Register as a Reviewer
Home Latest Movie Reviews

Latest Movie Reviews

The most recent reviews from top critics and publications

1221 Reviews
Showing 553–564 of 1221 reviews

Peddi Movie Review

 గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన పెద్ది ఎట్టకేలకు థియేటర్లలో విడుదలై మంచి రెస్పాన్స్ ని కూడా రాబట్టుకుంది. బుచ్చిబాబు దర్శకత్వం వహించిన ఈ సినిమా రూరల్ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కగా, జాన...

 గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన పెద్ది ఎట్టకేలకు థియేటర్లలో విడుదలై మంచి రెస్పాన్స్ ని కూడా రాబట్టుకుంది. బుచ్చిబాబు దర్శకత్వం వహించిన ఈ సినిమా రూరల్ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కగా, జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించింది. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ నటనతో పాటు, బుచ్చిబాబు టేకింగ్, ఎఆర్ రహ్మన్ అదిరిపోయే మ్యూజిక్ తో సినిమాని నిలబెట్టారు. 


అయితే కథ పరంగా చాలా చిన్నగా ఉంటుంది. మాములు కొండప్రాంతానికి చెందిన పెద్ది అనే యువకుడు ఊరి కోసం చేసిన పోరాటమే ఈ కథ నేపథ్యం. ఇక స్క్రీన్ ప్లే కూడా కాస్త డల్ గా ఉన్నప్పటికి, ఆడియన్స్ ని ఎమోషనల్ గా టచ్ చేయడంలో బుచ్చిబాబు సక్సెస్ అయ్యాడు. ముఖ్యంగా సినిమాలో రామ్ చరణ్ నటన ఢిల్లీ ఎపిసోడ్స్, కుస్తీ సీన్స్ హైలెట్ అయ్యాయి. అలాగే జగపతి బాబు, శివరాజ్ కుమార్ కూడా మూవీకి ప్లస్ అయ్యారు. ఎఆర్ రహ్మాన్ సినిమాకి అద్భుతమైన సాంగ్స్ తో పాటు సాలిడ్ బీజీఎమ్ ఇచ్చారు. ఓవరాల్ గా సినిమాకి పెద్ది కథ ఇంకా బలంగా రాసుకుని ఉంటె ఇంపాక్ట్ వేరే లెవెల్ లో ఉండేది. కాని ఫైనల్ గా ఈ పెద్ది అందరికి గుర్తుండిపోతాడు. 

7.0
out of 9
2 months ago
Jun 04, 2026 Hindi

Peddi Movie Review

Tupaki

By Tupaki

సంక్రాంతి తర్వాత వెలవెలబోయిన టాలీవుడ్ బాక్సాఫీస్ ను గట్టెక్కించే సినిమా అవుతుందని ఇండస్ట్రీ అంతా ఆశలు పెట్టుకున్న చిత్రం.. పెద్ది. తన అరంగేట్ర చిత్రం ‘ఉప్పెన’తోనే సెన్సేషన్ క్రియేట్ చేసిన బుచ్చిబాబు ద...

సంక్రాంతి తర్వాత వెలవెలబోయిన టాలీవుడ్ బాక్సాఫీస్ ను గట్టెక్కించే సినిమా అవుతుందని ఇండస్ట్రీ అంతా ఆశలు పెట్టుకున్న చిత్రం.. పెద్ది. తన అరంగేట్ర చిత్రం ‘ఉప్పెన’తోనే సెన్సేషన్ క్రియేట్ చేసిన బుచ్చిబాబు దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన చిత్రమిది. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చి అనుకున్నట్టుగానే మంచి రెస్పాన్స్ ని అందుకుంటుంది. సినిమాలో రామ్ చరణ్ నటనతో పాటు బుచ్చిబాబు టేకింగ్, ఎఆర్ రహ్మన్ అదిరిపోయే మ్యూజిక్ తో సినిమాని నిలబెట్టారు. 


కథ పరంగా రొటీన్ స్టోరీయే అయినా, తన స్క్రీన్ ప్లే మ్యాజిక్ తో బుచ్చిబాబు మ్యానేజ్ చేసాడు. ఇక ‘పెద్ది’ కోసం బుచ్చిబాబు ఏరి కోరి ఏఆర్ రెహమాన్ ను ఎంచుకున్నందుకు ఆయన మంచి ఔట్ పుటే ఇచ్చాడు. స్పెషల్లీ బీజీఎం అదిరిపోయింది. రత్నవేలు విజువల్స్ సాంకేతికంగా సినిమాలో మరో హైలైట్. నిర్మాణ విలువలు బాగున్నాయి. ఇక చరణ్ తో పాటు జగపతిబాబు, శివరాజ్ కుమార్ రోల్స్ బిగ్గెస్ట్ ప్లస్ అయ్యాయి. ఓవరాల్ గా ఒక చిన్న సినిమా అనుభవంతో ఇంత పెద్ద ప్రాజెక్టును డీల్ చేసిన విధానానికి.. రామ్ చరణ్ నుంచి అద్భుతమైన పెర్ఫామెన్స్ రాబట్టుకున్న తీరుకు బుచ్చిబాబు అభినందనీయుడే.


7.0
out of 9
2 months ago
Jun 04, 2026 Hindi

Peddi Movie Review

సినిమా ఆడటం అనేది ఆ సినిమా హీరోకి.. లేదంటే ఆ డైరెక్టర్‌కో, నిర్మాతకో, హీరోయిన్‌కో అవసరం. కానీ ఇప్పుడు పెద్ది సినిమా హిట్ అవ్వడం ఇండస్ట్రీకి అత్యవసరం. సంక్రాంతి తర్వాత గత ఆర్నెళ్లుగా ఒక్కటంటే ఒక్క సూపర...

సినిమా ఆడటం అనేది ఆ సినిమా హీరోకి.. లేదంటే ఆ డైరెక్టర్‌కో, నిర్మాతకో, హీరోయిన్‌కో అవసరం. కానీ ఇప్పుడు పెద్ది సినిమా హిట్ అవ్వడం ఇండస్ట్రీకి అత్యవసరం. సంక్రాంతి తర్వాత గత ఆర్నెళ్లుగా ఒక్కటంటే ఒక్క సూపర్ హిట్ సినిమా లేదు. ఇలాంటి సమయంలో టాలీవుడ్ లో భారీ ఎక్స్పెక్టేషన్స్ తో విడుదలైన పెద్ది సినిమా ఆడియన్స్ నుండి యానానిమస్ గా అదిరిపోయే రెస్పాన్స్ దక్కించుకుంది. రామ్ చరణ్ మైండ్ బ్లోయింగ్ ట్రాన్స్‌ఫర్మేషన్‌ అండ్ పెర్ఫార్మన్స్ తో ఫ్యాన్స్ చేత విజిల్స్ వేయించాడు. అయితే ఎప్పుడో అరిగిపోయిన టెంప్లెట్, ఫార్మాట్‌ ను వాడారు బుచ్చిబాబు. అదొక్కటి సినిమాకి మైనస్ గా నిలిచింది. 


ఇక స్పెషల్ సాంగ్ కూడా ఇంప్రెసివ్ గా లేదు. ఆపై హీరోయిన్ క్యారెక్టర్ సాంగ్స్ కోసమే ఉన్నట్టు అయిపొయింది. ఫస్ట్ హాఫ్ లో చాలావరకు మరీ ప్రెడిక్టబుల్‌ గా సాగుతుంది. ఇంటర్వెల్‌ కి కాస్త కథ బరువు ఎక్కినట్టుగా అనిపిస్తుంది. ఇంటర్వెల్ బ్లాక్‌ లో కుస్తీ సీన్ అదిరిపోతుంది. ఫ్యాన్స్ ని మెప్పించడంలో మాత్రం బుచ్చిబాబు సక్సెస్ అయ్యాడు. ఇక ఎఆర్ రెహమాన్ మ్యూజిక్ కూడా సినిమాకి బిగ్గెస్ట్ ఎస్సెట్ గా నిలిచింది. ఓవరాల్ గా సినిమా రామ్ చరణ్ కి అదిరిపోయే కం బ్యాక్ ఇచ్చిందని చెప్పొచ్చు. 

7.0
out of 9
2 months ago
Jun 04, 2026 Hindi

Peddi Movie Review

టాలీవుడ్ లో ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న మోస్ట్ అవైటెడ్ సినిమా "పెద్ది" ఫైనల్ గా థియేటర్లలో విడుదలైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన ఈ మూవీని బుచ్చిబాబు డైరెక్ట్ చేసాడు. ఇక సినిమా విషయానికి...

టాలీవుడ్ లో ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న మోస్ట్ అవైటెడ్ సినిమా "పెద్ది" ఫైనల్ గా థియేటర్లలో విడుదలైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన ఈ మూవీని బుచ్చిబాబు డైరెక్ట్ చేసాడు. ఇక సినిమా విషయానికి వస్తే... 90స్ బ్యాక్ డ్రాప్ లో రూరల్ కథగా తెరకెక్కిన పెద్ది సినిమా ఫ్యాన్స్ ని అమితంగా మెప్పిస్తుంది. ఊరి గుర్తింపు కోసం ఆటగాడైన పెద్ది చేసిన పోరాటమే ఈ సినిమా కథ. 


ఓవరాల్ గా చూసుకున్నట్టైతే ఈ ‘పెద్ది’... ఆడియన్స్ మనసుల్ని కదిలించే ఒక ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా అని చెప్పొచ్చు. రామ్ చరణ్ పెర్ఫామెన్స్, మూడు వేరియేషన్స్ లలో తను పడ్డ కష్టం వర్ణనాతీతం. జగపతి బాబు, శివరాజ్ కుమార్ మరో హైలైట్ గా నిలిచారు. రెహమాన్ సంగీతం ఈ సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ గా నిలిచింది. అన్నిటికి మించి రొటీన్ కథే అయినా బుచ్చిబాబు తన టేకింగ్ తో మెప్పించాడు. అలాగే రత్నవేలు సినిమాటోగ్రఫీ, నవీన్ నూలి ఎడిటింగ్ కూడా బాగున్నాయి. ఓవరాల్ గా మంచి ఎమోషనల్ బ్లాక్ లు, సాలిడ్ స్పోర్ట్స్ ఎపిసోడ్స్ ఫ్యాన్స్ కి థియేటర్ లో ట్రీట్ ఇస్తాయి. 


7.0
out of 9
2 months ago
Jun 04, 2026 Hindi

Review For Mareechika

వారం మొత్తం ఆఫీస్ లో deadlines, meetings, calls‌ తో బిజీగా గడిచిపోయింది. అందుకే Weekend‌ లో రిలాక్స్ అవుదామని friends‌ తో కలిసి ఈ Sunday ‘మరీచిక’ మూవీకి వెళ్లా.. Trailer కూడా చూడకుండా సినిమాకి వెళ్ళాన...
వారం మొత్తం ఆఫీస్ లో deadlines, meetings, calls‌ తో బిజీగా గడిచిపోయింది. అందుకే Weekend‌ లో రిలాక్స్ అవుదామని friends‌ తో కలిసి ఈ Sunday ‘మరీచిక’ మూవీకి వెళ్లా.. Trailer కూడా చూడకుండా సినిమాకి వెళ్ళాను. అందుకే దానికి తగ్గ రిజల్ట్ అందుకున్నాం. ఏదో మంచి thriller అనుకున్నా, స్టోరీ లైన్ బాగున్నా, సినిమా మాత్రం చాలా slow execution‌ తో సాగింది. సినిమాలో కొన్ని twists బాగున్నా, క్లైమాక్స్ కొచ్చేసరికి చాలా బోర్ ఫీలోచ్చింది. actors కూడా బాగా perform చేశారు. బట్ స్టోరీయే సరిగా లేనప్పుడు ఏం చేస్తాం. narration చాలా lag అయ్యింది. ఏదో Work stress తగ్గించుకోవడానికి movie కి వెళ్తే, ఇంకో stress add అయింది మాకు. దాని బదులు హోటల్ కెళ్ళి బిర్యానీ తిన్నా బాగుండేదనిపించింది. Overall‌ మరీచికని ఇప్పుడు కూడా చూడాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్లయితే OTT కి వచ్చిన తర్వాత చూస్తే బెటర్.
5.0
out of 9
2 months ago
Jun 03, 2026 Telugu

Mareechika Movie Review

Watched Mareechika movie this weekend with low expectations and ended up enjoying it more than I expected. Anupama, Regina, and Viraj Ashwin deliver convincing performances, while the suspense element...

Watched Mareechika movie this weekend with low expectations and ended up enjoying it more than I expected. Anupama, Regina, and Viraj Ashwin deliver convincing performances, while the suspense elements work well in key moments. 


ilayaraja music is also good, But expected more. overall Mareechika is a decent watchable.

6.0
out of 9
2 months ago
Jun 02, 2026 Telugu

Mareechika Movie Review

మరీచిక సినిమాకు ప్రధాన బలం కథనమే. కానీ డైరెక్టర్ సతీష్ కాశెట్టి దాన్ని స్క్రీన్ మీద ప్రెజెంట్ చేసిన విధానం ఆశించినంత లేదు. ఒక సాధారణ డ్రామాలా మొదలైన సినిమా, మెల్లగా ఒక డార్క్ థ్రిల్లర్ మూడ్‌లోకి షిఫ్ట...

మరీచిక సినిమాకు ప్రధాన బలం కథనమే. కానీ డైరెక్టర్ సతీష్ కాశెట్టి దాన్ని స్క్రీన్ మీద ప్రెజెంట్ చేసిన విధానం ఆశించినంత లేదు. ఒక సాధారణ డ్రామాలా మొదలైన సినిమా, మెల్లగా ఒక డార్క్ థ్రిల్లర్ మూడ్‌లోకి షిఫ్ట్ అవుతుంది. సినిమాలో కొన్ని సీన్స్ లో కాస్త ఉత్కంఠను మెయింటైన్ చేయడంలో డైరెక్టర్ బాగానే సక్సెస్ అయ్యాడు. అయితే అక్కడక్కడా కొన్ని ఎమోషనల్ సీన్స్ కాస్త లాగ్ అయిన ఫీలింగ్ వస్తుంది. 


క్లైమాక్స్ కథనం మరింత గ్రిప్పింగ్‌గా ఉంది.. కానీ ఆడియన్స్ ఊహకు అందకుండా నాన్-లీనియర్ పద్ధతిలో కథను నడిపించడంలో స్క్రీన్ ప్లే రైటర్స్ చూపించిన నేర్పు మెచ్చుకోవాలి. అయితే లాజిక్స్ వెతికే వాళ్లకు కొన్ని ప్రశ్నలు మిగిలినా.. ఓవరాల్‌గా ఈ స్క్రీన్ ప్లే ప్రేక్షకులకు ఒక థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది. కొన్నిచోట్ల మాత్రం లాజిక్ ఉండదు.. మరికొన్నిచోట్ల కథనం చాలా నెమ్మదిగా సాగుతుంది. డార్క్ సైకలాజికల్ థ్రిల్లర్స్ చూడాలనుకునేవాళ్లకు మరీచిక మంచి ఛాయిసే. ఇక ప్రొడక్షన్ వాల్యూస్ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా, సినిమా స్థాయికి తగ్గట్టుగా గ్రాండ్‌గా ఉన్నాయి. ఓవరాల్‌గా మరీచిక.. డీసెంట్ సైకలాజికల్ థ్రిల్లర్..!




5.0
out of 9
2 months ago
Jun 01, 2026 Telugu

Mareechika movie Review

మరీచిక సినిమా ఎలా ఉందో చెప్పే ముందు... ఈ టైటిల్ 'మరీచిక' గురించి ప్రస్తావిస్తే... అసలు మరీచిక అంటే అర్థం ఏమిటి? అని ప్రేక్షకులు కొద్దిమందైనా ఆలోచిస్తారు. అయితే మరీచిక అంటే ఎండమావి అని సినిమాలో చె...

మరీచిక సినిమా ఎలా ఉందో చెప్పే ముందు... ఈ టైటిల్ 'మరీచిక' గురించి ప్రస్తావిస్తే... అసలు మరీచిక అంటే అర్థం ఏమిటి? అని ప్రేక్షకులు కొద్దిమందైనా ఆలోచిస్తారు. అయితే మరీచిక అంటే ఎండమావి అని సినిమాలో చెప్పారు. వేసవిలో ఎండమావి కనిపిస్తుంది, కానీ నీళ్లు ఉండవు. అయితే ఈ సినిమాలోనూ అంతే... నెక్స్ట్ సీన్ నుంచి బావుంటుందని ప్రేక్షకులు ఎదురు చూడటం తప్ప బావుందన్న సంతృప్తి కలగదు. సతీష్ కాసెట్టి దర్శకత్వం వహించిన ఈ 'మరీచిక'లో థ్రిల్లర్ ఒక సినిమాకు కావాల్సిన ట్విస్టులు, టర్నులు ఉన్నాయి. కాని ప్రేక్షకులకు థ్రిల్ ఇచ్చేలా చెప్పే కథనం, దర్శకత్వం కరువైంది.


ఓవరాల్ గా నటీనటుల పెర్ఫార్మన్స్ బాగుంది. కానీ సరైన కథనం లేకపోవడంతో ఆడియన్స్ ని చాలా నిరాశపరిచింది. సింపుల్ గా చెప్పాలంటే ఈ మరీచిక... పేరుకు తగ్గట్లుందీ ఈ సినిమా. ఎండమావిలో నీళ్లు లేనట్టు... సినిమాలోనూ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎగ్జైట్ చేసే, థ్రిల్ ఇచ్చే కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం లేవు. కథలో క్రైమ్ ఎలిమెంట్స్, ట్విస్టులు ఉన్నాయి. కానీ ప్రేక్షకుడు ఆహా అనేలా ఒక్కటీ లేదు. కొత్తదనం కోరుకునే ప్రేక్షకులు స్కిప్ చేయడం బెటర్. లేదంటే ఓటిటిలో చూసేయొచ్చు. 

3.0
out of 9
2 months ago
Jun 01, 2026 Telugu

Mareechika Movie Review

మరీచిక.. అంటూ ఈ వారం విడుదలైన సైకలాజికల్ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ ఆడియన్స్ నుండి డివైడ్ టాక్ అందుకుంది. ఎంతలా అంటే సినిమాలో మర్డర్ ని చూసి హీరోయిన్ తల పట్టుకుని ఏడుస్తుంది. అలాగే థియేటర్లోని ప్రేక్షకు...

మరీచిక.. అంటూ ఈ వారం విడుదలైన సైకలాజికల్ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ ఆడియన్స్ నుండి డివైడ్ టాక్ అందుకుంది. ఎంతలా అంటే సినిమాలో మర్డర్ ని చూసి హీరోయిన్ తల పట్టుకుని ఏడుస్తుంది. అలాగే థియేటర్లోని ప్రేక్షకులు సైతం తల పట్టుకునేలా చేశారు సినిమా దర్శకులు. ఆ రకంగా ఈ సినిమా టైటిల్‌ ను జస్టిఫై చేశారు మేకర్స్. 


సింపుల్ గా కథ నేపథ్యం చెప్పాలంటే... ఇందులోని పాత్రలన్నీ డ్రామా ఆడేవే. డబ్బుల కోసం కొందరు, ప్రేమ కోసం మరికొందరు, స్నేహం కోసం ఇంకొందరు, ఆస్తుల కోసం మరికొందరు! ఈ డ్రామాలో ఏది నిజమో ఏది అబద్ధమో తెసుకోవడమే పెద్ద పజిల్‌. ప్రేక్షకులకు ఇలాంటి ప్రహేళికను ఇచ్చిన సినిమా ఈ మధ్యకాలంలో మరొకటి లేదంటే అతిశయోక్తి కాదు. కానీ బోరింగ్ సీన్లతో, పస లేని కథతో ఆడియన్స్ కి విసుగుపుట్టించారు. ఇళయరాజా సంగీతం అందించారనో, కాస్త పేరున్న ఆర్టిస్టులు ఉన్నారనో ఆశతో థియేటర్ కు వెళితే... ఎడారిలో ఎండమావిలా అవుతుంది ప్రేక్షకుల పరిస్థితి. కొద్ది రోజులు ఆగితే ఈ సినిమా ఎలానూ ఓటీటీలో వస్తుంది. అప్పుడు కూడా తీరుబడి ఉంటే... మీ కిష్టమైన అనుపమా పరమేశ్వరన్‌ నటన కోసం ఓసారి చూడండి. అంతే..

4.0
out of 9
2 months ago
Jun 01, 2026 Telugu

Mareechika Movie Review

సైకలాజికల్ థ్రిల్లర్, మర్డర్ మిస్టరీ, లవ్, రివేంజ్ లాంటి అంశాలతో తెరకెక్కిన మూవీ మరీచిక. తాజాగా థియేటర్లలో విడుదలైన ఈ మూవీ బీలో యావరేజ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. అయితే దర్శకుడు సతీష్ కాసెట్టి కథను...

సైకలాజికల్ థ్రిల్లర్, మర్డర్ మిస్టరీ, లవ్, రివేంజ్ లాంటి అంశాలతో తెరకెక్కిన మూవీ మరీచిక. తాజాగా థియేటర్లలో విడుదలైన ఈ మూవీ బీలో యావరేజ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. అయితే దర్శకుడు సతీష్ కాసెట్టి కథను ఊహించుకోవడం బాగానే ఉన్నా, దానికి తగినట్టుగా నటీనటులను ఎంపిక చేసుకొన్నా, కథను సాఫీగా, సూటిగా, సుత్తి లేకుండా చెప్పడంలో పూర్తిగా తడబాటుకు గురయ్యాడు. సంజూ (విరాజ్ అశ్విన్) ని చంపే సీన్‌ తో కథను అత్యంత ఆసక్తిగా ప్రారంభించాడు. కానీ అదే క్యూరియాసిటీని ఆడియెన్స్‌ లో కొనసాగించలేకపోయాడనే చెప్పాలి. 


స్క్రీన్ ప్లే విషయంలో గందరగోళం కారణంగా ఒక మంచి పాయింట్‌తో వచ్చిన కథ ఆడియెన్‌ ను ఇంప్రెస్ చేయడంలో ఫెయిల్ అయిందనే చెప్పాలి. ఇక ఈ సినిమాకు మ్యూజిక్ మేస్ట్రో ఇళయరాజా సంగీతం ఇచ్చారు. కానీ కథలో కంటెంట్ బలంగా లేకపోవడం, సన్నివేశాలు పేలవంగా ఉండటం, స్టోరీలో క్లారిటీ లేకపోవడం వల్ల ఇళయరాజా కూడా తన మార్కు చూపించలేకపోయారనిపిస్తుంది. లక్ష్మీభూపాల డైలాగ్స్ ఫర్వాలేదనిపిస్తాయి. అరవింద్ కన్నాభిరాన్ సినిమాటోగ్రఫి బాగుంది. రాజీవ్ చిలక, మేఘా చిలక అనుసరించిన నిర్మాణ విలువలు బాగున్నాయి. కథ, కథనాలపై మరింత దృష్టి పెడితే డీసెంట్ థ్రిల్లర్ అయి ఉండేది. ఆ ఛాన్స్ మిస్ అయిందనే చెప్పాలి.


4.0
out of 9
2 months ago
Jun 01, 2026 Telugu

Mareechika movie Review

ఈ వారం థియేటర్లలో విడుదలైన "మరీచిక" మూవీ ప్రేక్షకుల నుండి బీలో యావరేజ్ రెస్పాన్స్ అందుకుంది. సరైన కథా కథనాలు లేకపోవడంతో మూవీ ఆర్టిస్ట్ లు కూడా బాగానే చేసినా, ప్రొడక్షన్ వాల్యూస్ బాగానే ఉన్నా, ఫలితం లే...

ఈ వారం థియేటర్లలో విడుదలైన "మరీచిక" మూవీ ప్రేక్షకుల నుండి బీలో యావరేజ్ రెస్పాన్స్ అందుకుంది. సరైన కథా కథనాలు లేకపోవడంతో మూవీ ఆర్టిస్ట్ లు కూడా బాగానే చేసినా, ప్రొడక్షన్ వాల్యూస్ బాగానే ఉన్నా, ఫలితం లేకపోయింది. దర్శకుడు సతీష్ కాసెట్టి సరైన స్క్రీన్ ప్లే రాసుకోవడంలో విఫలమయ్యారు.


ఇక ఓవరాల్ గా చూసుకున్నట్టయితే ఈ ‘మరీచిక’ చిత్రం మంచి పొటెన్షియల్ ఉన్న కథను తెరపై ఆవిష్కరించడంలో విఫలమై డిజప్పాయింట్ చేసే సైకలాజికల్ థ్రిల్లర్‌గా మిగిలిపోయింది. ఎంగేజింగ్ గా మార్చే స్కోప్ ఉన్నప్పటికీ స్లోగా సాగే డిజైన్ చేసుకున్న కథనం నిరాశ పరుస్తుంది. ఫైనల్ గా కథనంలో బలహీనత కారణంగా మరీచిక చిత్రం ప్రభావం చూపలేని బోరింగ్ థ్రిల్లర్ గా నిలిచిపోయింది.

5.0
out of 9
2 months ago
May 30, 2026 Telugu

Drishyam 3

Recent ga family tho after long gap tarvatha Drishyam 3 movie ki vella. Honestly cheppalante “Drishyam 3” lo konni engaging moments unnayi… but first two parts ichina magic matram ee sari full ga work...

Recent ga family tho after long gap tarvatha Drishyam 3 movie ki vella. Honestly cheppalante “Drishyam 3” lo konni engaging moments unnayi… but first two parts ichina magic matram ee sari full ga workout avvaledu. Mohanlal as George kutty still superb… But screenplay previous parts range lo sharp ga anipinchaledu. Plus mana Telugu audience ki Venkatesh version baga register ayipoyindi kabatti…


Mohanlal ni aa place lo imagine cheyyadam konchem kastame. Telugu nativity chala miss ayindi. adi major minus ayithe, telugu version characters place lo vere artists ni kooda tondaraga kanukkolemu.. thrills ki scope takkuve.. Overall ga decent thriller one time watchable anthe.

6.0
out of 9
2 months ago
May 29, 2026 Telugu
Why MRO?