Register as a Reviewer
Home Reviews Media Reviews

Media Reviews

Reviews from top media outlets, YouTube channels, and publications

1211
Total Reviews
Showing 205–216 of 1211 media reviews
రోమాంచకం (Romanchakam)

Romanchakam movie review

సో రోమాంచకం మూవీ గురించి చెప్పాలంటే... బాలేదు.. ఎం బాలేదు సినిమా. అంటే ఆల్మోస్ట్ రోమాంచకం కాస్తా రోత సినిమా అన్న స్టేజ్ కి వెళ్ళిపోయింది సినిమా. కాకపోతే సినిమాలో హీరో ఫ్రెండ్ క్యారెక్టర్స్ బాగున్నాయి....

సో రోమాంచకం మూవీ గురించి చెప్పాలంటే... బాలేదు.. ఎం బాలేదు సినిమా. అంటే ఆల్మోస్ట్ రోమాంచకం కాస్తా రోత సినిమా అన్న స్టేజ్ కి వెళ్ళిపోయింది సినిమా. కాకపోతే సినిమాలో హీరో ఫ్రెండ్ క్యారెక్టర్స్ బాగున్నాయి. వాళ్ళ వల్ల మంచి కామెడీ జెనెరేట్ అయింది. అసలు సినిమా అయితే చాలా వరకు నిబ్బా నిబ్బి స్టోరీ కంటే అద్వానంగా ఉంది. ఎదో జాతిరత్నాలు సినిమాలాగా, లేదా మ్యాడ్ సినిమాల్లాగా ఫన్ తో లాగిద్దాం అని ట్రై చేసారు దెబ్బేసింది. 


ఇక సినిమాలో హీరో క్యారెక్టర్ కూడా ఏం అంత లేదు. ముఖ్యంగా ఎక్స్ప్రెస్ ఏం అంత లేదు. ఎంత సేపు ఫ్రెండ్స్ ఎదో అనడం దానికి హీరో రియాక్షన్ ఇవ్వడం అంతే.. లవ్ స్టోరీ కూడా బాగాలేదు. ఎమోషన్స్ అస్సలే ఏం బాగాలేవు. అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ డీసెంట్ గా ఉన్నాయి. సినిమాకి ఎంత పెట్టాలో అంతే పెట్టారు కాబట్టి పెద్దగా లాస్ ఏం అవ్వలేదు కావచ్చు. హీరో అసలేం చూసి సినిమా యాక్సెప్ట్ చేసాడో ఏమో మరి. ఏమో సినిమాలో క్యామియో చేసిన అనుదీప్ కోసమే ఇంకా ఆడియన్స్ వెళ్లొచ్చు. సో ఓవరాల్ గా మూవీ అయితే బాగాలేదు. నా రేటింగ్ అయితే ఈ సినిమాకు 2/5

4.0
out of 10

Below Average

కికు చిరంజీవి (Kiku Chiranjeevi)

Kiku Chiranjeevi movie review

కికు యనమల, కశిష్‌ ఖాన్‌ జంటగా తెరకెక్కిన సినిమా ‘కికు చిరంజీవి’. కికు ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై దీప్తి నడిమింటి నిర్మాణంలో శుభ సాయి వెంకట్‌ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో ఈశ్వరీరావు...

కికు యనమల, కశిష్‌ ఖాన్‌ జంటగా తెరకెక్కిన సినిమా ‘కికు చిరంజీవి’. కికు ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై దీప్తి నడిమింటి నిర్మాణంలో శుభ సాయి వెంకట్‌ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో ఈశ్వరీరావు, తనికెళ్ల భరణి, శ్రీకాంత్‌ అయ్యంగార్‌, వైవా రాఘవ.. పలువురు కీలక పాత్రలు పోషించారు. కికు చిరంజీవి సినిమా నేడు ఆగస్టు 28న థియేటర్స్ లోకి వచ్చింది.


అయితే గుండె కుడివైపు ఉండటం అనే కాన్సెప్ట్ తో గతంలో కొన్ని సినిమాలు వచ్చాయి. పాయింట్ రేర్ గా వచ్చేదే అయినా కథనం బాగానే రాసుకున్నారు. చిరంజీవి అంటే మరణం లేనివారు అని అర్ధం. దానికి తగ్గట్టు సినిమాలో కొన్ని సీన్స్ బాగానే జస్టిఫికేషన్ ఇచ్చారు. ఫస్ట్ హాఫ్ లో కొన్ని ల్యాగ్ సీన్స్ ఎడిటింగ్ లో కట్ చేయొచ్చు. హీరో – హీరోయిన్ మధ్య లవ్ సీన్స్ అంతగా పండలేదు. లవ్ ఎమోషన్ కనెక్ట్ అవ్వలేదు. ఫస్ట్ హాఫ్ ని అక్కడక్కడా సాగదీశారు. కొత్త పాయింట్ తీసుకున్నా రెగ్యులర్ కథనంతో కాస్త థ్రిల్లింగ్ గా బాగానే తెరకెక్కించాడు దర్శకుడు. మొత్తంగా ‘కికు చిరంజీవి’ హీరోకి గుండె కుడివైపు పెట్టి సస్పెన్స్ థ్రిల్లర్ అంశాలతో తెరకెక్కించిన సినిమా. 


6.0
out of 10

Above Average

కికు చిరంజీవి (Kiku Chiranjeevi)

Kiku chiranjeevi movie review

`చిరంజీవి` అంటే మరణం లేనివారు, చచ్చిబతికిన వారిని పిలుస్తుంటారు. ఇందులో రెండో యాంగిల్‌ చూపించారు. సినిమాలో హీరోని చంపాలని విలన్లు కాలుస్తారు. కానీ అతను చనిపోడు. అది ఎలా జరిగిందనేది ఇందులో ఆసక్తికరం. అ...

`చిరంజీవి` అంటే మరణం లేనివారు, చచ్చిబతికిన వారిని పిలుస్తుంటారు. ఇందులో రెండో యాంగిల్‌ చూపించారు. సినిమాలో హీరోని చంపాలని విలన్లు కాలుస్తారు. కానీ అతను చనిపోడు. అది ఎలా జరిగిందనేది ఇందులో ఆసక్తికరం. అదే పెద్ద ట్విస్ట్. సస్పెన్స్, థ్రిల్లర్‌ అంశాలు కనిపిస్తాయి. ట్విస్ట్ లు ఆకట్టుకుంటాయి. క్లైమాక్స్ ఎమోషనల్‌గా ముగుస్తుంది. ఓవరాల్‌గా మూవీ ఫర్వాలేదనిపించింది. 


సినిమాలో ఫన్‌, రొమాన్స్, యాక్షన్‌ అంశాలు బాగానే ఉన్నాయి. కాకపోతే ఎగ్జిక్యూషన్‌లోనే కొంత లోపం కనిపిస్తుంది. కథనం కూడా బాగుంది. కానీ తెరపై ఆవిష్కరించే విషయంలోనే కొంత తడబాటు కనిపిస్తుంది. ఒక సారి చూడొచ్చు అనిపించేలా చేశాడు. హార్ట్ కుడివైపు ఉండటమనే పాయింట్‌ కొత్తగా, ఆసక్తికరంగా ఉంది. అంచనాలు లేకుండా చూస్తే కొంత వరకు ఎంగేజ్‌ చేసే సర్వైవల్‌ డ్రామా థ్రిల్లర్‌ `కికు చిరంజీవి`.


6.0
out of 10

Above Average

కికు చిరంజీవి (Kiku Chiranjeevi)

Kiku Chiranjeevi movie review

Sakshi

By Sakshi

‘కికు చిరంజీవి’ డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా. గుండె కుడివైపున ఉండటం అనే పాయింట్ ఆసక్తికరంగా ఉన్నప్పటికీ, దాన్ని దర్శకుడు శుభ సాయి వెంకట్ తెరకెక్కించిన విధానం అక్కడక్కడా స్లో...

‘కికు చిరంజీవి’ డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా. గుండె కుడివైపున ఉండటం అనే పాయింట్ ఆసక్తికరంగా ఉన్నప్పటికీ, దాన్ని దర్శకుడు శుభ సాయి వెంకట్ తెరకెక్కించిన విధానం అక్కడక్కడా స్లోగా అనిపిస్తుంది. లవ్, ఎమోషన్, యాక్షన్, థ్రిల్లర్ అంశాలను కలిపి కథను నడిపించే ప్రయత్నం చేశారు. కొన్ని ట్విస్టులు ఆకట్టుకున్నా, అన్ని సీన్లు ఒకే స్థాయిలో ఇంపాక్ట్ ఇవ్వవు. ఫస్టాఫ్ ఓ మోస్తరుగా సాగితే, సెకండాఫ్‌లో వచ్చే కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ సినిమాపై ఆసక్తిని పెంచుతాయి.


క్లైమాక్స్‌లో వచ్చే ఎమోషనల్ టచ్ సినిమాకు కొంత ప్లస్‌గా నిలుస్తుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. ఓవరాల్‌గా ‘కికు చిరంజీవి’ ఒక డిఫరెంట్ ప్రయత్నం. కాన్సెప్ట్, థ్రిల్లర్ జానర్‌ను ఇష్టపడే వారికి సినిమా ఓసారి ట్రై చేయొచ్చు. అయితే అన్ని వర్గాల ప్రేక్షకులను పూర్తిగా మెప్పించే స్థాయిలో మాత్రం సినిమా లేదనే చెప్పాలి.


5.0
out of 10

Average

కికు చిరంజీవి (Kiku Chiranjeevi)

Kiku Chiranjeevi Movie Review

‘కికు చిరంజీవి’ మూవీ రివ్యూ: డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ఆకట్టుకున్న థ్రిల్లర్!టాలీవుడ్‌లో ఎప్పటికప్పుడు కొత్త కాన్సెప్ట్‌లతో సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. అదే కోవలో తెరకెక్కిన చిత్రం ‘కికు చిరం...


‘కికు చిరంజీవి’ మూవీ రివ్యూ: డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ఆకట్టుకున్న థ్రిల్లర్!


టాలీవుడ్‌లో ఎప్పటికప్పుడు కొత్త కాన్సెప్ట్‌లతో సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. అదే కోవలో తెరకెక్కిన చిత్రం ‘కికు చిరంజీవి’. లవ్, ఎమోషన్, యాక్షన్, థ్రిల్లింగ్ ట్విస్టులను కలిపి దర్శకుడు శుభ సాయి వెంకట్ ఈ సినిమాను ఆసక్తికరంగా తెరకెక్కించారు. ఈ సినిమాకు ప్రధాన హైలైట్ ఎడమ వైపు ఉండాల్సిన గుండె కుడివైపున ఉండటం అనే కాన్సెప్ట్. ఈ కొత్త పాయింట్ చుట్టూ దర్శకుడు రాసుకున్న పాత్రలు, కథను నడిపించిన విధానం ఆకట్టుకుంటాయి.


కథలో వచ్చే ట్విస్టులు, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ సినిమాను రెగ్యులర్ కమర్షియల్ మూవీస్‌కు భిన్నంగా నిలబెడతాయి. ముఖ్యంగా కథనం ముందుకు సాగే కొద్దీ వచ్చే మలుపులు ప్రేక్షకులను ఎంగేజ్ చేస్తాయి. ఓవరాల్‌గా డిఫరెంట్ కాన్సెప్ట్, ఎమోషనల్ కంటెంట్, థ్రిల్లర్ ఎలిమెంట్స్‌ను ఇష్టపడే వారికి ‘కికు చిరంజీవి’ మంచి ఆప్షన్. ఈ వారం థియేటర్‌లో తప్పక చూడాల్సిన సినిమాల జాబితాలో దీన్ని చేర్చుకోవచ్చు.


ఫైనల్లీ కొన్ని తడబాట్లు ఉన్నా, థ్రిల్లర్ లవర్స్ కి కికు చిరంజీవి నచ్చోచ్చు. 

5.0
out of 10

Average

కికు చిరంజీవి (Kiku Chiranjeevi)

Kiku Chiranjeevi Movie Review

లవ్, ఎమోషనల్, యాక్షన్, ట్విస్టులతో సాగే ఇంట్రెస్టింగ్ కంటెంట్ ఉన్న డిఫరెట్ మూవీ కికు చిరంజీవి. ఎడమ వైపు ఉండాల్సిన గుండె కుడివైపుకు ఉండటం అనే పాయింట్ కొత్తగా ఉంటుంది. ఆ పాయింట్ చుట్టూ దర్శకుడు శుభ సాయి...

లవ్, ఎమోషనల్, యాక్షన్, ట్విస్టులతో సాగే ఇంట్రెస్టింగ్ కంటెంట్ ఉన్న డిఫరెట్ మూవీ కికు చిరంజీవి. ఎడమ వైపు ఉండాల్సిన గుండె కుడివైపుకు ఉండటం అనే పాయింట్ కొత్తగా ఉంటుంది. ఆ పాయింట్ చుట్టూ దర్శకుడు శుభ సాయి వెంకట్ రాసుకొన్న పాత్రలు, కథను నడిపించిన విధానం బాగుంది. స్టోరీ గ్రిప్పింగ్‌గా ప్లాన్ చేశారు. ట్విస్టులు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌ తో మూవీ డిఫరెంట్ జోనర్‌ లో కనిపిస్తుంది. క్లైమాక్స్‌ను భావోద్వేగాలతో ముగించడం ఈ సినిమాకు ఫీల్ గుడ్ ఫ్యాక్టర్‌ గా మారిందని చెప్పాలి.


దీప్తి నడిమింటి అనుసరించిన నిర్మాణ విలువలు బాగున్నాయి. ఓవరాల్ గా డిఫరెంట్ కాన్సెప్ట్, ఎమోషనల్ కంటెంట్, థ్రిల్లర్ జోనర్లను ఇష్టపడే వారికి ఈ సినిమా నచ్చుతుంది. ఈ వారం చూడాల్సిన సినిమాలో లిస్టులో ఈ మూవీని ఎలాంటి సందేహం లేకుండా చేర్చుకోవచ్చు. మంచి థియేట్రికల్ ఎక్స్‌పీరియెన్స్ ఉన్న సినిమాగా కికు చిరంజీవి మూవీ ఓ రకమైన అనుభూతిని కలిగిస్తుంది.


7.0
out of 10

Hit

కికు చిరంజీవి (Kiku Chiranjeevi)

Kiku chiranjeevi movie Review

ఈ వారం థియేటర్స్ లోకి వచ్చిన తాజా చిత్రాల్లో ఓ చిన్న థ్రిల్లర్ చిత్రం “చిరంజీవి” కూడా ఒకటి. యువ నటుడు కికు యనమల హీరోగా ఈశ్వరి రావు, తనికెళ్ళ భరణి తదితరులు కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా ఆడియన్స్ నుండ...

ఈ వారం థియేటర్స్ లోకి వచ్చిన తాజా చిత్రాల్లో ఓ చిన్న థ్రిల్లర్ చిత్రం “చిరంజీవి” కూడా ఒకటి. యువ నటుడు కికు యనమల హీరోగా ఈశ్వరి రావు, తనికెళ్ళ భరణి తదితరులు కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా ఆడియన్స్ నుండి మిశ్రమ స్పందన తెచ్చుకుంటుంది. ఇక మొత్తంగా చూసుకున్నట్టైతే ఈ “చిరంజీవి” సినిమా అక్కడక్కడా ఓకే అనిపించే థ్రిల్లర్ డ్రామాగా నిలిచింది.


దర్శకుడు శుభ సాయి వెంకట్ తీసుకున్న పాయింట్ లో మంచి పోటెన్షియల్ ఉంది. దీనికి అనుగుణంగా కొన్ని సీన్స్ అక్కడక్కడా బాగున్నాయి. నటీనటులు కూడా తమ బెస్ట్ ఇచ్చారు. కానీ ఇంకా క్లారిటీతో కూడిన కథనం ఇందులో అవసరం ఉంది. దర్శకుడు కొన్ని మూమెంట్స్ ని సింపుల్ గా వదిలేశారు. వీటిని కూడా బాగా డిజైన్ చేసుకొని ఉంటే ఈ థ్రిల్లర్ బెటర్ గా ఉండేది. సో, ఈ కికు చిరంజీవి చిత్రాన్ని తక్కువ అంచనాలతో ప్రయత్నిస్తే మంచిది.


6.0
out of 10

Above Average

టాక్సిక్ (Toxic)

Toxic movie review

టాక్సిక్... (toxic).. Starring Yash, Nayanatara, Kiara Adwani, Rukmini vasanth... Directed by Geethu mohandas... ఏం సినెమారా బాబు ఇది... నవ్వాలో ఏడ్వాలో తెలీట్లేదు... ఇదేదో స్టాండప్ కామెడీలాగా... మెయ...

టాక్సిక్... (toxic).. Starring Yash, Nayanatara, Kiara Adwani, Rukmini vasanth... Directed by Geethu mohandas...

ఏం సినెమారా బాబు ఇది... నవ్వాలో ఏడ్వాలో తెలీట్లేదు... ఇదేదో స్టాండప్ కామెడీలాగా... మెయిన్ డైలాగ్స్ అండి... ఒక డైలాగ్ ఉంటది.. శౌర్యానికి - వీర్యానికి అని ఎదో డైలాగ్ ఉంటది... ఇలాంటివి సినిమాలో చాలా ఉన్నాయి... ఏం సినిమానో ఏంటో.. ఎమోషనల్ సీన్స్ కి కూడా నవ్వొచ్చింది నాకు. నాకు ఆ టీజర్ చూసినప్పుడే ఎదో రాంగ్ యాంగిల్ లో వెళ్తుంది అనుకున్నా... కానీ రిలీజ్ తర్వాత అంతకంటే ఘోరంగా కెజిఎఫ్ లాంటి ఎలివేషన్ల సినిమాలు అన్ని కలిపి కిచిడి చేసిన సినిమా ఇది. 


అసలు సినిమాలో ఏమైనా చెప్తే ప్రొడక్షన్ వాల్యూస్. హీరో పెర్ఫార్మన్స్ అంతే.. అసలు సినిమాలో ఒక కథలేదు. స్క్రీన్ ప్లే లేదు.. ఎవడు ఎవడ్ని వేసేస్తాడో తెలీదు. ఎందుకో తెలీదు. క్లైమాక్స్ లో అయితే బాగుందని కొందరున్నారు కానీ, నాకు అది కూడా నచ్చలేదు. అండ్ ఈ ఇయర్ లో నేను చుసిన వరెస్ట్ మూవీస్ లో ఇదొకటి. పైగా 20 డాలర్లు పెట్టి సినిమా చూడాల్సొచ్చింది. ఇంతకంటే ఏం చెప్పలేను.. మీకెలా అనిపించింది మరి. 

3.0
out of 10

Not Good

టాక్సిక్ (Toxic)

Toxic movie Review

Thyview

By Thyview

టాక్సిక్ (Toxic)... సినిమా చూసాక ఫస్ట్ అనిపించే వర్డ్ why...  అసలేం చెప్పాలనుకున్నరు డైరెక్టర్... నాకేం అనిపించిందంటే... నాకు తెలిసి ఈ డైరెక్టర్ ఇలాంటి సబ్జెక్టు మరెవ్వరూ ఇలా తీసే ధైర్యం చేయొద్దు...

టాక్సిక్ (Toxic)... సినిమా చూసాక ఫస్ట్ అనిపించే వర్డ్ why...  అసలేం చెప్పాలనుకున్నరు డైరెక్టర్... నాకేం అనిపించిందంటే... నాకు తెలిసి ఈ డైరెక్టర్ ఇలాంటి సబ్జెక్టు మరెవ్వరూ ఇలా తీసే ధైర్యం చేయొద్దు అని ఫిక్స్ అయ్యి తీశారు అని అనిపిస్తుంది. ఒక్క యష్ - కియారా మధ్యలో ఉండే కొన్ని సీన్స్ తప్ప సినిమా మొత్తంలో ఏం కూడా నాకు నచ్చలేదు. అండ్ సినిమా గురించి ప్లస్ మాట్లాడితే ప్రొడక్షన్ వాల్యూస్ గుడ్... బట్ సినిమాలో ఒక క్యారెక్టర్ ఎస్టాబ్లిష్ చేసే విధానం గాని, సినిమాలో ఏం జరుగుతుందో అన్న ఉత్కంఠను గాని అస్సలు చూపించలేకపోయారు. 


అండ్ టాక్సిక్ సినిమాలో యాక్షన్ అయినా బాగుంటుందేమో అని అనుకుంటే అది కూడా నచ్చలేదు నాకు. ఒక సిన్సియర్ అడ్వైస్ నా నుంచి ఏంటంటే... తెలుగులో మాత్రం అస్సలు చూడకండి.. అంత వరెస్ట్ డబ్బింగ్ ఉంది. ఎదో ఇంగ్లీష్ సినిమాని గూగుల్ ట్రాన్సలేట్ చేసి చూస్తున్నట్టు ఉంది. అండ్ సినిమాని ఎంతో కొంచెం చూడాలి అని గట్టిగా ఫిక్స్ అయితే అది యష్ కోసం మాత్రమే అయి ఉంటుంది. 

4.0
out of 10

Below Average

టాక్సిక్ (Toxic)

Toxic movie review

టాక్సిక్ టాక్సిక్ నో టాక్సిక్ (Toxic) అన్నమాట.. ఇప్పుడే చూసి రావడం జరిగిందన్నమాట.. టాక్సిక్ మూవీలో మంచిగా రాసుకున్న ఫిమేల్ క్యారెక్టర్స్ ఉన్నాయి... అంటే అన్ని కాదు.. నయనతార, కియారా రోల్స్ మాత్రమే. అండ...

టాక్సిక్ టాక్సిక్ నో టాక్సిక్ (Toxic) అన్నమాట.. ఇప్పుడే చూసి రావడం జరిగిందన్నమాట.. టాక్సిక్ మూవీలో మంచిగా రాసుకున్న ఫిమేల్ క్యారెక్టర్స్ ఉన్నాయి... అంటే అన్ని కాదు.. నయనతార, కియారా రోల్స్ మాత్రమే. అండ్ యష్ క్యారెక్టర్ అయితే సూపర్ గా రాసుకున్నారు. అయితే సినిమాలో కొన్ని కొన్ని సీన్లుగా పార్ట్ లు పార్ట్ లు గా చూస్తే బాగానే ఉన్నాయి కానీ, ఓవరాల్ గా సినిమా మొత్తం కలిపి చూస్తే... ఇదేమిటి సినిమా ఇలా తీశారు... అంత గ్రాండియర్ గా చెప్తున్నామంటూ, వీళ్ళు చెప్పిన స్టోరీ ఇదా అని అనిపిస్తుంది. 


బట్ వీళ్ళు సినిమాలో చెప్పాలనుకున్న పాయింట్ మంచిదే. ఆ పాయింట్ ని కొంచెం కమర్షియల్ గానే చెప్తూ, ఒక ఆర్టిఫీషియల్ గా చెప్దామన్న ప్రయత్నంలో కొంచెం పులిహోర ఎక్కువ కలపడం వల్ల... ఇదేమిట్రా బాబు... ఇంత నాన్ టాక్సిక్ లాకుందేంట్రా బాబు అన్నట్టు అనిపిస్తుంది. అసలు సినిమాలో ఎవడి గ్యాంగ్ ఎవడిదో... ఎవడు ఎవడ్ని చంపుకుంటారో కూడా తెలీదన్నట్టు ఉంటుంది. టెక్నికల్ గా చూస్తే ప్రొడక్షన్ వాల్యూస్ సూపర్ గా ఉంటాయి. అంతే తప్ప ఇంకేమి ఎక్కవు. అసలు సినిమాలో లాస్ట్ లో వచ్చే ఆ 15 నిమిషాల స్టోరీని అనలైజ్ చేసుకుంటే.. సినిమా ఇదన్నమాట అనుకుంటూ బైటికివస్తారు. ఆ క్లైమాక్స్ కూడా నచ్చకపోతే సినిమా మొత్తం మీ మైండ్ లోంచి ట్రాష్ అయిపోతుంది అనమాట. మొత్తానికి డిస్సపాయింట్ అనే చెప్పాలి యష్ టీం కి. 

5.0
out of 10

Average

టాక్సిక్ (Toxic)

Toxic movie review

టాక్సిక్ సినిమా గురించి చెప్పాలంటే... its a long long rod రోత మూవీ. ఎంత దరిద్రంగా అంటే ఉంది. పొరపాటున పార్ట్ 2 కూడా అనౌన్స్ చేస్తారేమో అని భయపడ్డా.. అంతలా ఉంది ఈ సినిమా. first of all ఈ సినిమా అసలు సిన...

టాక్సిక్ సినిమా గురించి చెప్పాలంటే... its a long long rod రోత మూవీ. ఎంత దరిద్రంగా అంటే ఉంది. పొరపాటున పార్ట్ 2 కూడా అనౌన్స్ చేస్తారేమో అని భయపడ్డా.. అంతలా ఉంది ఈ సినిమా. first of all ఈ సినిమా అసలు సినిమాయే కాదు. ఇదేంటంటే ధైర్యానికి, వీర్యానికి మధ్య జరిగిన ఒక కార్యం అంతే.. అంతకు మించి ఇంకేమి లేదు సినిమా. ఎంతసేపు నరుక్కోవడం, కాల్చుకోవడం తప్ప ఇంకేం లేదు. చాలా సినిమాలు దీనికి సిమిలర్ గా కనిపిస్తాయి. అందులో ముఖ్యంగా అనిమల్, 1 నేనొక్కడినే సినిమా గుర్తొస్తాయి. అది ఎందుకో సినిమా చూస్తే తెలుస్తుంది. 


నాకు తెలిసి యష్ కూడా సినిమా మొత్తం చూసి ఉండడు. లేకపోతే వేరేలా ఉండేది. యాష్ అయితే అద్భుతంగా యాక్టింగ్ చేసాడు. కానీ సీరియస్లి ఆ కష్టం వేస్ట్ అయింది. అండ్ రవిబాసుర్ అయితే పెద్ద దెబ్బేసాడు, బీజీఎమ్ కి కూడా. యాక్షన్ సినిమాలు ఇలా తీయకూడదు అనడానికి టాక్సిక్ బెంచ్ మార్క్ అని చెప్పాలి సింపుల్ గా. అండ్ సినిమాలో ఎలాంటి ఎమోషన్స్ కూడా వర్కౌట్ అవలేదు. ఇంక నాకైతే ఈ సినిమా గురించి చెప్పే ఓపిక కూడా లేదు. నా రేటింగ్ గనక సినిమాకి ఇవ్వాలంటే.. యష్ పెర్ఫార్మన్స్ కోసం, పెట్టిన ఖర్చుకి గాను 1\5 ఇస్తాను.. ఇంతకంటే ఇవ్వలేను. 

5.0
out of 10

Average

టాక్సిక్ (Toxic)

Toxic movie review

టాక్సిక్ కథ పాయింట్ చాలా సాదాసీదాగా అనిపించే పాయింట్ తో రూపొందగా యష్ ఈ కథని ఎందుకని ఒప్పుకున్నాడో అన్న డౌట్ కూడా అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది. అయితే హీరోగా సినిమాను సేఫ్ చేయడానికి యష్ ఎంత చేయాలో అంతా చే...

టాక్సిక్ కథ పాయింట్ చాలా సాదాసీదాగా అనిపించే పాయింట్ తో రూపొందగా యష్ ఈ కథని ఎందుకని ఒప్పుకున్నాడో అన్న డౌట్ కూడా అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది. అయితే హీరోగా సినిమాను సేఫ్ చేయడానికి యష్ ఎంత చేయాలో అంతా చేశాడు. కానీ కథలో బలం లేక పోవడంతో యష్ శ్రమ వృధా అయింది. ఇక హీరోయిన్స్ చాలా మంది ఉండగా ఉన్నంతలో కీయరా అద్వాని రోల్ ఆకట్టుకుంది. ఇక సినిమాలో సంగీతం జస్ట్ ఓకే అనిపించేలా ఉండగా, బ్యాగ్రౌండ్ స్కోర్ పెద్దగా ఇంపాక్ట్ ను చూపించ లేక పోయింది. 


చాలా సీన్స్ ను ట్రిమ్ చేసి ఉండొచ్చు…లెంత్ చాలా తగ్గించవచ్చు కూడా కానీ మేకర్స్ అలా చేయలేదు. దాంతో అనవసరంగా సీన్స్ అన్నీ కూడా డ్రాగ్ అయిన ఫీలింగ్ కలిగింది. అయితే ప్రీ క్లైమాక్స్ టు క్లైమాక్స్ ఎపిసోడ్ లు బాగానే ఆకట్టుకోవడంతో ఓవరాల్ గా ఓకే అనిపించింది. మొత్తం మీద ఏమాత్రం అంచనాలు పెట్టుకోకుండా థియేటర్స్ కి వెళితే కొంచం ఎక్కువ ఓపిక పట్టి చూస్తె మొత్తం మీద యష్ కోసం స్టైలిష్ టేకింగ్ కోసం ఒక సారి చూడొచ్చు అనిపించవచ్చు. కానీ కొంచం అంచనాలను పెట్టుకుని వెళ్ళినా చాలా చాలా చాలా ఓపిక పట్టాల్సి వస్తుంది. 


4.0
out of 10

Below Average

Why MRO?