Register as a Reviewer
Home Latest Movie Reviews

Latest Movie Reviews

The most recent reviews from top critics and publications

1888 Reviews
Showing 685–696 of 1888 reviews

Makutam movie review

‘మకుటం’ సినిమా చూసిన తర్వాత నా అభిప్రాయం చెప్పాలంటే.. సినిమా యాక్షన్, ఎమోషన్‌తో తెరకెక్కించినా, నాకు మాత్రం అంతగా కనెక్ట్ కాలేదు. విశాల్ తన పాత్రలో బాగానే నటించినప్పటికీ, రొటీన్ స్టోరీ, బోరింగ్ స్క్రీ...

‘మకుటం’ సినిమా చూసిన తర్వాత నా అభిప్రాయం చెప్పాలంటే.. సినిమా యాక్షన్, ఎమోషన్‌తో తెరకెక్కించినా, నాకు మాత్రం అంతగా కనెక్ట్ కాలేదు. విశాల్ తన పాత్రలో బాగానే నటించినప్పటికీ, రొటీన్ స్టోరీ, బోరింగ్ స్క్రీన్‌ప్లే సినిమాకు పెద్ద మైనస్‌గా అనిపించాయి.


ముఖ్యంగా కథలో కొత్తదనం లేకపోవడం, సన్నివేశాలు ఊహించిన విధంగానే సాగడం వల్ల చాలా చోట్ల ఇంట్రెస్ట్ తగ్గిపోయింది. నా వరకు అయితే సినిమా ఓవరాల్‌గా యావరేజ్‌గానే అనిపించింది. మంచి కథ, ఇంట్రెస్టింగ్ స్క్రీన్‌ప్లే కోరుకునే ఆడియన్స్‌కు మాత్రం ‘మకుటం’ నిరాశ కలిగించే అవకాశం ఉంది.

4.0
out of 9
3 months ago
Aug 18, 2026 Tamil

Makutam movie review

I just watched the movie *Makutam*... I honestly didn't even realize Vishal had directed it until the very end. To be fair, I watched the whole film mainly out of admiration for Vishal. The first half...

I just watched the movie *Makutam*... I honestly didn't even realize Vishal had directed it until the very end. To be fair, I watched the whole film mainly out of admiration for Vishal. The first half was average, but the second half felt like torture. They really took us for a ride with this one; I couldn't understand why it needed to be a three-hour movie. Even the handful of people in the theater were left wondering why they had bothered to show up.


I suspect even Vishal knew beforehand that this would be a flop. GV Prakash Kumar’s music was a letdown—not because the BGM wasn't good, but because it was wasted on a film like this. The only saving graces were the interval scene and the background score; aside from that, and perhaps the climax, the second half was tedious and filled with pointless scenes. The movie simply didn't work. If I had to rate it, I’d give it a 2/5.

5.0
out of 9
3 months ago
Aug 18, 2026 Tamil

Makutam movie review

మకుటం (Makutam) 2026 Youtube Channel
మకుటం... ప్రామిస్ గా చెప్తున్నా. ఈ సినిమా ఫినిష్ అయ్యే వరకు ఈ మూవీ డైరెక్ట్ చేసింది విశాల్ అని అస్సలు తెలీదు. రివ్యూ గురించి చెప్పాలంటే అసలు విశాల్ మీద ఉన్న అభిమానంతోనే సినిమా మొత్తం చూసాను. ఫస్ట్ హాఫ...

మకుటం... ప్రామిస్ గా చెప్తున్నా. ఈ సినిమా ఫినిష్ అయ్యే వరకు ఈ మూవీ డైరెక్ట్ చేసింది విశాల్ అని అస్సలు తెలీదు. రివ్యూ గురించి చెప్పాలంటే అసలు విశాల్ మీద ఉన్న అభిమానంతోనే సినిమా మొత్తం చూసాను. ఫస్ట్ హాఫ్ ఏమో యావరేజ్. సెకండ్ హాఫ్ నరకం అనిపించింది. మకుటం అని చెప్పి పెద్ద టోపీయే పెట్టారండి. అసలు దీనికెందుకు 3 గంటల సినిమా అనిపించింది. మళ్ళీ సినిమాకి వచ్చిన పది మంది కూడా ఎందుకొచ్చామురా అని ఫీల్ అయ్యారు. 


నాకు తెలిసి విశాల్ కి కూడా ఇది ప్లాప్ అవుతుందని ముందే తెలుసనుకుంటా. అందుకే పెద్దగా ప్రమోషన్లు చేయలేదు. ఇక జివి ప్రకాష్ కుమార్ మ్యూజిక్ దెబ్బేసాడు. బీజీఎమ్ బాగుంది. కానీ ఈ సినిమాకి ఆ మ్యూజిక్ వేస్ట్ అయింది. ఇక ప్లస్ పాయింట్ అంటే ఇంటర్వెల్ సీన్, ప్లస్ బీజీఎమ్. సెకండ్ హాఫ్ లో క్లైమాక్స్ అంతే. మైనస్ పాయింట్ అంటే చాలానే ఉన్నాయి. పనికి మాలిన సీన్లతో చాలా బోరింగ్ కొట్టేసింది. సినిమా అయితే పెద్దగా వర్కౌట్ కాలేదు. రేటింగ్ కూడా ఇవ్వాలంటే 2/5 ఇస్తున్న అంతే. 



6.0
out of 9
3 months ago
Aug 18, 2026 Tamil

Makutam movie review

మకుటం సినిమా విషయానికి వస్తే.. ఎలాంటి కొత్తదనం లేని రెగ్యులర్, రొటీన్ మాస్ మసాల ఫార్మూలా కథ. పోర్టు మాఫియా నేపథ్యంగా అల్లుకొన్న కథను హీరో విశాల్ దర్శకుడిగా మారి తెరపైకి తీసుకొచ్చారు. అయితే భాషా తరహా ట...

మకుటం సినిమా విషయానికి వస్తే.. ఎలాంటి కొత్తదనం లేని రెగ్యులర్, రొటీన్ మాస్ మసాల ఫార్మూలా కథ. పోర్టు మాఫియా నేపథ్యంగా అల్లుకొన్న కథను హీరో విశాల్ దర్శకుడిగా మారి తెరపైకి తీసుకొచ్చారు. అయితే భాషా తరహా ట్విస్ట్ ఉన్న కథ అయినప్పటికీ.. స్టోరీలో బలమైన పాయింట్ లేకపోవడం, సెకండాఫ్ కోసమే ఫస్టాఫ్‌ ను మరీ సాగదీశారా? అనే అభిప్రాయం కలుగుతుంది. అయితే పెర్ఫార్మన్స్ పరంగా, విశాల్ మూడు, నాలుగు గెటప్స్‌ లో తన క్యారెక్టర్‌ ను కొత్తగా ట్రై చేశాడు. వయసు మళ్లిన క్యారెక్టర్, యంగ్ క్యారెక్టర్‌ లో ఒదిగిపోయాడు.


సినిమాటోగ్రఫి, ఆర్ట్ వర్క్ ఫర్వాలేదనిపిస్తాయి. సూపర్ గుడ్ ఫిలింస్ బ్యానర్ స్టాండర్డ్స్‌ కు ఏ మాత్రం తీసిపోని విధంగా నిర్మాణ విలువలను పాటించారు. భాషా తరహా ఫ్యామిలీ, యాక్షన్ డ్రామాలను ఇష్టపడే వారికి ఈ సినిమా నచ్చడానికి అవకాశం ఉంది.


5.0
out of 9
3 months ago
Aug 18, 2026 Tamil

Makutam Movie review

హీరోగా విశాల్ కెరీర్ మొదలై 20 ఏళ్ళు దాటింది. హీరోగా తొలి అడుగులు వేసే సమయంలో కమర్షియల్ అంశాలతో కూడిన కొత్త కథలు - సినిమాలు చేశారు. ఆయనకు యాక్షన్ ఇమేజ్ వచ్చింది. ఆ తర్వాత విశాల్ ఎంపిక చేసుకునే కథలు, సి...

హీరోగా విశాల్ కెరీర్ మొదలై 20 ఏళ్ళు దాటింది. హీరోగా తొలి అడుగులు వేసే సమయంలో కమర్షియల్ అంశాలతో కూడిన కొత్త కథలు - సినిమాలు చేశారు. ఆయనకు యాక్షన్ ఇమేజ్ వచ్చింది. ఆ తర్వాత విశాల్ ఎంపిక చేసుకునే కథలు, సినిమాల్లో మూస ధోరణి ఎక్కువైంది. మార్క్ ఆంటోనీ, మద గజ రాజా హిట్స్ అయినా రొటీన్ కమర్షియల్ కథలతో తీసిన సినిమాలే అవి. ఈ తరుణంలో విశాల్ మెగాఫోన్ పట్టి దర్శకుడుగా మారడంతో ఎటువంటి సినిమా తీస్తారోనని పరిశ్రమ ప్రముఖులతో పాటు ప్రేక్షకులు సైతం చూశారు.


మకుటం చూస్తే… హీరోగా మాత్రమే కాదు, దర్శకుడిగానూ విశాల్ 20 ఏళ్ళ వెనక్కి వెళ్ళారని అనిపించింది. అసలు ఎటువంటి కొత్తదనం లేకుండా వచ్చిన సినిమా 'మకుటం'. హీరోగా, దర్శకుడిగా విశాల్ కెరీర్‌కు ఈ సినిమా ఏ విధంగానూ హెల్ప్ అవ్వదు. స్కిప్ చేయడం బెటర్. ఇటువంటి కథలు, సన్నివేశాలతో కూడిన సినిమాలను ప్రేక్షకులు పదుల సంఖ్యలో చూశారు. దర్శకుడిగా విశాల్ నుంచి ఇంత రొటీన్ ఫిల్మ్ వస్తుందనుకోలేదు. బాగా డిజప్పాయింట్ చేశారు.

5.0
out of 9
3 months ago
Aug 18, 2026 Tamil

Makutam movie Review

యాక్షన్, కమర్షియల్ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న విశాల్ కొన్నాళ్లుగా రొటీన్ రొట్ట కొట్టుడు కథలనే ఎంచుకుంటూ సక్సెస్ కు దూరమయ్యాడు. ఈ నేపథ్యంలో దర్శకుడిగా పరిచయమవుతూ ‘మకుటం’ తెరకెక్కించారు. అయితే సిని...

యాక్షన్, కమర్షియల్ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న విశాల్ కొన్నాళ్లుగా రొటీన్ రొట్ట కొట్టుడు కథలనే ఎంచుకుంటూ సక్సెస్ కు దూరమయ్యాడు. ఈ నేపథ్యంలో దర్శకుడిగా పరిచయమవుతూ ‘మకుటం’ తెరకెక్కించారు. అయితే సినిమా విషయానికి వస్తే డివైడ్ టాక్ తెచ్చుకుంది. బలహీనమైన కథ, రొటీన్ స్క్రీన్ ప్లే తో ఆడియన్స్ కి బోర్ కొట్టించింది. సినిమాలో విశాల్ యాక్టింగ్ మినహా పెద్దగా చెప్పుకోవడానికి ఏం లేదు. 


మహా అయితే క్లైమాక్స్ లో ఆడవాళ్లతో తీసిన ఫైట్ మాత్రం ఆకట్టుకునేలా ఉంది. అంతకుమించి సినిమాలో చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఇలాంటి పేవలమైన కథతో విశాల్ దర్శకుడిగా పరిచయం కావటం కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది. రొటీన్ ఫార్ములాతో వెళుతున్నపుడు ట్రీట్మెంట్ కొత్తగా ఉండాలి. పాత్రల్లో వైవిధ్యం చూపించాలి. ఆ జాగ్రత్తలేవీ తీసుకోలేదు. అదే సినిమాకు పెద్ద మైనస్ అయింది. సో… దర్శకుడిగా విశాల్ తొలి ప్రయత్నంలో ఫెయిల్ అయ్యారనే చెప్పాలి. ఇక సింపుల్ గా ఒక్క వర్డ్ లో సినిమా గురించి చెప్పాలంటే... కొత్తదనం లేని మకుటం. 

5.0
out of 9
3 months ago
Aug 18, 2026 Tamil

Makutam movie review

మకుటం (Makutam) 2026 News Channel
విశాల్, దుషారా విజయన్, అంజలి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ‘మకుటం’ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మాస్ యాక్షన్, ఎమోషనల్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రానికి మిశ్రమ స్పందన లభిస్తోంది. కథలో కొత్తదనం ల...

విశాల్, దుషారా విజయన్, అంజలి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ‘మకుటం’ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మాస్ యాక్షన్, ఎమోషనల్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రానికి మిశ్రమ స్పందన లభిస్తోంది. కథలో కొత్తదనం లేకపోవడం, రొటీన్ స్క్రీన్‌ప్లే సినిమాకు ప్రధాన మైనస్‌గా మారాయి. ముఖ్యంగా ఆసక్తికరమైన నేరేషన్ లేకపోవడంతో కొన్ని సన్నివేశాలు బోర్ కొట్టిస్తాయి. యాక్షన్ సన్నివేశాలు, భావోద్వేగ అంశాలు ఉన్నప్పటికీ అవి కథకు పూర్తిగా బలం చేకూర్చలేకపోయాయి. 


విశాల్ తన నటనతో మెప్పించే ప్రయత్నం చేశారు. అయితే బలమైన కథ, ఆకట్టుకునే కథనం లేకపోవడంతో సినిమా స్థాయి ఆశించినంతగా కనిపించలేదు. ఓవరాల్‌గా ‘మకుటం’ సాధారణ కథ, బోరింగ్ స్క్రీన్‌ప్లేతో ప్రేక్షకులను పూర్తిగా మెప్పించలేకపోయింది. విశాల్ అభిమానులు ఆయన పెర్ఫార్మన్స్ కోసం ఒకసారి ప్రయత్నించవచ్చు. ఒక్కముక్కలో సినిమా గురించి చెప్పాలంటే ఇదొక పాత చింతకాయ పచ్చడి కథ. 

4.0
out of 9
3 months ago
Aug 18, 2026 Tamil

Makutam movie review

విశాల్, దుషారా విజయన్, అంజలి కీలక పాత్రల్లో తెరకెక్కిన మూవీ మకుటం. కాగా ఈ రోజు రిలీజ్ అయిన ఈ చిత్రం డివైడ్ టాక్ తెచ్చుకుంది. రొటీన్ స్టోరీ, స్క్రీన్ ప్లే వల్ల సినిమా ఏమాత్రం ఆకట్టుకోలేదు. ఫైనల్ గ...

విశాల్, దుషారా విజయన్, అంజలి కీలక పాత్రల్లో తెరకెక్కిన మూవీ మకుటం. కాగా ఈ రోజు రిలీజ్ అయిన ఈ చిత్రం డివైడ్ టాక్ తెచ్చుకుంది. రొటీన్ స్టోరీ, స్క్రీన్ ప్లే వల్ల సినిమా ఏమాత్రం ఆకట్టుకోలేదు. 


ఫైనల్ గా విశాల్ దర్శకత్వం వహించిన మకుటం సినిమా మాస్ ఆక్షన్ అండ్ ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కగా, ఆడియన్స్ ని మాత్రం అంతగా ఆకట్టుకోలేకపోయింది. సరైన కథా, కథనాలు లేకపోవడం వల్ల అవి సరిగా ఆకట్టుకోలేదు. ఓవరాల్ గా బోరింగ్ స్క్రీన్ ప్లే వల్ల ఇంట్రెస్టింగ్ నేరేషన్ లేకపోవడం వల్ల సినిమా అంతగా ఆకట్టుకోలేదు. విశాల్ పెర్ఫార్మన్స్ కోసమైతే ఒకసారి ట్రై చేయొచ్చు.  


4.0
out of 9
3 months ago
Aug 18, 2026 Tamil

Vishwanath and sons movie review

Thyview

By Thyview

విశ్వనాధ్ అండ్ సన్స్... first of all సినిమా చూసాక నా ఎక్స్పీరెన్స్ చెప్పాలంటే... బావుంది. చాలా నచ్చింది సినిమా. ఫస్ట్ హాఫ్ చాలా బ్రిజిగా అలా వెళ్ళిపోతుంది. అండ్ ఏజ్ గ్యాప్ ఎక్కువగా ఉన్న కపుల్స్ కైతే ఈ...

విశ్వనాధ్ అండ్ సన్స్... first of all సినిమా చూసాక నా ఎక్స్పీరెన్స్ చెప్పాలంటే... బావుంది. చాలా నచ్చింది సినిమా. ఫస్ట్ హాఫ్ చాలా బ్రిజిగా అలా వెళ్ళిపోతుంది. అండ్ ఏజ్ గ్యాప్ ఎక్కువగా ఉన్న కపుల్స్ కైతే ఈ సినిమా బాగా నచ్చుతుంది. సినిమాలో చాలా సేపు బోరింగ్ సీన్స్ తో అలా నడుస్తుంటే... మామితా ఎంటర్ అయిన తర్వాతే ఊపందుకుంటది. అండ్ సూర్య మామితా కెమిస్ట్రీ కూడా చాలా బాగుంది. 


సినిమాలో కొన్ని సీన్స్ కొంతమందికి డీసెంట్ గా, బోర్ ఫీల్ కూడా అవ్వచ్చు. స్పెషల్ గా సెకండ్ హాఫ్ లో అలాంటి సీన్స్ ఉన్నాయి. బట్ నాకైతే చాలా బాగా నచ్చాయి. becuase స్టోరీకి తగ్గట్టున్నాయి ఆ సీన్స్. ఇప్పుడు ఎక్కకపోతే తర్వాతైనా ఆ సీన్స్ మైండ్ లోకి బాగా ఎక్కుతాయి. కాకపోతే క్లైమాక్స్ కూడా ఇంకొంచెం నీట్ గా రాసుకోవాల్సింది అనిపించింది. అండ్ కమర్షియలైజ్ కోసం కొన్ని ఫైట్స్ పెట్టారు. అవి అంత అనవసరం అనిపించింది. అండ్ టెక్నికల్లి మూవీ కూడా చాలా బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. జివి ప్రకాష్ మాత్రం ఈసారి అంత లేదు. ఓవరాల్ గా విశ్వనాధ్ అండ్ సన్స్ డీసెంట్ మూవీ. 

7.0
out of 9
3 months ago
Aug 17, 2026 Tamil

Vishwanath and Sons Movie Review

ఇప్పుడే విశ్వనాధ్ అండ్ సన్స్ మూవీ చూసొస్తున్నా.. నాకు వెంకీ అట్లూరి సినిమాలంటే చాలా ఇష్టం.. కానీ వెంకీ ముందు సినిమాలతో ఈ సినిమాను పోల్చను... టెక్నికల్లి ఈ సినిమా త్రివిక్రమ్ సినిమాలా అనిపిస్తుంది. ఇది...

ఇప్పుడే విశ్వనాధ్ అండ్ సన్స్ మూవీ చూసొస్తున్నా.. నాకు వెంకీ అట్లూరి సినిమాలంటే చాలా ఇష్టం.. కానీ వెంకీ ముందు సినిమాలతో ఈ సినిమాను పోల్చను... టెక్నికల్లి ఈ సినిమా త్రివిక్రమ్ సినిమాలా అనిపిస్తుంది. ఇది పక్కన పెడితే ఈ సినిమాలో మెయిన్ మామితా చాలా బాగా చేసింది. అండ్ తాను తప్ప మిగతా వాళ్ళందరూ aged గానే కనిపిస్తారు. అండ్ సినిమాలో మంచి మంచి సీన్లు పడ్డాయందరికి. ఫస్ట్ హాఫ్ ఎంటర్టైన్మెంట్ చాలా బాగుంది. 


అండ్ సినిమాలో మంచి మంచి డైలాగ్స్ పడ్డాయి. ఈ సినిమాలో నచ్చని విషయమేంటంటే... తమిళ్ లో మొత్తం సినిమా తీశారు, అది అంత నచ్చలేదు. కానీ తమిళ్ లో డైలాగ్స్ తెలుగు కంటే బాగున్నాయి. ప్రాబ్లెమ్ ఏంటంటే దీంట్లో నాకు వెంకీ అట్లూరి మార్క్ కనిపించలేదు. అండ్ సినిమాలో అందరూ చాలా బాగా యాక్ట్ చేసారు. అయితే సినిమాలో స్టోరీలో ఉన్న ఒక మెయిన్ ప్రాబ్లెమ్ ని చాలా పెద్దగా చూపించి, క్లైమాక్స్ లో ఆ ప్రాబ్లెమ్ ని చిన్నది చేసారు అది నాకు నచ్చలేదు. అండ్ సినిమాలో కమర్షియల్ ఎలిమెంట్స్ కోసం కొన్ని ఫైట్స్ పెట్టారు అది అస్సలు నచ్చలేదు. జివి ప్రకాష్ అయితే దెబ్బేసాడు. మ్యూజిక్ ఎక్కడా ఎక్కలేదు. ఓవరాల్ గా విశ్వనాధ్ అండ్ సన్స్ వన్ టైం వాచబుల్. 

5.0
out of 9
3 months ago
Aug 17, 2026 Tamil

Vishwanath and Sons movie review

విశ్వనాధ్ అండ్ సన్స్ మూవీ ఎలా ఉందంటే... అలా ఉందంతే... ఎలా ఉంటదంటే... మరీ ఎక్కువ కాదు, తక్కువ కాదు... ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగుంది. ఫ్రెష్ గా ఉంది. మమిత చాలా బాగా చేసింది. సూర్య గురించి చెప్పాల్సిన పన...

విశ్వనాధ్ అండ్ సన్స్ మూవీ ఎలా ఉందంటే... అలా ఉందంతే... ఎలా ఉంటదంటే... మరీ ఎక్కువ కాదు, తక్కువ కాదు... ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగుంది. ఫ్రెష్ గా ఉంది. మమిత చాలా బాగా చేసింది. సూర్య గురించి చెప్పాల్సిన పనిలేదు. ఆయన చాలా క్లాసిక్ గా చేసారు. బట్ ఈ సినిమా చూస్తే... ఫైనల్లీ ఆయనకు డీసెంట్ సినిమా పడిందనిపించింది. అండ్ సెకండ్ హాఫ్ లో అయితే ప్లాట్ పాయింట్ నాకు అంతలా ఎక్కాలా. 


Actually ఈ సినిమా మన్మథుడు మూవీకి చాలా దగ్గరగా ఉంటది. ఈ సినిమాకి ఇంకా బాగా రాసుండాల్సింది. కానీ చాలా సింపుల్ గా డీల్ చేసాడు డైరెక్టర్. అందుకే అంత ఎక్కలేదు. సింపుల్ గా చెప్పాలంటే వెంకీ అట్లూరి సినిమాలు రెగ్యులర్ గా ఉండవు. కానీ ఇది రెగ్యులర్ డ్రామాగా అనిపించింది. బట్ ఈ మధ్యలో వచ్చిన సినిమాల్లో ఇది చాలా బెటర్ సినిమా ఇది. అండ్ ఇది డబ్బింగ్ సినిమాలానే ఉంది. తెలుగు మేకర్స్ ఉన్నప్పుడు, కొంచెమైనా తెలుగులో ట్రై చేయొచ్చుగా అనిపించింది. ఓవరాల్ గా నాకైతే అంత ఎక్కలేదు... ఓకే. 


5.0
out of 9
3 months ago
Aug 17, 2026 Tamil

Mahidhar Vibes movie review

వెల్కమ్ టు తమిళ్ విశ్వనాథ్ అండ్ సన్స్(Vishwanath And Sons Movie) మూవీ రివ్యూ స్టారింగ్ సూర్య, మామితా బైజు. తమిళ్ మూవీ ఎందుకన్నానంటే ఇది తమిళ్ మూవీ. తమిళ్ లోనే షూట్ చేసారు. తెలుగులో డబ్ చేసారు. బట్ చాల...

వెల్కమ్ టు తమిళ్ విశ్వనాథ్ అండ్ సన్స్(Vishwanath And Sons Movie) మూవీ రివ్యూ స్టారింగ్ సూర్య, మామితా బైజు. తమిళ్ మూవీ ఎందుకన్నానంటే ఇది తమిళ్ మూవీ. తమిళ్ లోనే షూట్ చేసారు. తెలుగులో డబ్ చేసారు. బట్ చాలా మంది అన్నట్టు సూర్య అడాప్టడ్ సన్ అఫ్ తెలుగు స్టేట్స్ అన్న ట్యాగ్ తీసేసి, వాళ్ళ తమ్ముడు కార్తీకి ఇవ్వడం బెటర్. ఎందుకంటే అతను ఇక్కడికెప్పుడొచ్చినా తెలుగులోనే మాట్లాడతారు. తమిళ్ వాళ్ళకంటే తెలుగు ఫ్యాన్స్ ఏ ఇష్టమంటాడు. 


కమింగ్ టు ది రివ్యూ.. బానే ఉంది సినిమా.. ఒక డీసెంట్ సినిమా. ఫస్ట్ హాఫ్ డీసెంట్ గా ఎంటర్టైనింగ్ వెళ్ళిపోతుంది. సెకండ్ హాఫ్ అయితే కొంచెం డీవియేట్ అయిపోతుంది. అండ్ సినిమాలో కొన్ని సీన్స్ ఆర్టిఫీషియల్ గా అనిపిస్తాయి. అందుకే కొంత నచ్చలేదు. అలాగే కొన్ని తెలుగులో కొన్ని సీన్స్ పై ఎఫర్ట్ పెట్టి ఉంటె బాగుండేది. కానీ కొంచెం కూడా పెట్టలేదు. యాక్టింగ్ కొస్తే సూర్య, మమితా సహా అందరూ బాగా చేసారు. ఓవరాల్ గా బాగానే ఉంది పర్లేదు. నా రేటింగ్ అయితే 3.8

7.0
out of 9
3 months ago
Aug 17, 2026 Tamil
Why MRO?