భోగి(Bhogi)
Bhogi : పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో రా అండ్ రస్టిక్ గా "భోగి" ట్రైలర్... త్వరలోనే ప్రేక్షకుల ముందుకు..
Available in:
About This Movie
టాలీవుడ్ టాలెంటెడ్ హీరోల్లో ఒకరైన శర్వానంద్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ "భోగి". ఈ ఇయర్ ఆల్రెడీ రెండు మూవీస్ తో ఆడియన్స్ ని మెప్పించిన శర్వా ఈసారి పెర్ఫార్మన్స్ ఓరియెంటెడ్ మూవీతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు. పల్లెటూరి నేపథ్యంలో తెరకెక్కుతున్న కమర్షియల్ మూవీగా ఈ భోగి తెరకెక్కనుండగా, అనుపమ పరమేఅశ్వరన్ ఇందులో హీరోయిన్ గా కనిపించనుంది. ఇక కంటెంట్ బేస్డ్ మూవీస్ చేసే శర్వా ఈ భోగి సినిమాలో ఎప్పుడూ కనిపించనంత రా అండ్ డీగ్లామర్ లుక్ లో గ్రామీణ యువకుడిగా కనిపించనున్నాడు.
డైరెక్టర్ సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకి సంబంధించి తాజాగా ట్రైలర్ విడుదల చేయగా, సోషల్ మీడియాలో దీనికి మంచి రెస్పాన్స్ లభిస్తుంది. శర్వా ఫస్ట్ టైం ఒక ఊర మాస్ గెటప్ లో అండ్ అదిరిపోయే యాక్షన్ సీన్స్ లో కనిపించబోతున్నట్టు టీజర్ చూస్తుంటే తెలుస్తుంది. బొగ్గుల గుట్ట అనే ఊరి నేపథ్యంలో సినిమా కథ నడుస్తుండగా, టీజర్ లో రక్తపాతం సృష్టించే వైలెన్స్ బాగా కనిపిస్తున్నాయి. ఇక కుల వివక్ష, పాలెగాళ్ళ ఆధిపత్యం, అణచివేత లాంటి అంశాలను ఎక్కువగా సినిమాలో చూపించనున్నట్టు తెలుస్తుంది. టీజర్ లో "నేను సెయ్య సెయ్యనియ్య" అంటూ శర్వా చెప్పే మాస్ డైలాగ్ హైలెట్ గా అనిపిస్తుంది.
ఇక డైరెక్టర్ సంపంత్ నంది భోగి సినిమాను ఒక రా అండ్ రస్టిక్ గా తెరకెక్కించనున్నట్టు తెలుస్తుంది. విజువల్స్ పరంగా ఆడియన్స్ కి మంచి ఎక్స్పియరెన్స్ అందించనున్నట్టు తెలుస్తుంది. ఇక కేకే రాధామోహన్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తుండగా, నవంబర్ 12న ఈ సినిమాను థియేటర్లలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. మరి ఈ సినిమాతో శర్వానంద్ ఏ స్థాయిలో సక్సెస్ కొడతాడో చూడాలి.