Register as a Reviewer
ట్రాన్స్ ఫర్ త్రిమూర్తులు (Transfer Trimurthulu)

ట్రాన్స్ ఫర్ త్రిమూర్తులు (Transfer Trimurthulu)

19 Jun 2026
Overall Rating
5.0/10
1 Reviews

ఒకప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్‌లో మంచి క్రేజ్ ఉన్న హీరో వడ్డే నవీన్. కొన్ని కారణాల వల్ల కెరీర్ లో లాంగ్ బ్రేక్ తీసుకుని దాదాపు 15 ఏళ్ళ తర్వాత "ట్రాన్స్ ఫర్ త్రిమూర్తులు" అనే మూవీతో హీరోగా రీ ఎంట్రీ ఇచ్చాడు. వడ్డే నవీన్ స్వయంగా నిర్మించిన ఈ మూవీలో రాశీ సింగ్‌ హీరోయిన్ గా నటించగా, తాజాగా థియేటర్లలో విడుదలయింది.

Director: Kamal Teja Narla
Cast: Vadde Naveen, Rasi Singh, Shilpa Tulaskar, Vivek Raghuvanshi, Raghu Babu, Devi Prasad, Siva Narayana, and others.

Available in:

Reviews

What critics and the public are saying about ట్రాన్స్ ఫర్ త్రిమూర్తులు (Transfer Trimurthulu)

Media Reviews

1 Avg: 5.0/10
123telugu
123telugu Website
5

Average

Transfer Trimurthulu Movie Review

ఫ్యామిలీ ఆడియన్స్‌లో మంచి క్రేజ్ ఉన్న హీరో వడ్డే నవీన్. అయితే సినిమా కెరీర్ లో లాంగ్ బ్రేక్ తీసుకుని దాదాపు 15 ఏళ్ళ తర్వాత "ట్రాన్స్ ఫర్ త్రిమూర్తులు" అనే మూవీతో హీరోగా మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చాడు. వడ్డే నవీన్ స్వయంగా నిర్మించిన ఈ మూవీలో రాశీ సింగ్‌ హీరోయిన్ గా నటించగా, తాజాగా థియేటర్లలో విడుదలయి బీలో య...

ఫ్యామిలీ ఆడియన్స్‌లో మంచి క్రేజ్ ఉన్న హీరో వడ్డే నవీన్. అయితే సినిమా కెరీర్ లో లాంగ్ బ్రేక్ తీసుకుని దాదాపు 15 ఏళ్ళ తర్వాత "ట్రాన్స్ ఫర్ త్రిమూర్తులు" అనే మూవీతో హీరోగా మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చాడు. వడ్డే నవీన్ స్వయంగా నిర్మించిన ఈ మూవీలో రాశీ సింగ్‌ హీరోయిన్ గా నటించగా, తాజాగా థియేటర్లలో విడుదలయి బీలో యావరేజ్ టాక్ అందుకుంది. 


ఓవరాల్ గా ‘ట్రాన్స్ ఫర్ త్రిమూర్తులు’ అంటూ ఎమోషనల్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈ చిత్రంలో.. వడ్డే నవీన్ నటనతో పాటు ఆయన క్యారెక్టరైజేషన్ మరియు యాక్షన్ సీన్స్ బాగానే ఉన్నాయి. ఐతే, సినిమాలో బలమైన ఎమోషన్, కాన్ ఫ్లిక్ట్ మిస్ అయ్యాయి. పైగా ఉన్న ఎమోషన్ లో, ఉన్న కాన్ ఫ్లిక్ట్ లో ప్రేక్షకుడు పూర్తి స్థాయిలో ఇన్ వాల్వ్ అయ్యేంతగా.. అవి సరిగ్గా ఎస్టాబ్లిష్మెంట్ కాలేదు. ఓవరాల్ గా ఈ సినిమా ఆకట్టుకోదు.


Jun 20, 2026 Read Review

Public Reviews

Avg: —

No public reviews yet.

About This Movie

Story : నిజాయితీ గల కానిస్టేబుల్ త్రిమూర్తులు (వడ్డే నవీన్) తన భార్య లక్ష్మి (రాశి సింగ్) వాళ్ళ పాపతో కలిసి హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తుంటాడు. కానీ అతని నిజాయితీ వల్లే పలు ఇబ్బందులు ఎదుర్కుంటూ రెగ్యులర్ గా ట్రాన్స్ ఫర్ అవుతూ ఉంటాడు. ఈ క్రమంలో అరకు లోని ఓ పోలీస్ స్టేషన్ కు ట్రాన్స్ఫర్ కాగా, అక్కడ ప్రియమ్మ అనే యువతి రేప్ కు గురయితే దానికి సంబంధించిన ఎఫ్‌ఐఆర్‌ కాపీ దొరుతుకుంది. అయితే ఆ కేసు 20 ఏళ్లగా పక్కనపెట్టేస్తారు. ఈ క్రమంలో దీని వెనకున్నది ముఖ్యమంత్రి కమల (శిల్ప తులస్కర్‌), ఆమె కొడుకు సంతోష్ బాబు అని తెలుస్తుంది. అయితే కొడుకుని సీఎం చేయాలనీ కల గంటున్న కమల, తన పార్టీ తరపున మేనిఫెస్టో రిలీజ్ చేసే టైమ్‌ కి సంతోష్ బాబు గిరిజన అమ్మాయిని రేప్ చేసి చంపేశాడనే విషయాన్ని కానిస్టేబుల్ త్రిమూర్తులు బయటపెడతాడు. అయితే అసలు ఈ కేసుకి త్రిమూర్తులకు సంబంధం ఏంటి ? రేప్ కాబడిన ప్రియమ్మకి న్యాయం జరిగిందా? ఫైనల్ గా ఈ కేసును కానిస్టేబుల్ త్రిమూర్తులు ఎలా చేధించారు? అన్నది మిగిలిన కథ.

 

Plus Points

2010లో ‘శ్రీమతి కల్యాణం’ అనే మూవీ తర్వాత దాదాపు 16 ఏళ్లకు వడ్డే నవీన్ హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఇప్పటికి ఇండస్ట్రీలో మంచి క్రేజ్, పేరుండడం ఆయనకు కలిసొచ్చే పాయింట్. ఇక సినిమాలో కానిస్టేబుల్ త్రిమూర్తులుగా చాలా పర్ఫెక్ట్ గా ఫిట్ గా కనిపించాడు. వింటేజ్ వడ్డే నవీన్ మరోసారి కనిపించారు. అలాగే లక్ష్మీ పాత్రలో రాశీ సింగ్‌ పర్ఫెక్ట్‌ గా సెట్ అయింది. మిగతా కీ రోల్స్ లో నటించిన శిల్ప తులస్కర్‌, రఘుబాబు, దేవీ ప్రసాద్‌, శివన్నారాయణ, వడ్లమాని శ్రీనివాసరావు వాళ్ళ పాత్రల పరిధి మేరకు నటించారు.

 

MinusPoints :

అయితే వడ్డే నవీన్ తన రోల్ వరకు బాగానే చేసినా, ఆ రోల్ లో కొత్తదనం లేకుండాపోయింది. కథ కూడా చాలా సినిమాల్లో అరిగిపోయిన పాత క్యాసెట్ లాంటి కథే. దాన్ని ఈ జెనరేషన్ కి మ్యాచ్ అయ్యేలా, మంచి స్క్రీన్ ప్లే రాయడంలో దర్శకుడు తడబడ్డాడు. అలాగే కథకు అవసరమైన స్ట్రాంగ్ ఎమోషన్స్ కూడా మిస్ అయ్యాయి. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లే మిస్ అయింది. చాలా సీన్స్ ని ముందే గెస్ చేసేయొచ్చు. అలాగే హీరో – విలన్ సీన్స్ ని ఇంకా స్ట్రాంగ్ గా బిల్డ్ చేసి ఉంటే బాగుండేది. ఒక్క క్లైమాక్స్ మినహా అన్ని రొటీన్ గానే అనిపిస్తాయి. 

 

Technical values : 

ఇక టెక్నికల్ విషయానికి వస్తే... దర్శకుడు కమల్‌ తేజ నార్ల తన టేకింగ్ తో మెప్పించినా, బలమైన కథా కథనాలు రాసుకోవడంలో ఫెయిల్ అయ్యాడు. అయితే కళ్యాణ్ మాలిక్ మ్యూజిక్ బాగుంది. పాటలు అంతగా లేవు కానీ బీజీఎమ్ బాగుంది. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ పరంగా కొన్ని సాగతీత సీన్స్ ను తగ్గించాల్సింది. ప్రొడక్షన్ వాల్యూస్ అయితే బాగున్నాయి.

 

Final Review :

ఫైనల్ గా "ట్రాన్స్ ఫర్ త్రిమూర్తులు" అంటూ యాక్షన్ ఎంటర్టైనర్ తో వచ్చిన వడ్డే నవీన్ బాగానే ఆకట్టుకున్నా, పస లేని కథ, కథనాలతో ఆడియన్స్ ని మెప్పించలేకపోయారు. కమర్షియల్ ఎలిమెంట్స్ బాగున్నా, అసలైన కథని, ఎమోషనల్ కంటెంట్ మిస్ అయ్యాయి. ఓవరాల్ గా సినిమాని రెగ్యులర్ మూవీ ఆడియన్స్ ఓసారి తక్కువ ఎక్స్పెక్టేషన్స్ తో ట్రై చేయొచ్చు గాని, అందర్నీ మెప్పించలేదు.

Review Statistics

5.0
Overall Rating
Avg. of all reviews
1
Total Reviews
From 1 Provider Types

Review Average

Media
5.0/10
Public
N/A
Why MRO?