Register as a Reviewer
Home Reviews Media Reviews

Media Reviews

Reviews from top media outlets, YouTube channels, and publications

937
Total Reviews
Showing 697–708 of 937 media reviews
అయలాన్ (Ayalaan)

Ayalaan Movie Review

A

By AP7AM

శివ కార్తికేయన్ హీరోగా నటించిన అయలాన్ సినిమా కోసం అనుకున్న లైన్ బాగుంది. ప్రధానమైన పాత్రలను డిజైన్ చేసుకున్న తీరు కూడా బాగుంది. అయితే సరైన సన్నివేశాలను డిజైన్ చేసుకోవడమే ఆశించిన స్థాయిలో జరగలేదనిపిస్త...

శివ కార్తికేయన్ హీరోగా నటించిన అయలాన్ సినిమా కోసం అనుకున్న లైన్ బాగుంది. ప్రధానమైన పాత్రలను డిజైన్ చేసుకున్న తీరు కూడా బాగుంది. అయితే సరైన సన్నివేశాలను డిజైన్ చేసుకోవడమే ఆశించిన స్థాయిలో జరగలేదనిపిస్తుంది. ఈ కారణంగానే యాక్షన్ .. ఎమోషన్ .. కామెడీ కనెక్ట్ కాలేదని చెప్పచ్చు. నీరవ్ షా ఫొటోగ్రఫీ .. ఏఆర్ రెహ్మాన్ సంగీతం .. రూబెన్ ఎడిటింగ్ ఫరవాలేదనిపిస్తాయి. ఇక ప్రధానమైన పాత్రలను పోషించిన ఆర్టిస్టులంతా తమ పాత్రలకు న్యాయం చేశారు. ఓవరాల్ గా ఏలియన్ తో కలిసి హీరో చేసే హంగామాగా మాత్రమే ఈ సినిమా కనిపిస్తుంది. ఆ దారిలో వెళ్లాలనుకున్నప్పుడు కామెడీ సీన్స్ కాస్త బలంగా రాసుకోవలసింది. కామెడీ వర్కౌట్ కాకపోగా లవ్ .. యాక్షన్ .. ఎమోషన్స్ కూడా కనెక్ట్ కాలేదు. వినోదం పరంగా పిల్లలను అలరిస్తుందని మాత్రం చెప్పచ్చు.

5.0
out of 10

Average

అయలాన్ (Ayalaan)

Ayalaan movie Review

తమిళ స్టార్ శివ కార్తికేయన్ హీరోగా నటించిన అయలాన్ సినిమా ఒక ఏలియన్ బేస్డ్ కాన్సెప్ట్ తో తెరకెక్కగా, రెండేళ్ల కిందటే విడుదల కావాల్సిన సినిమా తెలుగులో థియేట్రికల్ రిలీజ్ కి నోచుకోలేదు. తమిళ్ లో విడుదలై...

తమిళ స్టార్ శివ కార్తికేయన్ హీరోగా నటించిన అయలాన్ సినిమా ఒక ఏలియన్ బేస్డ్ కాన్సెప్ట్ తో తెరకెక్కగా, రెండేళ్ల కిందటే విడుదల కావాల్సిన సినిమా తెలుగులో థియేట్రికల్ రిలీజ్ కి నోచుకోలేదు. తమిళ్ లో విడుదలై యావరేజ్ గా ఆడగా, ఎన్నో అవాంతరాలు దాటుకుని, ఎట్టకేలకు తెలుగులో ఆహాలో తాజాగా స్ట్రీమింగ్ కి వచ్చేసింది. ఇక ఓవరాల్ గా అయలాన్ విషయానికి వస్తే... సినిమాలో శివ కార్తికేయన్ పెర్ఫార్మన్స్ బాగుంది. అలాగే మేకర్స్ పెట్టిన ఎఫర్ట్స్, ఒక కొత్త కాన్సెప్ట్ ని ఎక్స్ ప్లోర్ చేయాలనే ప్రయత్నం బాగుంది. ఇందులో కామెడీ, విజువల్స్ అలాగే లీడ్ నటుల పెర్ఫామెన్స్ లు మెప్పిస్తాయి. కానీ ఈ సబ్జెక్టుకి తగ్గట్టుగా ఇంకా బలమైన కథనం ఇందులో యాడ్ చేస్తే బాగుండేది. ఇది మినహా ఈ కొత్త ప్రయత్నం పిల్లలతో కలిసి ఒక్కసారికి అలా సరదాగా ట్రై చేయాలి అనుకుంటే ఆహా లో చూడొచ్చు.

5.0
out of 10

Average

తెలుసు కదా (Telusu Kada)

Telusu Kada Movie Review

Thyview

By Thyview

తెలుసు కదా...మూవీ చూసాక సింపుల్ గా ఒపీనియన్ చెప్పాలంటే డైరెక్టర్ నీరజ కోన ని ముందుగా అప్రిషియేట్ చేయాలి. ఒక ఫిమేల్ డైరెక్టర్ అయ్యుండి, అది కూడా ఫస్ట్ మూవీ అయి ఉండి, మేల్ పాయింట్ అఫ్ వ్యూ బేస్డ్ మూవీని...

తెలుసు కదా...మూవీ చూసాక సింపుల్ గా ఒపీనియన్ చెప్పాలంటే డైరెక్టర్ నీరజ కోన ని ముందుగా అప్రిషియేట్ చేయాలి. ఒక ఫిమేల్ డైరెక్టర్ అయ్యుండి, అది కూడా ఫస్ట్ మూవీ అయి ఉండి, మేల్ పాయింట్ అఫ్ వ్యూ బేస్డ్ మూవీని ఇంత చక్కగా హ్యాండిల్ చేయడం మాములు విషయం కాదు. సినిమా వరకు అంతా బాగానే ఉన్నా ఎక్కడో ఏదో మిస్ అయినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఓల్డ్ మూవీస్ లో ఉన్న ట్రైయాంగిల్ లవ్ స్టోరీని ఇప్పటి జనరేషన్ కి మార్చి చెప్పినట్టు ఉంది. కాకపోతే అడ్వాన్స్డ్ జెనరేషన్ కి తగ్గట్టు కథని మార్చిన విధానం బాగుంది. బట్ స్క్రీన్ ప్లే కొంచెం స్లో అయి ఆడియన్స్ కి బోర్ ఫీలింగ్ వస్తుంది. అలాగే ట్విస్ట్లు పెద్దగా లేకపోయినా, ఫన్ ఎలిమెంట్స్ కి మూవీ చాలా దూరంగా ఉంది. డైరెక్టర్ కామెడీ విషయంలో ఇంకాస్త ఫోకస్ పెట్టాల్సింది. కానీ వైవా హర్ష కూడా తన రోల్ లో బాగానే నవ్వించాడు. ఇన్ ఫాక్ట్ ఆడియన్స్ కి హీరో రోల్ తర్వాత అంతగా కనెక్ట్ అయ్యేది ఫ్రెండ్ పాత్రనే. ఓవరాల్ గా అన్ని రకాల ఆడియన్స్ కి కనెక్ట్ అవకపోవచ్చు.

6.0
out of 10

Above Average

తెలుసు కదా (Telusu Kada)

Telusu kada Movie Review

Ragadi

By Ragadi

తెలుసు కదా... అంటే తెలిసినట్టుగానే సినిమా మొత్తం ఉంది. సింపుల్ గా ఇద్దరు హీరోయిన్లు, ఒక హీరో.. ట్రయాంగిల్ లవ్ స్టోరీ. పాత చింతకాయ పచ్చడిని ఇప్పటి జనరేషన్ కి తగ్గట్టు మార్చి తీశారు. డైరెక్టర్ గా ఫస్ట్...

తెలుసు కదా... అంటే తెలిసినట్టుగానే సినిమా మొత్తం ఉంది. సింపుల్ గా ఇద్దరు హీరోయిన్లు, ఒక హీరో.. ట్రయాంగిల్ లవ్ స్టోరీ. పాత చింతకాయ పచ్చడిని ఇప్పటి జనరేషన్ కి తగ్గట్టు మార్చి తీశారు. డైరెక్టర్ గా ఫస్ట్ మూవీ యే అయినా నీరజ కొనని ఇలాంటి సబ్జెక్టు హ్యాండిల్ చేసిన విధానంలో అభినందించాలి. ఒక ఫిమేల్ మేల్ పాయింట్ అఫ్ వ్యూ లో సబ్జెక్టు ని బాగానే రాసుకుందంటే చాలా మంచి విషయం. కాకపోతే ఎఫర్ట్ ఎంత పెట్టినా, స్క్రీన్ ప్లే ఎంగేజింగ్ గా లేకపోవడంతో ఆశించిన మేర ఆడియన్స్ అంచనాలను అందుకోలేదు. కానీ టెక్నికల్ గా మూవీ విజువల్స్ బాగున్నాయి. నవీన్‌ ఎడిటింగ్‌ నీట్‌గా ఉంది. సినిమా సీన్ల పరంగా కనెక్ట్ అవుతుంది. కానీ కలిపి చూస్తే రొటీన్ ఫీల్ వస్తుంది. ఓవరాల్ గా ఫ్యామిలీ ఆడియన్స్ కి అయితే సినిమా అంతగా కనెక్ట్ కాదు గాని, కొత్తదనం కోరుకునే ఆడియన్స్ కి ఒక రకంగా మెప్పించొచ్చు.

5.0
out of 10

Average

తెలుసు కదా (Telusu Kada)

Telusu kada Movie Review

తెలుసు కదా అంటూ ఆడియన్స్ ని పలకరించిన సిద్ధూ, కథ మొత్తం ట్రైలర్ లో చెప్పేసి, తెల్సిన కథనే మళ్ళీ మళ్ళీ కొత్తదనం లేనట్టు చేసారు. దర్శకురాలిగా పరిచయమైన నీరజ కోన తన ఎఫర్ట్ బాగానే పెట్టినా, కథనంలో ఆశించిన...

తెలుసు కదా అంటూ ఆడియన్స్ ని పలకరించిన సిద్ధూ, కథ మొత్తం ట్రైలర్ లో చెప్పేసి, తెల్సిన కథనే మళ్ళీ మళ్ళీ కొత్తదనం లేనట్టు చేసారు. దర్శకురాలిగా పరిచయమైన నీరజ కోన తన ఎఫర్ట్ బాగానే పెట్టినా, కథనంలో ఆశించిన మేర అంచనాలను అందుకోలేదు. కానీ టెక్నికల్ గా మూవీ విజువల్స్ బాగున్నాయి. జ్ఞానశేఖర్‌ విజువల్స్ బాగున్నాయి. నవీన్‌ ఎడిటింగ్‌ నీట్‌గా ఉంది. దర్శకురాలు నీరజ కోన ఇలాంటి సబ్జెక్ట్ ని డీల్‌ చేయడం మామూలు విషయం కాదు. చాలా బాగా తెరకెక్కించారు. సినిమాని చాలా క్లాసీగా తీశారు. మాస్‌ ఆడియెన్స్ ని దృష్టిలో పెట్టుకుని కొన్ని ఎలిమెంట్లు జోడిస్తే బాగుండేది. కామెడీ ట్రాక్‌కి ప్రయారిటీ ఇస్తే బాగుండేది. కానీ లేటెస్ట్ ట్రెండ్‌ని ఆవిష్కరించిన తీరు మాత్రం బాగుంది. ఒక లేడీ డైరెక్టర్‌ మేల్‌ పాయింట్‌ ఆఫ్‌ వ్యూలో కథని చెప్పడం, అంతే ఓపెన్‌గా తెరకెక్కించడం ఇందులో హైలైట్‌గా చెప్పొచ్చు. కాకపోతే ఆడియన్స్ కాన్సెప్ట్ విషయంలో కాస్త కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది.

6.0
out of 10

Above Average

తెలుసు కదా (Telusu Kada)

Telusu kada movie Review

స్టార్ బాయ్ సిద్ధూ జొన్నలగడ్డ హీరోగా నటించిన సినిమా తెలుసు కదా. నీరజ కోన దర్శకురాలిగా పరిచయమవుతూ తెరకెక్కించిన ఈ సినిమా ఆడియన్స్ నుండి యావరేజ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. కథ సింపుల్ గా చెప్పాలనుకుంటే... ప...

స్టార్ బాయ్ సిద్ధూ జొన్నలగడ్డ హీరోగా నటించిన సినిమా తెలుసు కదా. నీరజ కోన దర్శకురాలిగా పరిచయమవుతూ తెరకెక్కించిన ఈ సినిమా ఆడియన్స్ నుండి యావరేజ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. కథ సింపుల్ గా చెప్పాలనుకుంటే... పిల్లలు కావాలనుకునే భార్యాభర్తలు, సరోగసీ ద్వారా బిడ్డను అందించడానికి, మాజీ లవర్ రావడం... ఆ తర్వాత ముగ్గురు మధ్య చోటుచేసుకునే పరిస్థితులతో కూడిన ఒక డిఫరెంట్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ అని చెప్పొచ్చు. పెర్ఫార్మన్స్ వరకూ సిద్ధు జొన్నలగడ్డ తన పాత్రలో అదరగొట్టాడు. తనతో పోటీ పడి రాశి, శ్రీనిధి పెర్ఫార్మ్ చేసారని చెప్పాలి. అలాగే కీ రోల్ ప్లే చేసిన వైవా హర్షతో వచ్చే కామెడీ సీన్స్ నవ్విస్తాయి. తమన్ సంగీతం బాగుంది. ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ బాగుంది. డైరెక్టర్ టేకింగ్ ఓకే. కాకపోతే స్క్రీన్ ప్లే స్లోగా సాగడం, ఎండింగ్ ఊహించినంత బెస్ట్ గా లేకపోవడంతో అన్ని వర్గాల ఆడియన్స్ ని ఆకట్టుకోవడం కష్టం.

6.0
out of 10

Above Average

తెలుసు కదా (Telusu Kada)

Telusu Kada Movie Review

దీపావళి స్పెషల్ గా రిలీజ్ అయిన తెలుసు కదా మూవీ థియేటర్లలో మిక్స్డ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. సిద్ధు జొన్నలగడ్డ మెచ్యూర్డ్ పాత్ర చేశాడు. కానీ అతని పాత్రను మరింత బాగా రాసుకుని ఉండాల్సింది. లైఫ్ లో చిల్ అవ...

దీపావళి స్పెషల్ గా రిలీజ్ అయిన తెలుసు కదా మూవీ థియేటర్లలో మిక్స్డ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. సిద్ధు జొన్నలగడ్డ మెచ్యూర్డ్ పాత్ర చేశాడు. కానీ అతని పాత్రను మరింత బాగా రాసుకుని ఉండాల్సింది. లైఫ్ లో చిల్ అవ్వాలనుకునే కేర్ ఫ్రీ గర్ల్ గా శ్రీనిధి శెట్టి బాగానే చేసింది. రాశీ ఖన్నా పాత్ర హుందాగానే సాగినా సెకండ్ హాఫ్ లోని ట్వస్ట్స్ అండ్ టర్న్ ను ఎక్స్ ప్రెస్ చేయడంలో లోటు కనిపించింది. హీరో స్నేహితుడిగా వైవా హర్ష బాగా చేశాడు. అతని పాత్రే సినిమాలో కొంత రిలీఫ్ ను ఇచ్చింది. ఎస్. థమన్ స్వరపర్చిన 'మల్లిక గంథ' సాంగ్ బాగుంది. నేపథ్య సంగీతం గురించి పెద్దంత చెప్పుకోవాల్సిందేమీ లేదు. జ్ఞాన శేఖర్ బాబా సినిమాటోగ్రఫీ కూల్ గా ఉంది. ఓ సాధారణమైన కథను తన స్క్రీన్ ప్లేతో కొత్తగా చూపించడానికి నీరజ కోన ప్రయత్నం చేసింది. కానీ అది కన్ ఫ్యూజన్ కు గురిచేసింది. కథకు తగ్గట్టుగా నిర్మాతలు బాగానే ఖర్చు పెట్టారు. 'తెలుసు కదా' అని హీరో ఎంత చెప్పినా... ఏదో తెలియని భావనే ఆడియెన్ కు కలుగుతుంది.

5.0
out of 10

Average

తెలుసు కదా (Telusu Kada)

Telusu Kada Movie Review

తెలుసు కదా చిత్రంలో దర్శకురాలు నీరజ కోన అనుకున్న విధంగా స్టోరీని ఆడియన్స్ కి చెప్పాలని ట్రై చేసినా, చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. మూవీ స్లో గా రన్ అవుతున్నట్లుగా ఉంటుంది. కానీ రన్‌టైమ్ కూడా ఎ...

తెలుసు కదా చిత్రంలో దర్శకురాలు నీరజ కోన అనుకున్న విధంగా స్టోరీని ఆడియన్స్ కి చెప్పాలని ట్రై చేసినా, చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. మూవీ స్లో గా రన్ అవుతున్నట్లుగా ఉంటుంది. కానీ రన్‌టైమ్ కూడా ఎక్కువగా లేదు. అయితే ఈ మధ్య వయలెన్స్, బ్లడ్ బాత్ సినిమాలకి ఎక్కువగా అలవాటు అయిపోయిన ఆడియన్స్‌కి ఇలాంటి స్లో నెరేషన్ కాస్త ఇబ్బందిగా అనిపించినా, ఫీల్ గుడ్ మూవీస్ ఆడియన్స్ చూసే ఆడియన్స్ కి నచ్చవచ్చు. ఇక థమన్ చాలా రోజుల తర్వాత మంచి క్లాసిక్ సాంగ్స్, ఫీల్ గుడ్ బీజీఎమ్ ఇచ్చాడు. అలానే సొగసు చూడతరమా పాట కూడా కొన్నాళ్లు వినపడుతుంది. సినిమాటోగ్రఫీ పనితనం కూడా బావుంది. స్క్రీన్ ప్లే బలంగా లేకపోవడం వల్ల రెగ్యులర్ ఆడియన్స్ కనెక్ట్ అవడం కష్టం.

4.0
out of 10

Below Average

తెలుసు కదా (Telusu Kada)

Telusu kada movie Review

స్టార్ బాయ్ సిద్ధూ జొన్నలగడ్డ హీరోగా నటించిన తెలుసు కదా మూవీ దీపావళి స్పెషల్ గా రిలీజ్ అవగా, ఆడియన్స్ నుండి మిక్స్డ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. ఈ సినిమాను లేడీ డైరెక్టర్ నీరజ కోన డైరెక్ట్ చేయగా, రాశి ఖన్...

స్టార్ బాయ్ సిద్ధూ జొన్నలగడ్డ హీరోగా నటించిన తెలుసు కదా మూవీ దీపావళి స్పెషల్ గా రిలీజ్ అవగా, ఆడియన్స్ నుండి మిక్స్డ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. ఈ సినిమాను లేడీ డైరెక్టర్ నీరజ కోన డైరెక్ట్ చేయగా, రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి హీరోయిన్లుగా నటించారు. ట్రైయాంగిల్ లవ్ స్టోరీ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీలో ముగ్గురూ పోటీ పడి నటించారు. వీళ్ళతో పాటు వైవా హర్ష రోల్ కూడా బాగుంది. అయితే కథ పరంగా పాత సినిమాలనే అడ్వాన్స్డ్ జెనరేషన్ కి తగ్గట్టుగా తీసినట్టుంది. కాకపోతే స్క్రీన్ ప్లే విషయంలో ఇంకాస్త శ్రద్ధ పెట్టాల్సింది. ఆడియన్స్ ని కన్ఫ్యూజ్ చేసేలా కథనం సాగింది. ఇలాంటి కాన్సెప్ట్ చాలా మంది కనెక్ట్ అయ్యే అవకాశం ఉన్నా, దర్శకురాలు సీన్స్ ని ఎంగేజింగ్ గా హ్యాండిల్ చేయలేకపోయారు. సిద్ధూ ఫ్యాన్స్ కి అయితే కనెక్ట్ అవుతుంది. సాధారణ ప్రేక్షకులు ఒకసారి వీలైతే చూడొచ్చు.

5.0
out of 10

Average

కాంతారా చాప్టర్ 1 (Kantara Chapter 1)

Kantara Chapter 1 Movie Review

Thyview

By Thyview

కన్నడ స్టార్ రిషబ్ శెట్టి హీరోగా స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన మూవీ "కాంతార: చాప్టర్-1". ఫస్ట్ పార్ట్ ఎక్కడైతే ఫినిష్ అయిందో అక్కడ్నుంచే సెకండ్ పార్ట్ మొదలవుతుంది. స్టోరీ నార్మల్ గా ఉన్నా కూడా డైరెక...

కన్నడ స్టార్ రిషబ్ శెట్టి హీరోగా స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన మూవీ "కాంతార: చాప్టర్-1". ఫస్ట్ పార్ట్ ఎక్కడైతే ఫినిష్ అయిందో అక్కడ్నుంచే సెకండ్ పార్ట్ మొదలవుతుంది. స్టోరీ నార్మల్ గా ఉన్నా కూడా డైరెక్టర్ గా రిషబ్ శెట్టి ఇంట్రెసింగ్ గా మలచడంలో అద్భుతమైన పాత్ర వహించాడు. హీరోగా కంటే డైరెక్టర్ గా తన ఎఫర్ట్స్ ని మెచ్చుకుని తీరాలి. రిషబ్ మాత్రమే కాదు ప్రొడ్యూసర్స్ నుండి టెక్నిషియన్స్ లో మ్యూజిక్ డైరెక్టర్ అజనీష్ లోకనాథ్ రాకింగ్ మ్యూజిక్ అండ్ బీజీఎమ్, ఎడిటింగ్, సినిమాటోగ్రఫి, కెమెరా వర్క్ విజువల్స్ గా అన్ని బాగున్నాయి. ఇక డివోషనల్ టచ్ తో కూడిన ఈ సినిమా అన్ని రకాల ఆడియన్స్ ని మెప్పిస్తుందని చెప్పాలి. క్లైమాక్స్ లో రిషబ్ మాత్రమే కాకుండా రుక్మణి వసంత్ రోల్ కి ఫిదా అయిపోతారు ఆడియన్స్. ఇక క్లైమాక్స్ కూడా రెండో పార్ట్ గురించి వెయిట్ చేసేలా చేస్తుంది. ఓవరాల్ గా మస్ట్ వాచబుల్.

7.0
out of 10

Hit

కాంతారా చాప్టర్ 1 (Kantara Chapter 1)

Kantara chapter 1 movie Review

కన్నడ స్టార్ రిషబ్ శెట్టి హీరోగా స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన "కాంతార: చాప్టర్-1" మంచి రెస్పాన్స్ అందుకుంది. సినిమాకి నటనాపరంగానే కాదు రిషబ్ శెట్టి టీమ్ ప్రతి టెక్నీషియన్ ది బెస్ట్ ఇచ్చారు. అజనీష్...

కన్నడ స్టార్ రిషబ్ శెట్టి హీరోగా స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన "కాంతార: చాప్టర్-1" మంచి రెస్పాన్స్ అందుకుంది. సినిమాకి నటనాపరంగానే కాదు రిషబ్ శెట్టి టీమ్ ప్రతి టెక్నీషియన్ ది బెస్ట్ ఇచ్చారు. అజనీష్ లోక్ నాథ్ నేపథ్య సంగీతంలో విజృంభించాడు. పాటలకు ఇందులో పెద్దగా ప్రాధాన్యం లేదు గాని బీజీఎమ్ నెక్స్ట్ లెవెల్ లో ఉంది. అరవింద్ కశ్యప్ ఛాయాగ్రహణం అత్యున్నత స్థాయిలో సాగింది. ఆర్ట్ డిపార్ట్మెంట్ కృషి గురించి ఎంత చెప్పినా తక్కువ. హోంబలే ఫిలిమ్స్ ప్రొడక్షన్ వాల్యూస్ గొప్పగా ఉన్నాయి. ఇక తనకు సమకూరిన వనరులన్నింటినీ గొప్పగా ఉపయోగించుకుంటూ రైటర్ కమ్ డైరెక్టర్ రిషబ్ శెట్టి పడ్డ కష్టం గురించి ఎంత చెప్పినా తక్కువే. కథాకథనాల్లో.. సన్నివేశాల్లో కొంచెం గందరగోళం ఉండొచ్చు. ప్రథమార్ధంలో కాస్త బోర్ కొట్టించి ఉండొచ్చు. కానీ ఇలాంటి విభిన్నమైన కథను తెరపైకి తీసుకురావడంలో రిషబ్ పడ్డ కష్టాన్ని అతడి తపనను ఎంత కొనియాడినా తక్కువే. ప్రేక్షకులకు విజువల్స్ రూపంలో పరంగా గొప్ప అనుభూతిని పంచడానికి అతను పెట్టిన ఎఫర్ట్ గొప్పది.

7.0
out of 10

Hit

కాంతారా చాప్టర్ 1 (Kantara Chapter 1)

Kantara Chapter 1 Movie Review

పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన 'కాంతార చాప్టర్ 1' మూవీ భారీ బడ్జెట్ తో తెరకెక్కగా, రిషబ్ శెట్టి నటించి స్వీయ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా దసరా కానుకగా...

పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన 'కాంతార చాప్టర్ 1' మూవీ భారీ బడ్జెట్ తో తెరకెక్కగా, రిషబ్ శెట్టి నటించి స్వీయ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా దసరా కానుకగా రిలీజై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. సినిమా పరంగా తొలి సగంలో కొంత సాగదీసినట్లు అనిపించినా, సెకండ్ హాఫ్ మాత్రం వేగం పుంజుకుని, ముఖ్యంగా క్లైమాక్స్‌లో ప్రేక్షకులకు గూస్ బంప్స్ ఇచ్చే అనుభూతిని అందించిందనడంలో సందేహం లేదు. రిషబ్ శెట్టి నటన, సెకండ్ హాఫ్ కథనం, క్లైమాక్స్, ఇవన్నీ ఆడియన్స్ ని మెప్పిస్తాయి. సాంకేతిక విలువల పరంగానూ సంగీతం, ఆర్ట్, సినిమాటోగ్రఫీ కూడా బాగున్నాయి. భారీ అంచనాల కారణంగా 'కాంతార' చూసిన ఫీలింగ్ కలగకపోయినా, రిషబ్ శెట్టి వన్ మ్యాన్ షో, అద్భుతమైన సాంకేతిక విలువలు, సెకండ్ హాఫ్ కథనం కోసం ఈ సినిమాను ఒకసారి తప్పక చూడొచ్చు.

7.0
out of 10

Hit

Why MRO?