Register as a Reviewer
Mana Shankara Varaprasad Garu (మన శంకర వర ప్రసాద్ గారు)

Mana Shankara Varaprasad Garu (మన శంకర వర ప్రసాద్ గారు)

09 Jan 2026
Overall Rating
6.7/10
10 Reviews

మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి డైరెక్షన్ లో వచ్చిన లేటెస్ట్ కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్ "మన శంకర వర ప్రసాద్ గారు". నయనతార హీరోయిన్ గా నటించిన ఈ సినిమా తాజాగా ఈ సంక్రాంతి కానుకగా రిలీజ్ అయింది. సో మూవీ రివ్యూ పై ఓ లుక్కేద్దాం.

Director: Anil Ravipudi
Cast: Chiranjeevi, Nayanatara, Venkatesh (Cameo), Sachin khadeker

Available in:

Reviews

What critics and the public are saying about Mana Shankara Varaprasad Garu (మన శంకర వర ప్రసాద్ గారు)

Media Reviews

10 Avg: 6.7/10
Ragadi
Ragadi Youtube Channel
6

Above Average

Mana shankara Varaprasad garu movie Review

సినిమా గురించి స్ట్రైట్‌గా చెప్పాలంటే — ఇది పక్కా ఫుల్ మీల్స్ ఎంటర్టైనర్. మెగాస్టార్ చిరంజీవి గారు ఎనర్జీతో, స్వాగ్‌తో స్క్రీన్ మీద అదరగొట్టేశారు. ఆయన టైమింగ్, ఎక్స్‌ప్రెషన్స్, కామెడీ టచ్ — అన్నీ కలిసి సినిమా మొత్తానికి మెయిన్ హైలైట్‌గా నిలిచాయి. దర్శకుడు అనిల్ రావిపూడి తన స్టైల్‌కు తగ్గట్టుగానే ఫ్య...

సినిమా గురించి స్ట్రైట్‌గా చెప్పాలంటే — ఇది పక్కా ఫుల్ మీల్స్ ఎంటర్టైనర్. మెగాస్టార్ చిరంజీవి గారు ఎనర్జీతో, స్వాగ్‌తో స్క్రీన్ మీద అదరగొట్టేశారు. ఆయన టైమింగ్, ఎక్స్‌ప్రెషన్స్, కామెడీ టచ్ — అన్నీ కలిసి సినిమా మొత్తానికి మెయిన్ హైలైట్‌గా నిలిచాయి. దర్శకుడు అనిల్ రావిపూడి తన స్టైల్‌కు తగ్గట్టుగానే ఫ్యామిలీ + మాస్ + కామెడీ ఎలిమెంట్స్ అన్నింటినీ బాగా మిక్స్ చేశాడు. ఫస్ట్ హాఫ్ మొత్తం లైట్ హ్యూమర్, ఫన్ సీన్స్‌తో ఫాస్ట్‌గా వెళ్లిపోతుంది. ఎక్కడా బోర్ అనిపించదు. చిరంజీవి గారి కామెడీ టైమింగ్ అయితే థియేటర్‌లో నవ్వుల జాతర సృష్టిస్తుంది. హీరోయిన్ నయనతార పాత్ర గ్లామర్‌తో పాటు నటన పరంగా కూడా బాగా వర్క్ అయ్యింది. చిరంజీవి – నయనతార కాంబినేషన్ స్క్రీన్‌పై చాలా ఫ్రెష్‌గా అనిపిస్తుంది. వారి మధ్య వచ్చే సీన్స్ సినిమాకు మంచి ప్లస్. సెకండ్ హాఫ్‌లో ఎమోషన్, ఫ్యామిలీ సెంటిమెంట్ బాగా పండాయి. క్లైమాక్స్ దగ్గర ఇచ్చిన మెసేజ్ కూడా బాగుంది. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, పాటలు సినిమాకు మంచి ఎనర్జీని అందించాయి. మొత్తానికి ఇది థియేటర్‌లో కూర్చొని హాయిగా ఎంజాయ్ చేయాల్సిన సినిమా. మాస్, ఫ్యామిలీ, యూత్ — అందరికీ ఫుల్ కనెక్ట్ అవుతుంది.

Jan 12, 2026 Watch
Thyview
Thyview Youtube Channel
6

Above Average

Mana Shankara Vara prasad garu movie Review

ఫ్రెండ్స్… ఈ సినిమా గురించి స్ట్రైట్‌గా చెప్పాలంటే — ఇది ఒక పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్. హీరోగా చిరంజీవి గారు, దర్శకుడిగా అనిల్ రావిపూడి, హీరోయిన్‌గా నయనతార — ఈ కాంబినేషన్ అంటేనే అంచనాలు భారీగా ఉంటాయి. ఆ అంచనాలను ఎంటర్టైన్మెంట్ పరంగా ఈ సినిమా చాలావరకు మీట్ చేస్తుంది. స్టార్టింగ్ నుంచి కథ లైట్ టోన్‌లో...

ఫ్రెండ్స్… ఈ సినిమా గురించి స్ట్రైట్‌గా చెప్పాలంటే — ఇది ఒక పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్. హీరోగా చిరంజీవి గారు, దర్శకుడిగా అనిల్ రావిపూడి, హీరోయిన్‌గా నయనతార — ఈ కాంబినేషన్ అంటేనే అంచనాలు భారీగా ఉంటాయి. ఆ అంచనాలను ఎంటర్టైన్మెంట్ పరంగా ఈ సినిమా చాలావరకు మీట్ చేస్తుంది. స్టార్టింగ్ నుంచి కథ లైట్ టోన్‌లో సాగుతూ ఆడియన్స్‌ను ఎంగేజ్ చేస్తుంది. ఫస్ట్ హాఫ్ మొత్తం ఫుల్ ఎంటర్టైనింగ్ మోడ్‌లో ఉంటుంది. చిరంజీవి గారి స్క్రీన్ ప్రెజెన్స్, కామెడీ టైమింగ్, డైలాగ్ డెలివరీ సినిమాకు మేజర్ ప్లస్. మాస్ ఆడియన్స్‌కు ఫుల్ కనెక్ట్ అయ్యే మోమెంట్స్ చాలానే ఉన్నాయి. నయనతార పాత్ర గ్లామర్‌తో పాటు స్ట్రాంగ్ ప్రెజెన్స్‌తో కథకు మంచి సపోర్ట్ ఇస్తుంది. సెకండ్ హాఫ్‌లో కొంచెం సీరియస్ టోన్ వచ్చినా, ఎమోషనల్ సీన్స్ బాగా వర్క్ అవుతాయి. క్లైమాక్స్ దగ్గర ఇచ్చిన మెసేజ్ కూడా బాగుంది. అనిల్ రావిపూడి స్టైల్‌లో కామెడీ + కమర్షియల్ ఎలిమెంట్స్ మిక్స్ చేసి సినిమా నడిపించాడు. మొత్తానికి ఇది థియేటర్‌లో కూర్చొని హాయిగా ఎంజాయ్ చేసే సినిమా. మాస్, ఫ్యామిలీ, యూత్ — అందరికీ కనెక్ట్ అయ్యే పక్కా కమర్షియల్ ప్యాకేజ్. ఫైనల్ టాక్: ఫుల్ ఎంటర్టైన్మెంట్ — మెగా ఫ్యాన్స్‌కు మస్ట్ వాచ్

Jan 12, 2026 Watch
123telugu
123telugu Website
7

Hit

Mana Shankara Varaprasad Garu Movie Review

చిరంజీవి హీరోగా వచ్చిన ఈ తాజా చిత్రం కుటుంబ ప్రేక్షకులను లక్ష్యంగా తీసుకున్న సంపూర్ణ వినోదాత్మక చిత్రం. అనిల్ రావిపూడి తనకు బాగా పట్టిన హాస్య శైలిని చిరంజీవి ఇమేజ్‌కు చక్కగా కలిపారు. తొలి భాగం అంతా సరదా సన్నివేశాలు, పంచ్ డైలాగులతో వేగంగా సాగుతుంది. రెండో భాగంలో భావోద్వేగాలు కథకు బలాన్ని ఇస్తాయి. భీమ...

చిరంజీవి హీరోగా వచ్చిన ఈ తాజా చిత్రం కుటుంబ ప్రేక్షకులను లక్ష్యంగా తీసుకున్న సంపూర్ణ వినోదాత్మక చిత్రం. అనిల్ రావిపూడి తనకు బాగా పట్టిన హాస్య శైలిని చిరంజీవి ఇమేజ్‌కు చక్కగా కలిపారు. తొలి భాగం అంతా సరదా సన్నివేశాలు, పంచ్ డైలాగులతో వేగంగా సాగుతుంది. రెండో భాగంలో భావోద్వేగాలు కథకు బలాన్ని ఇస్తాయి. భీమ్స్ సిసిరోలియో అందించిన పాటలు, నేపథ్య సంగీతం సినిమా ఎనర్జీని నిలబెడతాయి. ముఖ్యంగా కామెడీ సన్నివేశాల్లో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మంచి ప్రభావం చూపిస్తుంది. వెంకటేష్ ప్రత్యేక అతిథి పాత్ర ప్రేక్షకులకు సర్ప్రైజ్‌లా నిలుస్తుంది. ఆయన–చిరంజీవి కలయికకు థియేటర్లలో మంచి స్పందన కనిపిస్తుంది. మొత్తం మీద ఈ సినిమా కుటుంబంతో కలిసి నవ్వుతూ చూడదగిన మంచి ఎంటర్‌టైనర్.

Jan 12, 2026 Read Review
One India
One India Website
7

Hit

Mana shankara vara prasad garu movie review

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన మన శంకర వర ప్రసాద్ సంక్రాంతి స్పెషల్ గా విడుదలై థియేటర్లలో ఆడియన్స్ ని మెప్పిస్తుంది. దర్శకుడు అనిల్ రావిపూడి మరొసారి తన టాలెంట్ నిరూపించుకున్నారు. పాత కథను కూడా తన మార్క్ ఎంటర్టైన్మెంట్ పద్ధతిలో మెప్పించారు.

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన మన శంకర వర ప్రసాద్ సంక్రాంతి స్పెషల్ గా విడుదలై థియేటర్లలో ఆడియన్స్ ని మెప్పిస్తుంది. దర్శకుడు అనిల్ రావిపూడి మరొసారి తన టాలెంట్ నిరూపించుకున్నారు. పాత కథను కూడా తన మార్క్ ఎంటర్టైన్మెంట్ పద్ధతిలో మెప్పించారు.

Jan 12, 2026 Read Review
Tupaki
Tupaki Website
6

Above Average

Mana shankara vara prasad garu movie review

భోళా శంకర్ ప్లాప్ తర్వాత చిరంజీవి సూపర్ హిట్ కొట్టాలని హిట్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో "మన శంకర వర ప్రసాద్ గారు" అంటూ వచ్చేసారు. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా ఆడియన్స్ కి రెండున్నర గంటల పాటు ఏ ఢోకా లేకుండా నవ్వుకోవడానికి సరైన మూవీగా నిలిచింది.

భోళా శంకర్ ప్లాప్ తర్వాత చిరంజీవి సూపర్ హిట్ కొట్టాలని హిట్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో "మన శంకర వర ప్రసాద్ గారు" అంటూ వచ్చేసారు. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా ఆడియన్స్ కి రెండున్నర గంటల పాటు ఏ ఢోకా లేకుండా నవ్వుకోవడానికి సరైన మూవీగా నిలిచింది.

Jan 12, 2026 Read Review
Chitra Jyothy
Chitra Jyothy Website
7

Hit

Mana Shankara varaprasad garu movie review

అనిల్ రావిపూడి డైరెక్షన్ లో చిరంజీవి హీరోగా నటించిన "మన శంకర వర ప్రసాద్" సంక్రాంతి కానుకగా రిలీజ్ అయింది. పండగకు ఫ్యామిలీ అంతా కలిసి వెళ్ళేలా ఈ సినిమా రూపొందగా, చిరు, వెంకీ కాంబో సీన్స్ హైలెట్ గా నిలుస్తాయని చెప్పొచ్చు.

అనిల్ రావిపూడి డైరెక్షన్ లో చిరంజీవి హీరోగా నటించిన "మన శంకర వర ప్రసాద్" సంక్రాంతి కానుకగా రిలీజ్ అయింది. పండగకు ఫ్యామిలీ అంతా కలిసి వెళ్ళేలా ఈ సినిమా రూపొందగా, చిరు, వెంకీ కాంబో సీన్స్ హైలెట్ గా నిలుస్తాయని చెప్పొచ్చు.

Jan 12, 2026 Read Review
6

Above Average

Mana shankara vara prasad garu movie review

చిరంజీవి హీరోగా నటించిన "మన శంకర వర ప్రసాద్" సంక్రాంతి కానుకగా రిలీజ్ అయింది. ఈ సంక్రాంతికి పర్‌ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌. చిరంజీవి, వెంకటేష్‌ అభిమానులు మాత్రం ఊగిపోతారు.

చిరంజీవి హీరోగా నటించిన "మన శంకర వర ప్రసాద్" సంక్రాంతి కానుకగా రిలీజ్ అయింది. ఈ సంక్రాంతికి పర్‌ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌. చిరంజీవి, వెంకటేష్‌ అభిమానులు మాత్రం ఊగిపోతారు.

Jan 12, 2026 Read Review
Filmi Beat
Filmi Beat Website
7

Hit

Mana shankara vara prasad garu movie review

Review Content : మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన "మన శంకర వర ప్రసాద్" సంక్రాంతి కానుకగా రిలీజ్ అయింది. హిట్ సినిమాకు కావాల్సిన అన్నిరకాల మాస్, మసాలాలు ఉన్న చిత్రం ఇది. పండుగ ప్రేక్షకులకు విందు భోజనం లాంటి సినిమా ఇది.

Review Content : మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన "మన శంకర వర ప్రసాద్" సంక్రాంతి కానుకగా రిలీజ్ అయింది. హిట్ సినిమాకు కావాల్సిన అన్నిరకాల మాస్, మసాలాలు ఉన్న చిత్రం ఇది. పండుగ ప్రేక్షకులకు విందు భోజనం లాంటి సినిమా ఇది.

Jan 12, 2026 Read Review
Mahidhar Vibes
Mahidhar Vibes Youtube Channel
8

Super Hit

Mana shankara Varaprasad movie review

ప్రతి సారి దొరుకుతాడు అనుకున్న అనిల్ రావిపూడి ఈసారి కూడా "దొరకను" అన్నాడు. మన శంకర వర ప్రసాద్ ట్రైలర్ చూసి రొటీన్ స్టఫ్ వస్తుందనుకున్న క్రిటిక్స్ కి ఊహకందని మంచి అవుట్ ఫుట్ ఇచ్చాడు. చిరు- వెంకీ స్క్రీన్ ప్రెజెన్స్ తో అదిరిపోయే కామెడీతో మన శంకర వర ప్రసాద్ ని సక్సెస్ చేసేసారు అనిల్ రావిపూడి.

ప్రతి సారి దొరుకుతాడు అనుకున్న అనిల్ రావిపూడి ఈసారి కూడా "దొరకను" అన్నాడు. మన శంకర వర ప్రసాద్ ట్రైలర్ చూసి రొటీన్ స్టఫ్ వస్తుందనుకున్న క్రిటిక్స్ కి ఊహకందని మంచి అవుట్ ఫుట్ ఇచ్చాడు. చిరు- వెంకీ స్క్రీన్ ప్రెజెన్స్ తో అదిరిపోయే కామెడీతో మన శంకర వర ప్రసాద్ ని సక్సెస్ చేసేసారు అనిల్ రావిపూడి.

Jan 12, 2026 Watch
Samayam Telugu
Samayam Telugu Website
7

Hit

Mana shankara vara prasad garu movie review

చిరంజీవి హీరోగా నటించిన "మన శంకర వర ప్రసాద్ గారు" మూవీ సంక్రాంతి స్పెషల్ గా రిలీజ్ కాగా, సంక్రాంతి వస్తున్నాం లాంటి చిత్రం తర్వాత రావిపూడి మరోసారి పండకి వస్తున్నారు అనగానే ఫ్యామిలీ ఆడియన్స్‌ థియేటర్లకి వస్తున్నాం అన్నట్లుగా ముందే ఫిక్స్ అయిపోయారు. ఇక వారిని ఏమాత్రం నిరుత్సాహపరచకుండా తన మార్క్ సినిమా...

చిరంజీవి హీరోగా నటించిన "మన శంకర వర ప్రసాద్ గారు" మూవీ సంక్రాంతి స్పెషల్ గా రిలీజ్ కాగా, సంక్రాంతి వస్తున్నాం లాంటి చిత్రం తర్వాత రావిపూడి మరోసారి పండకి వస్తున్నారు అనగానే ఫ్యామిలీ ఆడియన్స్‌ థియేటర్లకి వస్తున్నాం అన్నట్లుగా ముందే ఫిక్స్ అయిపోయారు. ఇక వారిని ఏమాత్రం నిరుత్సాహపరచకుండా తన మార్క్ సినిమాని మరోసారి నీటిగా ప్రజెంట్ చేశారు అనిల్.

Jan 12, 2026 Read Review

Public Reviews

Avg: —

No public reviews yet.

About This Movie

కథ విషయానికి వస్తే అనిల్ రావిపూడి అన్ని సినిమాల్లో ఉండే స్టోరీ లైన్ లాంటిదే. చాలా సింపుల్ గా ఉంటుంది. భారతీయ సెక్యూరిటీ ఏజెన్సీలో ఛీఫ్ సెక్యూరిటీ అడ్వైజర్ గా "శంకర వరప్రసాద్" (Chiranjeevi) పని చేస్తాడు. అంతే కాదు తను ఒక మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ కూడా. ఈ క్రమంలో తనకి పరిచయం అయిన అమ్మాయి శశిరేఖ (Nayanathara) ని తొలిచూపులోనే ఇష్టపడతాడు. అయితే శశిరేఖ ప్ పాపులర్ బిజినెస్ మ్యాగ్నెట్ అయిన "జీవిఆర్ గ్రూప్స్ కంపెనీ అధినేత (Sachin khadekar) కూతురు. అయితే మొదటి పరిచయంతోనే వరప్రసాద్ - శశిరేఖ ఇష్టపడి పెళ్లి చేసుకుంటారు. కట్ చేస్తే ఇద్దరు పిల్లలు కూడా పుడతారు. అయితే ప్రసాద్ అంటే ఇష్టం లేక శశిరేఖ తండ్రి ప్రసాద్ ని - శశిరేఖ, మరియు పిల్లల నుంచి విడదీస్తాడు. కొంతకాలం శశిరేఖకు దూరమైనా ప్రసాద్ మళ్ళీ కలుస్తాడు. మరి వీరు విడిపోవడానికి కారణాలేంటి? మళ్ళీ ఎలా కలిశారు. మధ్యలో తనకు పోటీగా వచ్చిన ఆఫీసర్ "మైనింగ్ మొఘల్ వెంకీ గౌడ" (Venkatesh) ఎంట్రీ ఇచ్చాక కథ ఎలా మారింది. ఈ క్రమంలో ఓ సస్పెండెడ్ పోలీస్ ఆఫీసర్ అయిన వీరేంద్ర పాండే (Sudev Nair) శశిరేఖని, తన పిల్లలని చంపాలని చూస్తాడు.  ఫైనల్ గా ఏం జరిగిందన్నదే కథ. 

Plus & Minus Points  :  మాములుగా అనిల్ రావిపూడి సినిమాల్లో పెద్దగా బలమైన కథ ఉండదు. ఎంటర్టైన్మెంటే లక్ష్యంగా ఆడియన్స్ ని నవ్వించడమే ధ్యేయంగా సినిమాలు తీస్తాడు. ఇప్పుడు కూడా మన శంకర వర ప్రసాద్ ని ఎంటర్టైనర్ గా చూపించి సక్సెస్ అయ్యాడు. కమర్షియల్ గా మెగాస్టార్ చిరంజీవి సినిమాని తన కామిక్ టైమింగ్ తో ముందుండి నడిపిస్తాడు. మొదట్నుంచి చివరిదాకా హిలేరియస్ గా ఉండగా, వింటేజ్ చిరు కామెడీ హైలెట్ అవుతుంది. అలాగే వెంకటేష్ ఎంట్రీ తర్వాత సినిమా పీక్స్ కి వెళ్తుంది. చిరు, వెంకీ ఉన్న ప్రతి ఫ్రేమ్ కూడా ఫ్యాన్స్ కి ఐ ఫీస్ట్ అనే చెప్పాలి. అలాగే సచిన్ ఖడేకర్, అభినవ్ గోమటం, హర్ష వర్ధన్, కేథరిన్ వారి పాత్రల పరిధిలో బాగా చేసారు. 

మైనస్ పాయింట్స్ గురించి మాట్లాడితే ఎప్పట్లాగే అనిల్ రావిపూడి యావరేజ్ స్టోరీ లైన్ తో వచ్చాడు. కథలో కొత్తదనం ఉండదు. అలాగే చిరంజీవిలోనే కామెడీని పూర్తి స్థాయిలో పిండుకోలేదనిపిస్తుంది. అలాగే చిరు లుక్స్ విషయంలో శ్రద్ధ వహించాల్సింది. కొన్ని సీన్స్ రొటీన్ గా అనిపిస్తాయి. ఇక మ్యూజిక్ డైరెక్టర్ గా భీమ్స్ మంచి సాంగ్స్ ఇచ్చినా, బీజీఎమ్ పరంగా ఎక్స్పర్ట్ చేసినంత చేయలేదు.

Technical values : టెక్నికల్ వాల్యూస్ పరంగా చూసుకుంటే, నిర్మాణ విలువలు డీసెంట్ గానే ఉన్నాయి. కథ పరంగా భారీ బడ్జెట్ తీసే సినిమా కాదు కాబట్టి, మేకర్స్ నార్మల్ గానే బడ్జెట్ పెట్టారు. సెట్టింగ్స్ కి పెద్దగా స్కోప్ ఇవ్వలేదు. మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ ఇచ్చిన ఫోక్ సాంగ్స్ బాగున్నాయి. అయితే అనిల్ రావిపూడి సెకండ్ హాఫ్ లో స్క్రీన్ ప్లే పరంగా కాస్త ఫోకస్ చేయాల్సింది. తమ్మిరాజు ఎడిటింగ్ బావుంది. అనిల్ రావిపూడి ఇంతకు ముందు సినిమాల్లో చూపించిన క్రింజ్ కామెడీ ఇందులో చాలా తక్కువే ఉంటుంది. మేకింగ్ క్వాలిటీ బాగుంది. 

Review Statistics

6.7
Overall Rating
Avg. of all reviews
10
Total Reviews
From 2 Provider Types

Review Average

Media
6.7/10
Public
N/A