సేవ్ ది టైగర్స్ సీజన్ 3 (Save The Tigers Season 3)
ఓటిటిలో ఫేమస్ అయిన వెబ్ సిరీస్ సేవ్ ది టైగర్స్ నుండి ఫైనల్ గా మూడో సిరీస్ కూడా వచ్చేసింది. ప్రముఖ ఓటిటి ఫ్లాట్ ఫామ్ అయిన జియో హాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సిరీస్ లో ప్రియదర్శి – జోర్దార్ సుజాత, అభినవ్ గోమఠం – పావని గంగిరెడ్డి, కృష్ణ చైతన్య – దేవియాని శర్మ జంటగా నటించిన విషయం తెలిసిందే. ఈ సిరీస్ కూడా ఎంటర్టైన్మెంట్ జోన్ లోనే తెరకెక్కింది.
Available in:
Reviews
What critics and the public are saying about సేవ్ ది టైగర్స్ సీజన్ 3 (Save The Tigers Season 3)
Media Reviews
2 Avg: 6.5/10Above Average
Save The Tigers Season 3 Review
గతంలో రెండు సీజన్లు ఆడియెన్స్ ఆదరణతో మంచి సక్సెస్ సాధించాయి. దాంతో ఈ సిరీస్ మూడో సీజన్‌పై పెరిగిన అంచనాలకు తగినట్టుగానే దర్శకుడు శ్రీరామ్ తన కంటెంట్‌ను బాగా డిజైన్ చేసుకొన్నారనేది ఆయన సృష్టించిన డ్రామాతో స్పష్టమైంది. చాలా సీన్లు ఫ్రెష్‌గా, ఫన్‌తో సాగాయి. ఎక్కువ మంది టాలెంటెడ్ ఆర్టిస్టుల నుంచి దర్శకు...
గతంలో రెండు సీజన్లు ఆడియెన్స్ ఆదరణతో మంచి సక్సెస్ సాధించాయి. దాంతో ఈ సిరీస్ మూడో సీజన్‌పై పెరిగిన అంచనాలకు తగినట్టుగానే దర్శకుడు శ్రీరామ్ తన కంటెంట్‌ను బాగా డిజైన్ చేసుకొన్నారనేది ఆయన సృష్టించిన డ్రామాతో స్పష్టమైంది. చాలా సీన్లు ఫ్రెష్‌గా, ఫన్‌తో సాగాయి. ఎక్కువ మంది టాలెంటెడ్ ఆర్టిస్టుల నుంచి దర్శకుడు టాలెంట్‌ను రాబట్టుకొన్న విధానం బాగుంది. మధ్యలో కొన్ని ఎపిసోడ్స్ కొంత స్లోగా నడుస్తాయనే ఫీలింగ్ కలుగుతుంది. కానీ చివరి ఎపిసోడ్స్‌ను హిలేరియస్‌గా అందించారు.
ఇక డిఫరెంట్ షేడ్స్ ఉన్న హైదరాబాదీగా ప్రియదర్శి తన పాత్రలో ఎప్పటిలానే ఒదిగిపోయాడు. అమాయక భర్త, లవర్ బాయ్‌గా చైతన్య కృష్ణ మరోసారి మంచి నటనతో మెప్పించే ప్రయత్నం చేశారు. బాడీ లాంగ్వేజ్, పాత్రకు తగినట్గుగా హావభావాలు, ఎమోషన్స్ చక్కగా పండించాడు. ఇక అభినవ్ గోమటం కామెడీ టైమింగ్ వల్ల షో ఫన్ రైడ్‌గా మారింది. తన సహజ శైలికి తగినట్టుగా ఆయన వేసిన పంచులు నవ్వులు పువ్వులు పూయించాయి. ఓటీటీలోనే కాబట్టి.. తగినంత సమయాన్ని కేటాయించుకొని చూడండి.. మంచి అనుభూతి కలుగుతుంది.
Hit
Save The Tigers Season 3 Web Series Review
ప్రముఖ వెబ్ సిరీస్ ‘సేవ్ ది టైగర్స్’ సరికొత్త సీజన్‌తో మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఈ సిరీస్ సీజన్ 3 ప్రస్తుతం జియో హాట్‌స్టార్ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇందులో ప్రియదర్శి – జోర్దార్ సుజాత, అభినవ్ గోమఠం – పావని గంగిరెడ్డి మరియు కృష్ణ చైతన్య – దేవియాని శర్మ జోడీలు మరోసారి తమద...
ప్రముఖ వెబ్ సిరీస్ ‘సేవ్ ది టైగర్స్’ సరికొత్త సీజన్‌తో మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఈ సిరీస్ సీజన్ 3 ప్రస్తుతం జియో హాట్‌స్టార్ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇందులో ప్రియదర్శి – జోర్దార్ సుజాత, అభినవ్ గోమఠం – పావని గంగిరెడ్డి మరియు కృష్ణ చైతన్య – దేవియాని శర్మ జోడీలు మరోసారి తమదైన గందరగోళం, ఎమోషన్స్ మరియు హిలేరియస్ కామెడీతో అలరించడానికి సిద్ధమయ్యారు.
కొత్త దర్శకుడు శ్రీరామ్ ఎరగం వచ్చినప్పటికీ ‘సేవ్ ది టైగర్స్ 3’లో ఆ మార్పు ఎక్కడా కనిపించదు. మొదటి రెండు సీజన్లను పాపులర్ చేసిన అదే వినోదాన్ని ఈ సీజన్ కూడా కొనసాగించింది. ఓవరాల్‌గా చూస్తే.. ‘సేవ్ ది టైగర్స్ సీజన్ 3’ ఈ సిరీస్ యొక్క విన్నింగ్ ఫార్ములాను ముందుకు తీసుకెళ్లడంలో విజయం సాధించింది. ప్రియదర్శి, అభినవ్ గోమఠం, కృష్ణ చైతన్య మరోసారి తమ పర్ఫార్మెన్స్‌లతో ఆకట్టుకున్నారు. అయితే, కొన్ని పోర్షన్స్ మాత్రం సాగదీతగా ఉండటం, బూతులు ఎక్కువగా వాడటం కొంతమేర నెగిటివ్ ఇంపాక్ట్ చూపెట్టాయి. కృష్ణ చైతన్యకు సంబంధించి కొన్ని కామెడీ సీన్స్ కూడా అందరినీ మెప్పించవు. గత రెండు సీజన్‌లను ఎంజాయ్ చేసిన ప్రేక్షకులు ఈ వీకెండ్ ‘సేవ్ ది టైగర్స్ సీజన్ 3’ని ట్రై చేయవచ్చు.
Public Reviews
Avg: —No public reviews yet.
About This Movie
Story : కథ విషయానికి వస్తే... రెండో సీజన్ కి కొనసాగింపుగా... హీరోయిన్ హంసలేఖ (సీరత్ కపూర్) తో గొడవ తర్వాత, భార్య హైమా (జోర్దార్ సుజాత)తో కలిసి గంటా రవి (ప్రియదర్శి) గేటెడ్ కమ్యూనిటీకి షిష్ట్ అవుతాడు. ఇటు భార్య రేఖ (దేవయాని)తో విడాకులు తీసుకునేందుకు విక్రమ్ (చైతన్య కృష్ణ)సిద్దమవుతాడు. మరో సైడ్ భార్య మాధురి (పావని గంగిరెడ్డి) పోరుపడలేక ఇష్టం లేని జాబ్ చేయడానికి రాహుల్ (అభినవ్ గోమటం) రెడీ అవుతాడు. ఇలా వీళ్ళ లైఫ్ లో అశాంతి, అసహనం కొనసాగుతూనే ఉంటుండగా, ఇంద్రుడు (వెన్నెల కిషోర్) వల్ల వీళ్ళ లైఫ్ స్టైల్ మొత్తం ఛేంజ్ అవుతుంది. దాని వల్ల ఈ ముగ్గురి లైఫ్ లో ఎలాంటి పరిణామాలు చోస్తూ చేసుకున్నాయనేది కథ.
Plus Points :
సేవ్ ది టైగర్స్ ఫస్ట్ 2 పార్ట్స్ ఆడియన్స్ ని ఎంతలా ఎంటర్టైన్ చేశాయో తెలిసిందే. ఈ మూడో సీజన్ పై బజ్ క్రియేట్ అవడానికి మొదటి రెండు సీజన్స్ చాలా హెల్ప్ అయ్యాయి. ఇక ఈ మూడో సీజన్ ని కొత్త డైరెక్టర్ శ్రీరామ్ ఎరగం డైరెక్ట్ చేసినా, ముందు సీజన్స్ కి ఈ మూడో పార్ట్ కి డిఫరెన్స్ కనిపించదు. అంటే ముందు సీజన్స్ లో ఎంటర్టైన్మెంట్ ని ఈ సీజన్లో కూడా అందించారు. అదే దీనికి బిగ్గెస్ట్ ప్లస్ అయింది. ఇక ఎప్పట్లాగే ప్రియదర్శి, అభినవ్ గోమఠం తమ కామెడీ టైమింగ్ తో ఆకట్టుకోగా, ఈసారి కృష్ణ చైతన్య తన పెర్ఫార్మన్స్ తో అందర్నీ మించిపోయాడు. ఈ సీజన్లో కృష్ణ చైతన్య క్యారక్టరైజేషన్, డైలాగ్ డెలివరీ అదిరిపోయాయి. అలాగే జోర్దార్ సుజాత, పావని గంగిరెడ్డి, దేవియాని శర్మ డీసెంట్ పెర్ఫార్మన్స్ తో పాటు, రోహిణి కామెడీ టైమింగ్ కూడా హైలెట్ గా నిలిచింది. అన్నిటికి మించి ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయడమే టార్గెట్ గా ఈ మూడో సీజన్ కూడా వచ్చేయగా, అందులో మేకర్స్ సక్సెస్ అయ్యారని చెప్పాలి.
Minus Points :
ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయడమే టార్గెట్ గా వచ్చిన ఈ సీజన్ 3 అందులో సక్సెస్ అయింది కానీ, కథ పరంగా కొత్తదనం లేకపోవడం వల్ల ఫ్రెష్ స్టోరీస్ ఇష్టపడే ఆడియన్స్ ని ఒకింత డిస్సపాయింట్ చేస్తుంది. అలాగే ఫ్యామిలీస్ ఇష్టపడిన ఈ సిరీస్ లో ఈ మూడో సీజన్ లో అక్కడక్కడా కొన్ని బూతు పదాల వాడకం, మరి కొన్ని ఎఫైర్స్ వంటి ప్రస్తావనలు రావడం వల్ల ఫ్యామిలీ ఆడియన్స్ కి నచ్చకపోయే అవకాశం ఉంది. అలాగే కొన్ని సీన్స్ మరీ సాగదీస్తూ ఉండడం వల్ల ట్రిమ్ చేయాల్సిన అవసరం ఉందనిపిస్తుంది. స్క్రీన్‌ప్లే ఇంకాస్త టైట్ గా ఉంటే బాగుంటుందన్న ఫీల్ వస్తుంది. ఇక వెన్నెల కిషోర్ లాంటి స్టార్ కమెడియన్ ని సరిగా వాడుకోలేదనిపిస్తుంది. ఇందులో ఫాంటసీ ఎలిమెంట్స్ కూడా ఆడియన్స్ కి ఎంతగా ఎక్కేలా లేవు.
Technical values :
ఇక టెక్నికల్ గా చూసుకుంటే... దర్శకుడు శ్రీరామ్ ఎరగం ఈ మూడో సీజన్ ని మొదటి రెండు సీజన్లకి ఏమాత్రం తగ్గకుండా, తన డైరెక్షన్ తో ఎంటర్టైన్ చేసేలా మెప్పించాడు. రైటింగ్ వర్క్ కూడా చాలా బాగుంది. నిర్మాణ విలువలు రిచ్ గా ఉన్నాయి. శ్రవణ్ కటికనేని ఎడిటింగ్ పై ఇంకాస్త ఫోకస్ చేయాల్సింది. అజయ్ అరసాడ మ్యూజిక్ ప్లస్ అయింది.
FinalReview :
ఇక ఓవరాల్ గా... సేవ్ ది టైగర్స్ సీజన్ 3 మూడోసారి కూడా ఆడియన్స్ ని మెప్పించడంలో సక్సెస్ అయిందని చెప్పాలి. ప్రియదర్శి, అభినవ్ గోమఠం, కృష్ణ చైతన్య మళ్ళీ తమ స్టయిల్లో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయగా, వెన్నెల కిషోర్, రోహిణి కామెడీ టైమింగ్స్ కూడా ప్లస్ అయ్యాయి. కాకపోతే ఈ సీజన్లో కాస్త బూతు డైలాగ్స్ ని తగ్గించి ఉంటే, మరింత బాగుండేది. ఓవరాల్ గా సేవ్ ది టైగర్స్ రెగ్యులర్ మూవీ లివర్స్ మొహమాటం లేకుండా ఈ వీకెండ్ చూసి ఎంజాయ్ చేయొచ్చు.