Latest Movie Reviews
The most recent reviews from top critics and publications
Drishyam Movie Review
By ABP Desam
విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన 'దృశ్యం', 'దృశ్యం 2' ప్రేక్షకుల్ని మెప్పించాయి. ఆ రెండూ మలయాళంలో మోహన్ లాల్ (Mohanlal) హీరోగా జీతూ జోసెఫ్ దర్శకత్వంలో వచ్చిన సినిమాలకు రీమేక్స్. అయితే 'దృశ్యం' ఫ్రాంచైజీలో మూడో సినిమాను రీమేక్ చేయలేదు. తాజాగా తెలుగులోనూ మోహన్ లాల్ సినిమాను డబ్బింగ్ చేసి దృశ్యం 3 ని విడుదల చేశారు. సినిమా ఎలా ఉందనేది పక్కన పెడితే... తెలుగు ప్రేక్షకులకు ఎదురయ్యే మొదటి సమస్య ఒరిజినల్ వెర్షన్ లో , ప్రధాన పాత్రధారులను తొందరగా పోల్చుకోకపోవడం.
అందువల్ల కొంతమంది తెలుగు ఆడియన్స్ మూవీకి కనెక్ట్ కాకపోవచ్చు. ఇక 'దృశ్యం', 'దృశ్యం 2' సినిమాల్లో కథతో పాటు కథనం కూడా ఉత్కంఠ కలిగిస్తుంది. ట్విస్టులు సర్‌ప్రైజ్ చేయడంతో పాటు షాక్ ఇస్తాయి. పోలీస్ స్టేషన్ కింద దొరికిన అస్థిపంజరం వరుణ్ ది కాదని కోర్టులో తెలిసే సీన్, లాయర్ ఎక్స్‌ప్రెషన్ ఇప్పటికీ వైరల్ అవుతుంది. కానీ 'దృశ్యం 3'లో అటువంటి సన్నివేశం ఒక్కటి కూడా లేదు. ఆ సంగతి పక్కన పెడితే... 'దృశ్యం' ఫ్రాంచైజీలో మొదటి రెండు సినిమాల్లో సగం ఉత్కంఠ కూడా మూడో భాగం ఇవ్వలేదు. అందుకే ముందు భాగాల్లాగా దృశ్యం 3కి థియేటర్లలో థ్రిల్ అవ్వడం చాలా కష్టం. మోహన్ లాల్ వీరాభిమానులను సైతం దృశ్యం 3 మెప్పించడం కష్టమే అనిపిస్తుంది.
Drishyam movie Review
By NTV Telugu
దృశ్యం’ఫ్రాంచైజ్‌లలో భాగంగా తాజాగా దృశ్యం 3 మూవీ మలయాళం, తెలుగులో విడుదల కాగా మోహన్ లాల్, మీనా మెయిన్ లీడ్స్ లో నటించిన ఈ మూవీ ఆశించిన రెస్పాన్స్ అందుకోలేదు. మొదటి రెండు పార్ట్స్ తో ఆకట్టుకున్న దర్శకుడు జీతు జోసెఫ్ మ్యాజిక్ ఈసారి పూర్తిగా వర్కౌట్ కాలేదనే ఫీలింగ్ కలుగుతుంది. జార్జ్ కుట్టి పాత్రలో మోహన్ లాల్ మరోసారి తన సెటిల్డ్ పెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకున్నా… కథలో మాత్రం ఆ పాత థ్రిల్, టెన్షన్ పెద్దగా కనిపించదు. ముఖ్యంగా ‘దృశ్యం’, ‘దృశ్యం-2’ చూసిన ప్రేక్షకులకు ఈసారి కొత్తదనం మిస్సైన ఫీలింగ్ బలంగా వస్తుంది.
ఇక తెలుగు డబ్బింగ్ కూడా సినిమాకి పెద్ద మైనస్‌గా మారింది. చాలా చోట్ల డబ్బింగ్ artificialగా అనిపిస్తుంది. రచయితగా, దర్శకుడిగా జీతు జోసెఫ్ ఈసారి తన mark screenplay magic చూపించలేకపోయాడు. గత భాగాల్లో ఉన్న mind-blowing twists, edge-of-the-seat narration ఈ పార్ట్‌లో మిస్ అయ్యాయి. కొన్ని ల్యాగ్ సీన్స్ ని ట్రిమ్ చేసి ఉండాల్సింది. ఓవరాల్ గా దృశ్యం 3 కొంతవరకు ఎంగేజింగ్ థ్రిల్లరే. కానీ మొదటి రెండు భాగాలను దృష్టిలో పెట్టుకుని భారీ అంచనాలతో థియేటర్లకు వెళితే నిరాశ తప్పదు.
Drishyam Movie Review
By Tupaki
ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే బెస్ట్ థ్రిల్లర్ల జాబితా తీస్తే అందులో ‘దృశ్యం’ కచ్చితంగా ఉంటుంది. దానికి కొనసాగింపుగా వచ్చిన ‘దృశ్యం-2’ సైతం ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది. ఇప్పుడు ఈ ఫ్రాంఛైజీలో మూడో సినిమా తెలుగు మలయాళ భాషలలో విడుదలైంది. మలయాళం వెర్షన్ నే తెలుగులోనూ రిలీజ్ చేయగా, మోహన్ లాల్, మీనా మెయిన్ లీడ్ గా నటించారు. అయితే తెరపై జీతు-మోహన్ లాల్ కలిసి మరోసారి ఏదో మ్యాజిక్ చేసే ఉంటారని ఎంతో నమ్మకంతో థియేటర్లలో అడుగు పెట్టిన ప్రేక్షకులకు నిరాశ తప్పదు.
జార్జి కుట్టి క్యారెక్టర్.. ‘దృశ్యం’ ఫార్మాట్ బాగా అలవాటైపోయి ఉండడం వల్ల కొత్తదనం ఫీలవ్వలేని పరిస్థితి రావడం ‘దృశ్యం-3’కి అతి పెద్ద ప్రతికూలతగా మారింది. మోహన్ లాల్ మినహా వేరే క్యారెక్టర్లు పెద్దగా ఆకట్టుకోవు. పైగా తెలుగు డబ్బింగ్ బాగా చేయలేదు. డబ్బింగ్ వాసనలు గుప్పుమంటాయి. అన్నిటికి మించి తెలుగు ఆడియన్స్ వెంకటేష్ ప్లేస్ లో వేరే నటుడ్ని ఈజీగా కనెక్ట్ అవలేరు. జీతు జోసెఫ్ ఈసారి రచయితగా.. దర్శకుడిగా తన ప్రమాణాలను అందుకోలేకపోయాడు. దృశ్యం.. దృశ్యం-2 చిత్రాల్లో మైండ్ బ్లోయింగ్ రైటింగ్ తో కట్టిపడేసిన జీతు.. ఈసారి నిరాశపరిచాడు. ముఖ్యంగా ప్రేక్షకుల బుర్రలకు పని పెట్టేలా సాగే తన మార్కు స్క్రీన్ ప్లే ఇందులో మిస్ అయింది. దర్శకుడిగానూ జీతు పనితనానికి యావరేజ్ మార్కులే పడతాయి.
Drishyam 3 Movie Review
మోహన్ లాల్, మీనా (Meena) జంటగా నటించిన మలయాళ చిత్రం దృశ్యం రెండు భాగాలను తెలుగులో వెంకటేశ్ (Venkatesh), మీనా చేశారు. అక్కడ మాదిరిగానే ఇక్కడా 'దృశ్యం, దృశ్యం 2' హిట్ అయ్యాయి. అయితే ఈసారి మాత్రం 'దృశ్యం 3' (Drishyam 3)ని రీమేక్ చేయకుండా డబ్ చేసి తెలుగువారి ముందుకు తీసుకొచ్చారు. మోహన్ లాల్, మీనా మెయిన్ లీడ్ లో నటించిన ఈ మూవీ థియేటర్లలో మిక్స్డ్ రెస్పాన్స్ అందుకుంది.
అయితే మొదటి రెండు భాగాలతో పోల్చితే... 'దృశ్యం 3' పేలవంగా సాగింది. నటీనటుల విషయానికి వస్తే మోహన్ లాల్ తనదైన శైలిలో జార్జి కుట్టి పాత్రకు మరోసారి ప్రాణం పోశాడు. మిగిలిన నటీనటులు పర్వాలేదనిపించారు. దృశ్యం' సీరిస్‌కు దర్శకుడు జీతూ జోసెఫ్ స్క్రీన్ ప్లేనే ప్రధాన బలం. మొదటి రెండు భాగాల్లో అది వర్కౌట్ అయి, ఆ సినిమాల విజయానికి కారణమైంది. మూడో భాగం దగ్గరకు వచ్చే సరికీ నటీనటుల పెర్ఫార్మెన్స్ ఎలా ఉన్నా... స్క్రీన్ ప్లే ఉత్కంఠను కలిగించలేదు కదా, కథనం నత్తనడకలా సాగి ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడుతుంది. థ్రిల్లర్ మూవీస్‌ను ఇష్టపడే వారికి ఓ మాదిరిగా అనిపించవచ్చు కానీ మిగిలిన వారిని 'దృశ్యం 3' ఆకట్టుకోవడం కష్టమే.
Drishyam 3 Movie Review
By Filmi Beat
దృశ్యం ఫ్రాంచైజీకి మంచి క్రేజ్ ఉన్న నేపథ్యంలో దృశ్యం 3 వస్తుందనే వార్తతో ఆడియెన్స్‌లో భారీగా క్యూరియాసిటీ పెరిగింది. అయితే ఆ క్యూరియాసిటీతో వెళ్లిన ప్రేక్షకులకు దర్శకుడు జీతూ జోసెఫ్ పూర్తి స్థాయిలో సంతృప్తిని కలిగించలేకపోయాడనే చెప్పాలి. కథలో కొత్తదనం లేకపోవడం, కథ కథనంలో వేగం లేకపోవడం వల్ల సహనానికి పరీక్ష పెట్టారా? అనే ఫీలింగ్ కలుగుతుంది. ఇక మోహన్ లాల్ ఈ సినిమాకు వెన్నముకగా నిలిచాడు. సినిమా ఆద్యంతం వన్ మ్యాన్ షో పెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకొన్నాడు.
ఇక కేరళ అందాలను ఎప్పటిలానే సినిమాటోగ్రాఫర్ కెమెరాలో చక్కగా ఒడిసిపట్టుకొన్నారు. ఆశీర్వాద్ సినిమాస్, ఆంటోని పెరంబవూర్ అనుసరించిన నిర్మాణ విలువలు బాగున్నాయి. ట్విస్టులతో సాగే థ్రిల్లర్‌ను ఇష్టపడే వారికి కూడా ఈ దృశ్యం 3 సినిమా నచ్చడానికి అవకాశాలు ఉన్నాయి.
Drishyam 3 Movie Review in Telugu
By 123telugu
మోహన్ లాల్ నటించిన దృశ్యం 3 సినిమా మళయాళంతో పాటు తెలుగులోనూ రిలీజ్ అవగా, తెలుగులో డీసెంట్ రెస్పాన్స్ అందుకుంది. తెలుగులో చేసిన వెంకటేష్ పాత్రలో మోహన్ లాల్ ని తొందరగా ఊహించుకోలేరు కాబట్టి, కొంతమంది కనెక్ట్ కాకపోవచ్చు. అలాగే ఫస్ట్ రెండు పార్ట్స్ స్థాయిలో మూడో పార్ట్ కి ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే రాసుకోవడంలో దర్శకుడు జీతూ జోసెఫ్ తడబడ్డాడు. అయితే నటీనటుల పెర్ఫార్మన్స్ పరంగా మోహన్ లాల్ సహా అందరూ బాగానే నటించారు.
ఇక ఓవరాల్ గా చూస్తే... ‘దృశ్యం 3’ ఈ ఫ్రాంచైజీ సెట్ చేసిన రేంజ్ లో అయితే అనిపించలేదు. అలా అని కాకుండా పార్ట్ 3 బానే ఉంది. కానీ సింపుల్ గా చెప్పాలంటే ఒకే రేంజ్ లో ఉంది. కానీ ఆడియన్స్ మాత్రం ముందు పార్ట్స్ ఇచ్చిన హై ని ఈ మూవీలో కూడా ఎక్స్పెక్ట్ చేస్తే నిరాశ చెందుతారు. ఓవరాల్ గా మోహన్ లాల్ పెర్ఫార్మన్స్ కోసం, మలయాళం మూవీస్ ఇష్టపడే ఆడియన్స్, సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ ఇష్టపడే వాళ్ళు ఒకసారి ఈ సినిమా ట్రై చేయొచ్చు. కానీ మరింత ఎంగేజింగ్ కథనం మిస్ కావడంతో ఇది మిస్ ఫైర్ అయ్యింది.
Godari Gattupaina Review
Veerabhadrudu review
Godari Gattupaina Film Review
Godari Gattupaina starts with a very promising village love-story vibe, but the film mostly depends on its beautiful visuals rather than a strong story. The Godavari backdrop and rural atmosphere look absolutely stunning on screen.
The lead pair does a decent job, and the music works in parts. However, the storyline feels too predictable and lacks emotional depth. Still, if you go in with low expectations, the movie ends up being a decent and watchable love drama.
Suriya’s Veerabhadrudu Film Review
Suriya’s Veerabhadrudu feels like a solid comeback to the mass commercial genre. Suriya perfectly fits the role and delivers several goosebumps-worthy moments for fans. Director RJ Balaji handles the film well with entertaining commercial elements and a few surprise moments.
The music by Sai Abhyankkar adds good energy to the film.
However, the movie carries strong Tamil nativity, which may not connect with everyone.
Overall, Veerabhadrudu is a decent mass entertainer and a satisfying comeback film for Suriya fans.