సహ (Sahaa)
శివ కాసారం, శ్వేతా లక్ష్మణ్ హీరోహీరోయిన్లుగా నటించిన లేటెస్ట్ మూవీ "సహ". నిశాంత్ దోటి డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాను తేజ వేల్పుచర్ల నిర్మించగా తాజాగా థియేటర్లలో విడుదలై మిక్స్డ్ రెస్పాన్స్ అందుకుంటుంది.
Available in:
Reviews
What critics and the public are saying about సహ (Sahaa)
Media Reviews
7 Avg: 5.4/10Above Average
Cinema picha
సహ.. లైఫ్ అఫ్ సంజు అని మూవీ రిలీజ్ అయింది. సో లైఫ్ అఫ్ సంజు సహా అనే ఈ మూవీని ఒక డీసెంట్ అండ్ క్లీన్ లవ్ స్టోరీస్ లాగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నంలో... ఎక్కడా పెద్దగా బోర్ కొట్టకుండా, డీసెంట్ గా నీట్ గా ప్రెజెంట్ చేయడంలో సక్సెస్ అయ్యారేమో అని నాకు అనిపించింది. అండ్ సినిమాకి వాళ్ళు పెట్టిన...
సహ.. లైఫ్ అఫ్ సంజు అని మూవీ రిలీజ్ అయింది. సో లైఫ్ అఫ్ సంజు సహా అనే ఈ మూవీని ఒక డీసెంట్ అండ్ క్లీన్ లవ్ స్టోరీస్ లాగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నంలో... ఎక్కడా పెద్దగా బోర్ కొట్టకుండా, డీసెంట్ గా నీట్ గా ప్రెజెంట్ చేయడంలో సక్సెస్ అయ్యారేమో అని నాకు అనిపించింది. అండ్ సినిమాకి వాళ్ళు పెట్టిన ఎఫర్ట్ కి అప్రిషియేట్ చేయగలిగేలాగానే మన ముందుకు తీసుకొచ్చారు అని చెప్పాలి.
అండ్ లైఫ్ అఫ్ సంజు లైఫ్ లో సహ ప్లే చేసిన ఇంపార్టెంట్ రోల్ ఏంటి? అండ్ సంజు ట్రాన్సషన్ లైఫ్ ని ఈ స్క్రీన్ ప్లే ద్వారా బాగా ప్రెజెంట్ చేయడానికి ట్రై చేసారు. అండ్ అక్కడక్కడా బోర్ సీన్స్ ఉన్నాయి. అండ్ అక్కడక్కడా కొంచెం యాక్షన్ తో కూడిన ఎపిసోడ్స్ ని కూడా ట్రై చేసారు. ఓవరాల్ గా ఆ లవ్ స్టోరీ లో సంజు - సహా లైఫ్ లో వాళ్ళ రేలేషన్షిప్ ని బాగా చూపించారు. అండ్ సినిమా క్లైమాక్స్ బాగా డిస్ట్రబ్ చేసింది. అందుకనే ఈ క్లైమాక్స్ కి అందరూ కనెక్ట్ కాకపోవచ్చు. కొందరు ఈజీగా కనెక్ట్ అవుతారు. ఆ లాస్ట్ 15 మినిట్స్ అయితే మనం ఎమోషనల్ అయ్యేట్టుగా మేకర్స్ తీసుకెళ్లారు. ఫైనల్ గా ఇది ఒక గ్రేట్ మూవీ అని చెప్పను గాని, వాళ్ళు తీసిన సినిమా, చేసిన ప్రయత్నం, అండ్ పెర్ఫార్మన్సెస్, వాళ్ళు చెప్పాలనుకున్న పాయింట్ ని కూడా చక్కగానే చెప్పారు అనేది నా ఫీలింగ్.
Not Good
Sahaa movie review
సహ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఈ సినిమా కచ్చితంగా హిట్ అవుతుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేసింది. అంతేకాక హీరో, హీరోయిన్ ఓ అడుగు ముందుకు వేసి మరీ శపథాలు చేశారు. ఈ మేరకు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు చేసింది. సహ మూవీ హీరోయిన్ శ్వేతా లక్ష్మణ్ మాట్లాడుతూ.. ఈ సినిమా చూశాక మీరందరూ ఒక గొ...
సహ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఈ సినిమా కచ్చితంగా హిట్ అవుతుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేసింది. అంతేకాక హీరో, హీరోయిన్ ఓ అడుగు ముందుకు వేసి మరీ శపథాలు చేశారు. ఈ మేరకు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు చేసింది. సహ మూవీ హీరోయిన్ శ్వేతా లక్ష్మణ్ మాట్లాడుతూ.. ఈ సినిమా చూశాక మీరందరూ ఒక గొప్ప సినిమా చూశామని బయటకు వస్తారు.. ఈ సినిమా మీకు నచ్చకపోతే నేను అమీర్ పేట్ సెంటర్ లో నిలబడి గుండు కొట్టించుకుంటా.. అని చెప్పింది.
సినిమా మాత్రం దానికి రివర్స్ లో ఉంది. డీసెంట్ అనే దానికి కూడా వంద అడుగుల దూరంలో ఆగిపోయింది. స్టోరీ, స్క్రీన్ ప్లే రొటీన్ గా ఉండి బోర్ కొట్టేసింది. ఇక నటీనటుల పనితీరు విషయానికి వస్తే సంజు పాత్రలో శివ కుమార్ బాగా చేశారు. అలాగే సహ పాత్రలో హీరోయిన్ శ్వేతా లక్ష్మణ్ తన లుక్స్ తో ఆకట్టుకుంది. అయితే సినిమాను ఆసక్తికరంగా తెరకెక్కించడంలో దర్శకుడు ఫెయిల్ అయ్యాడనే చెప్పాలి. లాజిక్ లెస్ సీన్స్ తో ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టినట్లు ఆడియన్స్ నుంచి కామెంట్స్ వినిపిస్తున్నాయి. మొత్తానికి హీరో, హీరోయిన్లు శపథం చేసినంతగా ఈ సినిమా లేదని చెప్పాలి.
Above Average
Sahaa movie review
నవతరం ప్రేమకథల్లో మునుపెన్నడూ చూడని విభిన్నమైన ఎమోషనల్ డెప్త్‌తో దర్శకుడు నిశాంత్ దోటి తెరకెక్కించిన చిత్రం 'సహ' (లైఫ్ ఆఫ్ సంజు). పూర్తిగా నాయకానాయికల కోణం నుంచే సాగే ఈ కథ, ప్రేమలో తీవ్రమైన అనుబంధం పెంచుకుని ఆ బంధం తెగిపోయాక ఒక యువకుడు ఎదుర్కొనే మానసిక సంఘర్షణను, డిప్రెషన్ మరియు ట్రామాను ఎంతో సహజంగా...
నవతరం ప్రేమకథల్లో మునుపెన్నడూ చూడని విభిన్నమైన ఎమోషనల్ డెప్త్‌తో దర్శకుడు నిశాంత్ దోటి తెరకెక్కించిన చిత్రం 'సహ' (లైఫ్ ఆఫ్ సంజు). పూర్తిగా నాయకానాయికల కోణం నుంచే సాగే ఈ కథ, ప్రేమలో తీవ్రమైన అనుబంధం పెంచుకుని ఆ బంధం తెగిపోయాక ఒక యువకుడు ఎదుర్కొనే మానసిక సంఘర్షణను, డిప్రెషన్ మరియు ట్రామాను ఎంతో సహజంగా ఆవిష్కరించింది.
సంజు, సహ పాత్రల్లో నటించిన శివ కుమార్, శ్వేత లక్ష్మణ్ తమ సహజసిద్ధమైన నటనతో పాత్రలకు నూటికి నూరుపాళ్లు ప్రాణం పోయగా, చివరి 20 నిమిషాల క్లైమాక్స్ సన్నివేశాలు ప్రేక్షకుల హృదయాలను తీవ్రంగా కలచివేస్తాయి. అయితే, కథనంలో కొన్ని చోట్ల లాజిక్ లోపించడం, కథ ముందుకు వెళ్లే కొద్దీ వాతావరణం అత్యంత భారంగా మారడం వల్ల ఈ చిత్రం అందరినీ ఆకట్టుకోకపోవచ్చు.
కేవలం తీవ్రమైన ఎమోషనల్ డ్రామాలను ఆస్వాదించే ప్రత్యేక వర్గం (ఓ సెక్షన్) ప్రేక్షకులకు మాత్రమే పరిమితమయ్యే ఈ చిత్రాన్ని చూడటానికి కాస్త ఓపిక, సహనం తప్పనిసరి. ఫైనల్లీ.. గుండెల్ని పిండేసే ఎమోషన్స్ తో సహా ఫీల్ గుడ్ డ్రామా.
Above Average
Sahaa movie review
సహా అనే చిన్న సినిమాకు మొదట్లో పెద్ద బజ్ లేకపోయినా ప్రమోషన్స్ కి కిరణ్ అబ్బవరం, బన్నీ వాసు, వంశీ నందిపాటి రావడం, సినిమా నచ్చకపోతే హీరోయిన్ గుండు కొట్టించుకుంటా అనడంతో ఒక్కసారిగా ఈ సినిమా వైరల్ అయింది. రిలీజ్ కి ముందు టీజర్, ట్రైలర్, సాంగ్స్ అయితే బాగున్నాయి. అయితే ఇది మాములు లవ్ స్టోరీనే అని ముందును...
సహా అనే చిన్న సినిమాకు మొదట్లో పెద్ద బజ్ లేకపోయినా ప్రమోషన్స్ కి కిరణ్ అబ్బవరం, బన్నీ వాసు, వంశీ నందిపాటి రావడం, సినిమా నచ్చకపోతే హీరోయిన్ గుండు కొట్టించుకుంటా అనడంతో ఒక్కసారిగా ఈ సినిమా వైరల్ అయింది. రిలీజ్ కి ముందు టీజర్, ట్రైలర్, సాంగ్స్ అయితే బాగున్నాయి. అయితే ఇది మాములు లవ్ స్టోరీనే అని ముందునుంచే అనిపించింది. అయితే ఈ కథ అంతా నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే లో నడుస్తుంది. ముందుకు, వెనక్కి కథ వెళ్తూ ఉంటుంది.
నటీనటులు అక్కడక్కడా కామెడితో నవ్వించారు. క్లైమాక్స్ లో మాత్రం ఏడిపించారు. ఇదేమి కొత్త కథ, కథనం అయితే కాదు. చాలా చోట్ల సన్నివేశాలను బాగా సాగదీశారు. కాకపోతే మరీ బోరింగ్ ఫీల్ రాకుండా కథనంతో మెప్పించారు. ఈ సినిమా చాలా చోట్ల ఒక మంచి షార్ట్ ఫిలిం, నిడివి ఎక్కువ ఉన్న షార్ట్ ఫిలిం చూసినట్టు అనిపిస్తుంది. కొన్ని చోట్ల 7/G బృందావన కాలనీ, లాంటి పలు సినిమా ఛాయలు కనిపిస్తాయి. ఇక ఇలాంటి లవ్ సీన్స్ బోలెడన్ని సినిమాల్లో ఉన్నవే. ఒకసారి చూడొచ్చు. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. మొత్తంగా ‘సహా’ ఒక అబ్బాయి జీవితాంతం ఒకే అమ్మాయిని ప్రేమించడం, వాళ్ళ మధ్య జరిగే సంఘటనలతో ఏం జరిగింది అనే సినిమా.
Average
Sahaa movie review
స్యాడ్ ఎండింగ్ తో ఇటీవల చాలా సినిమాలు వస్తున్నాయి. అందులో కొన్నింటినే ఆడియెన్స్ యాక్సెప్ట్ చేస్తున్నారు. `సహ` ఏ సైడ్ ఉంటుందనేది సస్పెన్స్. అయితే ఇదొక లవ్ అండ్ ఎమోషనల్ డ్రామా. టీనేజ్‌లో ప్రేమలో పడటం, పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకోవడం, ఆ తర్వాత రియాలిటీలోకి వచ్చాక కుటుంబాన్ని పోషించాలన్నప్పుడు డ...
స్యాడ్ ఎండింగ్ తో ఇటీవల చాలా సినిమాలు వస్తున్నాయి. అందులో కొన్నింటినే ఆడియెన్స్ యాక్సెప్ట్ చేస్తున్నారు. `సహ` ఏ సైడ్ ఉంటుందనేది సస్పెన్స్. అయితే ఇదొక లవ్ అండ్ ఎమోషనల్ డ్రామా. టీనేజ్‌లో ప్రేమలో పడటం, పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకోవడం, ఆ తర్వాత రియాలిటీలోకి వచ్చాక కుటుంబాన్ని పోషించాలన్నప్పుడు డబ్బులు లేక, జాబ్ లేక ఇబ్బంది పడటం, ఈ క్రమంలో ఎదురయ్యే అవమానాలు, చోటు చేసుకునే సంఘటనల సమాహారమే ఈ మూవీ.
ఈ మూవీ క్లైమాక్స్ ఏంటో ప్రారంభంలోనే అర్థమయ్యేలా ఉంది. ఇలాంటి కంటెంట్ ని జనాలు ఎంజాయ్ చేయడం కష్టమే, అంత ఓపిక జనాలకు లేదు. ఇక చిన్నపాటి సస్పెన్స్, ట్విస్ట్ తో ఇంటర్వెల్ పడుతుంది. ఆ తర్వాత అది తేలిపోతుంది. సినిమా మొత్తం ఊహించినట్టే ఉంటుంది. కాకపోతే ఆయా సీన్లు కొంత వరకు హార్ట్ టచ్చింగ్ గా ఉంటాయి. స్లోగా, ఊహించేలా సాగే లవ్ అండ్ ఎమోషనల్ డ్రామా `సహ`. కొంత వరకు 7/జి బృందావన కాలనీని తలపిస్తుంది. హీరోహీరోయిన్లు సవాల్ విసిరి సినిమాపై అంచనాలు పెంచే ప్రయత్నం చేశారు. కానీ అదే ఈ మూవీకి పెద్ద మైనస్.
Above Average
Sahaa movie review
నిశాంత్ దోటి దర్శకత్వంలో శివ కుమార్ కాసారం కథానాయకుడిగా, శ్వేతా లక్ష్మణ్ కథానాయికగా నటించిన సినిమా సహ. రీసెంట్ గా థియేటర్లలో విడుదలైన ఈ సినిమా మిక్స్డ్ రెస్పాన్స్ అందుకుంది. ఇక సినిమా విషయానికి వస్తే... ఓ యువకుడి జీవితంలో దాదాపు నాలుగు దశాబ్దాల పాటు సాగే ప్రేమ, జ్ఞాపకాల చుట్టూ సాగిన ఈ సినిమా. ఈ సిని...
నిశాంత్ దోటి దర్శకత్వంలో శివ కుమార్ కాసారం కథానాయకుడిగా, శ్వేతా లక్ష్మణ్ కథానాయికగా నటించిన సినిమా సహ. రీసెంట్ గా థియేటర్లలో విడుదలైన ఈ సినిమా మిక్స్డ్ రెస్పాన్స్ అందుకుంది. ఇక సినిమా విషయానికి వస్తే... ఓ యువకుడి జీవితంలో దాదాపు నాలుగు దశాబ్దాల పాటు సాగే ప్రేమ, జ్ఞాపకాల చుట్టూ సాగిన ఈ సినిమా. ఈ సినిమాలో హీరోగా నటించిన శివ కుమార్ కాసారం
ఈజ్ తో సెటిల్డ్ గా నటించాడు. ముఖ్యంగా క్లైమాక్స్ లో అలాగే కొన్ని ప్రేమ సన్నివేశాల్లో శివ కుమార్ కాసారం నటన బాగుంది. హీరోయిన్ గా నటించిన శ్వేతా లక్ష్మణ్ నటన సినిమాకి ప్లస్ అయింది. ప్రధానంగా సెకండ్ హాఫ్ లో ఆమె నటించిన విధానం సినిమాకి ప్లస్ అయ్యింది.
ఓవరాల్ గా ‘సహ’ అంటూ వచ్చిన ఈ ఎమోషనల్ లవ్ డ్రామాలో.. ఎమోషనల్ గా సాగే క్లైమాక్స్, హీరో – హీరోయిన్ల మధ్య వచ్చే కొన్ని లవ్ సీన్స్ మరియు ఎమోషనల్ క్లైమాక్స్ బాగానే ఉన్నాయి. కానీ, కథాకథనాలు ఆకట్టుకునే విధంగా లేకపోవడం, మెయిన్ క్యారెక్టరైజేషన్స్ బలహీనంగా ఉండటం, అలాగే కొన్ని రొటీన్ సీన్స్ వంటి అంశాలు సినిమాకి మైనస్ అయ్యాయి. ఓవరాల్ గా, లవర్స్ కు ఈ సినిమాలో కొన్ని ఎలిమెంట్స్ కనెక్ట్ అవుతాయి.
Above Average
Sahaa movie review
సహ సినిమాని ఎంతో డెప్త్‌తో రాసుకున్నాడు దర్శకుడు. పూర్తిగా ప్రేమ, అమ్మాయి అబ్బాయి పాయింట్ ఆఫ్ వ్యూలోనే కథను అల్లుకున్నాడు. సహ లైఫ్ ఆఫ్ సంజు అని పెట్టిన టైటిల్, క్యాప్షన్‌కి తగ్గట్టుగానే సినిమా ఉంది. అమ్మాయి ప్రేమలో పడి, తనే లోకంగా బతికి, అందులోంచి బయటకు రాలేక చిక్కుకుపోయిన సంజు కథే ‘సహ’. ఈ కథకు కొన్...
సహ సినిమాని ఎంతో డెప్త్‌తో రాసుకున్నాడు దర్శకుడు. పూర్తిగా ప్రేమ, అమ్మాయి అబ్బాయి పాయింట్ ఆఫ్ వ్యూలోనే కథను అల్లుకున్నాడు. సహ లైఫ్ ఆఫ్ సంజు అని పెట్టిన టైటిల్, క్యాప్షన్‌కి తగ్గట్టుగానే సినిమా ఉంది. అమ్మాయి ప్రేమలో పడి, తనే లోకంగా బతికి, అందులోంచి బయటకు రాలేక చిక్కుకుపోయిన సంజు కథే ‘సహ’. ఈ కథకు కొన్ని చోట్ల లాజిక్స్ కనిపించవు. ఇలా కూడా ఉంటారా? అని అనిపించే అవకాశం ఉంటుంది. అయితే సహ మూవీ మాత్రం ఓ సెక్షన్ ఆఫ్ ఆడియెన్స్‌కి నచ్చే అవకాశం ఉంటుంది.
సినిమా ముందుకు వెళ్తున్న కొద్దీ భారంగా మారుతుంటుంది. ఇన్ని కష్టాలా? ఇన్ని బాధలా? అన్నట్టుగా అనిపిస్తుంది. ఇక క్లైమాక్స్ మాత్రం గుండెల్ని మరింత భారంగా చేస్తుంది. చివరి 20 నిమిషాల్లో ఆడియెన్స్ కన్నీరు పెట్టే అవకాశం ఉంది. ఆర్టిస్టుల విషయానికి వస్తే శివ కుమార్, శ్వేత లక్ష్మణ్ ఎక్కువగా కనిపిస్తారు. సంజు, సహ పాత్రలకు వారిద్దరూ వంద శాతం న్యాయం చేశారని చెప్పుకోవచ్చు. వ్రజన పాండ్య పాత్ర కూడా బాగుంటుంది. చివరగా సహ మూవీని చూడాలంటే కాస్త ఓపిక, సహనం అయితే ఉండాల్సిందే. అసలే ఇంకా బ్రేకప్ బాధలు, డిప్రెషన్, ట్రామా ఉంటే మాత్రం ‘సహ’ మరింత భారంగా అనిపించే అవకాశం ఉంది.
Public Reviews
3 Avg: 4.7/10Below Average
Sahaa movie review
Ippude Sahaa cinema first show chusostunna... nakinka gurtu promotional event lo ee cinema meeku nacchakapothe gundu kottinchukunta ani cheppindi aa heroin (shwetha laxman) mahathalli.. mari inthaku gundu kottinchukundo ledo...
inthakante simple ga cinema gurinchi cheppala... ala undi cinema mari...
Below Average
Sahaa movie review
Just theatre nunchi ippude baitaki vacha boss, mental torture ante enti ani sahaa film choapistundhi. Love story ani velthe pure depression & trauma icharu.Director Nishanth 'Life of Sanju' ani stylish tag pettadu gani, cinema lo lekka leni sadism and emotional toxicity thappa emi ledhu. Logic m...
Just theatre nunchi ippude baitaki vacha boss, mental torture ante enti ani sahaa film choapistundhi. Love story ani velthe pure depression & trauma icharu.
Director Nishanth 'Life of Sanju' ani stylish tag pettadu gani, cinema lo lekka leni sadism and emotional toxicity thappa emi ledhu. Logic missing, pacing unbearable ga undhi. Lead actors Shiva Kumar, Shweta Lakshman try chesar kani, a rotta, repetitive crying scenes ki audience ki chiraak vasthundhi.
Last 20 mins climax lo edipinchali ani forceful ga try chesaaru kani, emotional connect avvakunda audience headache tho thala pattukunnaaru.
Breakup trauma unna vallu e cinema choosthe inka heavy mental depression loki velthaaru. Patience test chese lag and dark torture story. Theatre ki velli dabulu, time bokka pettukokandi. Better skip this rods!
Above Average
Sahaa movie review
ఇప్పుడే థియేటర్‌లో 'సహ (Life of Sanju)' చూసి బయటకొచ్చా. నిరుత్సాహం కాదు కానీ, గుండెను పట్సేంత భారం మిగిలింది.ఒక అమ్మాయిని ప్రాణంగా ప్రేమించి, ఆ లవ్ అండ్ ట్రామాలోంచి బయటకు రాలేకపోతే ఒక అబ్బాయి లైఫ్ ఎలా నాశనం అవుతుందో డెప్త్ గా చూపించాడు డైరెక్టర్ నిశాంత్. సంజు, సహ పాత్రల్లో శివ కుమార్, శ్వేత లక్ష్మణ...
ఇప్పుడే థియేటర్‌లో 'సహ (Life of Sanju)' చూసి బయటకొచ్చా. నిరుత్సాహం కాదు కానీ, గుండెను పట్సేంత భారం మిగిలింది.
ఒక అమ్మాయిని ప్రాణంగా ప్రేమించి, ఆ లవ్ అండ్ ట్రామాలోంచి బయటకు రాలేకపోతే ఒక అబ్బాయి లైఫ్ ఎలా నాశనం అవుతుందో డెప్త్ గా చూపించాడు డైరెక్టర్ నిశాంత్. సంజు, సహ పాత్రల్లో శివ కుమార్, శ్వేత లక్ష్మణ్ జస్ట్ యాక్టింగ్ చేయలేదు.. స్క్రీన్ మీద నరకం అనుభవించారు!
క్లైమాక్స్ లాస్ట్ 20 మినిట్స్ మాత్రం హార్ట్ బ్రేకింగ్! థియేటర్‌లో కన్నీళ్లు ఆపుకోవడం కష్టం. కాకపోతే, సినిమా ముందుకు వెళ్లేకొద్దీ డార్క్ అండ్ డిప్రెసివ్‌గా మారుతుంది. కొన్నిచోట్ల లాజిక్స్ మిస్సయినా, ఆ ఎమోషనల్ పెయిన్ మనల్ని వదల్దు.
లవ్ లో ట్రామా లేదా ఆల్రెడీ బ్రేకప్ పెయిన్ ఉంటే మాత్రం థియేటర్ రిస్క్ వద్దు! హెవీ ఎమోషనల్ డ్రామాలు తట్టుకునే ఓపిక ఉంటేనే ట్రై చేయండి.
About This Movie
Story :
రిజిస్టార్ ఆఫీస్ లో పనిచేసే సంజీవ్ (శివ కుమార్ కాసారం) సహ అలియాస్ సహస్ర (శ్వేత లక్ష్మణ్)ని తన స్కూల్ డేస్ నుంచే ప్రేమించి, కాలేజ్ లో లవ్ డేస్ కూడా చూసి ఇద్దరూ పెళ్లి చేసుకుంటారు. ఇక సంజు ఎప్పుడూ భార్య మాటల్నే వింటూ, ఆమెతోనే ఫోన్‌లో మాట్లాడుతూ ఉంటాడు. అలాగే సహస్ర ప్రెగ్నెంట్ అవుతుంది. ఇలా సాగిపోతున్న సంజూ - సహా లైఫ్ లో జరిగిన కొన్ని సంఘటనలు అతని లైఫ్ ని టర్న్ చేస్తాయి. ఈ క్రమంలో సంజు ఎలాంటి కష్టాలని ఎదుర్కొన్నాడు. సహకి అసలు ఏమైంది? మధ్యలో సంజుకి పరిచయమైన మరో సహస్త్ర గుప్తా (వ్రజన పాండ్య) ఎవరు? చివరకు సంజు లైఫ్ ఎలా మారిపోయింది? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.
Plus Points :
బేసిగ్గా ఇలాంటి స్టోరీ లైన్స్ తో చాలా సినిమాలు వస్తుంటాయి. కానీ కొన్నే సక్సెస్ అవుతాయి. ఇలాంటి డిఫరెంట్ లవ్ స్టోరీస్ చూసే ఓ సెక్షన్ అఫ్ ఆడియన్స్ వేరే ఉంటారు. మనం కామన్ గా సినిమాల్లోనూ, బైట కూడా చూసే నార్మల్ లవ్ స్టోరీల్లాగానే ఈ సినిమా కూడా ఉంటుంది. సంజు అనే యువకుడి లైఫ్ లో మూడు దశాబ్దాల పాటు సాగే ప్రేమ దానిచుట్టూ అల్లుకున్న జ్ఞాపకాల చుట్టూ సాగింది ఈ "సహ" సినిమా. అయితే కథ పరంగా ఈ సినిమా కొన్ని బరువైన సీన్స్ తో ఆకట్టుకుంటుంది. అలాగే లవ్ ట్రాక్ సీన్స్ కూడా చాలా బాగా తీసాడు డైరెక్టర్ నిశాంత్ తోటి. సింపుల్ గా స్టోరీ పాయింట్ ని చెప్పాలంటే ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి జ్ఞాపకాలతో బతికే ఓ వ్యక్తి మానసిక పరిస్థితి ఎలా ఉంటుంది ? అతడి ప్రయాణం ఎలా సాగింది అనేది సినిమా.
ఇక హీరోగా నటించిన శివ కుమార్ కాసారం సెటిల్డ్ నటనతో మెప్పించాడు. బరువైన భావోద్వేగ సన్నివేశాలను చక్కగా హ్యాండిల్ చేసాడు. అలాగే హీరోయిన్ శ్వేతా లక్ష్మణ్ కూడా బాగా నటించింది. కొన్ని సీన్లలో ప్రమోషన్స్ లో చెప్పినదానికి ఓవర్ అయినట్టు అనిపించినా మొత్తానికి పర్లేదు. వ్రజన పాండ్య తో పాటు మిగిలిన నటీనటులు వాళ్ళ పాత్ర పరిధి మేరకు నటించారు.
Minus Points :
అయితే సహ సినిమాకి మెయిన్ మైనస్ కథ, కథనాలే. ఎందుకంటే వినడానికి బాగానే ఉన్నా, రొటీన్ రెగ్యులర్ ఫార్ములా లాగానే మూవీ వెళ్తుంది. సినిమా నెక్స్ట్ సీన్స్ ని కూడా ఈజీగా ఊహించేయొచ్చు. కథ పాయింట్ లో కంటెంట్ ఉన్నా, దానికి తగ్గట్టు స్క్రీన్ ప్లే మాత్రం ఉండదు. ముఖ్యంగా ఆడియన్స్ కి ఆకట్టుకునేలా ఎంగేజింగ్ గా రాయడంలో డైరెక్టర్ నిశాంత్ దోటి విఫలమయ్యాడు. ఈ టైప్ అఫ్ లవ్ అండ్ ఎమోషనల్ డ్రామాని రాసుకున్నపుడు, స్క్రీన్ ప్లే ఫ్రెష్ గ బరువైన భావోద్వేగాలతో ఆడియన్స్ కనెక్ట్ అయ్యేలా స్ట్రాంగ్ గా డ్రామాని బిల్డ్ చేయాలి. కానీ దానికి రివర్స్ లో ఉంటుంది.
స్కూల్ కాలేజ్ డేస్ టైం సీన్స్ ఎంటర్టైనింగ్ గా ఉన్నా, ఫ్రెష్ ఫీల్ రాదు. ఎలా అంటే సినిమా చూసాక బానే ఉందనిపిస్తుంది. కానీ ఒక్క సీన్ గుర్తుకు రాదు. నిజానికి ప్రేయసి జ్ఞాపకాలతో బతికే హీరో - హీరోయిన్ మధ్య సీన్స్ ఇంకా స్ట్రాంగ్ గా రాసుకునే ఛాన్స్ ఉన్నా డైరెక్టర్ వాడుకోలేదని అనిపిస్తుంది. చాలా సీన్ల ముందే గెస్ చేయడం వల్ల ఆడియన్స్ కి బోర్ ఫీల్ వస్తుంది.
Technical Values :
ఇక టెక్నికల్ పరంగా ప్రొడక్షన్ వాల్యూస్ డీసెంట్ గా ఉన్నాయ్. డైరెక్టర్ నిశాంత్ దోటి స్టోరీ లైన్ బానే రాసుకున్నా, సరైన స్క్రీన్ ప్లే రాసుకోలేదు. ఇక మ్యూజిక్ డైరెక్టర్ శేఖర్ చంద్ర ఇచ్చిన సంగీతం పర్లేదు. కానీ ఇంకా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎడిటింగ్ వర్క్ అవసరముంది. ఎడిటర్ దినేష్ పెద్ది అనవసరమైన సీన్స్ ని గ్రిప్పింగ్ గా ట్రిమ్ చేయాల్సింది. సినిమాలో సినిమాటోగ్రఫీ వర్క్ బాగుంది.
Final Review :
ఓవరాల్ గా "సహ" అంటూ ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ లవ్ అండ్ ఎమోషనల్ డ్రామాలో స్టోరీ పాయింట్ బాగానే ఉన్నా, పేలవమైన స్క్రీన్ ప్లే వల్ల అంతగా ఆకట్టుకోలేకపోతుంది. అయితే హీరో - హీరోయిన్ లవ్ ట్రాక్ అండ్ వాళ్ళ కెమిస్ట్రీ ఆకట్టుకుంటుంది. కానీ వాళ్ళ మధ్య బరువైన భావోద్వేగాలను రాసుకోకపోవడం వల్ల ఆ పాత్రలు కూడా బలహీనపడతాయి. మూవీలో ఊహించేలా ఉన్న రెగ్యులర్ సీన్స్ మూవీకి మైనస్ అయ్యాయి. ఫైనల్ గా రెగ్యులర్ మూవీ లవర్స్ తక్కువ అంచనాలతో సినిమా చూస్తే బెటర్. ఇలాంటి కాన్సెప్ట్ మూవీస్ ఇష్టపడే ఓ సెక్షన్ అఫ్ ఆడియన్స్ ఓసారి ట్రై చేయొచ్చు.