ఉస్తాద్ భగత్ సింగ్ (Ustaad Bhagat Singh)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - హరీష్ శంకర్ కాంబోలో వచ్చిన "ఉస్తాద్ భగత్ సింగ్" పలు వాయిదాల తర్వాత ఫైనల్ గా థియేటర్లలో రిలీజ్ అయి మిక్స్డ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమా నిర్మించారు.
Available in:
Reviews
What critics and the public are saying about ఉస్తాద్ భగత్ సింగ్ (Ustaad Bhagat Singh)
Media Reviews
19 Avg: 5.3/10Average
Ustaad Bhagat Singh Movie Review
ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలైనప్పటికీ, ఆ అంచనాలకు చాలా దూరంగా నిలిచింది. కమర్షియల్ ఎలిమెంట్స్‌తో నింపిన ఈ చిత్రం కథ పరంగా, కథనం పరంగా పూర్తిగా నిరాశపరుస్తుంది. ప్రారంభం నుంచి చివరి వరకు పాత టెంప్లేట్‌ను అనుసరించినట్లు కనిపిస్తూ, ఎలాంటి కొత్తదనం లేకుండా సాగుతుంది. దర్శకుడు హరీష్...
ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలైనప్పటికీ, ఆ అంచనాలకు చాలా దూరంగా నిలిచింది. కమర్షియల్ ఎలిమెంట్స్‌తో నింపిన ఈ చిత్రం కథ పరంగా, కథనం పరంగా పూర్తిగా నిరాశపరుస్తుంది. ప్రారంభం నుంచి చివరి వరకు పాత టెంప్లేట్‌ను అనుసరించినట్లు కనిపిస్తూ, ఎలాంటి కొత్తదనం లేకుండా సాగుతుంది. దర్శకుడు హరీష్ శంకర్ ఈసారి తన మార్క్‌ను చూపించడంలో విఫలమయ్యారు. కామెడీ పనిచేయదు, ఎమోషన్ కనెక్ట్ కాదు, సన్నివేశాల మధ్య సరైన లింక్ లేకపోవడంతో సినిమా ఫ్లో పూర్తిగా దెబ్బతింది. చాలా సీన్స్ అనవసరంగా పొడిగించినట్టుగా అనిపిస్తాయి. పవన్ కళ్యాణ్ స్క్రీన్ ప్రెజెన్స్ ఉన్నప్పటికీ, ఆయన పాత్రకు సరైన బలం లేదు. ఆయన ట్రేడ్‌మార్క్ ఎనర్జీ కూడా ఎక్కువ భాగంలో కనిపించదు. విలన్ ట్రాక్ బలహీనంగా ఉండటం వల్ల కథలో ఎలాంటి టెన్షన్, థ్రిల్ అనిపించదు. టెక్నికల్ పరంగా కూడా సినిమా పెద్దగా ప్రభావం చూపలేదు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ లౌడ్‌గా ఉన్నా ఇంపాక్ట్ లేకపోవడం, ఎడిటింగ్ లోపాలు స్పష్టంగా కనిపిస్తాయి. మొత్తంగా, ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రం కమర్షియల్ సినిమా పేరుతో వచ్చినా, కంటెంట్ పరంగా పూర్తిగా బలహీనంగా ఉండి ప్రేక్షకులను నిరాశపరచే అవకాశం ఉంది.
Average
Ustaad Bhagat Singh Movie Review
ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా చూస్తే ఒక్క మాటే గుర్తొస్తుంది — పూర్తిగా ఔట్‌డేటెడ్ కమర్షియల్ ఎంటర్టైనర్. కమర్షియల్ సినిమాకు కొత్తగా ఏదైనా ఉండాల్సిన అవసరం లేదు కానీ… కనీసం ఫ్రెష్ ఫీల్ అయినా ఉండాలి. కానీ ఇక్కడ స్టార్ట్ నుంచి ఎండ్ వరకు పాత టెంప్లేట్ ఫీలింగే. కొన్ని ఎలివేషన్ సీన్స్ మాత్రమే వర్క్ అవుతాయి. కా...
ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా చూస్తే ఒక్క మాటే గుర్తొస్తుంది — పూర్తిగా ఔట్‌డేటెడ్ కమర్షియల్ ఎంటర్టైనర్. కమర్షియల్ సినిమాకు కొత్తగా ఏదైనా ఉండాల్సిన అవసరం లేదు కానీ… కనీసం ఫ్రెష్ ఫీల్ అయినా ఉండాలి. కానీ ఇక్కడ స్టార్ట్ నుంచి ఎండ్ వరకు పాత టెంప్లేట్ ఫీలింగే. కొన్ని ఎలివేషన్ సీన్స్ మాత్రమే వర్క్ అవుతాయి. కానీ సినిమా మొత్తం ఒక ఫ్లోలో నడవదు… వేరువేరు సీన్స్‌ని కలిపేసినట్టుగా అనిపిస్తుంది. హరీష్ శంకర్ ఈసారి కామెడీ, కమర్షియల్ రైటింగ్ రెండింట్లోనూ మిస్ అయ్యాడు. నవ్వు రాదు, హైప్ ఫీల్ కూడా పూర్తిగా రాదు. థమన్ BGMతో లిఫ్ట్ చేయాలని ట్రై చేశాడు కానీ స్కోప్ లేకపోయింది. పవన్ కళ్యాణ్ కూడా కొన్ని చోట్ల బాగానే ట్రై చేసినా… తన ట్రేడ్‌మార్క్ ఎనర్జీ మాత్రం మిస్సింగ్. ఓవరాల్ గా సినిమాలో భజన సీన్లే ఎక్కువ ఉన్నట్టుంటుంది. మొత్తానికి కొన్ని మాస్ మూమెంట్స్ తప్ప… సినిమా చాలా బోర్ కొడుతుంది.
Average
Ustaad Bhagat Singh Movie Review
ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా గురించి ఒక్క మాటలో చెప్పాలంటే బిలో యావరేజ్ కి తక్కువే. సినిమా చూస్తే ఒక విషయం క్లియర్ గా అర్థమవుతుంది. ఇది కథ చెప్పాలనుకున్న సినిమా కాదు, హీరోని సెలబ్రేట్ చేయాలనుకున్న సినిమా. సార్టింగ్ లో మాస్ ఎలివేషన్స్ బాగానే హైప్ క్రియేట్ చేస్తాయి… కానీ ఆ తర్వాత సినిమా స్టెడీగా పడిపోతూ...
ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా గురించి ఒక్క మాటలో చెప్పాలంటే బిలో యావరేజ్ కి తక్కువే. సినిమా చూస్తే ఒక విషయం క్లియర్ గా అర్థమవుతుంది. ఇది కథ చెప్పాలనుకున్న సినిమా కాదు, హీరోని సెలబ్రేట్ చేయాలనుకున్న సినిమా. సార్టింగ్ లో మాస్ ఎలివేషన్స్ బాగానే హైప్ క్రియేట్ చేస్తాయి… కానీ ఆ తర్వాత సినిమా స్టెడీగా పడిపోతూ ఉంటుంది. ఫస్టాఫ్‌లో కథ పెద్దగా కదలదు… సీన్స్ వస్తూ పోతూ ఉంటాయి కానీ మనకు కనెక్ట్ అయ్యే ఎమోషన్ కనిపించదు. పవన్ కళ్యాణ్ స్క్రీన్ మీద ఉన్నంత వరకూ ఓ ఎనర్జీ ఉంటుంది. కానీ ఆ ఎనర్జీకి సరిపోయే స్ట్రాంగ్ రైటింగ్ లేదు. ఒక్కోసారి మంచి మూమెంట్ వస్తుంది. వెంటనే ఫ్లో బ్రేక్ అయిపోతుంది. మంచి కథ లేదు, ఒక బలమైన విలన్ లేడు. ఒక సరైన కామెడీ కూడా లేదు, మ్యూజిక్ పరంగా పెద్దగా గుర్తుండిపోయేలా ఏమీ లేదు. డిఎస్పీ, థమన్ ఇద్దరూ డిస్సపాయింట్ చేసారు. సెకండాఫ్‌లో కొన్ని మాస్ మూమెంట్స్, వింటేజ్ వైబ్స్ వర్క్ అవుతాయి… కానీ అప్పటికే సినిమా మీద ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది. అభిమానులకు కొన్ని హై మూమెంట్స్ ఉన్నాయి. మిగతావాళ్లకి మాత్రం ఇది జస్ట్ ఓ రొటీన్, హాఫ్-బేక్డ్ కమర్షియల్ సినిమా.
Average
Ustaad Bhagat Singh Movie Review
ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా తేరి రీమేక్ కాదు... తేరి రీమేక్ కాదు.. దాని నుండి ఒకటి రెండు సీన్స్ మాత్రమే తీసుకుని దానికి పవన్ కళ్యాణ్ స్వాగ్ ని కలిపి ఫ్యాన్స్ ని సాటిస్ఫై చేద్దామని హరీష్ శంకర్ ట్రై చేసారు. నిజం చెప్పాలంటే… ఈ సినిమా స్టార్ట్ అయ్యాక కొంచెం టైమ్ వరకే హైప్ ఉంటుంది. ఆ తర్వాత “ఇంకా ఎంత ఉంది?...
ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా తేరి రీమేక్ కాదు... తేరి రీమేక్ కాదు.. దాని నుండి ఒకటి రెండు సీన్స్ మాత్రమే తీసుకుని దానికి పవన్ కళ్యాణ్ స్వాగ్ ని కలిపి ఫ్యాన్స్ ని సాటిస్ఫై చేద్దామని హరీష్ శంకర్ ట్రై చేసారు. నిజం చెప్పాలంటే… ఈ సినిమా స్టార్ట్ అయ్యాక కొంచెం టైమ్ వరకే హైప్ ఉంటుంది. ఆ తర్వాత “ఇంకా ఎంత ఉంది?” అనిపించే టైమ్ వస్తుంది. పవన్ కళ్యాణ్ ఎంట్రీ, కొన్ని మాస్ షాట్స్ బాగానే ఉంటాయి. కానీ అవే మళ్లీ మళ్లీ రిపీట్ అవుతుంటే బోర్ కొడుతుంది. కథ సంగతి అడగకండి… ఎక్కడో చూసిన స్టోరీని మళ్లీ కొత్తగా చూపించడానికి ట్రై చేసినట్టు ఉంటుంది. ఇక పవన్ కళ్యాణ్ వన్ మ్యాన్ షో తో సినిమాని ముందుకు తీసుకెళ్లాడు. అలాగే హీరోయిన్లు ఇద్దరూ ఎందుకున్నారో కూడా తెలీదు. ఫస్టాఫ్ చాలా స్లో… సెకండాఫ్‌లో కాస్త పికప్ ఉన్నా, మొత్తం సినిమాను లిఫ్ట్ చేయడానికి సరిపోదు. విలన్ ట్రాక్ అస్సలు పని చేయదు… డైలాగులు బాగున్నా, కథకి అవసరం లేనట్టు ఉంటాయి. ముఖ్యంగా ప్రస్తుత పాలిటిక్స్ కి రిలేటెడ్ గా ఉంటాయి. ఇక క్లైమాక్స్ లో ఫినిషింగ్ బాగున్నా ఏమాత్రం కిక్కివ్వదు.. ఓవరాల్ గా ఫ్యాన్స్ కోసమే ఈ సినిమా గాని, కామన్ ఆడియన్స్ రిజెక్ట్ చేసే అవకాశం ఎక్కువ.
Average
Ustaad Bhagat Singh movie Review
ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా మొత్తం చూస్తే ఒకటి క్లియర్ గా తెలుస్తుంది. ఇది కథ కోసం తీసిన సినిమా కాదు… పవన్ కళ్యాణ్ భజన కోసం తీసిన సినిమా అనిపిస్తుంది. ప్రతి సీన్ లో హీరో ఎలివేషన్, డైలాగ్, స్లోమోషన్… ఇదే రిపీట్ అవుతూ ఉంటుంది. కానీ ఆ ఎలివేషన్స్‌కు సరిపోయే కథ, ఎమోషన్ మాత్రం కనిపించవు. ఎక్కడైనా కథ ముందుక...
ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా మొత్తం చూస్తే ఒకటి క్లియర్ గా తెలుస్తుంది. ఇది కథ కోసం తీసిన సినిమా కాదు… పవన్ కళ్యాణ్ భజన కోసం తీసిన సినిమా అనిపిస్తుంది. ప్రతి సీన్ లో హీరో ఎలివేషన్, డైలాగ్, స్లోమోషన్… ఇదే రిపీట్ అవుతూ ఉంటుంది. కానీ ఆ ఎలివేషన్స్‌కు సరిపోయే కథ, ఎమోషన్ మాత్రం కనిపించవు. ఎక్కడైనా కథ ముందుకు వెళ్లాలంటే మళ్లీ భజన మోడ్ ఆన్ అవుతుంది. పవన్ కళ్యాణ్ ఎనర్జీ, స్క్రీన్ ప్రెజెన్స్ టాప్ లెవెల్ . కానీ ఆ ఎనర్జీని స్ట్రాంగ్ సీన్స్‌లో వాడాల్సింది పోయి… ఎక్కడ పడితే అక్కడ ఎలివేషన్ షాట్స్‌తో వేస్ట్ చేసినట్టు అనిపిస్తుంది. అన్నిటికంటే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ నుండి ఈ మధ్య డాన్స్ మిస్ అవుతున్నారని చెప్పి ఇందులో మంచి డాన్స్ మూవ్స్ పెట్టించారు... ఆ ఫోకస్ ఎదో హరీష్ శంకర్ కంటెంట్ మీద కూడా పెట్టి ఉంటే బాగుంటుంది. విలన్ ట్రాక్ వీక్ గా ఉంది. కామెడీ అస్సలు వర్క్ కాలేదు, మ్యూజిక్ కూడా పెద్దగా హెల్ప్ కాలేదు. ఓవరాల్ గా సినిమాలో అసలు స్టోరీయే లేదన్నట్టు అనిపిస్తుంది.. ఫాన్స్ విషయానికి వస్తే... స్క్రీన్‌ప్లే పక్కన పెట్టి… హీరో భజన చూడాలనుకుంటే ఓకే.. ఇక నార్మల్ ఆడియన్స్ సంగతి సరే సరి.
Average
Ustaad Bhagat Singh Movie Review
ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా చూడటం అంటే… ట్రైలర్ చూసిన తర్వాత ఎక్స్‌పెక్ట్ చేసినది ఒకటి, స్క్రీన్ మీద వచ్చినది ఇంకొకటి. మొదట్లో మాస్ ఎలివేషన్స్‌తో హైప్ క్రియేట్ చేస్తుంది… కానీ కొద్దిసేపటికి అసలు కథ ఎక్కడుంది అన్న డౌట్ స్టార్ట్ అవుతుంది. మొత్తం సినిమా చూసిన తర్వాత కూడా అదే డౌట్ క్లియర్ అవదు. స్టోరీ అనే...
ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా చూడటం అంటే… ట్రైలర్ చూసిన తర్వాత ఎక్స్‌పెక్ట్ చేసినది ఒకటి, స్క్రీన్ మీద వచ్చినది ఇంకొకటి. మొదట్లో మాస్ ఎలివేషన్స్‌తో హైప్ క్రియేట్ చేస్తుంది… కానీ కొద్దిసేపటికి అసలు కథ ఎక్కడుంది అన్న డౌట్ స్టార్ట్ అవుతుంది. మొత్తం సినిమా చూసిన తర్వాత కూడా అదే డౌట్ క్లియర్ అవదు. స్టోరీ అనేది కొత్తదేమీ కాదు… పాత టెంప్లేట్‌ని మళ్లీ రీపీట్ చేసినట్టే ఉంటుంది. పవన్ కళ్యాణ్ ఎనర్జీ, స్క్రీన్ ప్రెజెన్స్ మాత్రం టాప్. కానీ డైరెక్టర్ ఆ ఎనర్జీని ప్రాపర్‌గా యూజ్ చేసుకోలేకపోయాడు. ఒక్కోసారి మంచి సీన్ వస్తుంది… వెంటనే రెండు వీక్ సీన్స్ వచ్చి ఫ్లోని బ్రేక్ చేస్తాయి. విలన్ ట్రాక్ అసలు థ్రెట్ ఫీల్ ఇవ్వదు. కామెడీ కూడా పెద్దగా వర్క్ కాలేదు. మ్యూజిక్, BGM—లౌడ్‌గా ఉంటుంది కానీ ఇంపాక్ట్ మాత్రం జీరో. ఫస్టాఫ్ డ్రాగ్, సెకండాఫ్‌లో కొన్ని మాస్ మూమెంట్స్ ఉన్నా… మొత్తం సినిమాను సేవ్ చేయడానికి సరిపోవు. ఓవరాల్ గా ఇది ఫ్యాన్స్ కోసం చేసిన సేఫ్ గేమ్… కానీ ఆడియెన్స్‌కు కొత్తగా ఏమీ ఇవ్వలేదు. ఫ్యాన్స్ వరకు ఒకసారి థియేటర్ కి వెళ్లొచ్చు... నార్మల్ ఆడియన్స్ చూడడం కష్టమే.
Average
Ustaad Bhagat Singh Movie Review
మొదటే క్లియర్ చేస్కుందాం… ఈ సినిమా ఫుల్‌గా ఫ్యాన్స్ కోసమే. జనరల్ ఆడియెన్స్‌కి అయితే కొంచెం టఫ్. స్టార్ట్‌లో మాస్ ఎలివేషన్స్ బాగానే ఉంటాయి… కానీ స్టోరీ ముందుకెళ్తుంటే “ఇది ఎక్కడో చూసినట్టుంది” అనే ఫీలింగ్ తప్పదు. పవన్ కళ్యాణ్ స్క్రీన్ ప్రెజెన్స్ మాత్రం ఫుల్ ఫైర్. ఆయన ఎంట్రీలు, డైలాగ్స్, యాక్షన్ బ్ల...
Average
Ustaad Bhagat Singh Movie Review
ఉస్తాద్ భగత్ సింగ్ గురించి సూటిగా చెప్పాలంటే… ఈ సినిమా మీద ఎంత హైప్ పెట్టారో, అంత మాత్రం డెలివర్ చేయలేదు. స్టార్టింగ్ లోనే మాస్ ఎలివేషన్స్‌తో ఓ రేంజ్‌లో మొదలవుతుందనుకుంటాం కానీ… కొద్దిసేపటికే అసలు స్టఫ్ లేదనే ఫీలింగ్ వస్తుంది. కథ చాలా రొటీన్, ఏదో పాత సినిమా చూసినట్టే అనిపిస్తుంది. ఎమోషన్ కనెక్ట్ కావ...
ఉస్తాద్ భగత్ సింగ్ గురించి సూటిగా చెప్పాలంటే… ఈ సినిమా మీద ఎంత హైప్ పెట్టారో, అంత మాత్రం డెలివర్ చేయలేదు. స్టార్టింగ్ లోనే మాస్ ఎలివేషన్స్‌తో ఓ రేంజ్‌లో మొదలవుతుందనుకుంటాం కానీ… కొద్దిసేపటికే అసలు స్టఫ్ లేదనే ఫీలింగ్ వస్తుంది. కథ చాలా రొటీన్, ఏదో పాత సినిమా చూసినట్టే అనిపిస్తుంది. ఎమోషన్ కనెక్ట్ కావడం లేదు, సీన్స్ మధ్యలో డ్రాగ్ ఎక్కువగా ఉంది. పవన్ కళ్యాణ్ స్క్రీన్ మీద ఎనర్జీ మాత్రం టాప్ లెవెల్ . కానీ ఆ ఎనర్జీకి సరిపోయే స్ట్రాంగ్ సీన్స్ మాత్రం లేవు. కొన్ని డైలాగ్స్, యాక్షన్ బ్లాక్స్ బాగున్నా… మొత్తం సినిమాను సేవ్ చేయలేవు. విలన్ ట్రాక్ పూర్తిగా వీక్. మ్యూజిక్ కూడా పెద్దగా హెల్ప్ కాలేదు… బ్యాగ్రౌండ్ స్కోర్ లౌడ్‌గా అనిపిస్తుంది కానీ ఇంపాక్ట్ లేదు. కామెడీ కూడా చాలా చోట్ల ఫ్లాట్. మొత్తానికి ఇది ఫ్యాన్స్ కోసం తీసిన సినిమా తప్ప… జనరల్ ఆడియెన్స్‌కి మాత్రం బోర్ కొట్టే ఛాన్సెస్ ఎక్కువ. ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకుని వెళ్తే డిసప్పాయింట్ అవ్వడం ఖాయం. టైమ్ పాస్ కోసం అయితే ఓకే… కానీ థియేటర్ ఎక్స్‌పీరియన్స్ కోసం మాత్రం థింక్ చేయాలి!
Average
Ustaad Bhagat Singh Movie Review
ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా రివ్యూ విషయానికి వస్తే... హైదరాబాద్ బ్యాక్‌డ్రాప్‌లో సాగిన ఈ కథలో రాజకీయాలు, పోలీస్ వ్యవస్థ, గ్యాంగ్ వార్స్ మిక్స్ అవుతాయి. హీరో పవన్ కళ్యాణ్ తన స్టైల్, స్వాగ్‌తో మాస్ ఆడియెన్స్‌ను ఆకట్టుకుంటాడు. ముఖ్యంగా కొన్ని యాక్షన్ సీన్స్, డైలాగ్స్ బాగా వర్క్ అవుతాయి. అయితే కథలో భావోద్...
ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా రివ్యూ విషయానికి వస్తే... హైదరాబాద్ బ్యాక్‌డ్రాప్‌లో సాగిన ఈ కథలో రాజకీయాలు, పోలీస్ వ్యవస్థ, గ్యాంగ్ వార్స్ మిక్స్ అవుతాయి. హీరో పవన్ కళ్యాణ్ తన స్టైల్, స్వాగ్‌తో మాస్ ఆడియెన్స్‌ను ఆకట్టుకుంటాడు. ముఖ్యంగా కొన్ని యాక్షన్ సీన్స్, డైలాగ్స్ బాగా వర్క్ అవుతాయి. అయితే కథలో భావోద్వేగాలు, సామాజిక అంశాలు ఉన్నా కూడా అవి పూర్తిగా ప్రభావం చూపలేకపోతాయి. కొన్ని సన్నివేశాలు బాగున్నా మొత్తం కథనం కొంచెం నెమ్మదిగా, ఫ్లాట్ గా అనిపిస్తుంది. విలన్ ట్రాక్ కూడా అంతగా స్ట్రాంగ్‌గా ఏం లేదు. హరీష్ శంకర్ తన మార్క్ లో బాగానే సినిమాని ప్రెజెంట్ చేసినా, ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లే రాసుకోవడంలో తడబడ్డాడు. మొత్తానికి ఇది పూర్తి మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కినా, కొత్తదనంలేని కథా కథనాలతో ఆడియన్స్ ని పూర్తి స్థాయిలో మెప్పించలేదు. కానీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు మంచి ట్రీట్‌గా ఉంటుంది.
Average
Ustaad Bhagat Singh Movie Review
ఉగాది పచ్చడిలో అన్ని రుచులు ఉన్నట్టే కమర్షియల్ సినిమాలో కామెడీ, థ్రిల్స్, యాక్షన్, సెంటిమెంట్, రొమాన్స్, ఎమోషన్స్ కలిపి దర్శకులు కథ రెడీ చేస్తారు. అలాగే ఉస్తాద్ భగత్ సింగ్ ని కూడా అన్ని హంగులు కలగలిపి ఆడియన్స్ ముందుకు తీసుకొచ్చారు. కానీ సినిమా పూర్తి స్థాయిలో ఆడియన్స్ ని మెప్పించలేదు. పవన్ కళ్యాణ్ వ...
Above Average
Ustaad Bhagat Singh Movie Review
ఉస్తాద్ భగత్ సింగ్ అంటూ ఆడియన్స్ ముందుకు వచ్చిన పవన్ కళ్యాణ్ వన్ మ్యాన్ షో తో సినిమాని నడిపించాడు. డాన్సుల కోసం, ఫైట్స్ కోసం బాగానే కష్టపడ్డాడు. మాస్ డైలాగ్ లతో మెప్పించాడు. ఇక శ్రీలీల పాత్ర సెకండాఫ్ లో వస్తుంది. ఆమెకి మంచి పాత్ర పడింది. రాశి పాత్రకి పెద్దగా స్కోప్ లేనట్టు ఉంటుంది. సీఎంగా, హ...
ఉస్తాద్ భగత్ సింగ్ అంటూ ఆడియన్స్ ముందుకు వచ్చిన పవన్ కళ్యాణ్ వన్ మ్యాన్ షో తో సినిమాని నడిపించాడు. డాన్సుల కోసం, ఫైట్స్ కోసం బాగానే కష్టపడ్డాడు. మాస్ డైలాగ్ లతో మెప్పించాడు. ఇక శ్రీలీల పాత్ర సెకండాఫ్ లో వస్తుంది. ఆమెకి మంచి పాత్ర పడింది. రాశి పాత్రకి పెద్దగా స్కోప్ లేనట్టు ఉంటుంది. సీఎంగా, హీరోకి గురువుగా కేఎస్ రవికుమార్ బాగా నటించాడు. నల్ల నాగప్పగా విలన్ పాత్రలో పార్థిబన్ బాగా సూట్ అయ్యాడు. రాంకీ డీజీపీగా గెస్ట్ రోల్‌లో కనిపించాడు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం గొప్పగా లేదు. థమన్ బీజీఎం కూడా రొటీన్ గానే ఉంది. ఇప్పుడు కమర్షియల్ సినిమాలను జనం పెద్దగా చూడటం లేదు. అయినా ఇలాంటి సినిమా చేయడం హరీష్ చేసిన సాహసమనే చెప్పాలి. కాకపోతే అభిమానులకు కావాల్సిన విధంగా మూవీని రూపొందించారు. అన్ని అంశాలను పర్‌ఫెక్ట్ గా మేళవించి రూపొందించారు. సినిమాలో ట్విస్ట్ లు ఉన్నా, అవి పెద్దగా కిక్ ఇవ్వవు. రొటీన్ ఫీలింగ్‌నే తెస్తాయి. ఓవరాల్ గా సినిమాపై తక్కువ అంచనాలు పెట్టుకుని చూస్తే ఓ మోస్తరు ఎంజాయ్ చేయొచ్చు.
Above Average
Ustaad Bhagat Singh Movie Review
గబ్బర్ సింగ్ తర్వాత పవన్ కళ్యాణ్ - హరీష్ శంకర్ కాంబో లో సెట్టయిన మూవీ కావడంతో ఉస్తాద్ భగత్ సింగ్ పై భారీ అంచనాలు పెరిగిపోగా, సినిమా మాత్రం చాలా రోజులు షూటింగ్ జరుపుకుని తాజాగా థియేటర్లలో రిలీజ్ అయింది. అయితే థియేటర్లలో మిక్స్డ్ రెస్పాన్స్ తెచ్చుకున్న ఈ సినిమా కథా, కథనాల పరంగా నిరాశ పరిచింది. దర్శకుడ...
గబ్బర్ సింగ్ తర్వాత పవన్ కళ్యాణ్ - హరీష్ శంకర్ కాంబో లో సెట్టయిన మూవీ కావడంతో ఉస్తాద్ భగత్ సింగ్ పై భారీ అంచనాలు పెరిగిపోగా, సినిమా మాత్రం చాలా రోజులు షూటింగ్ జరుపుకుని తాజాగా థియేటర్లలో రిలీజ్ అయింది. అయితే థియేటర్లలో మిక్స్డ్ రెస్పాన్స్ తెచ్చుకున్న ఈ సినిమా కథా, కథనాల పరంగా నిరాశ పరిచింది. దర్శకుడు హరీష్ తన టేకింగ్ తో మెప్పించినా, ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లే రాసుకోవడంలో తడబడ్డాడు. ముందే నార్మల్ స్టోరీ ఫ్యాన్స్ కోసం మాత్రమే తీస్తున్నానని క్లారిటీ ఇచ్చాడు కాబట్టి, లో అంచనాలు పెట్టుకుని ఆడియన్స్ థియేటర్లకు వెళ్తే బాగుంటుంది. పైగా ఎడిటింగ్ విషయంలో జాగ్రత్త పడాల్సింది. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. ఓవరాల్ గా థియేటర్లలో సినిమా ఫ్యాన్స్ కి బాగా నచ్చుతుంది. అలాగే రెగ్యులర్ మూవీ లవర్స్ కి కూడా ఓ మోస్తరు నచ్చోచ్చు. కానీ కొత్తదనం ఆశిస్తే నిరాశ తప్పదు.
Average
Ustaad Bhagat Singh Movie Review
ఉస్తాద్ భగత్ సింగ్ అంటూ ఆడియన్స్ ముందుకు వచ్చిన పవన్ కళ్యాణ్ థియేటర్లలో ఉగాది నుండి సందడి చేస్తున్నాడు. అయితే సినిమా మిశ్రమ స్పందన తెచ్చుకుంది. కథ, కథనాల్లో బలం లోపించగా, డైరెక్షన్ పరంగా హరీష్ శంకర్ తన వంతు న్యాయం చేసాడు. ఇక సినిమా మొత్తం పవన్ కళ్యాణ్ వన్ మ్యాన్ షోగా నడిపించాడని చెప్పొచ్చు. శ్రీ లీల...
Above Average
Ustaad Bhagat Singh Movie Review
పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ కాంబోలో వచ్చిన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా సాధారణ ప్రేక్షకుల అంచనాలకు దిగువన.. పవర్ స్టార్ ఫ్యాన్స్ అంచనాలు మ్యాచ్ అయ్యేలా చేసిన పూర్తిస్థాయి కమర్షియల్, ఎంటర్‌టైన్‌మెంట్‌తో సాగే ప్యాకేజ్డ్ మూవీ. పవన్ కల్యాణ్ వన్ మ్యాన్ షో, శ్రీలీల, రాశీ ఖన్నా గ్లామర్ కోసం ఈ సినిమాను చూడాలి. హర...
Average
Ustaad Bhagat Singh Movie Review
అభిమానులను అలరించడమే లక్ష్యంగా తీసిన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో పవన్ కళ్యాణ్ వారు మెచ్చే రీతిలో కనిపించాడు. ఆయన చాలా ఏళ్ల తర్వాత ఫన్ టచ్ ఉన్న పాత్ర ఇందులో చేసారు. ఓవైపు పవర్ ఫుల్ గా సాగుతూనే.. ఇంకోవైపు వినోదం కూడా పంచుతుందా పాత్ర. అయితే శ్రీలీల.. పవన్ పక్కన కొంచెం చిన్నమ్మాయిలా కనిపించింది. గీత పా...
Above Average
Ustaad Bhagat Singh Movie Review
పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన 'ఉస్తాద్ భగత్ సింగ్' మూవీ ఫైనల్ గా థియేటర్లలో రిలీజ్ కాగా, ఆడియన్స్ నుండి మిక్స్డ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇక పవన్ కళ్యాణ్ ఒక పవర్ ఫుల్ పోలీసాఫీసర్ గా మరోసారి మెప్పించారు. శ్రీలీల ఈ సినిమాలో చాలా క్యూట్ గా కనిపిస్తుంది. బాగా నటించింది కూడా, రాశీఖన్నా పాత్ర కు మాత్రం పెద్ద...
Above Average
Ustaad Bhagat Singh Movie Review
పవన్ కళ్యాణ్ – హరీష్ శంకర్ కాంబో అంటేనే భారీ ఎక్స్‌పెక్టేషన్స్.. ‘గబ్బర్ సింగ్’ రేంజ్ మ్యాజిక్ మళ్లీ రిపీట్ అవుతుందా అనే ఆసక్తితో వచ్చిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఆడియన్స్ ని ఊహించిన రేంజ్ లో ఎంటర్టైన్ చేయకపోయినా, ఫ్యాన్స్ కి మాత్రం ట్రీట్ ఇస్తుంది. ముఖ్యంగా సెకండాఫ్ పూర్తిగా ఫ్యాన్ అండ్ మాస్ స్టఫ్‌గా డి...
పవన్ కళ్యాణ్ – హరీష్ శంకర్ కాంబో అంటేనే భారీ ఎక్స్‌పెక్టేషన్స్.. ‘గబ్బర్ సింగ్’ రేంజ్ మ్యాజిక్ మళ్లీ రిపీట్ అవుతుందా అనే ఆసక్తితో వచ్చిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఆడియన్స్ ని ఊహించిన రేంజ్ లో ఎంటర్టైన్ చేయకపోయినా, ఫ్యాన్స్ కి మాత్రం ట్రీట్ ఇస్తుంది. ముఖ్యంగా సెకండాఫ్ పూర్తిగా ఫ్యాన్ అండ్ మాస్ స్టఫ్‌గా డిజైన్ చేశారు. వింటేజ్ సాంగ్స్‌తో వచ్చే పవన్ మూమెంట్స్ థియేటర్లలో ఫ్యాన్స్‌ని ఊగేలా చేస్తాయి. పవన్ స్క్రీన్ ప్రెజెన్స్, ఎనర్జీ, యాక్షన్ సీన్స్ సినిమా మొత్తాన్ని మోస్తాయి. పాతబస్తీ సీక్వెన్స్‌లో గబ్బర్ సింగ్ వైబ్స్ స్పష్టంగా కనిపిస్తాయి. అయితే ఫస్టాఫ్ మాత్రం అంతగా ఎంగేజ్ చేయదు. స్టోరీ నెమ్మదిగా సాగుతూ కొన్ని చోట్ల ఫ్లాట్‌గా అనిపిస్తుంది. ట్విస్ట్స్ ఉన్నా ఇంపాక్ట్ తక్కువగా ఉంటుంది. హీరోయిన్స్ రాశీ ఖన్నా, శ్రీలీల తమ పాత్రల్లో ఓకే. విలన్ పార్థిబన్ పెర్ఫార్మెన్స్ బాగున్నా క్యారెక్టర్ మరింత స్ట్రాంగ్‌గా ఉండాల్సింది. టెక్నికల్‌గా విజువల్స్ రిచ్‌గా ఉన్నాయి కానీ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మాత్రం మిస్ అయ్యిన ఫీలింగ్ ఇస్తుంది. ఓవరాల్‌గా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ పూర్తిగా పవన్ ఫ్యాన్స్ కోసం తీసిన మాస్ ఎంటర్టైనర్. స్టోరీలో కొత్తదనం తక్కువ అయినా, పవన్ స్వాగ్ & యాక్షన్ కోసం ఒకసారి చూడొచ్చు
Average
Ustaad Bhagat singh movie Review ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా అభిమానుల్లో భారీ అంచనాల మధ్య విడుదలైంది. స్క్రీన్‌పై పవన్ కనిపించే ప్రతి సీన్‌లో ఆయన స్వాగ్, ఎనర్జీ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాలు, డైలాగ్ డెలివరీ ఫ్యాన్స్‌కు పూర్తి సంతృప్తినిస్తాయి. అయితే కథ, కథనం విషయానికి వస్త...
Average
Ustaad Bhagat singh Movie Review
పవన్ కళ్యాణ్ సినిమా అంటే ఫ్యాన్స్‌కు ఎప్పుడూ పండగే. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ (Ustaad Bhagat Singh)లో కూడా ఆయన స్క్రీన్ ప్రెజెన్స్, ఎనర్జీ, స్వాగ్ బాగానే కనిపిస్తాయి. కానీ కంటెంట్ విషయంలో సినిమా పూర్తిగా మెప్పించదు. దర్శకుడు హరీష్ శంకర్ (Harish Shankar) మాస్ ఎలివేషన్స్‌పై ఎక్కువ ఫోకస్ పెట్టి, ఎమోషన్‌ను క...
Public Reviews
Avg: —No public reviews yet.
About This Movie
కథ విషయానికి వస్తే... నల్లమల అడవుల్లో ఓ గిరిజన ప్రాంతంలో టీచర్ అయిన చంద్రశేఖర్ రావు (కే ఎస్ రవికుమార్) కు పరిచయమైన ఓ గిరిజన కుర్రాణ్ణి దత్తత తీసుకొని "ఉస్తాద్ భగత్ సింగ్" (పవన్ కళ్యాణ్) అని పేరు పెట్టి చదివిస్తాడు. ఈ క్రమంలో భగత్ ఏసీపీ పోలీస్ ఆఫీసర్ అవుతాడు. అలాగే తన గురువు చంద్రశేఖర్ రావు ముఖ్యమంత్రి అవుతాడు. ఇదే తరుణంలో సీఎం కావాలని కలలుగంటున్న నల్ల నాగప్ప (ఆర్ పార్తిబన్) తీవ్రవాదులతో చేయి కలిపి సీఎం ని చంపడానికి ప్రయత్నాలు చేస్తారు. ఈ క్రమంలో నల్ల నాగప్ప అతని కొడుకుల ఆగడాలను, సీఎం ని చంపాలని ప్లాన్ చేసిన వాళ్ళ ప్రయత్నాల్ని ఎలా అడ్డుకున్నాడు. మధ్యలో లీల (శ్రీలీల), శ్లోక (రాశీ ఖన్నా) ల పాత్రల ప్రాముఖ్యత ఏంటి? అనేది చిత్ర కథ.
Technical values : పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ ఐదేళ్ల కిందట అనౌన్స్ అవగా అన్ని పూర్తయి ఫైనల్ గా రిలీజ్ అవడానికి ఇంత టైం పట్టింది. పైగా గబ్బర్ సింగ్ కాంబో కాబట్టి భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే కథ, కథనాల పరంగా దర్శకుడు హరీష్ శంకర్ ఈ సారి డిస్సపాయింట్ చేసాడని చెప్పాలి. స్క్రీన్ ప్లే చాలా స్లో గా ఉండగా, దానికి తోడు కొన్ని పాత సాంగ్స్ స్పూఫ్స్ అంతగా ఎక్కలేదు. సినిమా మొత్తం పవన్ కళ్యాణ్ మాత్రమే వన్ మ్యాన్ షోగా నడిపించాడు. పెర్ఫార్మన్స్ పరంగా పవన్ కళ్యాణ్ మరోసారి గబ్బర్ సింగ్ రోజుల్ని గుర్తు చేసాడు. కానీ హరీష్ శంకర్ మాత్రం తన దర్శకత్వ ప్రతిభ చూపించలేకపోయాడు.
ఇక నటీనటుల విషయానికి వస్తే... పవన్ కళ్యాణ్ గురించి తెలిసిందే. హీరోయిన్లు శ్రీలీల, రాశిఖన్నా లకు సరైన రోల్స్ దక్కలేదు. పార్తీబన్ నాగప్పగా అదరగొట్టాడు కానీ, ఇంకాస్త బలంగా రోల్ ఉండాల్సింది. కె.ఎస్ రవికుమార్ పాత్ర చిన్నదే కానీ మంచి డెప్త్ ఉన్న రోల్ అది.
టెక్నికల్ గా చూసుకుంటే నిర్మాణ విలువలు బాగున్నాయి. దేవిశ్రీ సంగీతం అంత బాగా లేదు. థమన్ బీజీఎమ్ కూడా డిస్సపాయింట్ చేసింది. కార్తీక్ శ్రీనివాస్ ఎడిటింగ్ పైన మరింత వర్క్ చేయాల్సింది. మొత్తంగా చూసుకుంటే ఉస్తాద్ భగత్ సింగ్ ఫ్యాన్స్ ని బాగానే మెప్పిస్తాడు.. కానీ కామన్ ఆడియన్స్ కి ఎక్కాలంటే కష్టమే. ముఖ్యంగా గబ్బర్ సింగ్ కాంబో అంటూ అంచనాలు అస్సలు పెట్టుకోకూడదు. లేదంటే నిరాశ తప్పదు.