Register as a Reviewer
వాలా 2 (Vaazha 2)

వాలా 2 (Vaazha 2)

24 Apr 2026
Overall Rating
6.7/10
9 Reviews

మలయాళం లో బ్లాక్ బస్టర్ అయిన వాఘా మూవీ కి సీక్వెల్ గా తెరకెక్కిన 'వాఘా' 2 రీసెంట్ గా మలయాళంలో విడుదలై బ్లాక్ బస్టర్ సక్సెస్ అవగా, తెలుగులో తాజాగా "వాలా 2" పేరుతో థియేటర్లలో విడుదలైంది. హషీర్ హెచ్, అలన్ బిన్ సిరాజ్, వినాయక్ వి, అజిన్ జాయ్ మొదలైన వాళ్ళు మెయిన్ లీడ్ గా నటించగా, సావిన్ ఎస్ఏ డైరెక్ట్ చేసాడు.

Director: Savin SA
Cast: Hashir H, Alan Bin Siraj, Vinayak V, Ajin Joy, and others

Available in:

Reviews

What critics and the public are saying about వాలా 2 (Vaazha 2)

Media Reviews

9 Avg: 6.7/10
Thyview
Thyview Youtube Channel
7

Hit

Vaazha 2 Movie Review

మలయాళంలో బ్లాక్‌బస్టర్ కొట్టిన “వాఘా 2” ఇప్పుడు తెలుగులో “వాలా 2”గా వచ్చేసింది. సో… ఈ సినిమా హైప్‌కి తగ్గట్టు ఉందా? లేక జస్ట్ ఓకేనా? చూద్దాం! మొదటగా చెప్పాలంటే… స్టోరీ చాలా సింపుల్. కానీ దాన్ని డీల్ చేసిన విధానం మాత్రం ఫ్రెష్‌ గా అనిపిస్తుంది. కొత్త వాళ్లు అయినా హషీర్, అలన్, వినాయక్, అజిన్ ఈ గ్యాంగ్...

మలయాళంలో బ్లాక్‌బస్టర్ కొట్టిన “వాఘా 2” ఇప్పుడు తెలుగులో “వాలా 2”గా వచ్చేసింది. సో… ఈ సినిమా హైప్‌కి తగ్గట్టు ఉందా? లేక జస్ట్ ఓకేనా? చూద్దాం! మొదటగా చెప్పాలంటే… స్టోరీ చాలా సింపుల్. కానీ దాన్ని డీల్ చేసిన విధానం మాత్రం ఫ్రెష్‌ గా అనిపిస్తుంది. కొత్త వాళ్లు అయినా హషీర్, అలన్, వినాయక్, అజిన్ ఈ గ్యాంగ్ మొత్తం స్క్రీన్ మీద నేచురల్‌ గా ఫీల్ ఇచ్చారు. అసలు యాక్టింగ్ చేస్తున్నట్టు అనిపించదు. జస్ట్ వాళ్ల లైఫ్‌ ని చూస్తున్నట్టు ఉంటుంది.


ఫస్ట్ హాఫ్ అయితే ఫుల్ ఎంజాయ్ మోడ్! కాలేజ్ ఫ్రెండ్స్‌ తో చేసే టైం పాస్, ఫన్ మోమెంట్స్, చిన్న చిన్న కామెడీ సీన్స్ – ఇవన్నీ బాగా వర్క్ అయ్యాయి. కానీ సెకండ్ హాఫ్‌కి వెళ్లేసరికి టోన్ కొంచెం మారుతుంది. ఫన్‌తో పాటు స్ట్రగుల్స్, ఎమోషన్స్ కూడా చూపించారు. కొన్ని చోట్ల స్లోగా అనిపించినా… క్లైమాక్స్ మాత్రం సైలెంట్‌గా హార్ట్‌ని టచ్ చేస్తుంది. టెక్నికల్‌ గా చూసినా… మ్యూజిక్ డీసెంట్, ప్రొడక్షన్ వాల్యూస్ కూడా ఓకే. పెద్దగా కంప్లైంట్స్ లేవు. ఫైనల్‌గా చెప్పాలంటే… “వాలా 2” అనేది ఫ్రెండ్స్‌తో కూర్చొని చూసే ఫీల్ గుడ్ మూవీ. మీ కాలేజ్ డేస్ గుర్తొచ్చేలా చేస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఫ్రెండ్స్ తో తాపీగా థియేటర్లకు వెళ్లిపోవచ్చు. 


Apr 24, 2026 Watch
TV9 Telugu
TV9 Telugu News Channel
7

Hit

Vaazha 2 Movie Review

ఈ వారం థియేటర్లలో విడుదలైన వాలా 2 ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. కథ పరంగా పెద్ద కథ కాకపోయినా, కథనం పరంగా మంచి గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తో ఆడియన్స్ ను ఆకట్టుకున్నారు. ఎంతలా అంటే అసలు ఈ సినిమాకు అసలైన బలం, ప్రాణం.. దీని కథనం. ఒక సింపుల్ పాయింట్‌ను తీసుకొని, ఆడియన్స్‌ను ఎమోషనల్ రోలర్ కోస్...

ఈ వారం థియేటర్లలో విడుదలైన వాలా 2 ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. కథ పరంగా పెద్ద కథ కాకపోయినా, కథనం పరంగా మంచి గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తో ఆడియన్స్ ను ఆకట్టుకున్నారు. ఎంతలా అంటే అసలు ఈ సినిమాకు అసలైన బలం, ప్రాణం.. దీని కథనం. ఒక సింపుల్ పాయింట్‌ను తీసుకొని, ఆడియన్స్‌ను ఎమోషనల్ రోలర్ కోస్టర్‌ ఎక్కించడంలో డైరెక్టర్ సావిన్ ఎస్.ఏ, రచయిత విపిన్ దాస్ సక్సెస్ అయ్యారు. ఇక ఏ టీమ్ (అంకిత్ మీనన్) అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకి ప్రాణం. సీన్‌లోని మూడ్‌ను పర్ఫెక్ట్‌గా ఎలివేట్ చేసింది. 


ఈ సినిమాకి మెయిన్ పిల్లర్స్ ఈ నలుగురు కుర్రాళ్లే. హాషిర్, అలెన్, అజిన్, వినాయక్ పాత్రల్లో నటించిన వాళ్లంతా మలయాళంలో సోషల్ మీడియా స్టార్లు. వాళ్లకు ఇది నిజజీవితానికి దగ్గరగా ఉండే క్యారెక్టర్స్ కావడంతో కెమెరా ముందు యాక్ట్ చేసినట్లు అస్సలు అనిపించదు, క్యారెక్టర్లలో పరకాయ ప్రవేశం చేశారు. వాళ్ల మధ్య ఆన్-స్క్రీన్ కెమెస్ట్రీ, కామెడీ టైమింగ్ సినిమాకు హైలైట్.డబ్బింగ్ క్వాలిటీ, లోకలైజేషన్ చాలా నీట్‌గా ఉన్నాయి. విపిన్ దాస్ రైటింగ్ చాలా షార్ప్ అండ్ రిలేటబుల్. దర్శకుడు సావిన్ ఎస్.ఏ తన ఫస్ట్ సినిమా అయినా కూడా, యూత్ పల్స్ పట్టుకొని ఎక్కడా డీవియేట్ అవ్వకుండా సినిమాను ప్రెజెంట్ చేశాడు. 


ఓవరాల్ గా వాలా 2.. సగటు మిడిల్ క్లాస్ కుర్రాడి బయోపిక్..!

Apr 24, 2026 Read Review
Tupaki
Tupaki Website
6

Above Average

Vaazha 2 Movie Review

గతంలో మలయాళంలో వచ్చిన ‘వాఘా’ సినిమాకి సీక్వెల్ గా తెరకెక్కిన సినిమా ‘వాలా-2’ మలయాళంలో రూ.200 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ చిత్రాన్ని ఇప్పుడు తెలుగులోకి తీసుకొచ్చారు. ఇక థియేటర్లలో మంచి రెస్పాన్స్ తెచ్చుకున్న ఈ సినిమాలో నటీనటులు కూడా మంచి ప్రతిభ కనబరిచారు. ఈ సినిమాకు నేపథ్య సంగీతం అతి పెద్ద బలం. ‘...

గతంలో మలయాళంలో వచ్చిన ‘వాఘా’ సినిమాకి సీక్వెల్ గా తెరకెక్కిన సినిమా ‘వాలా-2’ మలయాళంలో రూ.200 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ చిత్రాన్ని ఇప్పుడు తెలుగులోకి తీసుకొచ్చారు. ఇక థియేటర్లలో మంచి రెస్పాన్స్ తెచ్చుకున్న ఈ సినిమాలో నటీనటులు కూడా మంచి ప్రతిభ కనబరిచారు. ఈ సినిమాకు నేపథ్య సంగీతం అతి పెద్ద బలం. ‘ఎ టీమ్’ సన్నివేశాలకు తగ్గట్లుగా చక్కటి బీజీఎంతో సినిమాకు కావాల్సిన ఎలివేషన్ ఇచ్చింది. అఖిల్ లైలాసురన్ సినిమాటోగ్రఫీ కూడా ఆకట్టుకుంటుంది. ఈ సినిమాకు తెలుగులో ట్రెండీ డైలాగ్స్ రాసి మన వాళ్లు బాగా కనెక్ట్ అయ్యేలా తీర్చిదిద్దారు. ‘‘మేము ప్యూర్ ఫామిలీ ఆడియన్స్ సార్, మమ్మల్ని కొడితే అనిల్ రావిపూడి అన్న ఫీల్ అవుతాడు సార్’’ లాంటి డైలాగులతో మన ఆడియన్స్ రిలేట్ అవుతారు. 


ఐతే డబ్బింగ్ విషయంలో అంత శ్రద్ధ తీసుకున్న వాళ్ళు.. ఈ చిత్రానికి ఒక తెలుగు టైటిల్ పెట్టలేక పోవడమే విచిత్రం. నిర్మాణ విలువలు ఈ కథకు అవసరమైన స్థాయిలో ఉన్నాయి. విపిన్ దాస్ ట్రెండీ కథ రాయగా.. దర్శకుడు సవిన్ దాన్ని బాగా డీల్ చేశాడు. ఇటు కామెడీని.. అటు ఎమోషన్లను బాగా బ్యాలెన్స్ చేసి మెప్పించాడు. చివరగా: వాలా-2.. యువతకు కిక్కు

Apr 24, 2026 Read Review
6

Above Average

Vaazha 2 Movie Review

మలయాళ సినిమాలు తెలుగు ఆడియెన్స్ ని బాగా ఆకట్టుకుంటున్నాయి. మంచి కంటెంట్‌తో వచ్చిన చిత్రాలు విశేషంగా అలరిస్తున్నాయి. ఆయా సినిమాలను మన ఆడియెన్స్ కూడా ఆదరిస్తుంటారు. లేటెస్ట్ గా మలయాళంలో బాక్సాఫీసు వద్ద దుమ్ములేపుతున్న మూవీ `వాలా 2`.(vaazha 2) అంతా కొత్త కుర్రాళ్లు నటించిన ఈ మూవీ తాజాగా తెలుగులో విడుదల...

మలయాళ సినిమాలు తెలుగు ఆడియెన్స్ ని బాగా ఆకట్టుకుంటున్నాయి. మంచి కంటెంట్‌తో వచ్చిన చిత్రాలు విశేషంగా అలరిస్తున్నాయి. ఆయా సినిమాలను మన ఆడియెన్స్ కూడా ఆదరిస్తుంటారు. లేటెస్ట్ గా మలయాళంలో బాక్సాఫీసు వద్ద దుమ్ములేపుతున్న మూవీ `వాలా 2`.(vaazha 2) అంతా కొత్త కుర్రాళ్లు నటించిన ఈ మూవీ తాజాగా తెలుగులో విడుదలయింది.


ఇక ఇక్కడ కూడా మంచి రెస్పాన్స్ అందుకోగా, ‘వాలా 2’ అనేది ప్రతి ఒక్కరూ తమ కాలేజీ రోజులను గుర్తు చేసుకునేలా చేసే ఒక మంచి కమింగ్-ఆఫ్-ఏజ్ డ్రామాగా రెస్పాన్స్ తెచ్చుకుంది. నేచురల్ పెర్ఫార్మెన్స్, రిలేటబుల్ కామెడీ, మరియు ఎమోషనల్ క్లైమాక్స్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణలు. అక్కడక్కడా సాగతీత సీన్లు ఉన్నప్పటికీ, మీ స్నేహితులతో కలిసి ఈ వీకెండ్ కి హ్యాపీగా చూడదగ్గ సినిమా ఇది. 


దర్శకుడు సావిన్‌ షా ఎంచుకున్న కథ బాగుంది. తెరకెక్కించిన తీరు బాగుంది. అయితే మలయాళ నేపథ్యానికి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వడం మన తెలుగు వారికి కొంత మైనస్‌గా చెప్పొచ్చు. మతం, కమ్యూనిటీకి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వడం మనకు మైనస్‌. దర్శకుడిగా సినిమాని ఎంగేజింగ్‌గా, కామెడీగా, ఎమోషనల్‌గా తెరకెక్కించడంలో సక్సెస్‌ అయ్యారు. ఇక అఖిల్‌ లైలాసురన్‌ కెమెరా వర్క్ బాగుంది. విజువల్స్ ఆకట్టుకుంటాయి. కనువిందు చేస్తాయి. పాటలు సినిమాకి ప్లస్‌, బీజీఎం అదిరిపోయింది. కన్నన్‌ మోహన్‌ ఎడిటింగ్‌ కూడా బాగుంది. నిర్మాణ విలువలకు కొదవ లేదు. టెక్నీకల్‌గా మూవీ చాలా స్ట్రాంగ్‌గా ఉందని చెప్పొచ్చు. ఫైనల్ గా టీనేజ్‌ (స్కూల్‌, కాలేజీ) కుర్రాళ్ల బయోపిక్‌ ఇది. వాళ్లు బాగా ఎంజాయ్ చేస్తారు.

Apr 24, 2026 Read Review
Samayam Telugu
Samayam Telugu Website
7

Hit

Vaazha 2 Movie Review

మలయాళంలో ‘వాలా’ (Vaazha) మొదటి భాగం సృష్టించిన సెన్సేషన్ అంతా ఇంతా కాదు. చదువులో వెనుకబడి, సమాజం దృష్టిలో ‘వేస్ట్’ అనిపించుకునే కుర్రాళ్ల కథ అది. ఇప్పుడు దానికి సీక్వెల్‌గా వచ్చిన ‘వాలా 2’ (Vaazha 2) కేవలం ఒక సినిమా మాత్రమే కాదు. ఇది మనందరి ఇళ్లలో ఉండే, పక్కింట్లో కనిపించే సగటు కుర్రాళ్ల జీవిత చరిత్...

మలయాళంలో ‘వాలా’ (Vaazha) మొదటి భాగం సృష్టించిన సెన్సేషన్ అంతా ఇంతా కాదు. చదువులో వెనుకబడి, సమాజం దృష్టిలో ‘వేస్ట్’ అనిపించుకునే కుర్రాళ్ల కథ అది. ఇప్పుడు దానికి సీక్వెల్‌గా వచ్చిన ‘వాలా 2’ (Vaazha 2) కేవలం ఒక సినిమా మాత్రమే కాదు. ఇది మనందరి ఇళ్లలో ఉండే, పక్కింట్లో కనిపించే సగటు కుర్రాళ్ల జీవిత చరిత్ర (Biopic of a Billion Bros). కథ వరకు మొదటి భాగం టెంప్లేట్‌నే తీసుకున్నా, ఈసారి ఎమోషన్స్, హ్యూమర్‌ను మరో స్థాయికి తీసుకెళ్లారు రచయిత విపిన్ దాస్. హషీర్, వినాయక్, అలన్, అజిన్.. ఈ నలుగురు స్నేహితుల జీవితం చుట్టూ కథ తిరుగుతుంది. 


ఇక ‘వాలా 2’ (Vaazha 2) మొదటి భాగం కంటే చాలా మెరుగ్గా ఉంది. కేవలం కుర్రాళ్లు మాత్రమే కాదు, తమ పిల్లల మనస్తత్వాన్ని అర్థం చేసుకోవాలనుకునే తల్లిదండ్రులు కూడా చూడాల్సిన సినిమా ఇది.మలయాళ సినిమా మళ్ళీ తన మ్యాజిక్‌ని రిపీట్ చేసింది. మన పక్కన ఉండే మనుషుల కథలను మనకు నచ్చేలా చెప్పడంలో మలయాళం తర్వాతే ఎవరైనా అని మరోసారి నిరూపించింది. సింగిల్ వర్డ్ లో మూవీ గురించి చెప్పాలంటే... ఇది మనందరి కుర్రాళ్ల బయోపిక్.. నవ్వుతూ ఏడిపించేస్తుంది!

Apr 24, 2026 Read Review
ABP Desam
ABP Desam Website
6

Above Average

Vaazha 2 Movie Review

సందేశాన్ని చేదు గుళికలా కాకుండా షుగర్ కోటింగ్ ఇచ్చి చెప్పిన సినిమాలు అన్నీ దాదాపుగా విజయాలు సాధించాయి. ఈ 'వాలా 2' కూడా ఆ కోవలోకి వస్తుంది. కథగా చూస్తే ఇదేమీ కొత్త కాదు. కానీ, ప్రతి స్టూడెంట్ కనెక్ట్ అయ్యేలా ఉంది. మలయాళంలో 200 కోట్ల రూపాయలు వసూలు చేయడానికి కారణం అదే అయ్యి ఉంటుంది. నేటివిటీని పక్కన పె...

సందేశాన్ని చేదు గుళికలా కాకుండా షుగర్ కోటింగ్ ఇచ్చి చెప్పిన సినిమాలు అన్నీ దాదాపుగా విజయాలు సాధించాయి. ఈ 'వాలా 2' కూడా ఆ కోవలోకి వస్తుంది. కథగా చూస్తే ఇదేమీ కొత్త కాదు. కానీ, ప్రతి స్టూడెంట్ కనెక్ట్ అయ్యేలా ఉంది. మలయాళంలో 200 కోట్ల రూపాయలు వసూలు చేయడానికి కారణం అదే అయ్యి ఉంటుంది. నేటివిటీని పక్కన పెడితే... తెలుగు యువత సైతం కనెక్ట్ అయ్యే అంశాలు 'వాలా 2'లో పుష్కలంగా ఉన్నాయ్.


'వాలా 2' స్పెషాలిటీ ఏమిటంటే... నేటివిటీకి, సహజత్వానికి దగ్గరగా సినిమా తీశారు. ఎక్కడా గీత దాటలేదు. ఇందులో యువతకు స్కూల్, కాలేజ్ లైఫ్ గుర్తు చేసే నోస్టాల్జియా మూమెంట్స్ చాలా ఉన్నాయి. సినిమాలకు ఓవర్సీస్ మార్కెట్ చాలా కీలకం. ఇండియా నుంచి విదేశాలకు చదువు (అమెరికా) లేదా ఉద్యోగం (దుబాయ్) కోసం వెళ్లిన యువత సినిమాలు చూడటం వల్ల ఓవర్సీస్ కలెక్షన్స్ వస్తున్నాయి. అయితే విదేశాల్లో వాళ్ళు పడే కష్టాలను వినోదాత్మకంగా చూపించారు దర్శక రచయితలు శివన్ ఎస్ఏ, విపిన్ దాస్. పరోక్షంగా సందేశం కూడా ఇచ్చారు.




అయితే 'వాలా' చూడని ప్రేక్షకులకు 'వాలా 2' చాలా కొత్తగా అనిపిస్తుంది. ఆ సినిమా చూసిన ప్రేక్షకులకు మరోసారి నోస్టాల్జియా మూమెంట్స్ గుర్తు చేస్తుంది. అక్కడక్కడా కాస్త డౌన్ అయినట్టు అనిపించినా... యూత్‌కి మాత్రం తప్పకుండా కనెక్ట్ అవుతుంది. వినోదంతో పాటు చక్కటి సందేశం ఇస్తుంది. యువతకు తమను తాము తెరపై చూసుకున్నట్టు అనిపిస్తుంది.

Apr 24, 2026 Read Review
NTV Telugu
NTV Telugu News Channel
7

Hit

Vaazha 2 Movie Review

ఈ వారం తెలుగులో థియేటర్లలో విడుదలైన ‘వాలా 2’ థియేటర్లలో మంచి రెస్పాన్స్ అందుకోగా, దర్శకుడు సావిన్ ఎస్ఏ ఒక చిన్న కథను తీసుకుని, దానికి యూత్ ఎంటర్టైన్మెంట్‌తో పాటు ఎమోషన్స్‌ను జోడించి ఆసక్తికరంగా మలిచారు. హషీర్, అలన్, వినాయక్, అజిన్ తమ పాత్రల్లో సహజంగా నటిస్తూ సినిమాకు బలం చేకూర్చారు. ముఖ్యంగా వారి మధ...

ఈ వారం తెలుగులో థియేటర్లలో విడుదలైన ‘వాలా 2’ థియేటర్లలో మంచి రెస్పాన్స్ అందుకోగా, దర్శకుడు సావిన్ ఎస్ఏ ఒక చిన్న కథను తీసుకుని, దానికి యూత్ ఎంటర్టైన్మెంట్‌తో పాటు ఎమోషన్స్‌ను జోడించి ఆసక్తికరంగా మలిచారు. హషీర్, అలన్, వినాయక్, అజిన్ తమ పాత్రల్లో సహజంగా నటిస్తూ సినిమాకు బలం చేకూర్చారు. ముఖ్యంగా వారి మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ కెమిస్ట్రీ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.


ఫస్ట్ హాఫ్ మొత్తం సరదా కామెడీతో వేగంగా సాగిపోతూ, కాలేజ్ రోజుల జ్ఞాపకాలను గుర్తు చేస్తుంది. సెకండ్ హాఫ్‌లో విదేశాల్లో ఎదురయ్యే సమస్యలను చూపిస్తూ కథలో కొంత ఎమోషనల్ టచ్ ఇచ్చారు. క్లైమాక్స్‌లో వచ్చే భావోద్వేగ సన్నివేశాలు హృదయాన్ని తాకుతాయి.


సాంకేతికంగా కూడా సినిమా పర్వాలేదనిపిస్తుంది. సంగీతం, నిర్మాణ విలువలు కథకు అనుగుణంగా ఉన్నాయి. అయితే కొత్త నటీనటులు మాత్రమే ఉండి, పెద్దగా పేరున్న నటులు లేకపోవడం చిన్న వెలితి. మొత్తంగా ‘వాలా 2’ యూత్‌ను టార్గెట్ చేసిన కమింగ్ ఆఫ్ ఏజ్ ఎంటర్టైనర్. ఫ్రెండ్స్‌తో కలిసి వీకెండ్‌లో చూసేందుకు ఓ సరదా చిత్రం. ఫైనల్ గా "ఇది బిలియన్ బాయ్స్ బయోపిక్. అంటే నాది నీది మనందరిది".


Apr 24, 2026 Read Review
Sakshi
Sakshi News Channel
7

Hit

Vaazha 2 movie Review

తెలుగులో ఈ వారం రిలీజ్ అయిన మూవీస్ లో 'వాలా 2' ఒకటి. మలయాళం లో పెద్ద హిట్ అయిన ఈ సినిమా తాజాగా తెలుగులో విడుదలైంది. పెద్ద స్టార్ కాస్ట్ లేకపోయినా, కొత్త నటుల ఎనర్జీ ఈ సినిమాకి మెయిన్ హైలైట్‌గా నిలిచింది.దర్శకుడు సావిన్ ఎస్ఏ చిన్న కథను తీసుకుని, దానిలో ఫుల్ ఎంటర్టైన్మెంట్, ఫ్రెండ్షిప్ వైబ్స్, ఎమ...

తెలుగులో ఈ వారం రిలీజ్ అయిన మూవీస్ లో 'వాలా 2' ఒకటి. మలయాళం లో పెద్ద హిట్ అయిన ఈ సినిమా తాజాగా తెలుగులో విడుదలైంది. పెద్ద స్టార్ కాస్ట్ లేకపోయినా, కొత్త నటుల ఎనర్జీ ఈ సినిమాకి మెయిన్ హైలైట్‌గా నిలిచింది.


దర్శకుడు సావిన్ ఎస్ఏ చిన్న కథను తీసుకుని, దానిలో ఫుల్ ఎంటర్టైన్మెంట్, ఫ్రెండ్షిప్ వైబ్స్, ఎమోషన్స్ అన్నీ కలిపి బాగా ప్రెజెంట్ చేశాడు. హషీర్, అలన్, వినాయక్, అజిన్ లాంటి లీడ్ యాక్టర్స్ తమ పాత్రల్లో నేచురల్‌గా లివ్ చేశారు. వారి మధ్య కెమిస్ట్రీనే సినిమాను ముందుకు నడిపించే ప్రధాన బలం.


ఫస్ట్ హాఫ్ మొత్తం ఫన్ రైడ్ లా సాగిపోతూ, కాలేజ్ డేస్‌ను రీక్రియేట్ చేస్తుంది. సెకండ్ హాఫ్‌లో విదేశాల్లో ఫేస్ చేసే స్ట్రగుల్స్‌ను చూపిస్తూ, నవ్వుల మధ్య ఒక ఫీలింగ్ కూడా ఇస్తుంది. క్లైమాక్స్ మాత్రం సైలెంట్‌గా హార్ట్‌ని టచ్ చేసేలా డిజైన్ చేశారు. మ్యూజిక్, ప్రొడక్షన్ వాల్యూస్ కూడా కథకి సపోర్ట్ అయ్యాయి. కొన్ని చోట్ల స్లోగా అనిపించినా, ఓవరాల్‌గా ‘వాలా 2’ యూత్‌తో పాటు ఫ్రెండ్స్‌తో ఎంజాయ్ చేసే ఫీల్ గుడ్ మూవీ.


ఫైనల్ వర్డ్: ఫ్రెండ్షిప్ + ఫన్ + ఎమోషన్ కావాలంటే ఈ వీకెండ్ కి పర్ఫెక్ట్ ఛాయిస్

Apr 24, 2026 Read Review
123telugu
123telugu Website
7

Hit

Vaazha 2 Movie Review

మలయాళంలో బ్లాక్ బస్టర్ అయిన "వాఘా 2" మూవీ తాజాగా "వాలా 2" పేరిట తెలుగులో రిలీజ్ అవగా, థియేటర్లలో మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. నటీనటులు అందరూ చిన్నవాళ్ళే అయినా అందరూ బాగా నటించారు. చిన్న కథని ఎంతో ఎంటర్టైనింగ్ గా మంచి ఎమోషన్స్ తో తెరకెక్కించాడు దర్శకుడు సావిన్ ఎస్ఏ. మ్యూజిక్ పరంగా నిర్మాణ విలువల పరంగ...

మలయాళంలో బ్లాక్ బస్టర్ అయిన "వాఘా 2" మూవీ తాజాగా "వాలా 2" పేరిట తెలుగులో రిలీజ్ అవగా, థియేటర్లలో మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. నటీనటులు అందరూ చిన్నవాళ్ళే అయినా అందరూ బాగా నటించారు. చిన్న కథని ఎంతో ఎంటర్టైనింగ్ గా మంచి ఎమోషన్స్ తో తెరకెక్కించాడు దర్శకుడు సావిన్ ఎస్ఏ. మ్యూజిక్ పరంగా నిర్మాణ విలువల పరంగా కూడా టీం ని మెచ్చుకోవాలి. 


ఇక ​ఓవరాల్ గా చూసుకుంటే, ‘వాలా 2’ అనేది ప్రతి ఒక్కరూ తమ కాలేజీ రోజులను గుర్తు చేసుకునేలా చేసే ఒక మంచి కమింగ్-ఆఫ్-ఏజ్ డ్రామా. నేచురల్ పెర్ఫార్మెన్స్, రిలేటబుల్ కామెడీ, మరియు ఎమోషనల్ క్లైమాక్స్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణలు. అక్కడక్కడా సాగతీత సీన్లు ఉన్నప్పటికీ, మీ స్నేహితులతో కలిసి ఈ వీకెండ్ కి హ్యాపీగా చూడదగ్గ సినిమా ఇది.

Apr 24, 2026 Read Review

Public Reviews

Avg: —

No public reviews yet.

About This Movie

కథ విషయానికి వస్తే... చిన్నప్పట్నుంచి ప్రాణ స్నేహితులైన హషీర్ (హషీర్), అలన్ (అలన్ బిన్ సిరాజ్), వినాయక్ (వినాయక్ వి), మరియు అజిన్ (అజిన్ జాయ్) కాలేజీ లో కూడా బెస్ట్ ఫ్రెండ్స్. అయితే అల్లరి చిల్లరగా వీళ్ళు చేసే కొన్ని పనుల వల్ల కాలేజీలో లెక్చరర్లతో పాటు, ఇంట్లో పెద్దవాళ్ళ ముందు కూడా అవమానాల పాలవుతారు. కొన్ని నాటకీయ పరిణామాల తర్వాత ఆ నలుగురు స్నేహితుల్లో మార్పు వచ్చి బాగా చదువుకుని విదేశాలకు వెళ్లి బాగా ఎదగాలని, డబ్బు సంపాదించాలని డిసైడ్ అవుతారు. ఈ ప్రయాణంలో వాళ్ళు ఎలాంటి ఇబ్బందులెదుర్కొన్నారు! ఫైనల్ గా ఈ స్నేహితులు అనుకున్నది సాధించారా లేదా అన్నది కథ. 
 
వాలా 2 పేరుతో విడుదలైన ఈ మలయాళ డబ్బడ్ మూవీ రిలీజ్ కి ముందు నుంచే మంచి హైప్ తెచ్చుకుంది. దానికి తోడు ​ఈ సినిమాకు తెలుగులోనూ మంచి ప్రమోషన్లు దక్కాయి. ఇక సినిమా కూడా ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంటుంది. కథ పరంగా చిన్న కథే అయినా, దాన్ని ఎంతో ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లే తో ఆడియన్స్ కి నచ్చే విధంగా తెరకెక్కించాడు దర్శకుడు. ముఖ్యంగా స్టూడెంట్ లైఫ్ లో చేసే అల్లరి, తప్పులను, ఎంజాయ్మెంట్స్ ని బాగా చూపించారు. పైగా సినిమాలో స్వచ్ఛమైన కాలేజీ లైఫ్ సహజత్వం సినిమాలో కనిపించింది. అదే మూవీకి బిగ్ ప్లస్ పాయింట్. 

ఇక లీడ్ రోల్స్ లో నటించిన హషీర్, అలన్, వినాయక్, అజిన్ తమ పాత్రల్లో సహజంగా నటించారు. వాళ్ళ ఫ్రెండ్షిప్ బాండింగ్ కూడా బాగా చూపించారు. ఇక సినిమా మొత్తం ఎక్కడా పెద్దగా బోర్ లేకుండా, ఎంటర్టైన్మెంట్ తో అలాగే అక్కడక్కడా మంచి ఎమోషన్స్ తో ఇంప్రెస్ చేస్తుంది. అలాగే క్లైమాక్స్ కూడా చాలా గ్రిప్పింగ్ గా ఉంటుంది. డబ్బింగ్ మూవీ అన్న ఫీల్ కూడా అంతగా రాదు. 

అయితే మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే... కథనం కొన్ని చోట్ల నెమ్మదిగా సాగుతుంది. రెగ్యులర్ కమర్షియల్ అంశాలు ఇందులో ఉండవు, కాబట్టి మాస్ ఆడియన్స్ కి బోర్ కొట్టొచ్చు. పైగా లవ్ స్టోరీస్ కూడా అంత బాలేదు. ఇక అక్కడక్కడా డబ్బింగ్ సింక్ అవలేదు. ఇక టైటిల్ కూడా తెలుగులో పెట్టి ఉంటే బాగుండేది.  టెక్నికల్ గా చూసుకుంటే... డైరెక్టర్ సావిన్ ఎస్ఏ ఈ కథని ఆడియన్స్  నచ్చే విధంగా తీయడం లో సక్సెస్ అయ్యాడు. కన్నన్ మోహన్ ఎడిటింగ్ బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. ఎ టీమ్ అందించిన సంగీతం బాగుంది. బీజీఎమ్ కూడా మంచి ప్లస్ అయింది. 

Final Review : ​ఓవరాల్ గా చూసుకుంటే, ‘వాలా 2’ అనేది అన్ని రకాల ఆడియన్స్, ముఖ్యంగా ఇప్పటి యూత్ తమ కాలేజీ రోజులను గుర్తుచేసుకునేలా మంచి ఎంటర్టైనర్ గా వాలా 2 ని బెస్ట్ చాయిస్ గా చూడొచ్చు. కొన్ని రకాల ల్యాగ్ సీన్లు ఉన్నా పట్టించుకోకుండా బాగా ఎంజాయ్ చేయొచ్చు. 

Review Statistics

6.7
Overall Rating
Avg. of all reviews
9
Total Reviews
From 3 Provider Types

Review Average

Media
6.7/10
Public
N/A
Why MRO?