Register as a Reviewer
Shambala (శంబాలా)

Shambala (శంబాలా)

25 Dec 2025
Overall Rating
6.2/10
10 Reviews

ఎన్నాళ్ళనుంచో హిట్ కోసం ఎదురుచూస్తున్న ఆది, ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలన్న పట్టుదలతో ఓ మిస్టరి థ్రిల్లర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. యుగంధర్ ముని అనే యువ దర్శకుడు "శంబాలా" మూవీని తెరకెక్కించాడు.

Director: Yugandhar Muni
Cast: Aadi Saikumar, Archana Iyer, Madhunandan , Swasika, Ravi Varma

Available in:

Reviews

What critics and the public are saying about Shambala (శంబాలా)

Media Reviews

10 Avg: 6.2/10
Ragadi
Ragadi Youtube Channel
6

Above Average

Shambala Movie Review

శాంబాల సినిమా ఒక మిస్టరీ – థ్రిల్లర్ – స్పిరిచువల్ ఎలిమెంట్స్ మేళవింపుతో రూపొందిన ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్. కొత్త తరహా కథతో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం దర్శకుడు బాగా చేశారు. ప్రారంభం నుంచే ఆసక్తికరమైన సన్నివేశాలతో కథ ముందుకు సాగుతుంది. సినిమా కథలో సస్పెన్స్ ప్రధాన బలంగా నిలుస్తుంది. ప్రతి సీన్‌...

శాంబాల సినిమా ఒక మిస్టరీ – థ్రిల్లర్ – స్పిరిచువల్ ఎలిమెంట్స్ మేళవింపుతో రూపొందిన ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్. కొత్త తరహా కథతో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం దర్శకుడు బాగా చేశారు. ప్రారంభం నుంచే ఆసక్తికరమైన సన్నివేశాలతో కథ ముందుకు సాగుతుంది. సినిమా కథలో సస్పెన్స్ ప్రధాన బలంగా నిలుస్తుంది. ప్రతి సీన్‌లో కొత్త మలుపులు, అనూహ్యమైన ట్విస్టులు ప్రేక్షకులను సీట్లకు కట్టిపడేస్తాయి. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్‌లో మిస్టరీ ఎలిమెంట్స్ బలంగా వర్క్ అవుతాయి. సెకండ్ హాఫ్‌లో ఎమోషన్, ఆధ్యాత్మికతను జోడిస్తూ కథను మరింత లోతుగా తీసుకెళ్లారు. నటీనటుల ప్రదర్శన సహజంగా ఉండి, పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. ముఖ్యంగా ప్రధాన పాత్రలో నటించిన నటుడు తన భావోద్వేగాలు, ఇంటెన్స్ ఎక్స్‌ప్రెషన్స్‌తో మెప్పించాడు. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ థ్రిల్‌ను పెంచుతూ, సన్నివేశాలకు అదనపు బలం ఇచ్చింది. సినిమాటోగ్రఫీ విజువల్‌గా ఆకట్టుకునేలా ఉంది. కొన్ని చోట్ల కథ నెమ్మదిగా సాగినట్లు అనిపించినా, క్లైమాక్స్‌లో వచ్చే రివీల్ ఆ లోటును కప్పిపుచ్చుతుంది. మొత్తం మీద శాంబాల ఒక డిఫరెంట్ కాన్సెప్ట్‌తో రూపొందిన ఆసక్తికరమైన థ్రిల్లర్. మిస్టరీ, స్పిరిచువల్ డ్రామా ఇష్టపడే ప్రేక్షకులకు ఇది మంచి అనుభూతిని అందిస్తుంది.

Dec 25, 2025 Watch
T
6

Above Average

Shambala Movie review

మొత్తంగా “శంబాల” మిస్టికల్ థ్రిల్లర్‌లను ఇష్టపడే ప్రేక్షకులకు ఒకసారి చూడదగిన అనుభూతిని అందించే సినిమా.

Dec 25, 2025 Read Review
H
HMTV News Channel
7

Hit

Shambala movie review

వింతలు, భయానక ఘటనలు, మిస్టరీతో నిండిన కథలను ప్రేక్షకులకు పరిచయం చేస్తూ వచ్చిన సినిమాల జాబితాలో ఇప్పుడు ఆది సాయికుమార్ ప్రధాన పాత్రలో నటించిన “శంబాల” కూడా చేరింది.

భయపెట్టిస్తూ, నవ్విస్తూ, భావోద్వేగానికి గురి చేస్తూ, థ్రిల్‌తో కట్టిపడేసే హర్రర్‌, థ్రిల్లర్‌ మూవీ `శంబాల`. ఆది సాయికుమార్‌ కెరీర్‌ని మలుపు తిప్పే మూవీ అవుతుంది.

భయపెట్టిస్తూ, నవ్విస్తూ, భావోద్వేగానికి గురి చేస్తూ, థ్రిల్‌తో కట్టిపడేసే హర్రర్‌, థ్రిల్లర్‌ మూవీ `శంబాల`. ఆది సాయికుమార్‌ కెరీర్‌ని మలుపు తిప్పే మూవీ అవుతుంది.

Dec 25, 2025 Read Review
T
Timesnowtelugu Website
6

Above Average

Shambala movie review

అది నటించిన "శంబాల" మూవీ అనౌన్స్‌మెంట్ దగ్గర్నుంచి మంచి హైప్ క్రియేట్ చేయగా, ఫైనల్ గా డిసెంబర్ 25న థియేటర్లో రిలీజ్ అయి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది.

అది నటించిన "శంబాల" మూవీ అనౌన్స్‌మెంట్ దగ్గర్నుంచి మంచి హైప్ క్రియేట్ చేయగా, ఫైనల్ గా డిసెంబర్ 25న థియేటర్లో రిలీజ్ అయి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది.

Dec 25, 2025 Read Review
ABP Desam
ABP Desam Website
6

Above Average

Shambala movie review

'శంబాల' రివ్యూ: శాస్త్రాలు vs సైన్స్... ఆది సాయి కుమార్ నటించిన శంబాలా మూవీ తాజాగా విడుదలై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది.

'శంబాల' రివ్యూ: శాస్త్రాలు vs సైన్స్... ఆది సాయి కుమార్ నటించిన శంబాలా మూవీ తాజాగా విడుదలై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది.

Dec 25, 2025 Read Review
Great Andhra
Great Andhra Website
5

Average

Shambala movie Review

ఆది హీరోగా నటించిన శంబాలా మూవీ డిసెంబర్ 25న విడుదలవగా, ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన తెచ్చుకుంది.

Dec 25, 2025 Read Review
Sakshi
Sakshi News Channel
6

Above Average

Shambala movie review

ఆది సాయికుమార్ ప్రధాన పాత్రలో నటించిన మిస్టరీ థ్రిల్లర్ శంబాలా: ఏ మిస్టికల్ వరల్డ్. సైన్స్ దేవుడికి మధ్య జరిగే పోరాటం ఈ సినిమా. ఇది ఎలా ఉందో పూర్తి రివ్యూలో చూద్దాం..

ఆది సాయికుమార్ ప్రధాన పాత్రలో నటించిన మిస్టరీ థ్రిల్లర్ శంబాలా: ఏ మిస్టికల్ వరల్డ్. సైన్స్ దేవుడికి మధ్య జరిగే పోరాటం ఈ సినిమా. ఇది ఎలా ఉందో పూర్తి రివ్యూలో చూద్దాం..

Dec 25, 2025 Read Review
NTV Telugu
NTV Telugu News Channel
6

Above Average

Shambala movie review

Shambala Movie Review : ఆది హీరోగా నటించిన మిస్టరీ థ్రిల్లర్ "శంబాలా" మూవీ డిసెంబర్ 25న విడుదలై, మంచి రెస్పాన్స్ అందుకోగా 3/5 రేటింగ్ అందుకుంది.

Shambala Movie Review : ఆది హీరోగా నటించిన మిస్టరీ థ్రిల్లర్ "శంబాలా" మూవీ డిసెంబర్ 25న విడుదలై, మంచి రెస్పాన్స్ అందుకోగా 3/5 రేటింగ్ అందుకుంది.

Dec 25, 2025 Read Review
IMDB
IMDB Website
8

Super Hit

Shambala Movie Review

Shambala Movie Review : 1980లలో అత్యంత మూఢనమ్మకాల గ్రామమైన శంభాలలోకి ఒక ఉల్కాపాతం దూసుకెళ్లినప్పుడు, వింతైన అతీంద్రియ సంఘటనలు బయటపడతాయి, నాస్తిక శాస్త్రవేత్త ఒక పురాతన భయానక సంఘటనను ఎదుర్కోవలసి వస్తుంది - దానిని సైన్స్ వివరించలేకపోవచ్చు లేదా తప్పించుకోలేకపోవచ్చు.

Public Reviews

Avg: —

No public reviews yet.

About This Movie

శంబాలా అనే ఓ ఊరిలో ఈ కథ నేపథ్యం నడుస్తుంది. 80వ దశకంలో శంబాల అనే ఒక చిన్న ఊరిలో ఆకస్మికంగా ఒక భారీ ఉల్క నేల రాలుతుంది. అయితే సరిగ్గా ఆ ఉల్క కింద పడిన తర్వాత రోజు నుంచే, ఆ ఊరిలో ఊహించని ఘటనలు మొదలవుతాయి. శంబాలా ఊళ్ళో జనాలందరూ మెల్లిగా ఒకరి తర్వాత మరొకరు వారి మెడ వెనుక భాగంలో ఒక బొడుపిలా వచ్చి, అది విచ్చిన్నమయి చనిపోతూ ఉంటారు. అయితే అసలు ఆ ఉల్క ఏంటి అని పరిశోధించడానికి వచ్చిన ప్రభుత్వ జియో సైంటిస్ట్ పైగా విక్రమ్ (ఆది) ఆ ఉల్కని కాపాడడానికి, అలాగే ఆ ఊరి ప్రజల సమస్య కనుక్కోవడానికి వారి సమస్యలోకి వెళ్తాడు. అప్పటినుండి విక్రమ్ కి ఎదురైన ఇబ్బందులు ఏంటి? నాస్తికుడైన విక్రమ్ కు అలాగే ఆ ఉల్క గురించిన సమస్యలో శాస్త్రానికి - సైన్స్ కి మధ్య వార్ ఎలా నడిచింది? ఆ ఊరిలో చావుల్ని విక్రమ్ ఆపగలిగాడా? లేదా? అనేది సినిమా కథ. 

Technical values : శాంబాల చిత్రం కోసం మేకర్స్ బాగానే కష్టపడినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా దర్శకుడు రాసుకున్న స్టోరీ పాయింట్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. పైగా కొన్ని శాస్త్రీయ, వాస్తు అంశాలకు సంబంధించిన విషయాలను అర్థం అయ్యే విధంగా చెప్పడం బాగుంది. ఆది నటన పరంగా మెప్పించడమే కాకుండా, శంబాల తో ఎట్టకేలకు సక్సెస్ అందుకున్నాడని చెప్పొచ్చు.

ఇక దర్శకుడిగా యుగంధర్ ముని తొలిసినిమాతోనే మంచి ప్రతిభని కనబరిచాడు. శ్రీ చరణ్ పాకాల నేపథ్య సంగీతం బాగుంది. అయితే కథనం పరంగా కాస్త నెమ్మదించింది. చాలా సీన్స్ ఊహాజనితంగా సాగగా, AI విజువల్స్ కాకుండా యానిమేషన్స్ వాడుకుంటే బాగుండేది అనిపిస్తుంది.

మొత్తంగా "శంబాలా" మూవీ డీసెంట్ సస్పెన్స్ థ్రిల్లర్ గా ఆడియన్స్ ని మెప్పిస్తుందని చెప్పొచ్చు. మరీ కొత్తదనం ఎక్స్పెక్ట్ చేయకుండా, సినిమాకెళ్తే ఫ్యామిలీ ఆడియన్స్ ని కూడా మెప్పిస్తుంది. 

Review Statistics

6.2
Overall Rating
Avg. of all reviews
10
Total Reviews
From 3 Provider Types

Review Average

Media
6.2/10
Public
N/A