Register as a Reviewer
Home Latest Movie Reviews

Latest Movie Reviews

The most recent reviews from top critics and publications

739 Reviews
Showing 289–300 of 739 reviews

Dacoit movie Review

Sakshi

By Sakshi

“డెకాయిట్” పేరుతో విడుదలైన ఈ ఎమోషనల్ యాక్షన్ డ్రామా ప్రేక్షకులను పూర్తిగా మెప్పించలేకపోయినా, కొంతవరకు ఆకట్టుకునే అంశాలతో నిలిచింది. Dacoit సినిమాకు “ఓ ప్రేమ కథ” అనే ట్యాగ్‌లైన్ ఇవ్వడంతో లవ్, యాక్షన్ క...

“డెకాయిట్” పేరుతో విడుదలైన ఈ ఎమోషనల్ యాక్షన్ డ్రామా ప్రేక్షకులను పూర్తిగా మెప్పించలేకపోయినా, కొంతవరకు ఆకట్టుకునే అంశాలతో నిలిచింది. Dacoit సినిమాకు “ఓ ప్రేమ కథ” అనే ట్యాగ్‌లైన్ ఇవ్వడంతో లవ్, యాక్షన్ కలిసిన స్ట్రాంగ్ స్టోరీ ఉంటుందని ప్రేక్షకులు భావించారు. కానీ తెరపై మాత్రం ఆ అంచనాలకు విరుద్ధంగా కథ సాగడం గమనించదగ్గ విషయం.

హీరోగా Adivi Sesh, హీరోయిన్‌గా Mrunal Thakur తమ నటనతో సినిమాను కొంతవరకు నిలబెట్టారు. ముఖ్యంగా కొన్ని ఎమోషనల్ సీన్స్, క్లైమాక్స్‌లో వారి పెర్ఫార్మెన్స్ మెప్పిస్తుంది. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ కూడా సినిమాకు ప్లస్ పాయింట్‌గా మారింది.

అయితే ఫస్ట్ హాఫ్‌లో కొంత ఎంగేజ్‌మెంట్ ఉన్నా, సెకండ్ హాఫ్‌లో కథనం నెమ్మదించడం, కొన్ని లాజిక్ లేకుండా కనిపించే సన్నివేశాలు ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తాయి.


దర్శకుడు టేకింగ్ విషయంలో తన ముద్ర వేయగలిగాడు. మేకింగ్, నిర్మాణ విలువలు సినిమాకు రిచ్ లుక్ తీసుకొచ్చాయి. అయితే కంటెంట్ పరంగా బలహీనతలు ఉండటం వల్ల సినిమా పూర్తిస్థాయిలో ఎఫెక్ట్ చూపించలేకపోయింది.

మొత్తంగా “డెకాయిట్” ఓ సరాసరి ఎమోషనల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా నిలుస్తుంది. కొత్తదనం, బలమైన కథ కోరుకునే ప్రేక్షకులకు ఇది కాస్త నిరాశ కలిగించే అవకాశం ఉంది. కానీ ఎమోషనల్ టచ్, యాక్షన్ ఎలిమెంట్స్ కోసం ఒకసారి చూసేలా మాత్రం ఉంటుంది.




6.0
out of 9
2 months ago
Apr 10, 2026 Telugu

Dacoit Movie Review

"డెకాయిట్" అంటూ ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ ఎమోషనల్ ఫీల్ గుడ్ యాక్షన్ డ్రామాలో కొన్ని ఎమోషనల్ సీన్స్ అండ్ క్లైమాక్స్ బాగున్నాయి. అలాగే హీరో హీరోయిన్లుగా నటించిన అడవి శేష్, మృణాల్ ఠాకూర్ నటన కూడా బాగుంది...

"డెకాయిట్" అంటూ ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ ఎమోషనల్ ఫీల్ గుడ్ యాక్షన్ డ్రామాలో కొన్ని ఎమోషనల్ సీన్స్ అండ్ క్లైమాక్స్ బాగున్నాయి. అలాగే హీరో హీరోయిన్లుగా నటించిన అడవి శేష్, మృణాల్ ఠాకూర్ నటన కూడా బాగుంది. దీనికి తోడు కథా కథనాలు రొటీన్ గా ఉన్నాయి. కానీ డైరెక్టర్ టేకింగ్ బాగుంది. అయితే కొన్ని రెగ్యులర్ సీన్స్ అండ్ లాజిక్ లేని సీన్స్.. ముఖ్యంగా సెకండ్ హాఫ్ డ్రాప్ అవ్వడం వంటి అంశాలు సినిమాకి మైనస్ అయ్యాయి.


నిర్మాణ విలువలు రిచ్ గా ఉన్నాయి. కానీ, టేకింగ్ అండ్ మేకింగ్ లతో పాటు శేష్ – మృణాల్ మధ్య కెమిస్ట్రీ కూడా ఆకట్టుకుంది. ఓవరాల్ గా ఈ సినిమా బాగానే ఆకట్టుకుంది. కాకపోతే స్టోరీ ఫ్రెష్ గా కావాలనుకునే ఆడియన్స్ కాస్త నిరాశ చెందొచ్చు.

7.0
out of 9
2 months ago
Apr 10, 2026 Telugu

Rakasi Movie Review

రాకాస (Rakasa) 2026 Youtube Channel
రాకాస సినిమా... ఈ వీక్ థియేటర్లలో రిలీజ్ అయిన క్రేజీ మూవీస్ లో ఇదొకటి. సినిమా గురించి చెప్పాలంటే అంతగా నచ్చలేదు. సినిమా ముందు నుండి చెప్పాలన్నా, మొత్తం చూసి చెప్పాలన్నా, కథ గురించి పెద్దగా చెప్పాల్సిం...

రాకాస సినిమా... ఈ వీక్ థియేటర్లలో రిలీజ్ అయిన క్రేజీ మూవీస్ లో ఇదొకటి. సినిమా గురించి చెప్పాలంటే అంతగా నచ్చలేదు. సినిమా ముందు నుండి చెప్పాలన్నా, మొత్తం చూసి చెప్పాలన్నా, కథ గురించి పెద్దగా చెప్పాల్సిందేమి లేదు. ఎన్నో పాత సినిమాలు గుర్తొస్తాయి. ఈ సినిమా చూస్తుంటే... ఒక ఊరు.. ఊళ్ళో కోట.. కోటలో రాక్షసుడు... రాక్షసుడ్ని పీడ ఒదిలించే హీరో.. ఇదే పెద్ద హీరో అయితే సీరియస్ డ్రామాగా తీసేవాళ్ళేమో గాని, చిన్న హీరో, పైగా చిన్న కాన్సెప్ట్ కాబట్టి ఎంటర్టైన్ జోనర్ ని నమ్ముకున్నారు. 


బట్ ఇక్కడ మానస శర్మని అభినందించాల్సిందే. ఫస్ట్ మూవీ అయినా మూవీ తీయడానికి బానే కష్టపడింది. కానీ సినిమా ముందుకు వెళ్లే కొద్దీ… “ఇది ఎక్కడో చూసినట్టు ఉంది కదా?” అన్న ఫీలింగ్ వస్తుంది.

స్టోరీ కూడా ఫ్రెష్ కాదు… కామెడీ ని నమ్ముకుని బానే ట్రై చేసారు, కానీ mostly miss match. కొన్ని jokes కి outdated feel వస్తుంది. బీజీఎమ్ బాగుంది. విజువల్స్ బాగున్నాయి. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ వాల్యూస్ రిచ్ గా ఉన్నాయి. కానీ ఇదేదో స్టోరీ కంటెంట్ పై కూడా కొంచెం ఫోకస్ పెట్టుంటే బాగుండేది అనిపించింది. ఓవరాల్ గా కామెడీ ఆడియన్స్ ఒకసారి ట్రై చేయొచ్చు. 

4.0
out of 9
2 months ago
Apr 04, 2026 Telugu

Rakasa Movie Review

రాకాస (Rakasa) 2026 Youtube Channel
‘రాకాస’ సినిమా ఈ వారం థియేటర్లలో రిలీజయిన వన్ అఫ్ ది క్రేజీ సినిమా. బట్ సినిమా గురించి చెప్పాలంటే నచ్చలేదనే చెప్పాలి. సినిమాలో స్టోరీ అలా ఉంటుంది ఇలా ఉంటుంది అని మేకర్స్ బానే చెప్పడానికి ట్రై చేసారు గ...

‘రాకాస’ సినిమా ఈ వారం థియేటర్లలో రిలీజయిన వన్ అఫ్ ది క్రేజీ సినిమా. బట్ సినిమా గురించి చెప్పాలంటే నచ్చలేదనే చెప్పాలి. సినిమాలో స్టోరీ అలా ఉంటుంది ఇలా ఉంటుంది అని మేకర్స్ బానే చెప్పడానికి ట్రై చేసారు గాని, వాళ్ళు చెప్పినంత సినిమా లేదిక్కడ. రొటీన్ స్టోరీ ఉంది సరే.. బట్ సినిమా వరకైనా ఫ్రెష్ స్క్రీన్ ప్లే తో ఆడియన్స్ ని ఇంప్రెస్ చేయడానికి ట్రై చేయాలి కానీ అది కూడా లేదు. ఏదో కాసేపు నవ్వుకోవచ్చు అన్నట్టుంటుంది కానీ, థియేటర్ నుంచి బైటికొచ్చాక ఆ నవ్వులు కూడా గుర్తుండవు అన్నట్టుంటుంది రాకాస. 


కంటెంట్ కూడా పాత సినిమాల్లో చూసినట్టే ఉంటుంది, బట్ కథ పరంగా చూస్తే… ‘అంధ విశ్వాసాలకు వ్యతిరేకంగా ఒక యువకుడి పోరాటం’ అనే మూల ఆలోచన కొత్తది కాదు. సంతోష్ శోభన్ సహా అందరూ కామెడీ చేయడానికి బానే ట్రై చేసారు.. ఆ విషయంలో అపీప్రిషియేట్ చేయాల్సిందే. హాస్యాన్ని తీసుకొచ్చే ప్రయత్నం కనిపించినా… సాంకేతికంగా సినిమా ఓకే అనిపిస్తుంది. విజువల్స్ సరిపడా ఉంటాయి. కానీ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కొన్ని చోట్ల ఎక్కువగా వినిపించి ఇరిటేటింగ్ అనిపిస్తుంది. ఓవరాల్ గా సినిమా ఒకసారి చూడడమే ఎక్కువనిపిస్తుంది. 

6.0
out of 9
2 months ago
Apr 04, 2026 Telugu

Rakasa Movie Review

రాకాస (Rakasa) 2026 Youtube Channel
రాకాస’ సినిమా హారర్-కామెడీ జానర్‌లో ఒక ఇంట్రెస్టింగ్ సెటప్‌ తో స్టార్ట్ అయినా… పూర్తి స్థాయిలో ఆ ఇంపాక్ట్‌ ని మెయింటైన్ చేయలేకపోయింది. ముందు సంగీత్ శోభన్ సినిమా అని చెప్పి, వర్త్ సినిమా అన్న ఫీల్ తో వ...

రాకాస’ సినిమా హారర్-కామెడీ జానర్‌లో ఒక ఇంట్రెస్టింగ్ సెటప్‌ తో స్టార్ట్ అయినా… పూర్తి స్థాయిలో ఆ ఇంపాక్ట్‌ ని మెయింటైన్ చేయలేకపోయింది. ముందు సంగీత్ శోభన్ సినిమా అని చెప్పి, వర్త్ సినిమా అన్న ఫీల్ తో వెళ్లారు. బట్ బైటికి వస్తూ వస్తూ... డీలా పడిపోతారు. ఎంటర్టైన్మెంట్ పరంగా డోకా ఉండదు, కానీ ఏదో మిస్ అయిన ఫీల్ వస్తుంది. అండ్ కామెడీ ఉంటుంది, ఆడియన్స్ నవ్వుతారు కూడా... కానీ ఫ్రెష్ కామెడీ లాంటిదేమీ ఉండదు. ఇలాంటి కథలను ఇంతకుముందే చాలా సినిమాల్లో చూసిన ఫీలింగ్ కలుగుతుంది, దర్శకురాలు నవ్వులు పండించాలనే ప్రయత్నం చేసినా కుదర్లేదు, కొన్ని జోక్స్ అయితే పూర్తిగా అవుట్‌డేటెడ్‌గా అనిపిస్తాయి.


అయితే సెకండాఫ్‌ లో కొన్ని కామెడీ సీన్స్ నిజంగా నవ్విస్తాయి. అక్కడక్కడా సినిమా ఎంగేజ్ చేసే మూమెంట్స్ ఉన్నాయి. టెక్నికల్‌గా వీఎఫ్ఎక్స్ అద్భుతంగా లేకపోయినా, నాసిరకం అనిపించకుండా ఓకే స్థాయిలో ఉన్నాయి. విజువల్స్ కూడా సరిపడా ఉన్నాయి. మొత్తానికి మంచి ఐడియా ఉన్నా… కథలో కొత్తదనం లేకపోవడం, ఎగ్జిక్యూషన్ పూర్తిగా కన్విన్స్ చేయకపోవడం వల్ల ‘రాకాస’ సినిమా కాస్త బోర్ కొడుతోంది. కొత్తదనం కోసం ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం డిస్సపాయింట్ తప్పదు.. టైంపాస్ కోసం ఓసారి చూసేయొచ్చు. 

5.0
out of 9
2 months ago
Apr 04, 2026 Telugu

Rakasa Movie Review

రాకాస (Rakasa) 2026 Youtube Channel
Thyview

By Thyview

రాకాస అంటూ ఆడియన్స్ ముందుకు ఈ వారం థియేటర్లో రిలీజ్ అయిన సినిమా మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. అంటే సినిమా గురించి స్ట్రైట్‌ గా చెప్పాలంటే… ‘రాకాస’ ఒక హారర్ కామెడీ అనిపిస్తుంది కానీ… పూర్తిగా వర్క్ అయ్...

రాకాస అంటూ ఆడియన్స్ ముందుకు ఈ వారం థియేటర్లో రిలీజ్ అయిన సినిమా మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. అంటే సినిమా గురించి స్ట్రైట్‌ గా చెప్పాలంటే… ‘రాకాస’ ఒక హారర్ కామెడీ అనిపిస్తుంది కానీ… పూర్తిగా వర్క్ అయ్యిందా అంటే కాదు. ఫస్ట్ బిగెస్ట్ ఇష్యూ క్లైమాక్స్. సినిమాలో మొదట విలన్‌ ని ఫుల్ రూత్ లెస్ మాన్స్టర్ లా భయంకరంగా build చేసి… చివర్లో సడన్ గా సింపతీ ట్రాక్ ఇవ్వడం ఎందుకు అని అనిపిస్తుంది. ప్రతి విలన్‌ కి బ్యాక్ స్టోరీ కంపల్సరీ నా? అన్న ఫీలింగ్ వస్తుంది.


పైగా స్టోరీ కూడా కొత్తది కాదు. ‘blind belief vs hero’ plot already చాలా సార్లు చూసాం. ‘శంబాలా’ వైబ్ కూడా కొంచెం గుర్తు వస్తుంది. ఇక బీజీఎమ్ కూడా బాగా వర్కౌట్ అయింది. కాకపోతే లౌడ్ ఎక్కువైంది. విజువల్స్ కూడా ఎక్సలెంట్ గా ఉన్నాయి. పెర్ఫార్మన్స్ వైస్ సంగీత్ శోభన్ వన్ మ్యాన్ షో గా చెప్పుకోవచ్చు. దాంతో పాటూ హీరోయిన్, ఇతర కమెడియన్లు కూడా బాగానే వర్క్ చేసారు. ఫైనల్ గా కొన్ని fun moments ఉన్నా… overall మిక్స్డ్ బోర్ ఫీల్ వస్తుంది. బట్ రెగ్యులర్ మూవీ లవర్స్ కి నచ్చే ఛాన్స్ ఉంది. 

7.0
out of 9
2 months ago
Apr 04, 2026 Telugu

Rakasa Movie Review

రాకాస (Rakasa) 2026 Youtube Channel
ఫస్ట్ అఫ్ అల్ 'రాకాస' సినిమా చూసాక ముందుగా స్ట్రైట్‌ గా రివ్యూ చెప్పాలంటే… ఆడియన్స్ కి నచ్చుతుంది. ఈ సినిమా ఒక హారర్-కామెడీగా స్టార్ట్ అవుతుంది కానీ, అలాగే సినిమా మొత్తం ఎంటర్టైన్ చేస్తుంది. కానీ ఎగ్జ...

ఫస్ట్ అఫ్ అల్ 'రాకాస' సినిమా చూసాక ముందుగా స్ట్రైట్‌ గా రివ్యూ చెప్పాలంటే… ఆడియన్స్ కి నచ్చుతుంది. ఈ సినిమా ఒక హారర్-కామెడీగా స్టార్ట్ అవుతుంది కానీ, అలాగే సినిమా మొత్తం ఎంటర్టైన్ చేస్తుంది. కానీ ఎగ్జిక్యూషన్‌ లో పూర్తిగా సంతృప్తి ఇవ్వలేకపోయింది. ముఖ్యంగా క్లైమాక్స్ గురించి చెప్పాలి. మొదట విలన్‌ ను చాలా క్రూరంగా చూపించి… చివర్లో సడన్‌గా ఒక సెంటిమెంట్ బ్యాక్‌స్టోరీ ఇవ్వడం అంతగా వర్క్ కాలేదు. ప్రతి విలన్‌ కు జస్టిఫికేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉందా? అన్న ఫీలింగ్ వస్తుంది.


స్టోరీ విషయానికి వస్తే… ‘బ్లైండ్ ఫెయిత్‌ కు వ్యతిరేకంగా హీరో పోరాటం’ అనే కాన్సెప్ట్ కొత్తది కాదు. ఇలాంటి కథలను మనం ఇంతకుముందే చాలా సినిమాల్లో చూసాం. ఫస్ట్ హాఫ్ కాస్త నెమ్మదిగా సాగుతుంది. కామెడీ ట్రై చేసినా… ఎక్కువగా గ్యాగ్స్ వర్క్ కాలేదు. కొన్ని జోక్స్ అయితే పాతగా అనిపిస్తాయి. అయితే సెకండాఫ్‌ లో కొన్ని కామెడీ సీన్స్ బాగానే నవ్విస్తాయి. అక్కడక్కడా సినిమా ఎంగేజ్ చేసే మూమెంట్స్ ఉంటాయి. టెక్నికల్‌ గా బ్యాక్‌ గ్రౌండ్ స్కోర్ కొంచెం లౌడ్‌ గా అనిపిస్తుంది. అదే సమయంలో కొన్ని విజువల్స్, ప్రొడక్షన్ వాల్యూస్ మాత్రం ఓకే అనిపిస్తాయి. మంచి ఐడియా ఉన్నా, కొత్తదనం లేకపోవడం, ఎగ్జిక్యూషన్ మిస్సవడం వల్ల ‘రాకాస’ పూర్తి స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది.

7.0
out of 9
2 months ago
Apr 04, 2026 Telugu

Rakasa Movie Review

రాకాస సినిమా గురించి చెప్పాలంటే... తెలిసిన కథనే అయినా చెప్పే విధానం బాగుంటే మళ్ళీ మళ్ళీ చూడటానికి ఆడియన్స్ ఎప్పుడూ వెనకాడరు…లేడీ డైరెక్టర్ మానస శర్మ రొటీన్ కథనే ఎంచుకుని అరిగిపోయిన హర్రర్ కామెడీ జానర్...

రాకాస సినిమా గురించి చెప్పాలంటే... తెలిసిన కథనే అయినా చెప్పే విధానం బాగుంటే మళ్ళీ మళ్ళీ చూడటానికి ఆడియన్స్ ఎప్పుడూ వెనకాడరు…లేడీ డైరెక్టర్ మానస శర్మ రొటీన్ కథనే ఎంచుకుని అరిగిపోయిన హర్రర్ కామెడీ జానర్ నే మళ్ళీ ఆడియన్స్ కి తనదైన స్టైల్ ఎంటర్ టైన్ మెంట్ తో ఆకట్టుకునేలా మలిచింది. అయితే ఈ క్రమంలో కథ టేక్ ఆఫ్ కి టైం పట్టింది. సినిమా మొదలు పెట్టిన తర్వాత ఫస్టాఫ్ లో చాలా టైం వరకు స్లోగానే సాగుతుంది. ఏంటి ఇంకా అనుకున్న రేంజ్ లో ఎంటర్ టైన్ మెంట్ రావడం లేదు అని ఆడియన్స్ అనుకుంటున్న టైంలో, ఇంటర్వెల్ కి 20 నిమిషాల ముందు నుండి ఎంటర్ టైన్ మెంట్ మొదలవుతుంది.


ఓవరాల్ గా ఎక్కడా ఎంటర్టైన్మెంట్ కి డోకా లేకుండా ఆకట్టుకుంటూ సినిమా ఎండ్ అయ్యే వరకు కూడా చాలా బాగా ఆకట్టుకునేలా సాగింది అని చెప్పాలి. సంగీత్ శోభన్ మరోసారి తనదైన కామెడీతో మెప్పించాడు…తనకి తోడూగా గెటప్ శ్రీను అండ్ వెన్నెల కిషోర్ లు తమ కామెడీతో కుమ్మెశారు…హీరోయిన్ నయన్ సారికా కూడా ఆకట్టుకోగా ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే ఫస్టాఫ్ మరింత బెటర్ గా ఉండి ఉంటే ఇంకా బాగుండేది. ఓవరాల్ గా ఫస్టాఫ్ ను ఇంకా బెటర్ గా డీల్ చేసి ఉంటే ఔట్ అండ్ ఔట్ హిలేరియస్ లెవల్ లో ఉండేది.

6.0
out of 9
2 months ago
Apr 04, 2026 Telugu

Rakasa Movie Review

Tupaki

By Tupaki

ఈ వారం విడుదలైన రాకాస సినిమా గురించి చెప్పాలంటే... ఒక డీసెంట్ హారర్ కామెడీ థ్రిల్లర్ గా సినిమాని చెప్పుకోవచ్చు. సినిమాలో కంటెంట్ విషయానికి వస్తే... కథ పరంగా రొటీన్ గానే ఉంటుంది. కాకపోతే ఎంటర్టైన్మెంట్...

ఈ వారం విడుదలైన రాకాస సినిమా గురించి చెప్పాలంటే... ఒక డీసెంట్ హారర్ కామెడీ థ్రిల్లర్ గా సినిమాని చెప్పుకోవచ్చు. సినిమాలో కంటెంట్ విషయానికి వస్తే... కథ పరంగా రొటీన్ గానే ఉంటుంది. కాకపోతే ఎంటర్టైన్మెంట్ వరకు డోకా ఉండదు. సంగీత్ శోభన్ మొదలుకొని గెటప్ శీను, వెంన్నెల కిశోర్, బ్రహ్మజీ సహా అందరూ నవ్వించారు. హీరోయిన్ నయన్ సారిక కూడా ఆకట్టుకుంది. హీరోయిన్ అనగానే ఏదో మొక్కుబడి పాత్ర ఇవ్వకుండా.. కథలో కీలకంగా ఉండేలా తన పాత్రను తీర్చిదిద్దింది దర్శకురాలు మానస.


తనికెళ్ళ భరణి తన నటనా అనుభవం చూపించారు. సాంకేతిక వర్గం విషయానికి వస్తే... చిన్న సినిమా అయినప్పటికీ.. సాంకేతికంగా ‘రాకాస’ బాగుంది. ఒక చిన్న స్థాయి కామెడీ సినిమాకు మించిన నిర్మాణ విలువలు చూపించారు. పరిమిత బడ్జెట్లోనే సెట్స్.. వీఎఫెక్స్ బాగా తీర్చిదిద్దారు. అనుదీప్ దేవ్ నేపథ్య సంగీతం సినిమాకు పెద్ద బలంగా నిలిచింది. రాక్షసుడిలో ఎమోషనల్ చూపించే సన్నివేశాల్లో వచ్చే బిట్ సాంగ్.. బీజీఎం హృద్యంగా సాగాయి. మిగతా పాటలు పర్వాలేదు. రాజు ఎదురోలు కెమెరా పనితనం ఆకట్టుకుంటుంది. మానస శర్మ కథ అంత గొప్పగా లేదు. అలా అని తీసిపడేసేలా కూడా లేదు. కథలో చాలా విషయాలు సిల్లీగా.. హడావుడిగా అనిపిస్తాయి. ఏదీ సీరియస్ గా తీసుకునేలా లేకపోవడం బలహీనతే. కానీ ఈ లోపాలను మన్నించవచ్చు అనిపించేలా కామెడీ అయితే పండించగలిగింది మానస. ఆమె టేకింగ్ ట్రెండీగా అనిపిస్తుంది. ఓవరాల్ గా రాకాస ఓసారి చూసేయడానికి బాగుంటుంది. 


6.0
out of 9
2 months ago
Apr 04, 2026 Telugu

Rakasa Movie Review

రాకాస మూవీ గురించి చెప్పాలంటే.. ఫస్ట్ హాఫ్ మొత్తం లైట్ మూడ్‌ లో సాగుతుంది. క్యారెక్టర్స్ పరిచయం, కామెడీ ట్రాక్స్, కొన్ని సన్నివేశాల్లో సరదా ఎలిమెంట్స్ బాగా వర్క్ అవుతాయి. అయితే కొన్ని చోట్ల కథ నెమ్మది...

రాకాస మూవీ గురించి చెప్పాలంటే.. ఫస్ట్ హాఫ్ మొత్తం లైట్ మూడ్‌ లో సాగుతుంది. క్యారెక్టర్స్ పరిచయం, కామెడీ ట్రాక్స్, కొన్ని సన్నివేశాల్లో సరదా ఎలిమెంట్స్ బాగా వర్క్ అవుతాయి. అయితే కొన్ని చోట్ల కథ నెమ్మదిగా సాగిన ఫీలింగ్ వస్తుంది. ఒక మంచి ట్విస్ట్‌తో ఇంటర్వెల్ ముగియడం సినిమా మీద ఆసక్తిని పెంచుతుంది. ఇది సెకండ్ హాఫ్‌కు మంచి బేస్ వేస్తుంది. ఇక సెకండ్ హాఫ్‌లో కథ అసలు ట్రాక్‌లోకి వస్తుంది. ఎమోషనల్ సీన్స్, డ్రామా, క్లైమాక్స్ అన్ని కలిసి మంచి ఎంగేజింగ్ అనుభవాన్ని ఇస్తాయి. ముఖ్యంగా క్లైమాక్స్ ప్రేక్షకులను కదిలించేలా ఉంటుంది. 


ఇక పెర్ఫార్మన్స్ పరంగా సంగీత్ శోభన్ అల్టిమేట్ కామెడీ తో ఆడియన్స్ ని నవ్వించాడు. సినిమా మొత్తం ఒక్కడే అన్నట్టు రెచ్చిపోయాడు. తనతో పాటు హీరోయిన్ నయన్ సారిక రోల్ కూడా బాగుంది. గెటప్ శీను, వెన్నెల కిశోర్, బ్రహ్మాజీ అందరూ తమ తమ రోల్స్ లో బాగానే మెప్పించారు. ఓవరాల్ గా రాకాస కామెడీ జోనర్ లో హారర్ అండ్ ఫాంటసీ ఎలిమెంట్స్ తో కూడిన మూవీగా ఫ్యాన్స్ ని అలరిస్తుంది. ఈ వారం ఫామిలీతో చక్కగా ఈ సినిమాని ఎంజాయ్ చేయొచ్చు. 


6.0
out of 9
2 months ago
Apr 04, 2026 Telugu

Rakasa Movie Review

Gulte

By Gulte

నిహారిక కొణిదెల నిర్మాణం లో తెరకెక్కిన రాకాస సినిమా ఈ వారమే థియేటర్లలో విడుదలై రన్ అవుతుంది. సంగీత్ శోభన్ నయన్ సారిక జంటగా నటించగా, హారర్ కామెడీ థ్రిల్లర్ గా తెరకెక్కిన రాకాస సినిమా స్టోరీ పరంగా రొటీన...

నిహారిక కొణిదెల నిర్మాణం లో తెరకెక్కిన రాకాస సినిమా ఈ వారమే థియేటర్లలో విడుదలై రన్ అవుతుంది. సంగీత్ శోభన్ నయన్ సారిక జంటగా నటించగా, హారర్ కామెడీ థ్రిల్లర్ గా తెరకెక్కిన రాకాస సినిమా స్టోరీ పరంగా రొటీన్ గానే ఉన్నా, ఆడియన్స్ ని బాగానే నవ్వించింది. సినిమా మొత్తం నవ్విస్తూనే అక్కడక్కడా భయపెట్టారు. అయితే ‘రాకాస’లో బిగ్గెస్ట్ మైనస్ క్లైమాక్స్. ఫుల్ క్రూరంగా చూపించిన విలన్‌ కు చివర్లో సడన్‌ గా సెంటిమెంట్ బ్యాక్‌ స్టోరీ ఇవ్వడం అంతగా వర్క్ కాలేదు. ప్రతి విలన్‌కు జస్టిఫికేషన్ అవసరమా? అన్న ఫీలింగ్ వస్తుంది.  


ఇక సంగీత్ శోభన్ సినిమా మొత్తం ఫన్ తో ఎంటర్టైన్ చేసాడు. అలాగే మిగతా కమెడియన్స్ కూడా ఎవరి రోల్స్ కి తగ్గట్టు వాళ్ళు నవ్వించారు. పెర్ఫార్మన్స్ పరంగా బాగున్నా, స్టోరీ కూడా కొత్తగా అనిపించదు. ‘బ్లైండ్ ఫెయిత్‌కు వ్యతిరేకంగా హీరో పోరాటం’ అనే కాన్సెప్ట్ చాలా సినిమాల్లో చూసిందే. ‘శంబాలా’ లాంటి కథనే ఈసారి కామెడీ టచ్‌ తో చూపించినట్టే ఉంది. ఫస్ట్ హాఫ్‌ లో కామెడీ ఎక్కువగా వర్క్ కాలేదు. గ్యాగ్స్ ఫోర్స్ చేసినట్టుగా అనిపిస్తాయి. కొన్ని పాత జోక్స్ అయితే పూర్తిగా మిస్ అయ్యాయి. అయితే సెకండాఫ్‌ లో కొన్ని కామెడీ సీన్స్ బాగానే నవ్విస్తాయి. కొన్ని ఫన్ మూమెంట్స్ ఉన్నా… స్టోరీ, ఎగ్జిక్యూషన్‌ లో కొత్తదనం లేకపోవడం వల్ల బోర్ ఫీల్ వస్తుంది. టైంపాస్ కోసం ఓసారి చూసేయొచ్చు

6.0
out of 9
2 months ago
Apr 04, 2026 Telugu

Rakasa Movie Review

ఈ వారం థియేటర్లలో విడుదలైన రాకాస మూవీ మిక్స్డ్ రెస్పాన్స్ తెచ్చుకోగా, హారర్ అండ్ కామెడీ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా లో సంగీత్ శోభన్ నయన్ సారిక జంటగా నటించగా, నిహారిక కొణిదెల నిర్మించింది. సినిమా...

ఈ వారం థియేటర్లలో విడుదలైన రాకాస మూవీ మిక్స్డ్ రెస్పాన్స్ తెచ్చుకోగా, హారర్ అండ్ కామెడీ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా లో సంగీత్ శోభన్ నయన్ సారిక జంటగా నటించగా, నిహారిక కొణిదెల నిర్మించింది. సినిమా విషయానికి వస్తే... సినిమాలో వీరబాబుగా సంగీత్‌ శోభన్‌ చక్కగా నటించాడు. అతనిలోని ఈజ్‌ క్యారెక్టర్‌కు బాగా ఉపయోగపడింది. కొన్ని సీన్స్‌లో డైలాగ్‌ చెబుతుంటే ఖలేజాలో మహేశ్‌ బాబు గుర్తొస్తాడు. అతని కామెడీ టైమింగ్‌ బావుంది. హీరో తర్వాత ఎక్కువగా అలరించింది సోము పాత్రధారి వెన్నెలకిశోర్‌. నయన్‌సారిక క్యారెక్టర్‌ ఓకే అనేలా ఉంది.


అయితే హీరో హీరోయిన్‌ కి మధ్య లవ్‌ సీన్స్‌ కూడా పెద్దగా లేవు. బ్రహ్మాజీ, ఆశిష్ విద్యార్థి, రోహ‌న్ రాయ్, తనికెళ్ల భరణి, గెటప్‌ శ్రీను తదితరులు పాత్రలకు న్యాయం చేశారు. అనుదీప్‌ సంగీతం సినిమాకు ఎసెట్‌ అయింది. రెండు పాటలు ఆకట్టుకున్నాయి. కోట, విలేజ్‌ సెటప్‌ అంతా గ్రాండ్‌గా ఉంది, సీజీ వర్క్‌లో ఇంకాస్త జాగ్రత్తలు తీసుకోవలసింది. కెమెరా వర్క్‌ బాగానే ఉంది. ఎడిటింగ్‌ ఓకే. కథానుగుణంగా నిహారిక బాగానే ఖర్చు పెట్టారు. ఓ చిన్న కథతో దర్శకురాలు పాస్‌ అయ్యారనే చెప్పవచ్చు. కామెడీ హారర్‌ థ్రిల్లర్స్‌ ఇష్టపడేవాళ్లు ఓసారి రాకాస సినిమాను చూడొచ్చు.


6.0
out of 9
2 months ago
Apr 04, 2026 Telugu
Why MRO?