Register as a Reviewer
సతీ లీలావతి (Sathi Leelavathi)

సతీ లీలావతి (Sathi Leelavathi)

08 May 2026
Overall Rating
4.6/10
8 Reviews

లావణ్య త్రిపాఠి కొణిదెల, దేవ్ మోహన్ జంటగా నటించిన లేటెస్ట్ మూవీ "సతీ లీలావతి". లవ్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీ తాజాగా థియేటర్లలో విడుదలైంది.

Director: Tatineni Satya
Cast: Lavanya Tripathi Konidela, Dev Mohan, Naresh, VTV Ganesh, Sapthagiri, Motta Rajendran, Jaffer Sadiq, Tagubothu Ramesh, Joshi and others.

Available in:

Reviews

What critics and the public are saying about సతీ లీలావతి (Sathi Leelavathi)

Media Reviews

8 Avg: 4.6/10
TV9 Telugu
TV9 Telugu News Channel
5

Average

Sathi Leelavathi movie Review

లావణ్య త్రిపాఠి నటించిన సతీ లీలావతి సినిమా తాజాగా థియేటర్లలో విడుదలై మిశ్రమ స్పందన తెచ్చుకుంది. సినిమా ప్రారంభం కాస్త ఆసక్తికరంగానే అనిపిస్తుంది. భార్యాభర్తల మధ్య గొడవ, హీరోని ఇంట్లో బంధించడం వంటివి ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచుతాయి. కానీ ఆ తర్వాత కథ మొత్తం దాదాపుగా ఒకే గదిలో సాగడం ప్రేక్షకులకు...

లావణ్య త్రిపాఠి నటించిన సతీ లీలావతి సినిమా తాజాగా థియేటర్లలో విడుదలై మిశ్రమ స్పందన తెచ్చుకుంది. సినిమా ప్రారంభం కాస్త ఆసక్తికరంగానే అనిపిస్తుంది. భార్యాభర్తల మధ్య గొడవ, హీరోని ఇంట్లో బంధించడం వంటివి ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచుతాయి. కానీ ఆ తర్వాత కథ మొత్తం దాదాపుగా ఒకే గదిలో సాగడం ప్రేక్షకులకు కాస్త విసుగు తెప్పిస్తుంది. మధ్యలో వచ్చే లాయర్ కామెడీ కూడా అంతగా పండలేదు. ఇంటర్వెల్ సమయానికి కథ కాస్త వేగవంతం అయినట్లు అనిపించినా అందులో ఎలాంటి ఉత్కంఠ ఉండదు. 


ఇక ద్వితీయార్థం అయితే మరీ గందరగోళంగా సాగుతుంది. దొంగ ట్రాక్, హీరో తప్పించుకునే ప్రయత్నాలు చాలా సిల్లీగా అనిపిస్తాయి. యాక్షన్ సన్నివేశాలు కేవలం టైమ్ పాస్ కోసం ఇరికించినట్లు ఉంటాయి. క్లైమాక్స్‌ను ఒక గేమ్ లాగా వెరైటీగా ప్లాన్ చేసినా అది ప్రేక్షకులను మెప్పించడంలో విఫలమైంది. దర్శకుడు తీసుకున్న పాయింట్ బాగున్నా, దాన్ని తెరపై ఆసక్తికరంగా మలచలేకపోయారు. కథనాన్ని అనవసరంగా సాగదీయడం వల్ల సినిమా కూడా నీరసంగా సాగింది. నిర్మాణ విలువలు కథకు సరిపోయేలా ఉన్నాయి. ఓవరాల్‌ గా సతీ లీలావతి.. ఆకట్టుకోని ఫ్యామిలీ ఎంటర్‌టైనర్..!



May 08, 2026 Read Review
ABP Desam
ABP Desam Website
4

Below Average

Sathi Leelavathi Movie Review

సతీ లీలావతి అంటూ ఆడియన్స్ ముందుకు వచ్చిన లావణ్య త్రిపాఠి ఈసారి ఎలాగైనా సక్సెస్ కొట్టాలని చూడగా, ఇప్పుడు కూడా నిరాశపరిచింది. కథ నేపథ్యం గురించి సింపుల్ గా చెప్పాలంటే... మూవీలో విడాకుల వైపు అడుగులు వేస్తున్న జంటలు ఈ రోజుల్లో ఎక్కువ అవుతున్నాయి. మనస్పర్ధలు కావచ్చు… చిన్న చిన్న గొడవలు కావచ్చు… కారణాలు ఏ...

సతీ లీలావతి అంటూ ఆడియన్స్ ముందుకు వచ్చిన లావణ్య త్రిపాఠి ఈసారి ఎలాగైనా సక్సెస్ కొట్టాలని చూడగా, ఇప్పుడు కూడా నిరాశపరిచింది. కథ నేపథ్యం గురించి సింపుల్ గా చెప్పాలంటే... మూవీలో విడాకుల వైపు అడుగులు వేస్తున్న జంటలు ఈ రోజుల్లో ఎక్కువ అవుతున్నాయి. మనస్పర్ధలు కావచ్చు… చిన్న చిన్న గొడవలు కావచ్చు… కారణాలు ఏమైనా కావచ్చు… విడాకుల కోసం వెళ్తున్నారు. భార్యాభర్తల మధ్య కోపతాపాలు పంతాలు పట్టింపులు వంద ఉన్నప్పటికీ… విడిపోకూడదని సందేశం ఇచ్చే చిత్రమిది. ప్రేక్షకులకు దర్శకుడు తాతినేని సత్య చెప్పాలనుకున్న పాయింట్ బాగుంది. కానీ, చెప్పే క్రమంలో తడబాటు కనిపించింది.


సినిమా మరీ రొటీన్ అని చెప్పాలనే గాని, డీసెంట్ రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామాగా సతీ లీలావతిని తీశారు. ఈ తరం భార్యాభర్తలకు చక్కటి సందేశం ఇచ్చే ప్రయత్నం చేశారు. నటిగా లావణ్య త్రిపాఠి తన పాత్రకు న్యాయం చేశారు. కథలో విషయం ఉంది. తెరపై కమెడియన్లు చాలా మంది ఉన్నారు. అయితే సినిమాలో కామెడీ లేదు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎంగేజ్ చేసే స్క్రీన్ ప్లే గానీ, మంచి సన్నివేశాలు గానీ కుదరలేదు. సో… రెండు గంటల పాటు థియేటర్లలో ప్రేక్షకులు కూర్చోవడం కష్టమే. 

May 08, 2026 Read Review
5

Average

Sathi Leelavathi movie Review

హీరోయిన్‌ లావణ్య త్రిపాఠి పెళ్లి తర్వాత నటించిన చిత్రం `సతీ లీలావతి`. దేవ్‌ మోహన్‌ హీరోగా నటించిన ఈ చిత్రానికి తాతినేని సత్య దర్శకత్వం వహించారు. నాగ మోహన్‌ నిర్మాత. ఇందులో వీకే నరేష్‌, వీటీవీ గణేషన్‌, సప్తగిరి, మొట్టా రాజేంద్రన్‌ కీలక పాత్రలు పోషించారు. తాజాగా విడుదలైన ఈ మూవీ డివైడ్ టాక్ అందుకుంది....

హీరోయిన్‌ లావణ్య త్రిపాఠి పెళ్లి తర్వాత నటించిన చిత్రం `సతీ లీలావతి`. దేవ్‌ మోహన్‌ హీరోగా నటించిన ఈ చిత్రానికి తాతినేని సత్య దర్శకత్వం వహించారు. నాగ మోహన్‌ నిర్మాత. ఇందులో వీకే నరేష్‌, వీటీవీ గణేషన్‌, సప్తగిరి, మొట్టా రాజేంద్రన్‌ కీలక పాత్రలు పోషించారు. తాజాగా విడుదలైన ఈ మూవీ డివైడ్ టాక్ అందుకుంది. కథా కథనాల్లో నిరాశపరచగా, నటీనటులు కూడా పెద్దగా గుర్తుండిపోయే రోల్స్ చేయలేదు. లావణ్య త్రిపాఠి రోల్ బానే ఉన్నా, అంత కొత్త తరహా రోల్ ఏమి కాదు.

 

టెక్నీకల్‌ గా మాత్రం సతీ లీలావతి బాగుంది. స్క్రీన్‌ కలర్‌ఫుల్‌ గా ఉంది. మిక్కీ జే మేయర్‌ సంగీతం ఫర్వాలేదు. దర్శకుడు తాతినేని సత్య ఎంచుకున్న కథ ఫర్వాలేదు. దాన్ని కామెడీ ఎంటర్‌టైనర్‌ గా తెరకెక్కించడంలో కొంత తడబాటు కనిపిస్తుంది. ఫన్నీ సీన్లు అన్నీ వర్కౌట్‌ కాలేదు. కొంత వరకు మాత్రమే నవ్వించాయి. నిర్మాణ విలువలకు కొదవలేదు. సినిమాపై ఆయనకున్న ప్యాషన్‌ ప్రతి ఫ్రేములోనూ కనిపిస్తుంది. అయితే సినిమాలో ఫ్యామిలీకి సంబంధించి అంతర్లీనంగా అందించిన సందేశం బాగుంది. కొంత వరకు అలరించే సతీ లీలావతి, భార్యాభర్తలకు సంబంధించిన ఇచ్చిన సందేశం బాగుంది.


May 08, 2026 Read Review
NTV Telugu
NTV Telugu News Channel
4

Below Average

Sathi Leelavathi Movie Review

పెళ్లైన జంటల మధ్య చిన్న చిన్న ఈగోలు, అనుమానాలు ఎలా పెద్ద సమస్యలుగా మారతాయో చూపించే ప్రయత్నమే ‘సతీ లీలావతి’. కానీ మంచి పాయింట్ తీసుకున్న దర్శకుడు సత్య… దాన్ని ఆసక్తికరంగా చెప్పడంలో మాత్రం పూర్తిగా తడబడ్డాడు. భర్తను ఇంట్లోనే బంధించడం, దాని చుట్టూ నడిచే కామెడీ ట్రాక్‌లు లాజిక్‌కి దూరంగా అనిపిస్తాయి. నవ...

పెళ్లైన జంటల మధ్య చిన్న చిన్న ఈగోలు, అనుమానాలు ఎలా పెద్ద సమస్యలుగా మారతాయో చూపించే ప్రయత్నమే ‘సతీ లీలావతి’. కానీ మంచి పాయింట్ తీసుకున్న దర్శకుడు సత్య… దాన్ని ఆసక్తికరంగా చెప్పడంలో మాత్రం పూర్తిగా తడబడ్డాడు. భర్తను ఇంట్లోనే బంధించడం, దాని చుట్టూ నడిచే కామెడీ ట్రాక్‌లు లాజిక్‌కి దూరంగా అనిపిస్తాయి. నవ్వించాల్సిన సన్నివేశాలు చాలా చోట్ల బలవంతంగా పెట్టినట్టుగా కనిపిస్తాయి.


లావణ్య త్రిపాఠి, దేవ్ మోహన్ తమ పాత్రలకు న్యాయం చేయడానికి ప్రయత్నించారు. ముఖ్యంగా లావణ్య ఎమోషనల్ సీన్స్‌లో మెప్పిస్తుంది. కానీ పాత్రల లోతు, భావోద్వేగాల బలం లేకపోవడంతో ఆ పెర్ఫార్మెన్స్ కూడా పెద్దగా ఎలివేట్ కాలేదు. ఉదయ్ పొట్టిపాడు రాసిన కొన్ని డైలాగ్స్ మాత్రం ఆకట్టుకుంటాయి. బినేంద్ర మీనన్ సినిమాటోగ్రఫీ కూడా సినిమాకు ప్లస్ అయ్యింది.


అయితే కథనం నెమ్మదిగా సాగడం, సీన్స్ రిపీటివ్‌గా అనిపించడం సినిమాకు పెద్ద మైనస్. థియేటర్ నుంచి బయటకు వచ్చాక గుర్తుండిపోయే అంశాలు కూడా చాలా తక్కువ. నిర్మాత నాగమోహన్‌కు తొలి ప్రయత్నంగా వచ్చిన ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోవచ్చు. మొత్తంగా ‘సతీ లీలావతి’ మంచి కాన్సెప్ట్‌తో వచ్చినా… సరైన ట్రీట్‌మెంట్ లేక ఆడియెన్స్‌ను పూర్తిగా మెప్పించలేకపోయింది.

May 08, 2026 Read Review
Chitra Jyothy
Chitra Jyothy Website
5

Average

Sathi Leelavathi Movie Review

చిన్న చిన్న కారణాల వల్ల భార్య భర్తలు విడిపోవడం చూస్తున్నాం. ఈ "సతీ లీలావతి" కథలోనూ అలాంటి సిల్లీ రీజనే దర్శకుడు తీసుకున్నాడు. సినిమాలో భర్త బుర్ర బద్దలు కొట్టి ఇంటిలోనే బంధించే సన్నివేశాలు, దాని చుట్టూ అల్లిన కామెడీ కూడా అతికించినట్టే ఉంది. కాగితం మీద కథగా రాసుకున్నప్పుడు కాస్తంత కొత్తగా ఉండి ఉండొచ్...

చిన్న చిన్న కారణాల వల్ల భార్య భర్తలు విడిపోవడం చూస్తున్నాం. ఈ "సతీ లీలావతి" కథలోనూ అలాంటి సిల్లీ రీజనే దర్శకుడు తీసుకున్నాడు. సినిమాలో భర్త బుర్ర బద్దలు కొట్టి ఇంటిలోనే బంధించే సన్నివేశాలు, దాని చుట్టూ అల్లిన కామెడీ కూడా అతికించినట్టే ఉంది. కాగితం మీద కథగా రాసుకున్నప్పుడు కాస్తంత కొత్తగా ఉండి ఉండొచ్చు కానీ దాని ఎగ్జిక్యూషన్ ను దర్శకుడు సత్య ఫెయిల్ అయ్యాడు. దాంతో సతీ లీలావతి శిరోభారంగా మారిపోయింది. పెర్ఫార్మన్స్ పరంగా లావణ్య త్రిపాఠి, దేవ్ మోహన్ బాగా నటించారు. కానీ పాత్రలు, వాటికీ సంబంధించిన ఎమోషన్స్ ను స్ట్రాంగ్ గా చూపించడంలో డైరెక్టర్ తడబడ్డాడు. 


ఉదయ్ పొట్టిపాడు రాసిన కొన్ని డైలాగ్స్ శృత్రిమించాయి. బినేంద్ర మీనన్ సినిమాటోగ్రఫీ అందించారు. నిర్మాత నాగమోహన్ తొలి యత్నంగా తీసిన 'సతీ లీలావతి' ఆయనకు చేదు అనుభవాన్ని మిగిల్చే ఆస్కారం ఎక్కువ. ప్రస్తుతం ఓ బిడ్డకు తల్లి అయిన లావణ్య త్రిపాఠి ఈ సినిమా ప్రమోషన్స్ లో కొంతకాలం సినిమాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు తెలిపారు. 'సతీ లీలావతి' చూసిన తర్వాత ఆమె సరైన నిర్ణయమే తీసుకున్నారనిపిస్తుంది. ఓవరాల్ గా సతీ లీలావతి మూవీ అంతగా మెప్పించలేకపోయింది. 





May 08, 2026 Read Review
Filmi Beat
Filmi Beat Website
5

Average

Sathi Leelavathi Movie Review

భార్యాభర్తల విడాకుల అంశంతో వచ్చిన కొత్త సినిమా సతి లీలావతి. కథ కొత్తగా లేకపోయినా బోర్ కొట్టించకుండా దర్శకుడు సత్య తెరకెక్కించారని చెప్పాలి. డిఫరెంట్ స్టోరీ కాకపోయినప్పటికీ.. లావణ్య త్రిపాఠి కథను తన పాత్ర ద్వారా నడిపించిన విధానం బాగుంది. ఆమె డిఫరెంట్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్‌ ను చాలా సులభంగా పోషించారు...

భార్యాభర్తల విడాకుల అంశంతో వచ్చిన కొత్త సినిమా సతి లీలావతి. కథ కొత్తగా లేకపోయినా బోర్ కొట్టించకుండా దర్శకుడు సత్య తెరకెక్కించారని చెప్పాలి. డిఫరెంట్ స్టోరీ కాకపోయినప్పటికీ.. లావణ్య త్రిపాఠి కథను తన పాత్ర ద్వారా నడిపించిన విధానం బాగుంది. ఆమె డిఫరెంట్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్‌ ను చాలా సులభంగా పోషించారు. దేవ్ మోహన్ కూడా తన పాత్ర పరిధి మేరకు రాణించారు. మడోన్నా సెబాస్టియన్ పాత్ర నిడివి తక్కువే. అయితే ఓవరాల్ గా ఫ్రెష్ నెస్ కోరుకునే ఆడియన్స్ ని డిస్సపాయింట్ చేస్తుంది.


అయితే టెక్నికల్ విషయానికి వస్తే.. బినేంద్ర మీనన్ సినిమాటోగ్రఫి బాగుంది. సినిమా బ్యాక్ డ్రాప్‌ కు సంబంధించిన సన్నివేశాలను నేచురల్‌ గా తెరకెక్కించారు. మిక్కి జే మేయర్ తన మ్యూజిక్‌ తో ఆకట్టుకున్నాడు. కొన్ని సీన్స్ ఎడిట్ చేస్తే.. ఫీల్, రన్ బెటర్‌‌ గా ఉండేదనిపిస్తుంది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. కాకపోతే దాని మీద పెట్టిన ఫోకస్, కథ, కథనాలపై కూడా పెట్టి ఉంటే.. ఇదోక డిఫరెంట్ ఫ్యామిలీ డ్రామాగా మారేంది. దాంపత్య జీవితంలో విభేదాలు, విడాకులు, లవ్, ఎమోషన్స్ అంశాలతో రూపొందే సినిమాలను ఇష్టపడే వారికి సతీ లీలావతి కొంతవరకు నచ్చడానికి అవకాశం ఉంది.

May 08, 2026 Read Review
Tupaki
Tupaki Website
4

Below Average

Sathi Leelavathi Movie Review

పెళ్లి తర్వాత సినిమాల నుంచి కొంచెం గ్యాప్ తీసుకున్న లావణ్య త్రిపాఠి.. తాజాగా నటించిన చిత్రం ‘సతీ లీలావతి’. తాజాగా థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ ఆడియన్స్ నుండి మిక్స్డ్ రెస్పాన్స్ దక్కించుకుంది. కథ గురించి సింపుల్ గా చెప్పాలంటే... పెళ్లయిన కొన్నేళ్లకు భార్యాభర్తల మధ్య అపార్థాలు రావడం.. ఇద్దరి మధ్య దూరం...

పెళ్లి తర్వాత సినిమాల నుంచి కొంచెం గ్యాప్ తీసుకున్న లావణ్య త్రిపాఠి.. తాజాగా నటించిన చిత్రం ‘సతీ లీలావతి’. తాజాగా థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ ఆడియన్స్ నుండి మిక్స్డ్ రెస్పాన్స్ దక్కించుకుంది. కథ గురించి సింపుల్ గా చెప్పాలంటే... పెళ్లయిన కొన్నేళ్లకు భార్యాభర్తల మధ్య అపార్థాలు రావడం.. ఇద్దరి మధ్య దూరం పెరగడం చాలామందిలో జరిగేదే. ఇద్దరి తప్పొప్పులు తెలుసుకుని కలిసిపోవడమే మెయిన్ పాయింట్. సినిమాలో దానికి ఏ మార్గం ఎంచుకున్నా తెర మీద అవతలి పాత్ర మాత్రమే కాదు.. ప్రేక్షకులు కూడా కన్విన్స్ అయ్యేలా పరిష్కారం చూపించాలి. కానీ 'సతీ లీలావతి'లో తన నుంచి విడిపోవాలని అనుకునే భర్తను మార్చడానికి హీరోయిన్ ఎంచుకునే మార్గం సిల్లీగా అనిపిస్తుంది. 


సినిమాలో ఏ దశలోనూ ఆమె భర్తలో పరివర్తన తెచ్చేలా తన ప్రవర్తన ఉండదు. ఆ క్యారెక్టర్ని చూస్తే భర్త ఆమె నుంచి విడిపోవడం కరక్టే అని ఆడియన్సుకి అనిపించేలా డిజైన్ చేసారు ఆ పాత్రని. ఇలాగే సినిమా మొత్తం గొడవలు పడుతూనే ఉంటాయి సీన్లు. ఎంటర్టైన్మెంట్ విషయానికొస్తే... ఒక్క కమెడియన్ ని కూడా యూస్ చేసుకోలేదు. దర్శకుడు తాతినేని సత్య ఎంచుకున్న కాన్సెప్ట్ మంచిదే. కానీ కథను ఒక తీరుగా చెప్పడంలో అతను ఫెయిలయ్యాడు. అతను కథను మొదలుపెట్టిన విధానమే అంత ఆసక్తికరంగా లేదు. నరేషన్ ఆద్యంతం గందరగోళంగా సాగింది. సెకండాఫ్ లో కొంత మేర ఎంటర్టైన్మెంట్ పండించినా.. అది సరిపోలేదు. ఓవరాల్ గా సతీలీలావతి ఎవర్ని మెప్పించలేదు. 

May 08, 2026 Read Review
123telugu
123telugu Website
5

Average

Sathi Leelavathi Movie Review

లావణ్య త్రిపాఠి కొణిదెల, దేవ్ మోహన్ జంటగా నటించిన లేటెస్ట్ మూవీ "సతీ లీలావతి". లవ్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీ తాజాగా థియేటర్లలో విడుదలైంది. ఇక సినిమా విషయానికి వస్తే... రొటీన్ కథా కథనాలతో దర్శకుడు తాతినేని సత్య ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించాడు. పెర్ఫార్మన్స్ పరంగా లావణ్య త్రిపాఠి వన...

లావణ్య త్రిపాఠి కొణిదెల, దేవ్ మోహన్ జంటగా నటించిన లేటెస్ట్ మూవీ "సతీ లీలావతి". లవ్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీ తాజాగా థియేటర్లలో విడుదలైంది. ఇక సినిమా విషయానికి వస్తే... రొటీన్ కథా కథనాలతో దర్శకుడు తాతినేని సత్య ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించాడు. పెర్ఫార్మన్స్ పరంగా లావణ్య త్రిపాఠి వన్ విమెన్ షోగా నడిపించింది. 


ఓవరాల్‌ గా చూసుకుంటే, ‘సతీ లీలావతి’ ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్‌ గా ప్రేక్షకులను పూర్తిస్థాయిలో మెప్పించలేకపోయింది. లావణ్య త్రిపాఠి పెర్ఫార్మెన్స్ మరియు పర్వాలేదనిపించే ఫస్టాఫ్ సినిమాకు ప్లస్ అయ్యాయి. సెకండాఫ్ లో వచ్చే కామెడీ ట్రాక్స్, మెయిన్ ప్లాట్ నుంచి కథ డీవియేట్ కావడం మైనస్. ఈ వీకెండ్ ఏదైనా ఫ్యామిలీ డ్రామా చూడాలనుకునే వారు తక్కువ అంచనాలతో ఈ చిత్రాన్ని చూడటం బెటర్.

May 08, 2026 Read Review

Public Reviews

Avg: —

No public reviews yet.

About This Movie

Story : ఇక కథ విషయానికి వస్తే... ఓ ఫిల్మ్ డైరెక్టర్ అయిన లీల (లావణ్య త్రిపాఠి) చిన్నప్పట్నుంచి తల్లిదండ్రుల (నరేష్-పవిత్ర లోకేష్)ల మనస్పర్థల గొడవల వల్ల మానసికంగా డిస్ట్రబ్ అవుతుంది. అయితే తన చిన్నప్పటి ఫ్రెండ్ అయిన సైక్రియార్టిస్ట్ రామ్ సేతు (దేవ్ మోహన్) ఆమెలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెంచుతాడు. ఈ క్రమంలో సేతు నచ్చి అతడ్ని పెళ్లి చేసుకుంటుంది. అయితే పెళ్లయ్యాక కొన్నాళ్ళకు వాళ్ళ బిజీ షెడ్యూల్స్ వల్ల వైవాహిక జీవితంలో సమస్యలు వస్తుంటాయి. మరి ఆ సమస్యలు వీళ్ళు పరిష్కరించుకున్నారా? మధ్యలో వీళ్ళ లైఫ్ లోకి వచ్చిన నికోలా సెబాస్టియన్ (మడోన్నా సెబాస్టియన్) ఎవరు? చివరకు ఈ రామ్ - లీల కలిసారా? విడిపోయారా? అనేది మిగిలిన కథ. 

 

ఇక సినిమా విషయానికి వస్తే.. ముందుగా మెయిన్ లీడ్ లో "లీల" గా నటించిన లావణ్య త్రిపాఠి గురించి చెప్పాలి. లీల పాత్రలో లావణ్య తన నటనతో మెప్పించింది. చాలా మెచ్యూర్డ్ నటనతో డిఫరెంట్ షేడ్స్ చూపించి ఆకట్టుకోవడమే కాక, వన్ మ్యాన్ షోగా సినిమాని నడిపించింది. అలాగే దేవ్ మోహన్ కూడా తన రోల్ లో చక్కగా సెటిల్డ్ పెర్ఫార్మన్స్ ఇచ్చాడు. మిగతా కీ రోల్స్ చేసిన వాళ్ళు వాళ్ళ పరిధి మేరకు నటించారు. 


అయితే మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే... భార్య భర్తల మధ్య వచ్చే గొడవల నేపథ్యంలో చాలా సినిమాలు వచ్చాయి. కొత్త కథలు కాకపోయినా, ఆడియన్స్ కి ఎంత ఇంట్రెస్టింగ్ గా ఎంగేజ్ చేయగలిగితే అంత బాగా సినిమాలు ఆడేవి. అయితే ఈ మూవీ విషయానికి వస్తే... ఫస్ట్ హాఫ్ ఫినిష్ అయ్యే సరికే నీరసం వచ్చేస్తుంది. అంత డల్ గా స్టోరీ ఉంది. సెకండ్ హాఫ్ లో కూడా అలాగే ఉంటుంది. క్లైమాక్స్ కూడా సింపుల్ గా ముగించేసినట్టు ఉంటుంది. అలాగే సప్తగిరి, మొట్ట రాజేంద్రన్, విటివి గణేష్ లాంటి కమెడియన్స్ ఉన్నా వారిని సరిగా వాళ్ళని సరిగా వాడుకోలేకపోయారు. ఇక సినిమాలో కొన్ని డైలాగ్స్ ఫ్యామిలీస్ ని ఇబ్బంది పెట్టడం మైనస్.


Technical values : ఇక టెక్నికల్ గా చూస్తే.. దర్శకుడు తాతినేని సత్య ఎదో పాత చింతకాయ పచ్చడి లాంటి కథను తీసుకున్నా... దాన్ని ట్రెండ్ కి తగ్గట్టు ఆడియన్స్ కి ఇంట్రెస్టింగ్ గా చెప్పడంలో విఫలమయ్యారు. కొన్ని సాగదీత సీన్స్ ని ఎడిట్ చేయాల్సింది. మిక్కీ జే మేయర్ మ్యూజిక్ బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్ డీసెంట్ గా ఉన్నాయి. 


Final Review :

ఇక మొత్తంగా సతీ లీలావతి ఒక నార్మల్ లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఆడియన్స్ ని కొంతవరకు మెప్పించే అవకాశం ఉంది. కానీ ఏమాత్రం కొత్తదనం ఆశించినా ప్రేక్షకులకి కన్నీరే. లావణ్య త్రిపాఠి పెర్ఫార్మన్స్ నచ్చిన వాళ్ళు, అది కూడా తక్కువ అంచనాలతో ఒకసారి ఒకసారి ట్రై చేయొచ్చు.

Review Statistics

4.6
Overall Rating
Avg. of all reviews
8
Total Reviews
From 2 Provider Types

Review Average

Media
4.6/10
Public
N/A
Why MRO?