Register as a Reviewer
అమీర్ లోగ్ (AmeerLog)

అమీర్ లోగ్ (AmeerLog)

21 Aug 2026

టాలీవుడ్ లో ఈ వారం విడుదలైన మూవీ లో "అమీర్ లోగ్" మూవీ కూడా ఒకటి. అంతా కొత్తవాళ్లు నటించిన ఈ మూవీ.. ఓ చిన్న యూత్ ఎంటర్టైనింగ్ కాన్సెప్ట్ తో తెరకెక్కింది. కాగా థియేటర్లలో డీసెంట్ టాక్ తెచ్చుకుంది.

Director: Ramana Reddy Soma
Cast: Hari munnangi, Sasidhar Kocharlakota, Manoj, Vedha Jalandharr, Ravan Nitturu,Sai Yogi Vishwender Reddy Kommidi, Pawon Ramesh And Others.

Available in:

About This Movie

Story : 

పాతబస్తీలో ఉండే శ్రీను (హరి మున్నంగి), మల్లేశ్ (శశిధర్ కంచర్లకోట), రఫీక్ (మనోజ్) చదువుకోకుండా జులాయిగా తిరుగుతూ, కుటుంబ బాధ్యతలు కూడా తీసుకోకుండా క్రికెట్ ఆడుతూ కాలం, బెట్టింగ్ లు చేస్తూ గడుపుతుంటారు. అలాంటి సమయంలో అదే బస్తీలో ఉండే సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని గీతక్క (వేద జలంధర్) శీనుకి వాళ్ళ ఆఫీస్ లోనే ఆఫీస్ బాయ్ గా ఉద్యోగం ఇప్పిస్తుంది. అయితే ఓసారి అక్కడ ఎంప్లాయిస్‌ తో శ్రీను బస్తి టీమ్ క్రికెట్ బెట్టింగ్ లో ఓడిపోతారు. ఇదే వీళ్ళ లైఫ్ టర్న్ చేస్తుంది. ఓడిపోయినందుకు శ్రీను ఆఫీస్ బాయ్స్ కి బిర్యానీ పార్టీ ఇస్తాడు. ఆ బిర్యానీ గీతక్క బాయ్ ఫ్రెండ్ హరికి నచ్చి, వాళ్లకి బిర్యానీ హోటల్ పెట్టమని సలహా ఇచ్చి హెల్ప్ చేస్తాడు. ఆ బిజినెస్ మంచి సక్సెస్ అవుతుంది. అయినప్పటికీ వీళ్ళ పొరపాట్ల వల్ల బిర్యానీ పాయింట్ క్లోజ్ అవుతుంది. ఈ క్రమంలో ముగ్గురు ఫ్రెండ్స్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు. వీళ్ళకి బస్తీలోని "చాచా" (విశ్వేంధర్ రెడ్డి కొమ్మిడి) ఎలాంటి సహకారం అందించాడు. చివరికి బిర్యానీ బిజినెస్ ఈ ముగ్గురు ఫ్రెండ్స్ లైఫ్ ని ఎలా టర్న్ చేసింది? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. 

Plus Points : 

అమీర్ లోగ్ అంటూ ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ సినిమా ఫ్రెండ్షిప్ నేపథ్యంలో తెరకెక్కిన ఎంటర్టైనింగ్ మూవీ. ఇలాంటి కాన్సెప్ట్ లో ఎన్ని సినిమాలొచ్చినా ఆడియన్స్ ఆదరిస్తారు. ముఖ్యంగా యూత్ ని దృష్టిలో పెట్టుకుని తీసిన సినిమా ఇది. పక్కా హైదరాబాదీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా చాలా న్యాచురల్ గా ఉండి యూత్ ని అట్రాక్ట్ చేస్తుంది. ఇక సినిమా ఇంట్రడక్షన్ నుండి మంచి ఎంటర్టైనింగ్ సీన్స్ తో డైరెక్టర్ ముందుకు తీసుకెళ్లాడు. చాలా సీన్లు ఊహించినట్టే ఉంటాయి, కానీ ఆకట్టుకుంటాయి. అలాగే ఫ్రెండ్షిప్ నేపథ్యంలో ఈ సినిమాలో రాసుకున్న పాయింట్స్ కూడా బాగున్నాయి. ముఖ్యంగా "ఎవరికైనా సరే పని చేసుకుంటేనే ఇజ్జత్"... అనే పాయింట్ ని డైరెక్టర్ బాగా ఎస్టాబ్లిష్ చేశారు. ఇక సినిమాలో మెయిన్ లీడ్ గా నటించిన హరి, శశిధర్, మనోజ్ లు వాళ్ళ రోల్స్ లో బాగా నటించారు. అలాగే కీ రోల్స్ లో నటించిన విశ్వేందర్ రెడ్డి కొమ్మిడి, అలాగే వేద, రావణ్ నిట్టూరు, సాయి యోగి కూడా వాళ్ళ పరిధిమేరకు బాగా నటించి మెప్పించారు.   

Minus Points :

ఇలాంటి సినిమాలు ఎప్పుడొచ్చినా కంటెంట్ కి కొంచెం కనెక్ట్ అయినా చాలు ఆడియన్స్ నెత్తిన పెట్టుకుంటారు. పైగా ఫ్రెష్ కథలేమి అవసరం లేదు. కానీ ఈ సినిమాలో కథ, కథనాలు మొత్తం ఊహించినట్టే సాగుతాయి. ఒకప్పుడు ఈ నగరానికి ఏమైంది, పెళ్లి చూపులు, ఫలక్ నామ దాస్ లాంటి సినిమాలు గుర్తొస్తాయి. పైగా వీటితో కంపేర్ చేస్తే... ఇందులో ఎంటర్టైన్మెంట్ పాళ్ళు తక్కువ. అలాగే సెకండ్ హాఫ్ కూడా రొటీన్ గా అలా అలా వెళ్ళిపోతుంది. ఎడిటింగ్ సీన్లు చాలా కట్ చేసి ఇంట్రెస్టింగ్ గా మలిచే అవసరం చాలా ఉంది. ఒక్క సహజంగా చూపించే సినిమాటోగ్రఫీ, డైలాగ్స్ తప్ప కథ పరంగా ప్లస్ ఏం అనిపించలేదు. 

Technical Values: 

టెక్నికల్ గా చూస్కుంటే ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. సినిమాకి ఎంత కావాలో అంతే పెట్టి, సహజంగా తెరకెక్కించేందుకు ట్రై చేసారు. అలాగే స్మరన్ సాయి మ్యూజిక్, బీజీఎమ్ మంచి ప్లస్ అయింది. సలిగంటి విజయ్ కుమార్ కెమెరా వర్క్ బాగుంది. రోహిత్ పెనుమత్స ఎడిటింగ్ పర్లేదు. కానీ అనవసరమైన సీన్లు కొన్ని ఎడిట్ చేయాల్సింది. ఇక డైరెక్టర్ రమణ రెడ్డి సోమ మంచి స్టోరీ పాయింట్ తీసుకున్నా, దాన్ని ఆడియన్స్ కి అర్ధమయ్యే విధంగా ఇంట్రెస్టింగ్ గా మలచలేకపోయారు. "ఇష్టపడి చేసే పని దాని ద్వారా నలుగురికి మంచి జరిగితే వాళ్ళే అమీర్ లోగ్".. అంటూ డైరెక్టర్ చెప్పిన పాయింట్ బాగుంది కానీ, రొటీన్ కథ కథనాలతో ఆడియన్స్ కి బోర్ కొట్టించాడు. 

Final Review : 

ఇక ఓవరాల్ గా అమీర్ లోగ్ అంటూ చిన్న సినిమాగా ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ యూత్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ మూవీ కథ పరంగా బాగానే ఉన్నా, ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లే లేక అలరించడంలో తడబడింది.  కొన్ని కామెడీ సీన్స్ బాగానే ఉన్నాయి. కానీ గుర్తుండిపోయే విధంగా సీన్స్ ఏమి లేవు. మొత్తంగా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించడం కష్టమే, కానీ ఒక వర్గం ఆడియన్స్ అంటే.. యూత్ మూవీస్ ఇష్టపడే యంగ్ ఆడియన్స్ కి కొంతవరకు మెప్పించే అవకాశం ఉంది. 

Why MRO?