Latest Movie Reviews
The most recent reviews from top critics and publications
Sathi Leelavathi Movie Review
By Tupaki
పెళ్లి తర్వాత సినిమాల నుంచి కొంచెం గ్యాప్ తీసుకున్న లావణ్య త్రిపాఠి.. తాజాగా నటించిన చిత్రం ‘సతీ లీలావతి’. తాజాగా థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ ఆడియన్స్ నుండి మిక్స్డ్ రెస్పాన్స్ దక్కించుకుంది. కథ గురించి సింపుల్ గా చెప్పాలంటే... పెళ్లయిన కొన్నేళ్లకు భార్యాభర్తల మధ్య అపార్థాలు రావడం.. ఇద్దరి మధ్య దూరం పెరగడం చాలామందిలో జరిగేదే. ఇద్దరి తప్పొప్పులు తెలుసుకుని కలిసిపోవడమే మెయిన్ పాయింట్. సినిమాలో దానికి ఏ మార్గం ఎంచుకున్నా తెర మీద అవతలి పాత్ర మాత్రమే కాదు.. ప్రేక్షకులు కూడా కన్విన్స్ అయ్యేలా పరిష్కారం చూపించాలి. కానీ 'సతీ లీలావతి'లో తన నుంచి విడిపోవాలని అనుకునే భర్తను మార్చడానికి హీరోయిన్ ఎంచుకునే మార్గం సిల్లీగా అనిపిస్తుంది.
సినిమాలో ఏ దశలోనూ ఆమె భర్తలో పరివర్తన తెచ్చేలా తన ప్రవర్తన ఉండదు. ఆ క్యారెక్టర్ని చూస్తే భర్త ఆమె నుంచి విడిపోవడం కరక్టే అని ఆడియన్సుకి అనిపించేలా డిజైన్ చేసారు ఆ పాత్రని. ఇలాగే సినిమా మొత్తం గొడవలు పడుతూనే ఉంటాయి సీన్లు. ఎంటర్టైన్మెంట్ విషయానికొస్తే... ఒక్క కమెడియన్ ని కూడా యూస్ చేసుకోలేదు. దర్శకుడు తాతినేని సత్య ఎంచుకున్న కాన్సెప్ట్ మంచిదే. కానీ కథను ఒక తీరుగా చెప్పడంలో అతను ఫెయిలయ్యాడు. అతను కథను మొదలుపెట్టిన విధానమే అంత ఆసక్తికరంగా లేదు. నరేషన్ ఆద్యంతం గందరగోళంగా సాగింది. సెకండాఫ్ లో కొంత మేర ఎంటర్టైన్మెంట్ పండించినా.. అది సరిపోలేదు. ఓవరాల్ గా సతీలీలావతి ఎవర్ని మెప్పించలేదు.
Godari Gattupaina Movie Review
By Tupaki
షార్ట్ ఫిలిమ్స్ తో పేరు సంపాదించి.. ‘మేం ఫేమస్’ సినిమాతో హీరోగా దర్శకుడిగా మారిన సుమంత్ ప్రభాస్ ఆ చిత్రంతో బానే ఆకట్టుకున్నాడు. ఇప్పుడు లేటెస్ట్ గా ‘గోదారి గట్టుపైన’ మూవీతో ఆడియన్స్ ముందుకొచ్చాడు. ‘గోదారి గట్టుపైన’ ట్రైలర్ చూస్తేనే ఇదొక సగటు టీనేజీ ప్రేమకథ అనే విషయం అర్థమైపోతుంది. కథ విషయంలోనూ ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. సింపుల్ గా కథ చెప్పాలంటే.. కూతురిని అమితంగా ఇష్టపడే తండ్రి.. ఆమెను తమ కంటే ఉన్నత స్థాయి కుటుంబంలో ఇవ్వాలని ఆశిస్తాడు. కథానాయికేమో హీరో గుణం చూసి ఇష్టపడుతుంది. వీరి పెళ్లికి ఇష్టపడని తండ్రి.. మిగతా విషయాల కంటే ఆ గుణమే గొప్పదని అర్థం చేసుకోవడం.. ఆ ఇద్దరినీ ఒక్కటి చేయడం.. ఈ నేపథ్యంలో బాగా అలవాటైన కథలాగే నడుస్తుంది ‘గోదారి గట్టుపైన’.
కథ పరంగా ఏ కొత్తదనం కనిపించదు. ఇందులో ఆశ్చర్యపరిచే అంశాలు కూడా ఏమీ లేవు. కథాకథనాలు రొటీన్ అనిపించినా.. టైంపాస్ వినోదాన్ని ఇవ్వడం ద్వారా జస్ట్ ఓకే అనిపిస్తుంది. ఇలాంటి రూరల్ లవ్ స్టోరీలకు వీనుల విందైన సంగీతం అవసరం. కానీ ఆ పాటలు వినాలి అనిపించే స్థాయిలో లేవు. సాయి సంతోష్ ఛాయాగ్రహణం ఆకట్టుకుంటుంది. గోదారి పల్లెటూర్లను.. ప్రేమ సన్నివేశాలను బాగా చూపించాడు. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. ఇటు ప్రేమ సన్నివేశాలు కానీ.. అటు కాన్ఫ్లిక్ట్ కానీ బలంగా లేకపోవడంతో సినిమా మరీ తేలిగ్గా అనిపిస్తుంది. ఐతే కొన్ని కామెడీ సీన్లు.. తండ్రీ కూతుళ్ల ఎమోషన్ వరకు అతను బాగా డీల్ చేశాడు. ఓవరాల్ గా గోదారి గట్టుపైన.. కూసింత కాలక్షేపం అన్నట్టు లో ఎక్స్పెక్టేషన్స్ తో సినిమా చూసి బైటికొచ్చేయాలి.
Godari Gattupaina Movie Review
‘మేం ఫేమస్’ అంటూ సుమంత్ ప్రభాస్ సోషల్ మీడియాలో కాస్త హడావిడి చేశాడు. సినిమా అంతగా హిట్ కాకపోయినా మనోడు తన డిఫరెంట్ ప్రమోషన్స్, మాటలు, చేతలతో ఎక్కువగానే ట్రెండ్ అయ్యాడు. ఇప్పుడు సుమంత్ ప్రభాస్ ‘గోదారి గట్టుపైన’ అనే సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. ప్రేమకు కులం, మతం, డబ్బు అడ్డు వచ్చిన కథలెన్నో మనం చూశాం. ఇందులో ఏమైనా కొత్తగా చెబుతాడని, చూపిస్తాడని ప్రేక్షకులు ఆశిస్తే మాత్రం నిరాశే కలుగుతుంది.
దర్శకుడు సుభాష్ చంద్ర తీసుకున్న పాయింట్, కథ, కథనం, మేకింగ్, టేకింగ్ ఇవన్నీ కూడా అవుట్ డేటెడ్‌గానే కనిపిస్తాయి. ఏ ఒక్క చోట కూడా అరెరే ఇదేదో కొత్త సీన్‌లా ఉందే, సినిమా కొత్తగా ఉందే అని అనిపించదు. నటీనటులు కూడా పెద్దగా గుర్తుండిపోయే పెర్ఫార్మన్స్ చేసింది లేదు... దాని కంటే ముందు ఆ రోల్స్ అంత స్ట్రాంగ్ గా లేవు కూడా. ఉన్నంతలో జగపతిబాబు రోల్ కొంచెం బాగుంటుంది. ఓవరాల్ గా గోదారి గట్టుపైన అని అందమైన టైటిల్, ఓ ఆహ్లాదకరమైన టైటిల్‌ను పెట్టారు. కానీ అందులోని కథ, కథనం, ఎమోషన్స్ మాత్రం అంత గొప్పగా ఉండవు. అంచనాలతో థియేటర్‌కి వెళ్తే ప్రేక్షకుడు కాస్త భంగపడే అవకాశం ఉందనిపిస్తుంది.
Godari Gattupaina Movie Review
By 123telugu
యంగ్ హీరో సుమంత్ ప్రభాస్ హీరోగా నటించిన రూరల్ లవ్, ఫ్యామిలీ డ్రామా ‘గోదారి గట్టుపైన’ తాజాగా థియేటర్లలో రిలీజ్ కాగా, మిక్స్డ్ రెస్పాన్స్ అందుకుంది. సుభాష్ చంద్ర దర్శకత్వంలో రెడ్ పప్పెట్ ప్రొడక్షన్స్ నిర్మించింది. అయితే రొటీన్ కథా కథనాలతో సినిమా ఆడియన్స్ ని అంతగా మెప్పించలేదు. గోదావరి నేటివిటీ బాగానే చూపించినా ఇంట్రెస్టింగ్ సీన్స్ తో ఆసక్తిగా చూపించలేకపోయారు.
ఓవరాల్ గా “గోదారి గట్టుపైన’’ అంటూ ఎమోషనల్ లవ్ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈ చిత్రంలో.. మెయిన్ థీమ్, ప్రేమ సన్నివేశాలు అండ్ ఎమోషనల్ సీన్స్ బాగున్నాయి. సుమంత్ ప్రభాస్, జగపతి బాబు నటన కూడా చాలా బాగుంది. ఐతే, కొన్ని రెగ్యులర్ సీన్స్ వంటి అంశాలు సినిమాకి మైనస్ అయ్యాయి. ఓవరాల్ గా ఈ సినిమాలో కొన్ని లవ్ అండ్ ఎమోషనల్ ఎలిమెంట్స్ మాత్రమే ఆకట్టుకుంటాయి.
Sathi Leelavathi Movie Review
By 123telugu
లావణ్య త్రిపాఠి కొణిదెల, దేవ్ మోహన్ జంటగా నటించిన లేటెస్ట్ మూవీ "సతీ లీలావతి". లవ్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీ తాజాగా థియేటర్లలో విడుదలైంది. ఇక సినిమా విషయానికి వస్తే... రొటీన్ కథా కథనాలతో దర్శకుడు తాతినేని సత్య ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించాడు. పెర్ఫార్మన్స్ పరంగా లావణ్య త్రిపాఠి వన్ విమెన్ షోగా నడిపించింది.
ఓవరాల్ గా చూసుకుంటే, ‘సతీ లీలావతి’ ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకులను పూర్తిస్థాయిలో మెప్పించలేకపోయింది. లావణ్య త్రిపాఠి పెర్ఫార్మెన్స్ మరియు పర్వాలేదనిపించే ఫస్టాఫ్ సినిమాకు ప్లస్ అయ్యాయి. సెకండాఫ్ లో వచ్చే కామెడీ ట్రాక్స్, మెయిన్ ప్లాట్ నుంచి కథ డీవియేట్ కావడం మైనస్. ఈ వీకెండ్ ఏదైనా ఫ్యామిలీ డ్రామా చూడాలనుకునే వారు తక్కువ అంచనాలతో ఈ చిత్రాన్ని చూడటం బెటర్.
Gayapadda Simham Movie Review
గాయపడ్డ సింహం గురించి చెప్పాలంటే... ఇంట్రెస్టింగ్ ఐడియా. బోరింగ్ స్టోరీ. ఈ మూవీకి ఒక విలక్షణమైన కథాంశం ఉంది. ఇది ఒక ఎంటర్టైనింగ్ కామెడీగా మారే అవకాశం ఉంది. కానీ స్క్రీన్ ప్లే చాలా బోరింగ్ గా అనిపిస్తుంది, ఎట్ ది సేమ్ టైం సెకండ్ హాఫ్ లో ఏవేవో సన్నివేశాలను కలిపి కుట్టినట్లుగా అనిపిస్తుంది. ఈ ఫార్స్ స్పూఫ్ కామెడీ చాలా వరకు ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. కొన్ని నవ్వులు తప్ప, చివరికి ఇది ఒక బోరింగ్ మూవీగా నిలుస్తుంది.
#GaayaPaddaSimham Interesting Idea, Boring Execution!
The film has an unconventional storyline that had potential to be a wacky comedy. But the screenplay turns out to be exhausting and feels like random scenes stitched together especially in the second half. The farce/spoof comedy fails to land for the most part.
Ends up being a tiring experience with just a few laughs!
Gayapadda Simham movie Review
By Cinema Picha
తరుణ్ భాస్కర్ చాలా రోజుల తర్వాత మళ్ళీ హీరోగా ట్రై చేసిన ‘గాయపడ్డ సింహం’ ఫైనల్ గా థియేటర్లకు వచ్చేసింది. ఇక సినిమా స్టార్ట్ అయిన పదిహేను నిమిషాల్లోనే క్లారిటీ వచ్చేస్తుంది… “ఇది ఏ జానర్ బాస్?” అసలు కామెడీనా? సీరియస్ స్టోరీనా? లేక ఎక్స్‌పెరిమెంటా? అని — ఏదీ ఫుల్ గా వర్క్ అవ్వలేదు. హీరోగా తరుణ్ భాస్కర్ బానే సెట్టయ్యాడు, కానీ తన రోల్ స్ట్రాంగ్ రాసుకోలేదు. తన స్టైల్ అఫ్ డైలాగ్స్, నేచురల్ యాక్టింగ్ ఉంది, కానీ ఫ్రెష్ నెస్ లేదు.
సెకండాఫ్‌లో అయినా స్టోరీ పికప్ అవుద్దేమో అనుకుంటే మళ్ళీ రిపీట్ మోడ్ లోకి వెళ్తుంది. ఎటొచ్చి శ్రీ విష్ణు ఎంట్రీ చ్చినప్పుడే కాస్త ఎంటర్టైన్మెంట్ పెరిగి మంచి ఫీల్ ఇస్తుంది. ఓవరాల్ గా ఒక డిఫెరెంట్ కాన్సెప్ట్ ని, డిఫెరెంట్ పాయింట్ తో, డిఫెరెంట్ గానే మేకర్స్ చూపించడానికి ట్రై చేశారన్నమాట. సింపుల్ గా లో ఎక్స్పెక్టేషన్స్ తో చూస్తే మంచి ఫీల్ రావొచ్చు గాని, గాయపడ్డ సింహం పై కన్ఫ్యూజన్ ఎక్కువ.
Gayapadda Simham movie Review
'గాయపడ్డ సింహం' అంటూ ఆడియన్స్ ముందుకు వచ్చిన తరుణ్ భాస్కర్ ఈసారి అరకొర అన్నట్టుగా ఇంప్రెస్ చేయడానికి ట్రై చేసాడు. అయితే సినిమా చూస్తే ఒక క్లియర్ ఫీలింగ్ అయితే వస్తుంది. ఐడియా ఉంది, కానీ ఎగ్జిక్యూషన్ మిస్ అయింది. తరుణ్ భాస్కర్ డైరెక్టర్ గా ప్రూవ్ చేసుకున్నా, హీరోగా ఎక్స్‌పెక్ట్ చేసిన ఇంపాక్ట్ రాలేదు. ఫస్ట్ హాఫ్ లోనే సినిమా టోన్ సెటిల్ అవ్వదు. సెకండాఫ్‌లో కథ ముందుకు వెళ్లాలని చూస్తుంది, కానీ మళ్లీ అదే లూప్‌లో తిరిగినట్టు అనిపిస్తుంది. ఎమోషన్, కామెడీ రెండింట్లోనూ క్లారిటీ లేకపోవడం వల్ల ఆడియెన్స్ కనెక్ట్ అవ్వడం కష్టమే.
ఓవరాల్ గా సినిమా గురించి చెప్పాలంటే..జస్ట్ ఒకే. సోది లేకుండా ఒక్క ముక్కలో చెప్పాలంటే..కొత్తదనం కోసం వెళ్ళేవాళ్లకి మిస్, టైమ్‌పాస్ కోసం వెళ్లేవాళ్లకి కూడా మిక్స్డ్ ఫీలింగ్ మాత్రమే. రేటింగ్ విషయానికి వస్తే... ఫైవ్ అవుట్ అఫ్ టెన్ వరకు ఇవ్వొచ్చు.. లేదంటే టు పాయింట్ ఫైవ్ వరకు ఇవ్వొచ్చు.
Gayapadda Simham movie Review
సమ్మర్ లో పెద్ద సినిమాలు లేక డీలా పడితే, చిన్న సినిమాలైనా ఊరట కలిగిస్తాయనుకుంటే అవి కూడా దెబ్బేస్తున్నాయి. లేటెస్ట్ గా రిలీజ్ అయిన ‘గాయపడ్డ సింహం’ కూడా ఇదే కోవలోకి వచ్చేలా కనిపిస్తుంది. ఈ సినిమా ఒక క్లియర్ ఐడియా లేకుండా తీసిన ఎక్స్‌పెరిమెంట్ లా అనిపిస్తుంది. తరుణ్ భాస్కర్ దర్శకుడిగా తనదైన స్టైల్ తో మంచి సినిమాలు ఇచ్చాడు. కానీ హీరోగా ఈసారి ఆయన తీసుకున్న రిస్క్ పూర్తిగా వర్క్ కాలేదు. ట్రైలర్ లో కనిపించిన ఎంటర్టైన్మెంట్ సినిమా మొత్తంలో కనబడకపోవడం పెద్ద డిసప్పాయింట్.
ఫస్ట్ హాఫ్ మొత్తం లాజిక్ లేకుండా, సిల్లీ సిట్యుయేషన్స్ తో సాగిపోతుంది. కామెడీ కోసం పెట్టిన రిఫరెన్సులు కూడా పెద్దగా పేలవు. ప్రేక్షకుడు ఎక్కడ కనెక్ట్ అవ్వాలి, ఎక్కడ నవ్వాలి అన్న క్లారిటీ లేకుండా సినిమా ముందుకు సాగుతుంది. సెకండాఫ్‌లో కూడా కథలో పెద్దగా ట్విస్టులు ఉండవు. నటీనటుల పరంగా చూస్తే తరుణ్ భాస్కర్ తన పాత్రలో ఓకే అనిపించినా, సినిమాలోని బలహీన రైటింగ్ వల్ల ఆయన పర్ఫార్మెన్స్ కూడా లిఫ్ట్ కాలేదు. ఫరియా అబ్దుల్లా, మానస చౌదరి పాత్రలు కూడా పరిమితంగానే ఉన్నాయి. జెడి చక్రవర్తి పాత్రకు ఉన్న బిల్డప్ స్క్రీన్ పై కనిపించదు. అయితే శ్రీ విష్ణు ఎంట్రీ మాత్రం కొంతవరకు సినిమాకు ఎనర్జీ ఇస్తుంది. ఓవరాల్ గా ‘గాయపడ్డ సింహం’ కంఫ్యూజ్డ్ రైటింగ్ + వీక్ ఎక్స్యూగుషన్.
Gayapadda Simham movie Review
'గాయపడ్డ సింహం' అంటూ థియేటర్లోకి వచ్చిన తరుణ్ భాస్కర్ సినిమా గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే… అంచనాలు ఎక్కువ, అవుట్‌పుట్ తక్కువ. డైరెక్టర్ గా మంచి పేరు తెచ్చుకున్న తరుణ్ భాస్కర్ ఈసారి హీరోగా ఆడియెన్స్‌ను పూర్తిగా డిస్సపాయింట్ చేసాడు. ట్రైలర్ లో కనిపించిన కామెడీ, ఎంటర్టైన్మెంట్ సినిమా మొత్తంలో కనిపించకపోవడం పెద్ద మైనస్. ఫస్ట్ హాఫ్ అంతా సిల్లీ సీన్స్, లాజిక్ లేకుండా సాగిపోతుంది. కొన్ని రిఫరెన్సులు, మీమ్ లను పెట్టినా అవి నవ్వు తెప్పించలేవు. సెకండాఫ్ లో కూడా కథ ముందుకు వెళ్లకుండా అదే చుట్టూ తిరుగుతున్న ఫీలింగ్ వస్తుంది.
ఫరియా అబ్దుల్లా, మానస చౌదరి రోల్స్ పరిమితంగానే ఉంటాయి. జెడి చక్రవర్తి పాత్రకు హైప్ ఇచ్చినా, స్క్రీన్ పై పెద్దగా ఇంపాక్ట్ లేదు. సినిమా మొత్తం బోర్ గా సాగుతున్న టైం లో శ్రీ విష్ణు ఎంట్రీ కొద్దివరకు రిలీఫ్ ఇస్తుంది. టెక్నికల్ గా పర్వాలేదనిపించినా, కంటెంట్ పరంగా సినిమా బలహీనంగా ఉంది. మొత్తంగా ‘గాయపడ్డ సింహం’ అనే టైటిల్ లాగా… ఈ సినిమా చూసిన ఆడియెన్స్ కి కూడా ‘గాయం’ మిగులుతుంది. కామెడీ కోసం వచ్చినవాళ్లకు నిరాశ, కొత్తదనం కోరుకున్నవాళ్లకు పూర్తిగా మిస్ అయ్యే సినిమా ఇది. ఓవరాల్ గా గాయపడ్డ సింహాన్ని చూసి జాలిపడితే థియేటర్ నుంచి వచ్చిన ఆడియన్స్ ని చూసి మరొకరు జాలిపడతారు అన్నట్టుంది.
Gayapadda Simham movie Review
తరుణ్ భాస్కర్ హీరోగా నటించిన గాయపడ్డ సింహం తాజాగా థియేటర్లలో విడుదల కాగా థియేటర్లలో మిక్స్డ్ రెస్పన్స్ అందుకుంది. కాగా ఈ సినిమా ప్రమోషన్లలో ట్రంప్ అంశాన్ని వినియోగించడం వల్ల ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. ఫస్ట్ హాఫ్ లో ప్రేమ కథ, అమెరికా ప్రయాణం, ట్రంప్ పై ప్రతీకారం వంటి అంశాలు ప్రధానంగా చూపించారు. సెకండ్ హాఫ్ లో పోలీస్ అంశాలు, ధర్మ పాత్ర, భైరవ్ దాస్ కథ ప్రధానంగా సాగుతుంది. శ్రీ విష్ణు పాత్ర గెస్ట్ రోల్ గా కాకుండా సెకండ్ హీరోలా కనిపించడం విశేషం. అతని పాత్రకు ప్రత్యేకంగా కథను రూపొందించడం కొత్తగా అనిపించింది.
అయితే ఈ ప్రయోగం మెయిన్ స్టోరీని కొంతవరకు డామినేట్ చేసినట్లు అనిపిస్తుంది. భైరవ్ దాస్ పాత్ర ఆధారంగా భవిష్యత్తులో ప్రత్యేక సినిమా వచ్చే అవకాశం ఉందని క్లైమాక్స్ తో హింట్ ఇచ్చారు టీమ్. ట్రంప్‌కు సంబంధించిన సన్నివేశాలు హాస్యాన్ని అందిస్తాయి. అమెరికాకు వెళ్లాలని ఆశపడే ప్రేక్షకులకు ఈ కథ కనెక్ట్ అవుతుంది. కొన్ని చోట్ల కథ నెమ్మదిగా సాగినప్పటికీ, కామెడీ సీన్స్ కడుబుబ్బా నవ్విస్తాయి. ఓవరాల్ గా సినిమా గురించి సింపుల్ గా చెప్పేస్తే... “గాయపడ్డ సింహం” సినిమా అమెరికా వెళ్లాలన్న ఓ వ్యక్తి కల నెరవేరకపోవడంతో అతను తీసుకున్న నిర్ణయాలు, వాటి ప్రభావం చుట్టూ తిరిగే కథ. కామెడీ, యాక్షన్, ఎమోషనల్ అంశాలతో సినిమా రూపొందించబడింది. హ్యాపీగా నవ్వుకోవాలి అనుకునేవారికి గాయపడ్డ సింహం సినిమా మంచి ఆప్షన్.
Gayapadda Simham movie Review
By Tupaki
గాయపడ్డ సింహం కథ విషయానికి వస్తే... డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడు అయినప్పటి నుంచి తన నిర్ణయాలతో ప్రపంచాన్ని ఎలా ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాడో తెలిసిందే. అలాంటి నిర్ణయాల్లో వీసా రద్దు నిబంధనలు కూడా ఒకటి. దీనివల్ల అందరికంటే ఎక్కువగా ఇండియన్సే ఇబ్బంది పడ్డారు. ఈ కాన్సెప్ట్ బేస్ చేసుకుని కామెడీ ప్రధానంగా తెరకెక్కిన గాయపడ్డ సింహం ఆడియన్స్ ని బానే మెప్పిస్తుంది. కామెడీ బాగా రాయగలిగిన రైటర్ అయితే దీని మీద మంచి కామెడీ సీన్లతో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించేవాడు.
కానీ కొత్త దర్శకుడు కశ్యప్ శ్రీనివాస్. ఒరిజినల్ కామెడీని పండించలేక ఎక్కువగా స్పూఫుల మీద ఆధారపడ్డాడు. ఈ క్రమంలో అక్కడక్కడా కొన్ని నవ్వులు పండాయి కానీ.. ఆ డోస్ సరిపోలేదు. తనను డిపోర్ట్ చేయించిన ట్రంప్ మీద ప్రతీకారం తీర్చుకునే హీరో, ఈ పాయింట్ మీదే ఈ కథను నడిపిస్తే అది హిలేరియస్ గా వర్కవుట్ అయ్యేదేమో. కానీ ఇందులోకి క్రైమ్ రాకెట్ ట్రాక్ ను తీసుకొచ్చి మిక్స్ చేయడంతో ఈ కథ రొటీన్ క్రైమ్ కామెడీలా రూట్ తీసుకుంది. ఇక జేడీ చక్రవర్తి పాత్ర గురించి ప్రోమోల్లో ఇచ్చిన బిల్డప్ కి సినిమాలో ఉన్నదానికి పొంతన లేదు. అసలు ‘గాయపడ్డ సింహం’ టైటిల్ కే న్యాయం జరగలేదు. ఎక్కువ అంచనాలు పెట్టుకోకుండా అక్కడక్కడా కొన్ని నవ్వులతో సరిపెట్టుకుంటాం అంటే ఈ చిత్రంపై ఒక లుక్కేయొచ్చు. అంతకుమించి ఆశిస్తే కష్టం.