Register as a Reviewer
Home Latest Movie Reviews

Latest Movie Reviews

The most recent reviews from top critics and publications

1221 Reviews
Showing 577–588 of 1221 reviews

Veerabhadrudu Cinema Review

వారం మొత్తం office tensions తర్వాత relife కోసం ఎదో ఒక movie కి వెళ్దాం అని అలా ‘వీరభద్రుడు’ మూవీకి వెళ్లాను. బేసిగ్గా కమర్షియల్ మూవీస్ నాకు పెద్దగా నచ్చవు, కానీ వీరభద్రుడు మూవీని బాగా ఎంజాయ్ చేశా...

వారం మొత్తం office tensions తర్వాత relife కోసం ఎదో ఒక movie కి వెళ్దాం అని అలా ‘వీరభద్రుడు’ మూవీకి వెళ్లాను. బేసిగ్గా కమర్షియల్ మూవీస్ నాకు పెద్దగా నచ్చవు, కానీ వీరభద్రుడు మూవీని బాగా ఎంజాయ్ చేశాను. పెద్దగా స్టోరీ కూడా ఏం లేదు. మూవీ చూస్తుంటే... గోపాల గోపాల, వకీల్ సాబ్ మూవీ కాన్సెప్ట్స్ మిక్స్ చేసి దించినట్టు  అనిపించింది. బట్ సూర్య performance after long gap తర్వాత మంచిగనిపించింది. ఇక జెనరల్ ఆడియన్స్ గురించి నాకు తెలీదు గాని ఫ్యాన్స్ బాగా ఎంజాయ్ చేస్తారు మూవీని. but మూవీ నేటివిటీ మాత్రం అంత ఎక్కదు. because తమిళ్ నేటివిటీ మసాల ఎక్కువైంది. ఓవరాల్ గా ఓ సారి weekend లో enjoy చేయొచ్చు. 

6.0
out of 9
2 months ago
May 26, 2026 Telugu

Drishyam Movie Review

Court dramas, investigation thrillers అంటే నాకు personally చాలా ఇష్టం. అదే interest‌ తో “Drishyam 3” చూడడానికి వెళ్లాను. i expected more then prevoius parts... edo just ok annattundi ee movie. Movie s...

Court dramas, investigation thrillers అంటే నాకు personally చాలా ఇష్టం. అదే interest‌ తో “Drishyam 3” చూడడానికి వెళ్లాను. i expected more then prevoius parts... edo just ok annattundi ee movie. Movie starting నుంచి George kutty character malli ఏదో strong legal mind game చూపిస్తాడని expect చేశా. But screenplay ఈసారి అంత convincing‌గా అనిపించలేదు. గత రెండు parts‌ లాగా ఆడియన్స్ ని case analysis mode‌ లోకి తీసుకెళ్లే scenes చాలా తక్కువ. Investigation angle కూడా చాలా predictable‌గా అనిపిస్తుంది.


అన్నిటికి మించి ఈసారి కూడా జార్జ్ కుట్టి పోలీసులకు దొరక్కుండా ఉండడం audience కి రొటీన్ ఫీల్ ఇస్తుంది. because తెలీక చేసినా ఏదో ఒక రోజు punishment అనుభవించాల్సిందే. కానీ మూవీని lag చేస్తూ part 4 కి కూడా lead ఇవ్వడం అంత engaging గా లేదు. కానీ మోహన్ లాల్ మాత్రం ఎప్పట్లాగే సెటిల్డ్ పెర్ఫార్మన్స్ తో impress చేసాడు. Overall‌ గా “Drishyam 3” completely disappointing కాదు… కానీ వన్ టైం వాచబుల్ గా ఉంది. may be part 3 తీయకపోవడమే better. Rating 5

5.0
out of 9
2 months ago
May 25, 2026 Telugu

Drishyam 3 movie Review

Thyview

By Thyview

దృశ్యం 3 మూవీ చూసాక సింపుల్ గా చెప్పాలంటే పెద్దగా నచ్చలేదు. ఇక్కడితో దృశ్యం ప్రాంచైజ్ ని ఆపేస్తే బెటర్ అన్న ఫీల్ వచ్చింది. సినిమాలో పెద్దగా కథా, కథనాలు ఈ మూడో పార్ట్ లో అంతగా ఆకట్టుకోలేదు, పైగా చ...

దృశ్యం 3 మూవీ చూసాక సింపుల్ గా చెప్పాలంటే పెద్దగా నచ్చలేదు. ఇక్కడితో దృశ్యం ప్రాంచైజ్ ని ఆపేస్తే బెటర్ అన్న ఫీల్ వచ్చింది. సినిమాలో పెద్దగా కథా, కథనాలు ఈ మూడో పార్ట్ లో అంతగా ఆకట్టుకోలేదు, పైగా చాలా ల్యాగ్ అనిపిస్తుంది. పైగా తెలుగు వెర్షన్ కి కనెక్ట్ అయిన ఆడియన్స్ ఒరిజినల్ కి కనెక్ట్ కాలేరు అంత ఈజీగా. 


ఇక సెకండ్ హాఫ్ లోనే అసలు స్టోరీ స్టార్ట్ అవుతుంది. డీసెంట్ గా వెళ్తున్న సినిమాను క్లైమాక్స్ వరకు లాక్కొని వెళ్ళాడు డైరెక్టర్. కానీ మూడో పార్ట్ లో హీరో జార్జ్ చేసే పనులకు ఆడియన్స్ అంతగా కనెక్ట్ అవరు. ఎందుకంటే సప్రైజ్ ఎలిమెంట్స్, ట్విస్ట్ లను కూడా ఆడియన్స్ కొన్ని ముందే ఇమాజిన్ చేసుకుంటారు. పైగా ఆ ట్విస్ట్ లకు విసిగిపోయారు. క్లయిమాక్స్ బాగున్నా, సినిమా మొత్తం ఫినిష్ అయ్యాక ఆలోచిస్తే పెద్దగా ఏం లేదనిపిస్తుంది. ఓవరాల్ గా మోహన్ లాల్ వన్ మ్యాన్ షోతో మూవీకి బ్యాక్ బోన్ అయ్యారు. టెక్నికల్లి మూవీ ఓకే. బట్ కొత్తగా చెప్పడానికి మూవీ మూడో పార్ట్ లో ఎం లేదు. ఒకసారి చూసేలా ఉంది గాని, మరో పార్ట్ గురించి ఎక్స్పెక్ట్ చేసేలా లేదు. 

5.0
out of 9
2 months ago
May 23, 2026 Telugu

Drishyam movie Review 3

దృశ్యం 3 మూవీ గురించి చెప్పాలంటే బాగుంది సినిమా. అంటే సెకండ్ హాఫ్ నుండి పీక్స్ ఉంటది సినిమాలో. కానీ ప్రాబ్లెమ్ ఏంటంటే కొన్ని క్యారెక్టర్లు అర్ధం కావు. చాలా సేపు సస్పెన్స్ తర్వాత అర్ధం అయ్యే అవకాశం ఉంట...

దృశ్యం 3 మూవీ గురించి చెప్పాలంటే బాగుంది సినిమా. అంటే సెకండ్ హాఫ్ నుండి పీక్స్ ఉంటది సినిమాలో. కానీ ప్రాబ్లెమ్ ఏంటంటే కొన్ని క్యారెక్టర్లు అర్ధం కావు. చాలా సేపు సస్పెన్స్ తర్వాత అర్ధం అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇది మలయాళం వెర్షన్ కాబట్టి, తెలుగు వెర్షన్ వెంకటేష్ దృశ్యం చూసిన ఆడియన్స్ తొందరగా అర్ధం కాక, కన్ఫ్యూజ్ అవుతారు. అయితే ఫస్ట్ హాఫ్ ల్యాగ్ చాలా మైనస్ అయింది. ఇంటర్వెల్ తప్పిస్తే మొత్తం డొల్ల. పైగా డబ్బింగ్ వరెస్ట్ గా ఉంది.


ఇక కథలోకి వెళ్ళడానికి కూడా చాలా టైం తీసుకోవడం మైనస్. సెకండ్ హాఫ్ కూడా బుర్రపాడు. కానీ ఒరిజినల్ ని ఇష్టపడే ఆడియన్స్ కి సినిమా కనెక్ట్ అవుతారు. ఓవరాల్ గా మూవీ ఎలా ఉందంటే.. ఫస్ట్ హాఫ్ రాడ్ అయినా, సెకండ్ హాఫ్ క్లైమాక్స్ వా.. అన్న ఫీలింగ్ వస్తుంది. పైగా పార్ట్ 4 కి కూడా లీడ్ ఇచ్చారు. బట్ మెజారిటీ ఆడియన్స్ దృశ్యం ఇక్కడితో ఆపేస్తే బెటర్ అన్న కామెంట్స్ వస్తున్నాయి. యాక్టింగ్ వరకు అందరూ బాగా చేసారు. సో మోస్ట్ లీ ఆడియన్స్ కి కనెక్ట్ అవుతాది. ఓవరాల్ గా ఈ మూవీకి 3.5 వరకు రేటింగు ఇవ్వొచ్చు. 


7.0
out of 9
2 months ago
May 23, 2026 Telugu

Drishyam 3 Movie Review

#Drishyam3 A below par third installment from the franchise with a flat narration and very basic writing!The director succeeds in building the mood of the film and creating tension in places, but this...

#Drishyam3 A below par third installment from the franchise with a flat narration and very basic writing!


The director succeeds in building the mood of the film and creating tension in places, but this time the overall writing is unimpressive. Climax sequence is a bit better but the rest feels too basic and way too redundant.


The slow narration is expected, but when the twists themselves don’t land impactfully, it becomes hard to make this one work. Ends up disappointing and nowhere near the range of the first two parts!


Rating: 2.25/5

5.0
out of 9
2 months ago
May 23, 2026 Telugu

Drishyam 3 Movie Review

మోహన్ లాల్, మీనా జంటగా దృశ్యం రెండు పార్టులకు మరో సీక్వెల్ గా తెరకెక్కిన సినిమా దృశ్యం 3. తాజాగా థియేటర్స్ లో రిలీజయింది. దృశ్యం, దృశ్యం 2 సినిమాలు మళయాలంలో హిట్ అవ్వడంతో వేరే భాషల్లోకి రీమేక్ అవగా, త...

మోహన్ లాల్, మీనా జంటగా దృశ్యం రెండు పార్టులకు మరో సీక్వెల్ గా తెరకెక్కిన సినిమా దృశ్యం 3. తాజాగా థియేటర్స్ లో రిలీజయింది. దృశ్యం, దృశ్యం 2 సినిమాలు మళయాలంలో హిట్ అవ్వడంతో వేరే భాషల్లోకి రీమేక్ అవగా, తెలుగులో వెంకటేష్ చేసారు. కానీ ఇప్పుడు పార్ట్ 3 మాత్రం మలయాళం సినిమానే తెలుగులో డబ్బింగ్ చేసారు. ఇక సినిమా విషయానికి వస్తే... మూవీ మొత్తం చాలా ఆర్డినరిగా సాగుతూ, పెద్దగా ఇంట్రెస్టింగ్ సీన్లు లేకుండా అలా సాగిపోయింది. 


క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ లు మాత్రం ఈ సారి సింపుల్ గానే ఉన్నాయి. అయితే మొదటి రెండు సినిమాల్లో ఉన్నంత బలంగా ఈ పార్ట్ 3లో ట్విస్ట్ లు లేకపోవడం గమనార్హం. గత రెండు సినిమాలు వరుణ్ మర్డర్ కేసు చుట్టూ తిరిగాయి, అతని అవశేషాలు కనపడకుండా జార్జ్ ఏం చేసాడు అని నడిపించారు కాబట్టి చాలా ఇంట్రెస్ట్ గా ఉంటాయి ట్విస్ట్ లు. అయితే దృశ్యం 3 మాత్రం పాత కేసుకి లింక్ ఉన్నా ఒక రివెంజ్ డ్రామా, కూతుర్ని కాపాడుకోవడానికి తండ్రి ఏం చేసాడు అని రొటీన్ గా సాగుతుంది. పైగా చివర్లో అంజు విషయంలో నెక్స్ట్ ఏం జరుగుతుంది అని క్లారిటీ ఇవ్వకుండా, సినిమాకు సరైన ముగింపు ఇవ్వకుండా కన్ఫ్యూజన్ ఇవ్వడం ఆడియన్స్ ని కన్ఫ్యూజ్ చేస్తుంది.


ఓవరాల్ గా డైరెక్టర్ జీతూ జోసెఫ్ తన మార్క్ సాగదీసిన కథాంశం, వల్ల దృశ్యం 3 సినిమా మొదటి రెండు పార్టులని మించి ఆశించకుండా వెళ్లి చూస్తే ఓకే అనిపించొచ్చు. వాటికి మించి ఎక్కువ ఊహించి వెళ్తే కష్టం. దృశ్యం ఫ్యాన్స్ ఈ సినిమాని చూడొచ్చు. ఈ సినిమాకు 2.75 రేటింగ్ ఇవ్వొచ్చు.

6.0
out of 9
2 months ago
May 23, 2026 Telugu

Drishyam 3 movie Review

మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, సంచలన దర్శకుడు జీతు జోసెఫ్ కాంబినేషన్‌లో వచ్చిన క్రైమ్ థ్రిల్లర్ ఫ్రాంచైజీ దృశ్యం. ఈ సిరీస్‌లో వచ్చిన మొదటి రెండు భాగాలు సంచలనం సృష్టించాయి. తాజాగా ఇదే ఫ్రాంచైజీ నుంచి చ...

మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, సంచలన దర్శకుడు జీతు జోసెఫ్ కాంబినేషన్‌లో వచ్చిన క్రైమ్ థ్రిల్లర్ ఫ్రాంచైజీ దృశ్యం. ఈ సిరీస్‌లో వచ్చిన మొదటి రెండు భాగాలు సంచలనం సృష్టించాయి. తాజాగా ఇదే ఫ్రాంచైజీ నుంచి చివరి భాగం థియేటర్లలో వచ్చేసింది. అయితే టాప్ ఫ్రాంచైజీ ఒక స్థాయికి చేరుకున్న తర్వాత కొత్తదనం లోపిస్తే ప్రేక్షకులకు కొంత విసుగు రావడం సహజం. దృశ్యం 3 విషయంలో సరిగ్గా ఇదే జరిగింది. కొత్త కోణంలో కథను చెబితే బాగుండేది కానీ.. మళ్లీ పాత సమస్యనే తిప్పి తిప్పి చూపించడం వల్ల కథనం కాస్త రొటీన్‌ గా అనిపిస్తుంది.


ఇక సినిమాలో జార్జ్ కుట్టి తన తెలివితేటలతో ఎలాగోలా బయటపడతాడు అనే విషయం ప్రేక్షకులకు ముందే తెలిసిపోవడం వల్ల గత సినిమాల్లో లాగా థ్రిల్ ఫీల్ అవ్వలేము. భావోద్వేగాలు కూడా మునుపటి స్థాయిలో పండలేదు. ఇందులో ట్విస్టులు ఉండవని ముందుగానే దర్శకుడు చెప్పినా కూడా, ఇంత ఫ్లాట్ నెరేషన్ జీతూ జోసెఫ్ నుంచి ఊహించలేదు. జీతు జోసెఫ్ గత రెండు సినిమాలతో ఒక బెంచ్ మార్క్ సెట్ చేయడం వల్ల మూడో భాగం ఆ స్థాయిని అందుకోలేకపోయింది. క్లైమాక్స్ కూడా మునుపటి మ్యాజిక్ రిపీట్ చేయలేకపోయింది. మొత్తానికి ఒక బలమైన ఎమోషనల్ కనెక్ట్ మిస్ అవ్వడం ఈ చిత్రానికి పెద్ద మైనస్. దృశ్యం ఫ్రాంచైజీకి వీరాభిమానులు అయితే ఓకే కానీ నార్మల్ ఆడియన్స్‌కు ఈ సినిమా ఎక్కడం కష్టమే.

6.0
out of 9
2 months ago
May 23, 2026 Telugu

Drishyam Movie Telugu

దృశ్యం సినిమాలకు ఇండియా వైడ్ గా మంచి క్రేజ్‌ ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే విడుదలైన రెండు సినిమాలు అన్ని భాషల్లో పెద్ద హిట్‌ అయ్యాయి. దీనికి మూలం మలయాళం. అక్కడ మోహన్‌లాల్‌, మీనానటించగా, ఇందులో భాగంగ...

దృశ్యం సినిమాలకు ఇండియా వైడ్ గా మంచి క్రేజ్‌ ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే విడుదలైన రెండు సినిమాలు అన్ని భాషల్లో పెద్ద హిట్‌ అయ్యాయి. దీనికి మూలం మలయాళం. అక్కడ మోహన్‌లాల్‌, మీనానటించగా, ఇందులో భాగంగా ఇప్పుడు మలయాళంలో మూడో సీక్వెల్‌ వచ్చింది. అయితే గత రెండు చిత్రాల మంచి ఆదరణ పొందాయి. ఇప్పుడు మూడో పార్ట్ కూడా అదే తరహాలో ఎంగేజ్‌ చేసిందా? ట్విస్ట్ లు, టర్న్ లతో సాగిందా? అవి ఆడియెన్స్ ని ఆకట్టుకున్నాయా? అంటే ఆ స్థాయిలో లేదనే చెప్పాలి.


సినిమా ప్రారంభం నుంచి చాలా స్లోగా సాగుతుంది. కథ ముందే తెలియడంతో ఇందులో కథనం ఊహించినట్టుగానే ఉంటుంది. దీనికితోడు కథలో ఇంటెన్సిటీ మూడ్‌ ని క్రియేట్‌ చేయడానికి దర్శకుడు చాలా టైమ్‌ తీసుకున్నారు. దీంతో బోరింగ్‌ గా ఉంటుంది. మధ్య మధ్యలో థ్రిల్‌ ఎలిమెంట్లు ఒకటి రెండు యాడ్‌ చేశారు. కానీ అవి పెద్దగా కిక్‌ ఇవ్వవు. నటీనటుల పెర్ఫార్మన్స్ వరకు మోహన్ లాల్ సహా అందరూ బానే చేసారు. కానీ ఆ పాత్రలకు కనెక్ట్ అవ్వాలంటే కొంచెం కష్టమే. ఓవరాల్ గా స్లోగా, బోరింగ్‌ గా సాగే ఈ దృశ్యం 3 మూవీ, మధ్య మధ్యలో చిన్న మెరుపులు, క్లైమాక్స్ తో కాస్త ఆకట్టుకుంటుంది. అయితే గత రెండు సినిమాలతో పోల్చితే డిజప్పాయింట్‌ చేస్తుంది.


5.0
out of 9
2 months ago
May 23, 2026 Telugu

Drishyam 3 movie Review

Sakshi

By Sakshi

‘దృశ్యం’, ‘దృశ్యం-2’ సినిమాలతో ప్రేక్షకులను థ్రిల్ చేసిన జీతు జోసెఫ్ ఈసారి ‘దృశ్యం-3’తో మరోసారి ఆడియన్స్ ముందుకొచ్చాడు. తెలుగులో వెంకటేష్ మొదటి రెండు పార్ట్స్ ని రీమేక్ చేయగా, మూడో పార్ట్ రీమేక్ చేయలే...

‘దృశ్యం’, ‘దృశ్యం-2’ సినిమాలతో ప్రేక్షకులను థ్రిల్ చేసిన జీతు జోసెఫ్ ఈసారి ‘దృశ్యం-3’తో మరోసారి ఆడియన్స్ ముందుకొచ్చాడు. తెలుగులో వెంకటేష్ మొదటి రెండు పార్ట్స్ ని రీమేక్ చేయగా, మూడో పార్ట్ రీమేక్ చేయలేదు. మలయాళ వెర్షన్ నే తెలుగులో నేరుగా రిలీజ్ చేసారు. ఒరిజినల్ వెర్షన్ దృశ్యం 3 లో జార్జ్‌ కుట్టి పాత్రలో మోహన్‌లాల్ తన అనుభవంతో ఆకట్టుకున్నా… కథలో కొత్తదనం మాత్రం పెద్దగా కనిపించదు. గత భాగాలతో పోలిస్తే ఈ సినిమాలో థ్రిల్, టెన్షన్ తగ్గిన ఫీలింగ్ వస్తుంది. ప్రేక్షకుల్ని ఆశ్చర్యపరిచే ట్విస్టులు కూడా అంతగా పని చేయలేదు.


ఇక తెలుగు డబ్బింగ్ పర్లేదు గాని, కొన్ని చోట్ల డబ్బింగ్ నేచురల్‌ గా అనిపించదు. పైగా తెలుగు ప్రేక్షకులకు వెంకటేష్ చేసిన ‘దృశ్యం’ బాగా కనెక్ట్ కావడంతో మోహన్‌లాల్ వెర్షన్ అందరికీ అంతగా దగ్గర కావడం కష్టమే. దర్శకుడిగా, రచయితగా జీతు జోసెఫ్ ఈసారి తన స్థాయి స్క్రీన్‌ప్లే చూపించలేకపోయాడు. బీజీఎమ్ పర్వాలేదు. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. అయితే ఓవరాల్‌గా మొదటి రెండు భాగాలతో కంపేర్ చేస్తే... ‘దృశ్యం-3’ ఒక యావరేజ్ థ్రిల్లర్‌గా మాత్రమే మిగిలిపోయింది. 

5.0
out of 9
2 months ago
May 23, 2026 Telugu

Drishyam 3 Movie Review

మోహన్ లాల్ నటించిన తాజా చిత్రం "దృశ్యం 3". జీతూ జోసెఫ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ 'దృశ్యం' మూవీ ఫ్రాంచైజీలో మూడో పార్ట్ గా వచ్చింది. ఈ ఫ్రాంచైజీకి ఉన్న పాపులారిటీ వల్ల ఈసారి తెలుగు రీమేక్ హక్కులు అ...

మోహన్ లాల్ నటించిన తాజా చిత్రం "దృశ్యం 3". జీతూ జోసెఫ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ 'దృశ్యం' మూవీ ఫ్రాంచైజీలో మూడో పార్ట్ గా వచ్చింది. ఈ ఫ్రాంచైజీకి ఉన్న పాపులారిటీ వల్ల ఈసారి తెలుగు రీమేక్ హక్కులు అమ్మకుండా మలయాళంతో పాటు తమిళం, తెలుగు, హిందీ భాషల్లో ఒకేసారి విడుదల చేసారు. అయితే ఈ మూడో పార్ట్ మాత్రం అంతగా రెస్పాన్స్ అందుకోలేకపోయింది. అసలు దృశ్యం అంటేనే అద్భుతమైన స్క్రీన్‌ ప్లే, ఊహించని ట్విస్టులు గుర్తుకొస్తాయి. కానీ దృశ్యం 3 మాత్రం ఆ స్థాయి మాయాజాలాన్ని పూర్తిగా అందుకోలేకపోయింది.



జీతు జోసెఫ్ పేరు వినగానే ప్రేక్షకులు పెద్ద ట్విస్టులు, తెలివైన కథనాన్ని ఆశిస్తారు. కానీ ఈసారి ఆయన కథను చాలా సాధారణంగా చెప్పిన భావన కలుగుతుంది. గత రెండు భాగాలతో పోలిస్తే ఈ సినిమాలో కొత్తదనం తక్కువగా కనిపిస్తుంది. ఇక గ్రామీణ వాతావరణాన్నయితే సహజంగా చూపించారు. అయితే ఎడిటింగ్ విషయంలో ఇంకాస్త కట్టుదిట్టంగా ఉండాల్సింది. మొదటి భాగంలో అనవసరంగా సాగదీసిన సన్నివేశాలు తగ్గించి ఉంటే సినిమా మరింత ప్రభావవంతంగా ఉండేది. ఓవరాల్ గా దృశ్యం 3 మూవీని తక్కువ అంచనాలతో చూస్తే బెటర్. 


6.0
out of 9
2 months ago
May 23, 2026 Telugu

Drishyam 3 Movie Review

దృశ్యం’ అనే పేరు వినగానే ఆడియన్స్‌కు ముందుగా గుర్తొచ్చేది mind game screenplay. ఫ్యామిలీ ఎమోషన్స్‌తో crime thriller‌ని mix చేసి ప్రేక్షకులని సీట్ల ఎడ్జ్ మీద కూర్చోబెట్టిన ఫ్రాంచైజ్ ఇది. ఇందులో భాగంగా...

దృశ్యం’ అనే పేరు వినగానే ఆడియన్స్‌కు ముందుగా గుర్తొచ్చేది mind game screenplay. ఫ్యామిలీ ఎమోషన్స్‌తో crime thriller‌ని mix చేసి ప్రేక్షకులని సీట్ల ఎడ్జ్ మీద కూర్చోబెట్టిన ఫ్రాంచైజ్ ఇది. ఇందులో భాగంగా తాజాగా ‘దృశ్యం-3’ విడుదల కాగా, మలయాళ డబ్ నే తెలుగులోనూ రిలీజ్ చేసారు. కథా, కథనాల గురించి మాట్లాడితే ముందు భాగాల్లో ఉన్న ఆత్రుత, ఇంట్రెస్ట్ ఈ మూడో భాగంలో ఉండదు. మోహన్ లాల్ సహా మిగతా నటీనటులందరూ బాగానే చేసినా, కథలో మాత్రం ఒక wow factor కనిపించదు. 


ఫస్టాఫ్ అంతా స్లో గా సాగదీసినట్టు ఉండడమే కాకుండా, ట్విస్టులు కూడా పెద్దగా షాక్ ఇవ్వవు. పైగా తెలుగు డబ్బింగ్ మేజర్ మైనస్ అయింది. డబ్బింగ్ సినిమాటిక్ గా, సహజంగా ఉండదు. ఓవరాల్ గా సినిమాలో క్లైమాక్స్ 20 నిముషాలు మినహా మొత్తం సినిమా డల్ గా ఉంటుంది. బీజీఎమ్ కూడా పెద్దగా హెల్ప్ అవలేదు. ఓవరాల్ గా దృశ్యం 3 గురించి సింపుల్ గా చెప్పాలంటే... లౌ ఎక్స్పెక్టేషన్స్ తో ఒకసారి చూసేయొచ్చు. కానీ ఇప్పటికైనా దృశ్యం సిరీస్ గౌరవాన్ని కాపాడుతూ.. ఈ సిరీస్ ఇక్కడితో ఆపేస్తే బెటర్. మొదటి రెండు భాగాలతో పోలిస్తే దృశ్యం 3 మసకబారింది. 

5.0
out of 9
2 months ago
May 23, 2026 Telugu

Drishyam Movie Review

విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన 'దృశ్యం', 'దృశ్యం 2' ప్రేక్షకుల్ని మెప్పించాయి. ఆ రెండూ మలయాళంలో మోహన్ లాల్ (Mohanlal) హీరోగా జీతూ జోసెఫ్ దర్శకత్వంలో వచ్చిన సినిమాలకు రీమేక్స్. అయితే 'దృశ్యం' ఫ్రాంచైజ...

విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన 'దృశ్యం', 'దృశ్యం 2' ప్రేక్షకుల్ని మెప్పించాయి. ఆ రెండూ మలయాళంలో మోహన్ లాల్ (Mohanlal) హీరోగా జీతూ జోసెఫ్ దర్శకత్వంలో వచ్చిన సినిమాలకు రీమేక్స్. అయితే 'దృశ్యం' ఫ్రాంచైజీలో మూడో సినిమాను రీమేక్ చేయలేదు. తాజాగా తెలుగులోనూ మోహన్ లాల్ సినిమాను డబ్బింగ్ చేసి దృశ్యం 3 ని విడుదల చేశారు. సినిమా ఎలా ఉందనేది పక్కన పెడితే... తెలుగు ప్రేక్షకులకు ఎదురయ్యే మొదటి సమస్య ఒరిజినల్ వెర్షన్ లో , ప్రధాన పాత్రధారులను తొందరగా పోల్చుకోకపోవడం.


అందువల్ల కొంతమంది తెలుగు ఆడియన్స్ మూవీకి కనెక్ట్ కాకపోవచ్చు. ఇక 'దృశ్యం', 'దృశ్యం 2' సినిమాల్లో కథతో పాటు కథనం కూడా ఉత్కంఠ కలిగిస్తుంది. ట్విస్టులు సర్‌ప్రైజ్ చేయడంతో పాటు షాక్ ఇస్తాయి. పోలీస్ స్టేషన్ కింద దొరికిన అస్థిపంజరం వరుణ్‌ ది కాదని కోర్టులో తెలిసే సీన్, లాయర్ ఎక్స్‌ప్రెషన్ ఇప్పటికీ వైరల్ అవుతుంది. కానీ 'దృశ్యం 3'లో అటువంటి సన్నివేశం ఒక్కటి కూడా లేదు. ఆ సంగతి పక్కన పెడితే... 'దృశ్యం' ఫ్రాంచైజీలో మొదటి రెండు సినిమాల్లో సగం ఉత్కంఠ కూడా మూడో భాగం ఇవ్వలేదు. అందుకే ముందు భాగాల్లాగా దృశ్యం 3కి థియేటర్లలో థ్రిల్ అవ్వడం చాలా కష్టం. మోహన్ లాల్ వీరాభిమానులను సైతం దృశ్యం 3 మెప్పించడం కష్టమే అనిపిస్తుంది. 


5.0
out of 9
2 months ago
May 23, 2026 Telugu
Why MRO?