Kantara Chapter 1 Movie Review
రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన కాంతారా చాప్టర్ 1 ఆడియన్స్ నుండి యావరేజ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. నటన పరంగా నటీనటులు హీరో మొదలుకొని హీరోయిన్ విలన్ సహా అందరూ అద్భుతంగా నటించారు. అయితే దర్శకుడు రిషబ్ శెట్టి ఈసారి స్క్రీన్ ప్లే విషయంలో తడబడ్డారు. కథ విషయంలో ఇంకాస్త శ్రద్ధ పెట్టాల్సింది. అయితే సాంకేతిక నాణ్యత మరియు యాక్షన్ డిజైన్ లో మేకర్స్ శ్రమ అద్భుతంగా ఉంది. కానీ భావోద్వేగ లోతు మరియు కథనంలో తడబడింది. అజనీష్ లోకనాథ్ సినిమాని తన మ్యూజిక్ తో నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లాడు. అయితే ఫిక్షనల్ చారిత్రాత్మక సబ్జెక్టు కాబట్టి ఆడియన్స్ కనెక్ట్ అవుతారు. కానీ కథలో కొత్తదనం కోరుకునే ఆడియన్స్ కి అంతగా కనెక్ట్ అవకపోవచ్చు.
Hit
Kantara Chapter 1 Movie Review
By Filmi Beat
రిషబ్ శెట్టి నటించి నిర్మించిన కాంతార సినిమా ఎలాంటి అంచనాలు లేకుండా గొప్ప థ్రిల్ తో పాటు ఓ డివైన్ ఫ్యాక్టర్‌ను అందించిన చిత్రంగా నిలిచింది. ఆ సినిమా ఊహించని విజయం సాధించడంతో కాంతార చాప్టర్ 1 మూవీపై అంచనాలు భారీగా పెరిగాయి. అలాంటి అంచనాలు అందుకోవడం దర్శకుడు రిషబ్ శెట్టికి పెద్ద సవాలే ముందు నిలిచింది. అయితే ఈ ఛాలెంజ్‌ను సరియైన రీతిలో తీసుకొని చక్కటి ఫీల్‌తో సినిమాను అందించారు. రుక్మిణి వసంత్ సహా, జయరాం, గుల్షన్ దేవయ్య వారి పాత్రల్లో నటించి మెప్పించారు. చాలా లోపాలు నేరేషన్ పరంగా ఉన్నప్పటికీ.. వాటిని కప్పిపుచ్చేలా కమర్షియల్ హంగులు దట్టించి సినిమాను క్లీన్‌గా అందించాడు. భారీ అంచనాలు లేకుండా వెళితే.. మంచి సినిమాను చూశామనే తృప్తి, అనుభూతితో బయటకు రావొచ్చు. కాంతార ప్రీక్వెల్ సగటు ప్రేక్షకుడికి ఫుల్ మీల్స్ లాంటి సినిమా.
Above Average
Kantara Chapter 1 movie Review
రిషబ్ శెట్టి నటించి దర్శకత్వం వహించిన కాంతారా చాప్టర్ 1 మూవీ దసరా కానుకగా పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ అయి అన్ని రకాల ఆడియన్స్ ని మెప్పించింది. ఇక రిషబ్ శెట్టి తన పాత్రలో అద్భుతంగా నటించి మెప్పించగా, హీరో పాత్రకేమాత్రం తగ్గకుండా రుక్మిణి వసంత్ తన పాత్రలో నటించి మెప్పించింది. గుల్షన్ దేవయ్య క్యారెక్టర్ కాస్త వెరైటీగా ఉంది. జయరామ్ కూడా తన పాత్రలో మెప్పించారు. అజినీష్ లోక్‌నాథ్ మరోసారి తన మ్యూజిక్ తో సినిమాని నిలబెట్టారు. ఓవరాల్‌గా కాంతారలో నటుడిగా, దర్శకుడిగా రిషబ్ శెట్టి సూపర్ హిట్ అయ్యారు. కానీ ఈ చాప్టర్ 1 విషయానికొస్తే ఫస్ట్ పార్ట్ రేంజ్‌లో డైరెక్టర్‌గా ఆయన మెప్పించలేదేమో అనిపించింది. కానీ యాక్టర్‌గా మాత్రం మరోసారి ఇరగదీశారు. అలా అని ఇది బాలేదా అంటే బావుంది.. కానీ ఎక్కడో ఆ ఫ్రెష్ ఫీల్ మిస్ అయింది. ఓవరాల్‌గా కాంతార చాప్టర్ 1.. అంచనాలు లేకుండా వెళ్తే ఫుల్లుగా ఎంజాయ్ చేయొచ్చు..!
Above Average
Kantara Chapter 1 Movie Review
By 123telugu
రిషబ్ శెట్టి ప్రధాన పాత్రలో నటించిన కాంతారా చాప్టర్ 1 ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ అందుకుంది. డివోషనల్ టచ్ తో వైల్డ్ యాక్షన్ అండ్ గ్రాండియర్ విజువల్స్ తో వచ్చిన ఈ ‘కాంతార: చాప్టర్ 1’లో.. భారీ యాక్షన్ సీక్వెన్సెస్ తో పాటు ఫీల్ గుడ్ ఎమోషన్స్ కూడా చాలా బాగున్నాయి. ముఖ్యంగా రిషిబ్ శెట్టి పవర్ ఫుల్ నటన మరియు దర్శకత్వం, మొత్తం సాంకేతిక విభాగం నుంచి అందిన మంచి పనితనం.. మొత్తం సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అలాగే రుక్మిణి వసంత్ పెర్ఫార్మన్స్ కూడా సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కానీ, ఒకటి రెండు సన్నివేశాలు రోటీన్ గా సాగడం కాస్త మైనస్ అయింది. అయినప్పటికీ, రిషిబ్ శెట్టి తన నటనతో, కాంతార ఇమేజ్ తో ఈ సినిమాని మరో లెవల్ కి తీసుకు వెళ్లారు. ఓవరాల్ గా ఈ చిత్రం కాంతార అభిమానులతో పాటు మిగిలిన అన్ని వర్గాల ప్రేక్షకులను కూడా బాగా అలరిస్తుంది.
Hit
Mass Jathara Movie Review
రవితేజ హీరోగా నటించిన "మాస్ జాతర" సినిమా భానుభోగవరపు డైరెక్షన్ లో తెరకెక్కగా, శ్రీ లీల హీరోయిన్ గా నటించింది. నవంబర్ లో రీలీస్ అయిన ఈ సినిమా ఆడియన్స్ ని అంతగా ఇంప్రెస్ చేయలేదు. ఈ సినిమాతో రవన్న మాస్ కం బ్యాక్ ఇస్తాడనుకున్న ఫ్యాన్స్ ఆశలకు గండి కొట్టాడు డైరెక్టర్. సినిమా మొత్తం రవితేజకి మంచి ఎలివేషన్లు ఉంటాయి. కానీ ఎక్కడా ఆ సీన్స్ కి ఎలివేషన్లకు తగ్గ స్క్రీన్ ప్లే ఉండదు. మొత్తం రవితేజ వన్ మ్యాన్ షోగా సినిమా అనిపిస్తుంది. కానీ రవితేజ క్యారెక్టర్ గుర్తుండదు. ఎందుకంటే సినిమా చూస్తున్నంత సేపు క్రాక్ సినిమా గుర్తొస్తుంది. ప్రతి సీన్ దగ్గరా క్రాక్ సినిమా లాగే సీన్లు ఉంటాయి. ఇక శ్రీలీల సహా అందరికి బలమైన పాత్ర రాసుకోవడంలో విఫలమయ్యాడు డైరెక్టర్. భీమ్స్ తనవరకూ న్యాయం చేసినా, అది సినిమాకు అంతగా హెల్ప్ అవ్వలేదు. ఓవరాల్ గా ఫ్యాన్స్ ని మెప్పించినా, సాధారణ ప్రేక్షకులను ఆకట్టుకోలేదు.
Average
Mass Jathara Movie Review
By Thyview
రవితేజ హీరోగా తనకు అచ్చి వచ్చిన మాస్ జోనర్ లో అలాంటి ఒక పవర్ఫుల్ టైటిల్ తో వచ్చిన సినిమా "మాస్ జాతర". ట్రైలర్ చూసాక ఈసారి రవితేజ మాస్ కం బ్యాక్ పక్కా అని అనుకున్నారు ఫ్యాన్స్. కానీ మూవీ చూసాక ఆడియన్స్ అంచనాలు తారుమారయ్యాయి. మంచి మాస్ సీన్స్ పై ఫోకస్ పెట్టిన డైరెక్టర్ దానికంటే అవసరమైన కథ, కథనాలు రాసుకోవడంలో ఫోకస్ చేయలేదు. సినిమా మొత్తం భారి క్యాస్టింగ్ ఉన్నా, విలన్ సహా ఎవ్వరి పాత్ర కూడా బలంగా అనిపించదు. రవితేజ పాత్రపై మాత్రమే డైరెక్టర్ ఫోకస్ పెట్టాడు. కానీ మూవీ లవర్స్ కి అది సరిపోదు కదా. సినిమాని నడిపించేది కథే. అది రొటీన్ గా ఉన్నపుడు కనీసం స్క్రీన్ ప్లే పైన అయినా ఫోకస్ పెట్టాలి. కానీ దాంట్లోనే దర్శకుడు నెగ్లెట్ చేసాడు. ఓవరాల్ గా మాస్ జాతర రవితేజ ఫ్యాన్స్ కి కిక్ ఇస్తుందేమో గాని, కామన్ ఆడియన్స్ కి అంతగా ఆకట్టుకోలేదు.
Average
Mass Jathara Movie Review
ధమాకా తర్వాత ఆ రేంజ్ సక్సెస్ లేని రవితేజ ఈసారి మాస్ జోనర్ లోనే మాస్ జాతర తో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. భ్నుభోగవరపు డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా అంతగా రెస్పాన్స్ తెచ్చుకోలేకపోయింది. అతను రాసిన కథ, కథనాల్లో అస్సలు కొత్తదనం కనిపించదు. తర్వాత ఏం జరుగుతుందో అనే ఉత్కంఠ అస్సలు క్రియేట్ చేయలేకపోయాడు డైరెక్టర్. ఫస్ట్ సీన్ నుంచి లాస్ట్ సీన్ వరకూ ఏం జరుగుతుందో ప్రేక్షకులు ఇట్టే ఊహించగలరు. ఎప్పట్లాగే పాటలకు, డ్యాన్సులకు, హీరో హీరోయిన్లు మాత్రం ఎంటర్టైన్ చేసారు. అయితే టీజర్, ట్రైలర్‌లో చూపించినట్టే, పాత సినిమాల రిఫరెన్సులతో ఇద్దరి మధ్య లవ్ ట్రాక్ నడిపి, నవ్విద్దామని అనుకున్నాడు భాను. రాజేంద్ర ప్రసాద్, నరేష్, ప్రవీణ్ వంటి ఇతర సీనియర్ నటులు తమ నటనతో మెప్పించారు. సినిమాటోగ్రఫీ బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్‌గా ఉన్నాయి. ముఖ్యంగా యాక్షన్ ఎపిసోడ్స్ బాగున్నాయి. కొన్ని ఫైట్స్ ‘క్రాక్’ మూవీని గుర్తుకు తెస్తాయి. ఓవరాల్‌గా రవితేజ నుంచి రెగ్యులర మాస్ రాజా మార్క్ కమర్షియల్ ఎంటర్‌టైనర్ ‘మాస్ జాతర’.
Average
Mass Jathara Movie Review
By TV9 Telugu
రవితేజ హీరోగా భానుభోగవరపు దర్శకత్వంలో తెరకెక్కిన మాస్ జాతర మూవీ నవంబర్ లో రిలీజ్ అయింది. అయితే ఆడియన్స్ ఆశించిన రేంజ్ లో టాక్ రాలేదు. టెక్నికల్ గా సినిమాలో అడవివరం స్టేషన్, లొకేషన్లు, నైట్ షూట్, జాతర ఎపిసోడ్స్ ని బాగా డీల్ చేశారు డైరక్టర్. కానీ వాటి మీద ఫోకస్ పెట్టి కథ, స్క్రీన్ ప్లే విషయంలో తడబడ్డారు. రవితేజ మార్క్ హిట్ సినిమాల తాలూకు స్పెషల్ అంశాలు చాలా చోట్ల గుర్తుకొస్తాయి. కానీ అవి కామన్ ఆడియన్స్ కి అంతగా నచ్చలేదు. పలు సన్నివేశాల్లో బలం లేకపోయినా హుషారైన నేపథ్య సంగీతంతో వాటిని రక్తికట్టించే ప్రయత్నం చేశారు భీమ్స్. యాక్షన్ ఎపిసోడ్స్ గగుర్పొడిచేలా ఉన్నాయి. ఫస్టాఫ్ లో ఉన్న ఫ్లో, సెకండ్ హాఫ్లోనూ ఉండుంటే బావుండేది. సన్నివేశాలన్నీ అక్కడక్కడే తిరుగుతున్నట్టు అనిపించేసరికి కొన్ని సందర్భాల్లో ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టినట్టు అయింది. మొత్తానికి మాస్ మహరాజ్ ఫ్యాన్స్ కి ట్రీట్ ఈ సినిమా. కానీ బాక్స్ ఆఫీస్ వద్ద సాధారణ ప్రేక్షకులకు కనెక్ట్ అవలేదు.
Average
Mass Jathara Movie Review
By ABP Desam
రవితేజ హీరోగా శ్రీలీల హీరోయిన్ గా నటించిన మాస్ జాతర భానుభోగవరపు దర్శకత్వంలో తెరకెక్కింది. థియేటర్లలో ఈ సినిమా ఎక్స్పెక్టేషన్స్ ని రీచ్ కాలేదు. సినిమాలో రవితేజ నటన కంటే పాటల్లో గ్లామర్ హైలైట్ అయ్యేలా ఉంది. ముఖ్యంగా 'సూపర్ డూపర్ హిట్ సాంగ్' లో మరీ సన్నగా కనిపించారు. వన్ మ్యాన్ షో గా సినిమాని నడిపించారు మాస్ రాజా. శివుడిగా నవీన్ చంద్ర విలనిజం అతని కెరీర్ బెస్ట్ పెర్ఫార్మన్స్‌లలో ఒకటిగా నిలుస్తుంది. ఇటువంటి క్యారెక్టర్లు చేయడం రాజేంద్ర ప్రసాద్‌కు కొత్త కాదు. హైపర్ ఆది, వీటీవీ గణేష్, అజయ్ ఘోష్ మధ్యలో కొంత నవ్వించే ప్రయత్నం చేశారు. మురళీ శర్మ, నవ్య స్వామి, సముద్రఖని తదితరులు కనిపించారు. రవితేజ కటౌట్‌కు తగ్గ యాక్షన్ కొరియోగ్రఫీ కుదిరిన సినిమా 'మాస్ జాతర'. ఫైట్స్ ఒక్కటే చాలు, కథతో సంబంధం లేదనుకునే ప్రేక్షకులు - రవితేజ డై హార్డ్ ఫ్యాన్స్ ఎటువంటి అంచనాలు పెట్టుకోకుండా సినిమాకు వెళ్ళవచ్చు. ఇదొక రెగ్యులర్ కమర్షియల్ సినిమా అంతే.
Average
Mass Jathara Movie Review
By Filmi Beat
మాస్ మహారాజ్ రవితేజ హీరోగా భానుభోగవరపు డైరెక్షన్ లో నటించిన సినిమా "మాస్ జాతర". శ్రీలీల హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ఆడియన్స్ నుండి ఆశించిన రెస్పాన్స్ తెచ్చుకోలేదు. ప్రమోషన్స్ లో ఓ రేంజ్ లో ఉంటుందని మేకర్స్ చెప్పినట్టు, ఇందులో సగం కూడా ఆడియన్స్ కి ఆకట్టుకునేలా సీన్స్ లేవు. ఓవరాల్‌గా మాస్ జాతర గురించి చెప్పాలంటే.. రవితేజ మార్క్ మాస్, యాక్షన్ థ్రిల్లర్. మాస్ ఆడియెన్స్‌కు మాస్ మహారాజ్, శ్రీలీల కాంబో అలరించే అవకాశం ఉంది. కేవలం రవితేజ, శ్రీలీల ఫ్యాన్స్‌కు నచ్చే అంశాలతో రూపొందించిన కమర్షియల్ ఎంటర్‌టైనర్. ఎలాంటి అంచనాలు లేకుండా వెళ్తే టైంపాస్ చేసే సినిమా. కథ, కథనాలపై ఇంకాస్త దృష్టి పెట్టి ఉంటే.. ఇంకా బెటర్ రిజల్డ్ వచ్చి ఉండేదనిపిస్తుంది. రెగ్యులర్ ఆడియెన్స్ ఓ సారి ఈ సినిమాపై లుక్కేయండి.
Average
Mass Jathara Movie Review
By Great Andhra
మాస్ మహారాజ్ రవితేజ హీరోగా భానుభోగవరపు డైరెక్షన్ లో నటించిన సినిమా "మాస్ జాతర". నవంబర్ లో థియేటర్లో రిలీజ్ అయిన ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటించింది. ఇక ఈ సినిమా ఒక పవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కగా, థియేటర్లలో నెగిటివ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. రవితేజ వన్ మ్యాన్ షో తో ఈ సినిమాని నడిపించాడు గాని, దర్శకుడు భాను భోగవరపు సరైన కథ, కథనాలు రాసుకోవడంలో విఫలమయ్యాడు. రొటీన్ స్క్రీన్ ప్లే తో ఆడియన్స్ కి బోర్ కొట్టించాడు. ఫ్యాన్స్ కి బాగా నచ్చుతుంది కానీ, కామన్ ఆడియన్స్ సహనానికి పరీక్ష పెడుతుంది ఈ సినిమా. రొటీన్ స్టఫ్ గా ఉన్న మాస్ జాతర లో మాస్ పల్స్ ఉన్నా వాటికి బలమైన సన్నివేశాలు ఏమి కనిపించవు. థియేటర్ నుంచి బయటికి వచ్చాక రవితేజ గుర్తుంటాడు గాని, పాత్రలు అంతగా గుర్తుకు రావు. ఓవరాల్ గా మాస్ జాతర ఫ్యాన్స్ కి మాత్రమే అని చెప్పాలి.
Average
Mass jathara movie Review
By NTV Telugu
'భానుభోగవరపు డైరెక్షన్ లో మాస్ మహారాజ్ రవితేజ నటించిన "మాస్ జాతర" సినిమా నవంబర్ లో థియేటర్లో రిలీజ్ అయింది. రవితేజ తనకు కలిసొచ్చిన మాస్ జోనర్ లో పవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఆడియన్స్ నుండి మిశ్రమ స్పందన తెచ్చుకుంది. రవితేజ వన్ మ్యాన్ షో తో ఈ సినిమాని నడిపించాడు. మాస్ మహారాజ్ ఫ్యాన్స్ కి మంచి కిక్ ఇస్తుంది ఈ సినిమా. కానీ కొత్తదనం లేని కథ, కథనాలతో డైరెక్టర్ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయలేకపోయాడు. సినిమాలో భారీ కాస్టింగ్ తో నింపినా రవితేజకి మినహా ఎవరికీ బలమైన పాత్ర లభించలేదు. అన్ని సన్నివేశాలు కూడా ఊహాజనితంగా ఉండడం వల్ల సామాన్య ప్రేక్షకులకి ఎంజాయ్ చేసిన ఫీలింగ్ ఉండదు. కానీ ఓటిటి లో మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటుంది. ఓవరాల్ గా స్క్రీన్ ప్లే లోపం వల్ల, రొటీన్ కథ వల్ల అంతగా ఇంప్రెస్ చేయలేదు, కానీ రవితేజ కోసం రెగ్యులర్ ఆడియన్స్ ఒకసారి మాస్ జాతరని చూడొచ్చు.
Average