Register as a Reviewer
VISA – వింటారా సరదాగా (VISA - Vintara Saradaga TEASER 2)

VISA – వింటారా సరదాగా (VISA - Vintara Saradaga TEASER 2)

Upcoming Expected Release: 17 Oct 2026

VISA - Vintara Saradaga TEASER 2 : ఎలాగైనా హిట్టు కొట్టాలన్న టార్గెట్ తో లవ్ స్టోరీతో వస్తున్న మహేష్ బాబు మేనల్లుడు...

Director: Udbhav Raghu
Cast: Ashok Galla, Sri Gouri Priya, Rahul Vijay, Shivathmika Rajasekhar, Harsha Chemudu and Others.

Available in:

About This Movie

మహేష్ బాబు మేనల్లుడు అశోక్‌ గల్లా ఇంతకు ముందు రెండు సార్లు హీరోగా మంచి సినిమాలతో ఆడియన్స్ ముందుకు వచ్చి దెబ్బతిన్నాడు. పెద్ద బ్యాక్ గ్రౌండ్ వల్ల గ్రాండ్ ఎంట్రీ వచ్చినా, పసలేని కథలతో ప్లాపుల్ని మూటగట్టుకున్నాడు. ఇండస్ట్రీలో నిలబడాలంటే బ్యాక్ గ్రౌండ్, టాలెంట్ ఉంటే సరిపోదు, ఆవగింజంత అదృష్టం కూడా ఉండాలి. ఇక ఈసారి లవ్ స్టోరీతో ఆడియన్స్ ముందుకు రావడానికి రెడీ అయ్యాడు. 

 

అశోక్ గల్లా - శ్రీగౌరీప్రియ జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ "VISA – వింటారా సరదాగా". రాహుల్‌ విజయ్‌, శివాత్మిక రాజశేఖర్‌, హర్ష చెముడు కీ రోల్స్ లో నటించిన ఈ మూవితో ఉద్భవ్‌ రఘు డైరెక్టర్ గా పరిచయం అవుతున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మిస్తున్నారు. ఇక ఈ మూవీ టీజర్ ను తాజాగా మేకర్స్ విడుదల చేయగా, సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ అందుకుంటుంది. 

 

ఈ టీజర్ మొత్తం హీరో సైడ్ నుంచి చూపించగా, అమ్మాయిల వల్ల అబ్బాయిల జీవితాల్లో ఎదురయ్యే ట్రబుల్స్‌ గురించి హీరో తన స్టైల్ లో చెప్పేలా టీజర్ ని డిజైన్ చేసారు. మంచి ఎనర్జిటిక్ డైలాగ్స్ తో పాటు వాటికి తగ్గ బీజీఎమ్ టీజర్ లో హైలెట్ అయింది. ఇక ఈ మూవీలో సత్య, వైవా హర్ష వంటి వారి కామెడీ హైలెట్ అవుతుందని సినిమా టీజర్ ద్వారా తెలుస్తుంది. విజయ్‌ బుల్గానిన్‌ మ్యూజిక్ అందిసున్న ఈ సినిమాను అక్టోబర్‌ 17న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు మేకర్స్ రెడీ చేస్తున్నారు. మరి ఈ సినిమాతోనైనా తొలి సక్సెస్ ను అశోక్ గల్లా అందుకుంటాడో లేదో చూడాలి.

Why MRO?