Register as a Reviewer
మా ఇంటి బంగారం (Maa Inti Bangaaram)

మా ఇంటి బంగారం (Maa Inti Bangaaram)

19 Jun 2026

సమంత హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ మూవీ "మా ఇంటి బంగారం". నందిని రెడ్డి డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీని రాజ్ నిడిమోరు, సమంత, హిమాంక్ రెడ్డి దువ్వూరు ప్రొడ్యూస్ చేయగా, తాజాగా థియేటర్లలో విడుదలైంది.

Director: BV Nandini Reddy
Cast: Samantha, Diganth, Gulshan Devaiah, Gautami, Manjusha, Sreemukhi and others

Available in:

About This Movie

Story :

కథ విషయానికి వస్తే.. అనాధ అయిన స్వప్న అలియాస్ ఝాన్సీ (సమంత) పెద్ద కుటుంబం ఉన్న అనిరుద్ (దిగంత్)  ప్రేమించి పెళ్లిచేసుకుంటుంది. కానీ వీళ్ళ ప్రేమను దిగంత్ ఫ్యామిలీ ఒప్పుకోకపోవడం వల్ల, ఇంట్లో వాళ్ళతో కలిసిపోవడానికి స్వప్న చాలా కష్టాలు పడాల్సి వస్తుంది. ఫైనల్ గా అంతా ఒకటైపోయారు, స్వప్నను కోడలిగా ఇంట్లోకి అంగీకరించారు అనుకున్న టైం కి, స్వప్న గతం ఫ్యామిలీని బాగా ఇబ్బంది పెడుతుంది. కరుణ (గుల్షన్ దేవయ్య) అనే నక్సలైట్ స్వప్న పై పగబట్టి తనని, తన ఫ్యామిలీని చిక్కుల్లో పడేస్తాడు. అప్పుడు ఫ్యామిలీని కాపాడుకోవడానికి స్వప్న ఏం చేసింది. కరుణ ని ఎలా ఎదుర్కొంది తన కుటుంబానికి గత జీవితాన్ని చెప్పి కోడలిగా తన ఫ్యామిలీలో స్థానం నిలుపుకుందా? అనేది కథ.

 

Plus Point : 

ఇక ఈ సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ సమంత అనే చెప్పాలి. సినిమా మొత్తం వన్ ఉమెన్ షోగా నడిపించి అదరగొట్టింది. కొన్ని రిస్కీ యాక్షన్ సీక్వెన్స్ కూడా ఆకట్టుకుంటాయి. రెండు షేడ్స్ ఉన్న రోల్ ని పర్ఫెక్ట్ గా బ్యాలన్స్ చేసి ఆకట్టుకుంది సామ్. తన లుక్స్ తోనే కాకుండా నటనతోనూ ఆకట్టుకుంది. ఇక దిగంత్ కూడా తన మార్క్ నటనతో మెప్పించాడు. గుల్షన్ దేవయ్య నెగిటివ్ షేడ్స్ లో డిఫరెంట్ వేరియేషన్స్ చూపించాడు. ఇక శ్రీముఖి, లక్ష్మీ, మంజూష, గౌతమి తదితరులు వాళ్ళ రోల్స్ పరిధి మేరకు ఆకట్టుకున్నారు. ఇక దర్శకురాలు నందినిరెడ్డి తీసుకున్న స్టోరీ లైన్ డీసెంట్ గా ఉండి ఆకట్టుకుంది. హీరోయిన్ క్యారెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ సీన్స్ కూడా బాగున్నాయి. 

 

Minus Point :

అయితే హీరోయిన్ సమంత పాత్రను కథ ఫ్లాష్ బ్యాక్ ను బాగానే రాసుకున్న దర్శకురాలు, అంతే స్థాయిలో స్ట్రాంగ్ స్క్రీన్ ప్లే ను రాసుకోలేకయారు. అలాగే మూవీకి కావాల్సిన బలమైన ఎమోషన్స్ సినిమాలో మిస్ అయ్యాయి. పైగా కొన్ని ఫ్యామిలీ సీన్స్ ఇల్లాజికల్ గా అనిపిస్తాయి.  కామెడీకి కూడా పెద్దగా స్కోప్ లేదు. అలాగే ఫ్రెష్ స్టోరీస్ కావాలనుకున్న ఆడియన్స్ కొంచెం డిస్సపాయింట్ అవొచ్చు.

 

Technical values :

ఇక టెక్నికల్ విషయానికి వస్తే... సినిమాకి మ్యూజిక్ చాలా ప్లస్ అయింది. సంతోష్ నారాయణన్ ఇచ్చిన బీజీఎమ్ సినిమాకి మంచి ప్లస్ అయింది. అండ్ సినిమాటోగ్రఫీ వర్క్ కూడా చాలా బాగుంది. దర్శకురాలు నందిని రెడ్డి కథ పరంగా అంతగా మెప్పించలేకపోయినా, దర్శకురాలిగా మరోసారి తన బెస్ట్ వర్క్ చూపించారు. ఎడిటింగ్ వర్క్ బాగుంది, కాకపోతే కొన్ని సీన్స్ ట్రిమ్ చేయాల్సింది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. 

 

Final Review :

ఓవరాల్ గా "మా ఇంటి బంగారం" అంటూ వచ్చిన ఈ ఫ్యామిలీ అండ్ యాక్షన్ డ్రామా సమంతకు మంచి కం బ్యాక్ లాంటి మూవీ అవుతుందని చెప్పొచ్చు. సమంత పెర్ఫార్మన్స్ తో పాటు నందినిరెడ్డి ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లే, టేకింగ్ హైలెట్ అయ్యాయి. ఓవరాల్ గా రెగ్యులర్ మూవీ ఆడియన్స్ ని మెప్పించే అవకాశం ఉంది.

Why MRO?