Register as a Reviewer
రావు బహదూర్ (Rao Bahadur)

రావు బహదూర్ (Rao Bahadur)

03 Jul 2026
Overall Rating
5.8/10
25 Reviews

టాలీవుడ్ టాలెంటెడ్ నటులలో ఒకరైన సత్యదేవ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ "రావు బహదూర్". వెంకటేష్ మహా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ ఒక డిఫరెంట్ సైకలాజికల్ థ్రిల్లర్ డ్రామా కాన్సెప్ట్ తో తెరకెక్కగా తాజాగా థియేటర్లలో విడుదలైంది.

Director: Venkatesh Maha
Cast: Satya Dev, Vikas Muppala, Deepa Thomas, Bala Parasar, Anand Bharathi, Pranay Vaka, Kunal Kaushik, Master Kiran and others.

Available in:

Reviews

What critics and the public are saying about రావు బహదూర్ (Rao Bahadur)

Media Reviews

17 Avg: 5.6/10
Man of Fiction
Man of Fiction Youtube Channel
7

Hit

Rao Bahadur Movie Review

సో.. రావు బహదూర్ సినిమా ఇప్పుడే చూసొచ్చాను... నాకైతే నచ్చింది.. కొన్ని కొన్ని బొక్కలైతే ఉన్నాయి కానీ, నాకైతే బానే నచ్చింది. ఫస్ట్ అఫ్ అల్ పాజిటివ్స్ గురించి మాట్లాడుకుంటే... సినిమాలో ఎవరి గురించి మాట్లాడుకున్నా, మాట్లాడుకోకపోయిన, సత్యదేవ్ గురించి మాట్లాడుకోవాలి. సినిమాకి 100% కి 200% ఇచ్చిండు. సినిమ...

సో.. రావు బహదూర్ సినిమా ఇప్పుడే చూసొచ్చాను... నాకైతే నచ్చింది.. కొన్ని కొన్ని బొక్కలైతే ఉన్నాయి కానీ, నాకైతే బానే నచ్చింది. ఫస్ట్ అఫ్ అల్ పాజిటివ్స్ గురించి మాట్లాడుకుంటే... సినిమాలో ఎవరి గురించి మాట్లాడుకున్నా, మాట్లాడుకోకపోయిన, సత్యదేవ్ గురించి మాట్లాడుకోవాలి. సినిమాకి 100% కి 200% ఇచ్చిండు. సినిమాలో సత్యదేవ్ ప్రతిదానికి వేరే లెవెల్ కన్విన్షన్ తోటి రామప్ప అనే క్యారెక్టర్ తోటి జీవించేసాడు. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో కొన్ని సీక్వెన్స్ కి సత్యదేవ్ యాక్టింగ్ అల్టిమేట్. 


నాకు తెలిసి రావు బహదూర్ లాంటి సినిమా, ముఖ్యంగా రావు బహదూర్ లాంటి తెలుగు సినిమా ఈ మధ్యలో ఎప్పుడూ రాలేదు. మే బి మళ్ళీ వస్తదో లేదో తెలీదు. అంత యూనిక్ గా ఉంది. ఒకవేళ మీకు వర్కౌట్ అయితే వేరే లెవెల్లో అనిపిస్తది. లేదంటే అసలు ఎక్కడ ఎక్కదు. అండ్ సినిమాలో స్క్రీన్ ప్లే, CGI చాలా డిఫరెంట్ గా ఉంటది. అండ్ నాకది మెజారిటీ వర్కవుట్ అయింది. సెకండ్ హాఫ్ లో అయితే ప్రతిదీ బానే నచ్చింది. అలా అలా క్లైమాక్స్ వరకు వెళ్ళింది. ఆ క్లైమాక్స్ అయితే బాగా నచ్చింది. అండ్ సినిమా ఎక్కడెక్కడైతే గ్రాండియర్ అయిందో అక్కడక్కడా హైలెట్ అయింది. అండ్ సినిమాలో సస్పెన్స్ ని బాగా మైంటైన్ చేసారు. బట్ సినిమా చాలా చాలా ల్యాగ్ అనిపించింది. అదే మేజర్ మైనస్. కాస్త ఓపిక బట్టి చుస్తే సినిమా నచ్చే ఛాన్స్ ఉంది. 


Jul 04, 2026 Watch
Featu Gadi Media
Featu Gadi Media Youtube Channel
6

Above Average

Rao Bahadur Movie Review

రావు బహదూర్... మూవీ విషయానికి వస్తే... చాలా ఓపెన్ గా మాట్లాడతా.. నాకైతే లాస్ట్ 40 మినిట్స్ లో ఈ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ లు, ట్విస్ట్ లు రివీల్ చేస్తూ వెళ్తుందో అది చాలా బాగుంది. ముఖ్యంగా లాస్ట్ 15 నిముషాల్లో ఉన్న కంటెంట్ కి, సినిమాకి ఎంత సేపు ఈ విధంగా ఎందుకు చేయాలి, అన్న డౌట్స్ వచ్చేవి, కానీ అవి ఎంగే...

రావు బహదూర్... మూవీ విషయానికి వస్తే... చాలా ఓపెన్ గా మాట్లాడతా.. నాకైతే లాస్ట్ 40 మినిట్స్ లో ఈ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ లు, ట్విస్ట్ లు రివీల్ చేస్తూ వెళ్తుందో అది చాలా బాగుంది. ముఖ్యంగా లాస్ట్ 15 నిముషాల్లో ఉన్న కంటెంట్ కి, సినిమాకి ఎంత సేపు ఈ విధంగా ఎందుకు చేయాలి, అన్న డౌట్స్ వచ్చేవి, కానీ అవి ఎంగేజింగ్ వే లో తీసుండొచ్చు కదా... అనిపిస్తుంది. కానీ లాస్ట్ క్లైమాక్స్ ఎప్పుడు చుసిన విధంగా ఉండదు. క్లైమాక్స్ మినహా మిగతా సినిమా అంతా అలా వెళ్తూ ఉంటుంది. సినిమా చూడ్డానికి చాలా ఓపిక ఉండాలి. 


అండ్ సినిమాకి సత్యదేవ్ మెయిన్ పిల్లర్ అని చెప్పాలి. సినిమాకి కంటెంట్ కి తగ్గ బాడీ లాంగ్వేజ్, యాక్టింగ్ తో అదరగొట్టాడు. అండ్ వెంకటేష్ మహా డైరెక్షన్ వర్క్ కూడా చాలా బాగుంది. అండ్ సింపుల్ స్టోరీని చాలా డిఫరెంట్ గా చెప్పాడు. కాకపోతే స్క్రీన్ ప్లే చాలా స్లో గా ఉంటుంది. రెగ్యులర్ మూవీ లవర్స్ కి చాలా బోర్ ఫీల్ వస్తుంది. బట్ మూవీని చూడాలంటే ఓపిక చాలా ఉండాలి. అండ్ మంచి మూవీ టేస్ట్ ఉండాలి. 


Jul 06, 2026 Watch
Cinema Picha
Cinema Picha Youtube Channel
7

Hit

Rao bahadur movie Review

అనుమానం, పగ... ఇవి మనిషి బతికున్నప్పుడు క్షణ క్షణం బతుకుతూ ప్రశాంతంగా చనిపోదామనుకున్నా కూడా చావనీయకుండా వెంటాడే హ్యూమన్ ఎమోషన్స్ లో సీరియస్ ఎమోషన్స్ ఇవి. సో వీటిలో అనుమానం అనే పాయింట్ ని తీసుకుని తీసిన సినిమా ఈ రావు బహదూర్. అన్ని సినిమాలు అందరికి కావాలంటారు కదా.. సో ఈ సినిమా కూడా అదే పాయింట్ కొస్తుం...

అనుమానం, పగ... ఇవి మనిషి బతికున్నప్పుడు క్షణ క్షణం బతుకుతూ ప్రశాంతంగా చనిపోదామనుకున్నా కూడా చావనీయకుండా వెంటాడే హ్యూమన్ ఎమోషన్స్ లో సీరియస్ ఎమోషన్స్ ఇవి. సో వీటిలో అనుమానం అనే పాయింట్ ని తీసుకుని తీసిన సినిమా ఈ రావు బహదూర్. అన్ని సినిమాలు అందరికి కావాలంటారు కదా.. సో ఈ సినిమా కూడా అదే పాయింట్ కొస్తుంది. సో ఇక నావరకు వస్తే నాకైతే ఈ సినిమా బానే నచ్చింది. 


అండ్ వెంకటేష్ మహా గత సినిమాల వల్లో, సత్యదేవ్ మీద హాప్ తోనో సినిమాపై చాలా హైప్ ఒచ్చింది. బట్ చాలా మంది కొంచెం ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడం వల్ల దానికి రీచ్ అవలేదు అనుకోవచ్చు. అండ్ సినిమా చూసాక ఎందుకో కొంతమందికి స్వాగ్ మూవీ గుర్తొస్తుంది. అండ్ సినిమా లో స్టార్టింగ్ సాంగ్ నుండే సినిమా స్టోరీని డిఫరెంట్ గా చెప్పే ప్రయత్నం చేసారు మేకర్స్. టెక్నికల్ గా చూసుకుంటే రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్ తో బాగానే తీశారు. అండ్ సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ రావు బహదూర్ యాక్టింగ్. అండ్ ఎక్సయిట్ అయ్యే సీన్లు పెద్దగా లేవు గాని, ఓవరాల్ గా ఒక మంచి హానెస్ట్ అట్టెంప్ట్. కానీ కొంచెం ఓపిక కూడా కావాలి. 

Jul 06, 2026 Watch
Mahidhar Vibes
Mahidhar Vibes Youtube Channel
5

Average

Rao Bahadur Movie Review

రావు బహదూర్ సినిమా గురించి చెప్పాలంటే... బేసిగ్గా సినిమా లాస్ట్ 15 నిముషాలు అదిరిపోద్ది. దానికి ముందు సినిమా అంతా ఆల్మోస్ట్ స్లీపే. అంటే మే బి ఓ రేంజ్ సాలిడ్ పే ఆఫ్ ఉండడం వల్లే ఇంత హై వచ్చి ఉండొచ్చు. ఆలా ఉంటాయి ఆ ట్విస్ట్ లు. కానీ లాస్ట్ 15 నిమిషాల కోసం రెండున్నర గంటల సినిమాను లాగి లాగి లాగి తీసుకొచ...

రావు బహదూర్ సినిమా గురించి చెప్పాలంటే... బేసిగ్గా సినిమా లాస్ట్ 15 నిముషాలు అదిరిపోద్ది. దానికి ముందు సినిమా అంతా ఆల్మోస్ట్ స్లీపే. అంటే మే బి ఓ రేంజ్ సాలిడ్ పే ఆఫ్ ఉండడం వల్లే ఇంత హై వచ్చి ఉండొచ్చు. ఆలా ఉంటాయి ఆ ట్విస్ట్ లు. కానీ లాస్ట్ 15 నిమిషాల కోసం రెండున్నర గంటల సినిమాను లాగి లాగి లాగి తీసుకొచ్చారు. బట్ కొన్ని ఎలిమెంట్స్ బాగుంటాయి. కానీ కొన్ని వైల్డ్ షాట్స్ వల్ల యాక్టర్ తాలూకు ఎమోషన్స్ కనిపించలేదు. అది మైనస్ అయింది. 


అండ్ సినిమాలో డైరెక్టర్ వెంకటేష్ మహా చాలా సీన్స్ ని హైలెట్ చేయడానికి ప్రయత్నించి శృతి మించిపోయాడు. అండ్ సినిమాని మహామహులు మెచ్చుకునేలా తీస్తారనుకుంటే.. మహా ల్యాగ్ అయిన సినిమాని తీశారు.. నిజానికి లాస్ట్ 15 నిముషాలు అదిరిపోద్ది. కానీ దానికోసం సినిమా మొత్తం అనవసరమైన సీన్లు నింపేశారు. సినిమాలో ఓవరాల్ గా కలం కత్తు పదునైపోయింది అన్నట్టుంటుంది. ఫైనల్లీ మూవీ జస్ట్ యావరేజ్ ఓకే ఓకే అన్నట్టుంటుంది. సోది లేకుండా రావు బహదూర్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే రావొద్దు బహదూర్ అన్నట్టుంది. 

Jul 06, 2026 Watch
Barbell Pitch Meeting
Barbell Pitch Meeting Youtube Channel
5

Average

Rao Bahadur Movie Review

రావు బహదూర్ మూవీ రివ్యూ... ఇది బేసిగ్గా వెంకటేష్ మహా గారి మూవీ అంటే... ఇక కేరాఫ్ కంచెరపాలం డైరెక్టర్ కాబట్టి.. కళ్ళు మూసుకుని పోవచ్చు అనుకుంటూ వెళ్ళా. సినిమా చూసాక రివ్యూచెప్పాలంటే.. నాకైతే నచ్చలేదండి. చాలా గుడ్ పాయింట్స్ ఉన్నాయి. కానీ కొంచెం అబొవ్ యావరేజ్ కూడా కాదు అంత నచ్చలేదు. మాములుగా సినిమ...

రావు బహదూర్ మూవీ రివ్యూ... ఇది బేసిగ్గా వెంకటేష్ మహా గారి మూవీ అంటే... ఇక కేరాఫ్ కంచెరపాలం డైరెక్టర్ కాబట్టి.. కళ్ళు మూసుకుని పోవచ్చు అనుకుంటూ వెళ్ళా. సినిమా చూసాక రివ్యూచెప్పాలంటే.. నాకైతే నచ్చలేదండి. చాలా గుడ్ పాయింట్స్ ఉన్నాయి. కానీ కొంచెం అబొవ్ యావరేజ్ కూడా కాదు అంత నచ్చలేదు. 


మాములుగా సినిమాలో ఎం కావాలంటే డ్రామా... అది కనెక్ట్ అయిందంటే... సినిమా మూడు గంటలు కాదు గదా రోజంతా కూర్చుంటా... కానీ ఈ సినిమా మాత్రం పిచ్చ బోరింగ్. అండ్ సినిమాలో కొన్ని సీన్లు సంబంధం లేనట్టు ఉంటాయి. ఎదో ప్రూవ్ చేద్దామని ట్రై చేసినట్టు, డైరెక్షన్ బాగుంది, యాక్టింగ్ బాగుంది.. కానీ ఎంగేజింగ్ గా లేదు. అండ్ సినిమా కూడా చాలా అనిపిస్తది కానీ, ఎదో మిస్ అయింది. బట్ సత్యదేవ్ యాక్టింగ్ మాత్రం అల్టిమేట్. ఫైనల్లీ రావు బహదూర్ సినిమా నచ్చలేదని చెప్పడానికి చాలా బాధేస్తుంది. కానీ నచ్చలేదు అంతే..

Jul 06, 2026 Watch
Thyview
Thyview Youtube Channel
6

Above Average

Rao Bahadur movie Review

రావు బహదూర్ మూవీ చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే.. i liked it. బట్ అందరికి నాలాంటి ఒపీనియన్ ఉంటుందా అంటే అంత కాన్ఫిడెంట్ గా ఎస్ అని చెప్పలేను. కొంతమందికి ఎక్సయిటింగ్ గా అనిపించొచ్చు. కొంతమందికి అనిపించకపోవచ్చు. ఒక్కటైతే చెప్పొచ్చు. ఇలాంటి మూవీ తెలుగు ఇండస్ట్రీలో అయితే రాలేదు. అండ్ కొత్తదనాన్ని ఎప్పుడూ...

రావు బహదూర్ మూవీ చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే.. i liked it. బట్ అందరికి నాలాంటి ఒపీనియన్ ఉంటుందా అంటే అంత కాన్ఫిడెంట్ గా ఎస్ అని చెప్పలేను. కొంతమందికి ఎక్సయిటింగ్ గా అనిపించొచ్చు. కొంతమందికి అనిపించకపోవచ్చు. ఒక్కటైతే చెప్పొచ్చు. ఇలాంటి మూవీ తెలుగు ఇండస్ట్రీలో అయితే రాలేదు. అండ్ కొత్తదనాన్ని ఎప్పుడూ ఎంకరేజ్ చేయాలి కాబట్టి డైరెక్టర్ వెంకటేష్ మహాని అప్రిషియేట్ చేయాలి. అండ్ ఆడియన్స్ చూడొచ్చా అంటే... టీజర్, ట్రైలర్ చూసాక మూవీ గురించి డిసైడ్ అవ్వండి. కొత్తదనం కోసం చూడొచ్చు కానీ, ఎంటర్టైన్ అవ్వాలంటే మాత్రం కష్టమే. 


అండ్ సినిమాలో క్లైమాక్స్ ట్విస్ట్ సప్రైజ్ చేస్తుంది. ఇక సినిమాలో సత్యదేవ్ వన్ మ్యాన్ షో తో ఇంప్రెస్ చేసారు. ఇక సినిమాలో సింపుల్ గా పాయింట్ మొత్తం చెప్పాలంటే హ్యుమానిటీ గురించి డిఫరెంట్ గా చెప్పినట్టుంది. అండ్ హీరో సహా అందరి క్యారెక్టర్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ మూవీ ప్రొడక్షన్ డిసైనింగ్ కూడా బాగున్నాయి. అండ్ ఎండింగ్ మాత్రం కొత్తగా ఉన్నా అంతగా ఎక్కలేదని చెప్తాను. ఫ్రెష్ స్టోరీ ఉన్న డిఫరెంట్ కాన్సెప్ట్ ఉన్న మూవీ కోసం ఈ మూవీ ఆడియన్స్ ట్రై చేయొచ్చు. 

Jul 03, 2026 Watch
Venky Reviews
Venky Reviews Twitter Channel
5

Average

Rao Bahadur Movie Review

#RaoBahadur An Ambitious Experiment That Never Fully Clicks and Tests Your Patience at times! A very bold and unconventional attempt that struggles to justify its ambition. The first half tests your patience and largely serves as setup. Second half offers better drama and an interesting climax, but...

#RaoBahadur An Ambitious Experiment That Never Fully Clicks and Tests Your Patience at times!


A very bold and unconventional attempt that struggles to justify its ambition. The first half tests your patience and largely serves as setup. Second half offers better drama and an interesting climax, but the narrative is dragged out and too lengthy. The social commentary has potential, but it gets lost within the drama instead of leaving a lasting impact.


Satya Dev delivers a fantastic performance. Venkatesh Maha comes up with a very unique idea, but becomes too self-indulgent, and the film ultimately gets lost in translation.


Rating: 2.25/5

Jul 03, 2026 Read Review
Devi Priya
Devi Priya Twitter Channel
5

Average

Rao bahadur movie review

రావు బహదూర్ మూవీ రివ్యూ... ఇది ఏ విధంగానూ రెగ్యులర్, రొటీన్ సినిమా కాదు. ఆలా అని థియేటర్ లో ఆడుతుంది అని చెప్పలేము. కానీ థియేటర్ లో చుడండి. నిజమైన కొత్త సినిమా అనుభూతి ఇస్తుంది. ఇది కాలక్షేపంగా చూసేది కాదు, ప్రతి సీన్ ను డీకోడ్ చేసుకుంటూ చూడాలి. అప్పుడే దర్శకుడి మీద... నిర్మాతల మీద నటుల మీ...

రావు బహదూర్ మూవీ రివ్యూ... ఇది ఏ విధంగానూ రెగ్యులర్, రొటీన్ సినిమా కాదు. ఆలా అని థియేటర్ లో ఆడుతుంది అని చెప్పలేము. 


కానీ థియేటర్ లో చుడండి. నిజమైన కొత్త సినిమా అనుభూతి ఇస్తుంది. ఇది కాలక్షేపంగా చూసేది కాదు, ప్రతి సీన్ ను డీకోడ్ చేసుకుంటూ చూడాలి. అప్పుడే దర్శకుడి మీద... నిర్మాతల మీద నటుల మీద గౌరవం పెరుగుతుంది. 


పంచ్ లైన్ - మళ్ళి మళ్ళి రాదు.. బహదూర్

Jul 03, 2026 Read Review
TV9 Telugu
TV9 Telugu News Channel
6

Above Average

Rao Bahadur movie Review

సత్యదేవ్ - వెంకటేష్ మహా కాంబినేషన్ లో తెరకెక్కిన రావు బహదూర్ మూవీ తాజాగా థియేటర్లలో విడుదలై మిశ్రమ స్పందన తెచ్చుకుంది. ఈ మూవీ సమాజంలో కులం, మతం, అంతస్తు లాంటివి మనుషులను ఎలా శాసిస్తున్నాయో ఈ రావు బహదూర్ సినిమాలో డైరెక్టర్ చాలా వివరంగా చూపించే ప్రయత్నం చేశారు. హోదా, రంగు, రక్తసంబంధాలు అనే సున్నితమైన...

సత్యదేవ్ - వెంకటేష్ మహా కాంబినేషన్ లో తెరకెక్కిన రావు బహదూర్ మూవీ తాజాగా థియేటర్లలో విడుదలై మిశ్రమ స్పందన తెచ్చుకుంది. ఈ మూవీ సమాజంలో కులం, మతం, అంతస్తు లాంటివి మనుషులను ఎలా శాసిస్తున్నాయో ఈ రావు బహదూర్ సినిమాలో డైరెక్టర్ చాలా వివరంగా చూపించే ప్రయత్నం చేశారు. హోదా, రంగు, రక్తసంబంధాలు అనే సున్నితమైన అంశాల చుట్టూ ఈ కథ నడుస్తుంది.


రాజరికపు అహంకారం ఎంత గుడ్డిగా ఉంటుందో డైరెక్టర్ తన మేకింగ్‌లో లోతుగా చర్చించారు. 1960ల కాలంలో ఉన్న కుల వివక్ష, 2020 వచ్చినా పోదు అని హీరో ఫ్రెండ్ చెప్పే డైలాగ్ ఆలోచింపజేస్తుంది. దర్శకుడు ఈ సినిమాను చాలా క్లాస్‌గా, మేధావులకు నచ్చేలా తీశాడు కానీ మాస్ సినిమాలు, రెగ్యులర్ కమర్షియల్ ఎలిమెంట్స్ కోరుకునే సాధారణ ప్రేక్షకులకు ఈ సినిమా ఏ స్థాయిలో కనెక్ట్ అవుతుందనేది కచ్చితంగా చెప్పలేం. ఓవరాల్‌గా రావు బహదూర్.. రెగ్యులర్ కాదు.. డిఫెరెంట్ సైకలాజికల్ థ్రిల్లర్..!

Jul 03, 2026 Read Review
6

Above Average

Rao Bahadur movie Review

అనుమానం పాత రోగం, అనుమానం పెనుభూతం అంటుంటారు. సరిగ్గా ఇదే పాయింట్‌ పై నడిచే మూవీ ఈ రావు బహదూర్. కథగా ఇది చాలా చిన్నపాయింట్‌. ఒక పెద్ద సినిమా చేసేంత బలమైన పాయింట్‌ అయితే కాదు, కానీ దాన్ని సినిమాగా తెరకెక్కించడంలో దర్శకుడు వెంకటేష్‌ మహా చేసిన ప్రయత్నం, ఆయన్ని నిర్మాతలు, హీరోహీరోయిన్లు నమ్మడం ఇక్కడ గొప...

అనుమానం పాత రోగం, అనుమానం పెనుభూతం అంటుంటారు. సరిగ్గా ఇదే పాయింట్‌ పై నడిచే మూవీ ఈ రావు బహదూర్. కథగా ఇది చాలా చిన్నపాయింట్‌. ఒక పెద్ద సినిమా చేసేంత బలమైన పాయింట్‌ అయితే కాదు, కానీ దాన్ని సినిమాగా తెరకెక్కించడంలో దర్శకుడు వెంకటేష్‌ మహా చేసిన ప్రయత్నం, ఆయన్ని నిర్మాతలు, హీరోహీరోయిన్లు నమ్మడం ఇక్కడ గొప్ప విషయం. ఒక కొత్తరకమైన పాయింట్ తో ఈ మూవీ తీయడాన్ని అభినందించాలి. కానీ తీసిన విధానం, చెప్పిన తీరుని మాత్రం ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది.


రామప్ప రావు బహదూర్‌గా సత్యదేవ్‌ ఇరగదీశాడు. విభిన్నమైన షేడ్స్ లో ఆయన అదరగొట్టారు. యంగ్‌ కుర్రాడిగా, మిడిల్‌ ఏజ్‌ వ్యక్తిగా, వృద్ధుడిగా పాత్రలో పరకాయ ప్రవేశం చేశారు. దర్శకుడు వెంకటేష్‌ మహా మంచి కథలను తెరపై ఆవిష్కరిస్తూ ఆకట్టుకుంటారు. కానీ ఈ సారి మాత్రం ఆయన మెప్పించలేపోయాయి. ప్రయోగం మాత్రం చేశారని చెప్పొచ్చు. ప్రయోగం బాగుంది, కానీ ఆడియెన్స్ కి ఆకట్టుకునేలా చేయడంలో విఫలమయ్యారు. అనుమానం పెనుభూతం అన్నట్టు, ఇది ఆడియెన్స్ సహనాన్ని పరీక్షించే మూవీ అవుతుందని చెప్పడంలో ఎలాంటి అనుమానం లేదు. 

Jul 04, 2026 Read Review
One India
One India Website
6

Above Average

Rao bahadur Movie Review

"అనుమానం పెనుభూతం" అనే సామెతను దర్శకుడు వెంకటేష్ మహా రెండు గంటలకు పైగా నిడివి ఉన్న రావు బహదూర్ సినిమాగా మలిచారు. సాధారణంగా మనిషిని బతికించేది గాలి, నీరు, ఆహారం అని అంటారు. కానీ ఈ సినిమాలో మాత్రం ఒక అనుమానం కూడా మనిషిని ఎలా బతికిస్తుందో, అదే సమయంలో లోపల నుంచి ఎలా నెమ్మదిగా చంపేస్తుందో దర్శకుడు చాలా ల...

"అనుమానం పెనుభూతం" అనే సామెతను దర్శకుడు వెంకటేష్ మహా రెండు గంటలకు పైగా నిడివి ఉన్న రావు బహదూర్ సినిమాగా మలిచారు. సాధారణంగా మనిషిని బతికించేది గాలి, నీరు, ఆహారం అని అంటారు. కానీ ఈ సినిమాలో మాత్రం ఒక అనుమానం కూడా మనిషిని ఎలా బతికిస్తుందో, అదే సమయంలో లోపల నుంచి ఎలా నెమ్మదిగా చంపేస్తుందో దర్శకుడు చాలా లోతుగా చూపించాడు.


ప్లస్ పాయింట్స్.. సత్యదేవ్ అద్భుతమైన నటన వెంకటేష్ మహా రచన, దర్శకత్వం క్లైమాక్స్ ట్విస్ట్ బలమైన భావోద్వేగాలు కులం, వంశం, అనుమానం వంటి అంశాలపై లోతైన చర్చ సినిమాటోగ్రఫీ నేపథ్య సంగీతం నిర్మాణ విలువలు


మైనస్ పాయింట్స్.. నెమ్మదిగా సాగే ఫస్ట్ హాఫ్ కమర్షియల్ ఎలిమెంట్స్ లేకపోవడం DNA పరీక్షలకు సంబంధించిన కొన్ని సన్నివేశాలు సినిమాటిక్‌గా అనిపించడం సాధారణ ప్రేక్షకులకు పూర్తిగా కనెక్ట్ కాకపోవచ్చు కొంత నిడివి ఎక్కువగా అనిపిస్తుంది. ఓవరాల్ గా ఒకసారి ట్రై చేయొచ్చు. 


Jul 03, 2026 Read Review
NTV Telugu
NTV Telugu News Channel
6

Above Average

Rao bahadur movie Review

సాధారణ కమర్షియల్ సినిమాలకు పూర్తి భిన్నంగా తెరకెక్కిన 'రావు బహదూర్' ప్రేక్షకులను పరీక్షించే చిత్రంగా నిలుస్తుంది. ప్రారంభం నుంచే మిస్టరీతో కథను నడిపించిన దర్శకుడు, ప్రతి పాత్ర వెనుక ఒక రహస్యాన్ని దాచిపెడతాడు. అయితే ఆ ఆసక్తిని కొనసాగించే క్రమంలో కథనం మరీ క్లిష్టంగా మారిపోవడంతో ఫస్ట్ హాఫ్‌లోనే చాలా మం...

సాధారణ కమర్షియల్ సినిమాలకు పూర్తి భిన్నంగా తెరకెక్కిన 'రావు బహదూర్' ప్రేక్షకులను పరీక్షించే చిత్రంగా నిలుస్తుంది. ప్రారంభం నుంచే మిస్టరీతో కథను నడిపించిన దర్శకుడు, ప్రతి పాత్ర వెనుక ఒక రహస్యాన్ని దాచిపెడతాడు. అయితే ఆ ఆసక్తిని కొనసాగించే క్రమంలో కథనం మరీ క్లిష్టంగా మారిపోవడంతో ఫస్ట్ హాఫ్‌లోనే చాలా మందికి కన్ఫ్యూజన్ కలిగించే అవకాశం ఉంది.


సెకండాఫ్‌లో కథ కాస్త స్పష్టతకు వచ్చినా, ప్రేక్షకుడు అంతవరకు ఓపికగా ప్రయాణించాల్సిందే. క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్టులు సినిమాకు కొంత బలం చేకూర్చినా, మొత్తం ప్రయాణాన్ని పూర్తిగా సంతృప్తికరంగా మార్చలేవు. సత్యదేవ్ తన నటనతో మరోసారి ఆకట్టుకోగా, దర్శకుడు వెంకటేష్ మహా కొత్త తరహా కథ చెప్పాలనే ప్రయత్నం చేసిన విషయం స్పష్టంగా కనిపిస్తుంది.


మొత్తంగా, రెగ్యులర్ ఎంటర్‌టైనర్‌ను ఆశించే వారికి 'రావు బహదూర్' అంతగా నచ్చకపోవచ్చు. కానీ ప్రయోగాత్మక కథలు, నెమ్మదిగా విప్పుకునే మిస్టరీ డ్రామాలను ఇష్టపడే ప్రేక్షకులకు మాత్రం ఈ సినిమా ఒక విభిన్న అనుభూతిని అందిస్తుంది. ఫైనల్ గా టాలీవుడ్ లో ఇప్పటివరకు ట్రై చేయని రియలిజం మ్యాజిక్ తో కూడిన ఒక ఎంగేజింగ్ సైకలాజికల్ డ్రామా ఈ రావు బహదూర్. 

Jul 03, 2026 Read Review
Filmi Beat
Filmi Beat Website
5

Average

Rao Bahadur movie Review

సూపర్ స్టార్ మహేష్ బాబు రావు బహదూర్ సినిమాకు వెన్నుదన్నుగా నిలవడంతో ఉన్నట్టుండి క్రేజ్ పెరిగింది. మూవీ రిలీజ్‌ కు ముందు ఆయన వేసిన ట్వీట్‌ తో అంచనాలు పెరిగాయి. అయితే తెలుగు సినిమా చూడని కథ అంటూ చెప్పడంతో రావు బహదూర్ సినిమాపై క్యూరియాసిటీ పెరిగింది. తీరా చూస్తే చివరి 10 నిమిషాల క్లైమాక్స్ కోసం రెండున్...

సూపర్ స్టార్ మహేష్ బాబు రావు బహదూర్ సినిమాకు వెన్నుదన్నుగా నిలవడంతో ఉన్నట్టుండి క్రేజ్ పెరిగింది. మూవీ రిలీజ్‌ కు ముందు ఆయన వేసిన ట్వీట్‌ తో అంచనాలు పెరిగాయి. అయితే తెలుగు సినిమా చూడని కథ అంటూ చెప్పడంతో రావు బహదూర్ సినిమాపై క్యూరియాసిటీ పెరిగింది. తీరా చూస్తే చివరి 10 నిమిషాల క్లైమాక్స్ కోసం రెండున్నర గంటలపాటు సినిమాను సాగదీయడం అత్యంత నిరాశను, అసంతృప్తిని కలిగించే అంశంగా కనిపిస్తుంది. పేలవమైన సన్నివేశాలు ఉన్నప్పటికీ.. సత్యదేవ్ తన పెర్ఫార్మెన్స్‌తో సినిమా కంటెంట్‌ను కొంత మెరుగుపరిచాడు. 


రావు బహదూర్ సినిమా గురించి ఫైనల్‌ గా చెప్పాలంటే.. డైరెక్టర్ ఆలోచించిన పాయింట్ బాగుంది. సమాజాన్ని ఆలోచింపజేసేలా ఉంది. కానీ ఆ పాయింట్‌ ను పూర్తిస్థాయి కథగా మార్చడంలో తడబాటు కనిపిస్తుంది. సినిమా కథ చెప్పడంలో తెలివి ఉండాలి. కానీ ఎక్కువ మేధావితనం ప్రదర్శించకూడదనే విషయం ఈ సినిమా చెబుతుంది. ఈ సినిమా ఫిలాసఫికల్‌ గా ఎమోషనల్ డ్రామా, ఈ డాక్టర్, పేషెంట్ డ్రామాను చూడాలంటే ఎక్కువ పెషన్స్ తప్పనిసరి. కేవలం సత్యదేవ్ పెర్ఫార్మెన్స్ కోసం ఈ సినిమాను చూడొచ్చు.


Jul 03, 2026 Read Review
Great Andhra
Great Andhra Website
5

Average

Rao Bahadur Movie Review

Director Venkatesh Maha earned widespread critical acclaim with films like C/o Kancharapalem and Uma Maheswara Ugra Roopasya. His reunion with Satyadev for Rao Bahadur, presented by Mahesh Babu, naturally generated considerable curiosity. Mahesh Babu even claimed that Telugu cinema had never seen a...

Director Venkatesh Maha earned widespread critical acclaim with films like C/o Kancharapalem and Uma Maheswara Ugra Roopasya. His reunion with Satyadev for Rao Bahadur, presented by Mahesh Babu, naturally generated considerable curiosity. Mahesh Babu even claimed that Telugu cinema had never seen a film made in this manner before.


Highlights

Satyadev’s terrific performance

The final twists and payoff

The portions after the police officer’s entry


Drawbacks

Uneven and slow-moving first half

Lengthy runtime

Self-indulgent narration in several stretches


Overall, Rao Bahadur is a sincere attempt to tell a story in a distinctive manner. The idea is admirable, and the climax justifies much of the film’s thematic ambition, with Satyadev delivering a performance worthy of applause. However, the painfully slow narration, overstretched screenplay and self-indulgent storytelling make it a tiresome watch. Those willing to invest patience may appreciate its intent, but for many viewers, the film’s pacing will prove to be a major hurdle.


Jul 03, 2026 Read Review
Sakshi
Sakshi News Channel
5

Average

Rao Bahadur Movie Review

'రావు బహదూర్' ఆసక్తికరమైన కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ప్రయోగాత్మక చిత్రం. రంగు, రూపం చూసి మనుషులను అంచనా వేయకూడదనే సందేశాన్ని చెప్పే ప్రయత్నం చేసింది. అయితే క్లిష్టమైన స్క్రీన్‌ప్లే, కన్ఫ్యూజింగ్ నేరేషన్ కారణంగా ఫస్ట్ హాఫ్ సాధారణ ప్రేక్షకులకు కనెక్ట్ కావడం కష్టమే. సెకండాఫ్‌ లో కథ కాస్త పుంజుకుని,...

'రావు బహదూర్' ఆసక్తికరమైన కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ప్రయోగాత్మక చిత్రం. రంగు, రూపం చూసి మనుషులను అంచనా వేయకూడదనే సందేశాన్ని చెప్పే ప్రయత్నం చేసింది. అయితే క్లిష్టమైన స్క్రీన్‌ప్లే, కన్ఫ్యూజింగ్ నేరేషన్ కారణంగా ఫస్ట్ హాఫ్ సాధారణ ప్రేక్షకులకు కనెక్ట్ కావడం కష్టమే. 


సెకండాఫ్‌ లో కథ కాస్త పుంజుకుని, క్లైమాక్స్‌ లో వచ్చే ట్విస్టులు ఆకట్టుకుంటాయి. సత్యదేవ్ నటన సినిమాకు ప్రధాన బలం. మొత్తంగా, అందరికీ నచ్చే సినిమా కాకపోయినా... కొత్త తరహా కథలను ఇష్టపడే వారికి ఒక డిఫరెంట్ ఎక్స్‌పీరియెన్స్ అందిస్తుంది. వెంకటేష్ మహా డైరెక్షన్ బావున్నా, స్క్రీన్ ప్లే ఒకింత డిస్సపాయింట్ చేస్తుంది. ఎంటర్టైన్మెంట్ మాత్రమే కావాలనుకునే ఆడియన్స్ ఈ సినిమాపై తక్కువ అంచనాలు పెట్టుకుని వెళ్తే మంచిది.

Jul 03, 2026 Read Review
Samayam Telugu
Samayam Telugu Website
5

Average

Rao Bahadur Movie Review

రావు బహదూర్ సినిమా గురించి చెప్పాలంటే... కథ పాయింట్ బాగుంటుంది. మెరిసేదంతా బంగారం కాదు.. నలుపు, తెలుపు అన్న తేడాతో వ్యక్తుల్ని భిన్నంగా చూడకూడదు.. అనే పాయింట్లను చెప్పే ప్రయత్నాన్ని వెంకటేష్ మహా చేసినట్టుగా అనిపిసిస్తుంది. కాకపోతే ఆ పాయింట్‌ ని కథగా మలిచి, సినిమా కోసం రాసుకున్న బ్యాక్ డ్రాప్, తీసిన...

రావు బహదూర్ సినిమా గురించి చెప్పాలంటే... కథ పాయింట్ బాగుంటుంది. మెరిసేదంతా బంగారం కాదు.. నలుపు, తెలుపు అన్న తేడాతో వ్యక్తుల్ని భిన్నంగా చూడకూడదు.. అనే పాయింట్లను చెప్పే ప్రయత్నాన్ని వెంకటేష్ మహా చేసినట్టుగా అనిపిసిస్తుంది. కాకపోతే ఆ పాయింట్‌ ని కథగా మలిచి, సినిమా కోసం రాసుకున్న బ్యాక్ డ్రాప్, తీసిన విధానం మాత్రం మినిమం డిగ్రీ చదివిన వాళ్లకి కూడా అర్థం కాదేమో. అలా ఉంది సినిమా. అయితే తెలుగులో ఇలాంటి టేకింగ్, స్క్రీన్ ప్లే మాత్రం కొత్త అని చెప్పుకోవచ్చు.


భువనాలయం అనే రాజ కోట.. అందులో రామప్ప ఒకే గదిలో 8 ఏళ్ల పాటుగా ఉండటం.. ఇదంతా కూడా ప్రారంభంలో ఓ రకంగా అనిపించొచ్చు. అసలేం చేస్తున్నాడు.. ఏమై ఉంటుంది.. ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నాడు.. అనే ప్రశ్నలు కలుగుతాయి. ఇక కుసుమప్ప, రామప్ప, రేణుక, ఆచారి, లవణప్ప, అచ్చమ్మ పాత్రలతో ఫస్ట్ హాఫ్ అంతా కాస్త గందరగోళంగానే సాగుతుంది. ద్వితీయార్దం పర్వాలేదనిపిస్తుంది. అయితే క్లైమాక్స్‌ లో మాత్రం ఎవ్వరూ ఊహించని ట్విస్ట్ వస్తుంది. ఓవరాల్ గా ఇది సత్య దేవ్ వన్ మెన్ షో అని చెప్పుకోవచ్చు. ఇందులో వెంకటేష్ మహా చెప్పాలని అనుకున్నది, చూపించింది ఏంటో.. సామాన్య ప్రేక్షకులకు అర్థం కాక.. ఫస్ట్ హాఫ్‌లోనే బయటకు వెళ్లే ప్రమాదం ఉంది. ఇక సహనంగా, ఓపికతో భరిద్దాం అని చివరి వరకు చూసిన ప్రేక్షకుడికి కాస్త రిలీఫ్‌గా ఓ రెండు ట్విస్టులు ఉంటాయి. ఆ చివరి ఐదు నిమిషాలు మాత్రమే కాస్త ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తుంది. ఇదొక వినూత్న ప్రయోగం, ప్రయత్నం అని మాత్రం చెప్పుకోవచ్చు.

Jul 03, 2026 Read Review
123telugu
123telugu Website
6

Above Average

Rao Bahadur Movie Review

ఈ వారం థియేటర్స్ లోకి వచ్చిన తాజా చిత్రాల్లో టాలెంటెడ్ నటుడు సత్యదేవ్ హీరోగా కేరాఫ్ కంచరపాలెం దర్శకుడు వెంకటేష్ మహా నుంచి వచ్చిన సినిమా “రావు బహదూర్” కూడా ఒకటి. అయితే ఆడియన్స్ నుండి ఈ మూవీ మిక్డ్స్ రెస్పాన్స్ అందుకుంది. డిఫరెంట్ సైకలాజికల్ కాన్సెప్ట్ తో పాటు సత్యదేవ్ నటన ఆకట్టుకుంటుంది. కామెడీ అండ్...

ఈ వారం థియేటర్స్ లోకి వచ్చిన తాజా చిత్రాల్లో టాలెంటెడ్ నటుడు సత్యదేవ్ హీరోగా కేరాఫ్ కంచరపాలెం దర్శకుడు వెంకటేష్ మహా నుంచి వచ్చిన సినిమా “రావు బహదూర్” కూడా ఒకటి. అయితే ఆడియన్స్ నుండి ఈ మూవీ మిక్డ్స్ రెస్పాన్స్ అందుకుంది. డిఫరెంట్ సైకలాజికల్ కాన్సెప్ట్ తో పాటు సత్యదేవ్ నటన ఆకట్టుకుంటుంది. కామెడీ అండ్ ఎమోషనల్ సీన్స్ కూడా బాగానే ఉన్నాయి. అనుమానం పెనుభూతం అనే కాన్సెప్ట్ పై దర్శకుడు మైంటైన్ చేసిన సస్పెన్స్ ఫ్యాక్టర్, దీనిపై సాగే సంభాషణలు అలాగే అక్కడక్కడా ఫన్ మూమెంట్స్ సహా ఎమోషన్స్ ఇందులో బాగున్నాయి. 


సత్యదేవ్ సహా ఇతర నటీనటులు కూడా మంచి సహకారం అందించారు. కానీ వెంకటేష్ మహా దర్శకుడని, సత్య దేవ్ కాబట్టి సాలిడ్ స్క్రిప్ట్ ఉంటుందని నమ్మి, ఈ సినిమా విషయంలో ఓవర్ అంచనాలు పెట్టుకుంటే మాత్రం ఈ కాంబినేషన్ కోసం ఎదురు చూసిన ఆడియెన్స్ కొంతమేర నిరాశ చెందవచ్చు. సో వాటి విషయంలో కాంప్రమైజ్ అయితే ఈ సినిమా డీసెంట్ గా అనిపిస్తుంది.


Jul 03, 2026 Read Review

Public Reviews

8 Avg: 6.1/10
T
Tharuni Valluru Small Business Owner
6

Above Average

Rao bahadur movie review

సో.. రావు బహదూర్ ఇప్పుడే చూసొచ్చాను. నాకు మాత్రం సినిమా బాగా కనెక్ట్ అయింది. ఇది అందరికీ ఎక్కే సినిమా కాదు, కానీ ఎక్కితే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఫీల్ ఇస్తుంది. సత్యదేవ్ అయితే సినిమా మొత్తాన్ని తన షోల్డర్స్ మీద మోసేశాడు. ముఖ్యంగా సెకండ్ హాఫ్‌లో పర్ఫార్మెన్స్ అదిరిపోయింది. స్క్రీన్‌ప్లే, విజువల్స్, CGI...

సో.. రావు బహదూర్ ఇప్పుడే చూసొచ్చాను. నాకు మాత్రం సినిమా బాగా కనెక్ట్ అయింది. ఇది అందరికీ ఎక్కే సినిమా కాదు, కానీ ఎక్కితే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఫీల్ ఇస్తుంది. సత్యదేవ్ అయితే సినిమా మొత్తాన్ని తన షోల్డర్స్ మీద మోసేశాడు.


ముఖ్యంగా సెకండ్ హాఫ్‌లో పర్ఫార్మెన్స్ అదిరిపోయింది. స్క్రీన్‌ప్లే, విజువల్స్, CGI అన్నీ చాలా డిఫరెంట్‌గా అనిపించాయి. క్లైమాక్స్ కూడా బాగా వర్కౌట్ అయింది. ఒక్క మైనస్ ఏంటంటే సినిమా కొంచెం ల్యాగ్ అవుతుంది. ఓపికతో చూస్తే మాత్రం డెఫినెట్‌గా ట్రై చేయొచ్చు.

Jul 06, 2026
B
Baburam Powdal IT Employee
6

Above Average

Rao bahadur movie review

Rao Bahadur is one of those films that either connects with you or doesn't. For me, it did. The movie has a fresh concept, strong world-building, and a different style of storytelling. Satyadev delivers one of his finest performances and carries the film with complete conviction. The second half is...

Rao Bahadur is one of those films that either connects with you or doesn't. For me, it did. The movie has a fresh concept, strong world-building, and a different style of storytelling. Satyadev delivers one of his finest performances and carries the film with complete conviction. The second half is much stronger than the first, and the climax is satisfying.


Yes, the movie drags at times, and the slow narration may not work for everyone. But if you're looking for something different from the usual commercial films, give it a chance.

Jul 06, 2026
B
Baru Sri Harshitha Students & Youth
6

Above Average

Rao Bahadur movie Review

Just watched Rao Bahadur, and I came out impressed. It's a bold attempt with a unique concept that you don't usually see in Telugu cinema. Satyadev is the heart of the film—his performance, especially in the second half, is absolutely top-notch. The screenplay and visuals have a different vibe, and...

Just watched Rao Bahadur, and I came out impressed. It's a bold attempt with a unique concept that you don't usually see in Telugu cinema. Satyadev is the heart of the film—his performance, especially in the second half, is absolutely top-notch.


The screenplay and visuals have a different vibe, and the suspense keeps you engaged till the end.


The climax worked really well for me. The only issue is the pacing, as the movie feels slow in parts. If you're okay with a slow-burn film, this one is definitely worth watching.

Jul 06, 2026
T
Talari Snehalatha IT Employee
6

Above Average

Rao Bahadur movie Review

Just watched Rao Bahadur, and I actually liked it. It's definitely not a movie for everyone, but if it clicks, it really works. Satyadev is the biggest strength of the film—he completely owns the role of Ramappa and gives a performance that's especially outstanding in the second half. The screenplay...

Just watched Rao Bahadur, and I actually liked it. It's definitely not a movie for everyone, but if it clicks, it really works. Satyadev is the biggest strength of the film—he completely owns the role of Ramappa and gives a performance that's especially outstanding in the second half.


The screenplay, CGI, and overall treatment feel fresh and unique for a Telugu film. The suspense is maintained well, the climax lands nicely, and the grand moments have a solid impact. The only major drawback is the slow pacing. If you're patient, there's a good chance you'll enjoy this unique cinematic experience.

Jul 06, 2026
V
Velugubantla Ramadurga Private Employee
6

Above Average

Rao bahadur movie Review

just now watched Rao bahadur movie. మూవీ చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే just avarage అనిపించింది. because సినిమా content wise గా brilliant concept. but డైరెక్టర్ వెంకటేష్ మహా దాన్ని సరిగా ఎంగేజింగ్ గా చెప్పలేకపోయాడు. పెర్ఫార్మన్స్ గురించి చెప్పుకుంటే... సత్యదేవ్ సూపర్ గా ఇంప్రెస్ చేసాడు. అండ్ సిన...

just now watched Rao bahadur movie. మూవీ చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే just avarage అనిపించింది. because సినిమా content wise గా brilliant concept. but డైరెక్టర్ వెంకటేష్ మహా దాన్ని సరిగా ఎంగేజింగ్ గా చెప్పలేకపోయాడు. 


పెర్ఫార్మన్స్ గురించి చెప్పుకుంటే... సత్యదేవ్ సూపర్ గా ఇంప్రెస్ చేసాడు. అండ్ సినిమాలో క్లైమాక్స్ చాలా thrilling గా ఉంది. బట్ ఆ climax కోసం మూవీ మొత్తం భరించాల్సొచ్చింది. చాలా బోరింగ్ screenplay ఉంది, అందుకే lag ఎక్కువైంది. entertainment expect చేస్తే సినిమా నచ్చే ఛాన్స్ చాలా తక్కువ. 

Jul 05, 2026
A
Arige Srikanth Private Employee
7

Hit

Rao Bahadur movie Review

రావు బహదూర్... బైట వచ్చిన talk కి రివర్స్ లో ఉంటది నా రివ్యూ.. ఎందుకంటే నాకైతే సినిమా నచ్చింది. పెద్ది తర్వాత మళ్ళి ఓ మంచి సినిమా చూశాననిపించింది. కమర్షియల్ మూవీ అస్సలు కాదు. ఇలాంటి సినిమా చూడాలంటె చాలా ఓపిక కావాలి. అండ్ కాస్త కళాహృదయం కూడా ఉండాలి. ఎందుకంటే సినిమా చూసి చాలా మంది నెగిటివ్ రివ్యూ...

రావు బహదూర్... బైట వచ్చిన talk కి రివర్స్ లో ఉంటది నా రివ్యూ.. ఎందుకంటే నాకైతే సినిమా నచ్చింది. పెద్ది తర్వాత మళ్ళి ఓ మంచి సినిమా చూశాననిపించింది. కమర్షియల్ మూవీ అస్సలు కాదు. ఇలాంటి సినిమా చూడాలంటె చాలా ఓపిక కావాలి. అండ్ కాస్త కళాహృదయం కూడా ఉండాలి. 


ఎందుకంటే సినిమా చూసి చాలా మంది నెగిటివ్ రివ్యూసే ఇస్తున్నారు. ఎందుకంటే... వాళ్లకు అర్ధం కాక కొన్ని కారణాలుండొచ్చు... బోర్ కొట్టడం reason అయుండొచ్చు. ఇంకేదైనా కావొచ్చు. But the movie is brilliant... సత్యదేవ్ అయితే ultimate అసలు. వెంకటేష్ మహా డైరెక్షన్ బాగుంది.. కానీ కొన్ని సీన్స్ ట్రిమ్ చేసి స్క్రీన్ ప్లే racyగా ఉంటే బాగుండేది.

Jul 05, 2026
B
Baru Sri Harshitha Students & Youth
6

Above Average

Rao bahadur movie review

I watched Rao Bahadur with decent expectations, and it turned out to be a decent one-time watch. The story had a few interesting moments, but the narration felt a bit slow in the middle. The performances were good, especially in the emotional scenes, and the background music supported the mood well....

I watched Rao Bahadur with decent expectations, and it turned out to be a decent one-time watch. The story had a few interesting moments, but the narration felt a bit slow in the middle. The performances were good, especially in the emotional scenes, and the background music supported the mood well. 


Some comedy scenes worked, while a few didn't land for me. The climax was satisfying, though I felt it could have been more impactful. Overall, it's not a bad movie, but it also doesn't offer anything very new. 

Jul 04, 2026
K
KOLUGURU SURESH Students & Youth
6

Above Average

Rao Bahadoor Review

Hero sathyadev GMB banner lo cinema anagane pedda pedda herolatho poti padali ani chusadu kani entha pedda hero ayina content lekapothe padalsindhe. Adhe rao bahadoor cinemalo jarigindhi different type of concept tho alagaina hit kottali ani chusi bokka borla paddadu. Cinema chusthunna anthasepu oka...

Hero sathyadev GMB banner lo cinema anagane pedda pedda herolatho poti padali ani chusadu kani entha pedda hero ayina content lekapothe padalsindhe. Adhe rao bahadoor cinemalo jarigindhi different type of concept tho alagaina hit kottali ani chusi bokka borla paddadu. Cinema chusthunna anthasepu okate feeling endhuku chusthunnama ani inka nijam cheppali ante kevalam aa climax okkamatta kosam like climax kosam ee cinema saagathishara ani pichekkadam kaayam.

Jul 06, 2026

About This Movie

Story :

90స్ బ్యాక్ డ్రాప్ లో నడిచే ఈ కథలో ఓ రాజకుటుంబానికి చెందిన  భువనం రామప్ప రావు బహదూర్ అలియాస్ రామప్ప (సత్యదేవ్) చాలా యేళ్ళుగా లివర్ క్యాన్సర్ తో బాధ పడుతూ ఒంటరి జీవితాన్ని గడుపుతూ ఉంటాడు. కొన్ని నెలలు మాత్రమే బతుకుతాడని డాక్టర్లు తేల్చిన ప్రతిసారి బతికి ప్రాణాలు పోకుండా జీవితాన్ని కొనసాగిస్తుంటాడు. అయితే రామప్ప జీవితంలో చోటు చేసుకొన్న ఓ విషాద సంఘటన మానసికంగా కుంగదీస్తుంది. పైగా ఓ అనుమానం పెనుభూతంలా అతడిని పట్టి పీడిస్తుంది. ఈ క్రమంలో రామప్ప చివరి రోజులు ఎలా గడిచాయి? అతని స్నేహితుడు డాక్టర్ ఆచారి (వికాస్ ముప్పల)తో ఎలాంటి అనుబంధం ఉంది? రామప్పను బతికించడానికి ఆచారి చేసిన ప్రయత్నాలు ఏంటి? మధ్యలో రామప్పను రేణుక (దీపా థామస్) ఎందుకు పెళ్లి చేసుకుంది. రామప్ప పెంపుడు కొడుక్కి ఎదురైన అవమానాలు ఏంటి? ఇంతకీ రామప్పను వేధిస్తున్న ఆ అనుమానం వెనుక నిజం తెలిసిందా? చివరికి రామప్ప జీవితం ఎలా ముగిసిందనేది సినిమా చూసి తెలుసుకోవాలి.

 


PlusPoints :

ముందుగా రావు బహదూర్ సినిమా సత్యదేవ్ - వెంకటేష్ మహా కాంబినేషన్ లో వస్తుందనగానే మంచి క్రేజ్ జనాల్లో మొదలైంది. దానికి తోడు మహేష్ బాబు సమర్పణలో మూవీ అనగానే ఇండస్ట్రీలోనూ మంచి హైప్ వచ్చేయగా, టీజర్, ట్రైలర్లు కూడా జనాల్లో ఆసక్తి పెంచేసాయి. అయితే సినిమా రిలీజ్ తర్వాత లెక్కలు తారుమారయ్యాయి. సినిమా కథ సింపుల్ గానే ఉన్నా, దాని చుట్టూ అనుమాన పెనుభూతం కాన్సెప్ట్ తో అల్లుకున్న స్క్రీన్ ప్లే మాత్రం డిఫరెంట్ గా ప్రెజెంట్ చేసాడు దర్శకుడు. దానికి తోడు సత్యదేవ్ రావు బహదూర్ గా డిఫరెంట్ వేరియేషన్స్ తో సాలిడ్ పెర్ఫార్మన్స్ తో చితగ్గొట్టాడు. మిగతా నటీనటులందరూ తమ పాత్రల పరిధిమేరకు నటించారు. ఇక ఫస్ట్ హాఫ్ లో కొంత సేపు బాగానే ఉన్న సినిమా చాలా వరకు డల్ గా సాగుతుంది. అలాగే పలు కామెడీ సీన్స్ అండ్ డైలాగ్స్ తో పాటు క్లైమాక్స్ కూడా ఇంప్రెస్ చేస్తుంది.

 

MinusPoints :

అయితే రావు బహదూర్ కాన్సెప్ట్ వరకు బాగానే ఉన్నా, దానికి తగ్గ ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లే రాసుకోవడంలో దర్శకుడు తడబడ్డాడు. పైగా కథ ముందుకు వెళ్లే కొద్దీ సాగదీత ఎక్కువైపోయిన ఫీల్ వస్తుంది. ఒక్క క్లైమాక్స్ కోసం సినిమా మొత్తం భరించిన ఫీల్ కూడా వస్తుంది. అయితే చాలా మంది కేరాఫ్ కంచరపాలెం డైరెక్ట్ చేసిన వెంకటేష్ మహా దర్శకుడు కావడం వల్ల ఈ సినిమాపై మరీ ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని చూడడం వల్ల డిస్సపాయింట్ అవుతున్నారు. ఓవరాల్ గా కథనం ఇంకా గ్రిప్పింగ్ గా రాసుకుని ఉంటే లెక్క వేరేలా ఉండేది.

 

Technical values :

టెక్నికల్ గా చూసుకుంటే... ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా ఉన్నాయి. సినిమాకి ఎంత కావాలో అంతే పెట్టినట్టు పర్ఫెక్ట్ గా సరిపోయింది. పీరియాడిక్ నేపథ్యంలో వేసిన సెట్స్ కూడా చాలా బాగున్నాయి. పైగా కెమెరా వర్క్ బాగుంది. మ్యూజిక్ వర్క్ కూడా బాగా కుదిరింది. సాంగ్స్ డీసెంట్ గా కథకు తగ్గట్టుగా ఉన్నాయి. ఎడిటింగ్ వర్క్ బాగానే ఉన్నా, కొన్ని సాగదీత సీన్స్ ని ట్రిమ్ చేయాల్సింది. ఇక డైరెక్టర్ వెంకటేష్ మహా అనుకున్న కాన్సెప్ట్ బాగానే ఉన్నా దాన్ని ఇంట్రెస్టింగ్ వే లో ప్రెజెంట్ చేయడంలో తడబడ్డాడు. 

 

FinalReview : 

ఫైనల్ గా రావు బహదూర్ సినిమా ఒక డిఫరెంట్ సైకలాజికల్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన థ్రిలర్ మూవీగా ఆడియన్స్ ని కొంతవరకు మెప్పించొచ్చు. అనుమానం అనే పెనుభూతం కాన్సెప్ట్ పై డైరెక్టర్ కొనసాగించిన సస్పెన్స్, దానికి తగ్గ సత్యదేవ్ పెర్ఫార్మన్స్, క్లైమాక్స్ ఆడియన్స్ ని ఇంప్రెస్ చేస్తాయి. అయితే సాగదీత కథనం వల్ల, మూవీ ఆడియన్స్ కి బోర్ ఫీల్ తెప్పిస్తుంది. ఇలాంటి కాన్సెప్ట్ బేస్డ్ మూవీస్ ఆడియన్స్ కి అర్ధం కావాలన్నా కొంచెం టైం పడుతుంది. ఓవరాల్ గా సత్యదేవ్ పెర్ఫార్మన్స్ కోసం, తక్కువ అంచనాలతో మూవీని ఓసారి ట్రై చేయొచ్చు.  

Review Statistics

5.8
Overall Rating
Avg. of all reviews
25
Total Reviews
From 5 Provider Types

Review Average

Media
5.6/10
Public
6.1/10
Why MRO?