Register as a Reviewer
Home Reviews Media Reviews

Media Reviews

Reviews from top media outlets, YouTube channels, and publications

701
Total Reviews
Showing 481–492 of 701 media reviews
మాస్ జాతర (Mass Jathara)

Mass Jathara Movie Review

రవితేజ హీరోగా శ్రీలీల హీరోయిన్ గా నటించిన మాస్ జాతర భానుభోగవరపు దర్శకత్వంలో తెరకెక్కింది. థియేటర్లలో ఈ సినిమా ఎక్స్పెక్టేషన్స్ ని రీచ్ కాలేదు. సినిమాలో రవితేజ నటన కంటే పాటల్లో గ్లామర్ హైలైట్ అయ్యేలా ఉ...

రవితేజ హీరోగా శ్రీలీల హీరోయిన్ గా నటించిన మాస్ జాతర భానుభోగవరపు దర్శకత్వంలో తెరకెక్కింది. థియేటర్లలో ఈ సినిమా ఎక్స్పెక్టేషన్స్ ని రీచ్ కాలేదు. సినిమాలో రవితేజ నటన కంటే పాటల్లో గ్లామర్ హైలైట్ అయ్యేలా ఉంది. ముఖ్యంగా 'సూపర్ డూపర్ హిట్ సాంగ్' లో మరీ సన్నగా కనిపించారు. వన్ మ్యాన్ షో గా సినిమాని నడిపించారు మాస్ రాజా. శివుడిగా నవీన్ చంద్ర విలనిజం అతని కెరీర్ బెస్ట్ పెర్ఫార్మన్స్‌లలో ఒకటిగా నిలుస్తుంది. ఇటువంటి క్యారెక్టర్లు చేయడం రాజేంద్ర ప్రసాద్‌కు కొత్త కాదు. హైపర్ ఆది, వీటీవీ గణేష్, అజయ్ ఘోష్ మధ్యలో కొంత నవ్వించే ప్రయత్నం చేశారు. మురళీ శర్మ, నవ్య స్వామి, సముద్రఖని తదితరులు కనిపించారు. రవితేజ కటౌట్‌కు తగ్గ యాక్షన్ కొరియోగ్రఫీ కుదిరిన సినిమా 'మాస్ జాతర'. ఫైట్స్ ఒక్కటే చాలు, కథతో సంబంధం లేదనుకునే ప్రేక్షకులు - రవితేజ డై హార్డ్ ఫ్యాన్స్ ఎటువంటి అంచనాలు పెట్టుకోకుండా సినిమాకు వెళ్ళవచ్చు. ఇదొక రెగ్యులర్ కమర్షియల్ సినిమా అంతే.

5.0
out of 10

Average

మాస్ జాతర (Mass Jathara)

Mass Jathara Movie Review

మాస్ మహారాజ్ రవితేజ హీరోగా భానుభోగవరపు డైరెక్షన్ లో నటించిన సినిమా "మాస్ జాతర". శ్రీలీల హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ఆడియన్స్ నుండి ఆశించిన రెస్పాన్స్ తెచ్చుకోలేదు. ప్రమోషన్స్ లో ఓ రేంజ్ లో ఉంటుందని మ...

మాస్ మహారాజ్ రవితేజ హీరోగా భానుభోగవరపు డైరెక్షన్ లో నటించిన సినిమా "మాస్ జాతర". శ్రీలీల హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ఆడియన్స్ నుండి ఆశించిన రెస్పాన్స్ తెచ్చుకోలేదు. ప్రమోషన్స్ లో ఓ రేంజ్ లో ఉంటుందని మేకర్స్ చెప్పినట్టు, ఇందులో సగం కూడా ఆడియన్స్ కి ఆకట్టుకునేలా సీన్స్ లేవు. ఓవరాల్‌గా మాస్ జాతర గురించి చెప్పాలంటే.. రవితేజ మార్క్ మాస్, యాక్షన్ థ్రిల్లర్. మాస్ ఆడియెన్స్‌కు మాస్ మహారాజ్, శ్రీలీల కాంబో అలరించే అవకాశం ఉంది. కేవలం రవితేజ, శ్రీలీల ఫ్యాన్స్‌కు నచ్చే అంశాలతో రూపొందించిన కమర్షియల్ ఎంటర్‌టైనర్. ఎలాంటి అంచనాలు లేకుండా వెళ్తే టైంపాస్ చేసే సినిమా. కథ, కథనాలపై ఇంకాస్త దృష్టి పెట్టి ఉంటే.. ఇంకా బెటర్ రిజల్డ్ వచ్చి ఉండేదనిపిస్తుంది. రెగ్యులర్ ఆడియెన్స్ ఓ సారి ఈ సినిమాపై లుక్కేయండి.

5.0
out of 10

Average

మాస్ జాతర (Mass Jathara)

Mass Jathara Movie Review

మాస్ మహారాజ్ రవితేజ హీరోగా భానుభోగవరపు డైరెక్షన్ లో నటించిన సినిమా "మాస్ జాతర". నవంబర్ లో థియేటర్లో రిలీజ్ అయిన ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటించింది. ఇక ఈ సినిమా ఒక పవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా...

మాస్ మహారాజ్ రవితేజ హీరోగా భానుభోగవరపు డైరెక్షన్ లో నటించిన సినిమా "మాస్ జాతర". నవంబర్ లో థియేటర్లో రిలీజ్ అయిన ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటించింది. ఇక ఈ సినిమా ఒక పవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కగా, థియేటర్లలో నెగిటివ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. రవితేజ వన్ మ్యాన్ షో తో ఈ సినిమాని నడిపించాడు గాని, దర్శకుడు భాను భోగవరపు సరైన కథ, కథనాలు రాసుకోవడంలో విఫలమయ్యాడు. రొటీన్ స్క్రీన్ ప్లే తో ఆడియన్స్ కి బోర్ కొట్టించాడు. ఫ్యాన్స్ కి బాగా నచ్చుతుంది కానీ, కామన్ ఆడియన్స్ సహనానికి పరీక్ష పెడుతుంది ఈ సినిమా. రొటీన్ స్టఫ్ గా ఉన్న మాస్ జాతర లో మాస్ పల్స్ ఉన్నా వాటికి బలమైన సన్నివేశాలు ఏమి కనిపించవు. థియేటర్ నుంచి బయటికి వచ్చాక రవితేజ గుర్తుంటాడు గాని, పాత్రలు అంతగా గుర్తుకు రావు. ఓవరాల్ గా మాస్ జాతర ఫ్యాన్స్ కి మాత్రమే అని చెప్పాలి.

5.0
out of 10

Average

మాస్ జాతర (Mass Jathara)

Mass jathara movie Review

'భానుభోగవరపు డైరెక్షన్ లో మాస్ మహారాజ్ రవితేజ నటించిన "మాస్ జాతర" సినిమా నవంబర్ లో థియేటర్లో రిలీజ్ అయింది. రవితేజ తనకు కలిసొచ్చిన మాస్ జోనర్ లో పవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఆడి...

'భానుభోగవరపు డైరెక్షన్ లో మాస్ మహారాజ్ రవితేజ నటించిన "మాస్ జాతర" సినిమా నవంబర్ లో థియేటర్లో రిలీజ్ అయింది. రవితేజ తనకు కలిసొచ్చిన మాస్ జోనర్ లో పవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఆడియన్స్ నుండి మిశ్రమ స్పందన తెచ్చుకుంది. రవితేజ వన్ మ్యాన్ షో తో ఈ సినిమాని నడిపించాడు. మాస్ మహారాజ్ ఫ్యాన్స్ కి మంచి కిక్ ఇస్తుంది ఈ సినిమా. కానీ కొత్తదనం లేని కథ, కథనాలతో డైరెక్టర్ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయలేకపోయాడు. సినిమాలో భారీ కాస్టింగ్ తో నింపినా రవితేజకి మినహా ఎవరికీ బలమైన పాత్ర లభించలేదు. అన్ని సన్నివేశాలు కూడా ఊహాజనితంగా ఉండడం వల్ల సామాన్య ప్రేక్షకులకి ఎంజాయ్ చేసిన ఫీలింగ్ ఉండదు. కానీ ఓటిటి లో మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటుంది. ఓవరాల్ గా స్క్రీన్ ప్లే లోపం వల్ల, రొటీన్ కథ వల్ల అంతగా ఇంప్రెస్ చేయలేదు, కానీ రవితేజ కోసం రెగ్యులర్ ఆడియన్స్ ఒకసారి మాస్ జాతరని చూడొచ్చు.

5.0
out of 10

Average

మాస్ జాతర (Mass Jathara)

Mass Jathara Movie Review

'మాస్ జాతర' తో హిట్టు కొడుతున్నాం.. ఫిక్స్ అయిపోండి అని చాలా కాన్ఫిడెన్స్‌గా ఫ్యాన్స్‌కి మాట ఇచ్చారు మాస్ రాజా రవితేజ. ఆయనకి పెద్దగా యాంటీ ఫ్యాన్స్ వార్ ఉండదు కాబట్టి.. సినిమా ఓ మోస్తరుగా ఉన్నా కూడా ల...

'మాస్ జాతర' తో హిట్టు కొడుతున్నాం.. ఫిక్స్ అయిపోండి అని చాలా కాన్ఫిడెన్స్‌గా ఫ్యాన్స్‌కి మాట ఇచ్చారు మాస్ రాజా రవితేజ. ఆయనకి పెద్దగా యాంటీ ఫ్యాన్స్ వార్ ఉండదు కాబట్టి.. సినిమా ఓ మోస్తరుగా ఉన్నా కూడా లాక్కొచ్చేస్తుంటుంది. ఈ క్రమంలో భానుభోగవరపు డైరెక్షన్ లో నటించిన రవితేజ మాస్ జాతర నవంబర్ లో రిలీజ్ ఆక్షన్ ఎంటర్టైనర్ గా రిలీజ్ అయి ఆడియన్స్ నుండి మిక్స్డ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. ఓవరాల్ గా సినిమాలో ఓ సాంగ్ లో చెప్పినట్టు.. అంటే "సూపర్ డూపర్.. సూపర్ డూపర్" హిట్ అంటూ... పాటలో ఉన్న లిరిక్స్ మాదిరే.. "అర్ధం లేదు పర్థం లేదు.. తలా తోక లేదు.. రాగం, తాళం లేదు.. రిథమ్ లేదు.. కథం లేదు, పల్లవి లేదు.. చరణం లేదు, సెన్స్ లేదు.. కామన్ సెన్స్ లేనే లేదు.. అన్నట్టు కామన్ ఆడియన్స్ కి ఈ సినిమా అలాగే అనిపిస్తుంది. కానీ ఇవన్ని లేకపోయినా మాస్ రాజా రవితేజ ఫ్యాన్స్‌కి కిక్ ఇచ్చే ఎలివేషన్స్ ఉన్నాయి. కాబట్టి ఫ్యాన్స్ ని మెప్పించొచ్చు.

4.0
out of 10

Below Average

మాస్ జాతర (Mass Jathara)

Mass jathara movie Review

మాస్ మహారాజ్ రవితేజ హీరోగా నటించిన మూవీ "మాస్ జాతర". భానుభోగవరపు డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా ఒక పవర్ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది. ఇక ఈ సినిమాని రవితేజ తన ఎనర్జిటిక్ పెర్ఫార్మన్స్ తో ఫ...

మాస్ మహారాజ్ రవితేజ హీరోగా నటించిన మూవీ "మాస్ జాతర". భానుభోగవరపు డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా ఒక పవర్ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది. ఇక ఈ సినిమాని రవితేజ తన ఎనర్జిటిక్ పెర్ఫార్మన్స్ తో ఫ్యాన్స్ ని మెప్పించాడు. అలాగే నవీన్ చంద్ర కూడా ప్రతినాయకుడిగా సినిమాకి ప్లస్ అయ్యాడు. భీమ్స్ మ్యూజిక్ సినిమాలో సాంగ్స్ బాగుంటాయి. కానీ దర్శకుడు భాను కథ మీద పెట్టిన ఫోకస్ కథనం మీద పెట్టలేకపోయాడు. స్క్రీన్ ప్లే పరంగా చాలా స్లో గా సాగగా, సన్నివేశాలు ఊహాజనితంగా ఉండడం వల్ల ప్లస్ అవుతాయనుకున్న కొన్ని మాస్ సీన్స్ కూడా మైనస్ అయ్యాయి. సినిమాని ఇంకాస్త ఎడిట్ చేసి ఉంటె ఆడియన్స్ కి బోర్ కొట్టకుండా ఉండేది. కానీ రవితేజ మాస్ ఫ్యాన్స్ ని మెప్పిస్తుంది. కామన్ ఆడియన్స్ రెగ్యులర్ సినిమాలు ఇష్టపడే వారు ఒకసారి చూడొచ్చు.

5.0
out of 10

Average

సైక్ సిద్ధార్థ్ (Psych Siddharth)

Psych Siddharth Movie Review

శ్రీ నందు యామిని భాస్కర్ హీరోహీరోయిన్లుగా నటించిన మూవీ సైక్ సిద్ధార్థ్. మంచి టాలెంటెడ్ నటుడైన నందుకు సక్సెస్ మాత్రం కరువైంది. అయితే ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలని సైక్ సిద్ధార్థ్ గా డిఫరెంట్ క్యారెక్టర్...

శ్రీ నందు యామిని భాస్కర్ హీరోహీరోయిన్లుగా నటించిన మూవీ సైక్ సిద్ధార్థ్. మంచి టాలెంటెడ్ నటుడైన నందుకు సక్సెస్ మాత్రం కరువైంది. అయితే ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలని సైక్ సిద్ధార్థ్ గా డిఫరెంట్ క్యారెక్టర్ తో వచ్చాడు. ఇక సినిమాలో కూడా సైక్ సిద్ధార్థ్ గా ఇంప్రెస్ చేసాడు. కానీ ఆ క్యారెక్టర్ తెలుగు ఆడియన్స్ కి ఎక్కలేదు. ఆ పాత్ర తెరపై చూస్తున్నంత సేపు ప్రేక్షకులకి డీజే టిల్లు, అర్జున్ రెడ్డినే గుర్తొస్తాడు. పైగా సినిమాలో డైరెక్టర్ కథ కథనాల కన్నా అడల్ట్ సీన్స్ పైనే ఫోకస్ చేసినట్టు అనిపిస్తుంది. ఇక సినిమాలో మిగతా పాత్రలు కూడా తేలిపోయాయి. అయితే ఎడిటింగ్ చాలా డిఫరెంట్ గా వుంటుంది. మూడు సీన్స్ ఒకేసారి నడుస్తుంటాయి. రీల్స్ ఫాలో అయ్యేవారికీ ఇది బాగా కనెక్ట్ అవుతుంది. కానీ సినిమా మాత్రం ఆడియన్స్ కి కనెక్ట్ అవ్వాలంటే కష్టమే అని చెప్పాలి.

5.0
out of 10

Average

సైక్ సిద్ధార్థ్ (Psych Siddharth)

Psych Siddharth Movie Review

Thyview

By Thyview

శ్రీ నందు, యామిని భాస్కర్ హీరోహీరోయిన్లుగా నటించిన మూవీ సైక్ సిద్ధార్థ్. థియేటర్లలో న్యూ ఇయర్ కి రిలీజ్ అయిన ఈ సినిమా ఆడియన్స్ ని అంతగా మెప్పించలేదు. కానీ డీసెంట్ వాచబుల్ మూవీనే అని ట్రేడ్ విశ్లేషకులు...

శ్రీ నందు, యామిని భాస్కర్ హీరోహీరోయిన్లుగా నటించిన మూవీ సైక్ సిద్ధార్థ్. థియేటర్లలో న్యూ ఇయర్ కి రిలీజ్ అయిన ఈ సినిమా ఆడియన్స్ ని అంతగా మెప్పించలేదు. కానీ డీసెంట్ వాచబుల్ మూవీనే అని ట్రేడ్ విశ్లేషకులు అంటున్నారు. ఇక నటన పరంగా కూడా నందు, యామిని భాస్కర్ పోటీ పడి మరీ నటించారు. కానీ స్టోరీ, స్క్రీన్ ప్లే పరంగా డైరెక్టర్ సినిమాని సరిగ్గా రాసుకోలేదు. సన్నివేశాలన్నీ సిద్ధార్థ్ పాత్ర చుట్టూనే తిరుగుతాయి. కానీ ఏ సన్నివేశంలో కూడా ఆ పాత్రపై ఆడియన్స్ కి చెప్పుకోదగ్గ ఫీలింగ్ క్రియేట్ అవ్వదు. కానీ న్యూ ఏజ్ ఫిల్మ్ మేకింగ్ ని ఫాలో అయ్యాడు. ఎడిటింగ్ చాలా డిఫరెంట్ గా వుంటుంది. అయితే సినిమాని చూస్తే ఒక అర్జున్ రెడ్డి, డీజే టిల్లు లాంటి సినిమాలు గుర్తు రాకమానవు. డైరెక్టర్ సినిమా కంటెంట్ విషయంలో ఇంకాస్త ఫోకస్ చేయాల్సింది.

4.0
out of 10

Below Average

సైక్ సిద్ధార్థ్ (Psych Siddharth)

Psych Siddharth Movie Review

టాలీవుడ్ లో ఈ మధ్య అడల్ట్ కామెడీ కాన్సెప్ట్ తో వస్తున్న సినిమాలు ఎక్కువైపోయాయి. అందులో రీసెంట్ గా వచ్చిన సైక్ సిద్ధార్థ్ ఒకటి. నందు హీరోగా నటించిన ఈ సినిమాలో యామిని భాస్కర్ హీరోయిన్ గా నటించింది. అయిత...

టాలీవుడ్ లో ఈ మధ్య అడల్ట్ కామెడీ కాన్సెప్ట్ తో వస్తున్న సినిమాలు ఎక్కువైపోయాయి. అందులో రీసెంట్ గా వచ్చిన సైక్ సిద్ధార్థ్ ఒకటి. నందు హీరోగా నటించిన ఈ సినిమాలో యామిని భాస్కర్ హీరోయిన్ గా నటించింది. అయితే ఈ సినిమా కథా, కథనాల విషయంలో ఎక్కడా అంతగా ఆకట్టుకోలేకపోయింది. నందు సిద్ధార్థ్ క్యారెక్టర్ ని సైక్ ని అర్ధం చేసుకుంటూ నటించాడు. యామిని భాస్కర్ అందంగా, పద్దతిగా సహజంగా వుంది. కాకపోతే ఈ రెండు పాత్రల మధ్య కెమిస్ట్రీ సహజంగా బిల్డ్ చేసే సీన్స్ పడలేదు. అయితే ఫ్రెండ్ గా చేసిన నటుడు సహజంగా కుదిరాడు. ఇక డైరెక్టర్ వరుణ్ రెడ్డి న్యూ ఏజ్ ఫిల్మ్ మేకింగ్ ని ఫాలో అయ్యాడు. ఎడిటింగ్ చాలా డిఫరెంట్ గా వుంటుంది. మూడు సీన్స్ ఒకేసారి నడుస్తుంటాయి. రీల్స్ ఫాలో అయ్యేవారికీ ఇది బాగా కనెక్ట్ అవుతుంది. ఫస్ట్ హాఫ్ అయితే స్క్రీన్ మీద ఒక వీడియో గేమింగ్ నడిచినట్టే వుంటుంది. కెమరా వర్క్, స్మరణ్ సాయి మ్యూజిక్ ఈ కాన్సెప్ట్ కి సరిపడ్డాయి. వరుణ్ కొన్ని డైలాగుల్ని బానే రాసుకున్నాడు. ఇది రెగ్యులర్ సినిమా కాదు. అలాగని ఆడియన్స్ పూర్తిగా ఎంగేజ్ చేసిన సినిమా కూడా కాదు.

4.0
out of 10

Below Average

సైక్ సిద్ధార్థ్ (Psych Siddharth)

Psych Siddharth Movie Review

O

By OK Telugu

శ్రీ నందు, యామిని భాస్కర్ హీరో, హీరోయిన్ గా నటించిన మూవీ సైక్ సిద్ధార్థ్. అయితే ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. కథ కాకరకాయ లేకుండా.. జస్ట్ స్టైల్ మీద సినిమా రన్ చేసి, ప్రెజెంటేషన్ కూడా అతిగా...

శ్రీ నందు, యామిని భాస్కర్ హీరో, హీరోయిన్ గా నటించిన మూవీ సైక్ సిద్ధార్థ్. అయితే ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. కథ కాకరకాయ లేకుండా.. జస్ట్ స్టైల్ మీద సినిమా రన్ చేసి, ప్రెజెంటేషన్ కూడా అతిగా ఉన్న సినిమా ఇది. ఇది డైరెక్టర్ ఛాయిస్ అయి ఉండొచ్చు. కానీ ఆ అతిగా ఉన్న నరేషనే సినిమా మీద ఇంట్రెస్ట్ ను తగ్గించేసింది. ఈ సినిమాను చూస్తే రెండు సినిమాలు గుర్తు వస్తాయి, ఒకటి అర్జున్ రెడ్డి.. రెండు డీజె టిల్లు. ఈ రెండిటిని మిక్సీలో వేసి దానికి అతి నేరేషన్ జోడించి సినిమా చేస్తే అది సైక్ సిద్దార్థ. కానీ ఆ రెండు సినిమాలలో గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే ఉంటుంది. మనసుకు హత్తుకునే సీన్లు ఉంటాయి. టిల్లు చెప్పే పంచులకు నవ్వలేక పొట్ట నొప్పి వస్తుంది. అవేవీ ఈ సిద్ధార్థ లో లేవు. అదే ఈ సినిమా మైనస్. ఏ పాత్ర కూడా బలంగా లేదు. రైటింగ్ వీక్ అనే చెప్పాలి. మ్యూజిక్ కూడా ఆఫ్ బీట్ గా సాగింది. గుర్తుంచుకోదగ్గ పాట ఒక్కటీ లేదు. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ అన్నీ ఒక ప్రయోగాత్మక సినిమా తరహాలో సాగాయి.

3.0
out of 10

Not Good

సైక్ సిద్ధార్థ్ (Psych Siddharth)

Psych Siddharth Movie Review

కొత్త తరహా పత్రాలు చేయడంలో ఎప్పుడూ ముందుండే శ్రీ నందు ఈసారి సైక్ సిద్ధార్థ్ మూవీతో హీరోగా ఆడియన్స్ ముందుకు వచ్చాడు. యామిని భాస్కర్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీ లో ఇద్దరూ తమ తమ నటనతో ఇంప్రెస్ చేసారు. కాన...

కొత్త తరహా పత్రాలు చేయడంలో ఎప్పుడూ ముందుండే శ్రీ నందు ఈసారి సైక్ సిద్ధార్థ్ మూవీతో హీరోగా ఆడియన్స్ ముందుకు వచ్చాడు. యామిని భాస్కర్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీ లో ఇద్దరూ తమ తమ నటనతో ఇంప్రెస్ చేసారు. కానీ ఆడియన్స్ కి ఈ సినిమా కనెక్ట్ కాదు. సినిమా కోసం ఓ రకమైన ఫ్రస్ట్రేషనే వారిని ఈ పాత్రలు అంత బాగా చేయడానికి ప్రేరేపించి ఉండొచ్చు. ఇక సినిమాలో మిగిలిన పాత్రధారులు తెర మీద కొత్తగా కనిపించడంతో పాటు కాస్తంత భిన్నంగా నటించే ప్రయత్నం చేశారు. దర్శకుడు వరుణ్ రెడ్డి తాను తీయాలనుకున్న విధంగా సినిమాను తీసేశాడు... అంతే. స్మరణ్‌ సాయి నేపథ్య సంగీతం డిఫరెంట్ గా ఉండి, ఆకట్టుకుంటుంది. నిర్మాణ విలువలు బాగున్నా... మేకర్స్ కథ మీద ఇంకాస్తంత గట్టిగా వర్క్ చేసి ఉంటె బాగుండేది. కానీ సినిమాలో రొమాన్స్, కామెడీ పై మాత్రమే ఫోకస్ పెట్టగా, సినిమా కంటెంట్ ఆడియన్స్ కి చేరువ కాలేదు.

4.0
out of 10

Below Average

సైక్ సిద్ధార్థ్ (Psych Siddharth)

Psych Siddharth Movie Review

శ్రీ నందు హీరోగా, యామిని భాస్కర్ హీరోయిన్ గా నటించిన మూవీ సైక్ సిద్ధార్థ్. సినిమాలో నందు తన పెర్ఫార్మన్స్ తో బాగానే ఆకట్టుకున్నాడు. అలాగే కథానాయికగా యామినీ భాస్కర్ నటన బావుంది. కానీ ఆడియన్స్ కి అంతగా...

శ్రీ నందు హీరోగా, యామిని భాస్కర్ హీరోయిన్ గా నటించిన మూవీ సైక్ సిద్ధార్థ్. సినిమాలో నందు తన పెర్ఫార్మన్స్ తో బాగానే ఆకట్టుకున్నాడు. అలాగే కథానాయికగా యామినీ భాస్కర్ నటన బావుంది. కానీ ఆడియన్స్ కి అంతగా రీచ్ అవలేదు. బూతులు, బోల్డ్ సీన్లు చూపిస్తే అది న్యూ ఏజ్ సినిమా అవ్వదు. ట్రైలర్లలో ఆ కంటెంట్ కొంత మందిని థియేటర్లకు రప్పిస్తుందంతే. ఒక్క విషయంలో దర్శకుడిని మెచ్చుకోవాలి... హీరోయిన్‌ గా పెళ్లి కాని అమ్మాయిని కాకుండా బిడ్డతో భర్త నుంచి వేరుపడిన మహిళతో హీరోతో ప్రేమలో పడినట్టు చూపించడం. ప్రేమ కోసం కష్టపడమని చివరిలో చెప్పిన మాటలు బావున్నాయి. అందరికీ నచ్చే సినిమా కాదిది. జెన్ జి (ఈ తరం యువత)కు అయినా సరే హీరో క్యారెక్టర్, ఆ క్యారెక్టరైజేషన్ ఒక్కటే సరిపోదు. కథ కావాలి. యామినీ భాస్కర్, నందు నటనకు పేరొస్తుంది. విజయం మాత్రం కష్టమే.

5.0
out of 10

Average

Why MRO?