Register as a Reviewer
తిమ్మరాజుపల్లి టివి (ThimmarajuPalli TV)

తిమ్మరాజుపల్లి టివి (ThimmarajuPalli TV)

17 Apr 2026
Overall Rating
6.3/10
15 Reviews

సాయి తేజ్, వేద జలంధర్ హీరో హీరోయిన్లుగా నటించిన మూవీ తిమ్మరాజుపల్లి TV. కిరణ్ అబ్బవరం, తేజ వేల్పుచర్ల సంయుక్తంగా నిర్మించిన ఈ మూవీని వి.మునిరాజు దర్శకత్వం వహించాడు.

Director: V. Muniraju
Cast: Sai Tej , Vedha Jalandharr , Pradeep Kotte , Swathi Karimireddy , Amma Ramesh, Satyanarayana, Lathish

Available in:

Reviews

What critics and the public are saying about తిమ్మరాజుపల్లి టివి (ThimmarajuPalli TV)

Media Reviews

15 Avg: 6.3/10
Tupaki
Tupaki Website
7

Hit

ThimmarajuPalli TV Movie Review

హీరో కిరణ్ అబ్బవరం నిర్మించిన లేటెస్ట్ మూవీ తిమ్మరాజుపల్లి టివి. అంతా కొత్తనటులతో తెరకెక్కించిన ఈ మూవీ మంచి రెస్పాన్స్ ని అందుకుంటుంది. 90స్ బ్యాక్ డ్రాప్ లో ఓ టివి నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీ కథ చిన్నగా ఉన్నా, స్క్రీన్ ప్లే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. హీరోహీరోయిన్లుగా నటించిన సాయితేజ, వేద జలంధర్ సహ...

హీరో కిరణ్ అబ్బవరం నిర్మించిన లేటెస్ట్ మూవీ తిమ్మరాజుపల్లి టివి. అంతా కొత్తనటులతో తెరకెక్కించిన ఈ మూవీ మంచి రెస్పాన్స్ ని అందుకుంటుంది. 90స్ బ్యాక్ డ్రాప్ లో ఓ టివి నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీ కథ చిన్నగా ఉన్నా, స్క్రీన్ ప్లే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. హీరోహీరోయిన్లుగా నటించిన సాయితేజ, వేద జలంధర్ సహా, కీ రోల్స్ లో నటించిన వారందరూ చక్కగా నటించారు. అలాగే దర్శకుడు మునిరాజు సినిమాని చక్కగా హ్యాండిల్ చేసాడు. ఎడిటింగ్ కూడా తానే కావడం విశేషం. 


అలాగే మ్యూజిక్ డైరెక్టర్ వంశీకాంత్ గురించి చెప్పుకుంటే... సినిమాలో చాలా సాధారణంగా అనిపించే సన్నివేశాల్లో కూడా ఏదో జరిగిపోతున్న ఫీలింగ్ కలిగించి జనాలు ఉత్కంఠగా తెర వైపు చూసేలా చేశాడతను. వంశీకాంత్ బీజీఎం అంత ఎఫెక్టివ్ గా సాగింది. పాటలు కూడా బాగానే అనిపిస్తాయి. అక్షయ్ రామ్ ఛాయాగ్రహణం కూడా బాగుంది. 90ల నాటి పల్లెటూరి వాతావరణాన్ని చాలా బాగా చూపించాడు. ఆర్ట్ వర్క్ కూడా ఓకే. ఇలాంటి కథకు సపోర్ట్ చేయడం ద్వారా కిరణ్ అబ్బవరం తన అభిరుచిని చాటుకున్నాడు. మునిరాజు రచయితగా-దర్శకుడిగా కొంతమేర ఆకట్టుకున్నాడు. అతను ఎంచుకున్న కాన్సెప్ట్ బాగుంది. కానీ ఎగ్జిక్యూషన్లో కొంత తడబడ్డాడు. పాత్రల చిత్రణ ఇంకా బాగా ఉండుంటే.. కథనాన్ని మరింత బిగితో రాసుకుని ఉంటే ‘తిమ్మరాజుపల్లి టీవీ’ ఇంపాక్ట్ వేరుగా ఉండేది.

Apr 17, 2026 Read Review
Chitra Jyothy
Chitra Jyothy Website
7

Hit

ThimmarajuPalli TV Movie Review

తిమ్మరాజుపల్లి టివి అంటూ ఈ వారం థియేటర్లలో విడుదలైన ఈ సినిమాలో హీరోహీరోయిన్ నుంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ వరకూ అందరూ కొత్తవారే. థియేటర్లలో మిక్స్డ్ రెస్పాన్స్ తెచ్చుకోగా, సింగిల్ స్క్రీన్స్ లో మంచి రెస్పాన్స్ స్లో గా అందుకుంటుంది. ఇక మెయిన్ లీడ్ లో సాయితేజ్, వేదా జలంధర్ చక్కగా నటించగా, ప్రదీప్ కొట్టెద...

తిమ్మరాజుపల్లి టివి అంటూ ఈ వారం థియేటర్లలో విడుదలైన ఈ సినిమాలో హీరోహీరోయిన్ నుంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ వరకూ అందరూ కొత్తవారే. థియేటర్లలో మిక్స్డ్ రెస్పాన్స్ తెచ్చుకోగా, సింగిల్ స్క్రీన్స్ లో మంచి రెస్పాన్స్ స్లో గా అందుకుంటుంది. ఇక మెయిన్ లీడ్ లో సాయితేజ్, వేదా జలంధర్ చక్కగా నటించగా, ప్రదీప్ కొట్టెది కూడా కీ రోల్ లో అదరగొట్టాడు. ఇక తిమ్మరాజుపల్లి అందాలను అద్భుతంగా చూపించారు డిఓపీ అక్షయ్ రామ్ పొదిరెడ్డి. 1990ల నేపథ్యంలో పల్లె అందాల్ని చక్కగా చూపించారు. ఎక్కువ శాతం ఒరిజినల్ లొకేషన్లలో చిత్రీకరించడం కథకు కలిసొచ్చిందనే చెప్పాలి. 


అలాగే వంశీకాంత్ రేఖన బాణీలు ఆకట్టుకునేల ఉన్నాయి. పాటలతో పాటు నేపథ్య సంగీతం బాగుంది. దర్శకుడే ఎడిటర్ కావడం ప్లస్ అయినా.. సెకండాఫ్ లో కొన్ని చోట్ల సాగదీతగా అనిపించింది. నిర్మాత కిరణ్ అబ్బవరం కథకు తగ్గ బడ్జెట్ లో గ్రాండ్ గా తీశారు. లాజిక్కులు, భారీ అంచనాలు లేకుండా సినిమాకు వెళ్తే హ్యాపీగా ఎంజాయ్ చేసి బయటకు రావచ్చు. అయితే ఈ తరహా సినిమాలకు ఓపెనింగ్స్ బాగా వచ్చినపుడే జనాల్లోకి ఫాస్ట్ గా వెళ్ళగలుగుతుంది. లేదంటే సినిమాను జనాల్లోకి తీసుకు వెళ్ళడానికి శ్రమ పడక తప్పదు.

Apr 17, 2026 Read Review
6

Above Average

ThimmarajuPalli TV movie Review

అంతా కొత్తవాళ్లతో తెరకెక్కించిన తిమ్మరాజుపల్లి టివి తాజాగా థియేటర్లలో విడుదలై అలరిస్తుంది. 90స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ మూవీలో అందరూ కొత్తవాళ్ళైనా బానే నటించగా, కిరణ్ అబ్బవరం స్వయంగా నిర్మించిన ఈ మూవీకి వి.మునిరాజు డైరెక్ట్ చేసాడు. ఇక కథ పరంగా చిన్న కథే అయినా, దాన్ని ఆసక్తి కరంగా తెరకెక్కించాడ...

అంతా కొత్తవాళ్లతో తెరకెక్కించిన తిమ్మరాజుపల్లి టివి తాజాగా థియేటర్లలో విడుదలై అలరిస్తుంది. 90స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ మూవీలో అందరూ కొత్తవాళ్ళైనా బానే నటించగా, కిరణ్ అబ్బవరం స్వయంగా నిర్మించిన ఈ మూవీకి వి.మునిరాజు డైరెక్ట్ చేసాడు. ఇక కథ పరంగా చిన్న కథే అయినా, దాన్ని ఆసక్తి కరంగా తెరకెక్కించాడు దర్శకుడు. మ్యూజిక్ పరంగానూ మంచి ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది. అలాగే చాలా సీన్లని ఆర్‌ఆర్‌ మరో స్థాయికి తీసుకెళ్లిందని చెప్పొచ్చు.


అక్షయ్‌ రామ్‌ పొదిశెట్టి కెమెరా వర్క్ సైతం బాగుంది. విజువల్‌గా కనువిందు చేస్తుంది. ఆర్ట్ వర్క్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. ఎడిటింగ్‌ పరంగా ఇంకాస్త ట్రిమ్‌ చేయోచ్చు. ఇక దర్శకుడు మునిరాజు మంచి కథని ఎంచుకోవడంతోపాటు, దాన్ని అంతే బాగా తెరపై ఆవిష్కరించడంలో సక్సెస్‌ అయ్యాడు. చాలా నేచురల్‌గా తెరకెక్కించారు. సహజత్వం పరంగా ఎక్కడా తగ్గలేదు. అదే ఈమూవీ సక్సెస్‌గా చెప్పొచ్చు. నిర్మాణ విలువలకు కొదవ లేదు. కిరణ్‌ అబ్బవరం రాజీపడకుండా నిర్మించారు. టీమ్‌కి అండగా నిలిచాడని ప్రతి ఫ్రేమ్‌లోనూ తెలుస్తోంది. తిమ్మరాజుపల్లి టీవీ ఒక ఫ్రెష్‌ అటెంప్ట్. మళ్లీ పాత రోజుల్లోకి తీసుకెళ్లి, నవ్వించి, అలరించే మూవీ. మంచి అనుభూతిని పంచుతుంది. 90కిడ్స్ కి బాగా నచ్చుతుంది.


Apr 17, 2026 Read Review
10TV Telugu
10TV Telugu News Channel
6

Above Average

ThimmarajuPalli TV movie Review

ఈ వారం విడుదలైన క్రేజీ సినిమాల్లో తిమ్మరాజుపల్లి టివి ఒకటి. అంతా కొత్త నటులతో తెరకెక్కిన ఈ మూవీ మంచి రెస్పాన్స్ అందుకుంది. రొటీన్ కథే అయినా ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లే తో బాగా తెరకెక్కించాడు డైరెక్టర్ మునిరాజు. ఇక ఈ సినిమాలో నటించిన చాలా మంది కొత్తవాళ్ళైనా అదరగొట్టేసారు. హీరో సాయి తేజ్ చాలా బాగా నటి...

ఈ వారం విడుదలైన క్రేజీ సినిమాల్లో తిమ్మరాజుపల్లి టివి ఒకటి. అంతా కొత్త నటులతో తెరకెక్కిన ఈ మూవీ మంచి రెస్పాన్స్ అందుకుంది. రొటీన్ కథే అయినా ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లే తో బాగా తెరకెక్కించాడు డైరెక్టర్ మునిరాజు. ఇక ఈ సినిమాలో నటించిన చాలా మంది కొత్తవాళ్ళైనా అదరగొట్టేసారు. హీరో సాయి తేజ్ చాలా బాగా నటించాడు. హీరోయిన్ వేద జలంధర్ క్యూట్ గా కనిపిస్తూనే చక్కగా నటించింది. ప్రదీప్ కొట్టె సినిమాకు హైలెట్. మిగిలిన నటీనటులు అంతా వారి పాత్రల్లో బాగా నటించారు. సినిమా మొదట్లో కిరణ్ అబ్బవరం వాయిస్ ఓవర్ ఇవ్వడం గమనార్హం.

 

టెక్నికల్ గా సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. సినిమాకు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగా ప్లస్ అయింది. పోరాటాలు కూడా బాగున్నాయి. ఈ సినిమాకు లొకేషన్స్ చాలా ప్లస్ అయ్యాయి. 1996 విలేజ్ బ్యాక్ డ్రాప్ కావడంతో దానికి తగ్గట్టు లొకేషన్స్ చాలా బాగా వెతికి పట్టుకున్నారు. కొత్త కథని రొటీన్ లవ్ స్టోరీతో ఆసక్తికర స్క్రీన్ ప్లే తో బాగానే రాసుకొని తెరకెక్కించాడు దర్శకుడు. ఎడిటింగ్ లో అక్కడక్కడా కొన్ని ల్యాగ్ సీన్స్ కట్ చేస్తే బాగుండు. మొత్తంగా ‘తిమ్మరాజుపల్లి టీవీ’ సినిమా ఓ క్యూట్ లవ్ స్టోరీతో పాటు టీవీ దొంగతనం అనే సస్పెన్స్ తో ఆసక్తికరంగా తెరకెక్కించారు. ఫ్యామిలీతో కలిసి ఈ సినిమా చూడొచ్చు. ఈ సినిమాకు 3 రేటింగ్ ఇవ్వొచ్చు.

Apr 17, 2026 Read Review
ABP Desam
ABP Desam Website
6

Above Average

ThimmarajuPalliTV Movie Review

కిరణ్ అబ్బవరం నిర్మించిన కొత్త సినిమా తిమ్మరాజుపల్లి TV తాజాగా థియేటర్లలో విడుదల కాగా, మిక్స్డ్ రెస్పాన్స్ అందుకున్నప్పటికీ ఆ సినిమాకి ఆఫ్ లైన్ లో మంచి స్పందన వస్తుంది. కొత్త నటీనటులతో ఈ మూవీ తెరకెక్కగా నటీనటులు అందరూ చక్కగా చేశారు. ప్రదీప్ కొట్టెకి మంచి రోల్ దక్కింది. పాత్ర తాలూకూ మార్పులను బాగా చూ...

కిరణ్ అబ్బవరం నిర్మించిన కొత్త సినిమా తిమ్మరాజుపల్లి TV తాజాగా థియేటర్లలో విడుదల కాగా, మిక్స్డ్ రెస్పాన్స్ అందుకున్నప్పటికీ ఆ సినిమాకి ఆఫ్ లైన్ లో మంచి స్పందన వస్తుంది. కొత్త నటీనటులతో ఈ మూవీ తెరకెక్కగా నటీనటులు అందరూ చక్కగా చేశారు. ప్రదీప్ కొట్టెకి మంచి రోల్ దక్కింది. పాత్ర తాలూకూ మార్పులను బాగా చూపించారు. తెరపై సాయి తేజ్ మన పల్లెల్లో కనిపించే అబ్బాయిలా ఉన్నారు. ఎమోషనల్ సీన్స్ బాగా చేశారు. మిగతా ఆర్టిస్టులు అందరూ తమ తమ పాత్రలకు తగ్గట్టు నటించారు.


ఇక ట్రెండీ కథలు, ప్రేమలు మధ్య ప్రేక్షకులను 90వ దశకంలోకి తీసుకు వెళ్లడంలో 'తిమ్మరాజుపల్లి టీవీ' సక్సెస్ అయ్యింది. కథ కాస్త కిందకు మీదకు పడుతూ లేస్తూ వెళ్లినట్టు అనిపించినా... మంచి నోస్టాల్జియా మూమెంట్స్ అందిస్తుందీ సినిమా. సహజత్వానికి దగ్గరగా తీశారు. కొత్త వాళ్ళందరూ కలిసి చేసిన ప్రయత్నాన్ని అభినందించవచ్చు. సరదాగా రెండు గంటలు పల్లెలోకి వెళ్లి వచ్చినట్టు ఉంటుంది. ఎటువంటి అంచనాలు పెట్టుకోకుండా వెళితే థియేటర్లలో చివరి వరకు ప్రేక్షకుల్ని కూర్చోబెడుతుంది.

Apr 17, 2026 Read Review
Thyview
Thyview Youtube Channel
7

Hit

ThimmarajuPalli TV Movie Review

ఈ వారం మన ముందుకొచ్చిన తిమ్మరాజుపల్లి TV… basically ఒక నాస్టాల్జిక్ విలేజ్ డ్రామా! ముందుగా స్టోరీ పాయింట్ చూస్తే… చిన్నదే. కానీ డైరెక్టర్ వి. మునిరాజు దాన్ని 90స్ ఫీల్‌తో బానే ప్రెజెంట్ చేయడానికి ట్రై చేశాడు. ఇక్కడే కాస్త ఇష్యూ మొదలవుతుంది.మెయిన్ స్టోరీకి వెళ్లడానికి టైమ్ తీసుకుంటుంది… కొంచెం స్లోగా...

ఈ వారం మన ముందుకొచ్చిన తిమ్మరాజుపల్లి TV… basically ఒక నాస్టాల్జిక్ విలేజ్ డ్రామా! ముందుగా స్టోరీ పాయింట్ చూస్తే… చిన్నదే. కానీ డైరెక్టర్ వి. మునిరాజు దాన్ని 90స్ ఫీల్‌తో బానే ప్రెజెంట్ చేయడానికి ట్రై చేశాడు. ఇక్కడే కాస్త ఇష్యూ మొదలవుతుంది.

మెయిన్ స్టోరీకి వెళ్లడానికి టైమ్ తీసుకుంటుంది… కొంచెం స్లోగా అనిపిస్తుంది. పెద్దగా కాన్ఫ్లిక్ట్ లేకపోవడం వల్ల “ఏమవుతోంది?” అనే ఫీల్ వస్తుంది. కానీ… పల్లెటూరి ఎమోషన్స్ మాత్రం neatగా work అవుతాయి


అసలు సినిమా ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే… Second half!

టీవీ చుట్టూ తిరిగే మిస్టరీ angle, “ఈ తప్పు ఎవరు చేశారు?” అన్న థ్రాక్‌తో కథ కాస్త ఇంట్రెస్టింగ్ అవుతుంది. అక్కడ నుంచి ఎంగేజ్ చేయడానికి ప్రయత్నిస్తుంది. టెక్నికల్‌గా చూస్తే.. వంశీకాంత్ రేఖన BGM – scenes కి soul ఇచ్చింది. ఆర్ట్ వర్క్ (సుధీర్ మాచర్ల) – 90s village vibes on point, తో పాటు అక్షయ్ రామ్ కెమెరా – very natural & pleasant visuals గా అనిపించాయి.మునిరాజు simple storyని emotionalగా చెప్పాడు. పెద్దగా high moments లేకపోయినా, grounded narration తో connect అయ్యేలా ట్రై చేశాడు. ఫైనల్ గా తిమ్మరాజు పల్లి టివి ఒక soft, nostalgic village drama. ఇక క్లైమాక్స్ లో ఒక మంచి సీన్ రివీల్ తో సీన్ ఎండ్ అవుతుంది. అండ్ కొత్త ఆడియన్స్ తో చేయడం వల్ల ఫ్రెష్ ఫీల్ వస్తుంది. ఇక వాళ్ళ పెర్ఫార్మన్స్ కూడా అదరగొట్టేసారు.

Apr 17, 2026 Watch
TV9 Telugu
TV9 Telugu News Channel
7

Hit

ThimmarajuPalliTV movie Review

అంతా కొత్తవాళ్ళతో తెరకెక్కిన తిమ్మరాజు పల్లి TV తాజాగా థియేటర్లలో విడుదలైంది. ఇక సినిమా గురించి చెప్పుకుంటే... దర్శకుడు వి. మునిరాజు ఎంచుకున్న పాయింట్ చాలా చిన్నదైనా, దాని చుట్టూ అల్లిన డ్రామా ప్రేక్షకులను 90ల నాటి నాస్టాల్జియాలోకి తీసుకెళ్తుంది. అయితే ప్రధాన కథలోకి వెళ్లడానికి చాలా సమయం తీసుకోవడం వ...

అంతా కొత్తవాళ్ళతో తెరకెక్కిన తిమ్మరాజు పల్లి TV తాజాగా థియేటర్లలో విడుదలైంది. ఇక సినిమా గురించి చెప్పుకుంటే... దర్శకుడు వి. మునిరాజు ఎంచుకున్న పాయింట్ చాలా చిన్నదైనా, దాని చుట్టూ అల్లిన డ్రామా ప్రేక్షకులను 90ల నాటి నాస్టాల్జియాలోకి తీసుకెళ్తుంది. అయితే ప్రధాన కథలోకి వెళ్లడానికి చాలా సమయం తీసుకోవడం వల్ల ఫస్ట్ హాఫ్ కాస్త సాగదీసినట్లు అనిపిస్తుంది. బలమైన సంఘర్షణ లేకపోవడం వల్ల కథనం కాస్త మెల్లగా సాగుతున్న భావన ప్రేక్షకుడికి కలుగుతుంది. కానీ పల్లెటూరి ఎమోషన్స్ అయితే ఎక్కడా మిస్ చేయలేదు దర్శకుడు మునిరాజ్. 


ఇక ద్వితీయార్థంలో సినిమా అసలు వేగం పుంజుకుంటుంది. టీవీ చుట్టూ జరిగే మిస్టరీ, ఆ తప్పు ఎవరు చేశారు అనే కోణంలో సాగే కథనం ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తుంది. పల్లెటూరి వాతావరణంలో ఒక చిన్న సమస్య ఎంత పెద్ద ఎమోషనల్ డ్రామాకు దారి తీస్తుందో దర్శకుడు చాలా సహజంగా చూపించాడు. టెక్నికల్‌గా ఈ సినిమాకు ప్రధాన బలం వంశీకాంత్ రేఖన అందించిన నేపథ్య సంగీతం. సాధారణ సన్నివేశాలకు కూడా తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో ప్రాణం పోశాడు. సుధీర్ మాచర్ల ఆర్ట్ వర్క్ 90స్ నాటి పల్లెటూరి వాతావరణాన్ని అద్భుతంగా కళ్లకు కట్టింది. అక్షయ్ రామ్ కెమెరా పనితనం సినిమా మూడ్‌కు తగ్గట్టుగా చాలా నేచురల్‌గా ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. మునిరాజు దర్శకత్వం కూడా మెప్పించింది. ఓవరాల్‌గా తిమ్మరాజుపల్లి టీవీ.. 90ల్లోని జ్ఞాపకాలు.. స్వచ్ఛమైన పల్లెటూరి కథ

Apr 17, 2026 Read Review
Mahidhar Vibes
Mahidhar Vibes Youtube Channel
6

Above Average

Thimmaraju Palli TV Movie Review

కిరణ్ అబ్బవరం ప్రొడ్యూస్ చేసిన మూవీ తిమ్మరాజు పల్లి TV ఫైనల్ గా థియేటర్లలో రిలీజ్ అయింది. చిన్న సినిమాగా రిలీజ్ అయిన ఈ మూవీ ఆడియన్స్ ని మెజారిటీ వారికి బానే నచ్చుతుంది. కొత్త నటులతో చేసినందువల్ల ఫ్రెష్ ఫీల్ కూడా వస్తుంది. దీనికి తోడు 90స్ బ్యాక్ డ్రాప్ కాబట్టి మరింత నచ్చే ఛాన్స్ ఉంది. మెయిన్లి పీరియ...

కిరణ్ అబ్బవరం ప్రొడ్యూస్ చేసిన మూవీ తిమ్మరాజు పల్లి TV ఫైనల్ గా థియేటర్లలో రిలీజ్ అయింది. చిన్న సినిమాగా రిలీజ్ అయిన ఈ మూవీ ఆడియన్స్ ని మెజారిటీ వారికి బానే నచ్చుతుంది. కొత్త నటులతో చేసినందువల్ల ఫ్రెష్ ఫీల్ కూడా వస్తుంది. దీనికి తోడు 90స్ బ్యాక్ డ్రాప్ కాబట్టి మరింత నచ్చే ఛాన్స్ ఉంది. మెయిన్లి పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో మూవీస్ ఇష్టపడే వాళ్లకు తిమ్మరాజు పల్లి టివి బాగానే నచ్చుతుందని అనిపిస్తుంది. 


అలాగే డైరెక్టర్ మునిరాజు ఈ సినిమాతో మంచి సక్సెస్ కొట్టే ఛాన్స్ బానే ఉందనిపిస్తుంది. ఇక ఈ సినిమాకు మా రేటింగ్ 3.7 ఫైనల్ గా తిమ్మరాజుపల్లి టివి గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే... టివి కి సంబంధించి అయితే బానే ఆడింది, కానీ థియేటర్లలో ఎంతవరకు ఆడుతుందో అనేది ఆడియన్స్ డిసైడ్ చేయాలి. కానీ ఇలాంటి సినిమాలు చూడాలి. ఎందుకంటే ఎన్నో చెత్త ఏ రేటెడ్ సినిమాల మధ్య ఇలాంటి డీసెంట్ థ్రిల్లర్ మూవీస్ ఉంటె ఆ మాత్రం హిట్ అవ్వాల్సిన అవసరం ఈ సినిమాలకుంది. ఫైనల్ గా తిమ్మరాజు పల్లి టివి మూవీ రెగ్యులర్ మూవీ లవర్స్ ని అయితే బానే ఆకట్టుకుంటుంది. 

Apr 17, 2026 Watch
One India
One India Website
7

Hit

ThimmarajuPalli TV Movie Review

హీరో కిరణ్ అబ్బవరం తొలిసారి ప్రొడ్యూస్ చేసిన మూవీ తిమ్మరాజు పల్లి TV. ఈ వారం థియేటర్లలో విడుదలైన ఈ మూవీ డీసెంట్ రెస్పాన్స్ అందుకుంది. కథ రొటీన్ గానే ఉన్నా, డీసెంట్ స్క్రీన్ ప్లే తో అలరించింది. హీరోగా సాయి తేజ్ కొత్తవాడైనా తన పాత్రకు తగ్గట్టుగా సహజంగా నటించాడు. ముఖ్యంగా భావోద్వేగ సన్నివేశాల...

హీరో కిరణ్ అబ్బవరం తొలిసారి ప్రొడ్యూస్ చేసిన మూవీ తిమ్మరాజు పల్లి TV. ఈ వారం థియేటర్లలో విడుదలైన ఈ మూవీ డీసెంట్ రెస్పాన్స్ అందుకుంది. కథ రొటీన్ గానే ఉన్నా, డీసెంట్ స్క్రీన్ ప్లే తో అలరించింది. హీరోగా సాయి తేజ్ కొత్తవాడైనా తన పాత్రకు తగ్గట్టుగా సహజంగా నటించాడు. ముఖ్యంగా భావోద్వేగ సన్నివేశాల్లో అతని నటన ప్రేక్షకులను ఆకట్టుకునే స్థాయిలో ఉంది. హీరోయిన్ వేద పాత్ర చిన్నదే అయినా, కథకు అవసరమైన భావోద్వేగాన్ని అందించింది. రాజప్ప పాత్రలో నటించిన ఆర్టిస్ట్ సినిమాకు ప్రధాన బలం. మొత్తానికి, కొత్తవారైనా తమ పరిధిలో మంచి ప్రయత్నం చేశారు. 


ఇక టెక్నికల్ గా దర్శకుడు మునిరాజు ఈ సినిమాతో సహజమైన గ్రామీణ వాతావరణాన్ని చూపించాలని ప్రయత్నించాడు. 90ల కాలాన్ని తిరిగి తెరపైకి తీసుకురావడంలో విజయం సాధించాడు. కానీ కథనం విషయంలో అదే రియలిజం కొన్నిసార్లు నెమ్మదితనంగా మారింది. ఆర్ట్ డిపార్ట్‌మెంట్ 90ల సెటప్‌ను బాగా రీక్రియేట్ చేసింది. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కొన్ని చోట్ల ఎమోషన్‌ను బాగా ఎలివేట్ చేసింది. కానీ పాటలు మాత్రం థియేటర్ నుంచి బయటకు వచ్చాక గుర్తుండేలా లేవు. చిత్తూరు యాసలో డైలాగ్స్ ఉండటం ఈ సినిమాకు రియలిస్టిక్ టచ్ ఇచ్చింది. ప్లస్ పాయింట్స్.. 90ల నాటి గ్రామీణ వాతావరణం సింపుల్ కాన్సెప్ట్‌లో మిస్టరీ ఎలిమెంట్ సహజమైన నటన కొన్ని ఎమోషనల్ సీన్స్ మైనస్ పాయింట్స్ స్లో నరేషన్ చిన్న కథను ఎక్కువగా లాగడం యాస వల్ల కనెక్ట్ సమస్య గుర్తుండని సంగీతం ఫైనల్ వర్డిక్ట్... గ్రామీణ కథలను ఇష్టపడే వారికి నచ్చే సినిమా.

Apr 17, 2026 Read Review
Gulte
Gulte Website
6

Above Average

Thimmaraju Palli TV movie Review

కిరణ్ అబ్బవరం ప్రొడ్యూస్ చేసిన తిమ్మరాజుపల్లి టీవీ ఈ వారం థియేటర్లలో విడుదల కాగా, బీలో యావరేజ్ టాక్ అందుకుంది. సాయి తేజ్, వేదా జలంధర్ మంచి పెర్ఫార్మన్స్ ఇచ్చారు. అయితే కథ ప్రకారం ద్వితీయార్థం తప్పిపోయిన టీవీ చుట్టూ అల్లుకున్న 'హూడన్నిట్' (హత్య ఎవరు చేశారు?) డ్రామాగా మారుతుంది. ఇక్కడే దర్శకుడు తడబడ్డ...

కిరణ్ అబ్బవరం ప్రొడ్యూస్ చేసిన తిమ్మరాజుపల్లి టీవీ ఈ వారం థియేటర్లలో విడుదల కాగా, బీలో యావరేజ్ టాక్ అందుకుంది. సాయి తేజ్, వేదా జలంధర్ మంచి పెర్ఫార్మన్స్ ఇచ్చారు. అయితే కథ ప్రకారం ద్వితీయార్థం తప్పిపోయిన టీవీ చుట్టూ అల్లుకున్న 'హూడన్నిట్' (హత్య ఎవరు చేశారు?) డ్రామాగా మారుతుంది. ఇక్కడే దర్శకుడు తడబడ్డాడు. హీరో, హీరోయిన్ల వేదనను లోతుగా అన్వేషించలేదు. కథనం ఒక మూస పద్ధతిని అనుసరిస్తుంది – చాలా మందిపై అనుమానాలు రేకెత్తించి, చివరికి ఊహించని వ్యక్తిపై దృష్టి పెడుతుంది. సాధారణంగా, 'హూడన్నిట్' కథలు ఇలాగే పనిచేస్తాయి, అదే ఫార్ములా. కానీ అది ప్రేక్షకులకు అంత సుస్పష్టంగా తెలియకుండా చూసుకోవాల్సిన బాధ్యత చిత్రనిర్మాతలదే.


అయినప్పటికీ, ఇది మనం తేలికగా తీసిపారేయగలిగే సినిమా కాదు. దీని ప్రతి అణువులోనూ ఒక ఉద్దేశం, నిజాయితీతో కూడిన ప్రయత్నం ఉన్నాయని మనం గ్రహించగలం. టీవీ సన్నివేశాలు మరియు గ్రామ నేపథ్యం కచ్చితంగా ఒక సరికొత్త అనుభూతినిస్తాయి. ఈ లోపాలు ఉన్నప్పటికీ, ఈ కథాంశాన్ని అనుభవించి, ప్రయత్నించడానికి మీరు దీన్ని ఒక్కసారి చూడవచ్చు.

Apr 17, 2026 Read Review
Filmi Beat
Filmi Beat Website
6

Above Average

ThimmarajuPalli TV Movie Review

తిమ్మరాజుపల్లి టీవీ అంటూ ఆడియన్స్ ముందుకు వచ్చిన చిన్న సినిమా ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన అందుకుంది. హీరోహీరోయిన్లుగా నటించిన సాయి తేజ్, వేదా జలంధర్ మంచి పెర్ఫార్మన్స్ ఇవ్వగా, ప్రదీప్ కొట్టే, స్వాతి కరిమిరెడ్డి కూడా మెచ్యురిటీతో కూడిన పెర్ఫార్మెన్స్‌ను అందించారు. కిరణ్ అబ్బవరమ్ నుంచి లభించిన ఒకే...

తిమ్మరాజుపల్లి టీవీ అంటూ ఆడియన్స్ ముందుకు వచ్చిన చిన్న సినిమా ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన అందుకుంది. హీరోహీరోయిన్లుగా నటించిన సాయి తేజ్, వేదా జలంధర్ మంచి పెర్ఫార్మన్స్ ఇవ్వగా, ప్రదీప్ కొట్టే, స్వాతి కరిమిరెడ్డి కూడా మెచ్యురిటీతో కూడిన పెర్ఫార్మెన్స్‌ను అందించారు. కిరణ్ అబ్బవరమ్ నుంచి లభించిన ఒకే ఒక్క ఛాన్స్‌‌ను ప్రూవ్ చేసుకోవాలనే తపన కనిపించింది. ఈ సినిమాలో నటించిన ప్రతీ ఒక్కరు కూడా వందకు వందశాతం తమ ప్రతిభను చాటుకొన్నారు. ఈ సినిమాను ఫీల్‌గుడ్‌గా మార్చడంలో తమ వంతు సహకారాన్ని అందించారు.


ఇక ఈ మూవీకి అత్యంత బలంగా మారిన సాంకేతిక విభాగాల్లో మ్యూజిక్, సినిమాటోగ్రఫి గురించి చెప్పుకోవాలి. వంశీకాంత్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదరగొట్టింది. అక్షయ్ రామ్ అందించిన సినిమాటోగ్రఫి చాలా బాగుంది. కిరణ్ అబ్బవరం టీమ్ అనుసరించిన ప్రొడక్షన్ వాల్యూస్ ట్రెండ్ సెట్టింగ్‌గా ఉన్నాయి. సరైన కంటెంట్‌ ఉంటే.. భారీ బడ్జెట్‌తో కాకుండా తక్కువ వ్యయంతో ప్రేక్షకులను మెప్పించవచ్చు అని నిరూపించారు. ఈకలు పీకి..లోపాలు వెతకాలనే టార్గెట్‌తో కాకుండా.. ఓ నిజాయితీతో కూడిన అంటెంప్ట్‌ను చూడాలంటే.. తిమ్మరాజుపల్లి టీవీని ఈ వారం మీ ఛాయిస్‌గా ఎంచుకోవచ్చు.

Apr 17, 2026 Read Review
NTV Telugu
NTV Telugu News Channel
6

Above Average

ThimmarajuPalli TV Movie Review

తాజాగా విడుదలైన తిమ్మరాజు పల్లి TV చిత్రం ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందనను అందుకుంటోంది. సినిమాలో హీరో సాయితేజ, హీరోయిన్ వేద జలంధర్ తమ నటనతో ఆకట్టుకోగా… రూరల్ తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌ ను బాగా చూపించారు. రాజప్ప పాత్రలో ప్రతీక్ కూడా మంచి నటన కనబరిచారు. మిగతా నటీనటులు తమ పాత్రలకు న్యాయం చేశారు. సాంకేతిక...

తాజాగా విడుదలైన తిమ్మరాజు పల్లి TV చిత్రం ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందనను అందుకుంటోంది. సినిమాలో హీరో సాయితేజ, హీరోయిన్ వేద జలంధర్ తమ నటనతో ఆకట్టుకోగా… రూరల్ తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌ ను బాగా చూపించారు. రాజప్ప పాత్రలో ప్రతీక్ కూడా మంచి నటన కనబరిచారు. మిగతా నటీనటులు తమ పాత్రలకు న్యాయం చేశారు. సాంకేతిక విభాగాల విషయానికి వస్తే… సంగీతం సినిమాకు ప్లస్‌గా నిలిచింది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, కొన్ని పాటలు బాగున్నాయి. కెమెరా వర్క్ కూడా విజువల్స్‌ను నేచురల్‌గా చూపించింది.


అయితే ఎడిటింగ్ విషయంలో లోపాలు కనిపిస్తాయి. రెండు గంటల సినిమా అయినా స్లో నేరేషన్ వల్ల మరింత పొడవుగా అనిపిస్తుంది. ముఖ్యంగా లవ్ ట్రాక్ బలహీనంగా ఉండటం, కొన్ని సన్నివేశాలు కన్ఫ్యూజింగ్‌గా అనిపించడం మైనస్ పాయింట్స్. ఓవరాల్ గా తక్కువ బడ్జెట్‌లో చేసిన ప్రయత్నం కనిపించినా, కథనం బలహీనతల వల్ల సినిమా పూర్తిగా మెప్పించలేకపోయింది. అయితే రూరల్ డ్రామాలు ఇష్టపడే ఆడియన్స్ కి తిమ్మరాజు పల్లి TV నచ్చే ఛాన్స్ ఉంది. 

Apr 17, 2026 Read Review
Great Andhra
Great Andhra Website
5

Average

ThimmarajuPalliTV Movie Review

తిమ్మరాజుపల్లి టీవీ’ అంటూ ఆడియన్స్ ముందుకు వచ్చిన కొత్త సినిమా ఆడియన్స్ ని అంతగా ఇంప్రెస్ చేయలేదు. చిన్న కథని ఇంట్రెస్టింగ్ గా మలచడంలో విఫలమయ్యాడు డైరెక్టర్. ఇక నటీనటులు సాయి తేజ్, వేద జలంధర్, ప్రదీప్ కొట్టే తమ పాత్రల్లో మెప్పించారు. హీరోయిన్ వేద కి మంచి రోల్ దక్కగా, రాజప్ప పాత్రధారి ప్రతీక్ కూడా అద...

తిమ్మరాజుపల్లి టీవీ’ అంటూ ఆడియన్స్ ముందుకు వచ్చిన కొత్త సినిమా ఆడియన్స్ ని అంతగా ఇంప్రెస్ చేయలేదు. చిన్న కథని ఇంట్రెస్టింగ్ గా మలచడంలో విఫలమయ్యాడు డైరెక్టర్. ఇక నటీనటులు సాయి తేజ్, వేద జలంధర్, ప్రదీప్ కొట్టే తమ పాత్రల్లో మెప్పించారు. హీరోయిన్ వేద కి మంచి రోల్ దక్కగా, రాజప్ప పాత్రధారి ప్రతీక్ కూడా అద్భుత నటనను కనబరిచాడు. మిగిలిన నటీనటులంతా వాళ్ల పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.


ఇంతకి చెప్పుకోవాల్సిన విషయం మరొకటుంటే సంగీతోం. ఈ సినిమాకి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో పాటు సాంగ్స్ గా నిలిచింది. పాటలు ఒకటి బాగుంది. కెమెరా వర్క్ కూడా ఇంట్రెస్టింగ్ గా, న్యూ మ్యూజిక్ మూడ్ కి తగ్గట్టుగా ఉంది. ఎడిటింగ్ ఇంకాస్త ఫాస్ట్ గా ఉండాల్సింది. రెండు గంటల సినిమా అయినా మూడు గంటల భావాన్ని అనిపించింది. దానికి కారణం కొన్ని ఎడిటింగ్ అంశం చెప్పాల్సిందే. సీన్స్ పేస్ లో బాగా ఉంది. సినిమా మొత్తానికి కూడా వర్క్ ఫ్రెండ్ మెంట్ గా ఉంది. ఇంటర్వెల్ కి అప్పుడు కధ మొదలవ్వడం ఫీలింగ్ రావు. అంతే డ్రామాటిక్ గా జంక్ అయ్యింది. హీరో హీరోయిన్ లవ్ ట్రాక్ కూడా చాలా వీక్ గా ఉంది. ఫోకస్ టీమ్ చెప్పిన అంశాలను అంతగా సక్సెస్ కి నెత్తురం పడ్డ సన్నివేశాలు లో ఏమి చెప్పాలో తెలియని సన్నివేశాలుగా అనిపించింది. ఓవరాల్ గా మూవీ టీవీల్లో చూసేలా ఉంది గాని, థియేటర్ కి హాల్లో చూడాల్సిన మూవీలా లేదు. 

Apr 17, 2026 Read Review
Sakshi
Sakshi News Channel
6

Above Average

ThimmarajuPalli TV Movie Review

తిమ్మరాజుపల్లి టీవీ’ పేరుతో వచ్చిన ఈ పీరియాడికల్ ఎమోషనల్ డ్రామా ఓ వర్గం ప్రేక్షకులకు నాటి జ్ఞాపకాలను గుర్తు చేస్తోంది. కథ, అప్పటి టీవీ నేపథ్య సన్నివేశాలు, కొన్ని ఎమోషనల్ ఎలిమెంట్స్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. 90స్ వాతావరణం కట్టిపడేస్తుంది.అయితే కొన్ని సీన్స్ నెమ్మదిగా సాగడం, రొటీన్ స్క్రీన్‌ప...

తిమ్మరాజుపల్లి టీవీ’ పేరుతో వచ్చిన ఈ పీరియాడికల్ ఎమోషనల్ డ్రామా ఓ వర్గం ప్రేక్షకులకు నాటి జ్ఞాపకాలను గుర్తు చేస్తోంది. కథ, అప్పటి టీవీ నేపథ్య సన్నివేశాలు, కొన్ని ఎమోషనల్ ఎలిమెంట్స్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. 90స్ వాతావరణం కట్టిపడేస్తుంది.


అయితే కొన్ని సీన్స్ నెమ్మదిగా సాగడం, రొటీన్ స్క్రీన్‌ప్లే, కమర్షియల్ ఎలిమెంట్స్ లోపం సినిమాకు మైనస్‌లుగా మారాయి. నటీనటుల విషయానికి వస్తే… కొత్తవాళ్లే అయినప్పటికీ అందరూ సహజంగా నటించారు. ముఖ్యంగా సాయి తేజ్, వేద జలంధర్, ప్రదీప్ కొట్టే తమ పాత్రల్లో మెప్పించారు. దర్శకుడు వి. మునిరాజు బాగా హ్యాండిల్ చేసాడు. అలాగే వంశీ కాంత్ మ్యూజిక్ బాగా ఉంది. నిర్మాతగా కిరణ్ అబ్బవరం కు ఈ మూవీతో మంచి సక్సెస్ దక్కే అవకాశం ఉంది. ఇక ‘తిమ్మరాజుపల్లి టీవీ’ పీరియాడికల్ కథలను ఇష్టపడే వారికి కొంతవరకు కనెక్ట్ అయ్యే సినిమా.

Apr 17, 2026 Read Review
123telugu
123telugu Website
7

Hit

ThimmarajuPalli TV movie Review

‘తిమ్మరాజుపల్లి టీవీ’ అంటూ వచ్చిన ఈ పీరియాడికల్ ఎమోషనల్ డ్రామా ఓ వర్గం ప్రేక్షకులకు తమ గత అనుభూతిని ఇస్తోంది. ముఖ్యంగా కథ, అప్పటి టీవీ నేపథ్య సన్నివేశాలు, కొన్ని ఎమోషనల్ ఎలిమెంట్స్.. ఈ సినిమాలో ఆకట్టుకునే అంశాలు. అయితే, కొన్ని సీన్స్ రెగ్యులర్ గా అండ్ స్లోగా సాగడం, మరియు రొటీన్ స్క్రీన్ ప్లే, అలాగే...

‘తిమ్మరాజుపల్లి టీవీ’ అంటూ వచ్చిన ఈ పీరియాడికల్ ఎమోషనల్ డ్రామా ఓ వర్గం ప్రేక్షకులకు తమ గత అనుభూతిని ఇస్తోంది. ముఖ్యంగా కథ, అప్పటి టీవీ నేపథ్య సన్నివేశాలు, కొన్ని ఎమోషనల్ ఎలిమెంట్స్.. ఈ సినిమాలో ఆకట్టుకునే అంశాలు. అయితే, కొన్ని సీన్స్ రెగ్యులర్ గా అండ్ స్లోగా సాగడం, మరియు రొటీన్ స్క్రీన్ ప్లే, అలాగే కమర్షియల్ ఎలిమెంట్స్ మిస్ కావడం వంటి అంశాలు సినిమాకి బలహీనతలుగా నిలుస్తాయి.


అంతా కొత్త వాళ్ళతో చేసినప్పటికీ దాదాపుగా నటీనటులందరూ బాగా పెర్ఫార్మ్ చేసారు. ముఖ్యంగా సాయి తేజ్, వేద జలంధర్‌, ప్రదీప్ కొట్టే వారి పాత్రల్లో సహజంగా బాగా నటించారు. ఇక దర్శకుడిగా వి. మునిరాజు మంచి పనితనం కనబరిచాడు. ఓవరాల్ గా పీరియాడికల్ చిత్రాలను ఇష్టపడేవారికి ఈ సినిమాలో కొన్ని అంశాలు కనెక్ట్ అవుతాయి.

Apr 17, 2026 Read Review

Public Reviews

Avg: —

No public reviews yet.

About This Movie

Story : కథ విషయానికి వస్తే.. 90స్ బ్యాక్ డ్రాప్ లో జరిగే ఈ కథలో తిమ్మరాజుపల్లి అనే గ్రామంలో ఆవారాగా తిరిగే సతీష్‌ (సాయి తేజ్) అప్పుడప్పుడూ ఊళ్ళో జరిగే ఉత్సవాలకు టివి రెంట్ కి తెచ్చి, సినిమాలు ప్రదర్శిస్తూ ఉంటాడు. అలాగే  అదే గ్రామానికి చెందిన రాజప్ప (ప్రదీప్ కొట్టే) చెల్లెలైన శారదను (వేదా జలంధర్) సతీష్ ప్రేమిస్తూ ఉంటాడు. అయితే కొన్ని నాటకీయపరిణామాల నేపథ్యంలో ఊళ్ళో రాజప్ప కొత్త టివి కొంటాడు. అయితే అనుకోకుండా ఆ టివి చోరీకి గురైతే ఆ నేరం అందరూ సతీష్ పై నేరం మోపుతారు. దీంతో రెండు వారాల్లో టీవీ దొంగతనం ఎవరు చేసారో బైటపెట్టి నిజం నిరూపించుకుంటానని సతీష్ సవాల్ చేస్తాడు. మరి ఊళ్ళో అవమానాలు సతీష్ ఎలా ఎదుర్కొన్నాడు. ఆ టివి దొంగతనం ఎవరు చేసారో కనిపెట్టడా? శారదతో ప్రేమలో ఉన్న సతీష్ అందులోనూ నెగ్గడా లేదా? అనేది మిగిలిన కథ. 

 

దాదాపు అంతా కొత్త నటులతో తెరకెక్కించిన ఈ మూవీ విలేజ్ బ్యాక్ డ్రాప్ లో అదీ 90స్ బ్యాక్ డ్రాప్ నేపథ్యంలో తెరకెక్కడం మంచి ప్లస్ పాయింట్ అని చెప్పాలి. పల్లెటూరు వాతావరణాన్ని చాలా చక్కగా సహజంగా చూపించగా, హీరోగా నటించిన సాయి తేజ్ చక్కగా నటించాడు. అలాగే వేద జలంధర్‌ పాత్రకు ఎక్కువ స్కోప్ లేకపోయినా ఉన్నంతలో బాగా నటించింది. కీలక పాత్రలో నటించిన ప్రదీప్ కూడా బాగా పెర్ఫార్మ్ చేసాడు. అయితే ఈ తిమ్మరాజుపల్లి టీవీ సినిమా కమర్షియల్ మూవీస్ కి భిన్నంగా తెరకెక్కడం వల్ల ఓ వర్గం ఆడియన్స్ కి బాగానే మెప్పించే అవకాశం ఉంది, కానీ కొత్త కథలు కోరుకునే ఆడియన్స్ ని ఎంత వరకు ఆకట్టుకుంటుందో చెప్పలేం. 

 

ఇక టెక్నికల్ గా చూసుకుంటే... వి.మునిరాజు కథకుడిగా పెద్దగా మెప్పించలేకపోయినా, దర్శకుడుగా పర్లేదనిపించాడు. కాకపోతే కొన్ని  డెప్త్ ఉండాల్సిన సీన్స్ ని పెద్దగా వాడుకోలేదు. పైగా స్క్రీన్ ప్లే కూడా రొటీన్ ఫీల్ ఇచ్చింది. కథలో టివి దొంగతనానికి సంబంధించి సస్పెన్స్ బాగానే క్రియేట్ చేసాడు గాని, హీరో హీరోయిన్ల కథను గాలికొదిలేసినట్టు అనిపిస్తుంది. అలాగే క్లైమాక్స్ ని కూడా మరింత ఇంట్రెస్టింగ్ గా డిజైన్ చేయాల్సింది. ఇక మ్యూజిక్ డైరెక్టర్ వంశీకాంత్ పనితనం బాగుంది. సినిమాటోగ్రఫీ వర్క్ సినిమాకి ప్లస్ అయింది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. 

 

Final Review :

"తిమ్మరాజుపల్లి TV" అంటూ ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ మూవీ 90స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన డిఫరెంట్ లవ్ కం ఎమోషనల్ డ్రామాగా ఓ వర్గం ఆడియన్స్ కి ఆకట్టుకుంటుంది. కాకపోతే రొటీన్ కథా, కథనాల వల్ల ఆడియన్స్ ని కొంతవరకే ఆకట్టుకోవచ్చు. ఆసక్తికరమైన స్క్రీన్ ప్లే రాసుకోలేకపోవడం వల్ల, చిన్న కథ కావడం వల్ల కొత్తదనం కోరుకునే ప్రేక్షకులకు అంతగా కనెక్ట్ కాకపోవచ్చు.

 

Review Statistics

6.3
Overall Rating
Avg. of all reviews
15
Total Reviews
From 3 Provider Types

Review Average

Media
6.3/10
Public
N/A
Why MRO?