Register as a Reviewer
సింగ్ గీతం (Sing Geetham)

సింగ్ గీతం (Sing Geetham)

12 Jun 2026
Overall Rating
7.0/10
1 Reviews

లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించిన మూవీ "సింగ్ గీతం". ఆయన 94 ఏళ్ళ వయసులో డైరెక్ట్ చేసిన ఈ సినిమాను డైరెక్టర్ నాగ్ అశ్విన్ నిర్మించగా, జూన్ 12న థియేటర్లలో విడుదలైంది.

Director: Singeetham Srinivasa Rao
Cast: Ahilya Bamroo, Ayaan, Shalini Kondepudi, Siva Narayana, Banerjee and others

Available in:

Reviews

What critics and the public are saying about సింగ్ గీతం (Sing Geetham)

Media Reviews

1 Avg: 7.0/10
123telugu
123telugu Website
7

Hit

Sing geetham movie Review

లెజెండరీ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు గారి నుంచి వచ్చిన మరో కొత్త ప్రయోగ చిత్రమే ‘సింగ్ గీతం’. తన 90ల వయస్సులో కూడా దర్శకత్వం మీద ఎంతో ఫ్యాషన్ తో చేసిన ఈ చిత్రానికి నాగ్ అశ్విన్ విజన్ కూడా తోడై తెరకెక్కిన ఈ సినిమా లేటెస్ట్ గా థియేటర్లలో విడుదలైంది. సినిమా విషయానికి వస్తే.. మొత్తంగా ‘సింగ్ గీత...

లెజెండరీ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు గారి నుంచి వచ్చిన మరో కొత్త ప్రయోగ చిత్రమే ‘సింగ్ గీతం’. తన 90ల వయస్సులో కూడా దర్శకత్వం మీద ఎంతో ఫ్యాషన్ తో చేసిన ఈ చిత్రానికి నాగ్ అశ్విన్ విజన్ కూడా తోడై తెరకెక్కిన ఈ సినిమా లేటెస్ట్ గా థియేటర్లలో విడుదలైంది. సినిమా విషయానికి వస్తే.. మొత్తంగా ‘సింగ్ గీతం’ అనే చిత్రం సింగీతం శ్రీనివాసరావు గారి నుంచి మరో వినూత్న విజయ ప్రయత్నం. 40 ఏళ్ల కితమే తనకి వచ్చిన ఈ ఆలోచన ఇప్పటికీ మెప్పించే విధంగా ఉంది అంటే ఆయన ఏ రీతి దర్శకుడు అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. 


ఇక తనకి తగ్గట్టుగా పాటలు, సంగీతం ప్రధానంగా సాగిన ఈ సినిమాలో దేవిశ్రీ ప్రసాద్ పనితనం కూడా మరో బిగ్గెస్ట్ హైలైట్ గా నిలిచింది. నటీనటుల పెర్ఫామెన్స్ లు కూడా మరింత ప్లస్ అయ్యాయి. చిన్నపాటి పొరపత్యాలు ఉన్నాయి కానీ వాటిని మిగతా అంశాలు కప్పేస్తాయి. సో సింగీతం గారి మార్క్ విజన్ తో కూడిన అందమైన చందమామ కథ లాంటి సినిమా చూడాలి అనుకుంటే ఈ వారాంతంలో ఫ్యామిలీతో కలిసి ధారాళంగా ఈ సినిమాని వీక్షించవచ్చు.


Jun 12, 2026 Read Review

Public Reviews

Avg: —

No public reviews yet.

About This Movie

Story :

కథ విషయానికి వస్తే... బీహార్ జైలు నుండి విడుదలైన ప్రతాప్ మన్నెం (అయాన్) అనే యువకుడు తన తండ్రి ఆస్తి, స్థలాన్ని సొంతం చేసుకోవాలని "కుబేరపురం" అనే గ్రామానికి వస్తాడు. అయితే తన తండ్రికి చెందిన స్థలంలోనే బంగారు గనులున్నాయని గ్రహిస్తాడు. అలాగే ఆ ఊళ్ళో రేణు (షాలిని కొండెపూడి), తన తండ్రి బ్రహ్మయ్య (బెనర్జీ) కూడా బంగారు గనిని సొంతం చేసుకోవాలని ప్లాన్ చేస్తారు. మరోవైపు ఆ ఊరి మొత్తానికి ఉండే ఒకే ఒక్క చెట్టును దాన్ని అమ్మలా చూసుకునే గౌరీ (అహిల్యా బమ్రూ) వల్ల ఆ ఊరిలో ఒక్కసారిగా పలు మార్పులు సంభవిస్తాయి. ఆ ఊళ్ళో జనాలు అంతా మాట్లాడ్డం మానేసి పాటలు పాడుతుంటారు. దీంతో ప్రతాప్ అనుకున్న పని కూడా జరగదు. దీంతో ఊరికి వచ్చిన ఆ సమస్యను క్లియర్ చేయడానికి ప్రతాప్ ప్రయత్నిస్తాడు. మరి ఆ ఊరి జనం అంతా మళ్ళీ మామూలు అయ్యారా లేదా? అసలు ఆ ఊరికొచ్చిన సమస్య ఏంటి? ఆ ఊరి గత చరిత్ర ఏంటి? ప్రతాప్ అనుకున్నది సాధించడా? లేదా? అనేది మిగిలిన కథ.    

 

Plus Points : 

ముందుగా "సింగ్ గీతం" మూవీని డైరెక్ట్ చేసిన దర్శకులు సింగీతం శ్రీనివాసరావుని మెచ్చుకొని తీరాలి. ఒక డిఫరెంట్ సబ్జెక్టుని తీసుకుని నేటి జెనరేషన్ కి అనుకూలంగా తీయడంలో ఆయనకు సాటి ఎవరూ లేరని మరోసారి ప్రూవ్ అయింది. దానికి నాగ్ అశ్విన్ సహకారం, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం తోడై మంచి సినిమాని ఆడియన్స్ కి అందించడంలో దోహదపడ్డారు. అన్నిటికి మించి సింగీతం 94 ఏళ్ళ వయసులో మళ్ళీ ఓ సినిమాని డైరెక్ట్ చేయడం మాములు విషయం కాదు. బహుశా ఇండియన్ సినిమా హిస్టరీ లో ఈ ఏజ్ లో సినిమాని డైరెక్ట్ చేసిన వ్యక్తి ఈయనే కావచ్చు. 

 

ఇక సినిమాలో దర్శకులు సింగీతం శ్రీనివాసరావు తన క్లాసిక్ విజన్ లో చెప్పాలనుకున్న పాయింట్ బాగా రాసుకున్నారు. ఇదే సింగీతం శ్రీనివాసరావు గారి క్లాసిక్ ఆలోచన టాలెంట్ కి నిదర్శనం. ఇక సినిమా చూసాక ఆడియన్స్ కి కూడా కథల విషయంలో సంగీతం అడ్వాన్స్డ్ థాట్స్, ఆయన డైరక్షన్ స్కిల్స్ పై మరింత రెస్పెక్ట్ పెరుగుతుంది. సినిమాని కమర్షియల్ ఎలిమెంట్స్ కి దూరంగా, రియాలిటీ సిచ్యుయేషన్స్ కి దగ్గరగా చూపించడం బాగుంది. ప్రకృతిని నాశనం చేస్తున్న మనుషులకి వాళ్ళ తప్పుల్ని గుర్తు చేస్తూ, చాలా మందికి తెలిసిన సబ్జెక్టునే డైరెక్టర్ తన కోణంలో చూపించాడు. ఇక సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన సంగీతం కూడా బిగ్ అడ్వాంటేజ్ అయింది. చాలా క్రియేటివ్ గా ఇందులో మ్యూజిక్ ఉంటుంది. అలాగే సినిమాలో నటీనటులందరూ డీసెంట్ పెర్ఫార్మన్స్ తో మెప్పించారు. 

 

Minuspoints : 

అయితే ఈ సినిమాలో చాలా మంచి పాయింట్స్ ఉన్నా, కాన్సెప్ట్ డిఫరెంట్ గా ఉన్నా కొన్ని లూప్ హొల్స్ కనిపిస్తూనే ఉన్నాయి. చాలా సీన్స్ రియాలిటీకి దూరంగా ఉంటాయి. పైగా సినిమాలోని ఊళ్ళో ఫెసిలిటీస్ రియాలిటీకి దూరంగా లాజిక్ లేకుండా ఉన్నట్టు అనిపిస్తుంది. అలానే ఇందులో చూపించే కొన్ని ఫాంటసీ కథలు కూడా మనం ఆల్రెడీ చూసినట్టు ఉంటాయి. సో ఫ్రెష్ స్టోరీస్ చూడాలనుకునే వారు కొంత డిస్సపాయింట్ అవొచ్చు. అలాగే దేవిశ్రీ మ్యూజిక్ బాగున్నా కొత్తగా అనిపించలేదు. సినిమా కూడా కాస్త ల్యాగ్ అయిందేమో అన్న ఫీల్ వస్తుంది. 

 

Technical values :

ఇక టెక్నికల్ గా చూస్తే.. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వ ప్రతిభకి తోడు నిర్మాత నాగ్ అశ్విన్ సహకారం ఎంతో హెల్ప్ అయింది. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. అలాగే అనుకూర్ సి అందించిన కెమెరా వర్క్ బాగుంది. ఎడిటింగ్ కూడా డీసెంట్ ఉంది. కొన్ని ల్యాగ్ సీన్స్ తగ్గించాల్సింది. ఇక దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ పరంగా సింగీతం శ్రీనివాసరావు ఐడియాకి తగ్గట్టు పర్ఫెక్ట్ గా ఇచ్చాడు. 

 

Final Review :

ఇక ఓవరాల్ గా సింగ్ గీతం సినిమా సింగీతం శ్రీనివాసరావు నుండి వచ్చిన మరో డిఫరెంట్ ప్రయోగాత్మక మంచి మూవీ అని చెప్పొచ్చు. ఇక నాలుగు దశాబ్దాలక్రితమే ఆయన అనుకున్న ఈ కాన్సెప్ట్ ని ఇప్పటికీ ఆడియన్స్ మెచ్చే విధంగా ఉండడం విశేషం. అలాగే దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్, కూడా హైలెట్ అయింది. మొత్తంగా సింగీతం మార్క్ విజన్ తో కూడిన కథని థియేటర్లలో పేక్షకులు ఈ వీకెండ్  హ్యాపీగా చూసేయొచ్చు.

Review Statistics

7.0
Overall Rating
Avg. of all reviews
1
Total Reviews
From 1 Provider Types

Review Average

Media
7.0/10
Public
N/A
Why MRO?