పెద్ది (Peddi Movie)
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన పాన్ ఇండియా మూవీ "పెద్ది" ఎట్టకేలకు థియేటర్లలో విడుదలైంది. పీరియాడిక్ రూరల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ కమర్షియల్ ఎంటర్టైనర్ ని బుచ్చిబాబు డైరెక్ట్ చేయగా, జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించింది.
Reviews
What critics and the public are saying about పెద్ది (Peddi Movie)
Media Reviews
25 Avg: 6.9/10Above Average
Peddi Movie Review
పెద్ది... ప్రెసెంట్ హిట్ లేని టాలీవుడ్ ని సేవ్ చేయడానికి వస్తుందనిపించింది. టీజర్ సాంగ్స్ తో హోప్స్ వచ్చాయి. నిజంగా జెన్యూన్ గా చెప్పాలంటే సినిమా అబొవ్ యావరేజ్ అనిపించింది. కొంత ఇన్స్పైరింగ్ గా ఉండడం వల్ల కొంత నచ్చింది. సేమ్ చందు ఛాంపియన్ మూవీ స్టోరీల ఉంది. బట్ రామ్ చరణ్ గారి పెర్ఫార్మన్స్ సాలిడ్ గా...
పెద్ది... ప్రెసెంట్ హిట్ లేని టాలీవుడ్ ని సేవ్ చేయడానికి వస్తుందనిపించింది. టీజర్ సాంగ్స్ తో హోప్స్ వచ్చాయి. నిజంగా జెన్యూన్ గా చెప్పాలంటే సినిమా అబొవ్ యావరేజ్ అనిపించింది. కొంత ఇన్స్పైరింగ్ గా ఉండడం వల్ల కొంత నచ్చింది. సేమ్ చందు ఛాంపియన్ మూవీ స్టోరీల ఉంది. బట్ రామ్ చరణ్ గారి పెర్ఫార్మన్స్ సాలిడ్ గా ఉంది. ఇక జాన్వీ కపూర్ రోల్ ఇబ్బంది కరంగా ఉంటుంది.
రామ్ చరణ్ గారు 200 పెర్సెంట్ సూపర్ గా పెర్ఫార్మ్ చేసారు. అలాగే జగపతిబాబు, శివరాజ్ కుమార్ రోల్స్ కూడా ఉన్నంతవరకు బాగా చేసారు. ఇక క్లైమాక్స్ లో దేశం కోసం సైనికుడు ఎంత సేవ చేస్తారో, ఆటగాడు కూడా అంతే సేవ చేస్తారు అని క్లైమాక్స్ లో చెప్పారు. బట్ సినిమాలో గుర్తింపు కోసమే అంత కష్టపడతాడు అని ముందే తెలిసిపోవడం, చాలా సీన్స్ ని గెస్ చేయడం వల్ల సినిమా కొంచెం డిస్సపాయింట్ చేస్తుంది. బట్ ఓవరాల్ గా మెస్సేజ్ ఓరియెంటెడ్ మూవీగా చూసేవాళ్లకు నచ్చోచ్చు. టోటల్ ఫ్రెష్ స్టోరీగా ఇమాజిన్ చేసుకుని చూస్తే లైట్ గా డిస్సపాయింట్ అవుతారు.
Hit
Peddi movie Review
బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ అంచనాల నడుమ ఆడియన్స్ ముందుకు వరల్డ్ వైడ్ గా టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) నటించిన లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ పెద్ది(Peddi Movie) సినిమా వచ్చేసింది. చప్పగా సాగుతున్న టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ కి ఊపిరిపోయడానికి వచ్చిన పెద్ది అనుకున్నట్టుగానే థియేటర్ల వద్ద సందడి చేస్...
బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ అంచనాల నడుమ ఆడియన్స్ ముందుకు వరల్డ్ వైడ్ గా టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) నటించిన లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ పెద్ది(Peddi Movie) సినిమా వచ్చేసింది. చప్పగా సాగుతున్న టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ కి ఊపిరిపోయడానికి వచ్చిన పెద్ది అనుకున్నట్టుగానే థియేటర్ల వద్ద సందడి చేస్తున్నాడు. ఇక కథ మరీ అద్బుతం అనిపించే కథ ఏమి కాదు, చాలా నార్మల్ స్టోరీనే డైరెక్టర్ తీసుకుని హీరోకి ఆ పాయింట్ చుట్టూ పెర్ఫార్మెన్స్ కి అలాగే ఎలివేషన్స్ కి మంచి స్కోప్ ఉండేలా కథని ప్రిపేర్ చేసుకున్నాడు.
ఇక డైరెక్టర్ బుచ్చిబాబు సనా ఎంచుకున్న పాయింట్ బాగున్నా తన ఎక్స్ పీరియన్స్ అంతంత మాత్రమె అవ్వడంతో, రామ్ చరణ్ రోల్ వరకు ఎమోషనల్ క్లైమాక్స్ వరకు మెప్పించాడు, కానీ మిగిలిన కథని సరిగ్గా ప్రిపేర్ చేయలేదు. అలా అని సినిమా మరీ బోర్ ఫీల్ అయ్యేలా ఏం చేయదు. మూడు గంటల లెంగ్త్ లో కొన్ని సీన్స్ కొంచం క్రింజ్ లా అనిపించినా కూడా, రామ్ చరణ్ పెర్ఫార్మెన్స్, ఎక్స్ లెంట్ ఇంటర్వెల్ అండ్ ఎమోషనల్ క్లైమాక్స్ అంతా కూడా బాగా ఆకట్టుకుని ఓ మంచి సినిమా చూసిన ఫీలింగ్ తోనే ఆడియన్స్ థియేటర్స్ బయటికి వస్తారు.
అలాగే శివరాజ్ కుమార్, జగపతిబాబు రోల్స్ కూడా అద్భుతంగా ఉన్నాయి. రంగస్థలంకి ఏమాత్రం తీసిపోని యాక్టింగ్ తో రామ్ చరణ్ ప్రతీ సీన్ లో కుమ్మేశాడు. తన కష్టం కోసం ఈజీగా సినిమాను చూసేయోచ్చు.
Hit
Peddi movie review
Ram Charan faced two back-to-back setbacks (i.e., an extended cameo in Acharya & Game Changer). At a time when he had to deliver a successful film at any cost to be in the top chair race, he teamed up with a one-film-old director, Buchi Babu Sana, for a multi-sport drama, Peddi.1. Ramcharan’s...
Ram Charan faced two back-to-back setbacks (i.e., an extended cameo in Acharya & Game Changer). At a time when he had to deliver a successful film at any cost to be in the top chair race, he teamed up with a one-film-old director, Buchi Babu Sana, for a multi-sport drama, Peddi.
1. Ramcharan’s Terrific Performance
2. Inspiring Emotional Drama
3. Second Half
4. R. Rathnavelu Cinematography
5. A. R. Rahman’s Music
Negatives:
1. Janhvi Kapoor’s Role In The First Half
2. Visual Effects In Pre-Interval Sequence
3. Special Song Placement
Final Verdict: Ramcharan Wins Gold
Rating – 3/5
Average
Peddi Movie Review
పెద్ది మూవీ ఎలా ఉందిరా అంటే నాకైతే నచ్చలేదు.. సినిమా గురించి చెప్పాలంటే సెట్టు సినిమా అనిపించింది.. అనే ప్రతి సీన్ న్యాచురల్ అని చెప్పి సెట్స్ వేసి తీశారు... అది మేజర్ మైనస్. రామ్ చరణ్ లాంటి స్టార్ ని పెట్టుకుని పాన్ ఇండియా మూవీ అని 300 కోట్లు పెట్టి తీసారని చెప్తే నమ్మేట్టు లేదు మూవీ క్వాలిటీ. నా ఫ...
పెద్ది మూవీ ఎలా ఉందిరా అంటే నాకైతే నచ్చలేదు.. సినిమా గురించి చెప్పాలంటే సెట్టు సినిమా అనిపించింది.. అనే ప్రతి సీన్ న్యాచురల్ అని చెప్పి సెట్స్ వేసి తీశారు... అది మేజర్ మైనస్. రామ్ చరణ్ లాంటి స్టార్ ని పెట్టుకుని పాన్ ఇండియా మూవీ అని 300 కోట్లు పెట్టి తీసారని చెప్తే నమ్మేట్టు లేదు మూవీ క్వాలిటీ. నా ఫ్రస్టేషన్ ఏంటంటే గవర్నమెంట్ ని రిక్వెస్ట్ చేసి మరి ఎక్కువ టికెట్ రేట్లకు పర్మిషన్ తెచ్చుకున్నారు. మరి ఆ రేంజ్ క్వాలిటీ ఇచ్చారా అంటే లేదు. సినిమా మొత్తం ఎలివేషన్లు, బోల్డ్ సీన్లు అస్సలు నచ్చలేదు.
ఇక సినిమాలో హీరో చేత కొన్ని బోల్డ్ డైలాగ్స్ చెప్పించారు అది చాలా వల్గర్ గా అనిపించింది. అండ్ నాకు తెలిసిన నార్త్ ఛానెల్ లో సినిమాలో వల్గారిటీ ఎక్కువ ఉందని హీరోహీరోయిన్లను అడిగితే మాకు తెలీదు అన్నారు అది మరింత నచ్చలేదు. ఎందుకంటే హీరోహీరోయిన్లు ఫైనల్ ఔట్ పుట్స్ చూడరా? ఆ మాత్రం తెలీదా? దీనికి బుచ్చిబాబు క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అండ్ సినిమాలో హీరో అన్ని స్పోర్ట్స్ ఎంట్రీ ఇవ్వగానే అలా గెలిచేస్తూ ఉంటాడు. అది కూడా అస్సలు నచ్చలేదు. ఎందుకంటే చిన్నప్పట్నుంచి చాలా మంది వాళ్లకిష్టమైన స్పోర్ట్స్ లో సాధించాలని ట్రై చేస్తుంటే, హీరో మాత్రం ఎంట్రీ ఇవ్వగానే కొన్ని రోజులకే గెలిచేస్తుంటాడు. ప్రాక్టికల్ గా అలా ఎలా కుదురుతుంది. సో ఫైనల్లి ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఈ సినిమాలో ఊరి ఎమోషన్ ని వాడుకుని రొటీన్ కమర్షియల్ ని దించారు అనిపిస్తుంది. అందుకే నాకస్సలు నచ్చలేదు.
Above Average
Peddi Movie Review
పెద్ది మూవీ ఇప్పుడే చూసాను. ఈ సినిమాలో రామ్ చరణ్ గారు, రెహమాన్ గారు లేకపోతే ఈ సినిమా వేరే లెవెల్ డౌన్ అయ్యేది. ప్రాబ్లెమ్ ఏంటంటే సినిమాలో అంత కథ మెటీరియల్ ఇవ్వలేదు. ముందుగా ప్లస్ పాయింట్స్ చెప్పాలంటే బిగ్గెస్ట్ ప్లస్ రామ్ చరణ్. చాలా చాలా కష్టపడ్డారు. సినిమాకి బ్యాక్ బోన్ అయ్యారు. యాక్టింగ్ పరంగానే క...
పెద్ది మూవీ ఇప్పుడే చూసాను. ఈ సినిమాలో రామ్ చరణ్ గారు, రెహమాన్ గారు లేకపోతే ఈ సినిమా వేరే లెవెల్ డౌన్ అయ్యేది. ప్రాబ్లెమ్ ఏంటంటే సినిమాలో అంత కథ మెటీరియల్ ఇవ్వలేదు. ముందుగా ప్లస్ పాయింట్స్ చెప్పాలంటే బిగ్గెస్ట్ ప్లస్ రామ్ చరణ్. చాలా చాలా కష్టపడ్డారు. సినిమాకి బ్యాక్ బోన్ అయ్యారు. యాక్టింగ్ పరంగానే కాకుండా, ఫిజికల్ గా కూడా బెస్ట్ ఇచ్చారు. అండ్ రెహమాన్ కూడా అదిరిపోయే బీజీఎమ్ తో ప్రతి ఫ్రేమ్ ని ఎలివేట్ చేసాడు. బట్ ఫస్ట్ హాఫ్ లో మూడు నాలుగు సీన్లు మాత్రమే బాగున్నాయి. అండ్ ఆర్టిస్టులు ఒక్కరికి కూడా లిప్ సింక్స్ కుదరలేదు.
సెకండ్ హాఫ్ లో సినిమా ఒక రకంగా వెళ్తా ఉంటది. అండ్ జాన్వికపూర్ క్యారెక్టర్ వరెస్ట్ గా డిజైన్ చేసారు. అండ్ రామ్ బుజ్జి క్యారెక్టర్ లో దివ్యేన్దు ని ఎందుకు తీసుకున్నారో కూడా తెలీదు. ఓవరాల్ గా మంచి స్పోర్ట్స్ డ్రామాగా ఉండాల్సిన ఈ సినిమాని పెద్ద హీరో ఉన్నాడని, కమర్షియల్ ఎలిమెంట్స్ ఆడ్ చేసి చెడగొచ్చారు బుచ్చిబాబు. littirally రామ్ చరణ్ సినిమాని కాపాడాడు. అలాగే జగపతి బాబు, శివన్న చాలా ప్లస్ అయ్యారు. బుచ్చిబాబు ఏం చెప్పాలనుకొన్నాడో తెలీదు గాని అంతా సగం సగం కనెక్ట్ అయ్యింది. ఓవరాల్ గా నాకు యావరేజ్ గా అనిపించింది.
Blockbuster
Peddi Movie Review
ఇప్పుడే పెద్ది చూసొచ్చా. హార్ట్ ఫుల్ గా నాకనిపించింది చెప్తా.. ఫస్ట్ ఈ సినిమా చూసిన తర్వాత ఎవరైనా వాంటెడ్ గా ఒక వేళ వేరే హీరో ఫ్యాన్స్, రామ్ చరణ్ అంటే నచ్చని ఫ్యాన్స్ కి కూడా ఈ సినిమాలో రామ్ చరణ్ యాక్టింగ్ చూసిన తర్వాత, వాంటెడ్ గా నెగిటివ్ చేద్దామని అనుకున్నవాళ్ళు కూడా నెగిటివ్ చేయలేకపోతారు. ప్రతి జ...
ఇప్పుడే పెద్ది చూసొచ్చా. హార్ట్ ఫుల్ గా నాకనిపించింది చెప్తా.. ఫస్ట్ ఈ సినిమా చూసిన తర్వాత ఎవరైనా వాంటెడ్ గా ఒక వేళ వేరే హీరో ఫ్యాన్స్, రామ్ చరణ్ అంటే నచ్చని ఫ్యాన్స్ కి కూడా ఈ సినిమాలో రామ్ చరణ్ యాక్టింగ్ చూసిన తర్వాత, వాంటెడ్ గా నెగిటివ్ చేద్దామని అనుకున్నవాళ్ళు కూడా నెగిటివ్ చేయలేకపోతారు. ప్రతి జెన్యూన్ మూవీ లవర్స్ కి ఈ సినిమా తెగ నచ్చేస్తుంది. సో సినిమా విషయానికి వస్తే ఒక మంచి మెసేజ్ ఓరియెంటెడ్ మూవీ.
ఫస్ట్ ఈ మూవీలో ఇద్దరు హీరోలు. ఒకరు రామ్ చరణ్ గారు, నెంబర్ 2 హీరో ఎఆర్ రహ్మాన్ గారు, సోషల్ మీడియాలో రహ్మాన్ మీద వచ్చిన నెగిటివ్ చూసి ఏదో అనుకున్నాం, గాని, సినిమాలో ప్రతి సీన్ కి అదిరిపోయే ఎలివేషన్లతో పర్ఫెక్ట్ బీజీఎమ్ ఇచ్చాడు రెహమాన్. సినిమాలో నచ్చని పార్ట్ ఏదైనా ఉందంటే అది హీరోయిన్ పార్ట్. అండ్ సినిమాలో జగపతిబాబు, శివరాజ్ కుమార్ క్యారెక్టర్స్ కూడా చాలా బాగున్నాయి. అసలు సినిమాలో హీరోయిన్ రోల్ తప్ప, ఇది బాగాలేదని ఏం చెప్పలేం అంత బాగుంది పెద్ది సినిమా. కానీ డిస్సపాయింట్ ఏంటంటే ఒక 10 పెర్సెంట్ మూవీలో సీన్స్ గురించి ఇన్ఫర్మేషన్ లీక్ అయ్యాయి. అందువల్ల కొన్ని సీన్స్ ముందే తెలిసిపోయి ఫీల్ మిస్ అయ్యాను. అవి తప్పితే అన్ని బాగున్నాయి మావ. ఓవరాల్ గా సినిమాని తప్పకుండా మీ ఫ్యామిలీతో చూసేయండి.
Super Hit
Peddi Movie Review
పెద్ది గాడు ఆడాడు, పోరాడాడు, ఖచ్చితంగా గెలిచాడు. ఇది చాలా రూటెడ్ స్టోరీ అండ్ చాలా ఎమోషన్స్ తో కూడుకున్న జెన్యూన్ ఈ మూవీ. ఈ సినిమాలో ఫస్ట్ నుండి లాస్ట్ వరకు మన బుచ్చిబాబు, రామ్ చరణ్, రహ్మాన్, రత్నవేలు వాళ్ళ బెస్ట్ వర్క్ తో మనకు కనిపిస్తే వుంటారన్నమాట. సినిమాలో కొన్ని బోరింగ్ సీన్స్ కూడా ఉంటాయి, అలాగే...
పెద్ది గాడు ఆడాడు, పోరాడాడు, ఖచ్చితంగా గెలిచాడు. ఇది చాలా రూటెడ్ స్టోరీ అండ్ చాలా ఎమోషన్స్ తో కూడుకున్న జెన్యూన్ ఈ మూవీ. ఈ సినిమాలో ఫస్ట్ నుండి లాస్ట్ వరకు మన బుచ్చిబాబు, రామ్ చరణ్, రహ్మాన్, రత్నవేలు వాళ్ళ బెస్ట్ వర్క్ తో మనకు కనిపిస్తే వుంటారన్నమాట. సినిమాలో కొన్ని బోరింగ్ సీన్స్ కూడా ఉంటాయి, అలాగే జాన్వికపూర్ రోల్ కూడా అంతగా ఎక్కలేదు. అలాగే స్టోరీ కూడా చాలా సింపుల్ గా తీసుకున్నాడు బుచ్చి. ఇవి తప్ప మిగతా అన్నిటికి ఆడియన్స్ కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది.
నా వరకు చెప్పాలంటే ఆడియన్స్ ఇందులో ఉన్న ఎమోషన్స్ కి కనెక్ట్ అయితే సినిమా ఎంత ల్యాగ్ ఉన్నా కనెక్ట్ అవుతుంది. అయితే సెకండ్ హాఫ్ లో కాస్త ల్యాగ్ అయి ఫ్లో దెబ్బతింటుంది అనుకున్నా, ఈ సినిమా క్లైమాక్స్ వరకు చాలా ఎమోషనల్ గా, ఎంగేజింగ్ గా పట్టుకెళ్ళాడు బుచ్చిబాబు. అండ్ సినిమాలో రామ్ చరణ్ చితక్కొట్టి, ఉతికారేసాడు అని చెప్పొచ్చు. every సీన్ లో తన బెస్ట్ వర్క్ ఇచ్చాడు. అండ్ జగపతి బాబు రోల్ సినిమాలో story టర్న్ చేసే రోల్. అలాగే శివన్న రోల్ ఇంపాక్ట్ చాలా ఉంటుంది. ఎఆర్ రెహమాన్ కూడా తన బెస్ట్ వర్క్ ఇచ్చారు. ఓవరాల్ గా బుచ్చిబాబు టెక్నిషియన్స్, అండ్ యాక్టర్స్ నుండి అన్ని రకాలుగా టాలెంట్ ని పిండుకుని ది బెస్ట్ రూటెడ్ స్టోరీ ఉన్న మూవీ ఇచ్చాడు డైరెక్టర్. సింగల్ వర్డ్ లో చెప్పాలంటే ఈ మూవీలో ఎమోషన్ కి కనెక్ట్ అయితే పెద్ది గాడ్ని గుండెలలో పెట్టుకుని ఆడియన్స్ థియేటర్ బైటికి వస్తారు.
Super Hit
Peddi movie Review
పెద్ది సినిమా గురించి చెప్పాలంటే గుడ్ బాగుంది సినిమా. మంచి కమర్షియల్ సినిమా, మంచి ఎమోషన్స్ ఉన్న సినిమా. స్పెషల్లీ క్లైమాక్స్ చాలా ఎమోషనల్ గా కనెక్టివ్ గా ఉంటది. ఇక సాంగ్స్ కూడా బాగున్నాయి. కానీ ఐటెం సాంగ్ సినిమాకి అవసరం లేదనిపిస్తుంది. సినిమాలో హీరో తన ఆత్మగౌరవం కోసం ఎంతవరకైనా వెళ్తాడు. కథ కోర్ పాయి...
పెద్ది సినిమా గురించి చెప్పాలంటే గుడ్ బాగుంది సినిమా. మంచి కమర్షియల్ సినిమా, మంచి ఎమోషన్స్ ఉన్న సినిమా. స్పెషల్లీ క్లైమాక్స్ చాలా ఎమోషనల్ గా కనెక్టివ్ గా ఉంటది. ఇక సాంగ్స్ కూడా బాగున్నాయి. కానీ ఐటెం సాంగ్ సినిమాకి అవసరం లేదనిపిస్తుంది. సినిమాలో హీరో తన ఆత్మగౌరవం కోసం ఎంతవరకైనా వెళ్తాడు. కథ కోర్ పాయింట్ కూడా ఇదే. ఇక బుచ్చిబాబు స్క్రీన్ ప్లే కూడా బాగుంటది. బేసిగ్గా ఇదంతా ఒక రైలు కథ. సినిమాలో చాలా థింగ్స్ ఉంటాయి. కానీ సెకండ్ హాఫ్ లో ల్యాగ్ ఎక్కువైందనిపిస్తుంది. ఎండింగ్ మాత్రం పర్ఫెక్ట్ గా ఉంటది.
అయితే ఇండియాలో చాలా ఊళ్లలో సినిమాలో చూపించిన ప్రాబ్లెమ్ ఉంటది. అందుకే ఊరి వాళ్లకు ఈ సినిమా కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ సినిమాలో చాలా సీన్స్ ఊహించినట్టే ఉంటాయి, కానీ కొన్ని సీన్స్ అన్ ఎక్స్పెటెడ్ గా ఉంటాయి. ఇక మ్యూజిక్ మీద కూడా ఏఆర్ రెహమాన్ గట్టి ఎఫర్ట్ పెట్టారు. రామ్ చరణ్ నెవర్ బిఫోర్ రేంజ్ లో బాగా చేసారు. ఇక శివన్న, జగపతి బాబుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. జాన్వీ కపూర్ కె సరైన రోల్ లేదు. డైరెక్షన్ పరంగా సింపుల్ కథనే తీసుకున్నా, బుచ్చిబాబు బాగానే హ్యాండిల్ చేసారు. అయితే హిందీలో ప్రాపర్ రిలీజ్ ఉంటె సినిమా రేంజ్ వేరేలా ఉండేది. అయినా లాంగ్ రన్ లో క్లిక్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక పెద్ది కి నా రేటింగ్ 4.3/5
Hit
Peddi Movie Review
పెద్ది ఎలా అనిపించిందంటే... ముందుగా ఫస్ట్ షోల్డర్ మీద గద మోసినట్టు సినిమాని మోశాడు రామ్ చరణ్. మూవీ నుండి బయటికొచ్చాక కూడా చరణ్ మాత్రమే గుర్తొస్తాడు. ఎంతలా అంటే చరణ్ పెర్ఫార్మన్స్ గురించి వేలెత్తి మాట్లాడరు. కాకపోతే సినిమా కథలో కొత్తదనం లేదు. పలానా ఇలాంటి సీన్సే ఉండాలి, ఇలాగే కథ ఉండాలి అన్నట్టు చేసిన...
పెద్ది ఎలా అనిపించిందంటే... ముందుగా ఫస్ట్ షోల్డర్ మీద గద మోసినట్టు సినిమాని మోశాడు రామ్ చరణ్. మూవీ నుండి బయటికొచ్చాక కూడా చరణ్ మాత్రమే గుర్తొస్తాడు. ఎంతలా అంటే చరణ్ పెర్ఫార్మన్స్ గురించి వేలెత్తి మాట్లాడరు. కాకపోతే సినిమా కథలో కొత్తదనం లేదు. పలానా ఇలాంటి సీన్సే ఉండాలి, ఇలాగే కథ ఉండాలి అన్నట్టు చేసినట్టు ఉంది కానీ, ఆడియన్స్ ని ఇంపాక్ట్ చేసేలా లేదు. ఇక సీన్స్ గురించి చెప్పుకుంటే ఇంట్రో సీన్, సాంగ్స్, ఫైట్స్ కూడా బానే ఉంటాయి. కానీ ఏదో మిస్ అవుతుందనిపిస్తుంది.
ఇక సెకండ్ హాఫ్ లో కుస్తీ ఫైట్ సీన్ స్టార్ట్ అవగానే ఇక్కడినుండి సినిమా రియలిస్టిక్ గా ఉందనిపిస్తుంది. ఒక డివైన్ ఫీల్ వస్తుంది. బట్ బుచ్చిబాబు తన ఐడియాస్ స్క్రీన్ పై సరిగా చెప్పలేదు ఏదో మిస్ అయిందనిపిస్తుంది. పైగా కొన్ని విఎఫెక్స్ షాట్స్ కూడా బాగాలేవు. లిప్ సింక్స్ అయితే కొంతమంది కి అస్సలు సెట్ అవలేదు. అండ్ 350 cr బడ్జెట్ అంటే నమ్మేలా లేదు. ఎందుకంటే చాలా వరకు సెట్స్ వేసి తీశారు. ఇక జాన్వీ కపూర్ అచ్చియమ్మ ట్రాక్ కూడా అంత లేదు. ఇక విజువల్స్ గా సినిమా బాగుంది. జగపతి బాబు, శివన్న కూడా షైన్ అయ్యారు. అయితే బుచ్చిబాబు ఐడియాస్ బాగున్నా దాని ఎక్స్యూగుషన్ అంత లేదు. కానీ సినిమాలో ఒక హానెస్టీ ఉంటది. కొంచెం లైట్ ఎక్స్పెక్టేషన్స్ తో మూవీకి వెళ్తే మంచి సినిమా అన్న సంతృప్తితో బైటికొస్తారు.
Above Average
Peddi Movie Review
Completed watching the movie: #Peddi’s final portion makes you emotional.It’s about a man who goes to any extent to bring identity and recognition to his village and its people.Ram Charan and the film deserve national awards.This is not an entertainment-oriented film; it’s an emotionally driven, con...
Completed watching the movie:
#Peddi’s final portion makes you emotional.
It’s about a man who goes to any extent to bring identity and recognition to his village and its people.
Ram Charan and the film deserve national awards.
This is not an entertainment-oriented film; it’s an emotionally driven, content-rich film.
It’s appreciable that a big star like Ram Charan took up such a content-driven project.
Loved the English lyrics and the music that play in the background during #Peddi’s elevation sequences! A.R. Rahman’s score is absolutely top-notch.
Technically, #Peddi is brilliant!
On the whole, #Peddi is an inspirational film with solid box-office potential!
Above Average
Peddi Movie Review
#Peddi A watchable commercial entertainer with an honest story that works in parts despite its regular template narration! The first half is fairly average with template commercial elements, and Jahnvi’s track doesn’t work. However, the stretch from the pre-interval to the end of Massa Massa is the...
#Peddi A watchable commercial entertainer with an honest story that works in parts despite its regular template narration!
The first half is fairly average with template commercial elements, and Jahnvi’s track doesn’t work. However, the stretch from the pre-interval to the end of Massa Massa is the film’s biggest highlight and is executed well. Post that, the film drags with ups and downs, though the climax is wrapped up neatly.
Ram Charan is terrific and clearly carries the film. His transformation and effort are evident throughout. ARR’s music works well and is another highlight. Buchi Babu Sana succeeds in presenting an honest story, but the screenplay and editing could have been better.
Has its share of flaws, but can be watched with expectations in check for Ram Charan’s performance, the music, and the honest story.
Rating: 2.75/5
Above Average
Peddi movie Review
పెద్ది… నా రేటింగ్.…… 3/5పెద్ది…కమర్షియల్ మాస్ ఎంటర్ టైనర్ కాదుసిన్సియర్ స్పోర్ట్స్ పర్సన్ బయోపిక్పెద్ది ఓ సీరియస్ అటెంప్ట్అబౌవ్ యావరేజ్ ఫస్ట్ హాఫ్కథ ఎలా డ్రయివ్ చేస్తే అలా వెళ్లిన సెకండాఫ్.…పెద్ది..రామ్ చరణ్ నమ్మకంపెద్ది...రెహమాన్..రత్నవేలు వర్క్పెద్ది..నిర్మాత ధైర్యంపెద్ది..దర్శకుడు బుచ్చిబాబు స్ట...
పెద్ది… నా రేటింగ్.…… 3/5
పెద్ది…కమర్షియల్ మాస్ ఎంటర్ టైనర్ కాదు
సిన్సియర్ స్పోర్ట్స్ పర్సన్ బయోపిక్
పెద్ది ఓ సీరియస్ అటెంప్ట్
అబౌవ్ యావరేజ్ ఫస్ట్ హాఫ్
కథ ఎలా డ్రయివ్ చేస్తే అలా వెళ్లిన సెకండాఫ్.
…
పెద్ది..రామ్ చరణ్ నమ్మకం
పెద్ది...రెహమాన్..రత్నవేలు వర్క్
పెద్ది..నిర్మాత ధైర్యం
పెద్ది..దర్శకుడు బుచ్చిబాబు స్టామినా
…
అందరికీ నచ్చుతుందా? అన్నదే ప్రశ్న.
పంచ్ లైన్... మళ్లీ చూడగలమా ఏంటీ !
Hit
Peddi Movie Review
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మక చిత్రంగా తెరకెక్కిన 'పెద్ది' భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 'ఉప్పెన'తో దర్శకుడిగా తన ముద్ర వేసిన బుచ్చిబాబు సాన, ఈసారి పూర్తిగా భిన్నమైన కథను ఎంచుకుని ఒక గ్రామం ఆత్మగౌరవ పోరాటాన్ని స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో ఆవిష్కరించాడు. అయి...
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మక చిత్రంగా తెరకెక్కిన 'పెద్ది' భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 'ఉప్పెన'తో దర్శకుడిగా తన ముద్ర వేసిన బుచ్చిబాబు సాన, ఈసారి పూర్తిగా భిన్నమైన కథను ఎంచుకుని ఒక గ్రామం ఆత్మగౌరవ పోరాటాన్ని స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో ఆవిష్కరించాడు. అయితే 'పెద్ది'ని కేవలం స్పోర్ట్స్ డ్రామాగా చెప్పడం సరైంది కాదు. ఇది ఒక గ్రామం ఆత్మగౌరవం కోసం పోరాడిన యువకుడి కథ. అయితే బుచ్చిబాబు కథ రొటీన్ గా రాసుకున్నా, కొన్ని చోట్ల కథనం కాస్త నెమ్మదించిన భావన కలిగించినా, ప్రేక్షకుడు పాత్రలతో కనెక్ట్ అయ్యేలా స్క్రీన్ ప్లే సాగుతుంది.
ఇక ఇంటర్వెల్ బ్లాక్ సినిమాకు పెద్ద బలం. సెకండాఫ్‌లో కుస్తీ, అథ్లెటిక్స్, ఢిల్లీ ఎపిసోడ్స్, రాజకీయ వ్యవస్థతో పోరాటం, గ్రామ భవిష్యత్తు కోసం చేసే ప్రయత్నాలు ఎమోషనల్‌గా సాగుతాయి. ఇక సినిమాకి రామ్ చరణ్ కెరీర్ బెస్ట్ నటన, బుచ్చిబాబు ఎమోషనల్ కథనం, 40 నిమిషాల క్లైమాక్స్, జగపతిబాబు, శివరాజ్‌కుమార్ పాత్రలతో పాటు ఏఆర్ రెహమాన్ నేపథ్య సంగీతం కూడా బిగ్ ప్లస్ అయింది. ఓవరాల్ గా "పెద్ది.. కేవలం ఒక ఆటగాడి కథ కాదు.. ఒక ఊరి గౌరవం కోసం సాగిన పోరాట గాథగా ఆడియన్స్ తప్పక చూడాల్సిన సినిమా ఇది.
Hit
Peddi Movie Review
మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ పెద్ది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబు కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఇక ఊరి కోసం పోరాడే హీరో కథే ఈ పెద్ది. ఇక సినిమా మొత్తం రామ్ చరణ్ వన్ మ్యాన్ షోగా నడిపించాడు. పెద్ది పాత్రకి సంపూర్ణ న్యాయం చేసిన చరణ్ పెద్దిగా జీవిం...
మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ పెద్ది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబు కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఇక ఊరి కోసం పోరాడే హీరో కథే ఈ పెద్ది. ఇక సినిమా మొత్తం రామ్ చరణ్ వన్ మ్యాన్ షోగా నడిపించాడు. పెద్ది పాత్రకి సంపూర్ణ న్యాయం చేసిన చరణ్ పెద్దిగా జీవించేసాడు. తనదైన హావభావాలతో భావోద్వేగమైన నటనతో మెప్పించాడు. ఇక జాన్వికపూర్ పాటలకే పరిమితమైంది. మిగతా నటీనటులందరూ మెప్పించారు.
ఇక తెరపై హీరో రామ్ చరణ్ అయితే తెరవెనక నడిపించిన హీరో AR రెహ్మాన్. ఆయన రీ రికార్డింగ్ చాలా రీఫ్రెషింగ్‌గా అనిపించింది.. సినిమా స్థాయిని పెంచేసింది. రత్నవేలు సినిమాటోగ్రఫీ కూడా ఈ సినిమాకు ప్రాణం. నవీన్ నూలి ఎడిటింగ్ ఇంకాస్త షార్ప్ గా ఉంటే బాగుండేది.. కానీ దర్శకుడు నిర్ణయం కాబట్టి అతడిని తప్పు పట్టడానికి లేదు. బుచ్చిబాబు తన వంతు ప్రయత్నం చాలా సిన్సియర్‌గా చేసాడు.. హీరో దొరికాడు కదా అని కమర్షియల్‌గా కాకుండా మంచి కథ చెప్పాడు. గ్రాఫిక్స్ విషయాల్లో అక్కడక్కడా చూసుకోవాల్సిందే. వృద్ధి సినిమాస్ నిర్మాణ విలువలు బాగున్నాయి. ఓవరాల్‌గా పెద్ది.. మనసును కదిలించే కొండ కింద ఊరోడి కథ..!
Hit
Peddi Movie Review
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన ‘పెద్ది’ భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ స్పోర్ట్స్ డ్రామా, తన ఊరి గుర్తింపు కోసం పోరాడే ఓ యువకుడి కథను భావోద్వేగంగా చూపించే ప్రయత్నం చేస్తుంది. ఇక సినిమాలో రామ్ చరణ్ పెర్ఫార్మెన్స్ పరంగా తన పా...
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన ‘పెద్ది’ భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ స్పోర్ట్స్ డ్రామా, తన ఊరి గుర్తింపు కోసం పోరాడే ఓ యువకుడి కథను భావోద్వేగంగా చూపించే ప్రయత్నం చేస్తుంది. ఇక సినిమాలో రామ్ చరణ్ పెర్ఫార్మెన్స్ పరంగా తన పాత్రకు పూర్తి న్యాయం చేస్తూ, యాక్షన్ మరియు ఎమోషనల్ సన్నివేశాల్లో ఆకట్టుకుంటాడు. ముఖ్యంగా క్లైమాక్స్ మరియు స్పోర్ట్స్ ఎపిసోడ్స్‌లో చరణ్ నటన ప్రేక్షకులను కదిలిస్తుంది.
అయితే కథ పరంగా చూస్తే ఇది కొత్త కథ కాదు. కొన్ని సన్నివేశాలు ముందే ఊహించగలిగేలా ఉండగా, స్క్రీన్‌ప్లే కూడా కొంతవరకు రొటీన్‌గా అనిపిస్తుంది. టెక్నికల్‌గా ఎ.ఆర్. రెహమాన్ సంగీతం సినిమాకు పెద్ద బలంగా నిలిచింది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, ఎమోషనల్ బ్లాక్స్‌ను మరింత ఎలివేట్ చేస్తుంది. ఓవరాల్‌గా ‘పెద్ది’ కొత్త కథ చెప్పకపోయినా, బలమైన ఎమోషన్స్, రామ్ చరణ్ అద్భుత నటన, స్పోర్ట్స్ డ్రామా ఎలిమెంట్స్‌తో మెప్పించే కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా నిలుస్తుంది.
Hit
Peddi Movie Review
రామ్ చరణ్ నటించిన పెద్ది స్పోర్ట్స్ నేపథ్యంలో సాగే ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కగా, ఊరు గుర్తింపు కోసం, తన గుర్తింపు కోసం ఒక క్రీడాకారుడు తన ఆటతో చేసే పోరాటమే ఈ పెద్ది సినిమాగా చెప్పొచ్చు. అయితే సినిమాలో మెయిన్‌గా కథని ఎస్టాబ్లిష్ చేయడానికి, ఎమోషన్స్ ని క్యారీ చేయడానికి ఎక్కువగా టైమ్ తీసుకున్నారు. క్...
రామ్ చరణ్ నటించిన పెద్ది స్పోర్ట్స్ నేపథ్యంలో సాగే ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కగా, ఊరు గుర్తింపు కోసం, తన గుర్తింపు కోసం ఒక క్రీడాకారుడు తన ఆటతో చేసే పోరాటమే ఈ పెద్ది సినిమాగా చెప్పొచ్చు. అయితే సినిమాలో మెయిన్‌గా కథని ఎస్టాబ్లిష్ చేయడానికి, ఎమోషన్స్ ని క్యారీ చేయడానికి ఎక్కువగా టైమ్ తీసుకున్నారు. క్రికెట్ బ్యాట్ పట్టుకొని క్రికెట్ గ్రౌండ్ లోకి పెద్ది దిగిన సన్నివేశంతో రామ్ చరణ్ ఎంట్రీ ఉంటుంది. దాన్ని సాలిడ్‌గా ప్లాన్ చేశారు బుచ్చిబాబు. ముఖ్యంగా క్లైమాక్స్ మాత్రం ఎమోషనల్ గా ఉంది. ఎంగేజ్ చేస్తుంది. చివరి అరగంట ఉత్కంఠభరితంగా సాగుతుంది. చివరగా రెగ్యూలర్ గానే ముగింపు తీసుకుంటుంది.
అయితే సినిమాకి మ్యూజిక్ యావరేజ్ గా నిలిచింది. కానీ బీజీఎం బాగా ఇచ్చాడు ఏఆర్ రెహమాన్. రత్నవేలు కెమెరా వర్క్ బాగుంది. రామ్ చరణ్‌లోని ఎమోషన్స్ ని బాగా క్యారీ చేశారు. ఎడిటింగ్ పరంగా లోపాలున్నాయి. దర్శకుడు బుచ్చిబాబు సానా మంచి కథని రాసుకున్నాడు, కానీ ట్రెండ్‌కి తగ్గట్టుగా ప్రజెంట్ చేయడంలో కొంత తడబాటు కనిపిస్తుంది. కాకపోతే ఆయన సక్సెస్ అయిన అంశం ఏంటంటే రామ్ చరణ్‌తో బాగా చేయించగలిగాడు. నటీనటుల నుంచి తన బెస్ట్ తీసుకున్నాడు. ఓవరాల్ గా కథగా ఊహించేలా ఉన్నా, ఎమోషనల్ డ్రామా కట్టిపడేస్తుంది. రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ కోసం అయినా చూడగలిగే మూవీ.
Hit
Peddi Movie Review
మెగా పవర్ స్టార్ Ram Charan హీరోగా, దర్శకుడు Buchi Babu Sana తెరకెక్కించిన ‘పెద్ది’ ఒక ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా. ఊరి గుర్తింపు కోసం పోరాడే పెద్ది అనే యువకుడి కథ చుట్టూ సినిమా సాగుతుంది. కూలీ కుటుంబం నుంచి వచ్చిన పెద్ది తన అసాధారణ క్రీడా ప్రతిభతో ఎలా ఎదిగాడు? తన గ్రామం కోసం ఎంత దూరం వెళ్లాడు? అనేదే...
మెగా పవర్ స్టార్ Ram Charan హీరోగా, దర్శకుడు Buchi Babu Sana తెరకెక్కించిన ‘పెద్ది’ ఒక ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా. ఊరి గుర్తింపు కోసం పోరాడే పెద్ది అనే యువకుడి కథ చుట్టూ సినిమా సాగుతుంది. కూలీ కుటుంబం నుంచి వచ్చిన పెద్ది తన అసాధారణ క్రీడా ప్రతిభతో ఎలా ఎదిగాడు? తన గ్రామం కోసం ఎంత దూరం వెళ్లాడు? అనేదే కథాంశం. ఇక సినిమాకు ప్రధాన బలం రామ్ చరణ్ నటన. రంగస్థలం తర్వాత మరోసారి బలమైన పాత్రలో కనిపించిన ఆయన, యాక్షన్‌తో పాటు ఎమోషనల్ సన్నివేశాల్లోనూ ఆకట్టుకుంటాడు. జగపతి బాబు, శివరాజ్ కుమార్ పాత్రలు కూడా సినిమాకి ప్లస్ అయ్యాయి. కానీ హీరోయిన్ జాన్వీ కపూర్ పాత్ర మాత్రం నిరాశపరిచింది. పైగా సినిమాలో పాటలకు, ఎక్స్పోజింగ్ కి మాత్రమే అనట్టుంటుంది.
కథ పరంగా చూస్తే ఇది పూర్తిగా కొత్త కథ కాదు. చాలా సన్నివేశాలు ముందే ఊహించగలిగేలా ఉంటాయి. కొన్ని చోట్ల విజువల్ ఎఫెక్ట్స్, లిప్ సింక్ సమస్యలు కనిపిస్తాయి. అయితే దర్శకుడు భావోద్వేగాలను బాగా హ్యాండిల్ చేయడం సినిమాకు ప్లస్ అయ్యింది. టెక్నికల్ గా A. R. Rahman అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లింది. స్పోర్ట్స్ ఎపిసోడ్స్, ఎమోషనల్ బ్లాక్స్ థియేటర్లలో మంచి అనుభూతిని ఇస్తాయి. ఓవరాల్‌గా ‘పెద్ది’ రామ్ చరణ్ కెరీర్‌లో మరో గుర్తుండిపోయే సినిమా. కథ పరంగా వంక పెట్టేలా ఉన్నా, ఓసారి పక్కాగా చూసేయొచ్చు.
Super Hit
Peddi Movie Review
రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా తెరకెక్కిన సినిమా ‘పెద్ది’. బుచ్చిబాబు సాన దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ తాజాగా థియేటర్లలో విడుదలై ఆకట్టుకుంటుంది. అయితే ఇది కమర్షియల్ సినిమా అనేకన్నా ఒక ఎమోషనల్ స్ఫూర్తినిచ్చే స్పోర్ట్స్ డ్రామా సినిమా అని చెప్పొచ్చు. కథ పరంగా అంతగా లేకపోయినా, బుచ్చిబాబు స్క్రీన్ ప్లే ప...
రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా తెరకెక్కిన సినిమా ‘పెద్ది’. బుచ్చిబాబు సాన దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ తాజాగా థియేటర్లలో విడుదలై ఆకట్టుకుంటుంది. అయితే ఇది కమర్షియల్ సినిమా అనేకన్నా ఒక ఎమోషనల్ స్ఫూర్తినిచ్చే స్పోర్ట్స్ డ్రామా సినిమా అని చెప్పొచ్చు. కథ పరంగా అంతగా లేకపోయినా, బుచ్చిబాబు స్క్రీన్ ప్లే పరంగా ఆకట్టుకున్నాడు. ఇక రామ్ చరణ్ మరోసారి తన కెరీర్ బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చాడని చెప్పాలి. ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్ లో ఓ సీన్, ఆ తర్వాత క్లైమాక్స్ వరకు అలాంటి సీన్స్ స్టార్ హీరో చేయడానికి ధైర్యం కావాలి. చరణ్ ఆ సీన్స్ చేయడమే కాదు చేసి ఏడిపించాడు కూడా.
అలాగే జగపతి బాబు, శివరాజ్ కుమార్ కూడా తమ నటనలో సీనియారిటీ చూపించారు. ఎఆర్ రహ్మాన్ ఊరించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ట్రైలర్ ద్వారా వచ్చిన ట్రోల్స్ కి సినిమా ద్వారా సమాధానం చెప్పాడు. ఇక టెక్నికల్ గానూ సినిమా ఔట్స్టాండింగ్ గా ఉంది. మొత్తంగా ‘పెద్ది’ ఊరు, తన మనుషులకు గుర్తింపు కోసం ఒక ఆటగాడిగా ఏం చేసాడు? అందరిలో ఎలా స్ఫూర్తి నింపాడు అని కమర్షియల్ గా ఎమోషనల్ గా తెరకెక్కించారు. కొత్తదనం కోరుకోకుండా కమర్షియల్ మూవీస్ ఇష్టపడే ఆడియన్స్ అందరికి ఈ సినిమా నచ్చుతుంది.
Hit
Peddi Movie Review
రామ్ చరణ్ హీరోగా నటించిన పాన్ ఇండియా స్పోర్ట్స్ డ్రామా 'పెద్ది'. బుచ్చిబాబు సానా దర్శకత్వం వహించిన ఈ సినిమా థియేటర్లలో మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. అయితే బలమైన కథా కథనాలు రాసుకోవడంలో దర్శకుడు బుచ్చిబాబు విఫలమయ్యాడు. కాని తన టేకింగ్ తో ఆకట్టుకున్నాడు బుచ్చి. తనలోని నటుడిని బయటికు తీసుకువచ్చే క్యారెక్...
రామ్ చరణ్ హీరోగా నటించిన పాన్ ఇండియా స్పోర్ట్స్ డ్రామా 'పెద్ది'. బుచ్చిబాబు సానా దర్శకత్వం వహించిన ఈ సినిమా థియేటర్లలో మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. అయితే బలమైన కథా కథనాలు రాసుకోవడంలో దర్శకుడు బుచ్చిబాబు విఫలమయ్యాడు. కాని తన టేకింగ్ తో ఆకట్టుకున్నాడు బుచ్చి. తనలోని నటుడిని బయటికు తీసుకువచ్చే క్యారెక్టర్ చేయడానికి ఎప్పుడూ రెడీ ఉండే రామ్ చరణ్ మరోసారి తన యాక్టింగ్ పొటెన్షియాలిటీ ఏంటో చూపించారు. అలాగే జగపతిబాబు, శివరాజ్ కుమార్ తమ పెర్ఫార్మన్స్ తో మరో హైలెట్ గా నిలిచారు.
అయితే దర్శకుడు బుచ్చిబాబు సానా కథ కన్నా, కొన్ని భావోద్వేగ సన్నివేశాలు, క్లైమాక్స్ ఎపిసోడ్స్ మీద ఎక్కువ నమ్మకం పెట్టుకున్నారు. అక్కడ ఎమోషన్స్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టారు. అయితే అది బాగానే ఉంది కానీ, బలమైన కొత్త తరహా కథ తీసుకోలేకపోయారు బుచ్చిబాబు. దివ్యేందు శర్మ, రవి కిషన్, బోమన్ ఇరానీ వంటి ఆర్టిస్టులకు సరైన రోల్స్ పడలేదు. ఓవరాల్ గా కమర్షియల్ అంశాలతో కూడిన కంటెంట్ బేస్డ్ సినిమా పెద్ది. అయితే... కమర్షియాలిటీ కంటే కంటెంట్ హైలైట్ అవుతుంది. కథలో ఎమోషనల్ సీన్స్ హై ఇస్తాయి. ప్రీ ఇంటర్వెల్ నుంచి ఇంటర్వెల్ వరకు, అలాగే లాస్ట్ 30 మినిట్స్ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్స్. బుచ్చిబాబు రచనలో నిజాయతీని అభినందించాలి. రామ్ చరణ్ తన నటనతో సినిమాను నిలబెట్టారు. పెద్ది... నటుడిగా రామ్ చరణ్ వన్ మ్యాన్ షో. ఆయన కోసం సినిమా చూడాలంతే
Super Hit
Peddi Movie Review
గ్లోబల్‌స్టార్ రామ్‌చరణ్ (Ram charan) హీరోగా నటించిన 'పెద్ది’ సినిమా ఫైనల్ గా థియేటర్లలో విడుదలకాగా, సినిమా మంచి రెస్పాన్స్ ని అందుకుంటుంది. మరీ యానానిమస్ రేంజ్ లో కాకపోయినా, రీసెంట్ బిగ్గిస్ లో వన్ అఫ్ ది బెస్ట్ గా టాక్ తెచ్చుకుంది. సినిమాలో రామ్ చరణ్ తన బెస్ట్ పెర్ఫార్మన్స్ తో ఆకట్టుకోగా, బుచ్చి...
గ్లోబల్‌స్టార్ రామ్‌చరణ్ (Ram charan) హీరోగా నటించిన 'పెద్ది’ సినిమా ఫైనల్ గా థియేటర్లలో విడుదలకాగా, సినిమా మంచి రెస్పాన్స్ ని అందుకుంటుంది. మరీ యానానిమస్ రేంజ్ లో కాకపోయినా, రీసెంట్ బిగ్గిస్ లో వన్ అఫ్ ది బెస్ట్ గా టాక్ తెచ్చుకుంది. సినిమాలో రామ్ చరణ్ తన బెస్ట్ పెర్ఫార్మన్స్ తో ఆకట్టుకోగా, బుచ్చిబాబు టేకింగ్ తోనూ ఆకట్టుకున్నాడు. ఇక ఫస్టాఫ్ స్క్రీన్ ప్లే రొటీన్, రెగ్యులర్ గా, కమర్షియల్ అంశాలు లెక్కలేసుకొని సినిమాను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేసినట్టు కనిపిస్తుంది. అయితే అప్పలసూరికి సంబంధించి ఓ ఎమోషనల్ సీన్‌తో ఇంటర్వెల్ ఎపిసోడ్ ప్రేక్షకుడిని భావోద్వేగాల ఊగిసలాటకు గురి చేస్తుంది.
ఇంటర్వెల్ బ్యాంగ్ తో కథను మలుపు తిప్పిన దర్శకుడు బుచ్చిబాబు, పెద్ది పాత్రను చెక్కిన విధానం, ఆ పాత్రలో రాంచరణ్ చూపించిన కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ప్రేక్షకులను కొత్త అనుభూతికి గురి చేస్తాయి. సెకండాఫ్‌లో పెద్ది, గౌర్నాయుడు పాత్రల మధ్య కెమిస్ట్రీ బాగా పండింది. అయితే సినిమాలో కనెక్టవిటీ ఏదో మిస్ అయినట్టు అనిపిస్తాయి. ఇక ఎడిటింగ్, సాదా సీదా VFX ఇలాంటి స్వల్ప లోపాలు పక్కన పెట్టేయొచ్చు. ఓవరాల్ గా రాంచరణ్ మాత్రం నభూతో నభవిష్యత్ అనే విధంగా పెద్దిగా నటించాడు. కలెక్షన్లు మాత్రమే కాకుండా అవార్డులు కూడా తెచ్చిపెట్టే సినిమా పెద్ది. థియేటర్‌లోనే చూడండి.. డోంట్ మిస్.. మస్ట్ వాచ్ మూవీ.
Above Average
Peddi Movie Review
గ్లోబల్‌స్టార్ రామ్‌చరణ్ (Ram charan) హీరోగా నటించిన చిత్రం 'పెద్ది’. 'ఉప్పెన' లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత ఐదేళ్లు సమయం తీసుకుని బుచ్చిబాబు సాన తెరకెక్కించిన చిత్రమిది. తాజాగా థియేటర్లలో విడుదలైన ఈ సినిమా మిక్స్డ్ రెస్పాన్స్ అందుకుంది. విజయనగరంలో ఏ గుర్తింపు లేని, అంటే కనీసం ఆ ప్రాంతంలో 1800...
గ్లోబల్‌స్టార్ రామ్‌చరణ్ (Ram charan) హీరోగా నటించిన చిత్రం 'పెద్ది’. 'ఉప్పెన' లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత ఐదేళ్లు సమయం తీసుకుని బుచ్చిబాబు సాన తెరకెక్కించిన చిత్రమిది. తాజాగా థియేటర్లలో విడుదలైన ఈ సినిమా మిక్స్డ్ రెస్పాన్స్ అందుకుంది. విజయనగరంలో ఏ గుర్తింపు లేని, అంటే కనీసం ఆ ప్రాంతంలో 1800 మంది ఉన్నారన్న విషయం తెలియని ప్రభుత్వానికి ఆ ఊరి యువకుడు ఎలా గుర్తింపు తెచ్చాడు? అదొక ఊరని దేశానికి ఎలా తెలియజేశాడు? ఈ జర్నీలో ఎదురైన సవాళ్లేంటి అన్నది ఇతివృత్తంగా తీసిన సినిమా ఇది.
ఇక సినిమా మొత్తం బ్యాక్ బోన్ గా ఉండి నడిపించిన రామ్ చరణ్ ప్రతి ఫ్రేమ్ ఆకట్టుకుంటాడు. బలమైన భావోద్వేగాలతో ఆడియన్స్ ని మెస్మరైజ్ చేస్తాడు. అయితే బలమైన కథ, కథనం లేకపోవడంతో కొత్తదనం కోరుకునే ఆడియన్స్ కొంత డిస్సపాయింట్ అవుతారు. కానీ బుచ్చిబాబు తన టేకింగ్ తో కొంతవరకు మెప్పించాడు. దర్శకుడిగా రామ్ చరణ్ లోని నటుడ్ని మరోసారి ఆవిష్కరించి గురువుకి తగ్గ శిష్యుడనిపించుకున్నాడు. కానీ తెరపై పేరున్న ఆర్టిస్ట్‌లు ఎంతో మందిని సరిగా ఉపయోగించుకోలేకపోయాడు. కొన్ని చోట్ల లాజిక్స్‌ను వదిలేస్తే, కొన్ని సన్నివేశాలు సినిమాటిక్ గా ఉంటాయి. కానీ బుచ్చి రచనలో నిజాయతీ ఉంది. కొన్ని సీన్స్‌ను, డైలాగ్‌లను బాగా రాసుకున్నాడు. ఓవరాల్ గా కొన్ని సీన్స్ ని ఎడిట్ చేయాల్సింది. అయితే అభిమానులకు అయితే పెద్ది విందు భోజనం లాంటి సినిమా. ప్రస్తుతం ఏ సినిమా పోటీ లేకపోవడం ఈ సినిమాకు ప్లస్ అవుతుంది. మొత్తం మీద పెద్ది రామ్‌చరణ్ వన్‌మెన్ షోగా చెప్పుకోవచ్చు
Hit
Peddi Movie Review
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన పెద్ది ఎట్టకేలకు థియేటర్లలో విడుదలై మంచి రెస్పాన్స్ ని కూడా రాబట్టుకుంది. బుచ్చిబాబు దర్శకత్వం వహించిన ఈ సినిమా రూరల్ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కగా, జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించింది. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ నటనతో పాటు, బుచ్చిబాబు టేకింగ్, ఎఆర్ రహ్మన్...
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన పెద్ది ఎట్టకేలకు థియేటర్లలో విడుదలై మంచి రెస్పాన్స్ ని కూడా రాబట్టుకుంది. బుచ్చిబాబు దర్శకత్వం వహించిన ఈ సినిమా రూరల్ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కగా, జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించింది. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ నటనతో పాటు, బుచ్చిబాబు టేకింగ్, ఎఆర్ రహ్మన్ అదిరిపోయే మ్యూజిక్ తో సినిమాని నిలబెట్టారు.
అయితే కథ పరంగా చాలా చిన్నగా ఉంటుంది. మాములు కొండప్రాంతానికి చెందిన పెద్ది అనే యువకుడు ఊరి కోసం చేసిన పోరాటమే ఈ కథ నేపథ్యం. ఇక స్క్రీన్ ప్లే కూడా కాస్త డల్ గా ఉన్నప్పటికి, ఆడియన్స్ ని ఎమోషనల్ గా టచ్ చేయడంలో బుచ్చిబాబు సక్సెస్ అయ్యాడు. ముఖ్యంగా సినిమాలో రామ్ చరణ్ నటన ఢిల్లీ ఎపిసోడ్స్, కుస్తీ సీన్స్ హైలెట్ అయ్యాయి. అలాగే జగపతి బాబు, శివరాజ్ కుమార్ కూడా మూవీకి ప్లస్ అయ్యారు. ఎఆర్ రహ్మాన్ సినిమాకి అద్భుతమైన సాంగ్స్ తో పాటు సాలిడ్ బీజీఎమ్ ఇచ్చారు. ఓవరాల్ గా సినిమాకి పెద్ది కథ ఇంకా బలంగా రాసుకుని ఉంటె ఇంపాక్ట్ వేరే లెవెల్ లో ఉండేది. కాని ఫైనల్ గా ఈ పెద్ది అందరికి గుర్తుండిపోతాడు.
Hit
Peddi Movie Review
సంక్రాంతి తర్వాత వెలవెలబోయిన టాలీవుడ్ బాక్సాఫీస్ ను గట్టెక్కించే సినిమా అవుతుందని ఇండస్ట్రీ అంతా ఆశలు పెట్టుకున్న చిత్రం.. పెద్ది. తన అరంగేట్ర చిత్రం ‘ఉప్పెన’తోనే సెన్సేషన్ క్రియేట్ చేసిన బుచ్చిబాబు దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన చిత్రమిది. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చి అ...
సంక్రాంతి తర్వాత వెలవెలబోయిన టాలీవుడ్ బాక్సాఫీస్ ను గట్టెక్కించే సినిమా అవుతుందని ఇండస్ట్రీ అంతా ఆశలు పెట్టుకున్న చిత్రం.. పెద్ది. తన అరంగేట్ర చిత్రం ‘ఉప్పెన’తోనే సెన్సేషన్ క్రియేట్ చేసిన బుచ్చిబాబు దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన చిత్రమిది. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చి అనుకున్నట్టుగానే మంచి రెస్పాన్స్ ని అందుకుంటుంది. సినిమాలో రామ్ చరణ్ నటనతో పాటు బుచ్చిబాబు టేకింగ్, ఎఆర్ రహ్మన్ అదిరిపోయే మ్యూజిక్ తో సినిమాని నిలబెట్టారు.
కథ పరంగా రొటీన్ స్టోరీయే అయినా, తన స్క్రీన్ ప్లే మ్యాజిక్ తో బుచ్చిబాబు మ్యానేజ్ చేసాడు. ఇక ‘పెద్ది’ కోసం బుచ్చిబాబు ఏరి కోరి ఏఆర్ రెహమాన్ ను ఎంచుకున్నందుకు ఆయన మంచి ఔట్ పుటే ఇచ్చాడు. స్పెషల్లీ బీజీఎం అదిరిపోయింది. రత్నవేలు విజువల్స్ సాంకేతికంగా సినిమాలో మరో హైలైట్. నిర్మాణ విలువలు బాగున్నాయి. ఇక చరణ్ తో పాటు జగపతిబాబు, శివరాజ్ కుమార్ రోల్స్ బిగ్గెస్ట్ ప్లస్ అయ్యాయి. ఓవరాల్ గా ఒక చిన్న సినిమా అనుభవంతో ఇంత పెద్ద ప్రాజెక్టును డీల్ చేసిన విధానానికి.. రామ్ చరణ్ నుంచి అద్భుతమైన పెర్ఫామెన్స్ రాబట్టుకున్న తీరుకు బుచ్చిబాబు అభినందనీయుడే.
Hit
Peddi Movie Review
సినిమా ఆడటం అనేది ఆ సినిమా హీరోకి.. లేదంటే ఆ డైరెక్టర్‌కో, నిర్మాతకో, హీరోయిన్‌కో అవసరం. కానీ ఇప్పుడు పెద్ది సినిమా హిట్ అవ్వడం ఇండస్ట్రీకి అత్యవసరం. సంక్రాంతి తర్వాత గత ఆర్నెళ్లుగా ఒక్కటంటే ఒక్క సూపర్ హిట్ సినిమా లేదు. ఇలాంటి సమయంలో టాలీవుడ్ లో భారీ ఎక్స్పెక్టేషన్స్ తో విడుదలైన పెద్ది సినిమా ఆడియన్...
సినిమా ఆడటం అనేది ఆ సినిమా హీరోకి.. లేదంటే ఆ డైరెక్టర్‌కో, నిర్మాతకో, హీరోయిన్‌కో అవసరం. కానీ ఇప్పుడు పెద్ది సినిమా హిట్ అవ్వడం ఇండస్ట్రీకి అత్యవసరం. సంక్రాంతి తర్వాత గత ఆర్నెళ్లుగా ఒక్కటంటే ఒక్క సూపర్ హిట్ సినిమా లేదు. ఇలాంటి సమయంలో టాలీవుడ్ లో భారీ ఎక్స్పెక్టేషన్స్ తో విడుదలైన పెద్ది సినిమా ఆడియన్స్ నుండి యానానిమస్ గా అదిరిపోయే రెస్పాన్స్ దక్కించుకుంది. రామ్ చరణ్ మైండ్ బ్లోయింగ్ ట్రాన్స్‌ఫర్మేషన్ అండ్ పెర్ఫార్మన్స్ తో ఫ్యాన్స్ చేత విజిల్స్ వేయించాడు. అయితే ఎప్పుడో అరిగిపోయిన టెంప్లెట్, ఫార్మాట్ ను వాడారు బుచ్చిబాబు. అదొక్కటి సినిమాకి మైనస్ గా నిలిచింది.
ఇక స్పెషల్ సాంగ్ కూడా ఇంప్రెసివ్ గా లేదు. ఆపై హీరోయిన్ క్యారెక్టర్ సాంగ్స్ కోసమే ఉన్నట్టు అయిపొయింది. ఫస్ట్ హాఫ్ లో చాలావరకు మరీ ప్రెడిక్టబుల్ గా సాగుతుంది. ఇంటర్వెల్ కి కాస్త కథ బరువు ఎక్కినట్టుగా అనిపిస్తుంది. ఇంటర్వెల్ బ్లాక్ లో కుస్తీ సీన్ అదిరిపోతుంది. ఫ్యాన్స్ ని మెప్పించడంలో మాత్రం బుచ్చిబాబు సక్సెస్ అయ్యాడు. ఇక ఎఆర్ రెహమాన్ మ్యూజిక్ కూడా సినిమాకి బిగ్గెస్ట్ ఎస్సెట్ గా నిలిచింది. ఓవరాల్ గా సినిమా రామ్ చరణ్ కి అదిరిపోయే కం బ్యాక్ ఇచ్చిందని చెప్పొచ్చు.
Hit
Peddi Movie Review
టాలీవుడ్ లో ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న మోస్ట్ అవైటెడ్ సినిమా "పెద్ది" ఫైనల్ గా థియేటర్లలో విడుదలైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన ఈ మూవీని బుచ్చిబాబు డైరెక్ట్ చేసాడు. ఇక సినిమా విషయానికి వస్తే... 90స్ బ్యాక్ డ్రాప్ లో రూరల్ కథగా తెరకెక్కిన పెద్ది సినిమా ఫ్యాన్స్ ని అమితంగా మెప్పిస్తుంద...
టాలీవుడ్ లో ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న మోస్ట్ అవైటెడ్ సినిమా "పెద్ది" ఫైనల్ గా థియేటర్లలో విడుదలైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన ఈ మూవీని బుచ్చిబాబు డైరెక్ట్ చేసాడు. ఇక సినిమా విషయానికి వస్తే... 90స్ బ్యాక్ డ్రాప్ లో రూరల్ కథగా తెరకెక్కిన పెద్ది సినిమా ఫ్యాన్స్ ని అమితంగా మెప్పిస్తుంది. ఊరి గుర్తింపు కోసం ఆటగాడైన పెద్ది చేసిన పోరాటమే ఈ సినిమా కథ.
ఓవరాల్ గా చూసుకున్నట్టైతే ఈ ‘పెద్ది’... ఆడియన్స్ మనసుల్ని కదిలించే ఒక ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా అని చెప్పొచ్చు. రామ్ చరణ్ పెర్ఫామెన్స్, మూడు వేరియేషన్స్ లలో తను పడ్డ కష్టం వర్ణనాతీతం. జగపతి బాబు, శివరాజ్ కుమార్ మరో హైలైట్ గా నిలిచారు. రెహమాన్ సంగీతం ఈ సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ గా నిలిచింది. అన్నిటికి మించి రొటీన్ కథే అయినా బుచ్చిబాబు తన టేకింగ్ తో మెప్పించాడు. అలాగే రత్నవేలు సినిమాటోగ్రఫీ, నవీన్ నూలి ఎడిటింగ్ కూడా బాగున్నాయి. ఓవరాల్ గా మంచి ఎమోషనల్ బ్లాక్ లు, సాలిడ్ స్పోర్ట్స్ ఎపిసోడ్స్ ఫ్యాన్స్ కి థియేటర్ లో ట్రీట్ ఇస్తాయి.
Public Reviews
10 Avg: 7.6/10Super Hit
Peddi Review
Hit
Peddi movie review
Just now Watched Peddi movie. Ram Charan shines as Peddi and delivers one of his best performances. His dedication and hard work are clearly visible on screen. Shivarajkumar is outstanding in his role, and Jagapathi babu also leaves a strong impression with his performance. But expected perfection m...
Just now Watched Peddi movie. Ram Charan shines as Peddi and delivers one of his best performances. His dedication and hard work are clearly visible on screen. Shivarajkumar is outstanding in his role, and Jagapathi babu also leaves a strong impression with his performance. But expected perfection more from buchibabu. overall movie was good. climax thrill missed.
My message to the audience: Don't let critics decide for you. Watch Peddi with your family, enjoy the experience, and form your own opinion.
Blockbuster
Peddi movie Review
peddi.. its not a commercial movie. its a self motivational movie, and most of this genration peoples, (including childrens) need to must watch to this movie. and the ram charans peddi charecter was inspired many peoples. stunning performance, great efforts by ram charan. also shivanna rocks on his...
peddi.. its not a commercial movie. its a self motivational movie, and most of this genration peoples, (including childrens) need to must watch to this movie. and the ram charans peddi charecter was inspired many peoples. stunning performance, great efforts by ram charan. also shivanna rocks on his role, jaggubhai impressed.
and short message to audiance : no need to watch critics review, go and enjoy the peddi movie with your family.
Super Hit
Peddi Movie Review
One year nundi wait chesa Peddi kosam... finally movie release ayindi...but first day first show vellalsina nenu work busy valla one week ayyaka vella... edo day 1 exiytment, humgama miss ayyanu.. but movie chala baga nacchindi.. relase day roje social medialo negitive reviews kooda chusa... anduke...
One year nundi wait chesa Peddi kosam... finally movie release ayindi...but first day first show vellalsina nenu work busy valla one week ayyaka vella... edo day 1 exiytment, humgama miss ayyanu.. but movie chala baga nacchindi.. relase day roje social medialo negitive reviews kooda chusa... anduke just nenu 3 hours entertain ayithe chalani anukunna...
but movie chusaaka social medialo kavalani negitive chestunnarani anipinchindi.. okka heroin track tappa movie mottham chala baga anipinchindi. not only cricket, kusthi sences ayithe every episode, anni shots kooda adiripoyayayi. and ar rahman music ante before release full negitvity unde nakkuda.. kani peddilo prati sence ki fresh bgm tho impress chesadu. ika ram charan acting gurinchi special ga cheppakkarledu. after rangasthalam tarvatha chala nacchindi ee peddi charecter. buchibabu climax ni inka depth ga raskoni unte vere levello undedi movie.. overall ga peddi ram chrans one of the best movie..
Above Average
One man show
Ram Charan steals the entire movie..
Entire movie is ok but coming to climax audience not connected to star hero with disability of leg break..
Hit
Peddi Movie Review
Watched Peddi this weekend and had a good time. Ram Charan is the heart of the film, and his performance is worth the ticket price alone.and specially surprised with Shivanna, jagapathi babu roles. overall Peddi movie is emotional, inspiring, and packed with strong sports drama moments. Definitely a...
Watched Peddi this weekend and had a good time. Ram Charan is the heart of the film, and his performance is worth the ticket price alone.
and specially surprised with Shivanna, jagapathi babu roles.
overall Peddi movie is emotional, inspiring, and packed with strong sports drama moments. Definitely a satisfying watch.
Super Hit
Peddi Movie Review
I really enjoyed Peddi. Ram Charan delivers a powerful performance, and the movie has some inspiring moments.
The story, direction, and music all come together nicely. It's not perfect, but it definitely works as a big-screen entertainer. overall must watchable
Super Hit
Peddi Movie Review
Peddi is one of the most engaging movies I've watched recently.
Ram Charan's performance is outstanding, and the emotional moments hit well.
The story may be simple, but the way it's presented makes it enjoyable. I personally loved it.
Super Hit
Peddi Movie Review
I watched Peddi recently and really liked it. Ram Charan was amazing and completely owned the movie. The story, emotions, and sports scenes worked well for me.
A.R. Rahman's music was also a big plus. Despite a few flaws, it's an inspiring film worth watching on the big screen.
Hit
Peddi Movie Review
Genral గా నేను పెద్దగా సినిమాలు చూడను. అండ్ ఈ మధ్య నా బిజినెస్ హడావిడిలో పడి entertainment కూడా చాలా miss అయ్యా. నా ఫ్రెండ్ ఒకడు ఫోన్ చేసి పెద్ది సినిమా బాగుంది.. ఇలాంటి మూవీస్ రేర్ గా వస్తాయి.. చూడమని ఏదేదో చెప్తే... ఈ శనివారం మార్నింగ్ షోకి familyతో వెళ్లాను. సినిమా చూసినాక మా ఫ్రెండ్ చెప్పినంత లే...
Genral గా నేను పెద్దగా సినిమాలు చూడను. అండ్ ఈ మధ్య నా బిజినెస్ హడావిడిలో పడి entertainment కూడా చాలా miss అయ్యా. నా ఫ్రెండ్ ఒకడు ఫోన్ చేసి పెద్ది సినిమా బాగుంది.. ఇలాంటి మూవీస్ రేర్ గా వస్తాయి.. చూడమని ఏదేదో చెప్తే... ఈ శనివారం మార్నింగ్ షోకి familyతో వెళ్లాను. సినిమా చూసినాక మా ఫ్రెండ్ చెప్పినంత లేదు గాని, డీసెంట్ వాచబుల్ అనిపించింది. సినిమాని తక్కువ ఎక్స్పెక్టేషన్స్ తో చూసాను కాబట్టి, కొంచెం better అన్పించింది. బట్ family తో చూసేటోల్లకి కొన్ని సీన్స్ ఇబ్బంది అనిపిస్తయి. నాక్కూడా అదే అనిపించింది. main గా heroin track worest అసలు. ఈ సినిమాలో అసలు heroin లేకున్నా ఏం ఫరక్ పడదు. ఇంత మంచి concept తీసుకున్న directer ఈ సినిమాలో హీరోయిన్ track లో ఆ వల్గర్ సీన్స్ ఎట్లా పెట్టాడో ఏంటో.
but పెద్ది క్యారెక్టరైజేషన్ బాగా నచ్చింది. హీరో రామ్ చరణ్ సినిమాని నిలబెట్టాడు. అండ్ కొన్ని ఎమోషనల్ సీన్స్ కి మా ఫ్యామిలీ బాగా connect అయ్యాం. overall decent గా అనిపించింది. ఆ romantic సీన్స్, item సాంగ్ తీసేస్తే ఫ్యామిలీ మొత్తం చూసేయొచ్చు.
About This Movie
Story : కథ విషయానికి వస్తే... 90స్ మధ్య కాలంలో భారత్ కి చెందిన "మినిస్ట్రీ ఆఫ్ యూత్ ఎఫైర్స్" అండ్ స్పోర్ట్స్ అకాడమీకి చెందిన ఆఫీసర్ అయిన పైస్వాల్ (బొమన్ ఇరానీ) కి తన విజయనగర ప్రయాణంలో "పెద్ది" (రామ్ చరణ్) అనే మల్టీ స్పోర్ట్స్ ఆటగాడి గురించి తెలుస్తుంది. అసలు ఊరి పేరే లేని కొండప్రాంతం నుండి పొట్టకూటి కోసం రోజు కూలీ పనులు చేసుకునే వాళ్ళ కుటుంబం నుండి వచ్చిన పెద్ది ఆట కూలీగా గుర్తింపు తెచ్చుకుంటాడు. క్రికెట్, కుస్తీ, రన్నింగ్ ఇలా అన్నింట్లోనూ ఎదురులేని పెద్ది, ఒకానొక సమయంలో ఊరి గుర్తింపు కోసం ఏం చేసాడు? తమ ఊరి వాళ్ళ కోసం ఎంత దూరం వెళ్ళాడు.? ఈ మధ్యలో అప్పలసూరి (జగపతిబాబు), గౌర్నాయుడు (శివరాజ్ కుమార్) పెద్ది జీవితాన్ని ఎలా ప్రభావితం చేసాడు..? స్పోర్ట్స్ అకాడమీ ఆఫీసర్ పైస్వాల్ పెద్ది గురించి ఏం తెలుసుకున్నాడు.? చివరికి తన ఆటతో పెద్ది ఏం సాధించాడనేది చిత్ర కథ.
Plus Points :
పెద్ది గురించి చెప్పాలంటే... ఊరి గుర్తింపు కోసం పెద్ది అనే యువకుడు చేసిన పోరాటమే ఈ కథ... ముందుగా ఈ సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ గా నిలిచి సినిమా మొత్తం వన్ మ్యాన్ షోగా నడిపించిన రామ్ చరణ్ ని అభినందించి తీరాలి. అలాగే కథ పరంగా చిన్నదైనా, దాన్ని పర్ఫెక్ట్ గా బ్యాలన్స్డ్ గా డీల్ చేసిన బుచ్చిబాబుని మెచ్చుకోవాలి. సినిమా మొత్తం మూడు దశల్లో ఉంటుంది. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో నడిచే ఈ కథను ఎంచుకున్న దర్శకుడు బుచ్చిబాబు ఎమోషనల్ కోర్ పాయింటే సినిమాని నిలబెట్టిందని చెప్పాలి. దానికి దర్శకుడు, హీరో, మ్యూజిక్ డైరెక్టర్ తో పాటు అందరూ వాళ్ళ సైడ్ నుంచి బెస్ట్ ఇచ్చారు.
ఇక రంగస్థలం తర్వాత రామ్ చరణ్ కి మరో బెస్ట్ రోల్ పడిందని చెప్పొచ్చు. సినిమాలో తన ఎనర్జిటిక్ యాక్షన్ పెర్ఫార్మన్స్ తో పాటు ఎమోషనల్ గా బరువైన భావోద్వేగాలతో ఆడియన్స్ ని కదిలిస్తాడు. ఇలాంటి ఒక ఛాలెంజింగ్ రోల్ ని చరణ్ ఒప్పుకోవడం కూడా గ్రేట్. ఇక ఆ తర్వాత ఆడియన్స్ కి గుర్తుండిపోయే రోల్ అప్పలసూరి పాత్ర. జగపతిబాబు తన వెర్సటైల్ నటనతో ది బెస్ట్ అనిపించాడు. కనిపించేది కాసేపే అయినా జగ్గూభాయ్ ఇంపాక్ట్ సినిమా మొత్తం ఉంటుంది. అలాగే శివరాజ్ కుమార్ కూడా తన పాత్రలో వైవిధ్యతని చూపించారు. ఇక జాన్వీ కపూర్, దివ్యెందు శర్మ, బొమర్ ఇరానీ తమ పాత్రల పరిధి మేరకు బాగానే నటించారు.
Minus Points :
ఇక పెద్ది సినిమా విషయంలో చరణ్ ఫ్యాన్స్ తో పాటు ఇండస్ట్రీలో భారీ అంచనాలుండేవి. మేకర్స్ ఇచ్చిన ఆ భారీ హైప్ ని ఇమేజిన్ చేసుకుని మూవీ చూస్తే డిస్సపాయింట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే కథ పరంగా ఆడియన్స్ కి చాలా తెలిసిన రొటీన్ కథనే బుచ్చిబాబు తన స్టైల్లో డిఫరెంట్ గా చూపించడానికి ట్రై చేసాడు. స్క్రీన్ ప్లే కూడా ఊహించినట్టే అనిపిస్తుంది. పైగా కొన్ని సీన్స్ లో సహజత్వం లోపించింది. రియల్ గా తీయాల్సిన కొన్ని సీన్స్ ని గ్రీన్ మ్యాట్ వేసి తీసినట్టు తెలిసిపోతుంది. పైగా చాలా సీన్స్ లో పర భాషనటులకి లిప్ సింక్ కూడా కుదరలేదు. VFX ఎఫెక్ట్స్ కొన్ని చోట్ల చాలా బాగున్నా, మరి కొన్ని చోట్ల తేలిపోయింది.
Technical values :
ఇక టెక్నికల్ గా చూసుకుంటే.. ఎఆర్ రహ్మన్ మ్యూజిక్ డైరెక్టర్ గా బెస్ట్ ఎఫర్ట్స్ ఇచ్చారు. ట్రైలర్, సాంగ్స్ చూసాక రహ్మన్ పై ఎన్నో విమర్శలు కూడా వచ్చాయి. కానీ రహ్మన్ సినిమాలోనే అదిరిపోయే బీజీఎమ్ తో తన పనితనం ఏంటో చూపించాడు. కొన్ని బిట్ సాంగ్స్ సినిమాకి హైలెట్ అయ్యాయి. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. కానీ మేకింగ్ క్వాలిటీ విషయంలో కేరింగ్ గా ఉండాల్సింది. రత్నవేలు కెమెరా వర్క్ డీసెంట్ గా ఉంది. నవీన్ నూలి ఎడిటింగ్ కి కొద్దిగా పని చెప్పాల్సింది.
Final Review :
ఇక ఫైనల్ గా పెద్ది గురించి చెప్పాలంటే ఊరి గుర్తింపు కోసం పెద్ది చేసిన పోరాటమే ఈ కథ. ఈ మధ్య కాలంలో ఆడియన్స్ మనసుల్ని కదిలించే వన్ అఫ్ ది బెస్ట్ ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామాల్లో ఇది ఒకటిగా నిలుస్తుంది. రామ్ చరణ్ అద్భుతమైన నటనతో పాటు, ఎఆర్ రహ్మాన్ అదిరిపోయే మ్యూజిక్, బుచ్చిబాబు డైరెక్షన్ అన్ని కలగలిపి పెద్ది ని మనసుల్ని కదిలించే ఒక ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామాగా తీర్చిదిద్దారు. కథ పరంగానూ ఇంకొంచెం బలంగా రాసుకుంటే బాగుండేది. ఒక్క మాటలో చెప్పాలంటే పెద్ది ఆట, పోరాటం రెండూ మెప్పిస్తాయి.