Register as a Reviewer
Home Latest Movie Reviews

Latest Movie Reviews

The most recent reviews from top critics and publications

1867 Reviews
Showing 121–132 of 1867 reviews

418 movie Review

418 (#418) 2026 Website
విమ్స్‌ మెడికల్‌ కాలేజ్‌లో పాడుబడ్డ ఓ హాస్టల్‌ అది. 15 ఏళ్ల తర్వాత దాన్ని తెరవడం.. అందులోని ఓ గదిలో ఆత్మ.. దానికో కథ ఇది సింపుల్‌గా ఈ సినిమా స్టోరీ. ఆరుగురు మరణంతో మొదలైన కథ దానికి ముందు ఏం జరిగిందనే...

విమ్స్‌ మెడికల్‌ కాలేజ్‌లో పాడుబడ్డ ఓ హాస్టల్‌ అది. 15 ఏళ్ల తర్వాత దాన్ని తెరవడం.. అందులోని ఓ గదిలో ఆత్మ.. దానికో కథ ఇది సింపుల్‌గా ఈ సినిమా స్టోరీ. ఆరుగురు మరణంతో మొదలైన కథ దానికి ముందు ఏం జరిగిందనే ఆసక్తి కలగజేస్తుంది. అక్కడి నుంచి కథ ఆ హాస్టల్‌కి వచ్చిన నలుగురు కుర్రాళ్ల చుట్టూ తిరుగుతుంది. 417 గదిలో వివేక్‌ కు ఎదురైన సంఘటనలు మరింత ఉత్కంఠకు గురిచేస్తాయి. విరామం తర్వాత యక్షగాన కళాకారిణి దేవిక తెరపైకి వస్తుంది. ఆమె కళను వదిలి పెళ్లి చేసుకోవడం, పిల్లల్ని కనాలనుకోవడం వంటి సన్నివేశాలను హృద్యంగా తెరకెక్కించారు. 


సినిమాలో హారర్‌ ఎలిమెంట్స్‌ను బాగా రాసుకున్నారు. కానీ.. మిగతా కథను తెరపై ఆవిష్కరించడంలో డైరెక్టర్ తడబడ్డాడు. సినిమా ప్రారంభం నుంచి విరామం తర్వాత 20 నిమిషాల వరకూ ఒక ఫ్లోలో నడిచిన కథ.. 418 గది ఓపెన్‌ చేయాలనే ప్రయత్నం చేసే సమయానికి గజిబిజి అయిపోయింది. సీన్‌కి సీన్‌కి పొంతన లేకుండా పోయింది. ఏవేవో సీన్స్‌ వస్తాయి... కన్‌ఫ్యూజ్‌ చేస్తుంటాయి. అయితే హారర్‌ సినిమాల కథలు దాదాపుగా ఇదే యాంగిల్‌లో ఉంటాయి. దానిని తెరపై ఎంత ఉత్కంఠగా చూపించాం అన్నది ముఖ్యం. దర్శకుడు కీర్తన్‌ నాదగౌడ ప్రతి సీన్‌లోనూ ఉత్కంఠ క్రియేట్‌ చేశాడు. కానీ.. చెప్పాలనుకున్నది మాత్రం స్ట్రెయిట్‌గా చెప్పలేకపోయాడు. కన్‌ప్యూజ్‌ చేశాడు. మొత్తం మీద హారర్‌ సినిమాలను ఇష్టపడేవారికి ఓ మాదిరి నచ్చే ఆస్కారం ఉంది.


ట్యాగ్‌లైన్‌: వణుకు పుట్టించే గది!

5.0
out of 9
2 weeks ago
Oct 23, 2026 Telugu

418 Movie Review

418 (#418) 2026 News Channel
Sakshi

By Sakshi

ప్రశాంత్ నీల్ సమర్పణలో, మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన లేటెస్ట్ హారర్ థ్రిల్లర్ '#418' ఈరోజే థియేటర్లలోకి వచ్చింది. కరోనా లాక్‌ డౌన్ తర్వాత వేదగిరి మెడికల్ కాలేజ్ బాయ్స్ హాస్టల్‌లోని రూమ్ నెం. 418 చుట...

ప్రశాంత్ నీల్ సమర్పణలో, మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన లేటెస్ట్ హారర్ థ్రిల్లర్ '#418' ఈరోజే థియేటర్లలోకి వచ్చింది. కరోనా లాక్‌ డౌన్ తర్వాత వేదగిరి మెడికల్ కాలేజ్ బాయ్స్ హాస్టల్‌లోని రూమ్ నెం. 418 చుట్టూ తిరిగే ఒక వింత రహస్యం, గజ్జల శబ్దాల నేపథ్యంతో ఈ కథ సాగుతుంది. రొటీన్ హారర్ టెంప్లేటే అయినా, ఆడియన్స్‌ని భయపెట్టడంలో డైరెక్టర్ కీర్తన్ నడగౌడ చాలావరకు సక్సెస్ అయ్యారు.


ముఖ్యంగా నైట్ విజ్యువల్స్, వెంకీ జిజి ఇచ్చే గూస్‌బంప్స్ బీజీఎమ్, ఇంటర్వెల్ అండ్ క్లైమాక్స్ సీన్స్ మైండ్ బ్లాక్ చేస్తాయి! నటీనటుల్లో సూర్య రాజ్, చరణ్ లక్కరాజు బాగున్నా, చైత్ర జే ఆచార్ తన ఇంటెన్స్ పెర్ఫార్మెన్స్‌తో అసలు సిసలైన 'షో స్టాపర్'గా నిలిచింది. స్క్రీన్‌ ప్లే కాస్త స్లోగా ఉన్నా, సెకండాఫ్‌లో సాగదీత అనిపించినా.. తక్కువ అంచనాలతో వెళ్తే హారర్ ప్రియులకు ఇది ఒక మంచి థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్! ఎడిటింగ్ పర్వాలేదు, నిర్మాణ విలువలు బాగున్నాయ్. 



5.0
out of 9
2 weeks ago
Oct 23, 2026 Telugu

418 Movie Review

418 (#418) 2026 Website
Mythri Movie Makers ventures into Kannada cinema with the horror thriller 418, presented by Prashanth Neel. The film generated curiosity through its unusual social media promotions.HighlightsDevika’s...

Mythri Movie Makers ventures into Kannada cinema with the horror thriller 418, presented by Prashanth Neel. The film generated curiosity through its unusual social media promotions.


Highlights



Devika’s flashback episode

Chaitra Achar’s performance

Background score and sound design


Drawbacks


An unconvincing climax

Familiar horror-film tropes

Repetitive scares


418 begins on a familiar note, taking nearly 50 minutes to establish its horror premise and deliver its first effective scare. The initial college portions move slowly, with episodes involving ragging, student interactions and Saiesha’s illness doing little to advance the central mystery.


Despite these shortcomings, 418 works to an extent. Its effective flashback, Chaitra Achar’s performance and sound design make parts of the film engaging. However, repetitive scares and a weak climax prevent this horror thriller from realising its full potential. It is a mixed bag that delivers a few effective scares but falters at the finish.


5.0
out of 9
2 weeks ago
Oct 23, 2026 Telugu

418 Movie Review

418 (#418) 2026 Website
తెలుగులో మాత్రమే కాదు... ఇతర భాషల్లోనూ ఇప్పుడు హారర్ సినిమాలు అరుదుగా వస్తున్నాయి. కామెడీతో హారర్ మిక్స్ చేసి, ప్రేక్షకులను నవ్విస్తూ భయపడుతున్న దర్శక రచయితలు ఎక్కువయ్యారు. ఈ తరుణంలో పక్కా హారర్ సినిమ...

తెలుగులో మాత్రమే కాదు... ఇతర భాషల్లోనూ ఇప్పుడు హారర్ సినిమాలు అరుదుగా వస్తున్నాయి. కామెడీతో హారర్ మిక్స్ చేసి, ప్రేక్షకులను నవ్విస్తూ భయపడుతున్న దర్శక రచయితలు ఎక్కువయ్యారు. ఈ తరుణంలో పక్కా హారర్ సినిమాగా '418' వచ్చింది. మేకర్స్ అయితే ఇంతలా భయపెట్టే సినిమా ఇటీవల కాలంలో రాలేదని హైప్ ఇచ్చారు. కానీ హారర్ థ్రిల్లర్ సినిమాల్లో రెగ్యులర్‌ గా కనిపించే జంప్ స్కెర్స్, భయపెట్టడంలో కనిపించే రొటీన్ ట్రిక్స్ '418'లో లేవు. సిట్యువేషనల్ హారర్ కోసం దర్శకుడు కీర్తన నాడగౌడ ప్రయత్నించారు. అయితే... అది వర్కవుట్ కాలేదు.


సినిమాలో చైత్ర జె ఆచార్ పాత్ర బావుంది. ఆ పాత్ర లక్ష్యాన్ని బలంగా రాసిన దర్శకుడు... ఆమె వెళ్లే దారిని బలంగా రాలేదు. ఇక చివరకు వచ్చేసరికి 418 రూమ్ సీక్రెట్ కూడా సోసోగా అనిపిస్తుంది. అందువల్ల కథ పరంగా బలం లోపించింది. హారర్ కామెడీల మధ్య కేవలం ప్రేక్షకులను భయపెట్టే ఉద్దేశంతో వచ్చిన ప్యూర్ హారర్ సినిమా '418'. ఇందులో హారర్ ఎలిమెంట్స్, థ్రిల్స్ తక్కువ. కథ పరంగా ఎమోషనల్ మూమెంట్స్ ఎక్కువ. కొంత మేరకు మాత్రమే భయపెట్టింది. చైత్ర జె ఆచార్ కనిపించినది తక్కువ సేపే అయినా ఆమె నటన తప్పకుండా ఆకట్టుకుంది.


5.0
out of 9
2 weeks ago
Oct 23, 2026 Telugu

418 Movie Review

418 (#418) 2026 Website
Gulte

By Gulte

418 Movie ReviewPositives :1.⁠ ⁠Background Score2.⁠ ⁠Initial Few MinutesNegatives :1.⁠ ⁠Unexciting Screenplay2.⁠ ⁠Lack of Scary Moments3.⁠ ⁠Runtime4.⁠ ⁠Lack of Emotional Depth418 movie is Another draw...

418 Movie Review


Positives :


1.⁠ ⁠Background Score

2.⁠ ⁠Initial Few Minutes


Negatives :


1.⁠ ⁠Unexciting Screenplay

2.⁠ ⁠Lack of Scary Moments

3.⁠ ⁠Runtime

4.⁠ ⁠Lack of Emotional Depth


418 movie is Another drawback of the film is the excessive Kannada flavour. It is a film which is made by a Kannada director, presented by a Kannada filmmaker, and acted by many Kannada actors, set in Karnataka, has a backdrop of Yakshagana, a traditional folk dance form popular in Coastal Karnataka districts and has two Kannada songs.


Overall, 418, has an interesting core point, a good takeoff and a couple of mildly scary moments but other than that, the film offers nothing interesting. An unexciting first half followed by an equally unexciting second half, made it a tiresome watch.


Bottom Line – Empty Vessels Make The Most Noise


Rating: 2.25/5

5.0
out of 9
2 weeks ago
Oct 23, 2026 Telugu

418 Movie Review

418 (#418) 2026 Website
Tupaki

By Tupaki

ఒకప్పుడు హార్రర్ సినిమా అంటే హార్రర్ సినిమానే. జనాలను భయపెట్టడమే లక్ష్యంగా సాగేవీ సినిమాలు. కానీ తర్వాత భయానికి నవ్వును కూడా జోడించి ఈ జానర్ రీచ్ పెంచారు కొందరు ఫిలిం మేకర్స్. దీంతో క్రమంగా ఆ సినిమాలు...

ఒకప్పుడు హార్రర్ సినిమా అంటే హార్రర్ సినిమానే. జనాలను భయపెట్టడమే లక్ష్యంగా సాగేవీ సినిమాలు. కానీ తర్వాత భయానికి నవ్వును కూడా జోడించి ఈ జానర్ రీచ్ పెంచారు కొందరు ఫిలిం మేకర్స్. దీంతో క్రమంగా ఆ సినిమాలు ఒక మూసలా మారి.. ఆ జానరే కంగాళీగా తయారైంది. ఇలాంటి టైంలోనూ అప్పుడప్పుడూ ఫక్తు హార్రర్ సినిమాలు కొన్ని వస్తుంటాయి. ‘418’ కొంచెం సిన్సియర్ గానే ఆ పని చేసింది. ఎప్పుడూ హార్రర్ సినిమాల్లో చూసే సెటప్ కు కొంచెం భిన్నంగానే ఈ కథ నడుస్తుంది. ఐతే ఎంత కసరత్తు చేసినా.. కథను అర్థమయ్యేలా.. కన్విన్సింగ్ గా చెప్పడం.. లాజిక్కులు సరిగ్గా ఉండడం.. జెన్యూన్ హార్రర్ మూమెంట్స్ తో ప్రేక్షకులను భయపెట్టడం కీలకం. ఈ విషయాల్లో ‘418’ ఒకింత నిరాశకే గురి చేస్తుంది. 



ఇది కంటెంట్ ఉన్న సినిమానే కానీ.. కన్విన్సింగ్ గా లేకపోవడంతో ఒక మోస్తరు స్థాయిని మించలేకపోయింది. కథా నేపథ్యం బాగున్నా.. లీడ్ క్యారెక్టర్-అందులో ఛైత్ర అచర్ పెర్ఫామెన్స్ అదిరిపోయినా.. సాంకేతిక అంశాల్లో మెరుపులున్నా.. 418 ‘జస్ట్ ఓకే’ స్థాయిని మించలేకపోయింది. రైటర్ కమ్ డైరెక్టర్ కీర్తన్ నాదగౌడ.. ఒక డిఫరెంట్ హార్రర్ థ్రిల్లర్ కు అవసరమైన సెటప్ బాగానే చేసుకున్నాడు. తన టేకింగ్ బాగుంది. కానీ కథను ఇంకా క్లారిటీతో చెప్పాల్సింది. హార్రర్ ఎలిమెంట్స్ ను ఇంకా బాగా డీల్ చేయాల్సింది. తనలో మంచి టెక్నీషియన్ ఉన్న సంగతి తెలుస్తుంది కానీ.. ఔట్ పుట్ ఇంకా బెటర్ గా ఉండాల్సింది. చివరగా: 418.. కంటెంట్ ఉంది కడుపు నిండదు.

5.0
out of 9
2 weeks ago
Oct 23, 2026 Telugu

418 Movie Review

418 (#418) 2026 News Channel
‘418’ సినిమా విషయానికి వస్తే.. దర్శకుడు కీర్తన్ నడగౌడ ఎంచుకున్న నేపథ్యం, ఆ హాస్టల్ సెటప్, ఆత్మ చుట్టూ అల్లిన ఇంట్రడక్షన్ సీన్స్ మొదట్లో చాలా ఆసక్తికరంగా అనిపిస్తాయి. కానీ ఆ ఉత్కంఠ కాసేపు కంటిన్యూ అయిం...

‘418’ సినిమా విషయానికి వస్తే.. దర్శకుడు కీర్తన్ నడగౌడ ఎంచుకున్న నేపథ్యం, ఆ హాస్టల్ సెటప్, ఆత్మ చుట్టూ అల్లిన ఇంట్రడక్షన్ సీన్స్ మొదట్లో చాలా ఆసక్తికరంగా అనిపిస్తాయి. కానీ ఆ ఉత్కంఠ కాసేపు కంటిన్యూ అయింది. సినిమా ముందుకు వెళ్లేకొద్దీ మనం రెగ్యులర్‌గా చూసే పాతకాలపు హారర్ సినిమాల ఫార్ములాలోకి వెళ్లిపోతుంది. పాడుబడిన భవనం, పగతో రగిలిపోయే దయ్యం, ఊహకు అందే భయానక సీన్స్.. ఇవే మళ్లీ మళ్లీ కనిపిస్తాయి. స్క్రీన్‌ప్లేలో ఇంకాస్త కొత్తదనం ఉండుంటే అదిరిపోయేది. ఆడియన్స్‌ను నిజంగా భయపెట్టే సీన్స్ కంటే, కేవలం భారీ సౌండ్స్ పెట్టి ఉలిక్కిపడేలా చేసే సీన్స్‌పైనే డైరెక్టర్ ఎక్కువగా ఆధారపడ్డాడు. 


ఇక ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ కాస్త ఆసక్తిగా మొదలైంది.. కానీ దాన్ని బాగా ల్యాగ్ చేసినట్లు అనిపించింది. ముఖ్యంగా చివరి అరగంట ఇంకాస్త ఫోకస్ చేసుంటే బాగుండేది. మెయిన్ ప్లాట్ అంతా అక్కడే ఉంది. లాజిక్ లేని సీన్స్‌తో ఆడియన్స్‌కు విసుగు తెప్పిస్తుంది. క్లైమాక్స్ ట్విస్ట్ ఊహించని విధంగా ఉన్నా.. అది ప్రేక్షకులను థ్రిల్ చేయడంలో పర్లేదనిపిస్తుంది. రెండున్నర గంటల నిడివి ఈ తరహా రొటీన్ కథకు చాలా ఎక్కువైంది. ఒక అద్భుతమైన హారర్ సినిమా చూస్తామనుకుని థియేటర్‌కు వెళ్లిన వాళ్ళకు ఈ సింపుల్ స్క్రీన్‌ప్లే రొటీన్‌గానే అనిపిస్తుంది. కథలో లేని బలాన్ని నేపథ్య సంగీతంతో లాక్కొచ్చే ప్రయత్నం చేశారు. అకుల్ అవినాష్ ఎడిటింగ్ ఇంకాస్త క్రిస్ప్‌గా ఉండాల్సింది. నిడివి బాగా ఎక్కువవడం, ముఖ్యంగా క్లైమాక్స్ ఎపిసోడ్‌ని ట్రిమ్ చేయకపోవడం సినిమాకు మైనస్ అయ్యాయి.


5.0
out of 9
2 weeks ago
Oct 23, 2026 Telugu

418 movie Review

418 (#418) 2026 Website
సింపుల్ అండ్ ఎమోషనల్ స్టోరీ పాయింట్ అల్లుకొన్న హారర్, థ్రిల్లర్ 418. ఈ సినిమాలో కథ కంటే ఎక్కువగా కథనం, సౌండ్ ఎఫెక్ట్స్, సినిమాటోగ్రఫి, మ్యూజిక్, ఆర్ట్ విభాగాలపైనే ఎక్కువ దృష్టిపెట్టారనే విషయం సినిమా ఆ...

సింపుల్ అండ్ ఎమోషనల్ స్టోరీ పాయింట్ అల్లుకొన్న హారర్, థ్రిల్లర్ 418. ఈ సినిమాలో కథ కంటే ఎక్కువగా కథనం, సౌండ్ ఎఫెక్ట్స్, సినిమాటోగ్రఫి, మ్యూజిక్, ఆర్ట్ విభాగాలపైనే ఎక్కువ దృష్టిపెట్టారనే విషయం సినిమా ఆరంభంలోనే తెలిసి పోతుంది. కథలో వేగం లోపించడం, అక్కడక్కడే తిరుగుతూ సాగదీసి సాగదీసినట్టు ఉండటంతో ఆడియెన్స్‌లో ఉండే క్యూరియాసిటీపై క్రమంగా ప్రభావం పడిందనే చెప్పాలి. అయితే లాగించి చెప్పే ప్రయత్నం చేయడం వల్ల కొన్నిసార్లు విసుగు కూడా పడుతుంది. ఇక హారర్ ఎలిమింట్స్ కొన్ని సార్లు నిజంగానే భయపెట్టాయి. కానీ ఎక్కువ సార్లు చాలా ఆర్టిఫిషియల్‌గాను ఉంటాయి. ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్‌లో కొన్ని సీన్లు మాత్రమే ఓకే అనిపించేలా ఉంటాయి.


ఇక ఈ సినిమా సౌండ్ డిజైన్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కేక పెట్టించింది. ఇక ఎప్పటిలానే ప్రశాంత్ నీల్ తరహా కలర్ ప్యాటర్న్‌తో సాగుతుంది. కొన్నిసార్లు చీకట్లో ఏం జరుగుతుందో తీక్షణంగా చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కానీ కథ, కథనాలను ఇంకాస్త పట్టించుకొంటే.. అందరూ హైప్ చేసినట్టు మంచి థ్రిల్లర్ అయి ఉండేది. అంచనాలు పెంచుకొని వెళ్తే కొంత నిరాశ పడే అవకాశం ఉంది. కాబట్టి ఈ సినిమాపై ఎక్స్‌పెక్టేషన్స్ తక్కువగా పెట్టుకొని వెళ్తే మంచి అనుభూతితో బయటకు రావొచ్చు.

5.0
out of 9
2 weeks ago
Oct 23, 2026 Telugu

418 Movie Review

418 (#418) 2026 Website
చైత్ర జె ఆచార్ మెయిన్ లీడ్ లో ప్రశాంత్ నీల్ సమర్పణలో తెరకెక్కిన హారర్ థ్రిల్లర్ "418" తాజాగా థియేటర్లలో విడుదలై మిక్స్డ్ రెస్పాన్స్ అందుకుంది. ఇక ఈ చిత్రంలో మొదటి నుంచీ హైప్ చేసిన సౌండ్ డిజైన్ మాత్రం...

చైత్ర జె ఆచార్ మెయిన్ లీడ్ లో ప్రశాంత్ నీల్ సమర్పణలో తెరకెక్కిన హారర్ థ్రిల్లర్ "418" తాజాగా థియేటర్లలో విడుదలై మిక్స్డ్ రెస్పాన్స్ అందుకుంది. ఇక ఈ చిత్రంలో మొదటి నుంచీ హైప్ చేసిన సౌండ్ డిజైన్ మాత్రం అక్కడక్కడా ఆకట్టుకుంటుంది. కొన్ని టెన్స్ సీన్స్ ఒకటీ రెండు అక్కడక్కడా ఇంప్రెస్ చేస్తాయి. అలాగే ఇంటర్వెల్ బ్లాక్ లో మరియు క్లైమాక్స్ పోర్షన్ లో థ్రిల్ మూమెంట్స్ ఈ తరహా సినిమాలు ఇష్ట పడేవారికి, జెనరల్ ఆడియెన్స్ కి కూడా గూస్ బంప్స్ తెప్పించేలా అనిపిస్తాయి. అయితే ఖచ్చితంగా ఈ సినిమాపై సెట్ చేసిన హైప్ ఆధారంగా ఏదో క్రేజీ ఎక్స్ పీరియన్స్ ఉంటుంది అనుకోని ఆడియెన్స్ ట్రై చేస్తే మాత్రం డిజప్పాయింట్ అవ్వక తప్పదు. 


కేవలం కొన్ని చోట్ల మినహా మిగతా కథనం అంతా చాలా స్లోగా చప్పగా సాగుతుంది. ఇక మొత్తంగా చూసుకుంటే ఈ ‘418’ అనే హారర్ సినిమా కేవలం కొన్ని చోట్ల మాత్రమే థ్రిల్స్ ని పంచగలుగుతుంది. యువ నటీనటులు అలాగే నటి చైత్ర జే ఆచార్ మంచి పెర్ఫామెన్స్ లను అందించారు. అలాగే కొన్ని చోట్ల సౌండింగ్, థ్రిల్ మూమెంట్స్ బాగున్నాయి. కానీ ఓ రేంజ్ లో భయపెట్టేసే సినిమా అయితే ఇది కాదు. ముందు సెట్ చేసిన హైప్ తో వెళితే మాత్రం డిజప్పాయింట్ అవుతారు. సో చాలా తక్కువ అంచనాలు పెట్టుకొని ట్రై చేస్తే బెటర్.


6.0
out of 9
2 weeks ago
Oct 23, 2026 Telugu

NallaJarla Road movie review

Just ippude ETV win app lo Nallajarla Road short film chusa. genral ga nenu short film chudanu kaani... youtube lo trailer chusaka intrest occhindi. and subcription lekapothe konukkuni mari chusa..but...

Just ippude ETV win app lo Nallajarla Road short film chusa. genral ga nenu short film chudanu kaani... youtube lo trailer chusaka intrest occhindi. and subcription lekapothe konukkuni mari chusa..


but movie chala intresting ga anipinchindi. dennenduku long length movie ga teesi theaterlo enduku release cheyaledani feel occhindi.


but short ga unnanduke bore kottakunda thrill feel icchindi. 2 hours length unna movie ga marchithe chala bore kottedani tarvatha realize ayya.


twist lu, thrills bagunnayi nakaithe... mari evarikaina intrest unte low hype tho chudandi thriller movies like chesevallakaithe definatley try cheyocchu.

6.0
out of 9
2 weeks ago
Oct 21, 2026 Telugu

Crazy kalyanam movie review

final ga eeroju crazy kalyanam movie eeroju complete chesa. ippude first show chusostuna.. pandakki ekkuva cinemalocchesariki annintini cover cheyadaniki intha time pattindi. and cinema ayithe decent...

final ga eeroju crazy kalyanam movie eeroju complete chesa. ippude first show chusostuna.. pandakki ekkuva cinemalocchesariki annintini cover cheyadaniki intha time pattindi. and cinema ayithe decent timepass movie ani cheppochu.


movie mottham manchi entertainment untundi. and village back drop kabatti naku chala nachindi. because elagu ee busy life lo oollu tiragalem.. atleast cinemalo ayina naku chustunte ooriki vellina feel occhindi.


and movielo anupama, tarun bhasker, naresh performance peaks asalu... mareee pedda message cinemalo ledu kani.. alochiste.. adapillalaku pelli ventante cheseyakunda... valla career lo setile ayyedaka chance ivvalani movielo cheppinattu nakanipinchindi.

6.0
out of 9
2 weeks ago
Oct 21, 2026 Telugu

Crazy Kalyanam movie review

గ్రామాల్లో అమ్మాయికి పెళ్లి చేస్తే తమ బరువు తీరుతుందని, మంచి చదువుకున్న, జాబ్‌ చేసే అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయాలని భావిస్తుంటారు. చాలా వరకు అలానే జరుగుతుంటాయి. అమ్మాయి ఇష్టాఇష్టాలతో సంబంధం లేకుండా ఇలా...

గ్రామాల్లో అమ్మాయికి పెళ్లి చేస్తే తమ బరువు తీరుతుందని, మంచి చదువుకున్న, జాబ్‌ చేసే అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయాలని భావిస్తుంటారు. చాలా వరకు అలానే జరుగుతుంటాయి. అమ్మాయి ఇష్టాఇష్టాలతో సంబంధం లేకుండా ఇలాంటి పెళ్లిళ్లు చేస్తారు. అమ్మాయి కెరీర్‌ని పెళ్లితోనే సమాధి చేస్తుంటారు. అలాంటి రియలిస్టిక్‌ అంశాలతో క్రేజీ కళ్యాణం మూవీని రూపొందించారు దర్శకుడు బద్రప్ప. అదే సమయంలో తెలంగాణ పల్లెల్లో ఉంటే కల్చర్‌ ని, బంధాలు, అనుబంధాలు, అలకలు, గొడవలను బేస్‌ చేసుకుని తెరకెక్కించారు. రియాలిటీకి దగ్గరగా చూపించారు.


అయితే సినిమాలో ఫస్టాఫ్‌లో ఫన్‌ ఆశించిన స్థాయిలో వర్కౌట్ కాలేదు. డోస్‌ తగ్గింది. కొన్ని సీన్లు మాత్రమే వర్కౌట్ అయ్యాయి. దీంతో డ్రైగా సాగిన ఫీలింగ్‌ కలుగుతుంది.కీర్తిగా అనుపమా నటన అదిరిపోయింది. మామఅల్లుళ్ల గొడవలు నవ్విస్తాయి. బాలరాజు పాత్ర నవ్విస్తుంది. ఆకట్టుకుంటుంది. పర్వతాలు పాత్రలో సెకండాఫ్‌లో వచ్చే ఎమోషనల్స్ బాగున్నాయి. క్లైమాక్స్ అదిరిపోయింది. సంగీతం ఫర్వాలేదు. విజువల్స్ బాగున్నాయి. సినిమాలో మెయిన్‌గా కామెడీ వర్కౌట్‌ కాలేదు. నరేష్‌ పాత్ర హైలైట్‌ కావడంతోపాటు కొన్ని చోట్ల ఓవర్‌గా అనిపిస్తుంది. ఎమోషన్స్ పెద్దగా పండలేదు. డ్రామా కూడా కొన్ని చోట్లు తేలిపోయింది. ఇలాంటివి కొన్ని పక్కన పెడితే పండక్కి సరదాగా టైమ్‌ పాస్‌కి చూసే మూవీ ఇదే.


6.0
out of 9
2 weeks ago
Oct 21, 2026 Telugu
Why MRO?