Register as a Reviewer
దీవానా (Deewana)

దీవానా (Deewana)

25 Jun 2026
Overall Rating
6.7/10
22 Reviews

హర్షిత్ రెడ్డి, స్మేహ హీరో హీరోయిన్లుగా నటించిన లేటెస్ట్ మూవీ "దీవానా". లవ్ డ్రామా మూవీగా తెరకెక్కిన ఈ మూవీ గీతా ఆర్ట్స్ బ్యానర్ లో తెరకెక్కగా, తాజాగా థియేటర్లలో విడుదలయింది.

Director: Sreekanth Sangishetty
Cast: Deewana Movie Review | Starring Harshith Reddy and Directed By Sreekanth Sangishetty

Available in:

Reviews

What critics and the public are saying about దీవానా (Deewana)

Media Reviews

16 Avg: 6.6/10
Cinema Picha
Cinema Picha Youtube Channel
7

Hit

Deewana Movie Review

మూవీ రివ్యూ అఫ్ ది ఫిలిం దీవానా... బావుందండి మూవీ.. మంచిగా అనిపించింది నాకైతే.. ఈ సినిమా ట్రైలర్ చూసి ఎదో కొడుతోంది అనుకున్నా, కానీ అదేం లేదు సినిమాలో మెటీరియల్ ఉంది. మెయిన్ గా ఈ సినిమాలో లవ్ ట్రాక్ ని హైలెట్ చేసారు గాని, ఫ్రెండ్షిప్ కూడా బాగా చూపించారు. ఒక హై ఉంటది సినిమాలో. అయితే సినిమాలో ఫస్ట్ హా...

మూవీ రివ్యూ అఫ్ ది ఫిలిం దీవానా... బావుందండి మూవీ.. మంచిగా అనిపించింది నాకైతే.. ఈ సినిమా ట్రైలర్ చూసి ఎదో కొడుతోంది అనుకున్నా, కానీ అదేం లేదు సినిమాలో మెటీరియల్ ఉంది. మెయిన్ గా ఈ సినిమాలో లవ్ ట్రాక్ ని హైలెట్ చేసారు గాని, ఫ్రెండ్షిప్ కూడా బాగా చూపించారు. ఒక హై ఉంటది సినిమాలో. అయితే సినిమాలో ఫస్ట్ హాఫ్ చూసినంత సేపు ఇదేదో నిబ్బా నిబ్బి సినిమాలా అనిపించింది గాని, ప్రీ ఇంటర్వెల్ సీన్ హైలెట్ ఉంటది. 


అండ్ సెకండ్ హాఫ్ లో పోలీస్ స్టేషన్ సీన్ బాగుంటది. ఇక సినిమాలో సినిమాటోగ్రఫీ అస్సలు బాగాలేదు. స్టోరీ, రైటింగ్, పెర్ఫార్మన్స్ మాత్రం ఎక్సలెంట్ అని చెప్పాలి. ఓవరాల్ గా చెప్పేదేంటంటే బాగుంది దీవానా సినిమా. 


Jun 21, 2026 Watch
Featu Gadi Media
Featu Gadi Media Youtube Channel
6

Above Average

Deewana Movie Review

దీవానా... సినిమా చూసాక నాకైతే పర్లేదనిపించింది. ఈ సినిమా యొక్క ప్రొడక్షన్ వాల్యూస్ కి ఓటిటి రిలీజ్ కరెక్ట్ అనిపించింది. ఫస్ట్ హాఫ్ మొత్తం రొటీన్ ఫీల్ ఇచ్చింది. బట్ ఇంటర్వెల్ సీన్ మైండ్ బ్లోయింగ్ గా ఉంది. అండ్ సెకండ్ హాఫ్ మొత్తం ఫ్రెండ్షిప్, ఫ్యామిలీ మీద ఎక్కువ డీల్ చేసారు. అండ్ క్లైమాక్స్ ట్విస...

దీవానా... సినిమా చూసాక నాకైతే పర్లేదనిపించింది. ఈ సినిమా యొక్క ప్రొడక్షన్ వాల్యూస్ కి ఓటిటి రిలీజ్ కరెక్ట్ అనిపించింది. ఫస్ట్ హాఫ్ మొత్తం రొటీన్ ఫీల్ ఇచ్చింది. బట్ ఇంటర్వెల్ సీన్ మైండ్ బ్లోయింగ్ గా ఉంది. అండ్ సెకండ్ హాఫ్ మొత్తం ఫ్రెండ్షిప్, ఫ్యామిలీ మీద ఎక్కువ డీల్ చేసారు. అండ్ క్లైమాక్స్ ట్విస్ట్ కూడా బాగుంది. ఇక అడల్ట్ కంటెంట్ ఎం లేదు కాబట్టి ఫ్యామిలీ కూడా చూడొచ్చు. 


ప్లస్ పాయింట్ చూస్తే... హీరోహీరోయిన్స్ పెర్ఫార్మన్స్ బాగుంది. అండ్ ఫ్రెండ్స్ కూడా బానే చేసారు. మ్యూజిక్ కూడా బాగుంది. ఎడిటింగ్ ఇంకాస్త చేయాల్సింది. మైనస్ పాయింట్స్ చెప్పాలంటే... ఫస్ట్ హాఫ్ రొటీన్ గా ఉంటుంది. కొన్ని లాజిక్ లెస్ సీన్స్ కూడా నచ్చవు. అండ్ లో ప్రొడక్షన్ వాల్యూస్ ఉన్నాయి. ఫైనల్ గా చెప్పాలంటే ఒకసారి చూడొచ్చు మూవీ. its a one time watchable.. thats it.. my rating 2.75/5


Jun 21, 2026 Watch
Thyview
Thyview Youtube Channel
6

Above Average

Deewana Movie Review

దీవానా సినిమా చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే.. ఒకే ఒకే. సినిమా గురించి చెప్పాలంటే సింపుల్ గా అన్ని సినిమాల్లానే ఉండే లవ్ స్టోరీ. బట్ ప్రీ ఇంటర్వెల్ ట్విస్ట్ నుండి స్టోరీ మొత్తం మారిపోతుంది. అక్కడ్నుంచి చాలా ఇంట్రెస్టింగ్ వే లో వెళ్ళిపోతుంది. అండ్ స్టోరీ మీద ఓపినియన్ మారిపోతుంది. కొన్ని సీన్స్ మాత...

దీవానా సినిమా చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే.. ఒకే ఒకే. సినిమా గురించి చెప్పాలంటే సింపుల్ గా అన్ని సినిమాల్లానే ఉండే లవ్ స్టోరీ. బట్ ప్రీ ఇంటర్వెల్ ట్విస్ట్ నుండి స్టోరీ మొత్తం మారిపోతుంది. అక్కడ్నుంచి చాలా ఇంట్రెస్టింగ్ వే లో వెళ్ళిపోతుంది. అండ్ స్టోరీ మీద ఓపినియన్ మారిపోతుంది. కొన్ని సీన్స్ మాత్రం ఇల్లాజికల్ గా ఉంటాయి. క్లైమాక్స్ అయితే పేలిపోయింది. 


ఇక సినిమాలో హీరోహీరోయిన్స్ తో సహా, అందరూ బాగా పెర్ఫార్మ్ చేసారు. స్పెషల్లీ సినిమాలో హీరో ఫ్రెండ్స్ రోల్ చేసిన వాళ్ళు కూడా అదరగొట్టారు. అండ్ సినిమాని చాలా ఎంగేజింగ్ గా హ్యాండిల్ చేసారు డైరెక్టర్. ఫైనల్ గా దీవానా సినిమా పర్లేదు అనిపించింది. బాగానే ఉంది గాని క్లాసిక్ ఫీల్ రాలేదు. 

Jun 21, 2026 Watch
10TV Telugu
10TV Telugu News Channel
7

Hit

Deewana Movie Review

పలు వెబ్ సిరీస్ లు, శుభం, కల్కి సినిమాలతో ఫేమ్ తెచ్చుకున్నాడు హర్షిత్ రెడ్డి. మొదటిసారి సినిమా హీరోగా సోలో మెయిన్ లీడ్ చేసాడు. దీవానా ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు ఇదేదో అర్జున్ రెడ్డి, బేబీ.. లాంటి ప్రేమ కథ అని అంతా అనుకున్నారు కానీ కాదు అని సినిమా చూసాక అర్ధమవుతుంది. ప్రమోషన్స్ మాత్రం బాగానే చేసారు. డ...

పలు వెబ్ సిరీస్ లు, శుభం, కల్కి సినిమాలతో ఫేమ్ తెచ్చుకున్నాడు హర్షిత్ రెడ్డి. మొదటిసారి సినిమా హీరోగా సోలో మెయిన్ లీడ్ చేసాడు. దీవానా ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు ఇదేదో అర్జున్ రెడ్డి, బేబీ.. లాంటి ప్రేమ కథ అని అంతా అనుకున్నారు కానీ కాదు అని సినిమా చూసాక అర్ధమవుతుంది. ప్రమోషన్స్ మాత్రం బాగానే చేసారు. డైరెక్టర్ ఈ సినిమా మీద ఫుల్ కాన్ఫిడెంట్ తో హైప్ ఇచ్చాడు.


ఫస్ట్ హాఫ్ హీరో, ఫ్రెండ్స్ తో తిరగడాలు.. రొటీన్ అన్ని సినిమాల్లాగే ఉంటుంది. హీరోయిన్ ని చూడటం, ఆమె వెంట పడటం కొంచెం క్యూట్ గా, కామెడీగా చూపించారు. అక్కడక్కడా పేరెంట్స్ తో హీరో ఎలా ఉంటాడు, హీరో గొడవలతో సాగదీశారు. ఇంటర్వెల్ ముందు హీరోని పోలీసులు తీసుకెళ్లే సీన్, ఆ తర్వాత జరిగే సీన్ రొటీన్ సీన్స్ అయినా నెక్స్ట్ ఏం జరుగుతుంది అని ఉత్కంఠగా సాగుతాయి. ఇంటర్వెల్ కి ఆడియన్స్ కి హీరోయిన్ నుంచి అదిరిపోయే ట్విస్ట్ వస్తుంది. 


ఇలాంటి కథలు చాలా వచ్చినా ఒక ఇంటర్వెల్ ట్విస్ట్ తో ఎంగేజింగ్ గా మంచి లవ్ స్టోరీని రాసుకొని ఎమోషనల్ గా తెరకెక్కించాడు దర్శకుడు. నిర్మాణ పరంగా కూడా చిన్న సినిమా అయినా బాగానే ఖర్చుపెట్టినట్టు తెరపై క్వాలిటీ అవుట్ పుట్ కనిపిస్తుంది. మొత్తంగా ‘దీవానా’ సినిమా ఆసక్తికర ఇంటర్వెల్ బ్యాంగ్ తో తెరకెక్కిన ఓ మంచి ఎమోషనల్ లవ్ స్టోరీ. ఈ సినిమాకు 3 రేటింగ్ ఇవ్వొచ్చు.

Jun 21, 2026 Read Review
ABP Desam
ABP Desam Website
7

Hit

Deewana Movie Review

ఇప్పటి వరకు తెలుగు తెరపై ఇటువంటి ప్రేమకథ రాలేదని 'దీవానా' విడుదలకు ముందు నుంచి చిత్ర బృందం చెబుతా వచ్చింది. నిజంగా రాలేదా? అంటే... 'లేదు' అని చెప్పాలి. ఎందుకు? అనేది చెప్పాలంటే... ట్విస్ట్ రివీల్ అవుతుంది కనుక చెప్పలేం. కానీ, ఒక్కటి మాత్రం నిజం... సినిమా మొదలైనప్పటి నుంచి చివరి వరకు ప్రేక్షకులను అయి...

ఇప్పటి వరకు తెలుగు తెరపై ఇటువంటి ప్రేమకథ రాలేదని 'దీవానా' విడుదలకు ముందు నుంచి చిత్ర బృందం చెబుతా వచ్చింది. నిజంగా రాలేదా? అంటే... 'లేదు' అని చెప్పాలి. ఎందుకు? అనేది చెప్పాలంటే... ట్విస్ట్ రివీల్ అవుతుంది కనుక చెప్పలేం. కానీ, ఒక్కటి మాత్రం నిజం... సినిమా మొదలైనప్పటి నుంచి చివరి వరకు ప్రేక్షకులను అయితే ఎంటర్టైన్ చేస్తుంది.


ఇంటర్వెల్ వరకు 'దీవానా' ఓ సాధారణ ప్రేమ కథే. అందమైన అమ్మాయిని చూసి ప్రేమలో పడిన ఓ ఆవారా కథే. అయితే... ఇంటర్వెల్ బ్లాక్ మిగతా ప్రేమ కథల నుంచి 'దీవానా'ను వేరు చేసింది. ఒక్కసారిగా దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్ట్ ఇచ్చింది. నెక్స్ట్ ఏం జరుగుతుంది? ఆ ట్విస్ట్ ఇంకొకరికి తెలిస్తే? అని ఆసక్తి మొదలు అవుతుంది. ఇంటర్వెల్ వరకు దర్శకుడు శ్రీకాంత్ సంగిశెట్టి నడిపిన కథలో కొత్తదనం కంటే క్యారెక్టర్స్ ప్రవర్తించే తీరు కొత్తగా ఉంటుంది. స్నేహితుల మధ్య సరదాలు, చిన్న గొడవలు వంటి వాటిని బాగా చూపించారు.


ఓవరాల్ గా దీవానా... అందమైన, హృదయానికి హత్తుకునే క్యూట్ అండ్ లిటిల్ లవ్ స్టోరీ. ఈ తరహా ట్విస్ట్ ఇంతకు ముందు తెలుగు సినిమాల్లో రాలేదు. ట్విస్ట్ పక్కన పెడితే... ప్రతి సన్నివేశం, ఈ కథ మన కాలనీలో జరుగుతున్నట్టు అనిపిస్తుంది. ప్రతి పాత్ర ప్రేక్షకులకు ఏదో ఒక సందర్భంలో కనెక్ట్ అవుతుంది. డోంట్ మిస్ ఇట్.

Jun 21, 2026 Read Review
Tupaki
Tupaki Website
7

Hit

Deewana Movie Review

దీవానా’ను వీక్షిస్తుంటే రెండు వేర్వేరు చిత్రాలను మార్చి మార్చి చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. ఒక పార్శ్వ్యంలో ఏమో గుండెల్ని పిండేసే ఒక లవ్ స్టోరీ నడుస్తుంటుంది. హీరో హీరోయిన్ల ప్రేమకథకు అడ్డుగా నిలిచే ఒక షాకింగ్ పాయింట్ నేపథ్యంలో ఈ కథను నడిపించిన తీరుకు కదిలిపోతాం. అలాగే కుటుంబం నేపథ్యంలో కొన్ని సన్న...

దీవానా’ను వీక్షిస్తుంటే రెండు వేర్వేరు చిత్రాలను మార్చి మార్చి చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. ఒక పార్శ్వ్యంలో ఏమో గుండెల్ని పిండేసే ఒక లవ్ స్టోరీ నడుస్తుంటుంది. హీరో హీరోయిన్ల ప్రేమకథకు అడ్డుగా నిలిచే ఒక షాకింగ్ పాయింట్ నేపథ్యంలో ఈ కథను నడిపించిన తీరుకు కదిలిపోతాం. అలాగే కుటుంబం నేపథ్యంలో కొన్ని సన్నివేశాలు కూడా ప్రేక్షకుల కళ్లలో నీళ్లు తిరిగేల ా చేస్తాయి. ఎమోషనల్ సీన్లు అన్నింటినీ దర్శకుడు డీల్ చేసిన విధానం.. వాటిలో వచ్చే డైలాగులు ఒక టాప్ క్లాస్ సినిమా చూస్తున్న ఫీలింగ్ కలిగిస్తాయి. ఇందులో చూపించిన రెండో పార్శ్వం మాత్రం సినిమా మీద ఇంప్రెషన్ ను అంతకంతకూ తగ్గించేస్తుంటుంది. 


స్నేహితులతో కలిసి హీరో వేసే అల్లరి వేషాల దగ్గర్నుంచి.. ప్రేమ-ఉద్యోగం అంటూ అతను పడే పాట్లకు సంబంధించిన సీన్లన్నీ చికాకు పుట్టించేస్తాయి. ఒకే సినిమాలో ఇంత వైరుధ్యం చూసి ఆశ్చర్యం కలగక మానదు. ఎమోషనల్ సీన్లలో దర్శకుడు చూపించిన పరిణతిని మిగతా సన్నివేశాల్లో కూడా చూపించి ఉంటే.. వాటిని ఫిల్లింగ్ సీన్లలో పేర్చేసి ఉండకపోతే ‘దీవానా’ తెలుగులో వచ్చిన బెస్ట్ లవ్ స్టోరీల్లో ఒకటిగా నిలిచేది. ఐతే ఈ లోపం ఉన్నా సరే.. ‘దీవానా’ ఒక లుక్కేయడానికి ఢోకా లేని సినిమానే. ఇందులో కొన్ని సన్నివేశాలకు కదిలిపోని ప్రేక్షకుడు ఉండడంటే అతిశయోక్తి కాాదు.


Jun 21, 2026 Read Review
7

Hit

Deewana movie Review

లవ్‌ స్టోరీస్‌ లో ఇది సరికొత్త ప్రేమ కథా చిత్రం అని చెప్పొచ్చు. రియాలిటీకి దగ్గరగా ఉండే ప్రేమ కథా చిత్రాలు ఈ మధ్య కాలంలో చాలానే వస్తున్నాయి. నిజానికి ఇలాంటి సినిమాలే ఆదరణ పొందుతున్నాయి. అలాంటిదే `దీవాన`. హైదరాబాద్‌ సిటీలో జరిగే ప్రేమ కథ ఇది. సిటీలో ముగ్గురు కుర్రాళ్లు జాన్‌ జిగ్రీలు. దోస్తాన్‌ కోసం...

లవ్‌ స్టోరీస్‌ లో ఇది సరికొత్త ప్రేమ కథా చిత్రం అని చెప్పొచ్చు. రియాలిటీకి దగ్గరగా ఉండే ప్రేమ కథా చిత్రాలు ఈ మధ్య కాలంలో చాలానే వస్తున్నాయి. నిజానికి ఇలాంటి సినిమాలే ఆదరణ పొందుతున్నాయి. అలాంటిదే `దీవాన`. హైదరాబాద్‌ సిటీలో జరిగే ప్రేమ కథ ఇది. సిటీలో ముగ్గురు కుర్రాళ్లు జాన్‌ జిగ్రీలు. దోస్తాన్‌ కోసం ప్రాణాలిస్తారు. కొట్టుకున్నా, తిట్టుకున్నా మళ్లీ కలిసిపోతారు. తమ మీదకు వేరే వాళ్లు వస్తే, కలిసిపోతారు. ప్రేమ విషయంలోనూ దోస్త్ కి అండగా ఉండి, వాడి లక్ష్యానికి తమ వంతు సపోర్ట్ చేసి అటు లక్ష్యాన్ని, ఇటు ప్రేమని గెలిపించేందుకు స్నేహితులు చేసిన పోరాటమే ఈ మూవీ అని చెప్పొచ్చు. 


సాధారణంగా ప్రేమ కథా చిత్రాల్లో కేవలం ప్రేమ చుట్టూనే సినిమా సాగుతుంది. కానీ ఇందులో లవ్‌ స్టోరీ ఉంది, స్నేహం ఉంది, ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా ఉన్నాయి. ఓవరాల్ గా ఆద్యంతం కట్టిపడేసే రియలిస్టిక్‌ లవ్‌ స్టోరీ. ప్రేమ, స్నేహం, ఫ్యామిలీ ఎమోషన్స్, జీవిత లక్ష్యాన్ని బ్యాలెన్స్ చేస్తూ ఆద్యంతం కట్టిపడేసే సరికొత్త ప్రేమ కథ దీవాన. లవ్‌ స్టోరీస్‌లో ఇటీవల కాలంలో వచ్చిన బెస్ట్ మూవీ అవుతుంది. కమర్షియల్‌గా ఏ రేంజ్‌లో సత్తా చాటుతుందో చూడాలి. 





Jun 21, 2026 Read Review
TV9 Telugu
TV9 Telugu News Channel
7

Hit

Deewana Movie Review

ప్రేమకు రూపం లేదు, మనసే ప్రధానం అనే గొప్ప సందేశంతో ఈ చిత్రాన్ని దర్శకుడు శ్రీకాంత్ సంఘిశెట్టి ఎంతో నిజాయితీగా తెరకెక్కించాడు. సినిమా మొదట్లో పెద్దగా ఆసక్తిని కలిగించదు. సాధారణ యూత్ సినిమాల్లాగే గొడవలు, స్నేహితులు అంటూ కాస్త రొటీన్‌గా సాగుతుంది. కానీ లవ్ ట్రాక్ మొదలయ్యాక కథలో వేగం పెరుగుతుంది. ఫస్టాఫ...

ప్రేమకు రూపం లేదు, మనసే ప్రధానం అనే గొప్ప సందేశంతో ఈ చిత్రాన్ని దర్శకుడు శ్రీకాంత్ సంఘిశెట్టి ఎంతో నిజాయితీగా తెరకెక్కించాడు. సినిమా మొదట్లో పెద్దగా ఆసక్తిని కలిగించదు. సాధారణ యూత్ సినిమాల్లాగే గొడవలు, స్నేహితులు అంటూ కాస్త రొటీన్‌గా సాగుతుంది. కానీ లవ్ ట్రాక్ మొదలయ్యాక కథలో వేగం పెరుగుతుంది. ఫస్టాఫ్ లో వచ్చే ఫ్రెండ్ షిప్ ఫైట్ అదిరింది. ముఖ్యంగా ఇంటర్వెల్ సమయంలో వచ్చే అనుకోని మలుపు ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తుంది. అక్కడి నుంచి సినిమాపై ఉన్న అభిప్రాయం పూర్తిగా మారిపోతుంది. 


సెకండ్ హాఫ్ లో వచ్చే ఎమోషనల్ సన్నివేశాలు కంటతడి పెట్టిస్తాయి. హీరోయిన్ తన మనసులోని ప్రేమను స్నేహితురాలితో పంచుకునే సీన్ గుండెను హత్తుకుంటాయి. ప్రీ క్లైమాక్స్ మలుపు, క్లైమాక్స్ చాలా బాగున్నాయి. అయితే హీరో పోలీస్ ట్రైనింగ్, ఒకే అటెంప్ట్‌లో ప్రభుత్వ ఉద్యోగం సాధించడం లాంటివి సినిమాటిక్ లిబర్టీగా సరిపెట్టుకోవాలి. వాటిలో లాజిక్స్ వెతకకూడదు. క్లైమాక్స్ కూడా ఊహించినట్టుగానే ఉంది. ఓవరాల్‌గా దీవానా.. యూత్ ఫుల్ లవ్ ఎంటర్టైనర్.. గట్టిగా ఎక్కేస్తుంది..!


Jun 21, 2026 Read Review
NTV Telugu
NTV Telugu News Channel
7

Hit

Deewana Movie Review

హర్షిత్ రెడ్డి, స్మేహ జంటగా నటించిన సినిమా దీవానా... తాజాగా థియేటర్లలో విడుదలై మంచి రెస్పాన్స్ అందుకుంటుంది. సాధారణ ప్రేమకథకు భావోద్వేగ ట్విస్ట్‌ ను జోడించి ఈ మూవీ ప్రత్యేకంగా నిలుస్తుంది. ఫస్ట్ హాఫ్‌ లో ప్రేమకథ నెమ్మదిగా సాగినా, ఇంటర్వెల్ ట్విస్ట్‌ తో సినిమా ఆసక్తికరంగా మారుతుంది. సెకండ్ హాఫ్‌ లో ఫ...

హర్షిత్ రెడ్డి, స్మేహ జంటగా నటించిన సినిమా దీవానా... తాజాగా థియేటర్లలో విడుదలై మంచి రెస్పాన్స్ అందుకుంటుంది. సాధారణ ప్రేమకథకు భావోద్వేగ ట్విస్ట్‌ ను జోడించి ఈ మూవీ ప్రత్యేకంగా నిలుస్తుంది. ఫస్ట్ హాఫ్‌ లో ప్రేమకథ నెమ్మదిగా సాగినా, ఇంటర్వెల్ ట్విస్ట్‌ తో సినిమా ఆసక్తికరంగా మారుతుంది. సెకండ్ హాఫ్‌ లో ఫ్రెండ్‌ షిప్, ఫ్యామిలీ ఎమోషన్స్, సెంటిమెంట్ బాగా ఆకట్టుకుంటాయి. 


నరేష్–మున్నా మధ్య సన్నివేశాలు, క్లైమాక్స్ భావోద్వేగంగా మెప్పిస్తాయి. మొత్తంగా, నిజాయితీగా చెప్పిన హృద్యమైన ప్రేమకథగా ఈ దీవానా మూవీ నిలుస్తుంది. కాకపోతే కొత్తదనం ఉండదు. ఓవరాల్ గా ఎలాంటి అంచనాలు లేకుండా వెళ్తే ఈ దీవానా గాడు నవ్విస్తూనే ఆలోచింపచేసి, కన్నీరు పెట్టించి పంపిస్తాడు. 

Jun 21, 2026 Read Review
Filmi Beat
Filmi Beat Website
7

Hit

Deewana Movie Review

ప్రేమ కథలో యువతీ ఇష్టపడటమో లేదా యువకుడు ఇష్టపడటమో అనేది కామన్ పాయింట్. ఆ పాయింట్ చుట్టూ ఎమోషన్ పాయింట్ లేదా? ట్విస్టుతో కథను రాసుకొంటే డిఫరెంట్ లవ్ స్టోరీగా మారే అవకాశం ఉంటుంది. ఈ దీవానా సినిమాలో కథను భావోద్వేగంగా మార్చే, అలాగే సెంటిమెంట్‌ను పండించే అద్బుతమైన ట్విస్ట్ ఉండటంతో తెర మీద నిజాయితీతో కూడి...

ప్రేమ కథలో యువతీ ఇష్టపడటమో లేదా యువకుడు ఇష్టపడటమో అనేది కామన్ పాయింట్. ఆ పాయింట్ చుట్టూ ఎమోషన్ పాయింట్ లేదా? ట్విస్టుతో కథను రాసుకొంటే డిఫరెంట్ లవ్ స్టోరీగా మారే అవకాశం ఉంటుంది. ఈ దీవానా సినిమాలో కథను భావోద్వేగంగా మార్చే, అలాగే సెంటిమెంట్‌ను పండించే అద్బుతమైన ట్విస్ట్ ఉండటంతో తెర మీద నిజాయితీతో కూడిన ప్రేమ కథగా మారిందనే చెప్పాలి. ఫస్టాఫ్‌ లో క్యారెక్టర్లు, అమ్ము, మున్నా ప్రేమ కథను ఎస్టాబ్లిష్ చేయడానికి చాలా సమయం తీసుకొని.. కథను సాగదీసినట్టు చేశాడు. కానీ ఇంటర్వెల్ ట్విస్టుతో సినిమాను దర్శకుడు, హీరో తమ వైపుకు తిప్పుకొన్నారు.


సెకండాఫ్ విషయానికి వస్తే.. ఇంటర్వెల్ ట్విస్ట్ చుట్టూ రాసుకొన్న ఫ్రెండ్‌షిప్, ఫ్యామిలీ ఎమోషన్స్, సెంటిమెంట్ బాగా వర్కవుట్ అయ్యాయి. దర్శకుడు రాసుకొన్న సన్నివేశాలు చాలా కొత్తగా ఉన్నాయి. ముఖ్యంగా రఘు కారుమంచి సీన్ ఒకటి.. తండ్రి నరేష్ కొడుకు మున్నా మధ్య వచ్చే సన్నివేశాలు.. సెంటిమెంట్‌ను పండించటమే కాకుండా సగటు ప్రేక్షకుడిని కంటతడి పెట్టించేలా ఉంటాయి. ఇక క్రైమాక్స్‌లో డ్రామాను దర్శకుడు అద్బుతంగా పండించాడు. దాంతో దీవానా సినిమా నిజాయితీగా వెండితెర మీద చెప్పిన ప్రేమ కథగా మారింది.


Jun 21, 2026 Read Review
One India
One India Website
7

Hit

Deewana Movie Review

మెయిల్, తరగతి గది లాంటి డీసెంట్ వెబ్ సిరీస్ లతో ప్రేక్షకులకు దగ్గరైన యంగ్ హీరో హర్షిత్ రెడ్డి. ఆయన నటించిన కొత్త మూవీ 'దీవానా'.. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, సాంగ్స్ యూత్ కు ఎక్కేశాయి. దాంతో ఈ మూవీపై అంచనాలు ఏర్పడ్డాయి. జూన్ 20 న ఈ మూవీ గ్రాండ్ గా విడుదల అయిందిఇక దీవానా మూవీ స్లోగా స్టార్ట్ అయినా ముంద...

మెయిల్, తరగతి గది లాంటి డీసెంట్ వెబ్ సిరీస్ లతో ప్రేక్షకులకు దగ్గరైన యంగ్ హీరో హర్షిత్ రెడ్డి. ఆయన నటించిన కొత్త మూవీ 'దీవానా'.. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, సాంగ్స్ యూత్ కు ఎక్కేశాయి. దాంతో ఈ మూవీపై అంచనాలు ఏర్పడ్డాయి. జూన్ 20 న ఈ మూవీ గ్రాండ్ గా విడుదల అయింది


ఇక దీవానా మూవీ స్లోగా స్టార్ట్ అయినా ముందుకు వెళ్లే కొద్ది తరువాత ఏం జరుగుతుంది.. అనే క్యూరియాసిటీ పెరుగుతుంది. ఓవైపు లవ్ స్టోరీ.. మరోవైపు ఫ్యామిలీ ఎమోషన్స్ ను దర్శకుడు అద్భుతంగా చూపించాడు. సినిమాలోని ఎమోషన్స్, నటీనటుల పెర్ఫార్మెన్స్, ఒక షాకింగ్ ట్విస్ట్ అండ్ ఎమోషనల్ క్లైమాక్స్ సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. మొత్తానికి సినిమా పూర్తయ్యే సరికి ఆడియన్స్ అంచనాలను అందుకోవడంలో దీవానా మూవీ సక్సెస్ అయింది.


Jun 21, 2026 Read Review
Gulte
Gulte Website
5

Average

Deewana movie review

Deewana, directed by Sreekanth Sangishetty, is a film that attempts to blend romance, emotion, and realism into a meaningful cinematic experience. Featuring Harshith Reddy and Smeha Manimegalai in the lead roles. Backed by Arha Media, Vasudev Koppineni, and Sridevi Karyampudi, the film has music by...

Deewana, directed by Sreekanth Sangishetty, is a film that attempts to blend romance, emotion, and realism into a meaningful cinematic experience. Featuring Harshith Reddy and Smeha Manimegalai in the lead roles. Backed by Arha Media, Vasudev Koppineni, and Sridevi Karyampudi, the film has music by Eswar Chand, cinematography by Vamsi Patchipulusu, and editing by Hrishikesh Pasapal.


The director, Sreekanth Sangishetti, took a very basic plot of a ‘boy meets a girl and falling in love with her instantly’ and executed the majority of the first half in a routine manner. But, right from the pre-interval to the climax, he made sure, Deewana, has a very original soul. After unveiling an unexpected twist during the pre-interval episode, the film gets into the zone of an intense emotional drama and it is where ‘Deewana’, stood out compared to the regular romantic drama films we see often.


Overall, Deewana is an intense emotional drama from the pre-interval sequence. If you like hard-hitting emotional dramas without any sugar coating. Watch it in theatres.




Jun 21, 2026 Read Review
Great Andhra
Great Andhra Website
6

Above Average

Deewana Movie Review

These days, youthful love stories are gradually finding their audience. Films like “Youth” and “Vazha 2” have recently gained traction, and now “Deewana” arrives with a similar premise. Does it manage to stand out?“Deewana” begins like a typical youthful romance, focusing on a carefree youngster cha...

These days, youthful love stories are gradually finding their audience. Films like “Youth” and “Vazha 2” have recently gained traction, and now “Deewana” arrives with a similar premise. Does it manage to stand out?


“Deewana” begins like a typical youthful romance, focusing on a carefree youngster chasing a girl without any clear direction in life.


Highlights

The interval twist

Emotional climax

Meaningful message


Drawbacks

Lag in the second half

A few illogical episodes

Excessive sentiment in places


Overall, “Deewana” is an engaging mix of romance and emotional drama. It may not be flawless, but its strong twist, heartfelt emotions, and meaningful message make it worth a watch.


Jun 19, 2026 Read Review
Sakshi
Sakshi News Channel
6

Above Average

Deewana Movie Review

ఈ మధ్య కమర్షియల్ ఫార్ములాలతో వచ్చే లవ్ స్టోరీల మధ్య, ‘దీవాన’ మాత్రం తన నిజాయితీతో ప్రత్యేకంగా నిలుస్తుంది. ప్రేమను కేవలం రొమాన్స్‌గా కాకుండా, ఒక భావోద్వేగ ప్రయాణంగా చూపించిన సినిమా ఇది.ఫస్ట్ హాఫ్‌లో ప్రేమ కథ నెమ్మదిగా హృదయానికి దగ్గరవుతుంటే, సెకండాఫ్‌లో ఎమోషన్స్ పూర్తి స్థాయిలో టేకోవర్ చేస్తాయి. హీర...

ఈ మధ్య కమర్షియల్ ఫార్ములాలతో వచ్చే లవ్ స్టోరీల మధ్య, ‘దీవాన’ మాత్రం తన నిజాయితీతో ప్రత్యేకంగా నిలుస్తుంది. ప్రేమను కేవలం రొమాన్స్‌గా కాకుండా, ఒక భావోద్వేగ ప్రయాణంగా చూపించిన సినిమా ఇది.


ఫస్ట్ హాఫ్‌లో ప్రేమ కథ నెమ్మదిగా హృదయానికి దగ్గరవుతుంటే, సెకండాఫ్‌లో ఎమోషన్స్ పూర్తి స్థాయిలో టేకోవర్ చేస్తాయి. హీరోయిన్ తన మనసులోని ప్రేమను బయటపెట్టే సన్నివేశం, పోలీస్ స్టేషన్‌లో నరేష్ నటన, తండ్రి ప్రేమ గురించి వచ్చే డైలాగ్స్... ఒక్కో సీన్ నేరుగా హృదయాన్ని తాకుతుంది. కొన్ని చోట్ల కళ్లలో నీళ్లు తిరగడం గ్యారంటీ.


ప్రీ-క్లైమాక్స్ ట్విస్ట్ కథను మరో స్థాయికి తీసుకెళ్తుంది. క్లైమాక్స్ అయితే థియేటర్ నుంచి బయటికి వచ్చిన తర్వాత కూడా మనసులోనే తిరుగుతుంటుంది. ఎలాంటి ఆర్టిఫిషియల్ డ్రామా లేకుండా, సహజమైన భావోద్వేగాలతో దర్శకుడు శ్రీకాంత్ సంఘిశెట్టి కథను నడిపించిన తీరు ప్రశంసనీయం.


మాస్ ఎలిమెంట్స్, ఓవర్ యాక్షన్ కోసం వెతికేవారికి కాకుండా, మనసుతో సినిమా చూసేవారికి ‘దీవాన’ మంచి అనుభూతిని ఇస్తుంది. ప్రేమ కథల్లో కొత్తదనం, ఎమోషనల్ డెప్త్ కోరుకునే యూత్‌కు ఇది కనెక్ట్ అయ్యే సినిమా.


Jun 20, 2026 Read Review
Samayam Telugu
Samayam Telugu Website
7

Hit

Deewana Movie Review

ప్రేమ అనేది అనంతం.. ప్రేమ నుంచి ఎన్నో కథలు పుడతాయి.. ప్రేమను కేంద్రంగా చేసుకుని ఎన్ని కథల్ని అయినా అల్లుకోవచ్చు. అయితే ఆ కథలో కట్టి పడేసే ఎమోషన్, కొత్తదనం ఉండాలి. అలా ఎమోషనల్ కనెక్టివిటీతో, నిజాయితీగా సినిమాను తీస్తే ఆడియెన్స్ కచ్చితంగా ఆదరిస్తారు. అలాంటి ఓ హానెస్ట్ అటెంప్ట్‌గా ‘దీవాన’ నిలుస్తుంది....

ప్రేమ అనేది అనంతం.. ప్రేమ నుంచి ఎన్నో కథలు పుడతాయి.. ప్రేమను కేంద్రంగా చేసుకుని ఎన్ని కథల్ని అయినా అల్లుకోవచ్చు. అయితే ఆ కథలో కట్టి పడేసే ఎమోషన్, కొత్తదనం ఉండాలి. అలా ఎమోషనల్ కనెక్టివిటీతో, నిజాయితీగా సినిమాను తీస్తే ఆడియెన్స్ కచ్చితంగా ఆదరిస్తారు. అలాంటి ఓ హానెస్ట్ అటెంప్ట్‌గా ‘దీవాన’ నిలుస్తుంది. ప్రేమకి అర్థం చెప్పేలా ‘దీవాన’ ఉంటుంది. ప్రేమకి అందం ముఖ్యం కాదు.. మనసు ముఖ్యం అని చెప్పేలా హార్డ్ హిట్టింగ్ ఎమోషన్‌తో ‘దీవాన’ మూవీని దర్శకుడు శ్రీకాంత్ సంఘిశెట్టి తీశాడు.


సెకండాఫ్‌లో చాలా వరకు ఎమోషనల్ సీన్స్ కంటతడిని పెట్టిస్తాయి. హీరోయిన్ తనలో దాచుకున్న ప్రేమను స్నేహితురాలికి చెప్పుకునే సీన్, పోలీస్ స్టేషన్‌ లో నరేష్ చేసిన సీన్, తండ్రి గొప్పదనాన్ని కమెడియన్ రఘు చెప్పే సీన్ ఇలా ప్రతీ ఒక్కటి గుండెను బరువెక్కేలా చేస్తుంది. చాలా వరకు సీన్స్ కంటతడిని పెట్టించేలా ఉంటాయి. ఇక ప్రీ క్లైమాక్స్‌ లో వచ్చే ట్విస్ట్ మరింత బాగుంటుంది. క్లైమాక్స్ హార్ట్ టచింగ్‌ గా ఉంటుంది. మధ్యలో పోలీస్ ట్రైనింగ్ సీన్లు. రెగ్యులర్ కమర్షియల్ చిత్రాలు వస్తున్న సమయంలో.. ఇలాంటి ఓ రిఫ్రెషింగ్, హానెస్ట్ స్టోరీతో వచ్చిన ‘దీవాన’ యూత్ ప్రేక్షకుల్ని, ప్రేమ కథల్ని ఇష్టపడే ఆడియెన్స్‌ని ఆకట్టుకునే అవకాశం ఉంది. ఈ సినిమా ఓ ఫీల్ గుడ్ లవ్ స్టోరీని చూశామనే ఫీలింగ్‌ను మాత్రం కలిగించేలా చేస్తుంది.


Jun 19, 2026 Read Review
123telugu
123telugu Website
6

Above Average

Deewana Movie Review

హర్షిత్ రెడ్డి హీరోగా నటించిన లేటెస్ట్ రొమాంటిక్ డ్రామా చిత్రం ‘దీవానా’ నేడు థియేటర్లలో రిలీజ్ అయింది. ప్రెస్టీజియస్ బ్యానర్ గీతా ఆర్ట్స్ సమర్పణలో వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకుల నుండి డీసెంట్ రెస్పాన్స్ అందుకుంది. కథ పరంగా నిరాశపరిచినా, మంచి బలమైన కథనంతో ఆడియన్స్ ని మెప్పించే ప్రయత్నం చేసారు. హీరోహీరోయి...

హర్షిత్ రెడ్డి హీరోగా నటించిన లేటెస్ట్ రొమాంటిక్ డ్రామా చిత్రం ‘దీవానా’ నేడు థియేటర్లలో రిలీజ్ అయింది. ప్రెస్టీజియస్ బ్యానర్ గీతా ఆర్ట్స్ సమర్పణలో వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకుల నుండి డీసెంట్ రెస్పాన్స్ అందుకుంది. కథ పరంగా నిరాశపరిచినా, మంచి బలమైన కథనంతో ఆడియన్స్ ని మెప్పించే ప్రయత్నం చేసారు. హీరోహీరోయిన్ల పెర్ఫార్మన్స్ తో పాటు దర్శకుడి పనితీరు ఆడియన్స్ ని ఆకట్టుకుంది.


‘దీవానా’ ఒక సిన్సియర్ రొమాంటిక్ డ్రామాగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈ సినిమాలోని రైటింగ్, నటీనటుల పర్ఫార్మెన్స్‌ లు ప్రేక్షకులను మెప్పిస్తాయి. ఫస్ట్ హాఫ్ కాస్త స్లోగా సాగుతూ, కొన్ని సీన్స్ కొద్దిగా ఇబ్బందికరంగా అనిపించినప్పటికీ.. సెకండ్ హాఫ్‌ లోని ఎమోషన్స్, ఎంటర్‌టైన్‌మెంట్ ఆకట్టుకుంటాయి. రొమాంటిక్ డ్రామాలను ఇష్టపడేవారు ఈ వీకెండ్ ఈ చిత్రాన్ని ట్రై చేయవచ్చు.


Jun 21, 2026 Read Review

Public Reviews

6 Avg: 7.2/10
T
Tharuni Valluru Small Business Owner
8

Super Hit

Deewana Movie Review

ఏదైనా సినిమా వస్తుందంటే... Trailer చూసాక సినిమాకెళ్ళడం నాకలవాటు. అలాగే దీవానా మూవీ ట్రైలర్ చూసి సినిమాకెళ్ళడం వేస్ట్.. రొట్ట సినిమా అనుకున్నా. కానీ office అయిపోయాక నా firneds force చేస్తే... తప్పదన్నట్టు వెళ్ళా. బట్ సినిమా చూసాక ట్రైలర్ చూసి సినిమాని judge చేయకూడదని అనిపించింది. సినిమా స్టోరీ వ...

ఏదైనా సినిమా వస్తుందంటే... Trailer చూసాక సినిమాకెళ్ళడం నాకలవాటు. అలాగే దీవానా మూవీ ట్రైలర్ చూసి సినిమాకెళ్ళడం వేస్ట్.. రొట్ట సినిమా అనుకున్నా. కానీ office అయిపోయాక నా firneds force చేస్తే... తప్పదన్నట్టు వెళ్ళా. బట్ సినిమా చూసాక ట్రైలర్ చూసి సినిమాని judge చేయకూడదని అనిపించింది. 


సినిమా స్టోరీ వరకు మనకు తెలిసిందే. but మూవీలో చాలా విషయముంది. ప్రేమే కాకుండా, friendship, family emotions కూడా బాగున్నాయి. నేనేం చెప్పినా story రివీల్ అవుతుందని చెప్పట్లేదు గాని... must watchable మూవీ అని మాత్రం చెప్పగలను... వెంటనే సినిమా చూసేయండి. 

Jun 26, 2026
S
Shiva Teachers and Educators
7

Hit

Deewana Movie Review

Deewana isn't about a fresh story—it's about how it's told. 


* Familiar love story

* Solid interval & climax twists

* Good friendship track

* Emotional family moments


Overall A decent emotional entertainer that deserves a one-time watch.

Jun 25, 2026
Rupavath Bixam
Rupavath Bixam Small Business Owner
7

Hit

Deewana Movie Review

దీవానా మూవీ చూసాక నా opinoin చెప్పాలంటే... బాగుంది సినిమా... ఒకసారి చుడొచ్చు. కానీ కొత్త స్టోరీ ఎం కాదు... చాలా సినిమాల్లో ఉండే love storyనే ఈ సినిమాలో కూడా ఉంది. బట్ ఇంటర్వెల్ sence and climax twist ల వల్ల సినిమా చాలా మందికి నచ్చే ఛాన్స్ ఉంది. అండ్ దీవానా సినిమాలో లవ్ స్టోరీ మాత్రమే కాకుండా fr...

దీవానా మూవీ చూసాక నా opinoin చెప్పాలంటే... బాగుంది సినిమా... ఒకసారి చుడొచ్చు. కానీ కొత్త స్టోరీ ఎం కాదు... చాలా సినిమాల్లో ఉండే love storyనే ఈ సినిమాలో కూడా ఉంది. బట్ ఇంటర్వెల్ sence and climax twist ల వల్ల సినిమా చాలా మందికి నచ్చే ఛాన్స్ ఉంది. 


అండ్ దీవానా సినిమాలో లవ్ స్టోరీ మాత్రమే కాకుండా friendship ని కూడా బాగా చూపించడం నాకు నచ్చింది. అండ్ family emotions కూడా బాగున్నాయి. ఓవరాల్ గా decent watchable అనిపించింది.

Jun 24, 2026
T
Talari Snehalatha IT Employee
7

Hit

Deewana Movie Review

Deewana may not reinvent the love story genre, but it wins with its emotional storytelling.


While the plot feels predictable, the well-placed twists, heartfelt friendships, and strong family moments keep you invested.


The climax leaves a lasting impact. A simple yet satisfying watch.


my rating 7/10

Jun 22, 2026
V
Velugubantla Ramadurga Private Employee
7

Hit

Deewana movie Review

Deewana Not a new story, but it's all about the execution. 

The love story feels familiar, yet the interval and climax twists elevate the experience. 

The friendship track and family emotions add heart to the film.

 

Overall, a decent emotional entertainer that's worth a one-time watch

Jun 22, 2026
A
Arige Srikanth Private Employee
7

Hit

Deewana Movie Review

Just watched Deewana — here's my take! It's a decent one-time watch. The story isn't something groundbreaking.it's a familiar love story we've seen before. But the interval and climax twists add a fresh emotional punch and make the film engaging. What I liked most is that it doesn't just focus on ro...

Just watched Deewana — here's my take!


It's a decent one-time watch. The story isn't something groundbreaking.

it's a familiar love story we've seen before.

But the interval and climax twists add a fresh emotional punch and make the film engaging.

What I liked most is that it doesn't just focus on romance, it also gives equal importance to friendship and family emotions.


Overall, Deewana is an emotional, feel-good entertainer that's definitely worth watching once. 

Jun 21, 2026

About This Movie

Story :

కథ విషయానికి వస్తే... మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చెందిన మున్నా (హర్షిత్ రెడ్డి) డిగ్రీ ఫినిష్ చేసినా ఏ పని చేయకుండా ఆవారాలా తిరుగుతుంటాడు. అలాంటి మున్నా, ప్రభుత్వాఫీసులో పని చేసే అమూల్య (స్మేహా మణిమేఘలై)ని తొలిచూపులోనే ప్రేమిస్తాడు. రోజు వెంటపడుతూ అమూల్యకి ప్రపోజ్ చేస్తే... మున్నాని ఖాళీగా తిరిగడం కాదు, ముందు గవర్నమెంట్ జాబ్ సంపాదించుకుని రమ్మని, ఆ తర్వాత ఆలోచిద్దా మని తెగేసి చెప్తుంది. మరి అమూల్యని ప్రాణంగా ప్రేమించిన మున్నా ఆ తరువాత ఏం చేశాడు? అమూల్య కోసం కష్టపడి ఉద్యోగాన్ని సంపాదించాడా? అమూల్య మున్నా ప్రేమ అంగీకరించిందా? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.

 

Plus Points :

దీవానా మూవీ కథ వరకు చెప్పుకుంటే.. ఇలాంటి ప్రేమకథలు కొన్ని వందల సినిమాల్లో చూసి ఉంటాం. హీరో ఆవారా.. హీరోయిన్ రిచ్... హీరోయిన్ కోసం మంచిగా మారి ప్రయోజకుడవుతాడు. దానికి కమర్షియల్ ఎలిమెంట్స్ ఆడ్ చేసి ఎంటర్టైన్ చేస్తారు.. ఈ దీవానా కూడా అలాంటిదే. అయితే ట్రైలర్ చూసి ఈ సినిమాని కూడా చాలా మంది అంచనా వేయొచ్చు. కథ పరంగాను అలాగే ఉంటుంది. కానీ ఆ కథలోకి దర్శకుడు ఆడియన్స్ ని ఇన్వాల్స్ చేసిన తీరు బాగుంది. ముఖ్యంగా ఈ సినిమాలో ప్రేమ కథతో పాటు ఫ్రెండ్షిప్ ని చూపించిన తీరు కూడా ఆకట్టుకుంటుంది. ఇక సినిమాలో హీరో హీరోయిన్లతో పాటు హీరో ఫ్రెండ్స్ రోల్స్ చేసిన వాళ్ళు కూడా మంచి పెర్ఫార్మన్స్ తో ఇంప్రెస్ చేస్తారు. మిగతా నటీనటులు వాళ్ళ వాళ్ళ పరిధిమేరకు నటించారు.  అలాగే సినిమాలో చూపించిన న్యాచురాలిటీకి ఆడియన్స్ బాగానే కనెక్ట్ అవుతారు. ప్రేక్షకుడ్ని కథ కంటే ఎక్కువగా కదిలించేది ఎమోషన్. దర్శకుడు ఆ విషయంలో సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. 

 

Minus Points :

ఇక మైనస్ పాయింట్స్ చూసుకుంటే... సినిమాకి మెయిన్ మైనస్ స్లో నేరేషన్. కథ కూడా ఊహించినట్టే ఉండడం వల్ల నెమ్మదిగా సాగుతున్న ఫీల్ వస్తుంది. ప్రేక్షకులకు ఇంట్రెస్ట్ అనిపించే సీన్స్ అన్ని ఇంటర్వెల్, క్లైమాక్స్ లోనే ఉంటాయి. పైగా హీరొయిన్ ని ఇంప్రెస్ చేసేందుకు ట్రై చేసే సీన్స్ అన్ని రొటీన్ గా, ఇంకా చెప్పాలంటే చిరాగ్గా ఉంటాయి. ఇలాంటి సాగదీత సీన్స్ ను ట్రిమ్ చేసి ఉంటే బాగుండేది. పైగా కొన్ని డిస్టర్బింగ్ సీన్స్ కూడా ఉంటాయి. వాటికి కొందరు ఆడియన్స్ కనెక్ట్ కాకపోవచ్చు. అందుకే సెన్సార్ బోర్డు ‘A’ సర్టిఫికేట్ ఇచ్చింది. ప్రేక్షకులు ఇలాంటి సీన్స్‌కు ప్రిపేర్ అయ్యి వెళ్తే మంచిది.

 

Technical values :

ఇక టెక్నికల్ గా చూసుకుంటే... దీవానా మూవీలో కొన్ని సెన్సిటివ్ సీన్స్ ని బాగా హ్యాండిల్ చేసిన డైరెక్టర్ ని మెచ్చుకోవాలి. అయితే రైటర్ కం డైరెక్టర్ శ్రీకాంత్ సంఘిశెట్టి కథను మరింత స్ట్రాంగ్ గా రాసుకుంటే బాగుండేది. ఇక ఈశ్వర్ చంద్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. వంశీ పచ్చిపులుసు సినిమాటోగ్రఫీ బాగుంది, కానీ అక్కడక్కడా కొన్ని సీన్స్ లో లైటింగ్ ఓవర్ అయింది. ప్రొడక్షన్ వాల్యూస్ పర్లేదు. కొన్ని సీన్స్ ఎడిట్ చేయాల్సింది. 

 

Final Review :

ఓవరాల్ గా దీవానా సినిమా ఒక డీసెంట్ రొమాంటిక్ డ్రామాగా ఆడియన్స్ ని ఆకట్టుకుంటుందని చెప్పొచ్చు. కథ వరకు రొటీన్ అయినప్పటికీ, సినిమా మంచి స్క్రీన్ ప్లే, రైటింగ్ తో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తుంది. ముఖ్యంగా సెకండ్ హాఫ్‌ లోని ఎమోషన్స్ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఓవరాల్ గా కొత్తదనం కోరుకునే ఆడియన్స్ కాస్త డిస్సపాయింట్ అవ్వొచ్చు, గాని రెగ్యులర్ మూవీ లవర్స్ ని దీవానా ఆకట్టుకుంటుంది.

Review Statistics

6.7
Overall Rating
Avg. of all reviews
22
Total Reviews
From 4 Provider Types

Review Average

Media
6.6/10
Public
7.2/10
Why MRO?