వచ్చిన తాజా చిత్రాల్లో టాలెంటెడ్ నటుడు సత్యదేవ్ హీరోగా కేరాఫ్ కంచరపాలెం దర్శకుడు వెంకటేష్ మహా నుంచి వచ్చిన సినిమా “రావు బహదూర్” కూడా ఒకటి. అయితే ఆడియన్స్ నుండి ఈ మూవీ మిక్డ్స్ రెస్పాన్స్ అందుకుంది. డిఫరెంట్ సైకలాజికల్ కాన్సెప్ట్ తో పాటు సత్యదేవ్ నటన ఆకట్టుకుంటుంది. కామెడీ అండ్ ఎమోషనల్ సీన్స్ కూడా బాగానే ఉన్నాయి. అనుమానం పెనుభూతం అనే కాన్సెప్ట్ పై దర్శకుడు మైంటైన్ చేసిన సస్పెన్స్ ఫ్యాక్టర్, దీనిపై సాగే సంభాషణలు అలాగే అక్కడక్కడా ఫన్ మూమెంట్స్ సహా ఎమోషన్స్ ఇందులో బాగున్నాయి. 


సత్యదేవ్ సహా ఇతర నటీనటులు కూడా మంచి సహకారం అందించారు. కానీ వెంకటేష్ మహా దర్శకుడని, సత్య దేవ్ కాబట్టి సాలిడ్ స్క్రిప్ట్ ఉంటుందని నమ్మి, ఈ సినిమా విషయంలో ఓవర్ అంచనాలు పెట్టుకుంటే మాత్రం ఈ కాంబినేషన్ కోసం ఎదురు చూసిన ఆడియెన్స్ కొంతమేర నిరాశ చెందవచ్చు. సో వాటి విషయంలో కాంప్రమైజ్ అయితే ఈ సినిమా డీసెంట్ గా అనిపిస్తుంది.


6.0
out of 10

Above Average

నాగబంధం (NagaBandham)

NagaBandham Movie Review

ఈ వారం థియేటర్స్ లో అలరించేందుకు వచ్చేసిన తాజా చిత్రాల్లో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా “నాగ బంధం” కూడా ఒకటి. యువ హీరో విరాట్ కర్ణ హీరోగా అభిషేక్ నామా దర్శకత్వం వహించిన ఈ మూవీ ట్రెజర్ హంట్ నేపథ్యం...

ఈ వారం థియేటర్స్ లో అలరించేందుకు వచ్చేసిన తాజా చిత్రాల్లో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా “నాగ బంధం” కూడా ఒకటి. యువ హీరో విరాట్ కర్ణ హీరోగా అభిషేక్ నామా దర్శకత్వం వహించిన ఈ మూవీ ట్రెజర్ హంట్ నేపథ్యంలో డివోషనల్ టచ్ తో ఆక్షన్ డ్రామాగా తెరకెక్కింది. తాజాగా థియేటర్లలో విడుదలై మిశ్రమ స్పందన తెచ్చుకుంది. అయితే సినిమా కాన్సెప్ట్ బాగున్నా కథనం అంతగా ఆకట్టుకోలేదు. ‘నాగ బంధం’ లో కాన్సెప్ట్ దాని చుట్టూ నడిచే డ్రామా అక్కడక్కడా కొంతమేర ఓకే అనిపిస్తుంది. 


విరాట్ కర్ణ ఈ సినిమా కోసం గట్టి ఎఫర్ట్స్ పెట్టాడు. అలానే సినిమాలో గ్రాండ్ స్కేల్, విజువల్స్ ఆకట్టుకుంటాయి. సహాయ నటుల పెర్ఫామెన్స్ లు కూడా బాగున్నాయి. కానీ సెకండాఫ్ మాత్రం సినిమాలో సాగదీతగా అనిపిస్తుంది. అలాగే కొన్ని డివోషనల్ అడ్వెంచర్ సినిమాల ఫీల్ నే ఇది కూడా మిగులుస్తుంది. సో ఇవి కొంచెం రొటీన్ గా ఉన్నాయి. వీటిని పక్కన పెడితే కొంచెం తక్కువ అంచనాలు పెట్టుకుని ఈ సినిమా ట్రై చేస్తే మంచిది.


6.0
out of 10

Above Average

సేవ్ ది టైగర్స్ సీజన్ 3 (Save The Tigers Season 3)

Save The Tigers 3 review

సేవ్ ది టైగర్స్ సీజన్ 3... ఈ సిరీస్ మూడో భాగం గురించి చెప్పుకుంటే... పాయింట్ కొస్తే... ఫస్ట్ ఫోర్ ఎపిసోడ్స్ కొంచెం అప్ అండ్ డౌన్ లాగా వెళ్లాయి. లాస్ట్ 3 ఎపిసోడ్స్ మాత్రం మంచి ఫన్ ఎపిసోడ్స్ తో బాగున్నా...

సేవ్ ది టైగర్స్ సీజన్ 3... ఈ సిరీస్ మూడో భాగం గురించి చెప్పుకుంటే... పాయింట్ కొస్తే... ఫస్ట్ ఫోర్ ఎపిసోడ్స్ కొంచెం అప్ అండ్ డౌన్ లాగా వెళ్లాయి. లాస్ట్ 3 ఎపిసోడ్స్ మాత్రం మంచి ఫన్ ఎపిసోడ్స్ తో బాగున్నాయి. సీజన్ 3 లో ఫాంటసీ ఎలిమెంట్స్ తో మరింత ఇంట్రెస్ట్ తీసుకొచ్చి ఎన్ని సీజన్స్ అయినా తీయొచ్చనే కాన్ఫిడెన్స్ ఇచ్చారు. 


ఈ మూడు సీజన్లలో బెటర్ గా అనిపించింది ఈ మూడో సీజనే. 

సో ఓవరాల్ గా లీడ్ యాక్టర్స్ బెస్ట్ పెర్ఫార్మన్స్ తో పాటు, స్టోరీ, స్క్రీన్ ప్లే కూడా అదిరిపోయాయి. ఈ వీకెండ్ ఫ్యామిలీతో ఎంజాయ్ చేసేయొచ్చు.  

7.0
out of 10

Hit

సేవ్ ది టైగర్స్ సీజన్ 3 (Save The Tigers Season 3)

Save The Tigers 3 review

Tupaki

By Tupaki

భార్యా బాధితుల కష్టాల నేపథ్యంలో తెలుగులోనే కాదు వివిధ భాషల్లో బోలెడన్ని సినిమాలు వచ్చాయి. పెళ్లిని ఒక బూచిలా.. పెళ్లయిన మహిళల్ని రాకాసుల్లా చూపిస్తూ వినోదాన్ని పండించడం రచయితలు-దర్శకులకు అలవాటైన వ్యవహ...

భార్యా బాధితుల కష్టాల నేపథ్యంలో తెలుగులోనే కాదు వివిధ భాషల్లో బోలెడన్ని సినిమాలు వచ్చాయి. పెళ్లిని ఒక బూచిలా.. పెళ్లయిన మహిళల్ని రాకాసుల్లా చూపిస్తూ వినోదాన్ని పండించడం రచయితలు-దర్శకులకు అలవాటైన వ్యవహారమే. ఐతే ఈ పాత కథా వస్తువునే ఎంచుకున్నప్పటికీ.. జోక్స్ ఎక్కడా హద్దులు దాటకుండా.. మహిళలు సైతం ఎంజాయ్ చేసేలా.. వాళ్ల వైపు నుంచి నుంచి కథను బ్యాలెన్స్ చేస్తూ.. చాలా వరకు లైట్ హార్టెడ్ హ్యూమర్ తో సన్నివేశాలను నడిపిస్తూ.. అక్కడక్కడా కొంచెం ఎమోషన్ కూడా జోడించి ప్రేక్షకులను మెప్పించిన సిరీస్.. సేవ్ ద టైగర్స్. ఈ తరహా కథలకు రెండో సీజన్ తీయడానికి ఏమంటుంది అనిపిస్తుంది కానీ.. ఈ టీం మాత్రం సీజన్-2ను సైతం బోర్ కొట్టించకుండానే నడిపించింది. కానీ దీనికి మూడో సీజన్ అంటే.. వర్కవుట్ చేయడం కష్టమే అని.. ఓవర్ డోస్ అయిపోతుందనే సందేహాలే కలిగాయి. కానీ ఈ సారి కథకు ఫాంటసీ ఎలిమెంట్ జోడించి.. మరోసారి ఎంగేజ్ చేసింది టీం.


కథ పరంగా వైవిధ్యం తోడవడం.. స్క్రీన్ ప్లేతోనూ మ్యాజిక్ చేయడం.. జోకులు ఎప్పట్లాగే పేలడంతో మరోసారి ‘సేవ్ ద టైగర్స్’తో జర్నీ మంచి కాలక్షేపాన్నిస్తుంది. ఇక రైటర్లతో పాటు దర్శకుడి పనితనానికి ప్రశంసలు దక్కుతాయి. వెంకటస్వామి మ్యూజిక్.. విశ్వేశ్వర్ ఛాయాగ్రహణం బాగా కుదిరాయి. నిర్మాణ విలువలకు ఢోకా లేదు. గత రెండు సీజన్లలాగే ‘సేవ్ ద టైగర్స్’ మూడో సీజన్ కూడా చక్కటి కాలక్షేపమే. చివరగా ఈ టైగర్స్ మళ్లీ గర్జించారు


7.0
out of 10

Hit

సేవ్ ది టైగర్స్ సీజన్ 3 (Save The Tigers Season 3)

Save The Tigers Season 3 Review

సేవ్ ది టైగర్స్ 3వ సీజన్‌లో నటీనటులందరికీ రెండు విభిన్నమైన షేడ్స్ చూపించే అవకాశం దక్కడంతో అందరూ అద్భుతంగా నటించారు. అభినవ్ గోమఠం, ప్రియదర్శి, చైతన్య కృష్ణ ఈ ముగ్గురూ తమ కామెడీ టైమింగ్, ఎమోషన్స్‌తో సిర...

సేవ్ ది టైగర్స్ 3వ సీజన్‌లో నటీనటులందరికీ రెండు విభిన్నమైన షేడ్స్ చూపించే అవకాశం దక్కడంతో అందరూ అద్భుతంగా నటించారు. అభినవ్ గోమఠం, ప్రియదర్శి, చైతన్య కృష్ణ ఈ ముగ్గురూ తమ కామెడీ టైమింగ్, ఎమోషన్స్‌తో సిరీస్‌ను వన్-మ్యాన్ షోలా నడిపించారు. క్రియేటర్స్ మహి వి. రాఘవ్, ప్రదీప్ అద్వైతం అందించిన ఈ కాన్సెప్ట్‌ను డైరెక్టర్ శ్రీరామ్ ఎరగం ఎక్కడా పట్టు తప్పకుండా తెరకెక్కించారు. మొదటి మూడు ఎపిసోడ్‌లు పాత్రల పరిచయం, లోకాల మార్పిడితో సరదాగా సాగిపోతాయి. కేవలం కామెడీ మాత్రమే కాకుండా.. మహిళా సాధికారత, భార్య అంటే భర్తకు బానిస కాదు అనే పాయింట్స్‌ను, భార్యాభర్తల మధ్య ఉండాల్సిన అండర్ స్టాండింగ్‌ను చాలా హుందాగా చూపించారు.


సరికొత్త 'వరల్డ్ స్వాపింగ్' కాన్సెప్ట్ ను తీసుకుని అభిమానులను అలరించారు. ప్రియదర్శి, అభినవ్, చైతన్యల నటన అద్భుతంగా ఉంది. నవ్విస్తూనే భార్యాభర్తల బంధంపై ఇచ్చిన సందేశం చాలా బాగుంది. క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ ఈ సిరీస్ కు మేజర్ ప్లస్ పాయింట్. మైనస్ పాయింట్స్ చూస్తే.. అక్కడక్కడా కాస్త హద్దులు దాటిన కొన్ని డైలాగ్స్ రియాలిటీ కంటే ఫిక్షన్ ఎక్కువగా ఉండటం.. ఫైనల్‌ గా మొదటి రెండు సీజన్ల క్రేజ్‌ను నిలబెడుతూ 'సేవ్ ది టైగర్స్ 3' హ్యాట్రిక్ హిట్‌ను సొంతం చేసుకుంది. ఈ వీకెండ్‌ లో కుటుంబ సభ్యులందరితో కలిసి హాయిగా నవ్వుకుంటూ చూడదగ్గ పర్‌ఫెక్ట్ సిరీస్ ఇది.


7.0
out of 10

Hit

సేవ్ ది టైగర్స్ సీజన్ 3 (Save The Tigers Season 3)

Save The Tigers 3 Review

భార్య – భర్తల మధ్య రిలేషన్, వాళ్ళ మధ్య గొడవలతో ముగ్గురు జంటలతో ఫుల్ లెంగ్త్ కామెడీ సిరీస్ గా సేవ్ ది టైగర్స్ మొదటి రెండు సీజన్స్ ప్రేక్షకులను ఫుల్ గా నవ్వించింది. దీంతో సీజన్ 3 పై కూడా అంచనాలు నెలకొన్...

భార్య – భర్తల మధ్య రిలేషన్, వాళ్ళ మధ్య గొడవలతో ముగ్గురు జంటలతో ఫుల్ లెంగ్త్ కామెడీ సిరీస్ గా సేవ్ ది టైగర్స్ మొదటి రెండు సీజన్స్ ప్రేక్షకులను ఫుల్ గా నవ్వించింది. దీంతో సీజన్ 3 పై కూడా అంచనాలు నెలకొన్నాయి. రెండో వెబ్ సిరీస్ లో మూడు జంటల మధ్య ఏదో ఒక సమస్య పెట్టి ఎండ్ చేసారు. అక్కడ నుంచే ఈ సీజన్ కథ మొదలవుతుంది. మొత్తం ఏడు ఎపిసోడ్స్ తో ప్రతి ఎపిసోడ్ సింపుల్ బ్యాంగ్ తో తెరకెక్కించారు.


ఎప్పట్లాగే భార్య – భర్తల రిలేషన్ మీద చివర్లో కాస్త ఎమోషనల్ గా వర్కౌట్ చేయాలని ప్రయత్నించారు. ఎక్కడా బోర్ కొట్టకుండా అక్కడక్కడా నవ్వుతూ చూడొచ్చు. ఓపెనింగ్ లోనే గంట రవి, రాహుల్, విక్రమ్.. ఒకేలా ఉన్న ఇద్దరు ఇద్దర్ని చూపించి ఆశ్చర్యపరిచి అసలు కథలోకి తీసుకెళ్లారు. లాస్ట్ ఎపిసోడ్ మాత్రం కాస్త సాగదీశారు. చివరకు పెళ్లి అనే కాన్సెప్ట్ ని ఎవరు ఏం చేయలేరు అనే రొటీన్ ఎండ్ మాములే. మొత్తంగా ‘సేవ్ ది టైగర్స్ సీజన్ 3’ వెబ్ సిరీస్ కూడా మొదటి రెండు సీజన్స్ లాగే నవ్విస్తుంది, కానీ కాస్త కన్ఫ్యూజ్ చేస్తుంది. హ్యాపీగా చూసేయచ్చు. ఈ సిరీస్ కి 3.25 రేటింగ్ ఇవ్వొచ్చు.


7.0
out of 10

Hit

సేవ్ ది టైగర్స్ సీజన్ 3 (Save The Tigers Season 3)

Save The Tigers Season 3 Review

మూడో సీజన్‌ సిరీస్‌.. ప్రియదర్శి, అభినవ్‌, చైతన్య కృష్ణ ముగ్గురిని కిడ్నాప్‌ చేయడంతో ఈ సిరీస్‌ ప్రారంభమవుతుంది. ఫన్‌ మొదటి సీన్‌ నుంచే స్టార్ట్ అయ్యిందని చెప్పొచ్చు. అయితే అంతలోనే తమని పోలిన మరో ముగ్గ...

మూడో సీజన్‌ సిరీస్‌.. ప్రియదర్శి, అభినవ్‌, చైతన్య కృష్ణ ముగ్గురిని కిడ్నాప్‌ చేయడంతో ఈ సిరీస్‌ ప్రారంభమవుతుంది. ఫన్‌ మొదటి సీన్‌ నుంచే స్టార్ట్ అయ్యిందని చెప్పొచ్చు. అయితే అంతలోనే తమని పోలిన మరో ముగ్గురు కనిపించే ట్విస్ట్ అదిరిపోయింది. అది ఎవరూ ఊహించరు. ఈ సిరీస్‌లో అస్సలు ఊహించరు. అదే పెద్ద ట్విస్ట్ గా చెప్పొచ్చు. మూడు ఎపిసోడ్ల వరకు కొంత ఫన్‌, కొంత కన్‌ఫ్యూజన్‌ అనేలా వెళ్తుంది. ఇక నాల్గో సీజన్‌ నుంచి కథ మారిపోతుంది. 


ఈ సీజన్లో ఫన్‌ డోస్‌ పెరిగింది. ట్విస్ట్ లు రివీల్‌ అవ్వడం, పాత్రల్లో రియలైజేషన్‌ రావడం, ఒక ప్రపంచంలో ఈ ముగ్గురు చేసిన తప్పులను కొత్తగా వచ్చిన వారు సరిచేసే ప్రయత్నం చేయడం ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. రైటింగ్‌ చాలా గ్రిప్పింగ్‌గా ఉంది. డైలాగ్‌ నవ్వించడంతోపాటు ఆలోచింప చేస్తాయి. దర్శకత్వం సినిమాకి మరో ప్లస్‌ అని చెప్పొచ్చు. ట్విస్ట్ లతో, కామెడీతో, ఎమోషన్స్ తో ఇలా అన్ని మిక్స్ చేసి దీన్ని తెరకెక్కించిన తీరు బాగుంది. పర్‌ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ని తెరకెక్కించారని చెప్పొచ్చు. ఫైనల్‌గా భార్యాభర్తలు చూడాల్సిన సిరీస్‌. ఫ్యామిలీ ఆడియెన్స్ కి ఇదొక మంచి టైమ్‌ పాస్‌ ఎంటర్‌టైనింగ్‌ సిరీస్‌ అవుతుంది.

6.0
out of 10

Above Average

సేవ్ ది టైగర్స్ సీజన్ 3 (Save The Tigers Season 3)

Save The Tiger Season 3 series review

ఈ మూడో సీజన్‌కు శ్రీరామ్ ఎరగం కొత్తగా దర్శకత్వ బాధ్యతలు తీసుకున్నాడు. అయితే మొదటి రెండు సీజన్లను సూపర్ హిట్ చేసిన కామెడీ ఫార్ములాను ఆయన ఏమాత్రం మిస్ అవ్వలేదు. ఈసారి కథకు కొద్దిగా ఫాంటసీ (దేవుళ్లు భూమి...

ఈ మూడో సీజన్‌కు శ్రీరామ్ ఎరగం కొత్తగా దర్శకత్వ బాధ్యతలు తీసుకున్నాడు. అయితే మొదటి రెండు సీజన్లను సూపర్ హిట్ చేసిన కామెడీ ఫార్ములాను ఆయన ఏమాత్రం మిస్ అవ్వలేదు. ఈసారి కథకు కొద్దిగా ఫాంటసీ (దేవుళ్లు భూమి మీదకు రావడం) టచ్ ఇవ్వడం వల్ల సిరీస్‌కి మంచి కొత్తదనం వచ్చింది. అది ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయి నవ్వులు పంచుతుంది.


అయితే కథనంలో కొన్ని మైనస్ పాయింట్స్ కూడా ఉన్నాయి. ముఖ్యంగా మధ్యలో వచ్చే ఒకటి రెండు ఎపిసోడ్లు బాగా సాగదీసినట్లు అనిపిస్తాయి. సీన్స్ కాస్త నెమ్మదిగా బోర్ కొట్టేలా సాగుతాయి. స్క్రీన్‌ప్లే ఇంకాస్త క్రిస్పీగా, వేగంగా ఉంటే బాగుండేది. అలాగే ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఇబ్బంది పెట్టేలా ఇందులో బూతు పదాలు మితిమీరి వాడారు. మధ్యలో కొన్ని సాగదీత సీన్లను కట్ చేసి ఉంటే సిరీస్ మరింత స్పీడ్‌ గా ఉండేది. కొత్త దర్శకుడు శ్రీరామ్ కొన్ని చిన్న చిన్న ల్యాగ్ సమస్యలను పక్కన పెడితే ఫ్రాంచైజీకి ఉన్న పేరును నిలబెట్టి ప్రేక్షకులకు ఫుల్ మీల్స్ లాంటి ఎంటర్టైన్మెంట్ అందించాడు. ఓవరాల్ గా సేవ్ ద టైగర్స్ 3.. కొంచెం ఫాంటసీ, కొంచెం ఫ్రస్ట్రేషన్, బోలెడంత ఫన్..!

7.0
out of 10

Hit

సేవ్ ది టైగర్స్ సీజన్ 3 (Save The Tigers Season 3)

Save The Tigers Season 3 review

Sakshi

By Sakshi

భార్యాభర్తల రిలేషన్‌షిప్ కామెడీకి ఈసారి ఫాంటసీ ఎలిమెంట్ జోడించి 'సేవ్ ద టైగర్స్ 3'ను కొత్తగా తీర్చిదిద్దారు. ప్యారలల్ వరల్డ్ కాన్సెప్ట్, డ్యూయల్ రోల్స్‌తో కథ ఆసక్తికరంగా సాగుతుంది. ప్రియదర్శి, అభినవ్...

భార్యాభర్తల రిలేషన్‌షిప్ కామెడీకి ఈసారి ఫాంటసీ ఎలిమెంట్ జోడించి 'సేవ్ ద టైగర్స్ 3'ను కొత్తగా తీర్చిదిద్దారు. ప్యారలల్ వరల్డ్ కాన్సెప్ట్, డ్యూయల్ రోల్స్‌తో కథ ఆసక్తికరంగా సాగుతుంది. ప్రియదర్శి, అభినవ్ గోమఠం, చైతన్య కృష్ణతో పాటు వారి జోడీలు రెండు భిన్నమైన షేడ్స్‌లో ఆకట్టుకున్నారు. మొదటి కొన్ని ఎపిసోడ్లలో కామెడీ కాస్త తగ్గినట్టు అనిపించినా, కథ ముందుకు సాగేకొద్దీ ట్విస్టులు, సరదా సన్నివేశాలు ప్రేక్షకులను ఎంగేజ్ చేస్తాయి. క్లైమాక్స్‌లో మంచి నవ్వులు పంచుతూ సీజన్‌ను ముగించారు. 


టెక్నికల్ విషయానికి వస్తే... క్రియేటివ్ మహి.వి.రాఘవ్ మరోసారి అదరగొట్టారు. ప్రదీప్ అద్వైతం తో కలిసి మళ్ళీ హిట్ కొట్టారు. శ్రీరామ్ ఎరగం దర్శకత్వం కూడా బాగుంది. డైలాగ్స్ కూడా బాగున్నాయి. తొలి రెండు సీజన్లు నచ్చిన వారికి ఈ సీజన్ కూడా నిరాశ కలిగించదు. ఫ్యామిలీతో కలిసి చూడాల్సిన ఎంటర్‌టైనర్ ఇది. 

7.0
out of 10

Hit

సేవ్ ది టైగర్స్ సీజన్ 3 (Save The Tigers Season 3)

Save The Tigers Season 3 web series review

భార్యాభర్తల రిలేషన్‌షిప్ కామెడీకి ఈసారి ఫాంటసీ టచ్ జోడించి 'సేవ్ ద టైగర్స్ 3'ను కొత్తగా ప్రజెంట్ చేశారు. డ్యూయల్ రోల్స్, ప్యారలల్ వరల్డ్ కాన్సెప్ట్‌ తో కథ ఆసక్తికరంగా సాగుతుంది. మొదట కామెడీ కాస్త తగ్గ...

భార్యాభర్తల రిలేషన్‌షిప్ కామెడీకి ఈసారి ఫాంటసీ టచ్ జోడించి 'సేవ్ ద టైగర్స్ 3'ను కొత్తగా ప్రజెంట్ చేశారు. డ్యూయల్ రోల్స్, ప్యారలల్ వరల్డ్ కాన్సెప్ట్‌ తో కథ ఆసక్తికరంగా సాగుతుంది. మొదట కామెడీ కాస్త తగ్గినట్టు అనిపించినా... క్లైమాక్స్‌ కి వచ్చే సరికి ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ అందిస్తుంది. మొదటి రెండు సీజన్లు నచ్చిన వారికి ఇది కూడా పక్కా బింజ్-వాచ్. భార్య భర్తల రిలేషన్షిప్ గురించి చిన్న మెసేజ్ కూడా ఈ సిరీస్ లో ఇచ్చారు. ఫైనల్లీ ఈ వీకెండ్ లో హ్యాపీగా నవ్వుకోవడానికి సేవ్ ది టైగర్స్ బెస్ట్ ఆప్షన్. 

6.0
out of 10

Above Average

Why MRO?