అలియాస్ రుక్మిణీ (Alias Rukmini)
నవలా రచయితగా నితిన్.. అసలు ఎవరీ రుక్మిణీ.. తెలియాలంటే కొంతకాలం వెయిట్ చేయాల్సిందే..!
Available in:
About This Movie
టాలీవుడ్ లో ఒకప్పుడు లవర్ బాయ్ ఇమేజ్ తో మినిమం గ్యారెంటీ హీరోగా ఉన్న నితిన్ (Nithin) ఇప్పుడు వరుస ప్లాపులతో డీలా పడ్డాడు. అయినా సినిమాలకి గ్యాప్ ఇవ్వకుండా వరుస ప్రాజెక్టులను లైన్లో పెట్టాడు. ఈ క్రమంలో నితిన్ హీరోగా ఓ క్రేజీ ప్రాజెక్టును మొదలుపెట్టాడు. పైగా ఈ సినిమాను నేచురల్ స్టార్ నాని (Nani) నిర్మిస్తున్నాడు. తన సొంత నిర్మాణ సంస్థ 'యునానిమస్ ప్రొడక్షన్స్' (Unanimous Productions) బ్యానర్‌పై నిర్మిస్తున్న రెండో ప్రాజెక్ట్‌ను తాజాగా మొదలవగా, నితిన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా యొక్క టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ రివీల్ చేస్తూ, ఇంట్రో గ్లింప్స్ ని విడుదల చేసారు మేకర్స్.
ఇక విడుదల చేసిన టైటిల్ అనౌన్స్‌మెంట్ వీడియో కేజ్రీగా ఉండి అంచనాలను పెంచేస్తుంది. ఈ సినిమాకు "అలియాస్ రుక్మిణీ" (Alias Rukmini) అనే టైటిల్ ఫిక్స్ చేయగా, కథా నేపధ్యాన్ని, హీరో క్యారెక్టరైజేషన్ ను డిఫరెంట్ గా ప్రెజెంట్ చేసిన విధానం ఆడియన్స్ ను ఆకట్టుకుంటుంది. అయితే ఈ వీడియోని బట్టి ఇందులో నితిన్ 'కృష్ణ' అనే పదో తరగతి లెక్కల మాస్టర్ గా కనిపించనున్నట్టు, అలాగే నవలా రచయితగా సినిమాలో కనిపించబోతున్నట్టు తెలుస్తుంది. దర్శకుడు మురళీ కాంత్ నెరేషన్ తో ప్రారంభమైన ఈ వీడియో లో 'రుక్మిణీ' అనే కలం పేరుతో రాసిన రొమాంటిక్ నవలలు, వాటి విజువల్స్ తో పాటు, నాని తన వాయిస్ ఓవర్ తో నేరేషన్ లోకి ఎంటర్ అయి "అసలు ఎవరు ఈ రుక్మిణీ?" అంటూ ప్రశ్నించగా, దానికి కృష్ణ (నితిన్) స్పందిస్తూ.. "రుక్మిణీ నా భార్య" అని చెప్పిన తీరు బాగుంది.
ఇక నాని నిర్మిస్తున్న ఈ మూవికీ విజయ్ బుల్గానిన్ (Vijay Bulganin) సంగీతం అందిస్తున్నాడు. ఇక లాస్ట్ ఇయర్ 'దండోరా' సినిమాతో దర్శకుడిగా సత్తా చాటిన యంగ్ డైరెక్టర్ "మురళీ కాంత్ దేవాసోత్ (Muralikanth devasoth) ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నాడు. మరి వరుస ప్లాపుల్లో మునిగిపోయి ఉన్న నితిన్ ఈ సినిమాతో స్ట్రాంగ్ కం బ్యాక్ ఇస్తాడో లేడో తెలియాలంటే మరి కొన్ని నెలలు వెయిట్ చేయాలి.