Deewana Movie Review
By Filmi Beat
ప్రేమ కథలో యువతీ ఇష్టపడటమో లేదా యువకుడు ఇష్టపడటమో అనేది కామన్ పాయింట్. ఆ పాయింట్ చుట్టూ ఎమోషన్ పాయింట్ లేదా? ట్విస్టుతో కథను రాసుకొంటే డిఫరెంట్ లవ్ స్టోరీగా మారే అవకాశం ఉంటుంది. ఈ దీవానా సినిమాలో కథను భావోద్వేగంగా మార్చే, అలాగే సెంటిమెంట్‌ను పండించే అద్బుతమైన ట్విస్ట్ ఉండటంతో తెర మీద నిజాయితీతో కూడిన ప్రేమ కథగా మారిందనే చెప్పాలి. ఫస్టాఫ్ లో క్యారెక్టర్లు, అమ్ము, మున్నా ప్రేమ కథను ఎస్టాబ్లిష్ చేయడానికి చాలా సమయం తీసుకొని.. కథను సాగదీసినట్టు చేశాడు. కానీ ఇంటర్వెల్ ట్విస్టుతో సినిమాను దర్శకుడు, హీరో తమ వైపుకు తిప్పుకొన్నారు.
సెకండాఫ్ విషయానికి వస్తే.. ఇంటర్వెల్ ట్విస్ట్ చుట్టూ రాసుకొన్న ఫ్రెండ్‌షిప్, ఫ్యామిలీ ఎమోషన్స్, సెంటిమెంట్ బాగా వర్కవుట్ అయ్యాయి. దర్శకుడు రాసుకొన్న సన్నివేశాలు చాలా కొత్తగా ఉన్నాయి. ముఖ్యంగా రఘు కారుమంచి సీన్ ఒకటి.. తండ్రి నరేష్ కొడుకు మున్నా మధ్య వచ్చే సన్నివేశాలు.. సెంటిమెంట్‌ను పండించటమే కాకుండా సగటు ప్రేక్షకుడిని కంటతడి పెట్టించేలా ఉంటాయి. ఇక క్రైమాక్స్‌లో డ్రామాను దర్శకుడు అద్బుతంగా పండించాడు. దాంతో దీవానా సినిమా నిజాయితీగా వెండితెర మీద చెప్పిన ప్రేమ కథగా మారింది.
Hit
Deewana Movie Review
By One India
మెయిల్, తరగతి గది లాంటి డీసెంట్ వెబ్ సిరీస్ లతో ప్రేక్షకులకు దగ్గరైన యంగ్ హీరో హర్షిత్ రెడ్డి. ఆయన నటించిన కొత్త మూవీ 'దీవానా'.. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, సాంగ్స్ యూత్ కు ఎక్కేశాయి. దాంతో ఈ మూవీపై అంచనాలు ఏర్పడ్డాయి. జూన్ 20 న ఈ మూవీ గ్రాండ్ గా విడుదల అయింది
ఇక దీవానా మూవీ స్లోగా స్టార్ట్ అయినా ముందుకు వెళ్లే కొద్ది తరువాత ఏం జరుగుతుంది.. అనే క్యూరియాసిటీ పెరుగుతుంది. ఓవైపు లవ్ స్టోరీ.. మరోవైపు ఫ్యామిలీ ఎమోషన్స్ ను దర్శకుడు అద్భుతంగా చూపించాడు. సినిమాలోని ఎమోషన్స్, నటీనటుల పెర్ఫార్మెన్స్, ఒక షాకింగ్ ట్విస్ట్ అండ్ ఎమోషనల్ క్లైమాక్స్ సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. మొత్తానికి సినిమా పూర్తయ్యే సరికి ఆడియన్స్ అంచనాలను అందుకోవడంలో దీవానా మూవీ సక్సెస్ అయింది.
Hit
Deewana movie review
By Gulte
Deewana, directed by Sreekanth Sangishetty, is a film that attempts to blend romance, emotion, and realism into a meaningful cinematic experience. Featuring Harshith Reddy and Smeha Manimegalai in the lead roles. Backed by Arha Media, Vasudev Koppineni, and Sridevi Karyampudi, the film has music by Eswar Chand, cinematography by Vamsi Patchipulusu, and editing by Hrishikesh Pasapal.
The director, Sreekanth Sangishetti, took a very basic plot of a ‘boy meets a girl and falling in love with her instantly’ and executed the majority of the first half in a routine manner. But, right from the pre-interval to the climax, he made sure, Deewana, has a very original soul. After unveiling an unexpected twist during the pre-interval episode, the film gets into the zone of an intense emotional drama and it is where ‘Deewana’, stood out compared to the regular romantic drama films we see often.
Overall, Deewana is an intense emotional drama from the pre-interval sequence. If you like hard-hitting emotional dramas without any sugar coating. Watch it in theatres.
Average
Deewana Movie Review
By Great Andhra
These days, youthful love stories are gradually finding their audience. Films like “Youth” and “Vazha 2” have recently gained traction, and now “Deewana” arrives with a similar premise. Does it manage to stand out?
“Deewana” begins like a typical youthful romance, focusing on a carefree youngster chasing a girl without any clear direction in life.
Highlights
The interval twist
Emotional climax
Meaningful message
Drawbacks
Lag in the second half
A few illogical episodes
Excessive sentiment in places
Overall, “Deewana” is an engaging mix of romance and emotional drama. It may not be flawless, but its strong twist, heartfelt emotions, and meaningful message make it worth a watch.
Above Average
Deewana Movie Review
By Sakshi
ఈ మధ్య కమర్షియల్ ఫార్ములాలతో వచ్చే లవ్ స్టోరీల మధ్య, ‘దీవాన’ మాత్రం తన నిజాయితీతో ప్రత్యేకంగా నిలుస్తుంది. ప్రేమను కేవలం రొమాన్స్‌గా కాకుండా, ఒక భావోద్వేగ ప్రయాణంగా చూపించిన సినిమా ఇది.
ఫస్ట్ హాఫ్‌లో ప్రేమ కథ నెమ్మదిగా హృదయానికి దగ్గరవుతుంటే, సెకండాఫ్‌లో ఎమోషన్స్ పూర్తి స్థాయిలో టేకోవర్ చేస్తాయి. హీరోయిన్ తన మనసులోని ప్రేమను బయటపెట్టే సన్నివేశం, పోలీస్ స్టేషన్‌లో నరేష్ నటన, తండ్రి ప్రేమ గురించి వచ్చే డైలాగ్స్... ఒక్కో సీన్ నేరుగా హృదయాన్ని తాకుతుంది. కొన్ని చోట్ల కళ్లలో నీళ్లు తిరగడం గ్యారంటీ.
ప్రీ-క్లైమాక్స్ ట్విస్ట్ కథను మరో స్థాయికి తీసుకెళ్తుంది. క్లైమాక్స్ అయితే థియేటర్ నుంచి బయటికి వచ్చిన తర్వాత కూడా మనసులోనే తిరుగుతుంటుంది. ఎలాంటి ఆర్టిఫిషియల్ డ్రామా లేకుండా, సహజమైన భావోద్వేగాలతో దర్శకుడు శ్రీకాంత్ సంఘిశెట్టి కథను నడిపించిన తీరు ప్రశంసనీయం.
మాస్ ఎలిమెంట్స్, ఓవర్ యాక్షన్ కోసం వెతికేవారికి కాకుండా, మనసుతో సినిమా చూసేవారికి ‘దీవాన’ మంచి అనుభూతిని ఇస్తుంది. ప్రేమ కథల్లో కొత్తదనం, ఎమోషనల్ డెప్త్ కోరుకునే యూత్‌కు ఇది కనెక్ట్ అయ్యే సినిమా.
Above Average
Deewana Movie Review
ప్రేమ అనేది అనంతం.. ప్రేమ నుంచి ఎన్నో కథలు పుడతాయి.. ప్రేమను కేంద్రంగా చేసుకుని ఎన్ని కథల్ని అయినా అల్లుకోవచ్చు. అయితే ఆ కథలో కట్టి పడేసే ఎమోషన్, కొత్తదనం ఉండాలి. అలా ఎమోషనల్ కనెక్టివిటీతో, నిజాయితీగా సినిమాను తీస్తే ఆడియెన్స్ కచ్చితంగా ఆదరిస్తారు. అలాంటి ఓ హానెస్ట్ అటెంప్ట్‌గా ‘దీవాన’ నిలుస్తుంది. ప్రేమకి అర్థం చెప్పేలా ‘దీవాన’ ఉంటుంది. ప్రేమకి అందం ముఖ్యం కాదు.. మనసు ముఖ్యం అని చెప్పేలా హార్డ్ హిట్టింగ్ ఎమోషన్‌తో ‘దీవాన’ మూవీని దర్శకుడు శ్రీకాంత్ సంఘిశెట్టి తీశాడు.
సెకండాఫ్‌లో చాలా వరకు ఎమోషనల్ సీన్స్ కంటతడిని పెట్టిస్తాయి. హీరోయిన్ తనలో దాచుకున్న ప్రేమను స్నేహితురాలికి చెప్పుకునే సీన్, పోలీస్ స్టేషన్ లో నరేష్ చేసిన సీన్, తండ్రి గొప్పదనాన్ని కమెడియన్ రఘు చెప్పే సీన్ ఇలా ప్రతీ ఒక్కటి గుండెను బరువెక్కేలా చేస్తుంది. చాలా వరకు సీన్స్ కంటతడిని పెట్టించేలా ఉంటాయి. ఇక ప్రీ క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ మరింత బాగుంటుంది. క్లైమాక్స్ హార్ట్ టచింగ్ గా ఉంటుంది. మధ్యలో పోలీస్ ట్రైనింగ్ సీన్లు. రెగ్యులర్ కమర్షియల్ చిత్రాలు వస్తున్న సమయంలో.. ఇలాంటి ఓ రిఫ్రెషింగ్, హానెస్ట్ స్టోరీతో వచ్చిన ‘దీవాన’ యూత్ ప్రేక్షకుల్ని, ప్రేమ కథల్ని ఇష్టపడే ఆడియెన్స్‌ని ఆకట్టుకునే అవకాశం ఉంది. ఈ సినిమా ఓ ఫీల్ గుడ్ లవ్ స్టోరీని చూశామనే ఫీలింగ్‌ను మాత్రం కలిగించేలా చేస్తుంది.
Hit
Deewana Movie Review
By 123telugu
హర్షిత్ రెడ్డి హీరోగా నటించిన లేటెస్ట్ రొమాంటిక్ డ్రామా చిత్రం ‘దీవానా’ నేడు థియేటర్లలో రిలీజ్ అయింది. ప్రెస్టీజియస్ బ్యానర్ గీతా ఆర్ట్స్ సమర్పణలో వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకుల నుండి డీసెంట్ రెస్పాన్స్ అందుకుంది. కథ పరంగా నిరాశపరిచినా, మంచి బలమైన కథనంతో ఆడియన్స్ ని మెప్పించే ప్రయత్నం చేసారు. హీరోహీరోయిన్ల పెర్ఫార్మన్స్ తో పాటు దర్శకుడి పనితీరు ఆడియన్స్ ని ఆకట్టుకుంది.
‘దీవానా’ ఒక సిన్సియర్ రొమాంటిక్ డ్రామాగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈ సినిమాలోని రైటింగ్, నటీనటుల పర్ఫార్మెన్స్ లు ప్రేక్షకులను మెప్పిస్తాయి. ఫస్ట్ హాఫ్ కాస్త స్లోగా సాగుతూ, కొన్ని సీన్స్ కొద్దిగా ఇబ్బందికరంగా అనిపించినప్పటికీ.. సెకండ్ హాఫ్ లోని ఎమోషన్స్, ఎంటర్‌టైన్‌మెంట్ ఆకట్టుకుంటాయి. రొమాంటిక్ డ్రామాలను ఇష్టపడేవారు ఈ వీకెండ్ ఈ చిత్రాన్ని ట్రై చేయవచ్చు.
Above Average
Transfer Trimurthulu Movie Review
ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు గురించి చెప్పాలంటే... నిజాయితీ గల పోలీస్ కానిస్టేబుల్ కథ ఇది. దానికి ఒక గిరిజన యువతిపై రాజకీయ నాయకురాలి కొడుకు అత్యాచారం చేయడం, తమ పవర్ ఉపయోగించి అతను బయటకు వచ్చి, ఏకంగా సీఎం అయ్యేందుకు ప్లాన్ చేయడం, ఈక్రమంలో అతన్ని బండారాన్ని బయటపెట్టేందుకు హీరో చేసే పోరాటమే ఈ మూవీ. ఇలాంటి కథతో ఇప్పటికే తెలుగులో చాలా సినిమాలు వచ్చాయి. వస్తూనే ఉన్నాయి.
మనోళ్లు ఇలాంటి సెంటిమెంట్, ఎమోషనల్ అంశాలకు ప్రయారిటీ ఇస్తారు, సినిమాలను చూస్తారనే భావనతో పదే పదే ఇలాంటి అంశాలతోనే సినిమాలను తెరకెక్కిస్తున్నారు మేకర్స్. అయితే దాన్ని అంతే రియాలిటీగా, కన్విన్సింగ్‌గా చెబితే బాగుండేది. కానీ ఇందులో అది మిస్ అయ్యింది. ఈ కథలో ఈ కేసుని బలవంతంగా పెట్టినట్టుగానే, ఇరికించినట్టుగానే ఉంటుంది. ప్రారంభం నుంచి సినిమా చాలా డ్రైగా, స్లోగా సాగుతుంది. వడ్డే నవీన్‌ని ఎలివేషన్లకి ప్రయారిటీ ఇచ్చారు. కానీ ఆయన పాత్రలో ఆ పవర్‌లేదు. పైగా బలమైన సీన్లు ఒక్కటి కూడా కనిపించలేదు. ఓవరాల్ గా కొత్త సీసాలో పాత సారా అన్నట్టు, రొటీన్, బోరింగ్, ఔట్ డేటెడ్ కాన్సెప్ట్ తో తీసిన మూవీ `ట్రాన్స్ ఫర్ త్రిమూర్తులు`. వడ్డే నవీన్ రీఎంట్రీ బెడిసికొట్టిందని చెప్పొచ్చు.
Hit
Transfer Trimurthulu Movie Review
By TV9 Telugu
90స్ లో ఫ్యామిలీ, లవ్ స్టోరీలతో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న వడ్డే నవీన్.. కొన్నేళ్లుగా బ్రేక్ తీసుకున్నారు. పదేళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్న ఈయన చాలా కాలం తర్వాత చేసిన సినిమా ‘ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు’. ఇక సినిమా గురించి చెప్పుకుంటే... నిజాయితీ గల పోలీసు, ఒక రాజకీయ నాయకురాలి కొడుకు చేసిన అకృత్యాలను బయటపెట్టడం అనేది కొత్త ఫార్ములా కాదు. కానీ దాన్ని పర్ఫెక్టుగా బ్యాలెన్స్ చేస్తే మాత్రం బాగానే వర్కవుట్ అవుతుంది. ముఖ్యంగా రాజకీయాల చుట్టూ తిరిగే కథలకు డిమాండ్ ఎప్పుడూ బాగానే ఉంటుంది.
ఇప్పుడు దర్శకుడు కమల్ తేజ కూడా కథ అంతా రాజకీయాల చుట్టూనే తిప్పాడు. నిజాయితీ గల కానిస్టేబుల్ పాత్రకు వడ్డే నవీన్ బాగానే సెట్ అయ్యారు. అయితే మెజారిటీ సీన్స్ స్లో నెరేషన్ వల్ల అంతగా ఎక్కలేదు. దర్శకుడు కమల్ తేజ నార్ల రొటీన్ కథను ఎంచుకున్నాడు. వడ్డే నవీన్ నిర్మాణ విలువలు బాగున్నాయి. ఓవరాల్ గా ‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’.. నిజాయితీ గల కానిస్టేబుల్ కథ..!
Above Average
Transfer Trimurthulu movie Review
By Cinema Picha
first of all చాలా రోజుల తర్వాత వడ్డే నవీన్ గారు స్క్రీన్ మీద కనిపించడం చాలా బాగుంది. మొదటిగా ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు మూవీ పాజిటివ్స్ గురించి మాట్లాడుకుంటే.. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ బాగున్నాయి. హీరో క్యారెక్టరైజేషన్ కూడ బాగుంది. సినిమాకి ప్లస్ అయింది. అండ్ హీరో డాటర్ గా చేసిన పాప యాక్టింగ్ బాగుంది.
నెగిటివ్స్ గురించి చెప్తే... ముందుగా లెంగ్త్ గురించి చెప్పాలి. చాలా సీన్స్ కట్ చేయాలి. అండ్ బోరింగ్ గా ఉంటది. అండ్ సినిమాలో ఐటెం సాంగ్ ప్లేస్మెంట్ అస్సలు బాలేదు. పైగా సినిమాలో ఎమోషన్స్ కూడా అంతగా పండలేదు. పొలిటికల్ సీన్స్ కూడా అంత లేవు. అండ్ హీరోకి ఫైట్స్ అస్సలు వర్కౌట్ అవలేదు. సినిమా ఓవరాల్ గా చెప్పాలంటే డీసెంట్ పాయింట్ ఉంది. ఇల్లాజికల్ సీన్స్ ఇవన్నీ ఉన్నాయి. బట్ సింపుల్ గా డీసెంట్ మూవి తక్కువ అంచనాలతో చూస్తే మూవీ నచ్చవచ్చు.
Average
Transfer Thrimurthulu movie Review
By Tupaki
సీనియర్ నటుడు వడ్డే నవీన్ చాలా గ్యాప్ తర్వాత లీడ్ రోల్ చేసిన సినిమా.. ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు. ఆయనే నిర్మించిన ఈ చిత్రాన్ని కొత్త దర్శకుడు కమల్ తేజ రూపొందించాడు. ఇప్పుడున్న పెద్ద స్టార్ల సినిమాల్లోనూ ఇలాంటి మూస పద్ధతులను ప్రేక్షకులు తిప్పి కొడుతుంటే.. టాప్ స్టార్లు కూడా ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి సినిమాలు చేస్తుంటే.. వడ్డే నవీన్ ఇప్పుడొచ్చి ఇలాంటి విన్యాసాలను ప్రదర్శించడంలో ఔచిత్యమేంటో అర్థం కాదు. ఎంచుకున్నది కొంచెం భిన్నమైన కథే అయినా.. దాన్ని ప్రెజెంట్ చేసిన తీరు తేలిపోవడంతో ‘ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు’ ప్రేక్షకులకు ఏ రకమైన కొత్త అనుభూతినీ పంచలేకపోయింది.
దర్శకుడు కమల్ తేజ ఎంచుకున్నదేమో థ్రిల్లర్ కథ. కానీ దాన్ని నడిపించిందేమో కమర్షియల్ స్టయిల్లో. అందులోనూ ప్రేక్షకులు దాదాపుగా మరిచిపోయిన హీరోను తీసుకొచ్చి ఒక సూపర్ స్టార్ తరహాలో ప్రెజెంట్ చేయాలని చూడడంతో ఈ సినిమా చాలా కృత్రిమంగా తయారైంది. ఓవరాల్ గా థ్రిల్లర్ సినిమాలకు పూర్తి భిన్నంగా ‘ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు’ను నడిపించాడు దర్శకుడు. ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు అని చెప్పి... బోరింగ్ త్రిమూర్తులును అంటగట్టారు డైరెక్టర్.
Below Average
Transfer Trimurthulu movie Review
By Sakshi
వడ్డే నవీన్ పదేళ్ల గ్యాప్ తర్వాత ఎంట్రీ ఇచ్చిన మూవీ ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు. చాలా కాంఫిడెన్స్ తో ఆయనే స్వయంగా నిర్మించిన ఈ మూవీ థియేటర్లో రిలీజ్ అయి డివైడ్ టాక్ తెచ్చుకుంది. డైరెక్షన్ పరంగా దెబ్బేసిన ఈ మూవీ, కథ కూడా పాత చింతకాయ పచ్చడిలా ఉంటుందని అనుకోలేదు.
అండ్ సినిమాలో వడ్డే నవీన్ బాగానే పెర్ఫార్మ్ చేసినా, ఫ్రెష్ నెస్ అనేది కనిపించలేదు. అన్నిటికి మించి మంచి స్ట్రాంగ్ స్టోరీ ఉంటేనే కదా... దానికి తగ్గట్టు రోల్స్ కి కూడా కనెక్ట్ అయ్యేది. అండ్ స్క్రీన్ ప్లే కూడా ఏమంత లేదు. మ్యూజిక్ పర్లేదు. ప్రొడక్షన్ వాల్యూస్ బాగానే ఉన్నాయి. కానీ సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్స్ ని కట్ చేస్తే ఇంకాస్త క్రిస్పీగా ఉండేది. ఓవరాల్ గా సినిమా అంత ఇంప్రెస్ చేయదు.
Below Average